ఇదీ సంగతి
సుబ్బారావు దంపతులు కాకినాడలోని
బంధువుల ఇంటికి పెళ్ళి కి వెళ్ళి నాలుగు
రోజులు తర్వాత తిరిగి హైద్రాబాదు వచ్చారు.
తలుపులు తీద్దామనుకునేసరికి తాళంకప్ప
పగిలి ఉంది.
ఆందోళన తో లోపలికి అడుగు పెట్టారు.
ఎక్కవస్తువులక్కడే ఉన్నాయి.బీరువాకూడా
క్షేమం గా ఉంది.ఏ వస్తువు పోలేదు.
హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు దంపతులు.
పళ్ళు తోముకుని రండి కాఫీ పెడతానంది
భార్య.సుబ్బారావు పళ్ళు తోముకుని
టీవీ ఆన్ చేశాడు.
ఇంతలోవంటింట్లోంచి భార్య ఏవండీ
అంటూ కెవ్వుకేక.
ఏమయిందే అంటూ పరుగెట్టాడు సుబ్బారావు.
భార్యసంజ్జ్న తో కిచిన్ గట్టు చూసీ నిర్ఘాంతపోయాడు.
కారణం
గేసుసిలెండరు మరియు స్పేరు సిలీండర్
ఎత్తుకు పోయారు దొంగలు.
అయ్యా! అదీసంగతి.
******
జయంతి లక్ష్మీ నరసింహం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి