26, ఫిబ్రవరి 2026, గురువారం

పంచాంగం 26.02.2026 Thursday,

ఈ రోజు పంచాంగం 26.02.2026 Thursday,


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన  విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాస శుక్ల పక్ష దశమి తిథి బృహస్పతి వాసర మృగశిర నక్షత్రం ప్రీతి యోగః తైతుల తదుపరి గరజి కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం   01:30 నుండి 03:00 వరకు.

 

యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు. 

  


శ్రాద్ధ తిథి: దశమి


 

నమస్కారః , శుభోదయం

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం - దశమి - మృగశిర -‌‌ ‌గురు వాసరే* (26.02.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

సీతా మనోహరా !

 🌸శ్రీ రామ స్తుతి🙏 


సీ. సీతా మనోహరా !  చిన్మయా ! శ్రీరామ !

                  యిందీవర శ్యామ !  వందనములు 

      నిత్య నిరంజనా ! నిరుపమ గుణధామ !

                 శంకర పూజితా ! శరణు శరణు !

  పురుషోత్తమా! నిను పూజించు వారలు

                  భవ బంధ మోక్షంబు బడయ గలరు.

      శరణన్న వారిని కరుణతో బ్రోచెడు

                 సాకేత పురివాస ! సార్వ భౌమ !             

తే. దనుజమర్దన శ్రీరామ ! ధన్య చరిత !

      రవికులేశ్వర రఘువీర ! రమ్య తేజ  !

      భువన మోహన యో రామ ! పుణ్య పురుష !

      దశరథాత్మజ ! రఘురామ !ధర్మ తేజ !


           సాహితీ శ్రీ జయలక్ష్మి