*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
అనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము
* 662వ రోజు*
మాంసాహారము మీద మక్కువ
ధర్మరాజు " పితామహా ! మాంసభక్షణం ఇంత పాపం అని తెలుసి కూడా మానవులు కాయకూరలు, పండ్లు భక్ష్యములు ఎందుకు తినరు. మాంసాహారము మీద మక్కువ ఎందుకు చూపిస్తారు " అని అడిగాడు. ఆ మాటలకు భీష్ముడు నవ్వి " ధర్మనందనా ! ఒక సారి మాంసమును భుజించిన వాడు దాని రుచికి దాసోహం అయి దాని నుండి తప్పించుకో లేడు. మాంసము తినడం వలన వీర్యశక్తి పెరుగుతుంది, పనిచేసి అలసిన వాడికి నూతనశక్తి ఇస్తుంది, గాయములను శీగ్రగతిన మాన్పుతుంది ఫలములలో, భక్ష్యములలో, కాయకూరలలో ఈ శక్తిలేదు. మాంసభక్షణ వలన కలిగే దోషము దానము వలన పోతుంది. యజ్ఞయాగాదులలో మాంసభక్షణ వలన దోషములేదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అగస్త్యుడు మాంసభక్షణ గురించి చెప్తూ ఇలా అన్నాడు. వేటాడడం పరమధర్మము. అందులో పక్షులు, మృగములను చంపడం ధర్మము. ఆ మాంసముతో దేవకార్యములు, పితృకార్యములను నిర్వర్తించడం కూడా ధర్మమే. కాని కేవలము రుచిగా తినడం కొరకు దేహాన్ని పెంచుకొనడం కొరకు మాంసం తినడం జంతువులనుచంపడం పాపమే. ఇతర జంతువుల పక్షులమాంసంతో దేహాన్ని పోషించడం మహాపాపము. మాంసంతినడం వలన వచ్చేపాపము దానధర్మము వలన పోవడం నిజమే అయినా ఆతరువాత మాంసభక్షణ నిలిపి వేయకున్న పాపము పోదు కనుక అహింసకు మించిన పరమధర్మము వేరొకటి లేదు. దయకల వాడు ప్రాణుల అందు ప్రాణభయాన్ని చూడగలడు. అందువలన దయకలిగి ఉంటాడు. ప్రాణుల ఎడల క్రూరత్వాన్ని చూపిస్తే అవి కూడా అతడి అందుక్రూరత్వము చూపిస్తుంది. కనుక మానవుడు ప్రాణుల అందు దయకలిగి అహింసను పాటించుట పరమధర్మము " అని భీష్ముడు చెప్పాడు.
ఊర్ధ్వలోకములు
ధర్మరాజు " పితామహా ! మేము చేసిన యుద్ధములో ఎంతోమంది మరణించారు కదా ! వారికి ఏ లోకములు ప్రాప్తిస్తాయి తెలపండి. ఎందుకంటే మానవులు అందరూ బ్రతకడం సుఖాలు అనుభవించడానికి అని చావడం దుఃఖహేతువు అని భావిస్తారు కనుక ఎవరు తమతమ ప్రాణములను వదలుటకు సులభముగా అంగీకరించ లేరు. అందుకని అడిగాను " అన్నాడు ధర్మరాజు. భీష్ముడు " ధర్మనందనా ! నీకు ఈ సందర్భంలో ఒక కీటకముకు వేదవ్యాసుడికి మధ్యజరిగిన సంభాషణ చెప్తాను విను. ఒకసారి వేదవ్యాసుడు బండ్లు పోయే దారిలో వేగంగా పరుగెడుతున్న ఒక పురుగును చూసి " ఓ పురుగా ! ఎందుకు అలా వేగంగా ఎందుకు అలా భయంతో వేగంగా పరుగెడు తున్నావు " అని అడిగాడు. ఆ పురుగు " ఓ మహాత్మా ! చూసారా ఈ దారిలో అతి వేగంగా బండ్లు వస్తున్నాయి. ఈ బండ్లశబ్ధము, ఎద్దుల రంకెలు మనుష్యుల అరుపులు నాకు బెదురు పుట్టిస్తున్నాయి. బ్రతకడం సుఖం, చావడం దుఃఖంకదా ! అందుకని ఆ బండ్ల కిందపడి చావకుండా ఇంకా కొంత కాలం బ్రతుకుదామని వేగంగా పరుగెడుతున్నాను. ఏమైనా ప్రాణులకు ప్రాణభీతి ఎక్కువ కదా ! " అన్నది. వ్యాసుడు " నీవా చిన్న పుగువు. నీవు సుఖములు అనుభవించ లేవు. అటువంటి సమయంలో నీకు ప్రాణభయం ఎందుకు ? నీకు చావే సుఖముకదా ! అప్పుడు ఈ భయాలు ఉండవు " అన్నాడు. ఆ మాటలకు ఆ పురుగు నవ్వి " మహాత్మా ! పురుగులకు కీటకములకు ఇంద్రియ సుఖములు లేవని మీరు ఎలా చెప్పగలరు. మా పద్ధతిలో మేము కూడా మానవుల వలె మా దారిలో ఇంద్రియ సుఖములను అనుభవిస్తాము. అందుకే మాకుకూడా ప్రాణభయము బ్రతుకు మీద ఆశ ఉన్నాయి. అయినా మునీంద్రా ! నా మనసు తెలుకుకోవాలని అడుగుతున్నావు కాని ఆ మాత్రము నీకు తెలియదా చెప్పు
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి