శ్రీరామ (95)
శుభోదయం.
🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏
శ్లో// ఆదిత్యస్య గతా గతై రహరహ స్సంక్షీయతే జీవితమ్/
వ్యాపారై ర్బహు కార్యభార గురుభిః కాలో న విజ్ఞాయతే/
దృష్ట్వా జన్మ, జరా, విపత్తి, మరణం, త్రాసశ్చ నోత్పద్యతే /
పీత్వా మోహమయీం ప్రమాద మదిరా మున్మత్త భూతం జగత్// ( భర్తృహరి).
( సూర్యుని ఉదయాస్తమానములతో ప్రతిరోజూ ఆయువు తరిగిపోవుచున్నది.
సంసార వ్యవహారాలలో మునిగి, వార్థక్యం వస్తున్న విషయం కూడా మనం గమనించటం లేదు.
జనన మరణములు, ముసలితనము, అనేకమంది ఆపదలకు గురికావడం, మొదలైనవి చూస్తున్నా,మనలో ఎటువంటి ఆందోళనా కలగటం లేదు.
మద్యపానం చేసి మతి తప్పిన వారిలాగా ప్రజలు ఉన్మత్తులవలె ప్రవర్తిస్తున్నారు).
దుర్లభమైన మానవజన్మను పొందిన మనం సంసారవిషయాలలో కొట్టుకు పోకుండా సత్యం తెలుసుకొనే ప్రయత్నం చేద్దామని సారంశం.
శుభమస్తు,
తూములూరి మధుసూదనరావు,
26-2-'26.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి