30, సెప్టెంబర్ 2026, బుధవారం

లిఫ్ట్ కొత్తగా వచ్చిన రోజుల్లో

  లిఫ్ట్ కొత్తగా వచ్చిన రోజుల్లో ముళ్ళపూడి వారి జోకు!


పట్నంలో ఉద్యోగం చేస్తున్న కొడుకుని చూట్టానికి మొదటి సారి పల్లెటూరినుండి పట్నం వచ్చాడు ఓ ఆసామి.

కొడుకు తండ్రికి పట్నం మొత్తం తిప్పి చూపిస్తూ..

ఏదైనా తినిపించాలని ఓ పేద్ద హోటల్ కి తీసుకెళ్లాడు .


ఆ లాంజ్ ని చూసి ఆశ్చర్య పోతుండగానే , ఓ పక్కన ఒక పెద్ద పెట్టె మనిషెవరూ లేకుండానే కిందకి వచ్చి తలుపు తెరుచుకుంది.

ఇంతలో ఓ ముసలావిడ వచ్చి లోపలికి వెళ్ళగానే,తలుపు మూసుకుని పైకి వెళ్ళిపోయింది. పెద్దమనిషి అలా చూస్తుండగానే..మళ్ళీ పెట్టి పైనుండి కిందకు వచ్చింది.

అందులో నుండి ఓ అందమైన యువతి దిగి వీళ్ళ ముందునుండి వెళ్ళిపోయింది.


అవాక్కైన ముసలాయన కొడుకుతో ఇలా అన్నాడు.


*"ఓ పాలి ఎట్లైనా జేసి మీ యమ్మని తీస్కొచ్చి ఈ* *పెట్టెలో పెట్టి తీయాల్రా!!"*


😜😂🤣🤣🤣

కాళీయ మర్ధనం కధ

 🌸కాళీయ మర్ధనం కధ చదివితే గ్రహ దోషాలు తొలిగిపోతాయి అని పెద్దలు చెబుతారు


పూర్వం ద్వాపర యుగంలో  మధుర నగరిలో  శ్రీకృష్ణుడు బాలుడుగా ఉన్న సమయంలో కాళీయ అనే నాగుపాము యమునా నదిలో నివాసం ఏర్పరచుకుంది. ఆ పాము చిందించే విషంతో యమునా జలం కలుషితం అయింది. అంతేనా.. ఆ విషపు వేడికి నీళ్లు మరుగుతూ, నదిపై ఎగిరే పక్షులకు కూడా హాని చేస్తోంది. ఆ వేడి సెగ గాలులకు తట్టుకోలేక పక్షులు, నదిలో పడి చనిపోసాగాయి. 


ఆ నదిలో దిగిన పసుపక్షాదులను  జనులను ఆ కాళీయ సర్పం తినేస్తూ ఉండేది. అన్నిటికీ జీవనాధారమైన ఆ నదిలోకి దిగాలంటే భయపడి పోతుండేవారు. ఇది చూసిన బాల కృష్ణుని మనసు చాలా ఆర్ద్రమైంది.


 దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ దైవ లక్షణం కదా! యమునా జలాలకు కాలుష్యం నుండి విముక్తి ప్రసాదించాలని, కాళీయుని కోరల్లోంచి వెలువడుతోన్న విషం నుండి పశుపక్ష్యాదులను కాపాడాలని, యమునా జలాన్ని తిరిగి మంచినీటిగా మార్చాలని అనుకున్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు యమునా నదిలో దూకాడు. ఒడ్డున ఉన్నగోప బాలికలు, యశోదమ్మ అందరూ కంగారుపడ్డారు. భయాందోళనలకు లోనయ్యారు. 


కాళీయ సర్పం కృష్ణుని చూసింది. తనకు అపకారం తలపెట్టిన బాలకుడు ఎవరు అని ఆశ్చర్యపోయింది. తక్షణం బుద్ధి చెప్పాలని, తన పొడవాటి శరీరంతో కృష్ణుని చుట్టేసింది.దాంతో కృష్ణుడు నవ్వుతూ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. శ్రీకృష్ణుని ఆకృతి పెరగడంతో కాళీయ సర్పం పట్టు విడిపోయి, కోపంతో బుసలు కొట్టింది.


 ఇక కృష్ణుడు కాళీయుని నూరు పడగలపైకి ఎక్కి నృత్యం చేయ సాగాడు. శ్రీకృష్ణుడు ఒక్కో పడగమీదికి లంఘిస్తూ కాళియ మర్దనం చేస్తోంటే కాళీయుడు తగ్గిపోయాడు. పడగలు దెబ్బతిన్నాయి. రక్తం ధారలు కట్టింది. కాళీయుడు పశ్చాత్తాపానికి లోనయ్యాడు. శ్రీకృష్ణుని శరణు వేడాడు. కాళీయుని భార్యలు కూడా కృష్ణుని పాదాలపై పడి, కాళీయుని క్షమించమని కోరాయి. 


కృష్ణుడు దయ తలచాడు.. కాళీయుని వెంటనే యమునానది వదిలి వెళ్ళి, రమణక ద్వీపానికి వెళ్ళమన్నాడు.ఒడ్డున ఉన్నగోప బాలికలు, యశోదమ్మ అందరూ శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడో అని భయపడుతూ చూస్తున్నారు. ఇంతలో శ్రీకృష్ణుడు ఖాళీయ పడగల పై నుండి నాట్యం చేస్తూ యమునా నది నుండి పైకి వచ్చాడు. అది చూసిన యశోదమ్మ గోప బాలురు కృష్ణునికి ఏమీ కాలేదని  ఊపిరి పీల్చుకున్నారు 


 కాళీయుడు  శ్రీకృష్ణుని ప్రార్థించి  కుటుంబ సమేతంగా యమున వదిలి వెళ్లడంతో యమునాజలం పవిత్రమైంది. అందరూ ఆనందించారు.


అలా అందరూ కాళీయుడి విషవాయువుల నుంచి విముక్తి పొందారు. యమునా నది సైతం పవిత్రమైంది. 

ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🌻🙏

కాత్యాయనీ వ్రతం-3

  Katyanivratam

Date: 27-12-2026 ఆదివారం- మార్గశిర మాసం- కృష్ణ పక్షం చతుర్ధి


కాత్యాయనీ వ్రతం-3

శ్రీ మహాగణాధిపతయే నమః

శ్రీ గురుభ్యో నమః.


*ఓం*

*కాత్యాయని మహామాయే*

*మహాయోగిన్యధీశ్వరి*

*నందగోపసుతే దేవి* *పతిం మే కురు తే నమః.* 

*ఓం కాత్యాయనీ రూపిణ్యై నమః*


కృతయుగంలో భృగుమహర్షి అమ్మవారిని ప్రసన్నం చేసుకుని, స్త్రీ పురుషులకు కళ్యాణం శీఘ్రంగా జరగటానికి, అనుకూలదాంపత్యం ఉండడానికి ఏదైనా వ్రతం సూచించమని కోరాడు. అప్పుడు అమ్మవారు *"కాత్యాయనీ వ్రతం"* అనే వ్రతం గురించి చెప్పింది. గోపికలు ఈ వ్రతం చేసి శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందారు.


ఆనంద్ గ్రూపుల వారి ధార్మిక కార్యక్రమాలలో భాగంగా ఆనంద్ బ్రాహ్మణ వివాహ సంబంధిత గ్రూపుల వారిచే 


కాత్యాయనీ వ్రతం - వధువులకు మాత్రమే.


వధువుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి 


ఆనంద్ బ్రాహ్మిన్ మాట్రిమోనియల్సు వారి వధువులచే 

సామూహికంగా, 

ప్రత్యక్షంగా 

కాత్యాయనీ వ్రతం


27-12-2026- మార్గశిర మాసం-కృష్ణ పక్ష చవితీ ఆదివారం నాడు

ఉదయం 7 గంటలకు పెద్దలచే నిశ్చయింపబడినది.

8 గంటలనుంచి SVBC TV Channel లో రామాయణ, మహాభారత, శ్రీమద్భాగవత పారాయణ& ప్రవచన కార్యక్రమాల్లో పాల్గొన్న బ్రహ్మశ్రీ మారుతి గారిచే వ్యాఖ్యానం- కాత్యాయనీ మాత ప్రవచనం 

తదుపరి 

12.30 నిమిషాలకు అన్న ప్రసాద వితరణ



వేదిక: శ్రీ శృంగేరి శారదాశంకరమఠం,

             మోతీనగర్- హైదరాబాద్



ఈ కార్యక్రమ సంకల్పములో పేర్లు చెప్పుటకు ఒక వధువునకు 800 రూపాయలుగా నిశ్చయించడమైనది. పూజ అయిన తర్వాత ఫోటోలు వధువులు తీసుకుని వెళ్లవచ్చును.

అందుచేత వధువుల తల్లిదండ్రులు అందరూ GPay Number 9849566647 కు 

Rs.800/-లు పంపి రసీదు, పేరు, గోత్రము, నక్షత్రము 

కాత్యాయనీ వ్రతము గ్రూపులో పోస్టింగ్ చేయవలెను.

Group Link:


https://chat.whatsapp.com/DGmjKZZuzHz0XrGo37JBTQ?s=cl&p=i&mlu=4


*ఈ పవిత్ర కార్యక్రమంలో వధూవరుల తల్లిదండ్రులు అందరూ వారి

 పిల్లలుతో పాల్గొని కాత్యాయనీమాత అనుగ్రహం పొందవలసినదిగా కోరుతున్నాము.


మాకు సహకారం అందిస్తున్న వాలంటీర్లు అది నోట్ చేసుకుంటారు.

కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఖర్చుల వివరములు: 

వేదిక, మంగళ వాయిద్యముల

టీమ్ 5గురు, 4గురు పూజా గురువులు, పూజా ద్రవ్యములు, మైకు మరియు స్పీకర్లు, ఫోటోలు, వీడియో LIVE ఖర్చులు - అన్నప్రసాదము మొదలైనవి.


ఖర్చులు మొత్తం రాగానే రిజిస్ట్రేషన్లు క్లోజ్ చేస్తాము. అందుచేత అందరూ ముందుగా స్పందించవలసిందిగా కోరుతున్నాము. 


అన్నప్రసాద వితరణకు మీ అనుకూలతను బట్టి స్పందించండి.

సభ్యులందరూ ఈ కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుతున్నాము.


అయ్యలసోమయాజుల బ్రహ్మానందం

ఆనంద్ బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రం 

పుప్పల గూడ - హైదరాబాద్.

Mob: 9849566647

పంచాంగం

 ఈ రోజు పంచాంగం 30.09.2026 Wednesday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాస క్రిష్ణ పక్ష చతుర్థి తిథి సౌమ్య వాసర భరణి నక్షత్రం వజ్ర యోగః బాలవ తదుపరి కౌలవ కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

 

యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 


శ్రాద్ధ కర్మ తిథి : చతుర్థి.


 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                        సప్తమోధ్యాయః

                    జ్ఞాన విజ్ఞాన యోగము



 ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్ ।

ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్ ।। 18 ।।



ప్రతిపదార్థ;



ఉదారాః — మహనీయులు; సర్వే — వీరందరూ; ఏవ — నిజముగా; ఏతే — వీరు; జ్ఞానీ — జ్ఞానులు; తు — కానీ; ఆత్మా-ఏవ — స్వయముగా నేనే; మే — నా యొక్క; మతం — అభిప్రాయము; ఆస్థితః — స్థితుడై ఉండి; సః — ఆ వ్యక్తి; హి — ఖచ్చితంగా; యుక్త-ఆత్మా — ఏకీకృత మైనవారు; మాం — నా యందు; ఏవ — నిజముగా; అనుత్తమాం — సర్వోన్నత; గతిం — లక్ష్యము.



తాత్పర్యము:


నా యందు భక్తితో ఉన్నవారందరూ నిజముగా ఉత్తములే. కానీ, జ్ఞానముతో ఉండి, దృఢనిశ్చయము కలిగి, బుద్ధి నా యందు ఐక్యమై, మరియు కేవలం నన్ను మాత్రమే వారి పరమ లక్ష్యంగా కలిగిఉన్నవారు, స్వయంగా నా స్వరూపమే అని నేను పరిగణిస్తాను.



వివరణ :


7.17వ శ్లోకంలో జ్ఞానయుక్తుడైన భక్తుడే ఉన్నతమైన వాడు, అని చెప్పిన పిదప, శ్రీ కృష్ణుడు, మిగతా మూడు రకాల భక్తులు కూడా ఆయనకి ప్రియమైన వారే అని వివరణ ఇస్తున్నాడు. ఏ కారణంతో అయితేనేమి, భక్తిలో నిమగ్నమై ఉన్నవారు అందరూ గొప్పవారే అని చెప్తున్నాడు. అయినా, జ్ఞానంలో స్థితులై ఉన్న భక్తులు, భౌతిక వస్తు సంపద కారణాల కోసం భగవంతుడిని పూజించరు. అందుకే, భక్తుల యొక్క ఈ యొక్క నిస్వార్థ, బేషరతుగా ఉన్న ప్రేమకి భగవంతుడు బద్ధుడై పోతాడు.


పరా భక్తి, లేదా దివ్య ప్రేమ, అనేది, ప్రాపంచిక ప్రేమ కంటే చాలా విభిన్నమైనది. దివ్య ప్రేమ అనేది దివ్య సఖుని సంతోషం కోసం పరితపించే స్వభావంతో ఉంటుంది; ప్రాపంచిక ప్రేమ అనేది సొంత-ప్రయోజనం కోసం కోరికచే ప్రేరేపితమైనది. దివ్య ప్రేమ అనేది, సమర్పణ స్వభావంతో మరియు ఇష్టసఖుని సేవలో త్యాగంతో నిండి ఉంటుంది; ప్రాపంచిక ప్రేమ అనేది తీసుకునే దృక్పథంతో ఉంటుంది, దాని అంతిమ లక్ష్యం ప్రేమించిన వారి నుండి ఏదో పొందటమే. చైతన్య మహాప్రభు ఇలా వివరించాడు:


కామేర తాత్పర్య నిజ-సంభోగ కేవల

కృష్ణ-సుఖ-తాత్పర్య-మాత్ర ప్రేమ తా’ ప్రబల

అతఏవ కామ-ప్రేమే బహుత అంతర

కామ అంధ-తమః, ప్రేమ నిర్మల భాస్కర

(చైతన్య చరితామృతము, ఆది లీల 4.166 & 171)


‘కామము (ప్రాపంచిక ప్రేమ) స్వీయ-సంతోషం కోసము ఉంటుంది; దివ్య ప్రేమ శ్రీ కృష్ణుడి సంతోషం కోసం పెంపొందించుకోబడి ఉంటుంది. వీటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది - కామము అనేది చీకటి మరియు అజ్ఞానము వంటిది, అదే సమయంలో దివ్య ప్రేమ అనేది స్వచ్ఛమైనది మరియు ప్రకాశవంతమయినది.’ జగద్గురు శ్రీ కృపాలు జీ మహారాజ్ దీనిని చాలా అద్భుతంగా పేర్కొన్నాడు:


బ్రహ్మ లోక్ పర్యంత సుఖ్, అరు ముక్తిహుఁ త్యాగ్,

తబఇ ధరహు పగ ప్రేమ పథ, నహిఁ లగి జైహైఁ దాగ్


(భక్తి శతకము, 45వ శ్లోకం)


‘భక్తి మార్గంలో ప్రయాణించాలంటే, ప్రాపంచిక భౌతిక సుఖాల కోరికలను మరియు మోక్షము కోసం ఉన్న వాంఛను విడిచిపెట్టాలి. లేదా, అలాకాకపొతే దివ్య ప్రేమ అనే స్వచ్ఛమైన నీరు స్వార్థంతో మలినమైపోతుంది.’ నారద మహర్షి స్వచ్ఛమైన ప్రేమను ఈ విధంగా నిర్వచించారు:


తత్ సుఖ సుఖిత్వం (నారద భక్తి దర్శన్, 24వ సూత్రము)


‘నిజమైన ప్రేమ అంటే ఇష్ట సఖుని సంతోషం కోసం ఉన్నదే.’ భౌతిక ప్రాపంచికత్వంతో ప్రేరేపితమైన భక్తులు ఇటువంటి భక్తిలో నిమగ్నం కాలేరు, కానీ జ్ఞానంతో ఉన్న భక్తుడు ఈ నిస్వార్థ స్థాయికి ఎదుగుతాడు. ఎప్పుడైతే ఎవరైనా భగవంతుడిని ఈ విధంగా ప్రేమించటం నేర్చుకుంటారో, ఆయన ఆ భక్తునికి బానిసై పోతాడు. భగవంతుని యొక్క అత్యుత్తమ లక్షణం ఏమిటంటే, 'భక్త వత్సలుడు' (తన భక్తులపై ఆయనకు ఉన్న ప్రేమ). పురాణాలు ఇలా పేర్కొంటున్నాయి:


గీత్వా చ మమ నామాని విచరేన్మమ సన్నిధౌ

ఇతి బ్రవీమి తే సత్యమ్ క్రీతోహం తస్య చార్జున


(ఆది పురాణం 1.2.231)


శ్రీ కృష్ణుడు ఇలా అంటున్నాడు: ‘నా నామములు జపం చేస్తూ, తలంపులలో నన్ను తమ దగ్గరగా ఉంచుకున్న వారికి నేను బానిసనై పోతాను. ఇది నిజము ఓ అర్జునా.’ భగవంతుడు తన నిస్వార్థ భక్తుల పట్ల ఎంత ఋణపడి ఉంటాడంటే, వారిని తన స్వ-స్వరూపంగానే చూసుకుంటాను అన్న స్థాయి వరకు ఈ శ్లోకంలో చెప్తున్నాడు.

29, సెప్టెంబర్ 2026, మంగళవారం

30సెప్టెంబర్26🪷* *దృగ్గణిత పంచాంగం

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

 🌷 *సౌమ్యవారం*🌷 

*🪷30సెప్టెంబర్26🪷*  

 *దృగ్గణిత పంచాంగం*       

               

         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు*

*భాద్రపద మాసం - బహుళ పక్షం* 


*తిథి      : చవితి* మ 02.55 వరకు ఉపరి *పంచమి*

*వారం   :బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం   : భరణి* ఉ 07.36 వరకు ఉపరి *కృత్తిక*

*యోగం  : వజ్ర* రా 12.20 వరకు ఉపరి *సిద్ధి*

*కరణం   : బాలువ* మ 02.55 *కౌలువ* రా 01.45 ఉపరి *తైతుల* 

*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ09.00-10.00 సా04.00-05.00*

అమృత కాలం : *రా 03.48 - 05.17*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*

*వర్జ్యం         : సా 06.49 - 08.19*

*దుర్ముహూర్తం  : ప11.33 - 12.21*

*రాహు కాలం   : మ11.57 - 01.27*

గుళికకాళం      : *మ 10.27 - 11.57*

యమగండం    : *ఉ 07.27 - 08.57*

సూర్యరాశి : *కన్య*                      

చంద్రరాశి : *మేషం/వృషభం*   

సూర్యోదయం :*ఉ 06.06*  

సూర్యాస్తమయం :*సా 06.06*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం     : *ఉ 05.57 - 08.21*

సంగవ కాలం      :*08.21 - 10.45*

మధ్యాహ్న కాలం    : *10.45 - 01.09*

అపరాహ్నకాలం  : *మ 01.09-03.33*

*ఆబ్ధికం తిధి        : తిధి ద్వయం చవితి/పంచమి*

సాయంకాలం   : *సా 03.33 - 05.57*

ప్రదోష కాలం      : *సా 05.57 - 08.21*

రాత్రి కాలం        : *రా 08.21 - 11.34*

నిశీధి కాలం     : *రా 11.33 - 12.21*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.21 - 05.09*

¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●

                 *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


🌷 *ఓం సరస్వత్యై  నమః* 🌷


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు...                   లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🪷🪷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🪷🪷🍃🌷

🌹🌷🪷🪷🪷🪷🌷🌹

తెలుగు నేర్చుకోండి

తెలుగు నేర్చుకోండి

 మన తెలుగు వాళ్ళు ఎన్నో దేశాలలో ఉండి నిత్యం ఈ బ్లాగును చూస్తున్నా వాళ్ళు, వాళ్ళ పిల్లలకి తెలుగు నేర్పాలని అభిలాష ఉండటం సర్వసాధారణం.

కాకపోతే విదేశాలలో తెలుగు నేర్పే వాళ్లు లేరని మీరు సందేహించవచ్చు అటువంటి వాళ్లను దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ లో తెలుగు నేర్చుకుందాం అనే కోర్సును ప్రారంభించదల్చాము.

ప్రాథమికంగా తెలుగు మీద అవగాహనసం ప్రత్యేకంగా ఆన్లైన్లో తెలుగు పాఠాలను నేర్పటం కోసం ఈ కోర్సును ఏర్పాటు చేసాము

మీ పిల్లలకు తెలుగు మాట్లాడటం రాయటము నేర్పించదలిచితే వెంటనే కింద కామెంట్ రూపంలో సంప్రదించగలరు మీరు పెట్టే కామెంట్ గోప్యంగా ఉంచబడును అది ఇక్కడ ఎవరికీ కనబడదు కేవలము ఉపాధ్యాయులు గారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది మీరు మీ కామెంట్ ల మీ పిల్లల వయస్సు తెలుగుతో వారికి ఉన్న అనుబంధం తెలియచేస్తూ మీ మొబైల్ నెంబరు పేర్కొంటే ఆ నెంబర్కు వాట్సాప్ లో సంప్రదించబడును లేక మీ ఈమెయిల్ ఐడి ఇస్తే దాని ద్వారా సంప్రదించుకోవచ్చు ఇంకా ఎందుకు ఆలస్యం ఇప్పుడే మీరు మీ పిల్లలను ఈ కోర్సులో చేర్పించడానికి ఉద్యోత్తులు కండి.




మంగళవారం🍁* *🌹29సెప్టెంబర్26🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

 *🍁 మంగళవారం🍁* 

*🌹29సెప్టెంబర్26🌹*  

  *దృగ్గణిత పంచాంగం*       

                

         *ఈనాటి పర్వం* 

      *సంకష్టహర చతుర్ధి*

 

         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు*

*భాద్రపద మాసం - బహుళ పక్షం* 


*తిథి : తదియ* సా 05.09 వరకు ఉపరి *చవితి*

*వారం  : మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం  : అశ్విని* ఉ 09.03 వరకు ఉపరి *భరణి*

*యోగం : వ్యాఘాత* ఉ 06.13 *హర్షణ* రా 03.20 ఉపరి *వజ్ర*

*కరణం  : వణజి* ఉ 06.13 *భద్ర* సా 05.09 ఉపరి *బవ* రా.తె 04.03 వరకు ఆపైన *బాలువ*

*సాధారణ శుభ సమయాలు:*

*మ 12.00 - 01.00 సా 05.00 - 06.00*

అమృత కాలం  : *రా 03.06 - 04.36*

అభిజిత్ కాలం  : *ప 11.34 - 12.22*

*వర్జ్యం    : శేషం ఉ 06.46 & సా 06.04 - 07.34*

*దుర్ముహూర్తం  : ఉ 08.21 - 09.09 రా 10.46 - 11.34*

*రాహు కాలం : మ 02.58-04.28*

గుళికకాళం      : *మ 11.58 - 01.28*

యమగండం    : *ఉ 08.57 - 10.28*

సూర్యరాశి : *కన్య                       

చంద్రరాశి : *మేషం*  

సూర్యోదయం :*ఉ 06.06*

సూర్యాస్తమయం :*సా 06.07*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం     : *ఉ 05.57 - 08.21*

సంగవ కాలం        : *08.21 - 10.46*

మధ్యాహ్న కాలం    : *10.46 - 01.10*

అపరాహ్న కాలం  : *మ 01.10-03.34*

*ఆబ్ధికం తిధి        : భాద్రపద బహుళ తదియ*

సాయంకాలం    : *సా 03.34 -05.58*

ప్రదోష కాలం    : *సా 05.58 - 08.22*

రాత్రి కాలం      :*రా 08.22 - 11.34*

నిశీధి కాలం     :*రా 11.34 - 12.22*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.21 - 05.09*

¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

అదృష్టం

  అదృష్టం వాననీరు లాంటిది... శ్రమ బావినీరు లాంటిది..... రోజూ స్నానం చేయాలంటే ఎప్పుడో కురిసే వర్షాన్ని కాదు, బావిని నమ్ముకోవాలి....


శుభ మంగళవారం 🌹Happy Tuesday

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                        సప్తమోధ్యాయః

                    జ్ఞాన విజ్ఞాన యోగము


తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ।

ప్రియో హి జ్ఞానినోఽత్యర్థమహం స చ మమ ప్రియః ।। 17 ।।

 


ప్రతిపదార్థ;



తేషాం — వీరందరిలో; జ్ఞానీ — జ్ఞానములో స్థితమై ఉన్నవారు; నిత్య-యుక్తః — ఎల్లప్పుడూ దృఢ సంకల్పంతో; ఏక — అనన్యముగా; భక్తిః — భక్తి; విశిష్యతే — శ్రేష్ఠమైన; ప్రియః — ప్రియమైన; హి — ఖచ్చితంగా; జ్ఞానినః — జ్ఞానములో స్థితమైనవారు; అత్యర్థం — గొప్పగా; అహం — నేను; సః — అతను; చ — మరియు; మమ — నాకు; ప్రియః — ప్రియమైన వాడు.



తాత్పర్యము:


వీరందరిలో కెల్లా, జ్ఞానంతో నన్ను పూజించే వారు, మరియు నా పట్ల దృఢ సంకల్పముతో మరియు అనన్య భక్తితో ఉన్నవారిని, అందరి కంటే, శ్రేష్ఠమైన వారిగా పరిగణిస్తాను. నేను వారికి ప్రియమైనవాడిని మరియు వారు నాకు ప్రియమైనవారు.



వివరణ :


ఆపదలో, ప్రాపంచిక వస్తువుల కోసం, లేదా కుతూహలంతో - భగవంతుడిని ఆశ్రయించే వారికి ఇంకా నిస్వార్థ భక్తి లేనట్టే. నెమ్మదిగా, క్రమక్రమంగా భక్తి ప్రక్రియలో, వారి మనస్సు పవిత్రమై వారికి భగవంతునితో తమకున్న నిత్య-శాశ్వత అనుబంధ జ్ఞానం పెంపొందుతుంది. అప్పుడు వారి భక్తి అనన్యమైనదిగా, ఏక చిత్తముతో, నిరంతరం భగవత్ పరంగా కొనసాగుతునే ఉంటుంది. ఈ ప్రపంచం వారిది కాదనే జ్ఞానం పొందటం వలన మరియు ఇక్కడ సంతోషమనేది దొరకదు అని తెలియటం వలన, వారు అనుకూల పరిస్థితుల కోసం తపించరు లేదా ప్రతికూల పరిస్థితుల పట్ల శోకించరు. ఈ విధంగా, వారు నిస్వార్థ భక్తిలో స్థితమై ఉంటారు. సంపూర్ణ ఆత్మ సమర్పణ శరణాగతి దృక్పథంలో, దివ్య సఖుడి కోసం ప్రేమాగ్నిలో తమని తాము సమర్పించుకుంటారు. కాబట్టి, అటువంటి జ్ఞానంలో స్థితులై ఉన్న భక్తులు, తనకు అత్యంత ప్రియమైన వారని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.

రేబిస్ దినోత్సవం*

 *సెప్టెంబర్ 28 - ప్రపంచ రేబిస్ దినోత్సవం*


*ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా (World Rabies Day)* *రేబిస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.*


*ఉద్దేశ్యం:*

*రేబిస్ వ్యాధి ప్రమాదాలు, నివారణ మార్గాలు,  జంతువుల ద్వారా ఈ వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించడం.*


*చరిత్ర:*

*మొట్టమొదటి రేబిస్ వ్యాక్సిన్‌ను కనుగొన్న ఫ్రెంచ్ శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్* *1895 సెప్టెంబర్ 28న మరణించారు. ఆయన జ్ఞాపకార్థం ఈ రోజును జరుపుకుంటారు. గ్లోబల్ అలయన్స్ ఫర్ రేబీస్ కంట్రోల్ (GARC) మరియు  వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) సంయుక్తంగా 2007లో ఈ వేడుకలు ప్రారంభించాయి.*


*రేబిస్ గురించి తెలుసుకోండి:*

*🔴 ప్రాణాంతక జంతుజన్య వ్యాధి, ఎక్కువగా కుక్క కాటు ద్వారా వ్యాపిస్తుంది*

*🔴లక్షణాలు బయటపడితే 100% ప్రాణాంతకం, కానీ సకాలంలో వ్యాక్సిన్‌తో 100% నివారించవచ్చు*

*🔴ప్రధాన లక్షణం: జలభయం (Hydrophobia)* - *నీటిని చూసినా, తాగబోయినా గొంతు కండరాలు బిగుసుకుపోయి తీవ్ర భయాందోళన*


*✅ ప్రథమ చికిత్స - ప్రాణం కాపాడుతుంది:*

*1. కుక్క/జంతువు కరిచినా, గీరినా వెంటనే గాయాన్ని సబ్బుతో, కుళాయి నీటితో కనీసం 15 నిమిషాలు బాగా కడగాలి*

*2. బెటాడిన్ / స్పిరిట్ వంటి యాంటీసెప్టిక్ రాయాలి*

*3. వెంటనే వైద్యుడిని కలిసి యాంటీ-రేబిస్ టీకా తీసుకోవాలి*

*4. పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా రేబిస్ వ్యాక్సిన్ వేయించాలి*


*🎯 2026 థీమ్: "Stronger Together - అందరం కలిసికట్టుగా బలపడదాం"*

*రేబిస్ రహిత ప్రపంచం ఒక్కరితో సాధ్యం కాదు, అందరూ కలిస్తేనే సాధ్యం!*

27, సెప్టెంబర్ 2026, ఆదివారం

పంచాంగం 27.09.2026 Sunday,

 ఈ రోజు పంచాంగం 27.09.2026 Sunday,


స్వస్తి  శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాస క్రిష్ణ పక్ష ప్రతిపత్తి తిథి భాను వాసర ఉత్తరాభాద్ర నక్షత్రం వృద్ధి యోగః బాలవ తదుపరి కౌలవ కరణం.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

 


శ్రాద్ధ కర్మ తిథి : ప్రతిపత్తి.


 

నమస్కారః , శుభోదయం

భానువారం*🌞 *🌹27సెప్టెంబర్26🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

    🌞 *భానువారం*🌞

  *🌹27సెప్టెంబర్26🌹*  

   *దృగ్గణిత పంచాంగం*       

               

        *ఈనాటి పర్వం* 

      *మహాలయ పక్షం*

           *ప్రారంభం* 


         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు* 

*భాద్రపద మాసం - బహుళ పక్షం* 


*తిథి       : పాడ్యమి* రా 08.58 వరకు ఉపరి *విదియ*

*వారం : ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం   : ఉత్తరాభాద్ర* ఉ 11.08 వరకు ఉపరి *రేవతి*

*యోగం  : వృద్ధి* ఉ 11.17 వరకు ఉపరి *ధ్రువ* 

*కరణం   : బాలువ* ఉ 09.41 *కౌలువ* రా 08.58 ఉపరి *తైతుల*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ07.00- 09.00 మ02.00-04.00*

అమృత కాలం  : *ఉ 06.24 - 07.59*

అభిజిత్ కాలం  : *ప 11.34 - 12.22*

*వర్జ్యం         : రా 10.42 - 12.14*

*దుర్ముహూర్తం: సా 04.23-05.12*

*రాహుకాలం   : సా 04.29-06.00*

గుళికకాళం    : *మ 02.59 - 04.29*

యమగండం    : *మ 11.58 - 01.29*

సూర్యరాశి : *కన్య*                              

చంద్రరాశి : *మీనం* 

సూర్యోదయం :*ఉ 06.06*

సూర్యాస్తమయం :*సా 06.08*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:* 

ప్రాతః కాలం     : *ఉ  05.57 - 08.21*

సంగవ కాలం        :  *08.21 - 10.46*

మధ్యాహ్న కాలం    : *10.46 - 01.11*

అపరాహ్నకాలం    : *మ 01.11-03.35*

*ఆబ్ధికం తిధి        : భాద్రపద బహుళ పాడ్యమి*

సాయంకాలం   : *సా 03.35- 06.00*

ప్రదోష కాలం       : *సా 06.00-08.23*

రాత్రి కాలం          : *రా 08.23-11.34*

నిశీధి కాలం        : *రా 11.34 -12.22*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.21 - 05.09*

¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


          🙏*ఓం నమో*🙏

*🌞సూర్యదేవాయ నమః🌞* 


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు...                   లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

25, సెప్టెంబర్ 2026, శుక్రవారం

ఆరోగ్య చిట్కాలు

  **సంస్కృతంలో ప్రాచీన భారతీయ ఆరోగ్య చిట్కాలు ఆంగ్లంలోకి అనువదించబడ్డాయి*


*తప్పక చదవాలి*


*1. అజీర్ణే భోజన విషం.*


గతంలో తీసుకున్న భోజనం జీర్ణం కాకపోతే.. రాత్రి భోజనం తీసుకోవడం విషం తీసుకున్నట్లు అవుతుంది. ఆకలి అనేది మునుపటి ఆహారం జీర్ణమైందని సూచించే ఒక సంకేతం


*2. అర్ధరోగహరి నిద్ర.*


సరైన నిద్ర సగం వ్యాధులను నయం చేస్తుంది..


*3 ముద్గదాలి గదవ్యాలి.*


అన్ని పప్పుధాన్యాలలో, పచ్చ పెసర్లు ఉత్తమమైనవి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇతర పప్పుధాన్యాలు అన్నీ ఒకటి లేదా మరొక దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. 


*4.  భగ్నాస్థి-సంధానకరో లశునః.*

 వెల్లుల్లి విరిగిన ఎముకలను కూడా కలుపుతుంది.. 


 *5.  అతి సర్వత్ర వర్జయేత్.*

 రుచిగా ఉన్నంత మాత్రాన ఏదైనా అతిగా తీసుకుంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు.  మితంగా ఉండండి. 


 *6.  నాస్తి మూలమనౌషధం.*

 శరీరానికి ఔషధ ప్రయోజనం లేని కూరగాయలు లేవు. 


 *7.   న వైద్యః ప్రభురాయుషః ।*

 ఏ వైద్యుడూ దీర్ఘాయువు ఇవ్వలేడు.  (వైద్యులకు పరిమితులు ఉన్నాయి.) 


 *8.  చింతా వ్యాధి ప్రకాశాయ ।*

 ఆందోళన అనారోగ్యాన్ని తీవ్రతరం చేస్తుంది.. 


 *9.  వ్యామశ్చ శనైః శనైః.*

 ఏదైనా వ్యాయామం నెమ్మదిగా చేయండి.

 (వేగవంతమైన వ్యాయామం మంచిది కాదు.) 


 *10.  అజవత్ చర్వణం కుర్యాత్.*

 మీ ఆహారాన్ని మేక లాగా నమలండి.

 (ఎప్పుడూ తొందరపడి ఆహారాన్ని మింగకండి. 

 లాలాజలం జీర్ణక్రియలో మొదట సహాయపడుతుంది.) 


 *11.   స్నానం నామం మనఃప్రసాధనకరందుః స్వప్న-విధ్వంసనం ।*

  స్నానం కుంగుబాటు

( డిప్రెషన్‌) ను దూరం చేస్తుంది.

  చెడు కలలను దూరం చేస్తుంది.. 


 *12.  న స్నానమాచరేద్ భుక్త్వా.*

 ఆహారం తీసుకున్న వెంటనే స్నానం చేయ కూడదు.   (జీర్ణక్రియ ప్రభావితమవుతుంది). 


 *13.  నాస్తి మేఘసమం తోయం.*

 స్వచ్ఛతలో వర్షపు నీటికి ఏ నీరు సరిపోదు.. 


 *14.   అజీర్ణే భేషజం వారి.*

 అజీర్ణం ఉన్నప్పుడు సాధారణ నీటిని తీసుకోవడం వల్ల ఔషధంలా పనిచేస్తుంది.


 *15.  సర్వత్ర నూతనం షష్టం, సేవకాన్నే పురాతనే ।*

 ఎప్పుడూ తాజాగా ఉండేవాటికే ప్రాధాన్యత ఇవ్వండి.. 

 అయితే అన్నం మరియు సేవకుడు మాత్రం పెద్ద వయస్సులో ఉన్నప్పుడు మాత్రమే మంచివి.


 *16.  నిత్యం సర్వ రస భక్ష్యః ।।*

 మొత్తం షడ్రుచులు (ఆరు) రుచులు ఉన్న ఆహారాన్ని తీసుకోండి.

 (అనగా: ఉప్పు, తీపి, చేదు, పులుపు, వగరు (ఆస్ట్రింజెంట్) మరియు ఘాటు (పంజెంట్). 


 *17.  జఠరం పూరాయెదర్ధం అన్నార్, భాగం జలేన్ చ ।*

 *వాయోః సంచరణార్థాయ చతర్థమవశేషయేత్ ।।*

 మీ కడుపులో సగభాగాన్ని ఘనపదార్థాలతో నింపండి, 

పావు వంతు నీరు మరియు మిగిలిన దానిని ఖాళీగా ఉంచండి.


 *18.  భుక్త్వా శతపథం గచ్ఛేద్ యదిచ్ఛేత్ చిరజీవితమ్ ।*

 ఆహారం తీసుకున్న తర్వాత ఎప్పుడూ ఖాళీగా కూర్చోవద్దు. కనీసం అరగంట పాటు నడవండి. 


 *19.  క్షుత్సాధుతాం జనయతి ।*

 ఆకలి ఆహారం యొక్క రుచిని పెంచుతుంది..

 ఇంకా చెప్పాలంటే, ఆకలిగా ఉన్నప్పుడే తినండి.. 


 *20.  చింతా జరా నామం మనుష్యాణాం* 

 ఆందోళన వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది.. 


 *21.  శతం విహాయ భోక్తవ్యం, సహస్రం స్నానమాచరేత్ ।*

 ఆహారం కోసం సమయం వచ్చినప్పుడు, 100 పనులను కూడా పక్కన పెట్టండి (ఫోనుతో సహా). 


 *22.  సర్వధర్మేషు మధ్యమామ్.*

 ఎల్లప్పుడూ మధ్య మార్గాన్ని ఎంచుకోండి.  ఏదైనా విషయంలో అతిగా వెళ్లడం మానుకోండి


 *ఇవి మన ఋషులచే సంస్కృతంలో చెప్పబడిన  సువర్ణ జ్ఞాన పదాలు.*


 *దయచేసి మీ ప్రియమైన వారితో పంచుకోండి. 

24, సెప్టెంబర్ 2026, గురువారం

వేదవతియే పద్మావతి🌻

 🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️ 


*🌻 వేదవతియే పద్మావతి🌻*


*🍃🌹 వేదవతి జన్మ  శ్రీమహా విష్ణువును పొందాలనే సంకల్పం*


పురాణ కథనాల ప్రకారం, వేదవతి శ్రీమహావిష్ణువును భర్తగా పొందాలనే సంకల్పంతో కఠోరమైన తపస్సు చేసింది. ఆమె భక్తి, పాతివ్రత్యం, భగవంతునిపై ఉన్న అచంచలమైన విశ్వాసం ఎంతో గొప్పవి.


వేదవతి తపస్సు చేస్తున్న సమయంలో రావణుడు ఆమెను తన వశం చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ వేదవతి అతని కోరికను తిరస్కరించి, రావణునికి శాపం ఇచ్చింది. తన పాతివ్రత్యాన్ని కాపాడుకోవడానికి ఆమె అగ్నిలో ప్రవేశించింది.


*🍃🌹 సీతాదేవి స్థానంలో వేదవతి*


రామాయణానికి సంబంధించిన కొన్ని పురాణ పరంపరల్లో, రావణుడు సీతాదేవిని అపహరించబోయే సమయంలో అగ్నిదేవుడు నిజమైన సీతాదేవిని తన సంరక్షణలో ఉంచి, ఆమె స్థానంలో వేదవతిని సీత రూపంలో రావణుని చేతికి అప్పగించినట్లు కథనం ఉంది.


అలా రావణుడు లంకకు తీసుకెళ్లినది నిజమైన సీతాదేవి కాదు — వేదవతి అని ఈ పురాణ పరంపర వివరిస్తుంది.


లంకలో అశోకవనంలో ఉండి రావణుని వేధింపులను భరించినది కూడా వేదవతియేనని ఈ కథనం చెబుతుంది. శ్రీరాముడు రావణుని సంహరించిన అనంతరం, సీతాదేవి అగ్నిప్రవేశం చేసినప్పుడు నిజమైన సీతాదేవి తిరిగి ప్రత్యక్షమవుతుంది. అప్పుడు వేదవతి గురించి శ్రీరామునికి సీతాదేవి వివరిస్తుంది.


*🍃🌹 శ్రీరాముని వాగ్దానం*


సీతాదేవి వేదవతిని కూడా స్వీకరించాలని శ్రీరాముని కోరినట్లు పురాణ కథనం చెబుతుంది.


అయితే త్రేతాయుగంలో తాను ఏకపత్నీవ్రతాన్ని ఆచరిస్తున్నందున, ఆ జన్మలో ఆమెను వివాహం చేసుకోలేనని శ్రీరాముడు తెలియజేశాడు.


అయితే వేదవతి భక్తి, తపస్సు వృథా కాకుండా, భవిష్యత్తులో ఆమెను వివాహం చేసుకుంటానని శ్రీరాముడు వరమిచ్చినట్లు తిరుమల శ్రీనివాస కల్యాణ కథనం వివరిస్తుంది. తదుపరి జన్మలో ఆమె పద్మావతిగా జన్మిస్తుందని, తానే శ్రీనివాసునిగా అవతరించి ఆమెను వివాహం చేసుకుంటాననే దివ్య సంకల్పం ఏర్పడుతుంది.


*🍃🌹 వేదవతి — పద్మావతిగా అవతారం*


కాలం గడిచింది.


కలియుగంలో ఆకాశరాజు యజ్ఞం కోసం భూమిని దున్నుతున్న సమయంలో, పద్మసరోవరంలో వెయ్యి రేకుల బంగారు పద్మంలో ఒక బాలిక ప్రత్యక్షమైందని తిరుమల స్థలపురాణం చెబుతుంది.


పద్మంలో జన్మించిన ఆ బాలికకు “పద్మావతి” అనే పేరు పెట్టి, ఆకాశరాజు తన కుమార్తెగా పెంచుకున్నాడు. తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి అవతార కథనంలో కూడా పద్మపుష్కరిణిలో స్వర్ణపద్మంపై అమ్మవారి అవతారాన్ని ప్రస్తావిస్తారు.


*🍃🌹 పద్మావతిని కలుసుకున్న శ్రీనివాసుడు*


ఇదే సమయంలో శ్రీమహావిష్ణువు కలియుగంలో శ్రీనివాసునిగా వేంకటాద్రిపై అవతరించాడు.


ఒక సందర్భంలో శ్రీనివాసుడు పద్మావతిని దర్శించాడు. ఆ దివ్యదర్శనంతో ఇద్దరి మధ్య అనురాగం ఏర్పడింది. పద్మావతి కూడా శ్రీనివాసుని గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది.


శ్రీనివాసుడు తన తల్లి వకుళాదేవికి తన మనసులోని విషయాన్ని తెలియజేశాడు. వకుళాదేవి ఆకాశరాజును కలిసి పద్మావతిని శ్రీనివాసునికి వివాహం చేయాలని కోరింది.


*🍃🌹 దివ్య వివాహానికి మార్గం*


పద్మావతి కూడా శ్రీనివాసుని వివాహం చేసుకోవాలని కోరుకుంటున్న విషయం తెలిసింది. బృహస్పతి సలహాతో ఆకాశరాజు ఈ వివాహానికి అంగీకరించాడు.


ఆ తరువాత శుభముహూర్తం నిర్ణయించబడింది. దేవతలు, మహర్షులు, బ్రహ్మాది దేవతల సమక్షంలో శ్రీనివాస–పద్మావతి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది.


ఈ విధంగా త్రేతాయుగంలో శ్రీరాముని వద్ద పొందిన వాగ్దానం కలియుగంలో శ్రీనివాసుని రూపంలో నెరవేరిందని ఈ పురాణ పరంపర వివరిస్తుంది.


వేదవతి కథ మనకు ఒక గొప్ప విషయాన్ని తెలియజేస్తుంది.


భగవంతునిపై ఉంచిన నిజమైన భక్తి, చేసిన తపస్సు, ధర్మం కోసం చేసిన త్యాగం ఎప్పటికీ వృథా కావు.


ఒక జన్మలో ప్రారంభమైన సంకల్పం, మరొక జన్మలో భగవంతుని దివ్యసంకల్పంతో పరిపూర్ణత పొందుతుందని ఈ కథ భక్తులకు విశ్వాసాన్ని కలిగిస్తుంది.


వేదవతి తపస్సు —

➡️ శ్రీరాముని వాగ్దానానికి కారణమైంది.


శ్రీరాముని వాగ్దానం —

➡️ పద్మావతి అవతారానికి కారణమైంది.


పద్మావతి అవతారం —

➡️ శ్రీనివాసునితో దివ్యకల్యాణానికి దారితీసింది.


అందుకే భక్తి పరంపరలో “వేదవతియే పద్మావతి” అనే భావనకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది.


🍃🌹 వేదవతి తపస్సుకు ఫలితం — పద్మావతి కల్యాణం.


🍃🌹 శ్రీరాముని వాగ్దానానికి ఫలితం — శ్రీనివాసుని వివాహం.


🍃🌹 భక్తి, ధర్మం, దైవసంకల్పం కలిసిన దివ్యగాథ — శ్రీ పద్మావతి శ్రీనివాసుల కల్యాణం.


🙏🌺 ఓం నమో వేంకటేశాయ 🌺🙏

23, సెప్టెంబర్ 2026, బుధవారం

హనుమాన్ బాహుక్*🙏🌹

  *🪷సౌమ్యవారం 23 సెప్టెంబర్ 2026🪷*


**🙏🌹*హనుమాన్ బాహుక్*🙏🌹 

           *🌷పన్నెండవ రోజు🌷*


సేవక స్యోకాఈ జాని జానకీ సమానై కాని, 

సానుకూల సూలపాని నవై నాథ నాఁకకో, 

దేవీ దేవ దానవ దయావనే హ్వై జో రైం హాథ్, 

బాపురే బరాక కహా ఔర రాజా రాఁకకో ॥ 

జాగత సోవత బైఠే బాగత బినోద మోద, 

తాకై జో అనర్థ సో సమర్థ ఏక ఆఁకకో 

సబ దిన రూరో పరై పూరో జహాఁ తహాఁ తాహి, 

జాకే హై భరోసో హియే హనుమాన హాఁకకో ॥


వివరణ : తన సేవకుడగు హనుమంతుని సేవను చూచి జానకీపతి శ్రీరామచంద్రుడు అంత గొప్పవాని సేవను పొందుటలో సంకోచించినాడు. కృతజ్ఞతలో మునిగిపోయినాడు. సాక్షాత్తు పరమశివుడే అంశయై నిలిచినాడు. స్వర్గాధిపతియైన ఇంద్రుడే నమ్రుడైనాడు. దేవి దేవతలు, దానవులు సైతము ఎల్లరూ హనుమంతుని దయ నర్థించుచు చేతులు జోడించుచున్నారు. ఇక దిక్కులేనివారు, దరిద్రులు, దుఃఖితులగు రాజ సామాన్యుల విషయము చెప్పునదేమి? మెలకువ నున్నను, నిద్దుర నున్నను, కూర్చొని యున్నను, చలించుచున్నను, క్రీడాసక్తులై ఉన్నను, ఆనందమగ్నులై యున్నను ఆ హనుమంతుని సేవకులకు అపకారము తలపెట్టగల వా రున్నారా? ఎవరి హృదయమున అంజనానందనుని సహాయము నెడ సంపూర్ణ విశ్వాస మున్నదో వారు ఏ తావునైనను, ఎల్లవేళలను సంపూర్ణ మనోరథు లగుదురు.


హనుమంతుని యందు సంపూర్ణ విశ్వాసము కలవారిని ఎవ్వరూ ఎప్పుడును ఏమియు చేయజాలరు. హనుమత్సేవకుల కోరిక లన్నియు తీరును.


 **1. భావార్ధం**


**సేవక స్యోకాఈ జాని జానకీ సమానై కాని,**

**సానుకూల సూలపాని నవై నాథ నాఁకకో |**


* **అర్థం:** హనుమంతుని యొక్క నిష్కల్మషమైన సేవను చూసి, సాక్షాత్తు **జానకీ దేవి (సీతమ్మ)** ఆయనను తన సొంత బిడ్డలా, పరమ ఆప్తుడిగా గౌరవిస్తుంది. అలాగే, శూలపాణి అయిన **శివుడు (పరమేశ్వరుడు)** ఆయన పట్ల ఎల్లప్పుడూ ప్రసన్నుడై (సానుకూలుడై) ఉంటాడు(శివాంశ సంభూతుడు).స్వర్గాధిపతి అయిన **ఇంద్రుడు (నాథ నాఁకకో - దేవతల రాజు)** సైతం హనుమంతునికి తలవంచి నమస్కరిస్తాడు.


* **వివరణ:** హనుమంతుడికి విశ్వంలో ఉన్న ఉన్నతమైన స్థానాన్ని తులసీదాస్ గారు ఇక్కడ చెప్తున్నారు. సీతమ్మ ఆశీస్సులు, శివుని అంశ, దేవతల రాజు ఇంద్రుని గౌరవం పొందిన మహాశక్తి హనుమంతుడు.


**దేవీ దేవ దానవ దయావనే హ్వై జో రైం హాథ్,**

**బాపురే బరాక కహా ఔర రాజా రాఁకకో ||**


* **అర్థం:** ఏ హనుమంతుని ముందు సమస్త దేవతలు, మరియు దానవులు (రాక్షసులు) కూడా చేతులు జోడించి దీనంగా, దయాభిక్ష కోసం వేచి ఉంటారో... అటువంటి స్వామి అండ ఉన్నప్పుడు, ఇక సామాన్య మానవులైన రాజులు ఎంత? పేదవాళ్ళు ఎంత? (వారి వల్ల ఏ కీడూ జరగదు).


* **వివరణ:** లోకాలను శాసించే దేవతలు, దానవులే హనుమంతుని శక్తి ముందు మోకరిల్లుతుంటే, ఈ భూమిపై ఉండే అల్పమైన శత్రువులు, అధికారులు లేదా రాజులు భక్తుడిని ఏంచేయగలరు? వారి శక్తి హనుమంతుని ముందు చాలా చాలా చిన్నది.


 **జాగత సోవత బైఠే బాగత బినోద మోద,**

 **తాకై జో అనర్థ సో సమర్థ ఏక ఆఁకకో |**


* **అర్థం:** ఒక భక్తుడు మేల్కొని ఉన్నా (జాగ్రత), నిద్రిస్తున్నా (సోవత), కూర్చుని ఉన్నా (బైఠే), పరుగెడుతున్నా (బాగత), లేదా ఏదైనా వినోదంలో మునిగి ఉన్నా... అతనికి ఎవరైనా కీడు (అనర్థం) చేయాలని చూస్తే, ఆ దుష్టులను శిక్షించడానికి, ఆ కీడును ఒక్క క్షణంలో (ఏక ఆఁకకో) తుడిచిపెట్టడానికి హనుమంతుడు ఒక్కడే సమర్థుడు.


* **వివరణ:** భక్తుడు ఏ స్థితిలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా స్వామి రక్షణ కవచంలా ఉంటాడు. భక్తుడికి అపకారం చేయాలని చూసే శత్రువుల తలరాతను ఒక్క క్షణంలో మార్చేసే సర్వసమర్థుడు హనుమంతుడు.


 **సబ దిన రూరో పరై పూరో జహాఁ తహాఁ తాహి,**

 **జాకే హై భరోసో హియే హనుమాన హాఁకకో ||**


* **అర్థం:** ఎవరి హృదయంలోనైతే (హియే) హనుమంతుని యొక్క ఒక్క "హుంకారము" (హాఁకకో - గర్జన లేదా పిలుపు) పై పూర్తి నమ్మకం (భరోసో) ఉంటుందో, అతనికి ఎక్కడైనా, ఎప్పుడైనా, అన్ని రోజులూ (సబ దిన) మంగళకరంగానే (రూరో పరై) సాగుతుంది. అతని ప్రతి కోరికా సంపూర్ణమవుతుంది (పూరో).


* **వివరణ:** ఆంజనేయుని నామస్మరణ మరియు ఆయన రక్షణపై గుండెల్లో గట్టి నమ్మకం ఉన్నవాడికి జీవితంలో ఏ రోజూ చెడు జరగదు. కాలం, స్థలంతో సంబంధం లేకుండా అతనికి అంతా శుభమే జరుగుతుంది.


**విశేష విశ్లేషణ**


* **పూర్ణ శరణాగతి:** ఈ శ్లోకంలో "హనుమంతుని హుంకారమే" భక్తుడికి శ్రీరామరక్ష అని తులసి దాసు గారు చాటిచెప్పారు.


* **భయ వినాశనం:** లౌకిక పరమైన భయాలు (రోగాలు, శత్రువులు, గ్రహ దోషాలు, సమాజంలో వచ్చే ఇబ్బందులు) ఏవీ హనుమద్భక్తుడిని తాకలేవనే ధైర్యాన్ని ఈ శ్లోకం ఇస్తుంది.


* **ఆధ్యాత్మిక బలం:** సీతమ్మ కరుణ, శివుని అనుగ్రహం రెండూ హనుమంతునిలోనే ఉన్నాయి కాబట్టి, ఆయన్ని నమ్ముకుంటే సర్వ దేవతలను నమ్ముకున్నట్లే అనే పరమార్థం ఇందులో ఉంది.


**సారాంశం:**

ఎవరి హృదయంలో అయితే హనుమంతుని రక్షణ పట్ల నిశ్చలమైన నమ్మకం ఉంటుందో, వారికి ఎల్లప్పుడూ, అన్ని వేళలా జయమే కలుగుతుంది. శత్రువులు, రోగాలు లేదా ఎలాంటి విపత్తులైనా సరే స్వామి వారి ఒక్క హుంకారంతో పటాపంచలైపోతాయి.


🙏🌹*జై శ్రీరామ్ జై హనుమాన్*🙏🌹


          *🪷సేకరణ🪷*

       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*

బృహస్పతివారం🌹* *🌷24సెప్టెంబర్26🌷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

*🌹బృహస్పతివారం🌹*

 *🌷24సెప్టెంబర్26🌷* 

  *దృగ్గణిత పంచాంగం*

                    

         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు*

*భాద్రపద మాసం - శుక్ల పక్షం* 


*తిథి       : త్రయోదశి* రా 11.18 వరకు ఉపరి *చతుర్దశి*

*వారం  :గురువారం* (బృహస్పతివాసరే)

*నక్షత్రం   : ధనిష్ఠ* ఉ 10.35 వరకు ఉపరి *శతభిషం*

*యోగం  : ధృతి* సా 03.55 వరకు ఉపరి *శూల*

*కరణం   : కౌలువ* ఉ 11.09 *తైతుల* రా 11.18 ఉపరి *గరజి*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ11.00-12.00 సా04.00-05.00*

అమృత కాలం : *రా 03.56-05.35 తె*

 అభిజిత్ కాలం  : *ప 11.35 - 12.24*

*వర్జ్యం        : సా 06.01 - 07.40*

*దుర్ముహూర్తం  : ఉ 09.58 - 10.47 మ 02.49 - 03.37*

*రాహు కాలం : మ 01.30-03.01*

గుళికకాళం      : *ఉ 08.58 - 10.29*

యమగండం    : *ఉ 05.57 - 07.27*

సూర్యరాశి : *కన్య*                  

చంద్రరాశి : *కుంభం*   

సూర్యోదయం :*ఉ 06.05* 

సూర్యాస్తమయం :*సా 06.11*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం    : *ఉ  05.56 - 08.22*

సంగవ కాలం      :*08.22 - 10.47*

మధ్యాహ్న కాలం    : *10.47 - 01.12*

అపరాహ్న కాలం : *మ 01.12-03.37*

*ఆబ్ధికం తిధి :భాద్రపద శుద్ధ త్రయోదశి*

సాయంకాలం   : *సా 03.37- 06.02*

ప్రదోష కాలం      : *సా 06.02-08.25*

రాత్రి కాలం        : *రా 08.25 -11.36*

నిశీధి కాలం       : *రా11.36 -12.23*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.21 - 05.09*

¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

           

     *ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు...                   లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><><>


        🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

పరోపకారాయ

  👏1."పరోపకారాయ ఫలంతి

 వృక్షాః,

పరోపకారాయ వహంతి నద్యః,

పరోపకారాయ దుహంతి గావః, 

పరోపకారార్థమిదం శరీరం".

2."ప్రతిది సులభమ్ముగా సాధ్య-పడదు లెమ్ము,

నరుడు నరుడౌట ఎంతొ దు -ష్కరము సుమ్ము"

-మీర్జా గాలిబ్ గీతానికి దాశరథి కృష్ణమాచార్యుల వారి తెలుగు సేత.

3."పరుల కొరకు పాటుపడని 

-నరుని బ్రతుకు దేనికని?

మూగ నేలకు నీరందివ్వని-

వాగు పరుగు దేనికని?.."

-ఆచార్య సి నారాయణ రెడ్డి గారు. * * *

-మోతుకూరు నరహరి

శ్రీ వామన జయంతి

 *_𝕝𝕝ॐ𝕝𝕝 23/09/2026 - భాద్రపద శుద్ధ ద్వాదశీ - శ్రీ వామన జయంతి 𝕝𝕝卐𝕝𝕝_*

*≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈*


*_శ్రీ వామన అవతారం_*

*┉┅━ ❀ 🔆 ❀ ┉┅━*


ప్రజలు తమ బాధలు తట్టుకోలేని ప్రతిసారీ ఆ భగవంతుని తల్చుకోవడం నైజం. దైవకృపతో ఆ బాధలు తీరిపోతాయని వారి నమ్మకం. కానీ దేవుడు వస్తే కానీ తీరని బాధలు కలిగితే సాక్షాత్తు ఆ దైవమే కిందకి దిగిరాక తప్పదు. అలా ‘కిందకి దిగడం’ అన్న మాటను అవతరించడం అంటారు. అలా విష్ణుమూర్తి మానవాళిని రక్షించేందుకు తొమ్మిది అవతారాలు ఎత్తినట్లు చెబుతారు. వాటిలో ఐదవది వామనావతారం.


విష్ణుమూర్తి ధరించిన అవతారాలలో మొదటి మానవ అవతారం వామనుడు. ఈ వామనుడి ప్రసక్తి రుగ్వేదంలోనే ఉందని చెబుతారు. ఇక భాగవతంలో అయితే ఈయన ప్రసక్తి విస్తృతంగా కనిపిస్తుంది. ఒకప్పుడు బలి అనే రాక్షస రాజు ఉండేవాడట. ఆయన ఎవరో కాదు సాక్షాత్తు ఆ ప్రహ్లాదుని మనవడే! బలి మంచివాడే, తన ప్రజలను కన్నబిడ్డలలా కొలుచుకునేవాడే. కానీ రాక్షసుడు కావడం చేత దేవతలంటే సరిపడేది కాదు. రాక్షస గురువు శుక్రాచార్యుని సహాయంతో బలి ఏకంగా ఆ స్వర్గం మీదకే దండెత్తాడు.


స్వర్గం మీదకు దండెత్తిన బలిని నిలువరించడం ఎవరి తరమూ కాలేదు. దేవతలంతా చెల్లాచెదురైపోయారు. తమను రక్షించమంటూ వెళ్లి ఆ విష్ణుమూర్తినే శరణువేడారు. అంతట విష్ణుమూర్తి తాను ఆదితి అనే రుషిపత్ని గర్భాన జన్మిస్తానని వరమిచ్చాడు. అలా భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు అదితి గర్భాన చిన్నారి విష్ణుమూర్తి జన్మించి బలిని అణచివేసే రోజు కోసం ఎదురుచూడసాగాడు.


మహాబలి ఒకసారి అశ్వమేథయాగాన్ని తలపెట్టాడని తెలిసింది. అతన్ని అణగదొక్కేందుకు ఇదే సరైన అదనుగా భావించిన విష్ణుమూర్తి ఓ చిన్నారి బ్రాహ్మణుడి (వామనుడు) రూపంలో యాగశాల వద్దకు చేరుకున్నాడు. అప్పటికి యాగంలో భాగంగా దానధర్మాలు సాగుతున్నాయి. అందరితో పాటుగా వామనుడు కూడా రాజు చెంతకి చేరాడు. అతనికి ‘ఏం కావాలో కోరుకోమంటూ’ బలి అడిగాడు. ‘నేను ఒంటికాయ శొంఠికొమ్ముని నాకు నగలూ నట్రా అవసరం లేదు. ఓ మూడు అడుగుల స్థలం చాలు,’ అని అడిగాడు వామనుడు.


వచ్చినవాడు సామాన్యుడు కాడని రాక్షసగురువు శుక్రాచార్యడు గ్రహించాడు. కానీ ‘ఆడిన మాట తప్పేది లేదంటూ’ బలి తన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సిద్ధపడిపోయాడు. ఎలాగైనా ఈ దానాన్ని ఆపాలనుకున్న శుక్రాచార్యుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శాస్త్రోక్తంగా దానం చేసేటప్పుడు జలాన్ని విడుస్తూ దానిమిస్తారు. దీన్నే మనం ధారాదత్తం అంటాము. ఆ ధారాదత్తాన్ని అడ్డుకునేందుకు శుక్రాచార్యుడు కీటకంగా మారి కమండలంలోని నీటిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ వచ్చినవాడు సామాన్యుడు కాడు కదా! ఒక పుల్ల తీసుకుని కమండంలోకి చొప్పించాడు. దాంతో శుక్రాచార్యుని కన్ను కాస్తా పోయి ‘ఏకాక్షి’ గా మారాడు.


ఇంతకీ ఆ వామనుడు అడిగిన మూడు అడుగుల కథ గురించి అందరికీ తెలిసిందే! తొలి అడుగు కింద భూమినీ, రెండో అడుగు కింద ఆకాశాన్నీ, మూడో అడుగు కింద బలి తలనీ కోరుకున్నాడు. బలి రాక్షసుడే కావచ్చు. కానీ తన ప్రజలని కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు. అందుకే ఓసారి తిరిగివచ్చి తను పాలించిన ప్రాంతాన్ని చూసుకునే వరం ఈయమని వామనుడికి అడిగాడు. ఆ వరం ప్రకారమే ఏటా బలి పాలించినట్లుగా పేర్కొనే కేరళ రాజ్యానికి ఆయన వస్తాడని నమ్ముతారు. తన ప్రజలు సుఖసంతోషంగా ఉండటాన్ని చూసి, తృప్తిగా తిరిగి స్వర్గానికి మరలిపోతాడట. ఆ సందర్భాన్నే ఓనం పండుగగా జరుపుకొంటారు.


మూడు అడుగులతో ఈ లోకాన్ని జయించాడు కాబట్టి వామనుడికి త్రివిక్రముడు అని పేరు. ఆ త్రివిక్రముని పేరు మీద చాలా ఆలయాలు కూడా ఉన్నాయి. కంచిలో ఉన్న ‘ఉళగలంద పెరుమాళ్‌’ ఆలయం, ఖజరుహోలో ఉన్న ‘వామన’ ఆలయం వీటిలో ప్రముఖమైనవి. ఇవే కాకుండా ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, కేరళ తదితర చోట్ల కూడా వామనుడి ఆలయాలు కనిపిస్తాయి.


*_꧁ॐ ఓం వామనాయ నమః ॐ꧂_*


*_𝕝𝕝ॐ𝕝𝕝 శ్రీమన్నారాయణాయ చరణౌ శరణం ప్రపద్యే 𝕝𝕝卐𝕝𝕝_*


*_𝕝𝕝 లోకాస్సమస్తాః సుఖినో భవన్తు 𝕝𝕝_*


🚩 *_శుభమస్తు_* 🚩

పంచాంగం

  ఈ రోజు పంచాంగం 23.09.2026 Wednesday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాస శుక్ల పక్ష ద్వాదశి తిథి సౌమ్య వాసర శ్రవణం నక్షత్రం. సుకర్మ యోగః బవ తదుపరి బాలవ కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

 

యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 


శ్రాద్ధ తిథి : ద్వాదశి.


 

నమస్కారః , శుభోదయం

రాబోయే కాలం

 👦🏻*రాబోయే కాలం బ్రహ్మచర్య కాలం*👱‍♀️


ఒక ఇటీవలి అంతర్జాతీయ సర్వే ప్రకారం, రాబోయే ఆరు సంవత్సరాలలో ప్రపంచంలోని దాదాపు 45% మంది అమ్మాయిలు అవివాహితులుగానే ఉండిపోతారు. ఈ నివేదిక 1 ఫిబ్రవరి, 2025న లోక్‌మత్ వార్తాపత్రికలో ప్రచురితమైంది, మరియు ఇది మోర్గాన్ స్టాన్లీ సంస్థ చేసిన వివరణాత్మక అధ్యయనంపై ఆధారపడింది.


_సర్వేలో కనుగొన్న ప్రధాన కారణాలు:_

1. నేటి అమ్మాయిలు ఉన్నత విద్యను పొందుతూ తమ కెరీర్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు.  

2. వారు ఆర్థికంగా స్వతంత్రులు మరియు ఎవరిపైనా ఆధారపడాలని కోరుకోవడం లేదు.  

3. వారు స్వేచ్ఛను ప్రేమిస్తారు మరియు తమ జీవిత నిర్ణయాలను తామే తీసుకోవాలనుకుంటున్నారు.  

4. వారు వివాహం, మాతృత్వం మరియు కుటుంబ బాధ్యతలను తమ పురోగతికి అడ్డంకులుగా చూడటం ప్రారంభించారు.  

5. ఈ ధోరణి కొనసాగితే, సాంప్రదాయ కుటుంబ వ్యవస్థ మరియు సామాజిక నిర్మాణం కూలిపోవచ్చు.  

6. జనాభా తగ్గుదల, అవివాహిత పురుషుల సంఖ్య పెరగడం, మరియు వృద్ధాప్యంలో ఒంటరితనం సమస్యలు తలెత్తవచ్చు.  

7. ప్రశ్న కూడా తలెత్తుతుంది: జీవితం చివరిలో తోడుగా ఉండటానికి ఎవరూ లేకపోతే, పురోగతి, హోదా, డబ్బు వల్ల ఏమి ప్రయోజనం?


_చాలా మంది తల్లిదండ్రులు తమ కూతుళ్లకు సంబంధాలు చూస్తున్నారు, కానీ అమ్మాయిలకు మాత్రం వివాహంపై ఆసక్తి లేదు. ఫలితంగా, ప్రతి ప్రతిపాదన తిరస్కరించబడుతోంది._


_సమాజంలోని ఒక పెద్ద వర్గం ఇప్పటికీ ఈ మార్పు యొక్క తీవ్రత గురించి తెలియకుండా ఉంది, కాబట్టి మనం సమయానికి అప్రమత్తం కావడం అవసరం._


_అమ్మాయిల వివాహానికి తగిన వయస్సు 23 నుండి 26 సంవత్సరాల మధ్య ఉండాలి, లేదా సాధ్యమైతే అంతకంటే ముందుగానే. దీని కోసం, సామూహిక స్థాయిలో అవగాహన మరియు చొరవ అవసరం._


_ఈ అంశం ఎవరికీ వ్యతిరేకంగా లేవనెత్తలేదు, కానీ భవిష్యత్తు స్థిరత్వం మరియు సమతుల్యత పట్ల ఆందోళనతో లేవనెత్తబడింది. సమాజం, కుటుంబం మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను కాపాడుకోవడమే నిజమైన పురోగతి!

: _మనమందరం దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాలి_


_భవిష్యత్తు యొక్క మండుతున్న సమస్య_


👉🏿 పిల్లలు 20 ఏళ్లకు పెళ్లి చేసుకునేటప్పుడు, ఒక శతాబ్దంలో 5 తరాలు ఉండేవి.  


👉🏿 పిల్లలు 25 ఏళ్లకు పెళ్లి చేసుకున్నప్పుడు, ఒక శతాబ్దంలో 4 తరాలు ఉండేవి.  


👉🏿 ఇప్పుడు పిల్లలు 30 ఏళ్లకు పెళ్లి చేసుకుంటున్నప్పుడు, ఒక శతాబ్దంలో 3 తరాలు ఉన్నాయి.  


👉🏿 ఆలోచించదగిన విషయం: మన సమాజం తదుపరి శతాబ్దం వరకు మనుగడ సాగిస్తుందా?  

ఈ రోజు ఒక వింత చీకటి వ్యాపిస్తున్నట్లు కనిపిస్తోంది.


🏚️ వీధులు మరియు పరిసరాలు నిర్మానుష్యంగా ఉన్నాయి, సమీపంలోని ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి.  

ఈ రోజు, ఇళ్లలో పిల్లల శబ్దం తక్కువ, భార్యాభర్తల గొంతులు ఎక్కువగా వినిపిస్తున్నాయి.


★ అమ్మాయిలు 30–35 ఏళ్ల వరకు అవివాహితులుగా ఉంటున్నారు.  

★ అబ్బాయిలు 35 తర్వాత కూడా అవివాహితులుగా ఉంటున్నారు.  

★ ఆలస్య వివాహాలు... ఆపై విడాకులు (విడాకులు)


విరిగిన కుటుంబాలు...  

అసంతృప్త తల్లిదండ్రులు.  

తల్లిదండ్రులు ఒంటరిగా...  

మొత్తం తరం శూన్యతను అనుభవిస్తోంది.


🤷🏻‍♀️ దీనిని మనం "విద్యావంతమైన సమాజం" అని పిలవాలా లేక "స్వీయ-వినాశక సమాజం" అని పిలవాలా?


💁🏻‍♂️ ఇది జనాభాను తగ్గించడానికి ఒక నిశ్శబ్ద కుట్రలా కనిపిస్తోంది.


★ 50 జంటలలో ఒక్కొక్కరికి ఒక్క పిల్లవాడు మాత్రమే ఉంటే, తరువాతి తరంలో పిల్లల సంఖ్య నామమాత్రంగా ఉంటుంది.


👉 ఇది కొనసాగితే, మూడవ తరం దాదాపు కనుమరుగైపోతుంది.


👉 పరిసరాలు మరియు వీధులు ఖాళీగా ఉన్నాయి.  

అందరూ రోడ్లపైనే ఉన్నారు.  

జీవితంలో సగం రోడ్లపైనే గడుస్తోంది.


★ మొత్తం గ్రామాలు కనుమరుగవుతున్నాయి.


★ నగరాల్లో ఎత్తైన భవనాలు ఉన్నాయి, కానీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ముగిసింది.


👉 కొత్త కోడళ్లు “ఒక్క పిల్లవాడు మాత్రమే” కావాలనుకుంటున్నారు.  

🤷🏻‍♀️ ఇదేనా సమాజం?  

❓ ఇదేనా మన పూర్వీకుల వారసత్వం?


👉 నిజం ఏమిటంటే...  

పిల్లలు ఇక ప్రేమకు చిహ్నం కాదు.  

బదులుగా, పిల్లలను కనడం ఒక బలవంతం లాగా అనిపిస్తోంది.


⚖️ అతిపెద్ద తప్పు—  

అమ్మాయి తండ్రిది,  

అదే తండ్రి 20–22 లో పెళ్లి చేసుకొని  

కుటుంబాన్ని ప్రారంభించాడు.


ఇప్పుడు అదే తండ్రి 30 వరకు కూతురికి పెళ్లి చేయకుండా ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు.


👉 ఫలితం????


అబ్బాయిలు మరియు అమ్మాయిలు డిప్రెషన్‌లోకి వెళ్తున్నారు.


👉 ఈ రోజు, పిల్లలకు సరైన సమయంలో పెళ్లి కానీ, సరైన సమయంలో ఉద్యోగం కానీ రావడం లేదు.


👉 సమాజం క్రమంగా క్షీణిస్తోంది.


👉 అందుకే పిల్లలు సమాజంతో కలిసి ఉండటం కంటే ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు.  

అంటే, అణు కుటుంబాలు—  

పిల్లలను కూడా కోరుకోవడం లేదు.


★ ఆలస్యంగా పెళ్లి  

★ ఆలస్యంగా పిల్లలు, ఆపై  

ఒక పిల్లవాడి తర్వాత వైద్య మరియు పెంపకం సమస్యల గురించి సాకులు  

💁🏻‍♀️ ఇది సాధారణమైపోయింది.


వయస్సు కారణంగా వేలాది మంది యువతీ యువకులు అవివాహితులుగా తిరుగుతున్నారు.  

సమాజంలోని విజ్ఞులు మౌనంగా ఉన్నారు.


★ వివాహం, కుటుంబం, పిల్లలు—  

అన్నీ భారంగా చూడబడుతున్నాయి.


🎈 వివాహం ప్రాపంచిక బంధం కాదు,  

ఇది ఇల్లు, కుటుంబం మరియు సమాజం యొక్క స్తంభం.


🎈 ఇది జాతి, నాగరికత మరియు సంస్కృతిని ముందుకు తీసుకెళ్లే మార్గం.


💥 ఇప్పుడు మనమందరం అర్థం చేసుకోవాల్సిన సమయం.


🫵 పిల్లలకు “చాలా ఎక్కువ” స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా,  

మనం వారి వివేచనను తీసేసాము.


★ వివాహం ఆలస్యం అవుతూ వచ్చింది, మరియు అది జరిగే సమయానికి అప్పటికే ఆలస్యం అయిపోయింది.


మళ్ళీ, అదే ఒంటరితనం.


🫵 వివాహానికి సరైన వయస్సు:  

🔹 అబ్బాయిలకు: 25 లోపు  

🔸 అమ్మాయిలకు: 20 లోపు  


🚩 లేకపోతే చరిత్ర రాస్తుంది…  

“ఆ సమాజం నిశ్శబ్దంగా తనను తాను నాశనం చేసుకుంది.”  

ఆలోచించి తెలివిగా వ్యవహరించండి.


మీ పిల్లలకు సమయానికి పెళ్లి చేయండి. 🙏


ఎందుకంటే... కుటుంబం సంరక్షించబడకపోతే,  

సమాజం కూడా కూలిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు.


అందుకే డేవిడ్ సెల్బోర్న్ మరియు బిల్ వార్నర్ వంటి రచయితలు ఇస్లాం యొక్క బలమైన కుటుంబ వ్యవస్థ కారణంగా, ఆలస్యంగా అయినా సరే, చాలా దేశాలలో…


భారతదేశంలో కూడా, కుటుంబ సంప్రదాయం యొక్క క్షీణత ప్రారంభమైంది.  

ఐదు రక్త సంబంధాలు అంతరించిపోయే అంచున ఉన్నాయి:  

పెదనాన్న, చిన్నాన్న, అత్త, మామ, పిన్ని—  

అలాంటి బంధాలు భవిష్యత్తులో కనిపించకపోవచ్చు లేదా వినిపించకపోవచ్చు.


దీనిని ఇలా అర్థం చేసుకోవచ్చు:


కొడుకు కూతురు  

2 1 (పిన్ని X)  

1 2 (పెదనాన్న/చిన్నాన్న X)  

1 1 (పెదనాన్న/చిన్నాన్న, పిన్ని X)  

1 0 X  

0 1 X  


ఫలితం  

0 0  


★  

ఒకే పిల్లవాడు ఉన్న కుటుంబాల నిర్ణయం మూడవ తరాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది—  

మీరు తాత/నానమ్మ/అమ్మమ్మ అయ్యే తరం.


అసలు కంటే వడ్డీని ఎక్కువగా ప్రేమించే తాత—  

అసలును కూడా కోల్పోతాడు.  

దానికి అతనే బాధ్యుడు అవుతాడు.


అందువల్ల, జంటలు ఒకే పిల్లవాడు అనే నిర్ణయం గురించి తీవ్రంగా ఆలోచించాలి.


ఈ తగ్గుతున్న జనాభా గణాంకాలు మాట్లాడుతున్నాయి.  

ఈ విశ్లేషణ ప్రభుత్వ డేటాను అధ్యయనం చేయడం ద్వారా వచ్చింది.


మీ మనవడు లేదా మునిమనవడు  

ఈ ప్రపంచంలో ఒంటరిగా నిలబడతాడు.  

అతనికి రక్త సంబంధాలు అవసరమైతే,  

ఈ మొత్తం విశ్వంలో అతనికి చెందినవారు ఎవరూ ఉండరు.


ఇది లోతైన ఆందోళన కలిగించే విషయం.


ఇది మన పిల్లలను ఒంటరి జీవితాలను జీవించమని బలవంతం చేయడమే కాకుండా  

మన కుటుంబ నాగరికతను కూడా నాశనం చేస్తుంది.


మనం ఐక్యత గురించి మాట్లాడతాము—  

కానీ నాగరికతే కనుమరుగైపోతుంది.  

మరియు ఇవన్నింటికీ ప్రస్తుత తరం బాధ్యత వహిస్తుంది.


★  

మీరు ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తే,  

అప్పుడు ఈ సమస్య గురించి ఆలోచించండి.


ఇంట్లో, భార్యాభర్తల మధ్య,  

బంధువుల మధ్య, స్నేహితుల మధ్య,  

మరియు వివిధ సమావేశాలు మరియు కార్యక్రమాలలో దీని గురించి చర్చించండి.


మీ నాగరికత, విలువలు మరియు భవిష్యత్ తరాలను కాపాడండి.

------------------------

23సెప్టెంబర్26🪷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

   🌷 *సౌమ్యవారం*🌷    

  *🪷23సెప్టెంబర్26🪷*  

   *దృగ్గణిత పంచాంగం*       

                 

         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం*  

*దక్షిణాయనం - వర్ష ఋతువు*

*భాద్రపద మాసం - శుక్ల పక్షం* 


*తిథి       : ద్వాదశి* రా 10.50 వరకు ఉపరి *త్రయోదశి*

*వారం    : బుధవారం* ( సౌమ్యవాసరే )

*నక్షత్రం   : శ్రవణం* ఉ 09.08 వరకు ఉపరి *ధనిష్ఠ*

*యోగం  : సుకర్మ* సా 04.27 వరకు ఉపరి *ధృతి*

*కరణం   : బవ* ఉ 10.21 *బాలువ* రా 10.50 ఉపరి *కౌలువ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.00 - 10.00 సా 04.00 - 05.00*

అమృత కాలం  : *ప 11.34 - 01.15*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*

*వర్జ్యం       : మ 01.23 - 03.05*

*దుర్ముహూర్తం :ప 11.35- 12.24*

*రాహు కాలం   :మ12.00- 01.31*

గుళికకాళం     : *మ 10.29 - 12.00*

యమగండం    :*ఉ 07.27 - 08.58*

సూర్యరాశి : *కన్య                              

చంద్రరాశి : *మకరం*  

సూర్యోదయం :*ఉ 06.05*   

సూర్యాస్తమయం :*సా 06.12*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం   :  *ఉ  05.56 - 08.22*

సంగవ కాలం     :*08.22 - 10.47*

మధ్యాహ్న కాలం    : *10.47 - 01.12*

అపరాహ్న కాలం : *మ 01.12- 03.38*

*ఆబ్ధికం తిధి :భాద్రపద శుద్ధ ద్వాదశి*

సాయంకాలం    : *సా 03.38- 06.03*

ప్రదోష కాలం      : *సా 06.03- 08.26*

రాత్రి కాలం        : *రా 08.26 - 11.36*

నిశీధి కాలం       : *రా 11.36 - 12.24*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.21 - 05.09*

¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


🌷 *ఓం సరస్వత్యై  నమః* 🌷


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు...                   లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🪷🪷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🪷🪷🍃🌷

🌹🌷🪷🪷🪷🪷🌷🌹

22, సెప్టెంబర్ 2026, మంగళవారం

మూడు సార్లు హెచ్చరిక

  *మనిషికి దేవుడు మూడు సార్లు హెచ్చరిక గంటలు మోగిస్తాడు"*


ఒక వేదిక మీద రజినీ చాలా భావోద్వేగంగా ఈ విషయం చెప్పారు.


*1) 50 ఏళ్ళలో మొదటి గంట* 🔔

"50 ఏళ్లు రాగానే మొదటి గంట మోగుతుంది. అంతవరకు భార్య, పిల్లలు, సంపాదన, కుటుంబం అంటూ బిజీగా ఉంటాం. కానీ ఈ వయస్సు రాగానే ఒక్కసారి ఆగి, నీ ఆరోగ్యాన్ని చెక్ చేసుకో... BP, షుగర్, కొలెస్ట్రాల్ ఎలా ఉన్నాయో చూసుకో అని దేవుడు హెచ్చరిస్తాడు."


*అర్థం:* డబ్బు వెంట పరిగెత్తడం ఆపి, శరీరాన్ని పట్టించుకోమని మొదటి వార్నింగ్.


*2) 60 ఏళ్ళలో రెండో గంట* 🔔

"60 ఏళ్లకు రెండో గంట మోగుతుంది. ఇప్పటివరకు చేయాల్సిన పనులు, బాధ్యతలు అయిపోయాయి. ఇప్పుడు చూడాలనుకున్న ప్రదేశాలు తిరగండి, కలవాలనుకున్న బంధువులను కలవండి, మీ కోరికలు తీర్చుకోండి అని దేవుడు టైమ్ ఇస్తాడు."


*అర్థం:* బాధ్యతలు తీరాయి, ఇక నీకు నచ్చినట్టు బతుకు, సంతోషంగా ఉండు అని రెండో వార్నింగ్.


*3)70 ఏళ్ళలో మూడో గంట* 🔔

"70 ఏళ్లు దాటితే మూడో గంట మోగినట్లే. మీరు లిస్ట్ లో చేరిపోయినట్లే, ఎప్పుడైనా పిలుపు రావచ్చు అని అర్థం."


*అర్థం:* ఇక ప్రతి రోజు బోనస్ లాంటిదే, ప్రశాంతంగా, ఎవరితో గొడవలు లేకుండా, భగవంతుని నామం తలుచుకుంటూ ఉండాలని చివరి హెచ్చరిక.


చివరిలో ఆయన అన్న మాటే హైలెట్ :

*"మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఆస్తులు, అంతస్తులు మిగిలిపోవు... మిగిలేది మనం చేసిన మంచి, ఇతరులకు ఇచ్చిన సంతోషమే అసలైన సంతోషం."*


*ఇది 100% జీవిత సత్యం.*

పంచభక్ష్య పరమాన్నాలు

  పంచభక్ష్య పరమాన్నాలు అంటారు. అవి ఎంటో మీకు తెలుసా....?


మనం తినే పదార్థాలు అయిదు రకాలు.


1. భక్ష్యం – కొరికి తినేవి (గారెలు, బూరెలు, అప్పాలు...)


2. భోజ్యం- నమిలి తినేవి (పులిహోర, దద్దోజనం, ఇత్యాదివి)


3. చోష్యం జుర్రుకునేది (పాయసం, దప్పళం, చారు...) Vbr


4. లేహ్యం – నాకబడేవి (తేనె, బెల్లం పాకం, చలివిడి లాంటివి)


5. పానీయం తాగేవి (నీళ్ళు, కషాయం, పళ్ల రపంచభక్ష్య పరమాన్నాలు అంటారు. అవి ఎంటో మీకు తెలుసా....?


మనం తినే పదార్థాలు అయిదు రకాలు.


1. భక్ష్యం – కొరికి తినేవి (గారెలు, బూరెలు, అప్పాలు...)


2. భోజ్యం- నమిలి తినేవి (పులిహోర, దద్దోజనం, ఇత్యాదివి)


3. చోష్యం జుర్రుకునేది (పాయసం, దప్పళం, చారు...) Vbr


4. లేహ్యం – నాకబడేవి (తేనె, బెల్లం పాకం, చలివిడి లాంటివి)


5. పానీయం తాగేవి (నీళ్ళు, కషాయం, పళ్ల రసం 15 వంటివిసం 15 వంటివి

హనుమాన్ బాహుక్

  *🍁భౌమవారం 22 సెప్టెంబర్ 2026🍁*


**🙏🌹*హనుమాన్ బాహుక్*🙏🌹 

           *🌷పదకొండవ రోజు🌷*


                      **శ్లోకం**


రచిబేకో బిధి జైసే పాలిబేకో హరి,హర

మీచ మారిబేకో జ్యా ఇబేకో సుధాపాన భో ॥ 

ధరిబేకో ధరని, తరని, తమ దలిబేకో,

 సోఖిచే కృసాను, పోషిబేకో హిమ - భాను భో ॥ 

ఖల - దుఖ - దోషిబేకో, జన - పరితోషిబేకో, 

మాఁగి బో మలీనతాకో మోదక సుదాన భో | 

ఆరతకీ ఆరతి నివారిబేకో తిహూఁ పుర 

తులసీకో సాహెబ హఠీలో హనుమాన భో ॥


**భావం**

నీవు సృష్టి రచనయందు బ్రహ్మవు. పాలన చేయుట

యందు విష్ణుడవు. సంహరణయందు రుద్రుడవు. బ్రతికించుట యందు అమృతసమానుడవు. ధరించుట యందు ధరిత్రివి. అనగా భూదేవతవలె భరించువాడవు. అంధకారమును నాశన మొనర్చుటలో సూర్యుడవు. వ్రేల్చుటలో అగ్నివి. పోషణ మొనర్చుటలో చంద్రసూర్య స్వరూపుడవు. దుర్మార్గులను దుఃఖపెట్టుటలోను, దూషితుల నొనర్చుటలోను, సేవకులను సంతుష్టుల నొనర్చుటలో, అట్లే యాచకత్వమను మాలిన్యమును తొలగించుటలోను వరప్రదాతవు. మోదకదాతవు.


తులసీదాసుయొక్క స్వామియగు హనుమంతుడు ముల్లోకము లందలి దుఃఖితుల దుఃఖములను తొలగించుటకు ప్రతిజ్ఞచేసి యున్నాడు. రామరహస్యోపనిషత్తునందలి శ్రీ హనుమంతుని ప్రతిజ్ఞను భావించి ఆతనిని వేడుకొని జనులు సర్వదుఃఖములనుండి బయట పడవలెననుట.


**ప్రతిపద వివరణ**

**1. రచిబేకో బిధి జైసే పాలిబేకో హరి, హర మీచ మారిబేకో జ్యా ఇబేకో సుధాపాన భో ॥**


* **అర్థం:** సృష్టిని సృష్టించడానికి బ్రహ్మదేవుడు (**బిధి**), దాన్ని రక్షించడానికి విష్ణుమూర్తి (**హరి**), అలాగే మృత్యువును సైతం లయం చేయడానికి/శాసించడానికి శివుడు (**హర**) ఎంతటి సమర్థులో... హనుమంతుడు కూడా అంతటి సమర్థుడు.


* **భావం:** భక్తుడి పాలిట హనుమంతుడు నవజీవనాన్ని ఇవ్వడానికి అమృతపానం (**సుధాపాన భో**) లాంటివాడు. అంటే, చనిపోతున్న వాడికి అమృతం పోసి బతికించినట్టు, చావు అంచుల్లో ఉన్న భక్తుడిని సైతం హనుమంతుడు రక్షించగలడు. ఆయనలోనే సృష్టి, స్థితి, లయ కారకులైన త్రిమూర్తుల శక్తులు ఇమిడి ఉన్నాయి.


**2. ధరిబేకో ధరని, తరని, తమ దలిబేకో, సోఖిచే కృసాను, పోషిబేకో హిమ - భాను భో ॥**


* **అర్థం:** భారమంతటినీ మోయడానికి భూదేవి (**ధరని**) లాంటివాడు, చీకట్లను చీల్చడానికి సూర్యుడు (**తరని**) లాంటివాడు, సమస్తాన్ని దహించి/ఎండగట్టేయడానికి అగ్ని దేవుడు (**కృసాను**) లాంటివాడు, మరియు అందరికీ అమృతాన్ని (పోషణను) పంచే చంద్రుడు (**హిమ - భాను**) లాంటివాడు హనుమంతుడు.


* **భావం:** భక్తుడి కష్టాలనే భారాలను మోయడంలో ఆయన భూమి అంత సహనశీలి. అజ్ఞానమనే చీకట్లను పోగొట్టే సూర్యుడు. భక్తుడి పాపాలను, రోగాలను కాల్చి బూడిద చేయడానికి అగ్ని లాంటివాడు. తన చల్లని చూపులతో భక్తుడి మనస్సుకు, శరీరానికి ఉపశమనాన్ని ఇవ్వడంలో చంద్రుని లాంటివాడు.


**3. ఖల - దుఖ - దోషిబేకో, జన - పరితోషిబేకో, మాఁగి బో మలీనతాకో మోదక సుదాన భో ॥**


* **అర్థం:** దుష్టులను (**ఖల**), వారి వల్ల కలిగే దుఃఖాలను, దోషాలను శిక్షించడానికి/నాశనం చేయడానికి... మరియు తన భక్తులను (**జన**) పరమానందంలో ముంచెత్తడానికి ఆయన నిరంతరం సిద్ధంగా ఉంటాడు.

* **భావం:** దారిద్ర్యం, మానసిక మలినాలు (కుళ్లు, కుతంత్రాలు, పాప బుద్ధి) అనే మురికిని తుడిచేసి, భక్తులకు లడ్డూ లాంటి తీపి ఆనందాన్ని, శుభాలను ప్రసాదించే గొప్ప దాత హనుమంతుడు.


**4. ఆరతకీ ఆరతి నివారిబేకో తిహూఁ పుర తులసీకో సాహెబ హఠీలో హనుమాన భో ॥**


* **అర్థం:** ముల్లోకాలలో (**తిహూఁ పుర**) ఎక్కడైనా సరే... ఆర్తులైన (బాధల్లో ఉన్న) వారి ఆర్తిని (కష్టాలను, కన్నీళ్లను) తుడిచేయడంలో తులసీదాస్ యొక్క ప్రభువు, పట్టుదల కలిగినవాడైన (**హఠీలో**) హనుమంతుడే ఏకైక రక్షకుడు.


* **భావం:** ఇక్కడ **"హఠీలో"** అంటే మొండివాడు లేదా పట్టుదల గలవాడు అని అర్థం. అంటే తన భక్తుడిని రక్షించాలని హనుమంతుడు ఒక్కసారి నిశ్చయించుకుంటే, ఇక ఏ శక్తీ ఆయనను ఆపలేదు. విధి రాతను సైతం మార్చి భక్తుడిని ఆదుకునే అంతటి ప్రేమాస్పదమైన 'మొండితనం' హనుమ సొంతం.


 **ముగింపు (సారాంశం):**


ఈ పద్యం ద్వారా తులసీదాస్ గారు చెప్తున్నదేంటంటే—హనుమంతుడు కేవలం ఒక దేవత మాత్రమే కాదు; ఆయనలో త్రిమూర్తుల (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల) శక్తి, పంచభూతాల (భూమి, సూర్యుడు, అగ్ని, చంద్రుడు) సామర్థ్యం ఉన్నాయి. భక్తుల కష్టాలను తీర్చడానికి ఆయన 'హఠీలా' (మొండిగా పట్టుబట్టేవాడు). అలాంటి సర్వశక్తిమంతుడైన హనుమంతుడు నా స్వామి అయి ఉండగా, నా శారీరక బాధలు, రోగాలు నన్ను ఏం చేయగలవు? ఏం చేయలేవు అని అపారమైన నమ్మకం ఈ పద్యంలో కనిపిస్తాయి.


🙏🌹*జై శ్రీరామ్ జై హనుమాన్*🙏🌹


          *🍁సేకరణ🍁*

       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*

21, సెప్టెంబర్ 2026, సోమవారం

భౌమవారం🍁* *🌹22సెప్టెంబర్26🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    *🍁 భౌమవారం🍁*          

  *🌹22సెప్టెంబర్26🌹*  

   *దృగ్గణిత పంచాంగం*    

                   

         *ఈనాటి పర్వం*    

             *సర్వేషాం*

        *పరివర్తనైకాదశీ*


         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు*

*భాద్రపద మాసం - శుక్లపక్షం* 


*తిథి      : ఏకాదశి* రా 09.43 వరకు ఉపరి *ద్వాదశి*

*వారం  :మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం   : ఉత్తరాషాఢ* ఉ 07.06 వరకు ఉపరి *శ్రవణం*

*యోగం  : అతిగండ* సా 04.29 వరకు ఉపరి *సుకర్మ*

*కరణం   : వణజి* ఉ 08.55 *భద్ర* రా 09.43 ఉపరి *బవ*

*సాధారణ శుభ సమయాలు:*

*మ12.00-01.00 సా04.00-06.00*

అమృత కాలం  : *రా 09.52 - 11.36*

అభిజిత్ కాలం  : *ప 11.36 - 12.24*

*వర్జ్యం          : ప 11.27 - 01.11*

*దుర్ముహూర్తం  : ఉ 08.22 - 09.10 రా 10.49 - 11.36*                                    *రాహు కాలం : మ 03.02-04.33*

గుళికకాళం      : *మ 12.00 - 01.31*

యమగండం    : *ఉ 08.58 - 10.29*

సూర్యరాశి : *కన్య*                       

చంద్రరాశి : *మకరం* 

సూర్యోదయం :*ఉ  06.05*  

సూర్యాస్తమయం :*సా 06.13*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం    :*ఉ  05.56 - 08.22*

సంగవ కాలం   :*08.22 - 10.47*

మధ్యాహ్న కాలం    : *10.47 - 01.13*

అపరాహ్నకాలం   : *మ 01.13-03.38*

*ఆబ్ధికం తిధి:భాద్రపద శుద్ధ ఏకాదశి*

సాయంకాలం   : *సా 03.38 - 06.04*

ప్రదోష కాలం      : *సా 06.04- 08.26*

రాత్రి కాలం        :*రా 08.26 - 11.36*

నిశీధి కాలం       :*రా 11.36 - 12.24*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.21 - 05.09*

¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు...                   లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

20, సెప్టెంబర్ 2026, ఆదివారం

భగవంతుడు

  🌷☘️🌷☘️🌷☘️🌷☘️🌷


*🌺భగవంతుడు*

      *అంటే అర్ధం*🌺


*చాలా మందికి దేవుడిని "భగవంతుడు" అని పిలుస్తారని తెలుసు*.


*🌺"భగవంతుడు" అంటే ఏమిటి?*


మంచి గుణాలు కలిగిన వారిని "గుణవంతులు" అంటాము.

బాగా ధనం కలిగిన వారిని ''ధనవంతులు" అంటాము.

మంచి శీలం ఉంటే" శీలవంతులు" అంటాము.

అలాగే అందమైన రూపం కలిగిన వారిని " రూప వంతులు" అంటాము.

మరి "భగవంతుడు" అంటే ఏవరు?

"మాహాత్మ్యస్య సమగ్రస్య ధెైర్యస్య యశస శ్శ్రియఃజ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం - భగ, ..... ఇత్యుక్త భగో౽స్యాస్తీ తి భగవాన్ " అని శాస్త్ర నిర్వచనం .


1) మాహాత్మ్యం

2) ధైర్యం

3) యశస్సు 

4) సంపద

5) జ్ఞానం

6) వైరాగ్యం

ఈ ఆరింటిని షడైశ్వైర్యాలు అంటారు.

వీటికే "భగ" అని పేరు. 

*ఈ ఆరు ఐశ్వైర్యాలను సంపూర్ణంగా కలిగి ఉండడం వల్లనే "భగవంతుడు" అని పేరు**.


*🌺1) మాహాత్మ్యం..*

*పవిత్రత వల్ల మాహాత్మ్యం సిద్ధిస్తుంది." పవిత్రానాం పవిత్రం యో మంగళానాంచ మంగళం" అని వేదశాస్త్ర పురాణేతిహాసాలు దేవుడిని కీర్తిస్తున్నాయి.దేవుడు "సంపూర్ణ పవిత్ర స్వరూపుడు" కాబట్టి సంపూర్ణ మాహాత్మ్యం కలిగి ఉంటాడు.అనుభవ పూర్వకంగా చూసుకున్నా మనం ఏ విషయంలో పవిత్రంగా ఉంటామో ఆ విషయంలో మాహాత్మ్యం సిద్ధిస్తుంది*


*.ఉదాహరణకు...తల్లిదండ్రులు తమ సంతానం విషయంలో ఎలాంటి కల్మషం లేని పవిత్రతతో ఉంటారు.కాబట్టి పిల్లల విషయంలో తల్లిదండ్రులకు తమ దీవెనలు ఫలించగలిగే మాహాత్మ్యం సిద్ధిస్తుంది..... ఇలా ఏ విషయంలో మనం పవిత్రతను కలిగి ఉన్నామో ఆ విషయంలో ' మాహాత్మ్యం' ఏర్పడడాన్ని మనం గమనించవచ్చు!ఎక్కడ మాహాత్మ్యం ఉంటుందో అక్కడ నమస్కార యోగ్యత ఏర్పడుతుంది.నమస్కారం వల్ల అవతలి వ్యక్తి మాహాత్మ్యాన్ని - ఆశీర్వాదాన్ని మనం స్వీకరించ గలుగుతాము.అందుకే పవిత్రంగా జీవించే సాధువులకూ, మహాత్ములకూ, బ్రాహ్మణులకూ, పెద్దలకు నమస్కరించే పద్ధతి సనాతన ధర్మం లో సాంప్రదాయ సిద్ధంగా వస్తూ ఉంది*.


*🌺2) ధైర్యం*...

*.ఇక ధైర్యం దేనివల్ల కలుగుతుంది.భయం లేకపోవడం వల్ల.భయం ఎలా పుడుతుంది?ప్రధానంగా 50% భయాలు అజ్ఞానం వల్లనే కలుగుతాయి. ఎక్కడ తెలియనితనం ఉంటుందో అక్కడ భయం ఉంటుంది.అది తెలిసిన తర్వాత ఆ భయం పోతుంది.ఇక మిగతా భయాలు మనకున్న ఆరోగ్యం - ఆయుస్సు - సంపదలు - పరివారం - అధికారం - కీర్తి - సౌఖ్యం ...మొ॥ ఐశ్వర్యాలు ఎక్కడ నశించి పోతాయో అనే కారణం నుండి పుడుతాయి*.


*🌺ఇక దేవుడు వేదస్వరూపుడు.అంటే జ్ఞానస్వరూపుడు.ఇక అతనికి అజుడని పేరు.అంటే పుట్టక లేని వాడు .అలాగే అచ్యుతుడు.. అంటే నాశనం లేనివాడు.శ్రీధరుడు అంటే సమస్త ఐశ్వర్యాలను ధరించినవాడు.కాబట్టి సంపూర్ణ ధైర్యం అనెడి ఐశ్వర్యం అతనిని సేవిస్తూ ఉంటుంది*.


*🌺3) యశస్సు*...

*యశస్సు అంటే స్వచ్చమైన కీర్తి ."క్రియాశీలత వల్ల కీర్తి... నిష్క్రియత్వం వల్ల అపకీర్తి " ఏర్పడుతుంది.నీరు నిరంతరం ప్రవహిస్తూ క్రియాశీలంగా ఉండడం వల్ల " నది "లా మారి అందరిచే పూజించబడుతూ "కీర్తి"ని పొందుతుంది.ఆగిపోయిన నీరు " నిష్క్రియత్వం" వల్ల మురికి గుంటలా మారి అందరిచే అసహ్యించబడుతూ.. అపకీర్తిని పొందుతుంది.మనష్యుల పరిస్థితి అయినా అంతే!ఏ విషయంలో మనిషి క్రియాశీలతను కలిగి ఉంటే ఆ విషయంలో కీర్తి లభిస్తుంది.ఉదాహరణకు.. చదువు విషయంలో క్రియాశీలతను కలిగి ఉన్న వ్యక్తికి విద్య విషయంలో కీర్తి లభిస్తుంది.ధన సంపాదన విషయంలో క్రియాశీలతను కలిగి ఉన్న వ్యక్తికి ధనవంతుడనే కీర్తి లభిస్తుంది..... ఇలా ఏ విషయంలో క్రియాశీలత ఉంటుందో ఆ విషయంలో సహజంగానే కీర్తి లభిస్తుంది.ఇక సంపూర్ణ క్రియాశీలుడైన ఈశ్వరున్ని యశస్సు అనెడి ఐశ్వర్యం నిరంతరం సేవిస్తూ ఉంటుంది*.


*🌺4) సంపద..*

*సంపద అంటే సమృద్ధి, సాధించబడినది అనే రెండు అర్థాలు.తృప్తి పరిచేది - అవసరాలను తీర్చేది సంపద.సంపద రెండు రకాలుగా సృష్టించబడుతుంది*.


*🌺i)ఇతరుల అవసరాలను నెరవేర్చగలిగే శక్తి పెరుగుతున్న కొద్ది సంపద సృష్టి జరుగుతూ ఉంటుంది.ఒక కూలి నుండి బిల్ గేట్స్ వరకు ఎవరినైనా గమనించండి. వారు ఇతరుల అవసరాలను ఎంతగా నెరవేరుస్తూ ఉంటారో అంతగా వారి వద్ద సంపద వృద్ధి పొందుతూ ఉంటుంది.*


*శారీరకంగా - మానసికంగా -బౌద్ధికంగా - ఆథ్యాత్మికంగా ..... ఏ రకంగానైనా ఇతరుల అవసరాలను తీర్చగలిగే శక్తే, శ్రీమంతుడు కావడానికి ప్రధాన కారణం*.


*ఇక రెండవది*

*🌺ii) క్రియాశక్తి వల్లలక్ష్మీదేవి క్రియాశక్తి స్వరూపమని పురాణాలు వర్ణిస్తున్నాయి.సంపద అనేది శ్రమకు ప్రతిఫలం . శ్రమించడం వల్ల కూడా సంపద సృష్టి జరుగుతుంది.శ్రమించే తత్వం పెరుగుతూ తనలో ఉన్న ఇచ్చాశక్తినీ... జ్ఞాన శక్తిని క్రియా రూపంలోకి మార్చడం వల్ల సంపద సృష్టించబడుతూ వుంటుంది.ఈ రెండు రకాలుగా కాకుండా ఇతరుల చే సృష్టించబడిన సంపదను కొల్లగొట్టేవారు కొందరుంటారు. వీరు ఇహ-పర లోకాలలో పతనం చెందుతారని శాస్త్రం చెబుతుంది.ఎందుకంటే....సంపద అంటే డబ్బు - బంగారం కాదు. అవి సంపదకు బదులుగా వినియోగించే వినిమయాలు మాత్రమే! ఒక దేశంలోని డబ్బుకు మరో దేశంలో విలువ ఉండదు. అలాగే భూలోకంలో ఉండే వినిమయాలు మరో లోకంలో చెల్లబడి కావు.కానీ, ఇతరుల అవసరాలను తీర్చగలిగే నెైపుణ్యశక్తి.... క్రియాశక్తి ఆ జీవుడు ఏ లోకంలో ఉన్నా సంస్కార రూపంలో వెన్నంటి ఉండి అతన్ని ఐశ్వర్యవంతుడు గా నిలుపుతుంది*


*ఇక ఈ సమస్త సృష్టి అవసరాలు తీర్చడం వల్లా.., సంపూర్ణ క్రియాశీలత్వం వల్ల ఈశ్వరున్ని సంపద అనెడి ఐశ్వర్యం సేవిస్తూ ఉంటుంది*.


*🌺5) జ్ఞానం..*

*ఈశ్వరుని యొక్క సర్వవ్యాపకత్వం - సర్వశక్తిమత్వమే సర్వజ్ఞత్వానికి కారణమౌతుంది.తత్వశాస్త్ర దృష్ట్యా జ్ఞానం అనేది పొందబడేది ... కోల్పోయేది కాదు. అది ఎప్పుడూ ఉండేది. అది ఆత్మ స్వరూపంగా ఉంటుంది.దాన్ని మనకున్న ఏకాగ్రతను బట్టి కొంచెం కొంచెంగా అనుభవంలోకి తెచ్చుకుంటాము.ఒక వ్యక్తిలో ఉన్న ఏకాగ్రత శక్తిపైన అతని జ్ఞానం ఆధారపడి ఉంటుంది.ఏ విషయంలో ఏకాగ్రత చూపుతాడో ఆ విషయ సంబంధ జ్ఞానం లభిస్తుంది.ఏకాగ్రత సంపూర్ణ స్థాయికి చేరినపుడు సంపూర్ణ జ్ఞానం అనుభవంలోకి వస్తుంది. అలాంటి వ్యక్తులను ఆత్మజ్ఞానులు అంటాము. వారి వ్యక్తిగత చైతన్యం విశ్వ స్థాయికి ఎదగడం వల్ల వారికి కూడా సర్వజ్ఞత్వం సిద్ధిస్తుంది.ఈ విశ్వంలోని సమస్త నియమాలను సృష్టించి ఒక నియతిని ఏర్పాటు చేయడం వల్ల ఈశ్వరునికి నియంత అనే మరో పేరుంది.ఆ నియమాలపై ఏకాగ్రత నిలిపి పరిశోధించడాన్నే మనం శాస్త్ర విజ్ఞానం అంటున్నాము.ఇలా సర్వవ్యాపకుడు - విశ్వరూపుడు - నియంత అయిన ఆ పరమాత్మను జ్ఞానం అనెడి ఐశ్వర్యం సదా సేవిస్తూనే ఉంటుంది*.


*🌺6) వైరాగ్యం..*

*సంతృప్తితో కూడిన త్యాగమే వైరాగ్యం.ఈశ్వరునికి నిరంజనుడని పేరు.అంటే దేనికీ అంటకుండా కేవల సాక్షి మాత్రంగా ఉండే వైరాగ్య సంపన్నుడని అర్థం.వైరాగ్యం అనేది సమృద్ధిని దాటిన స్థితి.హిమాలయాల్లో "పరుసవేది " అనే మూలిక ఉంటుందట. ఆ వేరుతో ఏ లోహాన్ని ముట్టినా ఆ లోహం బంగారంగా మారుతుందట. అలాంటి పరుసవేది ని కలిగి ఉన్న వ్యక్తి గుట్టలు గుట్టలుగా బంగారాన్ని ప్రోగుచేస్తాడా?ఆ వేరును మాత్రం దగ్గరుంచుకుని అవసరమున్నంత వరకే వాడుకుంటాడు. అతనికి ధనాన్ని సంపాదించాలనే కోరిక - ఆశ వంటివి ఏమీ ఉండవు.అంటే ధన విషయంలో వైరాగ్యం లభించినదన్న మాట!అసంతృప్తితో - అశక్తతతో వచ్చేది వైరాగ్యం కాదు. అది లేమితనం - బలహీనత.ఒక నపుంసకుడు సన్యాసిగా మారితే అది వైరాగ్యం కాదు.ఒక నిజమైన పురుషుడు సన్యాసిగా మారితేనే అది నిజమైన వైరాగ్యం.మన దేశంలో చాలా మంది మిథ్యా వైరాగ్య సంపన్నులు ఉంటారు. నాకు ధనం మీద ఆశ లేదు అంటుంటారు. మళ్లి కష్టపడకుండా - తేరగా ధనం వస్తే సంతోషిస్తారు. ఒక కోటి రూపాయలు కష్టపడి సంపాదించి దానిపై బంధం లేకుండా సంతృప్తితో దానం చేయగలిగితే అది వైరాగ్యం అవుతుంది.వైరాగ్యం అనేది తేలికగా వచ్చే ఐశ్వర్యం కాదు. అది ఇంతకు ముందు చెప్పినట్లు సమృద్ధిని దాటిపోయిన స్థితి.ఎవరో కొందరు వివేకానందుడు లాంటి మహాత్ములు మాత్రమే నిజమైన వైరాగ్య సంపన్నులుగా ఉంటారు*.


*ఇక దేవునిది అన్ని విషయాల్లో సమృద్ధిని దాటిన స్థితి.కాబట్టి వైరాగ్యం అనెడి ఐశ్వర్యం అతడిని నిరంతరం సేవిస్తూ ఉంటుంది.ఇలా ఈ ఆరు ఐశ్వర్యాలను కలిపి 'భగ' అని పేరు. వీటిని కలిగి ఉండడం వల్ల భగవంతుడని పేరు.మనలో కూడా ఈ ఆరు ఐశ్వర్యాలు అంశ మాత్రంగా ఉంటాయి. మన ప్రవర్తనను బట్టి ఆయా ఐశ్వర్యాలు వృద్ధి పొందుతాయి*.


💅💅💅💅💅💅💅💅💅💅💅


*కృష్ణం వందే జగద్గురుం 🙏.*

ప్రణవనాదం

  🕉️ *ప్రణవనాదం — ఓంకార విశిష్టత.* 🪷


*“ఓం”* — భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఎంతో పవిత్రమైన నాదం. మనం పూజ చేసేటప్పుడు, మంత్రాలు జపించేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు ముందుగా ఓంకారాన్ని స్మరించడం మన సంప్రదాయంలో ఉంది.


ఓం అనేది కేవలం ఒక శబ్దం కాదు. దైవాన్ని స్మరించడానికి, మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి ఉపయోగించే పవిత్ర నాదం.


ఓంకారంలో దాగిన భావం ~


*ఓంకారం “అ, ఉ, మ” అనే మూడు ధ్వనులతో ఏర్పడుతుంది.*


మనిషి సాధారణంగా మూడు స్థితులను అనుభవిస్తాడు — మెలకువ, కల, గాఢ నిద్ర. వీటిని అ, ఉ, మ ధ్వనులతో మాండూక్యోపనిషత్తు అనుసంధానిస్తుంది.


ఈ మూడు స్థితులకు మించిన చైతన్యాన్ని తురీయ స్థితిగా ఉపనిషత్తు చెబుతుంది.


అందుకే ఓంకారం మన రోజువారీ అనుభవాలను గుర్తుచేస్తూనే, వాటికి మించిన ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకోవాలనే ఆలోచనను కలిగిస్తుంది.


 *ఓంకారాన్ని ఎందుకు స్మరించాలి?*


పూజలో ఓం అని పలికినప్పుడు మన మనస్సు దైవంపై నిలుస్తుంది. మంత్రజపానికి ముందు ఓంకారాన్ని స్మరించడం ద్వారా మనసును భక్తి భావంలోకి తీసుకురావచ్చు.


ధ్యానంలో కూడా ఓంకారాన్ని నెమ్మదిగా ఉచ్చరిస్తూ, ఆ నాదాన్ని శ్రద్ధగా వినవచ్చు. నాదం ముగిసిన తరువాత వచ్చే నిశ్శబ్దాన్ని కొద్దిసేపు గమనిస్తే మనస్సు ప్రశాంతంగా ఉండేందుకు అది సహాయపడుతుంది.


 *ఓంకారం మనకు చెప్పే విషయం. ~*


మన జీవితం ఎప్పుడూ ఎన్నో ఆలోచనలు, ఆందోళనలు, పనులతో నిండి ఉంటుంది. అలాంటి సమయంలో కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని “ *ఓం* ” అని స్మరించడం మన దృష్టిని లోపలికి తిప్పే ఒక సులభమైన సాధన.


శబ్దం నుంచి నిశ్శబ్దానికి,

చంచలత నుంచి ప్రశాంతతకు,

బయటి ప్రపంచం నుంచి మన అంతరంగం వైపు

మనసును తీసుకెళ్లే ఆధ్యాత్మిక భావమే ఓంకార స్మరణ.


*శాస్త్రాలు చెప్పిన ఓంకార మహిమ. ~*


మాండూక్యోపనిషత్తు ఓంకారంలోని అ, ఉ, మ ధ్వనులకు లోతైన అర్థాన్ని వివరిస్తుంది.


 ప్రశ్నోపనిషత్తు ప్రణవోపాసనను ప్రస్తావిస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు *“ఓం”* ను పవిత్రమైన ఏకాక్షర బ్రహ్మంగా పేర్కొంటాడు.


అందుకే మన పూజలు, మంత్రజపాలు, ధ్యానసాధనల్లో ఓంకారానికి ప్రత్యేకమైన స్థానం వచ్చింది.


🙏 *ఓంకారం — ప్రతి భక్తునికీ ఒక స్మరణ. ~*


ఓం అని పలికేటప్పుడు మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి:


దైవాన్ని స్మరించాలి…

మనస్సును ప్రశాంతంగా ఉంచాలి…

మంచి ఆలోచనలతో జీవించాలి…

మనలోని ఆధ్యాత్మికతను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.


ఇదే ఓంకార స్మరణలోని అందమైన భావం.


*ఓం — ఒక పవిత్ర నాదం.*

*ఓం — ఒక దైవస్మరణ.*

*ఓం — ఒక ధ్యాన మార్గం*.

*ఓం — మనసును అంతర్ముఖం చేసే ఒక సాధన.*


🕉️ *ఓం తత్ సత్* 🕉️


🙏 *సర్వేజనా సుఖినో భవంతు* 🙏

పంచాంగం

  ఈ రోజు పంచాంగం 20.09.2026 Sunday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాస శుక్ల పక్ష నవమి తిథి భాను వాసర పూర్వాషాఢ నక్షత్రం సౌభాగ్య యోగః కౌలవ కరణం.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

 


శ్రాద్ధ తిథి : నవమి


 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

 

 --------------------------భగవద్గీత. ------------------------

                        సప్తమోధ్యాయః
                    జ్ఞాన విజ్ఞాన యోగము

త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్ ।
మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్ ।। 13 ।।


ప్రతిపదార్థ:


త్రిభిః — మూడింటి; గుణ-మయైః — ప్రకృతి గుణములతో కూడియున్న; భావైః — దశలు; ఏభిః — ఇవి అన్ని; సర్వం — సర్వము; ఇదం — ఈ యొక్క; జగత్ — జగత్తు; మోహితం — మోహామునకు గురై; న అభిజానాతి — తెలుసుకొనలేక; మాం — నన్ను; ఏభ్యః — ఈ; పరం — సర్వోన్నత; అవ్యయం — అనశ్వరమైన/నిత్యమైన.


తాత్పర్యము:


మాయ యొక్క త్రిగుణములచే భ్రమకు లోనై (మోహితులై), ఈ లోకంలోని జనులు, అనశ్వరమైన మరియు సనాతనమైన నా గురించి తెలుసుకోలేకున్నారు


వివరణ :

ఇంతకు క్రితం శ్లోకాలు విన్న తరువాత, అర్జునుడు ఇలా అనుకునే అవకాశం ఉంది, ‘ఓ ప్రభూ, ఇవన్నీ గనక నీ విభూతులే అయి ఉంటే, శ్రీ కృష్ణా, నీవే సర్వేశ్వరుడవని, సమస్త సృష్టికి మూలమని కోట్ల మంది మనుష్యలు నిన్ను ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు?’ అని. దీనికి జవాబుగా, శ్రీ కృష్ణుడు అంటున్నాడు, సత్త్వము, రజస్సు, తమస్సు లతో కూడిఉన్న ప్రకృతి త్రిగుణములచే జనులు మోహితులై పోతున్నారు అని అంటున్నాడు. మాయ యొక్క ఈ మూడు గుణములు వారి యొక్క బుద్ధిని కప్పివేయటం వలన, వారు క్షణభంగురమైన శారీరక సుఖాలకు ఆకర్షితులౌతారు.

‘మాయ’ అన్న పదానికి ఉన్న అర్థాలలో ఒకటి, ‘మా’ (కాదు) మరియు ‘యా’ (ఉన్నది). కాబట్టి, మాయ అంటే, ‘మనకు అనిపించినట్టుగా ఉన్నది కాదు’ అని. భగవంతుని శక్తి స్వరూపంగా మాయ అనేది ఆయన సేవలోనే నిమగ్నమై ఉంటుంది. ఇంకా భగవత్ ప్రాప్తికి అర్హత సాధించని జీవాత్మల నుండి, పరమేశ్వరుని నిజమైన స్వభావాన్ని కప్పివేసి ఉంచటమే, అది చేసే సేవ. మాయ అనేది, ఈశ్వర విముఖంగా ఉన్న జీవాత్మలకు ఎర వేసి, మోహమునకు గురి చేస్తుంది. అదే సమయంలో, మాయ, జీవాత్మలను, మూడు రకాల భౌతిక బాధలకు గురిచేస్తూ ఎన్నోరకాల కష్టాలతో దుఃఖాన్ని కలుగచేస్తుంది. ఈ విధంగా, ఈశ్వర సన్ముఖంగా అయ్యేంతవరకూ వారికి సంతోషము లేదు అన్న విజ్ఞానాన్ని జీవాత్మలకు తెలియచేసేటానికి ప్రయత్నిస్తుంది.

ONLINE DRAFTING OF CASES

 

 ONLINE DRAFTING OF LEGAL CASES 

We launched an online service to useful for all Advocates, who are dealing with civil, criminal, family cases in Courts. Even private parties can also contact for legal help.

Nowadays it is becoming difficulty to find a good skilled person to draft a case.  the seniors are engaged in their day to day court work.  To avoid this situation we are providing eminent legal persons to draft cases.  For details mentioning the following information contact by sending a comment below this post.

NB: your comment will not appear in this blog.  That message will directly go to the relevant persons,

after receiving your message they will contact you to your mobile by way of watts app message.. Why delay start now to get inquiry.

Name:

Place:

Name of the Court you want to file the present case.

Details of case.

Your Mobile No:

Any other information which you wants to furnish

తెలుగు నేర్చుకోండి

 తెలుగు నేర్చుకోండి.

 మన తెలుగు వాళ్ళు ఎన్నో దేశాలలో ఉండి నిత్యం ఈ బ్లాగును చూస్తున్నా వాళ్ళు, వాళ్ళ పిల్లలకి తెలుగు నేర్పాలని అభిలాష ఉండటం సర్వసాధారణం.

కాకపోతే విదేశాలలో తెలుగు నేర్పే వాళ్లు లేరని మీరు సందేహించవచ్చు అటువంటి వాళ్లను దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ లో తెలుగు నేర్చుకుందాం అనే కోర్సును ప్రారంభించదల్చాము.


ప్రాథమికంగా తెలుగు మీద అవగాహనసం ప్రత్యేకంగా ఆన్లైన్లో తెలుగు పాఠాలను నేర్పటం కోసం ఈ కోర్సును ఏర్పాటు చేసాము


మీ పిల్లలకు తెలుగు మాట్లాడటం రాయటము నేర్పించదలిచితే వెంటనే కింద కామెంట్ రూపంలో సంప్రదించగలరు మీరు పెట్టే కామెంట్ గోప్యంగా ఉంచబడును అది ఇక్కడ ఎవరికీ కనబడదు కేవలము ఉపాధ్యాయులు గారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది మీరు మీ కామెంట్ ల మీ పిల్లల వయస్సు తెలుగుతో వారికి ఉన్న అనుబంధం తెలియచేస్తూ మీ మొబైల్ నెంబరు పేర్కొంటే ఆ నెంబర్కు వాట్సాప్ లో సంప్రదించబడును లేక మీ ఈమెయిల్ ఐడి ఇస్తే దాని ద్వారా సంప్రదించుకోవచ్చు ఇంకా ఎందుకు ఆలస్యం ఇప్పుడే మీరు మీ పిల్లలను ఈ కోర్సులో చేర్పించడానికి ఉద్యోత్తులు కండి.