ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వనియందు డిందు; బరమేశ్వరుడెవ్వడు; మూలకారణం
బెవ్వ; డనాదిమధ్యలయు డెవ్వడు; సర్వము దానయైన వా
డెవ్వడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్!
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వనియందు డిందు; బరమేశ్వరుడెవ్వడు; మూలకారణం
బెవ్వ; డనాదిమధ్యలయు డెవ్వడు; సర్వము దానయైన వా
డెవ్వడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్!
ఈ రోజు పంచాంగం 19.10.2026 Monday
స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాస శుక్ల పక్ష అష్టమి తిథి ఇందు వాసర ఉత్తరాషాఢ నక్షత్రం ధృతి యోగః బవ తదుపరి బాలవ కరణం.
రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.
యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.
శ్రాద్ధ కర్మ తిథి : నవమి.
నమస్కారః , శుభోదయం
--------------------------భగవద్గీత. ------------------------
సప్తమోధ్యాయః
జ్ఞాన విజ్ఞాన యోగము
యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్ ।
తే ద్వంద్వమోహనిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః ।। 28 ।।
ప్రతిపదార్థ;
యేషాం — ఎవరివైతే; తు — కానీ; అంత-గతం — పూర్తిగా నశించిపోయి; పాపం — పాపములు; జనానాం — జనులకు; పుణ్య, కర్మణాం — పుణ్య కార్యములు; తే — వారు; ద్వంద్వ — ద్వంద్వముల; మోహ — మాయ; నిర్ముక్తః — విముక్తి నొంది; భజంతే — పూజింతురు; మాం — నన్ను; దృఢ-వ్రతాః — దృఢ సంకల్పముతో
తాత్పర్యము:
పుణ్య కార్యములు ఆచరించుటచే ఎవరి పాపములు అయితే పూర్తిగా నశించిపోయినవో, వారు ఈ ద్వంద్వముల మోహము నుండి విముక్తి పొందుతారు. అటువంటి వారు నన్ను దృఢ సంకల్పముతో పూజిస్తారు.
వివరణ :
2.69వ శ్లోకంలో శ్రీ కృష్ణుడు చెప్పినట్టు - అజ్ఞానులు ఏదైతే రాత్రి అనుకుంటారో, జ్ఞానులు దానిని పగలు అనుకుంటారు. ఎవరికైతే భగవత్ ప్రాప్తి కోసం అభిలాష మేల్కొల్పబడిందో, వారు కష్టం/బాధ అనేదాన్ని ఆధ్యాత్మిక పురోగతి మరియు స్వార్థ త్యాగం కోసం వచ్చిన అవకాశంగా స్వీకరిస్తారు. ఆత్మని మరింత మరుగున పరిచే భోగాల పట్ల అప్రమత్తంగా ఉంటారు. అందుకే, వారు సుఖాల కోసం ప్రయాస పడరు లేదా కష్టాలను ద్వేషించరు. ఇటువంటి జీవాత్మలు, ఎవరైతే తమ మనస్సులను రాగ-ద్వేష ద్వంద్వముల నుండి విముక్తి చేసుకున్నారో, వారు భగవంతుడిని స్థిరమైన దృఢ సంకల్పముతో ఆరాధించగలరు.
శ్రీ మాత్రేనమః 🙏
శ్రీ గురుభ్యోనమః 🙏
19-10-2026 సోమవారం రాశి ఫలితాలు
మేషం
వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు కష్టసాద్యంతో పూర్తవుతాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో పెద్దలతో మాటపట్టింపులు తప్పవు. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి.
---------------------------------------
వృషభం
సోదరులతో మనస్పర్ధలు తొలగుతాయి. గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి. అవసరానికి ఇతురుల నుండి ధన సహాయం అందుతుంది. నూతన ఉద్యోగ అవకాశలు అందుతాయి.
---------------------------------------
మిధునం
నూతన వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుండి ఒత్తిడి తప్పదు. నేత్ర సంభందిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గంధరగోళంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది.
---------------------------------------
కర్కాటకం
సంతాన విద్యా ఉద్యోగ విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాలలో ఆశించిన విధంగా రాణిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.
---------------------------------------
సింహం
ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
---------------------------------------
కన్య
సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. గృహమున సంతాన శుభకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. ముఖ్యమైన పనులు బంధుమిత్రుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు.
---------------------------------------
తుల
ఉద్యోగమున చాలాకాలంగా వేదిస్తున్న సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. బంధువులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
---------------------------------------
వృశ్చికం
ఒక వ్యవహారంలో ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమౌతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
---------------------------------------
ధనస్సు
వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగులకు అతి కష్టం మీద అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత అధికమౌతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. కొన్ని వ్యవహారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.
---------------------------------------
మకరం
ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు కలసివస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
---------------------------------------
కుంభం
బంధు మిత్రులతో సఖ్యత పెరుగుతుంది. వ్యాపారాలలో శత్రు సమస్యలు నుండి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు.
---------------------------------------
మీనం
నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూరప్రాంత బందు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమున మంచి పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. కీలక సమయంలో మంచి ఆలోచనా జ్ఞానంతో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
---------------------------------------