12, జనవరి 2026, సోమవారం

చేతులు కాలినాక ఆకులు

   







చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభంలేదు


*Sugar side effects వచ్చిన తర్వాత చింతించి లాభంలేదు* 



మధుమేహం - *షుగర్ /sugar* సైడ్ ఎఫెక్ట్స్ నివారించే దివ్య ఔషదం

#########################

ఉపయోగాలు: — మీ గ్లూకోజ్ ఎప్పుడు 80—100 లోపు ఉంచుతుంది.

—ఇన్సులిన్ వాడుతున్న వారు దీనిని 3 పూటలు 90 రోజులు వాడిన తరువాత మీ ఇన్సులిన్ పాయింట్స్ తగ్గించవచ్చు.

—దీనిని నిత్యం వాడుతుంటే నీరసము, ఆయాసం తగ్గి శరీరం లో బలం కలుగుతుంది.

—శరీరంలో మంటలు, తిమ్మిరులు రానివ్వడు

–షుగర్ సైడ్ ఎఫెక్ట్స్ నుమెల్లమెల్లగా మీ శరీరం నుండి దూరం చేస్తుంది.

—వంశపారంపర్యము గా షుగర్ వచ్చే అవకాశం గలవారు నిత్యం 5 gm చూర్ణం వాడుతుంటే జీవితం లో షుగర్ వ్యాధి రాదు.

—-నేలతంగేడు మూలిక వల్ల అతిగా వచ్చే మూత్రం ను కంట్రోల్ చేస్తుంది.

—-కొందరికి పుండ్లు మానకపోవడం,గ్యాంగ్రీన్ కు దారితీయడం జరుగుతుంది.అలాంటి వారికోసం దీనిలో వాడిన పంచనింబ మేలు చేస్తుంది.

—-కంటిచూపు మసకబారడం,దృష్టి బలహీనపడం ను నివారిస్తుంది.

-మానసికఅలసట,చికాకు,లైంగికఅసమర్ధత ను తగ్గించును.

—టైప్—1 మధుమేహాన్నికూడా తగ్గిచును.

—చిన్న వయస్సులో వచ్చే షుగర్ వ్యాధిని కూడా తగ్గిస్తుంది.

—LDL,ట్రైగ్లిసరైడ్ నుకంట్రోలో ఉంచును.

“జిమ్నెమిక్ యాసిడ్ మాలిక్యూల్స్” చక్కర నిల్వలను నియంత్రణలో ఉంచును

ఈ చూర్ణంవాడుతుంటే  షుగర్ వల్ల బాధలు ఉండవు


పొడపత్రి ఆకు

నేలవేము సమూలం

తిప్పతీగ లావుది

మానుపసుపు బెర డు

నేరేడు గింజలు

మోదుగపువ్వు,

లోద్దుగ బెరడు,

వేగిస బెరడు

నేలతంగేడు,

మారేడు,

ఉసిరి

నల్లజిలకర

కలోంజీ 

కటుకరోహిణి

సప్తరంగి

ఒద్ది బెరడు

శిలాజితు

వంగభస్మము


Dose: 5 gm చూర్ణం ను గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం పరగడుపున. సాయంత్రం భోజనానికి ముందు తీసుకోవాలి.

సూచనలు: –గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పుడు 5 gm చూర్ణం ను 3 పూటలు ఆహారానికి ముందు తీసుకోవాలి

🏀సూచన: 

మీరు  తయారుచేసుకోలేనప్పుడు. 

మీరు ఆర్డర్ ఇస్తే మీ కోసం 310 gm చూర్ణం మేము ఫ్రెష్ మూలికలు సేకరించి తయారుచేసి speedpost ద్వారా ఇంటికి పంపిస్తాము. 

1250+100 courier for one month


❤️❤️❤️❤️❤️🍀🍀❤️❤️❤️❤️❤️

ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే నాకు  "9949363498  కు కాల్ చేయండి ఆయుర్వేద పరిష్కారం ఉచితంగా తెలియజేస్తాను

:

సుఖ-దుఃఖాలని

విబుధ వరుడు!

  *తే.గీ.* 

భారత వివేక విజ్ఞాన విబుధ వరుడు!

దేశ దేశాల వైదుష్య దివ్య ధనుడు!

రామకృష్ణుని చరణాల రమ్య ఘనుడు!

వేద వేదాంత సార సవిస్తరుండు!

గత్వాగోగణపృష్టతః

  గత్వాగోగణపృష్టతః విపినమాహారగ్రహీతానిదం

గోపాలాన్వయమాగతోత్వమితిపుణ్యంప్రాప్నువంతోవయం

సత్సంపన్న సుబంధమచ్యుతమిదమస్మాభిః తవశ్రీకరం

ప్రేమ్నా త్వాంలఘునామభిఃవయమబోధామహ్యమర్యాదయాऽ

స్మాన్ క్షమస్వపరందదాతుకృపయా!గోవింద!కోపం త్యజ!



పశువులవెనుక నడవిలోనశనము దిను

గోప కులమున పుణ్యపు గొప్ప నీవె 

కొరతలేని గోవిందుడ! పరను ఇచ్చే

నిన్ను చిన్నపేరుల బిల్చి యున్న మాకు 

బాలలకునీకుబంధము బాయదెపుడు

నిత్యపద్య నైవేద్యం

 *నిత్యపద్య నైవేద్యం-2096 వ రోజు*

*మంచిమాటకు మంచి పద్యం-365. సేకరణ, పద్యరచన,  సహజకవి, డాక్టర్ అయినాల  మల్లేశ్వరరావు* , తెనాలి, 9347537635, *గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ,తెనాలి*


*మంచి మాట:*

అదృష్టమంటే ఆస్తిపాస్తులు కాదు. చేతి నిండా పని, కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర, కష్టసుఖాలు పంచుకునే సన్నిహితులు ఉండటం. 

  

 *తేటగీతి*

చేతి నిండుగ పనియున్ను చేయుటకును, 

కడుపు నిండుగ తిండియు గడచుటకును, 

కంటి నిండుగ నిద్రయు.. కలుములనగ 

మనసుదీరగ వినువయ్య *మల్లి* మాట.

పంచాంగం

  



పరులోడినచో నవ్వకు

  *నేటి సూక్తి* 


 *ఇతరుల ఓటమిని చూసి నవ్వేవారు జీవితంలో ఏదీ సాధించలేరు, తన ఓటమిలో కూడా నవ్వేవారు ఎప్పటికైనా విజయం సాధిస్తారు.*


*క్రాంతి కిరణాలు*


 *కం.పరులోడినచో నవ్వకు* 

*పరాభవ విజయము రెండు పరిపాటేగా*

*అర నిమిషమ్మున మారును* 

*నర జీవితమందు మార్పు నడుచుచు నుండున్*


*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

సంక్రాంతి పండుగ

  2008వ సంవత్సరం నుండి సంక్రాంతి పండుగ 

జనవరి 15న రావడం ప్రారంభమయింది.


అంతకుముందు1935 నుండి 2007వరకు జనవరి 

14ననే పండుగ. ఇదో 72 ఏళ్ల సమయం. ప్రతీ 72 సంవత్సరాలకు ఒకసారి పండుగ ఒకరోజు తర్వాత

కు మారుతుంది.

 

1935 నుండి 2007 వరకు జనవరి 14న,

2008 నుండి 2080 వరకు జనవరి 15న,

2081 నుండి 2153 వరకు జనవరి 16న 

సంక్రాంతి పండుగ వస్తుంది.


ఎందుకిలా అంటే, సాధారణంగా, సూర్యుడు ధనూ

రాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించిననాడే మకర 

సంక్రాంతి జరుపుకోవడం ఆనవాయితీ. ఈ రోజు 

నుండి మిధునరాశికి ప్రవేశించేదాకా ‘ఉత్తరాయణ పుణ్యకాలం’గా వ్యవహరిస్తారు.


ఇక, సూర్యుడు ప్రతీసంవత్సరం మకరసంక్రమణం చేసినప్పుడు 20 నిమిషాలు ఆలస్యం అవుతోంది. 

స్థూల గణన ఆధారంగా ఇది 3 సంవత్సరాలకు 

ఒక గంట, 72 ఏళ్లకు ఒక రోజుగా మారుతోంది.


ఈ లెక్కన, ఇంగ్లీష్‌ క్యాలెండర్‌ ప్రకారం, 72 ఏళ్లకు

ఒకసారి సంక్రాంతి తర్వాతి రోజుకు మారుతుంది. 

జనవరి 16న సంక్రాంతి రావడం మొదలవుతుంది

సుభాషితమ్

  🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


  శ్లో𝕝𝕝 *హోమధూమో గవాంరేణు*

         *ర్వేదానాం ధ్వనిరేవ చ* |

         *అపి గోదోహమాత్రేణ*

         *సర్వంపాపం వ్యపోహతి* ||

           

తా𝕝𝕝 *“కనీసం ఆవుపాలు పితుకునంత సమయమైనా హోమధూపమును పీల్చినా, గోధూళి కణం మనపై బడినా , వేద ఘోష మనచెవిన బడినా, మన సర్వ పాపాలు నశించుతాయి..*


✍️💐🌹🌸🙏

నక్షత్ర స్తోత్ర మాలిక - 12 వ రోజు*

  🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷


*నక్షత్ర స్తోత్ర మాలిక - 12 వ రోజు* 


*నక్షత్రం*_ *ఉత్తర / ఉత్తరఫల్గుణి* (Uttara Phalguni)


*అధిపతి_* "*సూర్యుడు*" (Sun)


*ఉత్తర నక్షత్ర జాతకులు, ప్రభుత్వ పరమైన పనులలో ఆటంకాలు ఉన్నవారు, మరియు కీర్తి ప్రతిష్టలు కోరుకునే వారు పఠించాల్సిన స్తోత్రం.*


🙏 *శ్రీ మార్తాండ స్తోత్రం*🙏


*గాఢాంధకారహరణాయ జగద్ధితాయ*

*జ్యోతిర్మయాయ పరమేశ్వరలోచనాయ* ।

*మందేహదైత్యభుజగర్వవిభంజనాయ*

*సూర్యాయ తీవ్రకిరణాయ నమో నమస్తే* ॥ 1 ॥


*ఛాయాప్రియాయ మణికుండలమండితాయ*

*సురోత్తమాయ సరసీరుహబాంధవాయ* ।

*సౌవర్ణరత్నమకుటాయ వికర్తనాయ*

*సూర్యాయ తీవ్రకిరణాయ నమో నమస్తే* ॥ 2 ॥


*సంజ్ఞావధూహృదయపంకజషట్పదాయ*

*గౌరీశపంకజభవాచ్యుతవిగ్రహాయ* ।

*లోకేక్షణాయ తపనాయ దివాకరాయ*

*సూర్యాయ తీవ్రకిరణాయ నమో నమస్తే* ॥ 3 ॥


*సప్తాశ్వబద్ధశకటాయ గ్రహాధిపాయ*

*రక్తాంబరాయ శరణాగతవత్సలాయ* ।

*జాంబూనదాంబుజకరాయ దినేశ్వరాయ*

*సూర్యాయ తీవ్రకిరణాయ నమో నమస్తే* ॥ 4 ॥


*ఆమ్నాయభారభరణాయ జలప్రదాయ*

*తోయాపహాయ కరుణామృతసాగరాయ* ।

*నారాయణాయ వివిధామరవందితాయ*

*సూర్యాయ తీవ్రకిరణాయ నమో నమస్తే* ॥ 5 ॥


*ఇతి శ్రీ మార్తాండ స్తోత్రమ్* ॥


🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷

సూక్తి

  *నేటి సూక్తి*


*బలమైన ఆలోచనలు, ఉన్నత లక్ష్యాలు మన జీవితాన్ని వెలిగించే వెలుగు దీపాలు. ఆ స్ఫూర్తితో ప్రతి రోజు ముందుకు సాగుదాం* 


*క్రాంతి కిరణాలు* 


*కం.బలమగు ఆలోచనతో*

*విలువగు లక్ష్యంబు కలిగి వెళ్ళుము నెపుడున్*

*వెలిగించుము దీపాలను* 

*సులభముగా స్ఫూర్తి పొంది చూడుము జగతిన్*


*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

భాగవతం

  *'భాగవతం వింటే బాగవుతాం'*

_శ్రీ పోతన భాగవత మధురిమలు_


(6-36-క)

వర యోగిమాన సాంతః

కరణ సుధాంభోధి భావకల్లోల లస

త్పరతత్త్వశేషశాయికిఁ

జిరదాయికి సకలభక్తచింతామణికిన్


*భావము:-* పరమ యోగీంద్రుల అంతఃకరణమనే పాలసముద్రంలో భావ తరంగాలలో తేలియాడే శేషతల్పంపై శయనించే పరతత్త్వం, భక్తుల పాలిటి చింతామణియై శాశ్వతమైన మేలును కలిగించేవాడు అయిన శ్రీకృష్ణునికి (ఈ కృతిని సమర్పిస్తున్నాను).


శ్రీ త్యాగరాజ స్వామివారి కీర్తనతో శుభోదయం.


*శ్రీ కృష్ణం వందే జగద్గురుం* 

ధర్మో రక్షతి రక్షితః

శ్రీల ప్రభుపాద ఉవాచ!

  శ్రీల ప్రభుపాద ఉవాచ!

🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿

ఈ ప్రస్తుత కలి యుగంలో యజ్ఞం నిర్వహించడం చాలా కష్టమైన పని, ఎందుకంటే దేవతలందరినీ యజ్ఞంలో పాల్గొనడానికి ఆహ్వానించాలి. 

ఈ కలియుగంలో ఇంత ఖరీదైన యాగాలు చేయడం సాధ్యం కాదు, దేవతలను ఆహ్వానించడం కూడా సాధ్యం కాదు. 


అందువల్ల ఈ యుగంలో ఇది సిఫార్సు చేయబడింది,

యజ్ఞః సంకిర్తనైర్ ప్రాయైర్ యజంతి హి సుమేదశః

 (భా.గ. 11.5.32). 

కలియుగంలో వైదిక యాగాలు చేసే అవకాశం లేదని బుద్ధిమంతులు తెలుసుకోవాలి. 


కానీ దేవతలను ప్రసన్నం చేసుకుంటే తప్ప, నియంత్రిత కాలానుగుణ కార్యకలాపాలు లేదా వర్షపాతం ఉండవు. 

అంతా దేవతలచే నియంత్రించబడుతుంది. ఇట్టి

పరిస్థితులలో, ఈ యుగంలో, సామాజిక శాంతి మరియు శ్రేయస్సు యొక్క సమతుల్యతను ఉంచడానికి, తెలివైన పురుషులందరూ పవిత్ర నామాలను జపించడం ద్వారా సంకీర్తన-యజ్ఞాన్ని నిర్వహించాలి. 


హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే/ హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. 


ప్రజలను ఆహ్వానించి, హరే కృష్ణ జప సంకీర్తన చేసి, ఆపై ప్రసాదాన్ని పంచిపెట్టాలి. 

ఈ యజ్ఞం దేవతలందరినీ సంతృప్తిపరుస్తుంది, తద్వారా ప్రపంచంలో శాంతి మరియు శ్రేయస్సు ఉంటుంది ...


ఈ యుగంలో యజ్ఞం యొక్క పనితీరు సరళీకృతం చేయబడింది. 

ఒకరు హరే కృష్ణ అని జపించవచ్చు మరియు కృష్ణుడిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా దేవతలందరినీ స్వయంచాలకంగా సంతృప్తి పరచవచ్చు.


(శ్రీమద్-భాగవతం, స్కందము.4

అధ్యాయం.6, వచనం.53)


హరే కృష్ణ 

ఎల్లప్పుడూ మీ శ్రేయోభిలాషి

12-01-2026రాశి ఫలితాలు

  శ్రీ గురుభ్యోనమః 🙏

12-01-2026రాశి ఫలితాలు


మేషం


వ్యాపారస్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆప్తుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు.

---------------------------------------


వృషభం


నూతన కార్యక్రమాలను ప్రారంబించి సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ సందర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారం అందుతుంది. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. దీర్ఘకాలిక ఋణ సమస్యలు పరిష్కరించుకుంటారు.

---------------------------------------


మిధునం


ఉద్యోగస్థులకు స్థానచలనాలు తప్పవు. ఆకస్మికంగా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కుటుంబమున అదనపు బాధ్యతలు కొంత చికాకు పరుస్తాయి.

---------------------------------------


కర్కాటకం


ముఖ్యమైన పనులలో ఆటంకాలుంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారమున ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలలో అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. దూర ప్రయాణాలలో మార్గవరోధాలు కలుగుతాయి.

---------------------------------------


సింహం


మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున సమస్యలు తొలగి ఊరట చెందుతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. శుభ కార్యములకు ధనవ్యయం చేస్తారు.

---------------------------------------


కన్య


ఉద్యోగులకు ఇతరుల నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. బంధు వర్గంతో మాటపట్టింపులు ఉంటాయి. కుటుంబ వాతావరణం చికాకు పరుస్తుంది. ధనదాయ మార్గాలకు అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయట విమర్శలు అధికమౌతాయి. 

---------------------------------------


తుల


చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారమున నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత అనుకూలిస్తాయి. సమాజంలో ఉద్యోగమున సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. గౌరవ మర్యాదలకు లోటుండదు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.

---------------------------------------


వృశ్చికం


నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలు చేపడతారు. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. గృహమున కొందరి ప్రవర్తన వలన శిరోభాధలు తప్పవు.

---------------------------------------


ధనస్సు


 ఆర్థికంగా అనుకూలత కలుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. గృహమున చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారములలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

---------------------------------------


మకరం


ఆప్తులు నుంచి ధన సహాయం అందుతుంది. ఆదాయ మార్గాలు విస్తృతమౌతాయి. చేపట్టిన పనులలో కార్యజయం కలుగుతుంది. వ్యాపారమున ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగస్థుల కలలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------


కుంభం


సన్నిహితుల నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాటపట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. సోదరులతో ఆస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. ఇతరుల నుండి ఋణ ఒత్తిడులు అధికమౌతాయి.

---------------------------------------


మీనం


ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. దాయదులతో స్ధిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.

---------------------------------------

పంచాంగం 12.01.2026 Monday,

  ఈ రోజు పంచాంగం 12.01.2026 Monday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాస కృష్ణ పక్ష నవమి తిథి ఇందు వాసర స్వాతి నక్షత్రం ధృతి యోగః గరజి తదుపరి వణిజ కరణం.


రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 

యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు. 

  


శ్రాద్ధ తిథి: దశమి


 

నమస్కారః , శుభోదయం

మూక పంచశతి*

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


*శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 03*


*చింతితఫలపరిపోషణ చింతామణిరేవ కాంచినిలయా మే।*

*చిరతరసుచరితసులభా చిత్తం శిశిరయతు చిత్సుఖాధారా॥*


*భావము :*


*కాంచీపురుములో వెలసి ఉన్న ఆ చింతామణి, నేను కోరిన కోరికలన్నీ సిద్ధింపచేస్తున్నది. అత్యంత పుణ్యాత్ములకు మాత్రమే ఆ తల్లి సులభముగా వశు రాలవుతుంది. తన అమృతమయమైన ధారలతో ఆమె నా బాధతో నిండిపోయిన మనసుకు శాంతిని ప్రసాదిస్తుంది.*


🌸 *శ్రీమాత్రే నమః* 🙏


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - హేమంత ఋతువు - పుష్య మాసం - కృష్ణ పక్షం - నవమి - స్వాతి -‌‌ ఇందు వాసరే* (12.01.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*