*'భాగవతం వింటే బాగవుతాం'*
_శ్రీ పోతన భాగవత మధురిమలు_
(6-36-క)
వర యోగిమాన సాంతః
కరణ సుధాంభోధి భావకల్లోల లస
త్పరతత్త్వశేషశాయికిఁ
జిరదాయికి సకలభక్తచింతామణికిన్
*భావము:-* పరమ యోగీంద్రుల అంతఃకరణమనే పాలసముద్రంలో భావ తరంగాలలో తేలియాడే శేషతల్పంపై శయనించే పరతత్త్వం, భక్తుల పాలిటి చింతామణియై శాశ్వతమైన మేలును కలిగించేవాడు అయిన శ్రీకృష్ణునికి (ఈ కృతిని సమర్పిస్తున్నాను).
శ్రీ త్యాగరాజ స్వామివారి కీర్తనతో శుభోదయం.
*శ్రీ కృష్ణం వందే జగద్గురుం*
ధర్మో రక్షతి రక్షితః
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి