*నిత్యపద్య నైవేద్యం-2096 వ రోజు*
*మంచిమాటకు మంచి పద్యం-365. సేకరణ, పద్యరచన, సహజకవి, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు* , తెనాలి, 9347537635, *గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ,తెనాలి*
*మంచి మాట:*
అదృష్టమంటే ఆస్తిపాస్తులు కాదు. చేతి నిండా పని, కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర, కష్టసుఖాలు పంచుకునే సన్నిహితులు ఉండటం.
*తేటగీతి*
చేతి నిండుగ పనియున్ను చేయుటకును,
కడుపు నిండుగ తిండియు గడచుటకును,
కంటి నిండుగ నిద్రయు.. కలుములనగ
మనసుదీరగ వినువయ్య *మల్లి* మాట.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి