26, జులై 2023, బుధవారం

నడిస్తే చాలు అనుకుంటాడు

 *కాళ్ళు లేనివాడు నడిస్తే చాలు అనుకుంటాడు. చూపు లేనివాడు చూడగలిగితే చాలనుకుంటాడు. చెవులు లేనివాడు వినాలని ఆశ పడతాడు, ఎందుకంటే వాళ్ళకు వాటి విలువ ఏంటో తెలుసు! ఎవరి సాయం లేకుండా కాళ్ళతో నడిచి వెళ్ళడంలో ఉండే ఆనందం.* 


*గాడాంధకారం నుండి బైటపడి పకృతి అందాలను చూడడంలోని ఉల్లాసం.*


*భయంకరమయిన నిశ్శబ్దాన్ని చేదించి మధురమయిన సంగీతాన్ని చెవులతో ఆస్వాదించడం లోని సంతోషం.* 


 *కానీ కొంత మంది అన్నీ ఉన్నా ఇంకా ఏదో లేదని ఏదో కావాలని ఉన్నదాన్ని కోల్పోతున్నారు కాబట్టి ఉన్నదాంతో సంతృప్తిగా బ్రతకలిగిన వాళ్ళు ఆనందంగా ఉండి దేనినైనా సాధించగలరు.*

జడ్జిగారి అనుభవ సారం

 *ప్రశాంతమైన వృద్ధాప్యానికి* 

*పది బంగారు సూత్రాలు..!* 

రిటైర్డు ఫ్యామిలీ.. 🙏 🙏  

(సుప్రీమ్ కోర్టు జడ్జి గారు)  


*👉1. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ కొడుకు కోడలుతో కలిసి ఉండకండి. అవసరమైతే వారిని అద్దె ఇంట్లో ఉండమనండి. మీ పిల్లలతో మీరు ఎంత దూరంగా ఉంటే మీ వియ్యంకులతో, మీ కోడలితో మీ బంధుత్వాలు అంత బాగా ఉంటాయి. 


*👉2. మీ కుమారుడి భార్యను కేవలం అతని భార్యగా మాత్రమే చూడండి. లేదా ఒక ఫ్రెండ్ గా చూడండి. అంతే తప్ప ఆమెను మీ కుమార్తెగా చూడొద్దు. మీ అబ్బాయిని అన్నట్టుగానే ఆమెను కూడా పొరపాటున  ఒక మాట కూడా అనవద్దు. అది ఆమె జీవితాంతం గుర్తు పెట్టు కుంటుంది. ఆమెను తిట్టే హక్కు కేవలం ఆమె తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది. 


*👉3. మీ కోడలి అలవాట్లు లేక ప్రవర్తన అది మీ అబ్బాయి సమస్య మీకు అసలు సంబంధం లేదు,  అనవసరం కూడా. 


*👉4. ఒకవేళ మీరు కలిసి ఉంటున్నా కూడా ఎవరి పనులు వారు చేసుకోండి. వారికి సంబంధించిన ఏ పని మీరు చేయొద్దు. ఒకవేళ మీ కోడలు మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటే కనుక తిరిగి ఏమీ ఆశించకుండా మాత్రమే ఆ పని మీరు చేయండి. మీ కుమారుడి కుటుంబ సమస్యలు మీ మీద వేసుకోకండి. 


*👉5. మీ కొడుకు కోడలు వాగ్యుద్ధాలు చేసుకుంటున్న  మీరు చెవిటి వారిలా ఉండిపోండి. సాధారణంగా పెద్దలు కల్పించుకోవటం వారికి ఇష్టం ఉండదు. 


*👉6. మీ మనుమలు పూర్తిగా మీ కొడుకు కోడలు యొక్క ఆస్తి. వారు వారి పిల్లల్ని ఎలా పెంచుకుంటారో అది వారి ఇష్టం. 


*👉7. మీ కోడలు మిమ్మల్ని గౌరవించవలసిన అవసరం 

ఎంత మాత్రమూ లేదు అలా ఆశించకండి ఆశించకండి. ఒక మంచి వ్యక్తిగా మసులుకోమని మాత్రమే మీరు మీ కుమారుడికి చెప్పండి. 


*👉8. మీ రిటైర్మెంట్ కోసం మీరు ఎక్కువగా ప్రణాళికలు రచించుకోండి. మీ మిగతా జీవితం సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. 


*👉9. రిటైర్ అయిన తర్వాత మీ రోజులు ఎంత హాయిగా గడుపుకుంటారో అది మీ ఇష్టం. ఇంతకాలం మీరు దాచుకున్న సొమ్మును హాయిగా ఖర్చు పెట్టుకోండి మీ డబ్బులు మీకు పనికి రాకుండా పోయేలా చూసుకోరాదు. 


*👉10. మనుమల మీద మీకు ఎటువంటి హక్కు లేదు అది మీ సంతానానికి దేవుడిచ్చిన వరం. 


* సాధ్యమైనంత వరకూ ఈ మెసేజ్ ఎక్కువ మంది షేర్ చేసుకునేలా చూడండి. 


* ఇది తన జీవిత కాలం సుప్రీం కోర్టులో ఫ్యామిలీ డిస్ప్యూట్ కేసులు చూసిన ఒక జడ్జిగారి అనుభవ సారం. 🙏 🙏🏾 🙏 


వాట్సప్  ద్వారా వచ్చినది.

*రాసినవారికి కృతజ్ఞతలు🙏*

సారస్వత నీరాజనం

 రోజు, నెలకు ఉన్న సంస్కృత పేర్లకు తెలుగు పేర్లు... 


గ్రంథం: సారస్వత నీరాజనం 

రచయత: ఆదిభట్ల నారాయణదాసు గారు 

ప్రచురణ: 1975

అంతర్జాతీయ ఎగ్జిబిషన్

 



అత్యద్భుత నిర్మాణ సౌందర్యం..!! భారతీయ వారసత్వ సంపద ఉట్టిపడేలా కొత్త ఢిల్లీ లోని ప్రగతి మైదానంలో నిర్మాణమైన 'అంతర్జాతీయ ఎగ్జిబిషన్ మరియు కన్వెన్షన్ సెంటర్' (IECC) ఇది.. రేపు గౌరవ ప్రధాని శ్రీ Narendra Modi గారి చేతులమీదుగా ప్రారంభోత్సవం జరుగనుంది. 


2700 కోట్ల రూపాయల వ్యయంతో ఈ IECC ని 'శంఖం' రూపంలో నిర్మించడం జరిగింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో జరగబోయే G20 శిఖరాగ్ర సమావేశాలు ఈ కన్వెన్షన్ సెంటర్ లోనే జరుగనున్నాయి. 20 దేశాలకు చెందిన అతిరథమహారధులు ఈ సమావేశంలో పాల్గొననున్న నేపథ్యంలో భారత దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఉండాలని కేంద్రం ఈ అత్యద్భుత నిర్మాణం చేపట్టింది. ఇది భారత దేశ ప్రజలందరికి గర్వకారణం!!

యోగ ప్రక్రియ- పాదమర్దనం-Reflexology

 



పతంజలి మహర్షి మనకు ఇచ్చిన ఒక యోగ ప్రక్రియ- పాదమర్దనం-Reflexology 

జాగ్రత్తగా గమనించండి...

మన పాదాలు మన శరీరాకృతినే తలపిస్తాయి...

 1. బొటన వేలు తలను..

 2. మిగిలిన వేళ్ళు కళ్ళు, ముక్కు , గొంతు, వరుసగా సూచిస్తాయి...

 3. కాలివ్రేళ్ళ క్రింది భాగం... అంటే పాదాలకు వ్రేళ్ళకు మధ్య కలిసి ఉండే భాగం గొంతును సూచిస్తాయి

 4. అరి కాలిపై ఉన్న ఉబ్బెత్తు భాగం చాతీని సూచిస్తుంది...

 5. అరికాలి లోని గుంట భాగం నడుమును

 6. కాలి మడమ భాగం కాళ్ళను

 7. కాలి చివరి భాగం అరికాళ్ళను/మడమలు/పాదాలను సూచిస్తాయి...

ఇక విషయం చాలా వరకు మీకు అర్ధమయి ఉంటుంది...

బొటన వేలిని ఉబ్బెత్తు భాగాలను మర్దించటం ద్వారా తలలోని పిట్యుటరీ గ్రంధి చేతనమయి..

తలకు మేలు చేకూరుతుంది...

రెండవ మూడవ, మిగిలిన వేళ్ళ ఉబ్బెత్తు భాగాలు మర్దించటం ద్వారా కళ్ళు, ముక్కు, గొంతుకు సంబంధించిన అవయవాలు చేతనమయి...

ఆయా భాగాలను సుతిమెత్తగా మర్తించడం వలన వెర్వేరు శారీరక వ్యాధులనుండి ఉపశమనం కలుగుతుంది.... సమస్యలు తగ్గుతాయి... అతి సర్వత్ర  వర్జయేత్... అంటే ఎక్కువసేపు మర్థించడం వేరే సమస్య అవుతుంది... ఇవన్నీ గురు ముఖతా చేయడం మంచిది....ఇది పాద మర్దనం గురించిన సంక్షిప్త సమాచారం.

తిలింగ మందిర్

 🕉 మన గుడి : 





⚜ అస్సాం : బోర్దుబి


⚜ తిలింగ మందిర్


💠 ఇది ఏమిటి! గంటలు, గంటలు, గంటలు,

ఆ గుడిలో ఎక్కడ చూసినా గంటలే గంటలు..

గులకరాయిలా చిన్న పరిమాణంలో, మరికొన్ని చాలా పెద్దవి మరియు ఘనమైనవి.

50 గ్రాముల నుండి 55 కిలోల మధ్య బరువు కలిగి ఉంటాయి. 

కొన్ని వర్షాలతో తుప్పు పట్టాయి, మరికొన్ని ఎండలో బంగారంలా మెరుస్తున్నాయి. అన్నీ ఇనుప కడ్డీల నుండి కుప్పలుగా ఒకదానితో ఒకటి కలిసి, అనుకోకుండా, ఒక శిల్ప గుత్తిని సృష్టించి, మీ కళ్ళు సిద్ధంగా లేని దృశ్యంతో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇవి మాత్రమే కాదు, కాంప్లెక్స్ యొక్క మూలలో లోహ పర్వతాన్ని ఏర్పరుచుకుంటూ వేల సంఖ్యలో ఉన్నాయి గంటలు


 💠 ఈ గంటల్లో ప్రతి ఒక్కటి నెరవేరిన కోరికను సూచిస్తుంది. మరియు గంటల సంఖ్యను బట్టి చూస్తే, ఇక్కడ చాలా కోరికలు నెరవేరుతాయి.


💠 ఉత్తర దక్షిణ భారత దేవాలయాల వలె కాకుండా, ఇది పట్టు , బంగారం మరియు ఆచారాల కోలాహలంతో  ఉండదు. 

ఆలయ శిల్పకారుల నిర్మాణ వైభవం లేదా కళాత్మక వివరాలు లేవు. 

విగ్రహాలు కూడా లేవు. రద్దీ లేదు, వాణిజ్య దుకాణాలు లేవు, భక్తి పాటలను హోరెత్తించే లౌడ్‌స్పీకర్లు లేవు మరియు ట్రాఫిక్ జామ్ లేదు.


💠 ఈశాన్య అస్సాంలోని బోర్డుబి అనే చిన్న పట్టణంలో, బ్రహ్మపుత్ర నదికి దక్షిణాన దాదాపు 15 మైళ్ల దూరంలో, తిలింగ మందిర్ అని పిలువబడే ప్రత్యేకమైన 'బెల్ టెంపుల్' ఉంది.  ప్రపంచంలోని ఇతర పుణ్యక్షేత్రాలతో పోలిస్తే తిలింగ మందిరం సాపేక్షంగా కొత్త పవిత్ర స్థలం.

 తిలింగ అంటే అస్సామీ భాషలో "గంట" మరియు మందిర్ అంటే "ఆలయం". 


💠 ఆలయ పైకప్పు నాలుగు పెద్ద గంటలను కలిగి ఉంటుంది, ఆలయ ప్రవేశం కూడా లోహపు గంటను చూపుతుంది, భక్తులు గంటను మోగించి ఆలయంలోకి ప్రవేశిస్తారు. రోజూ ఘంటసాల దేవాలయం భక్తుల రద్దీతో నిండిపోతుంది, అయితే సోమవారం మహాశివరాత్రి రోజున కూడా ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని శివ భక్తులు విశ్వసించడంతో సోమవారం ఆలయం భక్తుల మహాసముద్రంలా కనిపిస్తుంది.


💠 కంచు, ఇత్తడి, రాగి మరియు అల్యూమినియంతో కూడిన అన్ని పరిమాణాలలో వందల మరియు వేల గంటలు పెద్ద మర్రి చెట్టుకు మరియు దాని వివిధ కొమ్మలపై కట్టబడి ఉన్నాయి. వందకు పైగా  త్రిశూలాలు అక్కడ ఇసుకలో  ఉన్నాయి.

 

💠 మీకు ఒక కోరిక ఉంటే మరియు కోరికను నెరవేర్చమని మీరు శివుడిని ప్రార్థిస్తే, మీ కోరికను శివుడు పూర్తి చేస్తాడని నమ్ముతారు. ఒక్క విషయం ఏమిటంటే, ఈ ఆలయంలో గంటను దానం చేయాలని మీరు నిర్ణయించుకోవాలి.


💠 ఈ దేవాలయం దాదాపు అర్ధ శతాబ్దం నాటిది. "1965లో, ఈ ప్రాంతంలోని తేయాకు తోట కార్మికులు ఈ మర్రిచెట్టు దగ్గర నేల నుండి 'శివలింగం'_ ఉద్భవించడాన్ని గమనించారు. అప్పుడు తోట నిర్వాహకులు ఇక్కడ ఒక చిన్న ఆలయాన్ని నిర్మించాలని చెప్పారు. 

తమ ప్రార్థనలకు ఫలిస్తే తిరిగి వచ్చి ఆలయానికి గంటను అందజేస్తానని వాగ్దానం చేశారు. 

ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం.


💠 "కాలక్రమేణా, ఎక్కువ మంది ప్రజలు ఈ విషయం తెలుసుకున్నారు మరియు వారి ప్రార్థనలకు సమాధానం లభించినప్పుడు ఈ పెద్ద చెట్టుకు గంటలు కట్టడం ప్రారంభించారు. 50 గ్రాముల కంటే ఎక్కువ బరువు లేని చిన్న వాటి నుండి 55 కిలోల బరువు వరకు, మొత్తం. ఆలయ ప్రాంగణంలో గంటలు  వేలాడదీయబడింది. 


💠 ఇక్కడ చాలా గంటలు ఉన్నాయి మరియు సంవత్సరానికి ఆ సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. వాటిలో కొన్ని పడిపోయాయి కానీ భక్తులు వాటిని కానుకగా ఇచ్చినందున, ఆలయ నిర్వాహకులు వాటిని విసరరు. నిర్వాహకులు వాటిని గోనె సంచుల్లో భద్రపరిచి ఆలయ ప్రాంగణంలోని ఓ మూలన ఉంచుతారు.


💠 చాలా మంది తమ కోరికలు నెరవేరినప్పుడు పావురాలను కూడా ఆలయానికి సమర్పించుకుంటారు. 

ప్రజలు తమ కోరికలు తీరినప్పుడు  శివాలయంలో 'త్రిశూలం', పావురం లేదా గంటను సమర్పించడం సాధారణంగా ఆచారం. 


💠 భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి ఒక పెద్ద మర్రి చెట్టు కొమ్మల వద్ద తిలింగాన్ని (గంట) కట్టుకుంటారు.


💠 ఈ ఆలయం గురించి విన్న భారతదేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శించారు. 

హిందూ పురాణాల ప్రకారం "సోమవారం" అనేది శివుని రోజుగా పరిగణించబడుతుంది అందువల్ల  ప్రతి సోమవారం శివుడిని ఆరాధించడానికి భారీ సంఖ్యలో ప్రజలు ఇక్కడకు వస్తారు.


💠 ఎలా చేరుకోవాలి


రైలు ద్వారా:

సమీప స్టేషన్ టిన్సుకియా టౌన్ స్టేషన్.

The oldest religion is Hindu


 

Water


 

Talent


 

Nandi


 

Lord photos

































 

Speech


 

భార్య ఇంటికి ఆభరణం

 భార్య ఇంటికి ఆభరణం!!* 

(నేడు ప్రపంచ వివాహ దినోత్సవం)

* భరించేది భార్య,

* బ్రతుకు నిచ్చేది భార్య,

* చెలిమి నిచ్చేది భార్య 

* చేరదీసేది భార్య 

* ఆకాశాన సూర్యుడు    లేకపోయినా...

ఇంట్లో  భార్య లేకపోయినా...

అక్కడ జగతికి వెలుగుండదు,

ఇక్కడ ఇంటికి వెలుగుండదు. 

* భర్త  వంశానికి సృష్టికర్త 

* మొగుడి అంశానికి మూలకర్త,

*కొంగు తీసి ముందుకేగినా...

* చెంగు తీసి మూతి తుడిచినా...ముడిచినా..

తనకు లేరు ఎవరు సాటి 

* ఇల లో తను లేని ఇల్లు...  కలలో....

ఊహకందని భావన...

* బిడ్డల నాదరించి...

* పెద్దల సేవలో తరించి

* భర్తని మురిపించి..

మైమరపించి...

* బ్రతుకు మీద ఆశలు పెంచి... 

* చెడు ఆలోచనలు త్రుంచి...

* భ్రమరం  లా ఎగురుతూ...

* భర్త ను భ్రమల నుండి క్రిందకు దించుతూ...

* కళ్ళు కాయలు కాచేలా...

* భర్త  జీవితాన పువ్వులు పూచేలా చేసిన

జీతం లేని పని మనిషి.* 

 *జీవితాన్ని అందించే మన* *మనిషి* ... 

ఏమిచ్చి తీర్చుకోగలం భార్య రుణం 

ఆమెకు భారం కాకుండా ఉండడం తప్ప. 

అదే  భార్యకు మనమిచ్చే విలువైన ఆభరణం

🌹🌹🌹🌹🌹🌹

నమస్కారం విలువ

 *_🙏నమస్కారం విలువ.. ఎంతో తెలుసా!?🙏_*

_[ప్రస్తుతం సమాజంలోని అనేక సమస్యలకు మూల కారణం ఒకరి నొకరు గౌరవించుకోక పోవడమే! అహంకారం వదిలి, ఎదుటి వారిని చులకనగా చూడడం వలన అనర్థాలు జరుగు తున్నాయి.]_

 *===(((🙏🙏🙏)))===*


*మహాభారత యుద్ధ సమయంలో "మీరు పక్షపాతంగా యుద్ధం చేస్తున్నారు" అని దుర్యోధనుడు అనిన వ్యంగ్యమైన మాటలకు బాధపడిన భీష్మ పితామహడు _"నేను రేపు పాండవులను చంపుతాను"_ అని ప్రకటించాడు.*

*అంతే... పాండవుల శిబిరంలో ఆందోళన పెరిగింది. భీష్ముని సామర్ధ్యం గురించి అందరికీ తెలుసు కాబట్టి, జరగబోయే పరిణామాల గురించి భయంతో కలవరపడ్డారు. అప్పుడు.. శ్రీ కృష్ణుడు తన వెంట ద్రౌపదిని తీసుకొని భీష్ముని శిబిరానికి వెళ్ళాడు.*

*తను బయటే నిలబడి ద్రౌపదితో "నీవు వెళ్లి భీష్మునికి నమస్కరించు, ఆయన _"అఖండ సౌభాగ్యవతీ భవ"_ అని ఆశీర్వదిస్తాడు. తర్వాత జరిగేది గమనించు అన్నాడు.*

*ద్రౌపది అలానే చేసింది, భీష్ముడు దీవించి, "ఏంటమ్మా! ఇంత రాత్రి ఒంటరిగా వచ్చావు. నిన్ను కృష్ణుడు తీసుకు వచ్చాడు కదా!" అన్నాడు.*

*దానికి ద్రౌపది "అవును తాతయ్యా..! అన్న శిబిరం బయట నిలబడి ఉన్నారు" అనింది. భీష్ముడు బయటకు వెళ్ళగా.. ఇద్దరూ ఒకరికి ఒకరు నమస్కరించు కున్నారు.*


*వెంటనే భీష్ముడు.. "నాకు తెలుసు కృష్ణా, మీరు ఇలా చేస్తారని. ప్రతిజ్ఞ కన్నా దీవెనకు ప్రభావం ఎక్కువ. నేను పాండవుల జోలికి రాకుండా ఉండేందుకు ఇలా చేయండి" అని ఒక మార్గం ఉపదేశించాడు.*


*శిబిరం నుండి తిరిగి వస్తున్నప్పుడు, శ్రీ కృష్ణుడు ద్రౌపదితో "నీవు వెళ్లి భీష్మునికి నమస్కరించడం ద్వారా నీ భర్తలు జీవితాన్ని పొందారు".*

*"ఇలాగే.. నీవు ప్రతిరోజూ భీష్ముడు, ధృతరాష్ట్రుడు, ద్రోణాచార్యుడు లాంటి పెద్దలకు నమస్కరిస్తూ ఉండు. అలాగే దుర్యోధనుడు, దుశ్శాసనుడి భార్యలు కూడా ఆ పెద్దలతో పాటు పాండవులకు కూడా నమస్కరిస్తూ ఉంటే బహుశా ఈ యుద్ధం ఆగిపోవచ్చు. ఒక్క నమస్కారానికి అంతటి భాగ్యం కలుగుతుంది" అన్నాడు.*


*👌ఇంటిలోని పిల్లలు మరియు కోడళ్లు ప్రతిరోజూ ఇంటి పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటే ఆ ఇంటిలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. పెద్దల ఆశీర్వాదాలు కవచం లాగా పనిచేస్తాయి.*

*ఎందుకంటే...*


*🙏నమస్కారం ప్రేమ.*


*🙏నమస్కారం క్రమశిక్షణ.*


*🙏నమస్కారం చల్లదనం.*


*🙏నమస్కారం గౌరవాన్ని నేర్పుతుంది.*


*💠నమస్కారం మంచి ఆలోచనలను ఇస్తుంది.*


*💠నమస్కారం సంస్కారాన్ని నేర్పుతుంది.*


*💠నమస్కారం కోపాన్ని తొలగిస్తుంది.*

 

*💠నమస్కారం కన్నీళ్లను కడిగివేస్తుంది.*


*🔶ఎక్కడ సజ్జన సాంగత్యం లభిస్తుందో అక్కడ ప్రతిభ ఇనుమడిస్తుంది. మంచి సంస్కారాలు అలవర్చుకొంటే తరతరాలుగా వంశాభివృద్ధి  జరుగుతుంది.*


_🙏🙏🙏ఇదీ మరి నమస్కారం విలువ అంటే..._🙏🙏🙏

వీరుడా వందనం !

 సందర్భంగా కార్గిల్ విజయ దివాస్

కార్గిల్ వీరుడు కవిత శీర్షిక 

రచన రవికుమార్ దేవరశెట్టి 

కలం కవి రవి


 వీరుడా వందనం !

అమర సైనికుడా అభివందనం!!

మంచే నీకు పట్టు పానుపు! రాతికొండలే రాజసింహసనం!

అష్ట దిక్కులే ఆత్మబలం!

కనురెప్ప వేయని-

రక్షణలోనే  దేశభక్తి విస్తరించే!

వీరుడా వందనం!

అమరసైనికుడా అభివందనం!!

నీ బాహువుల సరిహద్దులలో..

 నీ  స్వేధ పరిమళ

మలయ మారుతంలో..

 చిందే రక్త బిందువులే

 భరతమాత నుదుటిపై

మెరిసే తిలకం!

వీరుడా వందనం!

అమర సైనికుడా  అభివందనం!!

పగలు రాత్రి లేదు 

అలుపు సొలుపు రాదు!

ఆకలి దప్పులను అధిగమించి

సహన సాహస కృత్యాలలో 

నిత్య కర్తవ్య నిర్వహణలో 

 అజేయుడవు!

అగ్ని వీరుడవు!!

వీరుడా వందనం!

అమర సైనికుడా అభివందనం!!


ఏవిపత్తులోనైనా నీవే-

 ఏ సంక్షోభమైన నీకే-

త్యాగానికి చిరునా  నీవు!

స్వేచ్ఛ స్వాతంత్ర -

పొద్ధయి పొడుస్తావు.

వెన్నెలతో పలకరిస్తావు

ఎండలో ఎండయి-

వానలో వానై-

సుడిగాలి వడగాలై-

గాలిలో దీపం లాంటి 

మా అందరి -

అఖండ భద్రత జ్యోతివి నీవే!

వీరుడా వందనం!

అమర సైనికుడా  అభివందనం!!


మా భవిష్యత్తు కోసం

నీ బ్రతుకు పణంగా పెడుతూ..

ప్రకృతి వైపరీత్యాలకు

శత్రువు  శతజ్ఞులకు 

ఎదురెల్లుతావు!!

సంపద రోగంతో 

మేము కూనరిల్లుతున్న-

సామరస్యం కోసం

 సమిదవగుతావు.

 నిలువెత్తు సైనిక జెండాపై

ప్రకాశిస్తూ!!

అందని ఆకాశం పైకి

 స్వేచ్ఛ స్వాతంత్రాన్నివై కనుమరుగవుతావు.!

ప్రతి దినం-

తొలి కిరణ త్రివర్ణ పతాకమై రెపరెపలాడుతావు.!!

నీ త్యాగాల సాగుళ్లలో..

మేము మానవత్వం వెతుక్కుంటూనే ఉంటాము!

మీ సేవలను స్మరిస్తూ నివాళులు అర్పిస్తూనే ఉంటాము!!

వీరుడా వందనం ..

"కార్గిల్"

అమర సైనికుడా అభివందనం!

అడుగు అడుగున పాదాభివందనం..

జైహింద్ జై భారత్

సుఖములు కలుగును


*కం*

జలబుద్బుదకరణి బతుకు

కలతలవిడి చెలిమిపంచ కలుగును సుఖముల్.

చెలిమినిమించిన శాంతము

నిలనుండదనే నిజంబు నెరుగుము సుజనా.

*భావం*:-- ఓ సుజనా! నీటి బుడగవంటి అతి చిన్న దైన బతుకు లో కలతలను విడిచిపెట్టి స్నేహాన్ని పంచినచో సుఖములు కలుగును. స్నేహాన్ని మించినశాంతము ఈ లోకంలో ఉండదనే నిజము ను తెలుసుకొనుము.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

: సంభాషణసంస్కృతమ్

(వార్తావాహినీ)


హిందుభిఃసహ సాంగత్యం

హిందుభిఃసహ జీవనమ్

హిందుభిఃసహ మిత్రత్వం

కుర్వాణో నావసీదతి


కవిభిఃసహ సాంగత్యం

కవిభిఃసహ భాషణమ్

కవిభిఃసహ సత్కథాః

శృణ్వానో నావసీదతి 


గురుభిఃసహ మిత్రత్వం

గురుభిఃసహ భాషణమ్

గురుభిఃసహ సాంగత్యం

కుర్వాణో నావసీదతి 


మిత్రేణసహ సాంగత్యం

మిత్రేణసహ భాషణమ్

మిత్రేణసహ జల్పనం

కుర్వాణో నావసీదతి 


సంభాషణసంస్కృతమ్

(వార్తావాహినీ)

Pravachan


 

Palm oil


 I am Dr. Bhawna I am working as Councillor for paediatric surgery (PGI).

 I would like to make a small request to you.

 Before that, I would like to share a small piece of information with you.

 Many of you might have read today's newspapers that

 EMRI results say, majority of people having Heart Attack are less than 50 years old.

 *You will be surprised to know the culprit is Palm Oil. It's far far more dangerous than Alchol and Smoking put together.*

 *India is the highest importer for Palm oil in this world.*

 The Palm oil mafia is very very big.

 *Our children, who are the future, are at a big risk.*

 There is no fast food available in this country without Palm Oil.

 If you *go to our grocery store, try to pick up a children's edible food without Palm oil - you will not succeed.*

 You will be interested to know *even Biscuits of big companies are made from it, and similarly all chocolates*. We are made to believe they are healthy, but we never knew about *the killer Palm oil or Palmitic acid*

 The big companies like *Lays use different oil in Western Countries and Palm oil in India* just because it is Cheap.

 Each time our child eats a product with Palm Oil, the brain behaves inappropriately and signals to secrete fat around and in the Heart  *This leads to Diabetes at a very young age.*

 The World Economic Form has projected that 50 percent of people who Die at young age will die of Diabetes and Heart Disease.

 *The Palm Oil mafia has made our Children addicted to Junk Food, leaving the fruits and Vegetables aside, which are Heart protective.*

 Next time you buy something for your child, see the label of the product. If it has Palm oil or Palmolienic oil or Palmitic acid, avoid buying it!

 We, have written to our Hon'ble Prime Minister  and are also in the process of making similar letters from 1 Lakh Doctors across India to take some action to secure our future generations.

 Once again I want to emphasize on impending danger to our children.


 Pls protect our Children. They are the future of our Country! Please forward this message.


 Don't forget to forward this to your close friends and family members. Please note to send. as many persons as possible.


 *P.S:PLEASE share without editing.🙏🏻🙏🏻*


Forwarded 

Copy paste.

హై సెక్యూరిటీ అలర్ట్:*

 *హైదరాబాద్ ప్రాంతంలో హై సెక్యూరిటీ అలర్ట్:*

 బివేర్ & బి ఆన్ యువర్ గార్డ్...ఇంటిని దోచుకోవడానికి సరికొత్త మార్గం ఒక గుంపు(Group of peoples) ఇంటింటికీ తిరుగుతూ హోం వ్యవహారాల అధికారులుగా నటిస్తుంది.  వారు హోం వ్యవహారాల శాఖ నుండి పత్రాలు మరియు లెటర్‌హెడ్‌లను కలిగి ఉన్నారు మరియు రాబోయే జనాభా గణన కోసం ప్రతి ఒక్కరూ చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును కలిగి ఉన్నారని ధృవీకరిస్తారు.  నిజానికి, వారు  ఇళ్ళని లూటీ చేసి దోచుకునే వాళ్ళు. ప్రభుత్వం అటువంటి చొరవ తీసుకోలేదని దయచేసి గమనించండి.  దయచేసి దీన్ని మీ పొరుగు గ్రూప్ చాట్‌కి పంపండి.  వారు ప్రతిచోటా ఉన్నారు మరియు వారు అందంగా కనిపిస్తారు.  దయచేసి మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులను అప్రమత్తం చేయండి.  ఒక వ్యక్తి ఇంటికి వచ్చి ఇలా అంటాడు: 'ఆయుష్మాన్ భారత్' పథకం కింద నేను మీ ఫోటో/బొటనవేలు ముద్ర వేయాలనుకుంటున్నాను.  వారి దగ్గర ల్యాప్‌టాప్, బయోమెట్రిక్ మెషిన్ మరియు దాని పేర్లన్నీ ఉన్నాయి.  లిస్ట్ చూపించి ఈ వివరాలన్నీ అడుగుతున్నారు.  ఇదంతా ఫేక్. దయచేసి అతనికి ఎలాంటి సమాచారం ఇవ్వకండి.  దయచేసి మహిళలకు చెప్పండి, ముఖ్యంగా వారు ID చూపిస్తే, దయచేసి వారిని ఇంట్లోకి రానివ్వకండి.   సమాచారం కోసం ఈ పోస్ట్ పంపుతున్నాను.  ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండండి మరియు  మీwhatsapp Group లేని వారికి కూడా చెప్పండి.

 అన్ని గ్రూపులకు ఫార్వార్డ్ చేయండి.🙏

పుటుక్కు జరజర డుబుక్కుమే

 , తెలుగు సామెతలు వెనక గల ఆసక్తికర కధనాలు.


01. "పుటుక్కు జరజర డుబుక్కుమే"


ఓపాక పై బూడిదగుమ్మడి పాదుపాకి 

ఓ కాయ కాసింది. 

ఆ పాక చూరు కింద రాటకి 

ఓ మేక కట్టేసి ఉంది.

ఒకనాడు 

ఉర్వారక విబంధనాత్ రీతిని ఆ పాదుకి తొడిమనించి 

ఆ గుమ్మడికాయ 

పుట్టుక్కున విడిపోయి 

జరజరా కప్పుమీంచి జారి డుబుక్కున కింద ఉన్న మేక నెత్తిని పడితే 

ఆ మేక బాధతో మే... అంది.

ఇదీ కధనం.


దీన్ని ఏ సందర్భంలో వాడతారంటే 

మనకి ఏమాత్రం సంబంధంలేని తప్పుకి 

మనం బాధ పడవలసి వచ్చినపుడు

ఏరా ఏమైంది అంటే

ఆ... ఏవుంది

పుటుక్కు జరజర డబుక్కు మే.. అని బాధని కూడా హాస్యచతురతతో పంచుకునే అమ్మభాష లో 

ఓ అందం ఇది.


02.కాకతాళీయం.

కాక అంటే కాకి

తాళ  అంటే తాటిచెట్టు.


ఓ మాటు 

ఓ తాళపత్ర వృక్షం అంటే 

తాటిచెట్టు పై 

ఓ కాకి 

వాలీవాలగానే దానికి ఉన్న తాటికాయ 

ఠపీమని కిందకి రాలింది. 

అపుడా కాకి 

ఆహా! నేనెంత బలశాలినో కదా!అనుకుందిట.


వాస్తవానికి 

కాకి కాలూనిన బలానికి 

తాటికాయ పడలేదు.

తాటికాయ పడే సమయానికి 

కాకి వాలడం జరిగింది.


నేను కాలితో తన్నితే ఆటో స్టార్టవలేదు. 

అది స్టార్టు చేసే సమయానికి 

నేను తన్నడం జరిగింది. 

ఇదీ కాకతాళీయం అంటే.


ఇది ఎప్పుడు వాడతారంటే 

అనుకోకుండా మనవలన ఏదైనా గొప్ప పని జరిగితే 

ఆ..ఏదో కాకతాళీయంగా జరిగింది కానీ నిజానికి 

నా గొప్పేంలేదు

 అని నిజాయితీ తెలిపే మంచి లక్షణం పెంచే మాతృభాష సౌందర్యం ఇదోటి.


03. సింగినాదం జీలకఱ్ఱ


పూర్వం పల్లెలలోకి పడవలలో 

పోపు సామానులు సుగంధ ద్రవ్యాలైన

జాపత్రి యాలక్కాయిలు ఆవాలు జీలకఱ్ఱ మెంతులు వంటివి అమ్మకానికి కాలవ ఒడ్డున లంగరేసేవారు. 

మేం వచ్చామొహో! అని ఊరంతా తెలపడానికి


శృంగము అంటే 

కొమ్ము బూరలు  తుతుత్తుతూ

 అని పేధ్ధగా ఊదేవారు.


ఓ మాటు 

ఓ కొత్తకోడలు 

ఈ చప్పుడు విని

"అత్తా ఏమిటీ ధ్వని "అని అడిగితే 

ఆ అత్త

ఆ ఏవుంది 

"శృంగనాదం జీలకఱ్ఱ" 

ఏంలేదు లే కోడలా అందిట.

అది కాలక్రమంలో 

సింగినాదం జీలకఱ్ఱగా మారింది. 


ఇది ఏ సందర్భంలో వాడతారంటే

విషయం ఏమీ లేకుండా పెద్ద ఆర్భాటం చేసేప్పుడు వాడే అమ్మపలుకుల చురక ఇది.


04. కొండ బండ కుండ గుర్తులు.


మా చిన్నతెలుగు మాస్టారు. నాకేదైనా తెలుగులో గుర్తుండక పోతే 

గుడ్డిబట్టీ అంటే గాఠిగా కళ్ళుమూసుకు బట్టీయం వేయమనేవారు. 


అప్పటికీ రాక పోతే ..

అంటే 

ఎలాంటివంటే

పద్యాల పక్కన 

కం

చం

ఉ 

అని వ్రాసి ఉండేవి ఇవేంటో నాకు తెలిసేది కాదు.

అపుడాయన అవి పద్యాలలో రకాలురా!అని అంటూ


కం

కందము

చం

చంపకమాల

ఉత్పలమాల

మత్తేభము 

అని కుండగుర్తు పెట్టుకో అనేవారు.


ఈ కుండ కొండ బండ గుర్తు అనే పలుకుబడి ఎలా వచ్చిందంటే.


పూర్వం 

ఓ కామందుకి 

ఓ పొలం ఉండేది.

దానికి ఓ పాలేరుని పెట్టాడు.

వాడికి అవగాహనా లోపం ఎక్కువ

అందుకే

ఆ కామందు

"ఒరె..మన ఊరి ఉత్తరాన ఓ కొండ కనపడుతుందా 

ఆ కొండ కి కిందనున్నదే 

మన చేను. 

అని


ఒరేయ్  

ఆ కొండకింద ఓ పేద్ద బండ పక్కన ఉన్నదే మన పొలం అనో

బండ కొండ గుర్తులు చెప్పేవాడు


ఇంకా వాడి

మట్టిబుఱ్ఱకి తట్టకపోతే


ఒరేయ్

ఆ కనిపించె కొండ కింద ఓ చేలో 

ఓ రాటకి 

ఓ కుండ బోర్లించి దిష్ఠిబొమ్మగా

 నా నెత్తిన ఉన్నట్టు

ఆ కుండగుండుకీ మూడు నామాలుంటాయి

అదే మన చేను. అని 

కుండ బండ కొండ గుర్తులు,రా

అని చెప్పేవాడు.


ఇది ఏ సందర్భంలో వాడతారంటే


కష్ఠమైనవి

సులువుగా గుర్తుపెట్టుకోడానికి

యమాతా రాజభానస ల వలె తేలికగా

చెప్పే సులభ బోధనా పద్ధతులు,నేర్పే మాతృదేవోభవ భాష మన తెనుగుభాష


చివరిగా..


05. గాడిదగుడ్డు

కంకరపీసు


ఓ మాటు ఓ ఆంగ్ల దొరగారిదగ్గర

రాజబాబు వంటి 

ఓ సేవకుడు

అల్లు వారి వంటి 

ఓ దుబాసీ పనిచేస్తూ ఉండేవారు.


ఆ ఇంగ్లీషు దొర తరచూ

GOD IS GREAT..HE

CONQUARD PEACE

అంటూ ఉండేవాడు.

అంటే 

దేవుని గొప్పతనం వలన అతను విజయంతో శాంతి పొందాడు

అని వారి మాతృభాషలో అంటూంటే


ఈ రాజబాబుకి అర్థం కాక

అల్లు రామలింగయ్యని 


సారూ! 

ఆ దొరవారు

 పదే పదే ఏంటండీ అంటూంటారు? అని అడిగితే


తనకీ తెలియని దానిని తెలీదని ఒప్పుకోలేని 

ఆ అల్లు దుబాసి


ఏం లేదురా!

గాడిదగుడ్డు

కంకరపీసు

అని గడుసుగా తప్పించుకునే సమయస్ఫూర్తి నేర్పే  అమ్మ గడసరి భాష మన తెలుగు భాష


ఇది ఏ సందర్భంలో వాడతారంటే

తనకి కూడా తెలీని ఓ విషయాన్ని తనకన్నా చిన్నవారి

ముందు తెలీదు అని ఒప్పుకోడానికి చిన్నతనంగానో అహమో అడ్డొచ్చినపుడు

ఆ.. గాడిదగుడ్డు. నోర్మూసుకో అని తప్పించుకుంటారు నేటికీ కొందరు.


ఇవీ ఈ పూట తేనీటి ☕వేళ మనకే సొంతమైన మన తెలుగు పడికట్లు.


కాసేపు అమ్మభాషలో అమ్మతో మాట్లాడితే ఎలా ఉంది? అందుకే తేనె కన్నా తీయని కమ్మనైనది మన అమ్మభాష.


అమ్మతో వీలైనంత ఎక్కువసేపు మాట్లాడండి

కనీసం 

అమ్మభాషతో ఐనా వీలున్నపుడల్లా సావాసం చేయండి

పాఠకులకి 

నమోవాకములతో

కల్పనలు కాదు .

 మారుతున్న  వివాహ సాంప్రదాయాలు .


పూర్వం  ఆడపిల్ల  తండ్రి ఫలానా  ఊరిలో  ఫలానా  వారి అబ్బాయి  ఉన్నాడని తెలుసుకుని వారి దగ్గర  బంధువులను కాని , ఆప్తులైన స్నేహితులను కాని  వెంట బెట్టుకుని వరుని  ఇంటికి  వెళ్ళి వరుని తల్లిదండ్రులను , వారి ఇంట ఉండే బంధువులను కలిసి , వరుని  కుటుంబ  స్థితి గతులు , సాంప్రదాయలను  అన్నీ పరిశీలించి  తనకు నచ్చిన పక్షంలో  వరుని మరియు  వరుని  తల్లిదండ్రులను  తమ కుమారైను  పెళ్ళి చూపులు చూడటానికి  తమ ఇంటికి రావలసినదిగా ఆహ్వానించేవారు.


తర్వాత మంచిరోజు  చూసుకుని  వరుడు అతని తల్లిదండ్రులు  కొంతమంది  ముఖ్య బంధువులు  కలసి  వధువు ఇంటికి  వెళ్ళి  పెళ్ళి కుమార్తెను  చూసి అక్కడ వధువు  తల్లిదండ్రుల  స్థితిగతులు , సాంప్రదాయాలు  పరిశీలించి , ఇరు పక్షముల వారికి  నచ్చిన పక్షములో  ముందడుగు వేసేవారు.


ఇప్పుడు  నూటికి  80 శాతం కుటుంబాలలో  ఆ పద్ధతులు  మచ్చుకు కూడా  కానరావడం లేదు.


వధువు తరపు  వారెవరూ  వరుని ఇంటికి  వెళ్ళటం , పెళ్ళి చూపులకు ఆహ్వానించడం మరుగైపోయింది .


ఇప్పుడు  వరుని తరపు  వారు  వధువు  వివరాలు  తెలుసుకుని  మా అబ్బాయి  ఉన్నాడని  ఫోను  చేస్తే  వధువు తరపు వారి నుండి  వచ్చే సమాధానాలు  -----


- మేము చాలా busy గా ఉన్నామండీ. మీరు మరోసారి  ఫోను చేయండి .


-  అలాగా మీ వివరాలు చెప్పారుగా . మేం ఫోను చేస్తాం లేండి .


-  మాటి మాటికి  ఎందుకండీ ఫోను చేస్తారు. మేమే చేస్తామన్నాముగా .


- మా అమ్మాయి  పెళ్ళయ్యాక Joint Family లో  ఉండనంటోంది . విడిగా ఉండడం మీ కిష్టమైతే  ముందడుగు  వేస్తాం.


-  మీకు రెండు కార్లు ఉన్నాయంటున్నారు . ఒక కారు మీ అబ్బాయి మరో కారు మా అమ్మాయి  వేసుకుని  ఆఫీసుకు వెడితే మీ వారెలా ఆఫీసుకు వెడతారు ?


పైన  నేను రాసినవన్నీ కల్పనలు కాదు .


అక్షరాలా  అనుభవ పాఠాలు .


" వరుడు  వధువు  మధ్య రెండు సంవత్సరాల వ్యత్యాసమునకే వద్దంటున్నారేమిటి ?  మన కాలంలో దాదాపుగా  ఇరువురి మధ్య ఎనిమిదేళ్ళు తేడా లేదా ?  అంత దాకా ఎందుకండీ  మా అమ్మాయిలకు అల్లుళ్ళకు  ఆరేళ్ళు  తేడా ఉంది. మేము కూడా  ఈ మధ్య కాలంలోనేగా వివాహం చేసింది " అని  నా బోటి గాడెవడైనా వధువు తండ్రికి  నచ్చచెప్ప బోతే  వధువు తండ్రి నుండి వచ్చిన సమాధానం "  మీరు పెళ్ళిళ్ళు  చేసినప్పుడు  మీ అమ్మాయిలు మీ మాట విన్నారేమో ? ఇప్పుడు మాకు చేతకాదు " అని వెంటనే ఫెడేల్ మని మొహం బద్దలు కొట్టినట్లు వధువు తండ్రి జవాబు .


సిగ్గులేక వధువు ఇంటికి  వెడితే , పిలవని పేరంటానికి దక్షయజ్ఞమునకు వెళ్ళిన సతీ దేవిలా వరుని తరపు వారు అవమానాలను ఎదుర్కొంటున్నారు .


కనీసం  వరుని వివరాలు తీసుకోకుండా  సాగనంపుతున్నారు .


మీరు మా ఇంటికి  రావనక్కరలేదని చెప్పకనే చెబుతున్నారు .


పది సంవత్సరాల  క్రితం  మేము ముగ్గురమ్మాయిల వివాహాలు చేసిన వారమే .


మా పిల్లలూ విదేశాలలో ఉన్నారు . ఉద్యోగాలు  చేసుకుంటున్నారు కూడా .


మరి  వీళ్ళందరూ ఎందుకు  ఏం చూసుకుని  అహంకరిస్తున్నారు ?


నడమంత్రపు సిరా ?


లేదా అమ్మాయిలకు  నచ్చ చెప్పలేక పోతున్నారా ?


నిజానికి  ఆ రోజుల్లో  ఇరు పక్షముల  తల్లిదండ్రులదే  వివాహాన్ని నిశ్చయించడంలో అంతిమ నిర్ణయం.


ఇప్పుడు  కేవలం వారి పాత్ర రబ్బర్  స్టాంపు లాంటిది .


అన్నీ నిర్ణయించుకున్న  తర్వాత ఆఖరున తెలిసేది  వారి తల్లిదండ్రులకే .


చివరికి  పరువు దక్కించు కోవడానికి  ఆ  పెళ్ళి చేసి  చేతులు  దులుపుకుంటున్నారు .


ఇక  ఆ కాపురం  సవ్యంగా  సాగడమనేది  ఆ దంపతుల  EGOS  మీదే  ఆధారపడి  ఉంటోంది .


వారిలో  హెచ్చు తగ్గుల భావనల వల్ల అపార్ధాల వల్ల  చాలా మంది కాపురాలు  మూనాళ్ళ ముచ్చటే అవుతోంది .


కాలం ఎల్ల వేళలా ఒక తీరుగా ఉండదు .


నాడు వరుని తల్లిదండ్రుల ముందు  చేతులు కట్టుకుని నుంచున్నారు వధువు తల్లిదండ్రులు .


నేడు  మా అబ్బాయికి  పెళ్ళే కాదేమో అని ఆందోళన పడి  వధువు తల్లిదండ్రుల  షరతులన్నిటికీ తలవొగ్గుతున్నారు .


కానీ  కాలం ఎప్పుడూ  ఒక్కలా ఉండదు .


రాజు  బంటౌతాడు. బంటు రాజౌతాడు.


ఈ విషయం  ఇరుపక్షాల వారు గ్రహించాలి .


ముఖ్యంగా  ప్రస్తుతం  వధువు తల్లిదండ్రులు  ఈ విషయం ఆలోచించాలి .


ఈ రోజుకు  అలనాటి  సాంప్రదాయాలను పాటించే  ఉత్తములకు  శతకోటి  వందనములు .

Copied from Vasu Gulf Journalist  🧱 wall

*శ్రీ దేవి భాగవతం - 5 వ అధ్యాయము*

 *శ్రీ దేవి భాగవతం - 5 వ అధ్యాయము*


*శ్రీ హయగ్రీవావతార వర్ణనము*


*ఋషులనిరి:* ఓ సూత మహర్షీ! లోకములకు వింత - యచ్చెరువు గొలుపు కత మాకు వినిపించితివి. అది విని మా మనంబులు సంశయ సాగరమున కొట్టుమిట్టా డుచున్నవి. ఆ భగవానుడు మాధవుని తల శరీరమునుండి తెగిపడినదనియు ఆ విశ్వకర్త యగు జనార్దనుడు హయగ్రీవ రూపము దాల్చెననియు అంటివి. దేవతలెల్లరూ దేవ దేవుని ప్రస్తుతింతురో విబుధులెల్లరు సర్వము తానయైన యే విష్ణువు నాశ్రయింతురో అతడే జగన్నాథుడు - ఆదిదేవుడు - సర్వకారణ కారణుడును. అట్టివాని తలయును ఎట్టి విధియోగమున దెగిపడినది? ఆ కథయంతయును మాకు విశదముగ తెలుపుము.


*సూతుడిట్లనియె*: ఓ మునులారా! దేవదేవుడును పరమతేజస్వియగు శ్రీ మహావిష్ణుని పావన చరిత సావధానముగ చెవులార వినుడు. సనాతనుడును భగవానుడు నగు జనార్దనుడు తొల్లి పదివేలేండ్లు భీకరమైన పోరాటము సలిపి మిక్కిలి యలసట జెందెను. అపుడతడు సమప్రదేశమున పద్మాసనముపై కూర్చుండి ఎక్కు పెట్టిన విల్లు తన కంఠ పురోభాగమునకు నానించు కొని అలసట చెంది యుండుటచే వింటికొనపై తన మేనిబరువంతయు నుంచి నిదురించెను. కొంతకాలము గడిచిన పిమ్మట నింద్రుడు మున్నగు దేవతలెల్లరును బ్రహ్మతోగూడి యొక యాగము సేయదలంచిరి. మహా యజ్వయగు విష్ణువే దేవకార్యము నెరవేర్చుటకును యాగాధిపత్యము వహించుటకును సమర్థుడని తలచి బ్రహ్మాదులు జనార్దనుని దర్శింప వైకుంఠమేగిరి.


అచట వారికి హరి కనబడలేదు. వారు జ్ఞానదృష్టితో విష్ణుడున్న జాడ నెఱిగి యచ్చోటి కరిగిరి. నిశ్చలముగ యోగనిద్రలో మునిగిన జగత్పతిని విభుని ఈశానుని గనుంగొనిరి. బ్రహ్మ రుద్రుడు మొదలగు దేవతలు పరమచింతాక్రాంతులైరి. అంత నింద్రుడు వారి కిట్లనియె : ఓ సురలారా! ఇపుడు మన కర్తవ్యమేమి? ఆ హరికి నిద్రాభంగము చేయుట తగదు. అది మహాదోషము. కనుక మీరలెట్లేని యజ్ఞకార్యము కొనసాగింపుడు. బ్రహ్మ యిట్లనియె : ''నేను చెదపురుగును పుట్టించి యీ నేలనున్న వింటికొనను తినుటకు దాని నాదేశింతును. చెద పురుగు వింటికొనను తినగా నారి తెగును. అపుడు గాని యీ దేవదేవుడు నిదురనుండి మేలుకొనడు! దానివలన దేవకార్యము నెరవేరును. ఇందు సంశయము లేదు.'' అని దేవ దేవుడగు బ్రహ్మ చెద పురుగు నాదేశించెను. చెద పురు గిట్లనెను : రమాపతియు జగద్గురుడునగు దేవదేవునకు నేను నిద్రాభంగమెట్లు గల్గింతును? *ఎవ్వరికైనను నిద్ర చెడగొట్టుట సత్కథలు వినకుండ చేయుట భార్యా భర్తల నడుమ కలతలు పుట్టించుట తల్లినుండి శిశువును వేరు చేయుట - ఇవి బ్రహ్మహత్యాసమములని స్మృతులు వక్కాణించును. ఆ దేవదేవుని నిద్రాసుఖమున కెట్లు నేను భంగము కల్గింతును? దానిని తినుట వలన నాకు వచ్చెడి ఫలితమేమి? నేను పాపినగుటయే కదా? లోకములన్నియు తఱచుగ స్వార్థపీడితములై ఘోర దురితములు చేయు చుండును. అట్టి స్వార్థ మాశించియే నేనును* తినవలయునా?


బ్రహ్మయిట్లనియె : యాగములో నీకు కొంత భాగమేర్పరతుము. కనుక నీవు వెంటనే విష్ణుడు మేల్కొనునట్లు చేయుము. మా కార్యము నెరవేర్చుము. యజ్ఞములందు వేల్చునపుడు హవిస్సునుండి కొంత ప్రక్కలకు బడును. అది నీ భాగమని తెలిసికొనుము. ఇక త్వరగ నీ పని కొనసాగింపుము.


 *సూతుడిట్లనియె* : ఆ విధముగ బ్రహ్మ పలుకగా చెదపురుగు వెనువెంటనే వింటి నారిని కొరికెను. వెంటనే వింటి నుండి నారి తెగిపడెను. తత్ఫలితముగ విల్లు నేలపై బడినది. పడుటయే తడవుగ ఘోర శబ్ద ముప్పతిల్లెను. అది విని దేవతలందఱును భయపడిరి. బ్రహ్మాండము దద్దరిల్లెను. భూమి కంపించెను. సంద్రము లల్లకల్లోలమందెను. జలజంతువు లదరిపడెను. పెనుగాలులు వీచెను. గిరులు గ్రక్కదలెను. దుఃఖ సూచకములును మహోత్పాతములునగు ధూమ కేతువులు రాలిపడెను. ఎల్లదెసలు ఘోర రూపము దాల్చెను. సూర్యు డస్తమించెను. ఇట్టి దుర్దినమున నేమి మూడునో కదా! యని వేల్పులెల్లరు పెల్లుగ జింతిల్లిరి.


అమరులిట్లు చింతించు చుండగనే దేవదేవుడగు విష్ణునియొక్క కిరీట కుండలములతో శోభిల్లు తల అదృశ్యమయ్యెను. కొంతవడికి వెఱపుగొలుపు పెంజీకట్లు విరిసెను. బ్రహ్మరుద్రాది దేవతలపుడు తలలేని హరి మొండెమును గని విస్మితులై శోకసాగరమున మునిగి యిట్లు వాపోయిరి : జగన్నాథా, ప్రభూ! ఇది నీ యమానుషలీలా రూపమా యేమి? సనాతనా! దీనివలన వేల్పులకందఱకును వంత మిక్కుటమైనది. నీవు అచ్ఛేద్యుడవు - ఆదాహ్యుడవు - అక్లేద్యుడవు - అశోష్యుడవు - నిత్యుడవు. ఇంతటి నీ తల తెగుట కేదేవతమాయ హేతువో కదా! నీ విటుల తలలేకున్నచో దేవత లెల్లరు వసువులు గోల్పోవుదురు. మాకు నీయందిం కెటుల ప్రీతి గల్గును? కావున మేము మా స్వార్థము గోరి శోకించు చున్నాము. రమావల్లభా! ఇంతటి ఘోరమే దైత్యులచే గాని యక్షులచేతగాని రాక్షసులచే గాని సాధ్యము కాదు. ఇది దేవతల వలననే జరిగి యుండును. కావున నెవరిని నిందించగలము? ఎవరిని దూషించగలము! దేవేశా! మేమెల్ల దేవతలము పరతంత్రులము. మేమిపుడేమి చేయవలయునో యెచటి కేగవలయునో - మూఢ మతులమగు మాకింక శరణ్యమెవ్వరో ఏమియును దోచుట లేదు. విష్ణువు మాయా పతి యగుట వలన సత్వరజస్తమ శ్శక్తులు గల మాయ యీ జగద్గురుని తల ఛేదింపనోపదు. శివుడు మున్నగు దేవతలీ తీరున వాపోవుచుండిరి. అదంతయు విని వేదవిదుడగు దేవగురుడు వారి బిట్టేడ్పు చల్లార్పదలచి వారి కిట్లు పలికెను : ఓ మహాభాగులారా! ఇట్లు రోదించుటవలన నేమి ప్రయోజనము? ఇపుడెల్ల విధముల చక్కని బుద్ధితో నుపాయ మాలోచించుటయే మన కర్తవ్యము. ఇంద్రా! అదృష్టము పురుషకారమును రెండును సమానములే. కనుక మతిమంతుడు తొలుత నుపాయ మాలోచించ వలయును. పిదప తప్పక దైవ మనుకూలించును.


*ఇంద్రు డిట్లనెను* : దైవమే బలవత్తరమైనది. పురుషార్థ మనర్థమునకు దారితీయును. అది వ్యర్థము. మనకండ్ల యెదుటనే విష్ణువంతటి వాని తల తెగిపడెనుగదా! బ్రహ్మ యిట్లనియె: కాలానుగుణముగ మంచిగాని చెడుగాని యేది ప్రాప్తించిన దానిని తప్పక యనుభవించి తీరవలయును. ఎట్టివాడును దైవమును మీరలేడుగదా! దేహధారియగు జీవుడు సుఖ దుఃఖము లనుభవించి తీరవలయును. ఇందు సందియమే లేదు. నేనును కాలబద్ధుట నగుట చేతనే నా తల శివునిచేత ద్రుంప బడినది. శాప కారణమున హరుని లింగము పతనమందినది. నేడును హరి తల తెగి లవణ సాగరమున బడినది. దేవేంద్రునంతటి వానికిని సహస్రభగుడగు దుఃఖము తప్పలేదు. అతడును పదభ్రుష్టుడై మానస సరస్సులో తల దాచుకొనెను. ఇంతటి వారే దుఃఖములు గఱచు చుండగ నిక దుఃఖించని మనుజు డెవ్వడు? ఈ ఘోర దుఃఖ సంసార సాగర మేరికిని దాటశక్యము గాదు. కాన తెలివి గల మానవుడు ఆపదలో దుఃఖింపరాదు. అందుచే మన మిపుడా మహామాయ శ్రీ విద్యామయి సనాతన పరా ప్రకృతియగు నిర్గుణదేవిని సంస్మరింతము గాక. ఆ దేవ దేవియే మనయెల్ల కార్యకములు చక్కగ సమకూర్చ గలదు. ఆమెయే బ్రహ్మ విద్య - జగద్ధాత్రి - విశ్వజనయిత్రి - చరా చరాత్మకమైన ముల్లోకములకు తల్లి. ఆ లోకములన్నియు నామె చేతనే నిలిచి వ్యాప్తమై వెలుగొందుచున్నవి.


*సూతు డిట్లనియె*: అని యీ ప్రకారముగ బ్రహ్మ దేవతలతో పలికెను : పిదప బ్రహ్మ వేదముల నాదేశింపగ నవియు దేవకార్యము సాధించుటకు శరీరములు దాల్చి యతని యెట్టయెదుట నిలుచుండెను. మీరు సర్వ కార్యములు సఫల మొనరించి పరాభట్టారికయు పురాతన బ్రహ్మ విద్యయు గూఢాంగియు మహామాయయు నగు మహాదేవిని సంస్తుతింపుడు అని వేదములను బ్రహ్మ యాదేశించెను. బ్రహ్మ వచనానుసారము సర్వాంగ సుందరములైన వేదములు విశ్వస్థితి కారణియు జ్ఞానగమ్యయునగు మహామాయ నీ విధముగ సంస్తుతింప దొడగినవి : *సకల భూతేశ్వరీ! శివకామినీ! విశ్వజననీ! శివాత్మికా! మహామాయాదేవీ! నీకు మా నమస్కారములు! నీవే సర్వభూతములకు మూలాధారమవు. నీవే ప్రాణుల ప్రాణమవు. శ్రీ -క్షమ - బుద్ధి - కాంతి - శాంతి - శ్రద్ధ - మేధ - ధృతి - స్మృతి - ఇవన్నియు నీవే. ప్రణవమందలి బింద్వర్ధ చంద్రస్వరూపమగు నర్థమాత్రవు నీవే. శ్రీగాయత్త్రీ దేవతవు సప్త వ్యాహృతులు జయ - విజయ - ధాత్రి - లజ్జ - కీర్తి - దయ - స్పృహ - ఇవన్నియు నీవే. దయామృత తరంగిణీ! విశ్వమాతా! ముల్లోకముల సృష్టించు భవభవ భంజనీ! వరేణ్యా! మహావిద్యా స్వరూపిణీ! వాగ్బీజ నివాసినీ! ఓ అమ్మా! నిన్ను రేయైన పగలైన సంస్తుతింతుమమ్మా హరిహర బ్రహ్మలు - ఇంద్రాగ్నులు! రవి - సరస్వతి - లోకాధిపతులును నీచేతనే సృజింపబడిరి. ఇంతేకాదు. ఈ స్థావర జంగమముల కన్నింటికి నీవే జనయిత్రివి! నీవీ జగములనెల్ల నిర్మించనెంచి త్రిమూర్తులను సృజించి వారిచే సృష్టి స్థితి లయము లొనరింప జేయు చున్నావు. ఐనను నీవేకాత్మవై తేజరిల్లుటచేత నీలో నీ సంసార వికార వాసనలు లేశమాత్రమున పొడసూపవు*


నీ యనంత నామములును నీ దివ్య స్వరూపమును నీ వస్తుతత్త్వమును నెఱుంగ జాలినవాడు భువనంబు లన్నింటిలో నెవడును లేడు. ఒక చిన్న నీటి పడియను దాటజాలనివాడు సత్య ప్రతిజ్ఞుడై మున్నీటి నెట్లు దాటగలడు? ఈ యెల్ల వేల్పులం దొక్కండును నీ యనంత దివ్యవిభూతు లెఱుంగ గలవాడు లేనేలేడు. నీ శ్రీమాతృదేవినామ మెంతయో మధురాతిమధురము, ఈ మిథ్యా జగముల నెల్ల రచించుటకు నీవొక్కతెవే చాలు ననుటకు వేదవాక్కులు ప్రమాణభూతములు. నీవే కోర్కెలును లేనిదానవు. ఎల్ల భువనములకు కారణ భూతురాలవు. కాన నో భగవతీ! నీ విచిత్ర చరిత్ర మా మది కద్భుతముగ దోచుచున్నది. వేదములు 

అ న్నియు నొక్కటైనను మనోవాక్కుల కతీతమైన నీ మహోజ్జ్వల ప్రతిబ నెఱుగలేవు. ఇక మేమేమి గ్రహింపగలము? ఈ విష్ణు శిరము అదృశ్యమగుట నీకు తెలియదా? కాక నీవెఱింగియు తిరిగి తెలిసికొన దలంతువా? కాదేని మధువైరి బల మెంతయో తెలిసికొన జూతువా? హరియం దేదేని బలవత్తరమైన దోషమున్నదందుమా? అదియును సరికాదు, ఏలన - నీ పావన చరణ కమలములు గొల్చువారిని పాతకము తాకనైన తాకలేదు. ఓ విశ్వమాతా! ఈ హరి యెల్ల వేల్పులలో చాల దొడ్డవాడు. ఇతని విషయ ముపేక్షింప దగదు. ఇతని తల తెగిపడుట చూడగ నబ్బురముగ నున్నది. మదిలో వంత గల్గించుచున్నది.


*ఓ అమ్మా! ఈ చావు పుట్టుకల వలని వంతలనెడి తీగలను త్రుంచుట కీవే సమర్థురాలవు. మరియు మధుసూదనుని తల మరల నతికించుటకు జాగేల యెనరింతువో తెలియుటలేదు. దేవతలును దోష యుతులే యని యెంచి వారి దోషమునకు ఫలముగ హరిశిరమును ద్రుంచితివో! లేక నరుల పాపము రాజునకు సంక్రమించునుగాన నరుల - దేవతల పాతకముల వలన నితని తల తెగిపడినదో! కాక మధుకైటభులను చంపుటచే నితనికి గర్వము బలిసెనని తలచి యతని తలను ఛేదించితివో! దీని కారణమేమో మేమూహింపజాలకున్నాము*

 *భవానీ! రణమున నోటుపడిన రక్కసులు విమల తీర్థములందు తపములు సేయగ వారికి వరము లొసంగితివో! కాదయేని తలలేని వాసుదేవునిగని వినోదింపదలచితివో! నీవిందే మనుకొనుచున్నావో కాని మాకు మాత్రము హరి తల కనబడుట లేదు. సనాతనీ! కానిచో లక్ష్మిపై కోపించి యిట్లొనర్చితివో! ఐనచో పతిలేని యామె మొగమెట్లు చూడగలవు? నీ యంశమున బుట్టిన కడలి రాపట్టి చేసిన నేరమును క్షమింపవలయును* గదా! కావున నిపుడీ హరిని లేపి మాకానందము జేకూర్చుము తల్లీ!


మేము కార్యకుశలురము. ప్రభావ సంపన్నులము. దేవతలము. రేయైన పగలైన నీ చరణములే నమ్ముదుము. ఓ దేవదేవీ! ఈ లోకాధినాథుని బ్రతికించి మమ్మీ శోకవారిధి నుండి దాటించుము. శ్రీహరి శిరమేమయ్యెనో మాకు దోచుట లేదు. మేమిక మనుట యెట్లో తెలియుట లేదు. అమరులకు జీవనదాన మొసగు దివ్యామృత మూర్తిని నీవే కదా! ఈ జగములకు బ్రతుకు వెలుగు చూపింపగదవే! సూతుడిట్లనియె ; ఈ ప్రకారముగ సాంగములగు వేదములతో సామగులు సామగానము సలిపి తన్ను సన్నుతింపగా గుణాతీత - మహేశ్వరి - పరమమాయ పరమానంద భరితు రాలయ్యెను. అంతలో నంతరంగముల కభిరామమైన యశరీరవాణి సుస్వరమున వేల్పుల నుద్దేశించి యిట్లు పలికెను. అమరులారా! నేను ప్రాజదవుల చేత ప్రస్తుతింపబడి ప్రసన్నమైతిని. మీరలు చింత - వంత వదలుడు. స్వస్థులుగండు, నా మాట నమ్ముడు. ఎవ్వడీ భూమిపై నన్నీ దివ్యస్తోత్రమున సంస్తుతించునో, భక్తి యుక్తుడై దీనిని చదువునో, వానియెల్ల కోర్కులు తప్పక ఫలించును. వేదస్తోత్రము వేద తుల్యము. కనుక నెవడేని మూడు కాలములందును పరమభక్తి నిండార నీ వేదస్తోత్రము పారాయణమొనరించునో వాడు దుఃఖరహితుడై సుఖించగలడు.


లోకమందు కారణము లేక కార్యము లేదు. కనుక నీ హరి శిరము తెగుటకు గల కారణమాలింపుడు. మున్నొకప్పుడు కడలిరాచూలి హరిప్రియురాలు హరి చెంతనే యుండెను. అత్తఱి మనోరమమగు నామె పద్మవదనముగని హరి నవ్వెను. నన్ను జూచి యూరకే మాధవుడేల నవ్వును? తప్పక యేదేని వికారము నా మొగమందా ప్రభునకు బొడగట్టి యుండనోపును. అకారణముగ నవ్వేల వచ్చును? ఇతని నెమ్మదిలో నన్య వనిత నాకు సవతిగ నిల్చి యుండనోపునని లచ్చి తలంచెను. ఆమె మేనియందప్పుడు తామస శక్తి యావేశించి యుండెను. అందుచే నా మహాలక్ష్మి తమోగుణముచే కోపవంతురాలయ్యెను. ఆ సమయమున దైవ యాగమునను దేవకార్యమునకు నామె శరీరమందు దారుణమైన తామస శక్తి నిండి మెండుకొని యుండినందున తదావేశముచే ''నీ తలతెగి పడిపోవుగాక!'' యని లక్ష్మి మెల్లగ హరితో ననెను.


మునుపు మహావీరుడగు హయగ్రీవుడను దైత్యుడుండెను. అతడు సరస్వతీనదీ తీరమున ఘోరముగ తపమొనర్చెను. అతడన్నపానములు సుఖభోగములు విడనాడి విజితాత్ముడై మాయాబీజమగు నేకాక్షర మంత్రరాజమును జపించుచు లలిత భూషణ భూషితమగు నా తామసిక శక్తి ననుధ్యానించుచు వేయేండ్లతి దారుణమైన తపస్సు చేసెను. అతడెట్టి తామసరూపమును ధ్యానించెనో నేనదే తామసరూపమున నతని యెదుట ప్రత్యక్షమైతిని. సువ్రతా! నీకు వరమొసంగుదును. ఏదేని గోరుకొమ్మని సింహాసనాసీననై నేనతనితో దయదలచి పలికితిని. అతడు నా మాటలు విని బత్తితో నాకు ప్రదక్షిణించి సాగిలపడి మ్రొక్కెను. అతడు నా దివ్యస్వరూపముగాంచి కనులనిండ నానంద బాష్పములునిండ నన్ను కీర్తించెను. హయగ్రీవుడిట్లనె : కామమోక్షములొసగు మహామాయాదేవీ! భక్తాసు గ్రహస్వరూపిణీ! సృష్టి స్థిత్యంతకారిణీ! నీకు నమః సహస్రములు. నింగి గాలి నిప్పు నీరు నేలలకును శబ్దస్పర్శరూపరస గంధములకును నీవే మూలమైనదానవు. త్వక్చక్షుః శ్రోత్ర జిహ్వాఘ్రాణములలో వాక్పాణి పాద పాయూపస్థలును శక్తి చేత తమతమ పనులు జేయుచున్నవి.


శ్రీదేవి యిట్లనియెను : ఓ దానవా! నీ యద్భుత తపమునకు నీ పరభక్తికిని మెచ్చితిని. నీ కెట్టి కోర్కియున్నను తీర్చెద. వరమడుగుము. హయగ్రీవుడనియె : అమ్మా! సురాసురుల కజేయుడనై యోగినై యమరుడనై చావకుండునట్లు వరము నా కిమ్ము. శ్రీదేవి యిట్లనియె : పుట్టిన ప్రాణి తప్పక గిట్టును. గిట్టినదెల్ల తిరిగి పుట్టును. ఇది లోకమర్యాద. దీనికి విరుద్ధముగ నెట్లు జరుగగలదు? కావున చావు తప్పదని నిశ్చయించుకొని మరేదేని వరమడుగుము. హయగ్రీవుడనె : తల్లీ! నా చావు కేవలమొక్క హయగ్రీవుని వలననే జరుగవలయును. ఇతరుని చేత కూడదు. ఇదే నా కోర్కి. నాయీ కోర్కి తీర్చుము. శ్రీదేవి యిట్లనియె : ఓ మహాభాగా! నీవిక నీయింటికేగి సుఖముండుము. హయగ్రీవుడుగాక యితరునివలన నీవు చావవు అని పరాంబిక మహామాయ వరమొసగి అదృశ్యయయ్యెను. ఆ రక్కసుడును ప్రమోదించి తన యింటికేగెను. నాటినుండి యతడు వేదవిప్రులను మునినరులను బాధింపదొడగెను. ముల్లోకములలో నతని నెదుర్కొని తెగటార్చువాడెవ్వడును లేకుండెను. కావున దేవతలారా! మీరిపుడొక గుఱ్ఱము తలతెచ్చిఇండు. దానినీ మొండెమున కతికించి హరిని త్వష్ట మరల బ్రతికించును. అపుడా శ్రీ హయగ్రీవ భగవానుడా పాపిష్ఠుడును క్రూరుడునగు హయగ్రీవ దానవుని దప్పక దునుమాడగలడు. సూతుడిట్లనియె : ఈ విధముగ శ్రీభువనేశాని పలికి మౌనమూనెను. దేవతలును మోదమలర దేవశిల్పియగు త్వష్టతో శ్రీహరి మొండెమునకు గుఱ్ఱము తల నతికింపుము. ఆ శ్రీ హయగ్రీవుడు హయగ్రీవుని దెగటార్చును. ఇట్లు దేవతల కార్యము సాధింపుము అని వేడిరి. సూతుడిట్లనియె : ఆ దేవతల వచనములు విని త్వష్ట సంతసించి వెంటనే వారి సమక్షముననే యొక్క హయము తల ద్రుంచి దానిని హరిమొండెమున కతికించెను. అంత మహామాయ దయవలన హరి హయగ్రీవుడయ్యెను. కొన్ని దినముల పిదప నా శ్రీ హయగ్రీవుడు యుద్ధమున మదగర్వితుడు దేవవైరియగు హయగ్రీవుని నేలగూల్చెను. ఈ సుందరమైన కథను వినిన మానవుడు సర్వదుఃఖములు బాసి సుఖించగలడు. సందేహము లేదు. ఈ శ్రీ మహామాయాదేవి చరిత్ర పవిత్రము, పరమ పావనము, పాపనాశనము. దీనిని చదివిన వారికిని వినిన వారికిని మేలి కలుములు చేకూరును. ఇది ముమ్మాటికి నిజము.


*ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ ప్రథమస్కంధే హయగ్రీవావతారకథనం నామ పంచమోధ్యాయః*


*ఇది శ్రీ దేవీ భాగవత మహాపురాణ మందలి ప్రథమ స్కంధమున*

*శ్రీ హయగ్రీవావతార కథనమను పంచమాధ్యాయము.*

🙏🙏🙏👍👌😷😷😷🙏🙏

గణపతి తాళం

 గణపతి తాళం


🌸🌸🌸🌸🌸🌸🌸🌸


వికటోత్కట సుందర దంతి ముఖం |

భుజ కేంద్రసుసర్ప గదాభరణం ||

గజ నీల గజేంద్ర గణాధిపతిమ్ |

ప్రణతోస్మి వినాయక హస్తి ముఖం ||


సుర సుర గణపతి సుందర కేశం |

ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం ||


భవ భవ గణపతి పద్మ శరీరం |

జయ జయ గణపతి దివ్య నమస్తే ||


గజ ముఖ వక్త్రమ్ గిరిజా పుత్రం |

గణ గుణ మిత్రం గణపతి నిశప్రియం ||


కరద్రుత పరశుమ్ కంగణ పాణిమ్ కపళిత పద్మరుచిం | సురపతి వంద్యం సుందర డక్తం సురచిత మణిమకుటం ||


ప్రణమత దేహం ప్రకటిత కాలం షట్గిరి తాళం ఇదం,

తత్ తత్ షట్గిరి తాళం ఇదం,

తత్ తత్ షట్గిరి తాళం ఇదం |


లంబోధర వర కుంజా సురకృత కుంకుమ వర్ణ ధరం |

శ్వేత సశృంకం మోదక హస్తం ప్రీతి సపనసఫలం ||


నయనత్రయ వర నాగ విభూషిత,

నా నా గణపతితం,

తతం నయనత్రయ వర నాగ విభూషిత 

నా నా గణపతితం,

తతం నా నా గణపతితం,

తతం నా నా గణపతితం ||


ధవళిత జల ధర ధవళిత చంద్రం,

ఫణి మణి కిరణ విభూషిత ఖడ్గం |(2.1)


తను తను విషహర శూల కపాలం,

హర హర శివశివ గణపతి మభయం | (2.2)


కట తట వికలిత మత జల జలధిత

గణపతి వాధ్యమ్ ఇధం (2)

తత్ తత్ గణపతి వాధ్యమ్ ఇదం,

తత్ తత్ గణపతి వాధ్యమ్ ఇదం ||



తక తకిట తక తకిట తక తకిట తత్తోమ్,

శశి కలిత శశి కలిత మౌళినం శూలినమ్ |


తక తకిట తక తకిట తక తకిట తత్తోమ్,

విమల శుభ కమల జల పాదుకం పాణినం |


ధిక్ తకిట ధిక్ తకిట ధిక్ తకిట తత్తోమ్,

ప్రమధ గణ గుణ కచిత శోభనం శోభితం |


ధిక్ తకిట ధిక్ తకిట ధిక్ తకిట తత్తోమ్,

మ్రిథుల భుజ సరసిజ భిషాణకం పోషణం |


తక తకిట తక తకిట తక తకిట తత్తోమ్,

పనస ఫల కదలి ఫల మొదనం మోదకం |


ధిక్ తకిట ధిక్ తకిట ధిక్ తకిట తత్తోమ్,

ప్రమధ గురు శివ తనయ గణపతి తాళనం |

గణపతి తాళనం !

గణపతి తాళనం !!


🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*🪔శ్రీవేంకటేశ్వర దివ్య చరిత్ర - 5🪔

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🪔శ్రీవేంకటేశ్వర దివ్య చరిత్ర - 5🪔*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


 *వైకుంఠమున భృగువు శ్రీహరి వక్షస్థలమును తన్నుట* 


కైలాసమును వీడి ఆ భృగువు ఉత్కంఠతతో వైకుంఠమునకు వెడలినాడు. బ్రహ్మను పరీక్షించుట జరుగనే జరిగినది. శంకరుని పరీక్షించుట జరిగినది.


శ్రీ మహావిష్ణువును పరీక్షించవలసియున్నది, అందువలననే భృగువు శోభాయమానమగు వైకుంఠమునకు ప్రయాణమై వైకుంఠమును చేరినాడు.


అచ్చట శ్రీమహావిష్ణువుండెడి సొగసు వెలార్చు సుందర మందిరమును ప్రవేశించినాడు.


 ఆహా! ఆ లక్ష్మీనారాయణుల దివ్యస్వరూపములు,


 శ్రీమహావిష్ణువు శేషపాన్పు పై ఠీవిగ పవ్వళించుటలో గల ఆ వంపుసొంపు యెంత చక్కగానున్నది! పవ్వళించియున్న శ్రీమన్నారాయణుని పాదకమలములను లక్ష్మీదేవి తన కర కమలములతో మెల్లమెల్లగ ఒత్తుచున్నది. 


హృదయమున భృగుమహర్షి నారాయణ స్మరణ మొన్నర్చినాడు. తదుపరి ఒక్కసారిగ శ్రీమన్నారాయణుని చెంతకేగి అదరూ బెదురూ లేకుండగ ఆయన పవిత్ర వక్షస్థలమును తన్నినాడు.


శ్రీ మహావిష్ణువు యొక్కవక్షస్థలమును తన్నుట ఎవ్వరునూ, ఎప్పుడునూ చేయ సాహసించని పని దానిని భృగువు చేసినాడు. 


లక్ష్మీదేవి పొందిన ఆశ్చర్యమునకు అంతులేకపోయెను. తనను తన్నినందులకు వైకుంఠవాసుడావంతయు చలించలేదు. 


వీసమెత్తయిన కోపమును పొందలేదు. పైగా తన పాన్పు నుండి దిగి వెడలి భృగుమహాముని పాదములను పట్టుకొని


 ‘మహర్షీ! నేడు నేనెంత ధన్యుడనైతిని, మహాతపశ్శక్తి సంపన్నులగు మీ పవిత్ర పాదధూళి వలన నా శరీరమెంతగానో పవిత్రమైనది. 


అయ్యో! మరచితిని. కుసుమ సమాన కోమలములైన మీ పాదములు నా శరీరమును స్పృశించు ఎంతగా నొచ్చికొనినవో కదా! స్వామీ! ఏదీ మీ పాదములిటు చూపుడు’’ అనిచూచి కొంత ఒత్తెను, 


భృగువునకు పాదమున ఒక కన్ను గలదు. ఆ కంటిని శ్రీమన్నారాయణుడు ఆయన పాదముల నొత్తుచు చిదిపివేసెను.


 పిదప భృగుమునితో ఈ విధముగాననెను. 


‘‘భృగుమహర్షీ! మీ హృదయమున గల అభిప్రాయమును, మీరు వచ్చిన పనిని నేను గ్రహించనే గ్రహించితిని. మీరు ఏ పని నిమిత్తము నా కడకు వచ్చిరో ఆ పని అయినందులకు నేను మిక్కిలిగ ఆనందించుచున్నాను.’’


 ప్రశాంతమయిన, గంభీరమయిన శ్రీమహా విష్ణువు యొక్క పలుకులు భృగుముని పై అమృతపు చినుకులుగనుండెను. 


పాదమున గల కన్నుపోయిన పిదప భృగువున కేదియో నూతనానుభూతి కలిగెను. 


శ్రీమహావిష్ణువు యొక్క పరమశాంత స్వభావమునకు భృగువు లోలోపల మహానందమును పొందెను.


 ఆహా ఎంతటి సాత్త్వికమూర్తి విష్ణుమూర్తి! అనేక విధములైన శక్తి సంపదలున్నప్పటికినీ, తాను వక్షస్థలమున తన్నినప్పటికినీ కించిత్తూ మాట్లాడకదూషించలేకపోయెను.


 పైగా నా యొక్క పాదమున కేమయినా నొచ్చినదేమోనని నొచ్చుకొనుచున్నాడు. కావున శ్రీ మహావిష్ణువు మించిన సత్త్వగుణ ప్రధానుడు మరియొకడు లేడని గుర్తించాడు భృగువు.


 శ్రీమహావిష్ణువుతో అతడు, ‘సకలలోకపితా!నీవంటి మహాత్ముని పరీక్షించుటకు అరుదెంచుటయే పాపమునకు కారణమగును. నా పాపము బహుజన్మలెత్తిననూ పోవునా? తీరునా? నా తప్పును క్షమించవలసినదిగానూ, నన్ను రక్షించవలసినదిగానూ కోరుచున్నాను’’ అనెను.


 శ్రీమన్నారాయణుడు ముఖము నుండి చిరునవ్వు వెన్నెల కురిపిస్తూ కన్నుల నుండి దయను మెరిపిస్తూ భృగుమహర్షీ! నీ హృదయము నేనెరుంగనిదా! 


మీ పరీక్ష వలన మా గొప్పతనము మరియొక మారు ఋజువైనది అంతియే కదా! అందువలన నీకిది పాపదాయకము కాదు, నీకు శుభము కలుగును గాక! 


నీకు లోకకళ్యాణ కారకత్వము కలుగునుగాక! వెడలిరమ్ము అని కటాక్షించుచూ పలికినాడు.


 నారాయణుడు కరుణించగనే భృగువు ‘అమ్మయ్య’ అనుకొని భూలోకమునకు హుటాహుటిగా ప్రయాణమయ్యాడు.


 *వజ్రమకుటధర గోవిందా, వరాహమూర్తి గోవిందా,* *గోపీజనప్రియ గోవిందా, గోవర్ధనోద్ధార గోవిందా; |* 


 *గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా* *హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. |* 


శ్రీవేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.


*ఓం నమో వేంకటేశాయా*


సేకరణ:- శ్రీ కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్. 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 126*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

. ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 126*


🔴 *రాజనీతి సూత్రాణి - చతుర్ధాధ్యాయము* : 


1. ధర్మేణ ధార్యతే లోకః 

(లోకాన్ని ధర్మమే నిలబెడుతున్నది.) 


2. ప్రేతమపి ధర్మాధర్మా వనుగచ్చతః 

(చచ్చిన వానిని కూడా ధర్మాధర్మాలు వెంబడిస్తాయి.) 


3. దయా ధర్మస్య జన్మభూమిః 

(ధర్మానికి పుట్టినిల్లు దయ.) 


4. ధర్మమూలే సత్యదానే 

(సత్యమూ, దానమూ ధర్మానికి మూలం.) 


5. ధర్మేణ జయతి లోకాన్ 

(ధర్మం చేత లోకాల్ని జయిస్తాడు.) 


6. మృత్యురపి ధర్మిష్ఠం రక్షతి 

(ధర్మాత్ముడ్ని మృతదేవత కూడా రక్షిస్తుంది.) 


7. ధర్మాద్విపరీతం పాపం యత్ర ప్రసజ్యతే తత్ర తత్ర ధర్మావమతిరేవ మహతీ ప్రసజ్యతే 

(ధర్మానికి విరుద్ధమైన పాపం ఎక్కడెక్కడ ప్రవర్తిస్తుందో అక్కడ ధర్మానికి పెద్ద అవమానం కలుగుతుంది. ధర్మం పేరిట దానికి విరుద్ధమైన పాపం ఎక్కడెక్కడ వ్యాపిస్తుందో అక్కడ ధర్మానికి అవమానమే జరుగుతుంది.) 


8. ఉపస్థితవినాశానాం ప్రకృతిః ఆకారేణ చ లక్ష్యతే (వినాశం దగ్గరపడ్డ వాళ్ళ స్వభావం వాళ్ళ ఆకారం చేత, చేసే పనులచేత తెలుస్తుంది.) 


9. ఆత్మవినాశం సూచయత్వధర్మబుద్ధిః 

(అధర్మబుద్ధి ఆత్మవినాశాన్ని సూచిస్తుంది.) 


10. పిశునవాదినో రహస్యం కుతః ? 

(చాడీలు చెప్పేవాడికి రహస్యం ఏమిటి ?) 


11. పరరహస్యం నైవ శ్రోతవ్యమ్ 

(ఇతరుల రహస్యాలు వినకూడదు.) 


12. వల్లభస్వ స్వార్ధపరత్వమధర్మయుక్తమ్ (ప్రేమించబడేవాడు స్వార్ధపరుడై ఉండడం అధర్మం.) 


13. స్వజనే ష్యతిక్రమో న కర్తవ్య 

(తనవాళ్ళ విషయంలో కూడా మర్యాదను అతిక్రమించకూడదు.) 


14. మతాపి దుష్టా త్వాజ్యా 

(తల్లైనా దుష్టురాలైతే విడిచిపెట్టి వేయాలి.) 


15. స్వహస్తో పి విషదిగ్ధశ్చేద్యాః 

(విషం పూసిన తన చేతినైనా నరికి వెయ్యాలి.) 


16. పరో పి చ హితో బంధు 

(పరాయివాడైనా హితుడు బంధువే.) 


17. కక్షాదప్యౌషదం గృహ్యతే 

(పొదలోనుంచి అయినా ఔషధం గ్రహించబడుతుంది.) 


18. నాస్తి చేరేషు విశ్వాస 

(దొంగలమీద నమ్మకం పనికిరాదు.) 


19. అప్రతీకారేష్యనాదరో న కర్తవ్య 

(ప్రతిక్రియ చేయని వారి విషయంలో మనం చేసిన దానికి ఇతడు ఏమి ప్రతిక్రియ చేయలేదు కదా అని ఏమరిపాటుగా ఉండకూడదు. అతడు ఎప్పుడైనా చేయవచ్చు.) 


20. వ్యసనం మానగపి బాధతే 

(కొంచమైనా దుర్వ్యసనం బాధిస్తుంది.) 


21. అమరవదర్ధజాతమర్జయేత్ 

(ధనం సంపాదించేటప్పుడు "నాకు మరణం" లేదు అన్నట్లు సంపాదించాలి.) 


22. అర్ధవాన్ సర్వలోకస్య బహుమన్యతే లోకః (ధనవంతుణ్ణి అందరూ గౌరవిస్తారు.) 


23. మహేంద్రమప్యర్ధహీనం న బహుమన్యతే లోకః (సాక్షాత్తు దేవేంద్రుడే అయినా ధనం లేనివాడ్ని లోకం గౌరవించదు.) 


24. దారిద్య్రం ఖలు పురుషస్య సజీవితమ్ మరణమ్ 

(మానవుడికి దారిద్రం అనేది జీవించి ఉండగానే మరణం.) 


25. విరూపో ప్యర్ధన్ సురూపః 

(కురూపి అయినా ధనం ఉంటే సౌందర్యవంతుడు.) 


26. అదాతారమప్యర్ధంతమర్ధినో త్యజంతి 

(ఏమీ ఇవ్వనివాడైనా ధనికుడ్ని యాచకులు విడిచిపెట్టరు.) 


27. అకులీనో పి ధనవాన్ కులీనాద్విశిష్ట (సత్కులంలో పుట్టినవాడు కాకపోయినా ధనవంతుడు కులీనుడే.) 


28. నాస్త్యవమానభయమనార్యస్య 

(నీచుడు అవమానానికి భయపడడు.)


29. నోద్యోగవతాం వృత్తిభయమ్ 

(పాటుపడేవాళ్ళకి వృత్తి దొరకదనే భయం లేదు.) 


30. న జితేంద్రియాణాం మరణభయమ్ (ఇంద్రియాలను జయించిన వాళ్ళకి భోగ్యవిషయాల వల్ల భయం ఉండదు.) 


31. న కృతార్ధానాం మరణభయమ్ 

(కర్తవ్యాలన్నీ చేసుకున్నవాళ్ళు మరణానికి భయపడరు.) 


32. కస్యచిదర్థం స్వమివ మన్యతే సాధు 

(అది ఎవరి సొత్తయినా తన సొత్తే అనుకొని సంతోషిస్తూ ఉంటాడు సత్పురుషుడు.)


33. పరివిభవేష్యదరో న కర్తవ్య 

(పరుల ఐశ్వర్యాల మీద ఆసక్తి చూపకూడదు.) 


34. పరివిభవేష్యాదరో పి నాశమూలమ్ 

(పరుల వైభవాల మీద ఆదరం చూపినా అది నాశనానికి దారి తీస్తుంది.) 


35. పలాల మపి పరద్రవ్యం న హర్తవ్యమ్ 

(పరద్రవ్యం గింజలేని పొట్టు కూడా హరించకూడదు.) 


36. పరద్రవ్యాపహరణమాత్మద్రవ్య నాశహేతుః (పరుల ద్రవ్యం హరించడం వల్ల తన ద్రవ్యం నశిస్తుంది.) 


37. న చౌర్యాత్పరం మృత్యుపాశః 

(దొంగతనాన్ని మించిన యమపాశం లేదు.) 


38. యవాగూరపి ప్రాణధారణం కరోతి కాలే 

(కొన్ని సమయాలలో గంజి కూడా ప్రాణాలను నిలబడుతుంది.) 


39. న మృతస్యౌషదం ప్రయోజనమ్ 

(చచ్చినవానికి ఔషధం నిరుపయోగం.) 


40. సమకాలే ప్రభుత్వస్య ప్రయోజనం భవతి 

(కాలం సమంగా ఉన్నప్పుడే ప్రభుత్వం వల్ల ప్రయోజనం ఉంటుంది.) 


41. నీచస్య విద్యాః పాపకర్మన్యేవ తం యోజయన్తి (నీచుడికి విద్యలు ఉన్నా అవి వానిచేత పాపకర్మలే చేయిస్తాయి.) 


42. పయఃపానమపి విషవర్థనం భూజంగస్య త్వమృతం స్యాత్ 

(పాము పాలు తాగితే విషముగానే మారుతుంది. కాని అవి అమృతంగా మారవు.)


43. న హి ధ్యాన్యసమో హ్యర్థః 

(ధ్యానం వంటి ధనం లేదు.) 


44. న క్షుధాన్యసమో హ్యర్థః 

(ఆకలి వంటి శత్రువు లేడు.) 


45. అకృతేర్నియాతా క్షుత్ 

(పనిలేనివానికి ఎప్పుడూ ఆకలే.) 


46. నాస్త్యభక్ష్యం క్షుదితస్య 

(ఆకలిగొన్న వాడికి తినదగనిది అంటూ లేదు.)


47. ఇంద్రియాణి ప్రతిపదం నరాన్ జరాకృశాన్ కూర్వంతి 

(ఇంద్రియాలు మనుష్యుల్ని అడుగడుగునా ముసలితనం చేత కృషించిపోయేటట్లు చేస్తాయి.) 


48. సానుక్రోశం భర్తారమాజీవేత్ 

(జాలిగల ప్రభువును ఆశ్రయించి బ్రతకాలి.) 


49. లుబ్ధసేవీ పావకేచ్చయా ఖద్యోతం ధమతి (లోభియైన ప్రభువును సేవించడం అంటే నిప్పు కోసం మిణుగుడు పురుగును పట్టుకొని ఊదినట్లే.) 


50. విశేషజ్ఞం స్వామినమాశ్రయేత్ 

(ఇతరుల గుణాలను తెలుసుకొనగలిగిన ప్రభువును ఆశ్రయించాలి.) 


51. పూరుషస్యమైథునం జరా 

(పురుషుడికి మైథునం దౌర్భల్యహేతువు.) 


52. స్త్రీణామమైథునం జరా 

(స్త్రీలకు మైథునం లేకపోవడం ముసలితనం.) 


53. న నీచోత్తమయోర్వైవాహః 

(నీచులకీ ఉత్తములకీ మధ్య వివాహసంబంధం కుదరదు.) 


54. అగమ్మాగమనాదాయుర్యశః పున్యాని క్షీయతే (అక్రమ స్త్రీతో సంబంధంవల్ల ఆయుర్ధాయము, కీర్తి, పుణ్యమూ కూడా నశిస్తాయి.) 


55. నస్త్యహంకారసమః శత్రుః 

(అహంకారం వంటి శత్రువు లేడు.) 


56. సంసది శత్రుం న పరిక్రోశేత్ 

(శత్రువుని సభలో పదిమందిలో నిందించకూడదు.) 


57. శత్రువ్యసం శ్రవణసుఖమ్ 

(శత్రువు కష్టాలలో ఉన్నాడంటే వినడానికి చాలా ఆనందకరం.) 


58. అధనస్య బుద్ధిర్న విద్యతే 

(ధనంలేనివారికి బుద్ధి పనిచెయ్యదు.) 


59. హితమష్యధనస్య వాక్యం న గృహ్యతే 

(ధనం లేనివానిమాట హితకరమే అయినా వినరు.) 


60. అధనః స్వభార్యయా ప్యవమన్యతే 

(ధనం లేనివాడ్ని భార్య కూడా అవమానిస్తుంది.) 


61. పుష్పహీనం సహకారమపి నోపాసతే భ్రమరాః (తియ్య మామిడి చెట్టే అయినా పువ్వులు లేకపోతే తుమ్మెదలు దాని దరికి చేరవు.) 

(ఇంకా ఉంది)...🙏


సేకరణ:- శ్రీ కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్. 

🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

మారేడు

 _*🕉️🔱"మారేడు....! "🕉️🔱*_

_*లక్ష్మీదేవి కుడిచేతితో సృష్టించిన చెట్టు మారేడుచెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలము అని పిలుస్తారు.*_


🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️


*సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది.*


*మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకుంటారు.*


*మారేడు ఆయుర్వేదము నందు ప్రధానంగా ఉపయోగ పడుతుంది. ఈ మారేడు దళము మూడుగా ఉంటుంది. అందుకే ...*


*"త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం!*

*త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!!”*


*అని తలుస్తాము.*


*దళములు దళములుగా ఉన్నవాటినే కోసి పూజ చేస్తారు.*


*ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది.*

*అరుణాచలంలో బహు బిల్వదళం ఉంటుంది.*


*అది మూడు, తొమ్మిది కూడా ఉంటాయి.*


*మామూలుగా అన్ని పుష్పములను...*

*పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి. కానీ మారేడు దళమును పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈనెనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు.*


*మనకి శాస్త్రంలో అయిదు లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు. అందులో  మారేడు దళము ఒకటి.*


*మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈనె శివలింగమునకు తగిలితే ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది.*


*అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా, పిల్లలకు ఉద్యోగములు రాకపోవడం మొదలగు ఇబ్బందులు ఉన్నా మూడు ఆకులు ఉన్న దళములను పట్టుకుని శివునికి పూజ చేసేవారు.*


*శివుడిని మారేడు దళంతో పూజ చేయగా నే ఈశ్వరుడు త్రియాయుషం అంటాడట.*


*"బాల్యం,*

*యౌవనం,*

*కౌమారం*

*ఈ మూడింటిని నీవు చూస్తావు’  అని ఆశీర్వదిస్తాడుట.*


*కాబట్టి ..ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది.*

*శివుని మారేడు దళములతో పూజించే వ్యక్తి మూడు గుణములకు అతీతుడు అవుతాడు.*


*మారేడు దళం శివలింగం మీద బోర్లాపడితే జ్ఞానం సిద్ధిస్తుంది.*


*ఇంత శక్తి కలిగినది కాబట్టే దానికి*

 *శ్రీసూక్తం  లో...*

 *"అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే’*


*(అమ్మా అలక్ష్మిని= దరిద్రమును* *పోగొట్టెదవుగాక)*

*అని చెప్తాము.*


*మనిషికి మూడు గుణములు, మూడు అవస్థలు ఉంటాయి.* *నాల్గవదానిలోకి వెళ్ళడు.* 

*నాల్గవది తురీయము.*

*తురీయమే జ్ఞానావస్థ.*


*అటువంటి తురీయంలోకి వెళ్ళగలిగిన స్థితి శివలింగమును మారేడు దళముతో పూజ చేసిన వారికి వస్తుంది.*


*మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే మూడు కోట్లమంది* 

*దేవతలకి ప్రదక్షిణం* *చేసినట్లే.*


*ఇంట్లో మారేడు చెట్టు ఉంటె ఆ మారేడు చెట్టు క్రింద కూర్చుని ఎవరయినా జపం చేసినా పూజ చేసినా అపారమయిన సిద్ధి కలుగుతుంది.*


*యోగ్యుడయిన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టు క్రింద చక్కగా శుభ్రం చేసి ఆవుపేడతో అలికి,   పీట వేసి ఆయనను అక్కడ కూర్చోపెట్టి భోజనం పెడితే అలా చేసిన వ్యక్తికి కోటిమందిని తీసుకువచ్చి ఏకకాలమునందు వంటచేసి అన్నం పెట్టిన ఫలితం ఇవ్వబడుతుంది.*


*శాస్త్రము మనకు లఘువులు నేర్పింది. మారేడు చెట్టు అంత గొప్పది.*


*మారేడు చెట్టు మీదనుండి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలది.  అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది.*


*‘మా-రేడు’*

*తెలుగులో రాజు ప్రకృతి,*

*రేడు వికృతి.*


*మారేడు అంటే మా రాజు.*

*ఆ చెట్టు పరిపాలకురాలు. అన్నిటినీ ఇవ్వగలదు. ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు.*


*అది పువ్వు పూయవలసిన అవసరం లేదు.*


*ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా మారేడు  పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు.*


*అందుకే మీకు ఏది చేతనయినా కాకపోయినా..*

*మీ జీవితమును పండించుకోవడానికి వాసనా బలములను మీరు ఆపుకోలేకపోతే..*

*ప్రయత్నపూర్వకంగా పాపం చేయడానికి*

*మీ అంత మీరు నిగ్రహించుకోలేకపొతే..*

*మీ మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి మూడు విషయములు శాస్త్రంలో చెప్పబడ్డాయి.*


_అందులో.._

_*1. మొదటిది తప్పకుండా భస్మ ధారణ చేయడం,*_


_*2. రెండవది రుద్రాక్ష మెడలో వేసుకొనుట,*_


_*3. మూడవది తప్పకుండా మారేడు దళములతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారయినా చేయుట.*_


_*ఈ మూడు పనులను ప్రతివ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని పెద్దలు చెప్తారు.*_


_*సర్వేజనా సుఖినోభవంతు-శుభమస్తు.*_


          🕉️🙏🕉️🙏🕉️🙏🕉️

భక్తి

 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷


                   *భక్తి*


భక్తి’ అనే మాట ఉపనిషత్తుల్లో ప్రతిపాదితమై, పురాణాలు, ఇతిహాసాల్లో ప్రతిష్టితమై, ప్రహ్లాదాదులతో అనుష్టితమై... మధ్యయుగంలో ఉద్యమం అయింది. ఆధునిక కాలంలో ఈ మాటను... ‘దైవ భక్తి, దేశభక్తి, ప్రభుభక్తి, రాజ భక్తి, రాజకీయ భక్తి, మూఢభక్తి’...  ఇలా అనేక విధాలుగా వాడడంతో, దాని అసలు అర్థం మసకబారింది. మూఢవిశ్వాసానికి పర్యాయపదంగా పరిగణన పొందుతోంది. ఈ దుస్థితికి కారణం నిజమైన భక్తితత్త్వాన్ని నిజజీవితంలో ప్రకటింపజేసే మహాత్ములు మన సమాజంలో కనుమరుగైపోవడమే! 

అసలు భక్తి అంటే ఏమిటి? ‘‘భగవంతుని మీద సర్వోత్తమైన ప్రేమే భక్తి. అది అమృతానంద స్వరూపం. త్యాగరూపమైనది  ఏ కోర్కెలూ లేని స్థితి అదే మోక్షం’’ అని నారద భక్తి సూత్రాలు చెబుతున్నాయి. భగవద్గీతలోని ‘భక్తియోగం’ భక్తి తత్త్వాన్నీ, లక్షణాల్నీ విపులంగా తెలిపింది. శ్రీమద్భాగవతం భగవద్భక్తుల లక్షణాలను, భక్తి స్వరూపాన్నీ సవిస్తరంగా ఆవిష్కరించింది. మానవునికి క్రోధం, శోకం లాంటి ఎన్నెన్నో అనుభూతులు ఉన్నా ప్రేమ లాంటి మధురమైన అనుభూతి మరేదీ లేదు! అందునా, ప్రేమ పొందడం కన్నా ప్రేమించడం ఇంకా మధురం. మానవునికి స్వతహాగా ప్రేమించే లక్షణం ఉన్నా... ఆ ప్రేమ ఒక వ్యక్తికో, ఒక వస్తువుకో మాత్రమే పరిమితమవుతుంది. అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ, స్వార్థభావంతో కలుషితమౌతూ, విచ్ఛిన్నమైపోతూ ఉంటుంది. శాస్త్రం దీన్ని ‘సంగం’ అని అంటుంది. కానీ ఆ ప్రేమే నిష్కల్మషమైతే, సార్వజనీనమైతే, నిరంతరానుభవమైతే అదే నిత్యానందానుభూతి. అక్కడే సమస్త దుఃఖాలకు ఉపశాంతి. అదే భక్తి!  అటువంటి నిరవధికమైన ప్రేమైక్య స్థితిని సాధించడానికి ముందుగా ప్రపంచమంతటా కనిపించే ‘అనేక’త్వాన్ని పక్కకునెట్టి, అంతటా ‘ఏక’రూపంగా ఉన్న తత్త్వాన్ని నిష్కామంగా ప్రేమించడాన్ని సాధన చెయ్యాలి. ఆ ‘ఏక’ రూప తత్త్వమే భగవంతుడు! ఈ జగత్తులో భగవంతుడు వ్యాపించనిది ఏదీ లేదు కదా! సమష్టి రూపమైన భగవంతుని పట్ల... సాధకులు చేసే ’నిష్కామప్రేమ‘ అనే ఈ ఉపాసనాక్రమానికి కూడా ’భక్తి‘ అనేదే వ్యవహార నామం. భక్తి సార్వజనీనం, భేదరహితం కావడంవల్ల నిజమైన భక్తిలో ‘విషమత్వం’ లేదు. అంతా ‘సమత్వ’మే!

అనన్య భక్తి

మరి అంతటా ఉన్న భగవంతుణ్ణి ఎలా ప్రేమించాలి? అందుకు సులభమైన మార్గమే భగవంతుని సగుణ, సాకార మూర్తి! అనంతమైన భగవత్తత్త్వానికి అనంతమైన కళ్యాణ గుణాలు, రూపాలు, నామాలు ఉన్నాయి! వాటిలో రాముడు, కృష్ణుడు, శివుడు, లలిత తదితర సంపూర్ణ దేవతామూర్తుల్ని ఉపాసనా సౌలభ్యం కోసం వేద, పురాణాలు మనకు అందించాయి. భక్తులు తమకు ఇష్టమైన ఒక దేవతా మూర్తిని స్వీకరించి, సమస్త దేవతలనూ, సమస్త జగత్తునూ ఆ మూర్తిలోనే ఉన్నట్టు భావించి, పరదేవతగా ఉపాసించడం మొదటి క్రమం. ఆ తరువాత సమస్త జగత్తులో భగవద్దర్శనం, నిరంతరానుభూతి పొందడం. ఉపాసించడం అంటే - ఆ మూర్తి దివ్య మంగళ స్వరూపం, గుణాలు, లీలలు తదితరాలన్నిటితో చేసే ధ్యానం. మనసు మరే ఇతర విషయాల మీద, ఇతర దేవతా రూపాల మీద కాకుండా... ఆ ఇష్టదేవతామూర్తి పైనే నిరంతరం లగ్నం కావాలి. దీన్నే ‘అనన్య భక్తి’ అంటారు. ‘అనన్య’ అంటే... ‘వేరే ఇతరమైనది ఏదీ లేకుండా’ అని అర్థం.

పురాణాలు ఒక్కొక్క దేవతను ప్రధానంగా కీర్తిస్తూ... తక్కిన దేవతలకు తక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఉదాహరణకు ‘విష్ణు పురాణం’ విష్ణు పారమ్యంగా ఉంటూ... ఇతర దేవతామూర్తులకు తక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. అలాగే ‘శివ పురాణం’ శివ పారమ్యాన్ని బోధించి, ఇతర దేవతా మూర్తులకు తక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. ఇది కేవలం ఆయా రూపాలను ఉపాసించే భక్తులకు అనన్య భక్తిని అలవరచడానికే! అంతేకాని విష్ణువు, శివుడు వేరని మాత్రం కాదు. ఒకే భగవంతుడు అనేక విభూతులలో, అనేక కార్యాలు చేస్తూ, వేరు వేరు పేర్లతో, వేరు వేరు రూపాలతో, వేరు వేరు తత్త్వాలుగా అగుపిస్తాడు. 

నవవిధ మార్గాలు

భక్తి అంటే ‘నిరంతరం భగవంతుణ్ణి సేవించడం, లేదా భగవత్సాన్నిధ్యంలో ఉండడం’ అని కూడా అర్థం ఉంది.  భగవత్సాన్నిధ్యంలో ఉండడం కోసం భక్తుడికి ప్రతిపాదితమైన అనేక విధానాలు ఉన్నాయి. వాటిలో భాగవతంలో ప్రహ్లాదుడు వెల్లడించిన నవవిధ భక్తులు... అంతే తొమ్మిది విధాలుగా ఆచరించే భక్తి మార్గాలు ప్రసిద్ధమైనవి. ఇవి- శ్రవణం (ఏడు రోజులు నిరంతర భాగవత శ్రవణం చేసిన పరీక్షిత్తు దీనికి చక్కని ఉదాహరణ), కీర్తనం (నారదుడు), స్మరణం (ప్రహ్లాదుడు), పాదసేవనం (మహాలక్ష్మి), అర్చనం (పృథు చక్రవర్తి), వందనం (అక్రూరుడు), దాస్యం (హనుమంతుడు), సఖ్యం (అర్జునుడు), ఆత్మనివేదనం (బలి చక్రవర్తి). ఇవన్నీ భక్తులు భగవంతునితో నిరంతరంకూడి ఉండటానికి ఏర్పరచుకున్న సంబంధాలు. ఇవే కాకుండా.. వాత్సల్య భక్తి- భగవంతుణ్ణి సొంత బిడ్డలాగా భావించడం (యశోద), మధుర భక్తి - భగవంతుణ్ణి ప్రియునిగా భావించడం (గోపికలు) లాంటి సంబంధాలు కూడా ప్రతిపాదితమయ్యాయి. ఆళ్వారుల ‘దివ్య ప్రబంధాల’లో ప్రధానంగా కనిపించేవి ఈ భక్తి తత్త్వాలే!

Vinayaka vibhogam


 

Be careful


 

Friendship


 

పలుకరిస్తూ ఉండండి.

 *మరణాన్ని ఎప్పుడు చూడలేదు కానీ చాలా అందమైనది అయి ఉంటుంది.ఎందుకంటే దాన్ని ఒక్కసారి కలుసుకున్న వారంతా కూడాజీవించడమే మరచిపోతారు. ప్రకృతి నియమాలు కూడా చాలా చిత్రమైనవి. ప్రాణమున్న మనిషి నీళ్లలో మునిగిపోతాడు. చచ్చినవాడు నీటిలో తేలి చూపుతాడు. బతుకంతా బ్రాండ్ల వెనుక పరుగెత్తే వాడికి తెలుసా? రేపు ఎక్కి ఊరేగాల్సిన పాడెకు ఏ బ్రాండు ఉండదని.అందమైన శరీరాన్ని చూసి మురిసిపోతావు కానీ నీవైనా, నేనైనా మిగిలేది బూడిదగానే. ఒకరు ఏడ్చి మనసు తేలిక చేసుకుంటే ఒకరు నవ్వి బాధ దాచుకుంటారు. మనుషుల మధ్య ఐకమత్యం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. బతికున్న వాడిని పడగొట్టాలనుకుంటారు. చచ్చిపడిన వాడిని భుజాల మీద మోస్తారు. జీవితంలో ఏది ఎప్పుడో చెప్పలేం. ఏ మాట చివరిదో. ఏ ఆట చివరిదో. అందుకే వీలైనంతగా పలుకరిస్తూ ఉండండి. వీలైనన్ని సార్లు కలుస్తూ ఉండండి.*

రాజుగారు తలచుకుంటే

 మహా భారత యుద్ధానంతరము హస్తిన పాలకులు ప్రభ కోల్పోయి నామ మాత్రపు పాలకులు అయ్యారు. 


మగధ రాజ్యపు పాలకులు అయిన జరాసంధుని  వంశస్తులు దేశానికి పాలకులు అయ్యారు. వీరిని బృహద్రధ వంశం అంటారు.


బృహద్రధ వంశస్తులు మొత్తం 1006 సంవత్సరాలు రాజ్య పాలన చేశారు..ఆ పిమ్మట అవంతీ పాలకులు అయిన ప్రద్యోతన వంశ పాలనలోకి పోయింది.


ప్రద్యోతన వంశస్తులు 138 సంవత్సరాలు యావద్దేశాన్ని చక్రవర్తులుగా పాలించారు. 


ఆ తర్వాత దేశం కాశీ రాజు  శిశునాగుని పాలనలోకి పోయింది మగధ. శిశునాగుడు 1994 BCE నుండి 1954 BCE వరకూ పాలించారు.


ఈ శిశునాగుని కి కొన్ని అక్షరాలు సరిగ్గా పలికెడివి కావు..అవి తన ముందు ఎవరైనా పలికితే వారు తనను అవమానించారని వారికి శిక్ష వేసేవాడట. చివరకు ఈ ధోరణి తో అంత:పుర స్త్రీల మీద కూడా  చిత్రవిచిత్రముగా ప్రవరించడం అందరికీ ఇబ్బందులు కలిగిస్తున్నాయి.


ఓ మారు అతని మూడవ ఇల్లాలు చంద్రావతి  పరిహాస పాత్రముగా రాజుగారిని ప్రణయ సమయములో వెక్కిరింత ధోరణిలో అన్నదట.


వెంటనే చక్రవర్తి గారయిన శిశునాగుని కోపం నషాళానికి అంటింది . తన అంతఃపురములో ఎవ్వరూ " ట, ఠ, డ, ఢ, శ, ష, హ, క్ష " లతో  ఉన్న పదాలు ఏవీ మాటాడడానికి వీల్లేదు అని ఒక శాసనం చేసి పారేశాడట. (హతవిధీ! ఈ కథను ఎవరూ ఇపుడు ఆయన చెవిన వేయకండి సామీ..ఆయనా శాసనం చేసి పడేసినా పడేస్తారు)


అలా ఆ అక్షరాలు శిశునాగుడు పలకకుండా చేస్తే..అతడి కుమారుడు అయిన కాకవర్మ( 1954 BCE  నుండి 1918 BCE) పత్ని లీలావతి తెలివిగా తన కుమారుడికి " క్షేమ ధర్ముడు" అని పెట్టి సదరు తాత గారిని ఇరకాటంలో పెట్టేసరికి.. అసలు కంటే కొసరు ముద్దు కాబట్టి ..మనవని కోసం ఆ కఠిన నిర్ణయాన్ని మార్చుకున్నాడట.


రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదువా మరి.

మానవ జన్మ ఎందుకు

 *మానవ జన్మ ఎందుకు..?*


```ఈ ప్రశ్న మనకే కాదు, ఋషులకు, మునులకు కూడా అంతు పట్టలేదు, మనం కూడా ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవాల్సిన ప్రశ్న ఇది!


అయితే.. మళ్ళీ మళ్ళీ మానవులుగా పుట్టకుండా ఉండటానికే!


అంటే మోక్షం పొందటానికే, అని ఉపనిషత్తులు భగవద్గీత తెలిపాయి.


అయితే మోక్షం సాధించక పోయినా, సాధించటానికి ఏమాత్రం ప్రయత్నం చేయకపోయినా, మానవ జీవితాన్ని వ్యర్థం చేసుకున్నట్లే, మరి అట్టి మోక్షాన్ని పొందటానికి ముఖ్యమైన ఏకైక మార్గం ఏమిటి?


అదే..జ్ఞాన మార్గం లేదా జ్ఞాన యోగం!

దానినే ఇక్కడ బుద్ధియోగం అని కూడా అన్నారు.

అట్టి బుద్ధియోగం మనకు ఎలా లభ్యమవుతుందో ఇక్కడ ఉపాయాన్ని చెబుతున్నారు...


1). నిత్యము, నిరంతరము భగవంతుని యందు చిత్తాన్ని నిలపటం.


2). భగవంతుని ప్రీతితో, ఇష్టంతో, ప్రేమతో, భక్తితో భజించటం.


కనుక ఎప్పుడో ఒకప్పుడు కాక నిత్యము, నిరంతరము మనస్సు భగవంతుని యందే ఉండాలి. 

అదీ ప్రీతితో, భక్తితో, ప్రేమతో నింపాలి, భజించాలి, సేవించాలి. 

ఇలా ప్రీతితో సేవించిన వారికి ఫలంగా భగవంతుడు బుద్ధియోగాన్ని ప్రసాదిస్తాడు, ఈ బుద్ధియోగం వల్లనే జీవుడు తన యదార్థ స్వరూపం ఆత్మయని పరమాత్మయని గ్రహించి, జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని సాధించి, ఈ జీవబ్రహ్మైక్యత ద్వారా సమస్త దుఃఖనివృత్తిని, శాశ్వత ఆనంద ప్రాప్తిని పొందుతాడు, అందుకే బుద్ధియోగం...


బుద్ధియోగం అంటే ఈ దేహేంద్రియ మనోబుద్ధులన్నీ అనిత్యమైన అనాత్మ వస్తువులని గ్రహించి, వీటిని నిత్యవస్తువైన ఆత్మ నుండి వేరు చేసి చూచే జ్ఞానమే బుద్ధియోగం. 


ఇలా వేరు చేసి చూసే శక్తి      బుద్ధి వల్లనే కలుగుతుంది, అందుకే ఇది బుద్ధియోగం అన్నారు...