26, జులై 2023, బుధవారం

వీరుడా వందనం !

 సందర్భంగా కార్గిల్ విజయ దివాస్

కార్గిల్ వీరుడు కవిత శీర్షిక 

రచన రవికుమార్ దేవరశెట్టి 

కలం కవి రవి


 వీరుడా వందనం !

అమర సైనికుడా అభివందనం!!

మంచే నీకు పట్టు పానుపు! రాతికొండలే రాజసింహసనం!

అష్ట దిక్కులే ఆత్మబలం!

కనురెప్ప వేయని-

రక్షణలోనే  దేశభక్తి విస్తరించే!

వీరుడా వందనం!

అమరసైనికుడా అభివందనం!!

నీ బాహువుల సరిహద్దులలో..

 నీ  స్వేధ పరిమళ

మలయ మారుతంలో..

 చిందే రక్త బిందువులే

 భరతమాత నుదుటిపై

మెరిసే తిలకం!

వీరుడా వందనం!

అమర సైనికుడా  అభివందనం!!

పగలు రాత్రి లేదు 

అలుపు సొలుపు రాదు!

ఆకలి దప్పులను అధిగమించి

సహన సాహస కృత్యాలలో 

నిత్య కర్తవ్య నిర్వహణలో 

 అజేయుడవు!

అగ్ని వీరుడవు!!

వీరుడా వందనం!

అమర సైనికుడా అభివందనం!!


ఏవిపత్తులోనైనా నీవే-

 ఏ సంక్షోభమైన నీకే-

త్యాగానికి చిరునా  నీవు!

స్వేచ్ఛ స్వాతంత్ర -

పొద్ధయి పొడుస్తావు.

వెన్నెలతో పలకరిస్తావు

ఎండలో ఎండయి-

వానలో వానై-

సుడిగాలి వడగాలై-

గాలిలో దీపం లాంటి 

మా అందరి -

అఖండ భద్రత జ్యోతివి నీవే!

వీరుడా వందనం!

అమర సైనికుడా  అభివందనం!!


మా భవిష్యత్తు కోసం

నీ బ్రతుకు పణంగా పెడుతూ..

ప్రకృతి వైపరీత్యాలకు

శత్రువు  శతజ్ఞులకు 

ఎదురెల్లుతావు!!

సంపద రోగంతో 

మేము కూనరిల్లుతున్న-

సామరస్యం కోసం

 సమిదవగుతావు.

 నిలువెత్తు సైనిక జెండాపై

ప్రకాశిస్తూ!!

అందని ఆకాశం పైకి

 స్వేచ్ఛ స్వాతంత్రాన్నివై కనుమరుగవుతావు.!

ప్రతి దినం-

తొలి కిరణ త్రివర్ణ పతాకమై రెపరెపలాడుతావు.!!

నీ త్యాగాల సాగుళ్లలో..

మేము మానవత్వం వెతుక్కుంటూనే ఉంటాము!

మీ సేవలను స్మరిస్తూ నివాళులు అర్పిస్తూనే ఉంటాము!!

వీరుడా వందనం ..

"కార్గిల్"

అమర సైనికుడా అభివందనం!

అడుగు అడుగున పాదాభివందనం..

జైహింద్ జై భారత్

కామెంట్‌లు లేవు: