26, జులై 2023, బుధవారం

మత రక్షణకు మహత్తర కృషి

 కంచి మహా స్వామి వారు- మత రక్షణకు మహత్తర కృషి


భారత దేశంలో మతం మనుగడకు రాజ్యాంగరక్షణ చేకూరింది మన రాజ్యాంగంలో మతం ప్రజల ప్రాథమిక హక్కుగా  పరిగణన పొందింది. అయితే ఇందుకు ప్రధాన బాధ్యులు ఎవరో దేశం మొత్తం మీద తెలిసిన వారు ఎందరో లేరు.


1947లో కామకోటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి తపోబలంతో ఆ లక్ష్యం ఎలా సాధించబడిందో వేద రహస్య సంవేది, మహా పండితుడు శ్రీమాన్ అగ్నిహోత్రం రామానుజ తాతాచారి గారు ఈ వ్యాసంలో వెల్లడించిన విషయాలు అద్భుతావహాలు.


హిందూ మత సంరక్షణకు శ్రీ కంచి కామకోటి పరమాచార్యులు జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు చేసిన మహత్తర సేవలు తెలుసుకోవాలంటే భారత స్వాతంత్ర ఉద్యమం నాటి దేశ పరిస్థితులను జ్ఞాపకం చేసుకోవాలి.


చిన్నతనంలోనే సన్యసించి కంచి కామకోటి మఠాధిపత్యం వహించడం వల్ల స్వామివారి ప్రత్యక్షంగా దేశ రాజకీయాలలో పాల్గొనలేదు. అయినా భారత స్వాతంత్రాన్ని వారు మన: పూర్వకంగా వాంఛించారు. దానిని బలపరిచారు.


స్వామివారి ఆశించింది భారతదేశంలో విదేశీ పాలన అంతరించడం మాత్రమే కాదు. మన దేశీయుల హృదయంలో పాదుకున్న విదేశీ వ్యామోహం కూడా అంతం అవ్వాలని వారు గాఢంగా వాంఛించారు.


గాంధీ గారి విదేశీ వస్తే బహిష్కరణ ప్రారంభించిన నాటి నుండి స్వామి స్వయంగా ఖద్దరు ధరిస్తున్నారు.

దురదృష్టవశాన జాతీయ ఉద్యమ నాయకులూ రాజకీయాలకే సర్వప్రాధాన్యం ఇచ్చి , మతం పట్ల ఉపేక్ష వహించారు.

అందువల్ల మనకు స్వాతంత్రం సిద్ధించిన నాడు మన మతానికి ఆధ్యాత్మిక ప్రయోజనాలకు హాని వాటిల్లవచ్చని స్వామి వారు అనుమానించారు.

ఈ విషయమై శ్రీ కామకోటి స్వామి పలువురు రాజకీయ నాయకులను హెచ్చరించారు. కానీ వారి హెచ్చరికలను నాయకులు అంతగా పాటించలేదు. రాజకీయాలు మినహా ఇతర సమస్యలకు ప్రాధాన్యం లేని నాటి క్లిష్ట పరిస్థితులలో మన  మత రక్షణకు కంచి స్వామివారు ఒక్కరే అవిశ్రాంతంగా పాటుపడక తప్పలేదు.


భారత రాజ్యాంగ నిర్మాణ దశలో కంచి పీఠాధిపతి ప్రదర్శించిన అసాధ్య రాజకీయ పరిజ్ఞానం వల్లనే నేడు మన రాజ్యాంగ చట్టంలో మతస్వాతంత్రానికి    మతసంస్థల సంరక్షణకు ( అనగా హిందూ ధర్మంలో ఈనాడు ఉన్న అనేక సాంప్రదాయాల పీఠాలు మఠాలు స్వతంత్రతకు) నియమ నిబంధనలు స్థిరంగా నెలకొన్నవి.

ఈ సందర్భంగా శ్రీ స్వామి వారు సల్పిన నిరాడంబర కృషిని విజ్ఞాన ప్రపంచానికి వెల్లడించడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను.


""స్వామి భవిష్యద్వాణి""

మత స్వాతంత్రానికి మత సంరక్షణకు రాజ్యాంగ ప్రమాణికతను సమకూర్చాలని లక్ష్యసాధనలో  స్వామి వారెంత నిర్విరామంగా పాటుపడినరో నే నెరుగుదను. కుంభకోణం సమీపాన వేలూరు అనే పల్లెటూరులో ఒక అర్ధరాత్రి స్వామి వారు చేసిన ఈ హెచ్చరిక నేటికీ నా  చెవులలో మారు మ్రోగుతున్నది.


" భారత రాజ్యాంగం ద్వారా మన మతాన్ని కాపాడుకొనడం మన తక్షణ కర్తవ్యం. ఇది ఎంత మాత్రమూ ఉపేక్షించవలసిన విషయం కాదు.


ఈ హెచ్చరిక ప్రాముఖ్యత ఆనాడు మేమంతగా గుర్తించలేదు. కానీ తర్వాత కొద్ది రోజులలోనే జరిగిన సంఘటనలు స్వామి భవిష్యత్ వాణిని అక్షరాలా ధ్రువీకరించినవి.

భారత స్వాతంత్రాన్ని గురించి ప్రత్యేకించి భారతదేశానికి నూతన రాజ్యాంగ నిర్మాణాన్ని గురించి చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం మన దేశానికి ఒక రాయబార వర్గాన్ని పంపింది.


ఆ సందర్భంలో తమ కర్తవ్యం ఏమిటో కామకోటి శంకరాచార్యుల వారు తప్ప,తక్కిన మతాధిపతులు ఎవరు గుర్తించలేదు . బ్రిటిష్ రాయబార  వర్గ సభ్యులను కలుసుకొని మన దేశంలో గల మత సంస్థల పరిస్థితులను గురించి, భవిష్యత్తులో వాటి ప్రతిపత్తిని గురించి రాయబారవర్గ సభ్యులకు నచ్చ చెప్పవలసిందిగా స్వామి వారు మమ్ము ఆదేశించారు.


కానీ బ్రిటిష్ రాయబారవర్గమ్మ విజ్ఞప్తిని ఆలకించడానికి అవకాశం ఇస్తుందా అని మేము సందేహించాము. ఏమైనప్పటికీ జరగవలసినదేదో జరగనిమ్మని, స్వామివారి ఆదేశం మేరకు రాయబారవర్గానికి టెలిగ్రాములు పంపాము. మేము ఊహించినట్టే జరిగింది! మా టెలిగ్రాములకు వారు సమాధానం కూడా ఇవ్వలేదు. అయినా, స్వామివారు మావలే నిరాశ చెందలేదు. ఆయన ఆత్మ విశ్వాసం మాకు ఆశ్చర్యం కలిగించింది. అది మా అల్పగ్నతకు నిదర్శనం. స్వామి సంకల్పం అమోఘం. అది వారికే విధితం.


అద్భుత సన్నివేశం


ఇంతలో తలవని తలంపుగా "తక్షణం మద్రాస్ కు బయలుదేరి రావలసింది " అని " హిందూ" పత్రిక కార్యాలయం నుంచి నాకు టెలిగ్రామ్ వచ్చింది. నేను మద్రాసు చేరి హిందూ కార్యాలయంలో అడుగుపెట్టినాను లేదో , అప్పటి హిందూ సంపాదకులు శ్రీ కస్తూరి శ్రీనివాసన్ నాకు ఎదురుపడి, బ్రిటిష్ పార్లమెంటరీ రాయబారవర్గం మరికొన్ని నిమిషాల్లో తమ కార్యాలయం దర్శించబోతున్న వార్త నా చెవిని వేశారు. ఆనాడు రాయబారవర్గ సభ్యుల గౌరవార్థం హిందూ కార్యాలయంలో ఒక తేనేటి విందు ఏర్పాటు చేశారు. ఏ రాయబారవర్గం వారు మేము పంపిన టెలిగ్రాములకు సమాధానమైనా పంపకుండా తటస్థంగా ఉన్నారో, వారే మరికొన్ని క్షణాల్లో అక్కడికి నాకు ప్రత్యక్షమయ్యే అద్భుత సన్నివేశం అప్పటికప్పుడు ప్రత్యక్షమైంది. రాయబారవర్గం కార్యదర్శి కి కస్తూరి శ్రీనివాసన్ నన్ను పరిచయం చేశారు. మా టెలిగ్రాములు ఒక్కదానికైనను మీరు జవాబు ఇవ్వలేదు అని వారితో నేను అన్నాను. రాయబారవర్గ సభ్యులందరిలో ప్రముఖుడైన బ్రిటిష్ పార్లమెంటరీ సభ్యుడు శ్రీ సోరేన్సేన్ కు స్వయంగా మా విజ్ఞప్తిని వినిపించవచ్చని ఆయన నాకు సలహా ఇచ్చారు. ఈ వ్యవహారం అంతా హడావిడిగా జరిగిపోవడం వల్ల మా విజ్ఞాపనను రాత మూలకంగా వారికి సమర్పించడానికి వీలుపడలేదు, భారత దేశంలో మత సంస్థలు నిస్సహాయ స్థితి గురించి నోటి మాటలతోనే శ్రీ సోరేన్సేన్ కు సంగ్రహంగా చెప్పి మత సంస్థలకు రాజ్యాంగ రక్షణ అవసరమైన శ్రీ కామకోటి మఠాధిపతులు ఆశయాన్ని వారికి విశదపరిచాను. మరొకసారి తనను ఢిల్లీలో కలుసుకోవాల్సిందిగా ఆయన నాతో అన్నారు.    

      

      మతము ప్రాథమిక హక్కు!

ఆశ్చర్యకరంగా జరిగిన ఈ కథ యావత్తు మహాస్వామి వారికి వినిపించాలని నేను హుటాహుటిగా కంచికి తిరిగి వచ్చాను. నేను చెప్పిందంతా స్వామి విన్నారు ఒక్క క్షణం ధ్యానంలో ఉన్నారు.

అతి తర్వాత మతాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించవలసిందని కోరుతూ ఒక విజ్ఞాపన తయారు చేయవలసిందిగా మాదేశించారు.

మతమా! ప్రాథమిక హక్కా !


హక్కు! ప్రాథమిక హక్కుల గురించి దేశంలో అప్పటికే మేధావి వర్గాల్లో సైతం ఆలోచనలు బయలుదేరలేదు. కాగా మతాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించడం గురించి యోచించిన వారు అసలే లేరు. ఆ మాటకొస్తే భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల అవతరణకు ఇదే నాంది వాక్యము అనడం కూడా అతిశయోక్తి కాదు.

తర్వాత మళ్లీ నేను బ్రిటిష్ రాజ్యాంగ పరిరక్షణ రాయవర్గం వారిని కలుసుకున్నప్పుడు వారు నాతో అన్న మాటలు మేము ఎంత చేసినా చివరికి రాజ్యాంగం తయారు చేయవలసింది భారతీయులైన మీ వారే కాబట్టి మీరు వారిని వెళ్లి కలుసుకోవడమే ఉత్తమం అని వారు మాకు సూచించారు. ఆ విధంగా తరువాత భారతదేశానికి స్వాతంత్రం లభించడం, రాజ్యాంగ పరిరక్షణకు ఒక కమిటీ ఏర్పాటు అవ్వడం మేము కామకోటి పీఠం తరఫున అప్పటికే అనేక పర్యాయాలు శ్రీ పటేల్ గారిని అంబేద్కర్ గారిని గారిని కలుసుకొని అనేక విన్నపాలు విన్నపించాం , ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అంబేద్కర్ గారి వద్ద మా అనుమానం ఏదైతే ఉందో అది పటాపంచలయ్యి వారు మా యొక్క అభిప్రాయాలను ఎంతో గౌరవించారు అంతేకాక స్వామి వారి యొక్క న్యాయ ,రాజ్యాంగ లౌకిక ,రాజకీయ పరిజ్ఞానానికి ముగ్గులయ్యారు , వారికి కూడా తెలియని అనేక విషయాలను స్వామి వారి ద్వారా వారికి విన్నవిస్తూ ఉంటే , వారు ఆశ్చర్య చెక్కుతులై , దక్షిణ భారతదేశంలో ఎక్కడో ఒక కుగ్రామంలో ఏకాంతంగా కాలం గడుపుతున్న ఒక యోగి పుంగవుని దివ్య ప్రభావం ఎలా నడిపించిందో అని తెలుసుకొని ఆయన పొంగిపోయారు, 

మరొక మెలిక

ఇంత  జరిగిన మతానికి మత సంస్థలకు నిర్నిరోధమైన స్వాతంత్రాన్ని రాజ్యాంగంలో కల్పించడానికి రాజకీయ నాయకులు సిద్ధంగా లేరు. అందుచేత మేము సూచించిన మత స్వాతంత్రం అనే పదానికి ముందు చట్టసమ్మతమైన అను మాటలు చేర్చవలసిందిగా వారు సలహా ఇచ్చారు. ఆ మాటలు చేర్చినట్లైతే ప్రభుత్వం తన ఇష్టప్రకారం మత విషయంలో మత సంస్థల వ్యవహారంలో జోక్యం కల్పించుకోవచ్చు ప్రభుత్వం ఏ కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టిన మత సంస్థలు దానికి అడ్డు చెప్పడానికి వీలు ఉండదు అంత మాత్రమే కాదు. భవిష్యత్తులో రాబోయే కొన్ని ప్రభుత్వాలు అసలు మతంలోనే విశ్వాసం లేనివి గా ఉండవచ్చు అందుచేత బిల్లు రెండవ మార్పు చర్చలకే వచ్చినప్పుడు second reading of the bill ఆ నిబంధనలను తగువిధంగా సవరించవలసిందిగా స్వామి వారు మాకు చెప్పారు, ఆ ప్రకారమే రాజ్యాంగ పరిషత్ సభ్యులకు మేము విజ్ఞాపన చేసాము.

 డాక్టర్ అంబేద్కర్ మతాభిమానం

ఈ సందర్భంలో ఒక విషయం ప్రత్యేకంగా చెప్పక తప్పదు. సాంఘిక సమస్యలపై డాక్టర్ అంబేద్కర్ గారికి గల తీవ్రమైన అభిప్రాయాలను బట్టి మేము వారిని దర్శించినప్పుడు మా సూచనలకు వారు సుముఖులుగా ఉంటారని ఊహించలేదు కానీ అక్కడ కూడా స్వామివారి ప్రభావమే మాకు సహాయపడింది మాకు గల అనుమానాలు అంబేద్కర్ మహాసేయుడు ప్రభుత్వం ఏమాత్రం జోక్యం చేసుకోకుండా మత సంస్థల స్వచ్ఛందంగా  మననవలసినవేనని తమ అభిప్రాయం అన్నారు.

అప్పటినుండి మా వ్యవహారం నల్లేరుపై బండిలా నడిచింది.

మత సంస్థలకు సంబంధించిన క్లాజ్ ని నాలుగు భాగాలుగా విభజించారు. చట్టసమ్మతమైన అనే మాటలను నాలుగో భాగానికి మాత్రమే వర్తింపజేశారు.

మత సంస్థల స్వతంత్ర నిర్వహణ రాజ్యాంగ రక్షణ సమకూరుందంటే శ్రీ కామకోటి పరమాచార్యుల కృషి అందుకు ప్రధాన కారణం.

ప్రతి మతము ఈ హక్కులు కలిగి ఉంటుంది.

అని మాత్రమే ఆదిలో ఉండేది మహా మేధావులను రాజ్యాంగ నిర్మాతలు సైతం ఆ వాక్య రచనల్లో గల లోపాన్ని గ్రహించలేదు.

స్వామి వారొక్కరే దాన్ని అసమగ్రతను గ్రహించారు!


హిందూ మతానికి చెందిన ఏ వ్యక్తి అయినా తాను వైష్ణవుడనో శైవుడననో  భావిస్తూడే తప్ప, ఓం ప్రధమంగా హిందువులని పరిగణించుకోడు. అదేవిధంగా మన దేశంలో ఏ మత సంస్థ అయినా హిందూ మతం పేరుతో వ్యవహరించదు. ఎక్కడ చూసినా వైష్ణవ స్మార్త శైవా సిద్ధాంతాన్ని వేర్వేరు సంస్థలు గాని ఆ పేర్లతో నడుస్తూ ఉంటాయి. అందుచేత మత సంస్థలు అన్నప్పుడు అనేక శాఖల పేర్లతో నడిచే సంస్థలు రాజ్యాంగ రక్షణ సూత్రం వర్తించకపోవచ్చు. ఆ హేతు చేత అన్ని మతాలు ఆ మతాలకు చెందిన అన్ని శాఖలు ఈ క్రింది హక్కులు కలిగి ఉంటావి. అనే మాటలు చేర్చాల్సిందిగా శ్రీ స్వామి వారి సూచించారు స్వామి వారి సూచన ప్రకారమే ఆ నిబంధన రాజ్యాంగ నిర్మాణ సభ ఆమోదం పొందింది!


ఇంత వ్యవహారం నడిచిన ఈ సందర్భంలో స్వామివారు వహించిన పాత్ర పరమ రహస్యంగా ఉండిపోయింది.

తాము తెర మరుగున ఉండి,

మన మతానికి, మత సంస్థలకు స్వాతంత్రాన్ని, రాజ్యాంగ రక్షణనూ ప్రతిపాదించిన మహానుభావుడు ఆయన. రాజ్యాంగ వేత్తలు ,న్యాయ శాస్త్ర విచారకులు, న్యాయమూర్తులు, అందరూ స్వామివారి ప్రజ్ఞాపూర్వక సూచనలను  సూచనలను అనుసరించిన వారే అయినారు.


ఇంతవరకు లోకానికి వెల్లడి కానీ ఈ మహత్తర విషయాలు మన మత చరిత్రలోనే కాదు, మన మన రాజ్యాంగ నిర్మాణీతిహాసంలో సైతం సువర్ణ అక్షరాలతో చిత్రించదగ్గ అంశాలు.


శృంగేరి స్వామి ప్రశంస

ఇదే సందర్భంలో మరువరాని మరొక విషయాన్ని తెలుసుకోవాలి.

అది శ్రీ శృంగేరి పీఠాధిపతుల సందర్శనం. హిందూ మత సంస్థలకు భారత రాజ్యాంగంలో రక్షణ కల్పించే నిమిత్తం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు సలుపుతున్న కృషి సందర్భంగా నేను నా సహచరులు దేశంలో వివిధ మతాధిపతిలను సందర్శించాము. ఆ సందర్భంలోనే అప్పటి శృంగేరి పీఠాధిపతులు     శ్రీ చంద్ర శేఖర భారతీ స్వామి సమక్షంలో మీ అనుభవించిన దివ్య అనుభూతి ఎన్నటికీ మరువరానిది.

ఆ మహనీయుడు మఠాధిపతి అయినా తపస్ సంపన్నుడు నిరంతన ధ్యాన నిమగ్ధుడు ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే బాహ్య స్మృతి కలిగిన ఉండే మహా వ్యక్తి.


మేము శృంగేరి కి వెళ్ళిన రోజున అదేమి భాగ్య విశేషముగాని అంతకుముందే దీర్ఘ సమాధి      నిష్ఠులైన ఉండిన స్వామివారు , ఆనాడు దర్శనమిచ్చారు.

చూడడంతోనే స్వామివారి మమ్మల్ని అడిగిన మొట్టమొదటి ప్రశ్న కామకోటి పీఠాచార్యులు వ్యాస పూజ ఎక్కడ చేశారు?

తిరువడైమరుదురు అని మేము సమాధానం చెప్పాము.

అట తర్వాత హిందూ మత సంస్థలకు రాజ్యాంగ పరిరక్షణకై కామకోటి ఆచార్య స్వాములు సలుపుతున్న కృషిని దేశంలో మత సంస్థలన్నీటిని సమైక్యతకు వారు కలుపుతున్న ప్రయత్నాలను శృంగేరి స్వామికి నివేదించాము.

ప్రసన్నవదనంతో స్వామివారి ఇలా అన్నారు. దేశ పరిస్థితులను సూక్ష్మంగా గ్రహించి ప్రస్తుత స్థితిలో మన కర్తవ్యం ఏమో గుర్తించ జాలిన వారు కంచి స్వామి వారు ఒక్కరు మాత్రమే. ఈ విషయంలో మేమందరం వారి కృషి  పైన ఆధారపడుతాము ఇందుకు మేము వారికీ ఎంతో కృతజ్ఞులము.

వర్తమాన కాలంలోని మనదేశంలో హిందూ మతస్తులు ఈ మాత్రమైనా ధర్మనిష్ట కలిగి ఉన్నవారు అంటే  అందుకు ప్రధానంగా శ్రీ కంచి  శంకరాచార్యులు కారణం , అంటూ మమ్మల్ని ఆశీర్వదించి పంపించారు.


   శ్రీ అగ్నిహోత్రం రామానుజ తాతాచారి.

పైన తెలిపిన విషయాలు గమనిస్తే

ఆనాడు పరమాచార్య స్వామి వారు అంత శ్రమ కృషి తీసుకొని ఉండకపోతే, ఈనాడు భారత దేశంలో  ఏ మఠము లో అయినా గాని 

ప్రభుత్వాలు జోక్యం చేసుకొని , పీఠాలలో  కూడా రాజకీయాలు చేసి , పీఠాధిపతిని కూడా వారే నిర్ణయించేవారు , పీఠాధిపతి వ్యవస్థలో కూడా రిజర్వేషన్ పెట్టిన ఆశ్చర్యపడనక్కర్లేదు , అటువంటి స్థితి మనకు కలిగి ఉండేది, ఆనాడు పరమాచార్య స్వామి వారి ముందు చూపు వల్లనే ఈనాడు దేశంలో అన్ని పీఠాలలో సక్రమంగా వారి వారి సాంప్రదాయాను సారం నడుచుకుంటూ ధర్మ ప్రబోధం చేస్తూ ఉన్నారు, ఇప్పుడు చెప్పండి నేను పైన అన్న మాట తప్పా ?

పరమాచార్య స్వామి వారే లేకపోతే ఈనాడు హిందూ ధర్మం మరోలా ఉండేది, 

వారు ఈ దేశానికి ఈ ధర్మానికి చేసిన కృషి అనన్య సామాన్యం

మరో శంకరుల ఈ భూమి మీద నడయాడిన అపర దక్షిణామూర్తి అవతారం జగద్గురు శ్రీ కంచి కామకోటి పీఠాధిపరులైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, 

జయ జయ శంకర హర హర శంకర

శ్రీ రామ జయం

కామెంట్‌లు లేవు: