26, జులై 2023, బుధవారం

మానవ జన్మ ఎందుకు

 *మానవ జన్మ ఎందుకు..?*


```ఈ ప్రశ్న మనకే కాదు, ఋషులకు, మునులకు కూడా అంతు పట్టలేదు, మనం కూడా ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవాల్సిన ప్రశ్న ఇది!


అయితే.. మళ్ళీ మళ్ళీ మానవులుగా పుట్టకుండా ఉండటానికే!


అంటే మోక్షం పొందటానికే, అని ఉపనిషత్తులు భగవద్గీత తెలిపాయి.


అయితే మోక్షం సాధించక పోయినా, సాధించటానికి ఏమాత్రం ప్రయత్నం చేయకపోయినా, మానవ జీవితాన్ని వ్యర్థం చేసుకున్నట్లే, మరి అట్టి మోక్షాన్ని పొందటానికి ముఖ్యమైన ఏకైక మార్గం ఏమిటి?


అదే..జ్ఞాన మార్గం లేదా జ్ఞాన యోగం!

దానినే ఇక్కడ బుద్ధియోగం అని కూడా అన్నారు.

అట్టి బుద్ధియోగం మనకు ఎలా లభ్యమవుతుందో ఇక్కడ ఉపాయాన్ని చెబుతున్నారు...


1). నిత్యము, నిరంతరము భగవంతుని యందు చిత్తాన్ని నిలపటం.


2). భగవంతుని ప్రీతితో, ఇష్టంతో, ప్రేమతో, భక్తితో భజించటం.


కనుక ఎప్పుడో ఒకప్పుడు కాక నిత్యము, నిరంతరము మనస్సు భగవంతుని యందే ఉండాలి. 

అదీ ప్రీతితో, భక్తితో, ప్రేమతో నింపాలి, భజించాలి, సేవించాలి. 

ఇలా ప్రీతితో సేవించిన వారికి ఫలంగా భగవంతుడు బుద్ధియోగాన్ని ప్రసాదిస్తాడు, ఈ బుద్ధియోగం వల్లనే జీవుడు తన యదార్థ స్వరూపం ఆత్మయని పరమాత్మయని గ్రహించి, జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని సాధించి, ఈ జీవబ్రహ్మైక్యత ద్వారా సమస్త దుఃఖనివృత్తిని, శాశ్వత ఆనంద ప్రాప్తిని పొందుతాడు, అందుకే బుద్ధియోగం...


బుద్ధియోగం అంటే ఈ దేహేంద్రియ మనోబుద్ధులన్నీ అనిత్యమైన అనాత్మ వస్తువులని గ్రహించి, వీటిని నిత్యవస్తువైన ఆత్మ నుండి వేరు చేసి చూచే జ్ఞానమే బుద్ధియోగం. 


ఇలా వేరు చేసి చూసే శక్తి      బుద్ధి వల్లనే కలుగుతుంది, అందుకే ఇది బుద్ధియోగం అన్నారు...

కామెంట్‌లు లేవు: