శుభోదయం🙏
దైవశక్తి తిరుగులేనిది!
"గురుడు గురుండు;వాలు శతకోటి సుపర్వులు వాహినీపతుల్;
సురభవనంబుకోట;మధుసూదనుడుంసైదోడు;దంతి ది
క్కరపతి;గాగేనోడడె?సురేంద్రుడు దాయలచేత నాజిలో,
శరణముదైవమే!పురుషశక్తి నిరర్థక మెన్ని భంగులన్; "-
భర్తృహరి సుభాషితములు-దైవపధ్ధతి;
ఎంతమొనగాడైనా ఎంతసాధన సంపత్తి కలిగినాదైవబలం లేకుంటేఅవన్నీ వ్యర్థమే!
దేవేంద్రుడెంతగొప్పవాడు.త్రిలోకాధిపతి. ఆయనకు గురువు (సలహాదారు.మంత్రాంగం నిర్వహించేవాడు) బృహస్పతి. గురుగ్రహం ఉచ్చలో ఉంటే ఇంకఆతనికితిరుగులేదని జాతకశాస్త్రం ప్రవచిస్తోంది.గురుశనులఆధారంగానే ఆయుర్దాయాదులనిర్ణయం.అలాంటిప్రాముఖ్యంగల గురువే దేవేంద్రునకు గురువు.
వాలు-ఆయుధం శతకోటి నూరంచులు కలది .తిరుగులేనిది.
సేనానులా అమృతపానంచేసినదేవతలు.
దేవతలనివాసం ఆకాశంలో నిర్మించినకోట.
మధుసూదనుడు, విష్ణువు సోదరుడు సహాయకుడు. పట్టపుటేనుగా ఐరావతం దిగ్గజం.
ఇన్ని సాధనాలున్నా దేవేంద్రుడు రాక్షసులచేతిలో ఓడిపోవటంచూశాం.ఏమిటికారణం?దైవబలంలేకపోవటమే! కనుక దైవమేశరణు! తక్కినవి నిరర్థికములు.
[26/07, 5:51 am] Ch. Satyanarayana: 🙏👌👌👌🙏🙏🙏💐💐💐🌷💐🌷🌷🌷💐🌷🌾🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి