9, అక్టోబర్ 2022, ఆదివారం

అనుమానం రాకుండా

 *//My Views//* 


ముఖ్యమంత్రి తెలంగాణ హిందూ ప్రజలకు అనుమానం రాకుండా *ముస్లిం హఫీజ్మెంట్* భాగంగా ఒక్కొక్కటిగా చేస్తున్నాడు.

వాటిని తెలంగాణ ప్రజలు గమనించడం లేదు.

అందులో కొన్ని

1. తెలంగాణలో ఉర్దూను ద్వితీయ భాషగా ప్రకటించడం.

 2.ప్రతి జిల్లా కేంద్రంలో ఉర్దూ భవనాలను ఏర్పాటు చేయడం.

3. ఉర్దూ పండిత్ పోస్టులను భర్తీ చేయడం అందులో సిబ్బందిని నియమించడం.

 4.మదర్సాలు ఏర్పాటు అందులో సిబ్బందిని నియమించడం ఇస్లాం బోధకులను నియమించడం. 

 5.దర్గాల, మసీదుల కోసం స్థలాలను కేటాయించడం. 6.ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ ను నెలకొల్పడం కోసం ఆజ్ఞలు జారీ చేయడం.

7. పట్టణ ప్రాంతంలో ముస్లిం జాతులైన రోహింగ్యాలకు షెల్టర్లు ఏర్పాటు చేయడం, వారిని పెంచి పోషించడం. 8.ముస్లిం జనాభా ఉన్న ఓల్డ్ సిటీ మరియు ఇతర పట్టణ ప్రాంతాల్లో ఇంటి పన్నులు, నీటి పన్నులు కరెంట్ బిల్లులు వసూలు చేయకపోవడం. 9.ధరణిలో భాగంగా ముస్లింల పేరు మీద ఉన్న భూములను కొత్త పట్టాదార్ పాస్బుక్ ఇచ్చి మల్లి లాక్కునే విధంగా కోర్టులో కేసులు పెట్టే విధంగా తర్ఫీదు ఇవ్వడం.

 10.పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుద్యోగ ముస్లిం యువతకు దళిత బంధు కంటే ముందే 10 లక్షల లోపు విలువైన కార్లను టాక్సీలను ఇప్పించడం.

11. కేవలం ముస్లిం లకు స్వయం ఉపాధి కోసమే ముస్లిం బ్యాంకులను ఏర్పాటు చేసే ప్రయత్నాలు ప్రారంభించడం. 12.రంజాన్ బక్రీద్ లాంటి పండుగ సమయాలలో పండుగ నిర్వహించుకొనుటకు వాళ్లకు ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేయడం.

13. ముస్లిం పండుగలకు ప్రభుత్వ డబ్బుతో తొఫాలను పంపించడం.

14. వకుఫు బోర్డ్ లకు మరిన్ని ప్రత్యేక అధికారాలు కట్టబెట్టే విధంగా అసెంబ్లీ ప్రయత్నాలు చెయ్యడం.

15. అన్ని ప్రభుత్వ శాఖల్లో వారి యొక్క రిజర్వేషన్ కోటా కంటే ఎక్కువగా ఉద్యోగులను నియమించుకోవడం

. ......మొదలగు 

ముస్లిం హఫీజ్మెంట్ తెలంగాణ సర్కార్ ద్వారా జరుగుతుంది. ఇవి నాకు తెలిసినవి మాత్రమే.


 //ఇంకా ఉండొచ్చు *బహుశా*//

పరమార్థాన్ని చెప్పడం కోసమే

 రాజుగారు అంటే మనిషి. 


ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే మనిషిలోని సప్తధాతువులు. 


కొడుకులు వేటకు వెళ్ళడమూ అంటే మనిషి జీవితాన్ని కొనసాగించడం.


జీవితమే ఒక వేట. వేటే ఒక జీవితం.


రాజ కుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే 


 మనిషికి ఉండే అరిషడ్ వర్గాలు ( అనగా 6 )


1.కామ 2.క్రోధ 3.లోభ 4.మోహ 5.మద 6.మాత్సర్యాలు 


వీటన్నిం టిని మనిషి సాధన చేసి ఎండగట్టవచ్చు.

అంటే పూర్తిగా నియంత్రించవచ్చు.

 


అందుకే కథలో ఆరు చేపలను ఎండగట్టినట్టు చెప్పారు. 


రాజుగారి కొడుకులు ఎండబెట్టిన ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు.


ఏమిటా చేప. అది మనస్సు  


దీన్ని జయించడం చాలా కష్టం. 


ఎంత ప్రయత్నించినా అది ఎండదు. 


మనస్సు అంటే ఏమిటి❓


మనస్సు అంటే సంకల్ప వికల్పాలు 


ఒకటి తీరుతుంటే మరొకటి మొలుచుకొస్తుంది.


మొలిచే కోరికలను తీర్చుకుంటూ పోతుంటే జీవితకాలం చాలదు.


కోరికలన్నింటిని జయించేసి మోక్షానికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు.


మోక్షానికి వెళ్ళాలనుకోవడం కూడా ఒక కోరికే.


 

ఆ కోరికను ఎండగడితే తప్ప మోక్షం రాదు. 


ఈ చేప ఎండకుండా అడ్డు తగులుతున్నది ఏది❓

గడ్డిమేటు.


గడ్డిమేటు అంటే ఏమిటి❓


కుప్పపోసిన అజ్ఞానం.


గడ్డిమేటులా పేరుకుపోయిన అజ్ఞానాన్ని తొలగించా లంటే ఎలా❓


మామూలు గడ్డికుప్ప అయితే గడ్డిపరకలను పట్టి లాగీ, పీకి ఒకనాటికి ఖాళీ చేయవచ్చు.


కానీ అజ్ఞానం అలాంటిది కాదు. జ్ఞానాదాయ కమైన మాటలు ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డిపరకలను లాగినట్టే‼️


ఆ కుప్ప తరిగేది కాదు, తగ్గేది కాదు.


 

దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం కష్టం.


మరి అది పోవాలంటే ఏం చేయాలి❓


ఆవు వచ్చి మేయాలి.


ఆవు ఎక్కడి నుంచి రావాలి. అసలు ఆవు అంటే ఏమిటి❓


ఆవు అంటే జ్ఞానం.


జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి మేస్తే అజ్ఞానం అనే గడ్డికుప్ప ఒకనాటికి అంతరించి పోతుంది.


లేదూ… జ్ఞానాన్ని అగ్నికణంగా మార్చి గడ్డిమేటు మీద వేస్తే కాలి బూడిదవుతుంది.


అందుకే భగవద్గీతలో మన కర్మలు, వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెబుతాడు కృష్ణుడు

(జ్ఞానాగ్నిదగ్ధకర్మాణాం) 


జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగిన వాడు సిద్ధపురుషుడు, యోగ పురుషుడు మాత్రమే. 


 ఈ గోవును ఎవ్వరు మేపాలి. 


గొల్లవాడు మేపాలి. గొల్లవాడు అంటే ఎవరు❓


సమర్ధ సద్గురువు..

జగద్గురుడు.


జ్ఞానరూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు గొల్లవాడే కదా‼️


అర్జునుడు అనే దూడను అడ్డు పెట్టుకుని వేదం అనే ఆవు పాలు పిండి జ్ఞానరూపంగా మనందరికి ధారపోశాడు. 


ఇంత గొప్పపని చేయవలసిన ఈ గొల్లవాడు ఆ పని చేయలేదు.


ఏమిరా నాయనా‼️ఆవును ఎందుకు మేపలేదు అని అడిగితే అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు. 


ఇంతకీ ఆ గొల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు❓


అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ. ఆమెనే లోకం జగన్మాత అని కీర్తిస్తుంది.


ఈ జగన్మాత అన్నం పెట్టక పోవడం వల్ల గొల్లవాడి ఆకలి తీరలేదు. 


ఓ జగన్మాతా ఈ గొల్లవాడికి ఎందుకు అన్నం పెట్టలేదమ్మా అంటే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అంది.


ఇంతకి ఆ పిల్లవాడు ఎవరు❓ఆర్తితో దైవానుగ్రహం కోసం అలమటించేవాడు. 


ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు❓


వాడికి చీమ కుట్టింది. ఎక్కడిది చీమా❓దానికి ఇంకోపేరే సంసారం.


సంసారం అనే చీమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు.


ఆవులను మేపడానికి వచ్చే గొల్లవాడికన్నా ఆర్తితో దైవానుగ్రహం కోసం ఏడ్చే పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్ల వాడినే చూసుకుంది.

మరి గొల్లవాడు అమ్మ అన్నం పెట్టక పోవడం వలన తన విధిని నిలిపి వేసాడా? లేదు. 

అమ్మ ద్వారా తన పనిలో భాగమైన శిష్ట రక్షణను చేసుకున్నాడు.


చీమకుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే సంసార బాధలు, ప్రపంచ బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తున్నాం,


మనల్ని ఈ బాధలే చీమలై కుడుతున్నాయి. 


చీమలు పుట్టలోనే ఉంటాయి. ఏమిటీ ఈ పుట్ట❓


మనిషికి ఉండే సంసారం ఒక పుట్ట. 


ఈ పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలోకి అడుగు పెట్టే ముందే ఈ గొప్ప విషయం తెలియాలనే సదుద్దేశంతోనే మన పెద్దలు ఈ కథను ప్రతి పిల్లవాడికి నూరిపోశేవారు.

చమక్కులు

 *(తెలుగు భాషాభిమానులందరు చదివి తీరవలసిందే)*

తెలుగుభాషలోని *చమక్కులు* బలేగా ఉంటయ్యండి మరి:అవి ఎలాగుంటయ్యె కొన్ని చూద్దామండి*:

నిజమే మరి *చచ్చిన*" అనే పదాన్నికూడా బతికించే భాష *తెలుగుభాష!*


భాషాపరంగా తెలుగువాడికి సాటి ఇంకొకడు లేడు. అందరిదీ ఒక దారైతే మనవాడిది ఇంకోదారి! 


అందరూ పొగ *పీలిస్తే* తెలుగువాడు పొగ *తాగుతాడు.* 


-ఇంతేకాదు తెలుగువాడు దెబ్బలు *తింటాడు* అని అంటాడు. దెబ్బలు ఏమైనా తినే పదార్థాలా? అంటే ఉలకడు పలకడు. 


      *సంస్కృతం* అమరభాష అంటారు. దాని సంగతేమో కానీ తెలుగు మాత్రం కచ్చితంగా అమరభాషే! ఇందుకు ఉదాహరణలు ఉన్నాయి. 

ఎవరి మీద అయినా ప్రేమ వచ్చినా, కోపమొచ్చినా *సచ్చినోడా*’ అని తెలుగువాడు పిలుస్తాడు. ‘సచ్చినోడు’ ఎలా పలుకుతాడని ఆలోచించడు. 


*చచ్చినా* ఒప్పుకోను అంటాడు. చస్తే ఎలా ఒప్పుకుంటాడు? చచ్చినాక ఒప్పుకుని చూపించిన వాడు ఒక్కడైనా ఉన్నాడా? 


*ఆశ* చావడం లేదంటాడు. చెట్లకే ప్రాణం ఉందని చెప్పుకునే చావనివాళ్లు ఇంకా ఉన్నారు. అలాంటి వాళ్లు ఆశకు ప్రాణం ఉంటుందని ఎలా ఒప్పుకుని ‘చస్తా’రు? 


*తెలుగువాడు* కంటి చూపుతో చంపేస్తాడు. అతడి శక్తి అలాంటిది మరి. 


ఇలాంటి అతీత శక్తులు యావత్‌ ప్రపంచంలో తెలుగువాడికి మాత్రమే ఉన్నాయి. 

ఎంత గొప్ప! ఎంత చిత్రం !


 *మత్తు* పానీయాలైన సారా, బ్రాందీ, విస్కీలను *‘సేవిస్తున్నా*’ నంటాడు. అదే సమయంలో మంచినీళ్లు తాగుతున్నానంటాడు తప్ప సేవిస్తున్నాననడు. 

ఇదేం చిత్రమో! 


ఇంకా విచిత్రమేంటంటే మందు *కొడుతున్నా*’ నంటాడు. కొట్టడానికి మందేమన్నా మనిషా? పశువా? 


*బాతాఖానీ కొట్టకు* అంటాడు. దీని పరిస్థితీ ఇదే. 


*అనారోగ్యకరమైన నిషా పానీయాన్ని* ఆరోగ్యప్రదాయిని అయిన మందు పేరుతో పిలుస్తాడు! అంతా ‘మందే’ అనుకునేవాడు తప్ప ఇంకెవ్వడైనా ఈ పని చేయగలడా? 


*తెలుగువాడు* ఎందులోనైనా ఆటను చూడగలడు. మాట్లాడతానంటాడు. పోట్లాడతానంటాడు. 


*మనస్ఫూర్తిగా* కోరుకుంటున్నానంటాడు. మనసు పూర్తిగా కాకుండా అందులో ఏభై శాతమో, డెబ్భైఅయిదు శాతమో ఉంచి కోరుకుంటాడా ఏంటి? 


ఇంకోమాట! 


*హృదయపూర్వకంగా* అభినందిస్తున్నానంటాడు. కాసేపు హృదయాన్ని పక్కనబెడితే, అభినందించే అవకాశం ఉందా? ఉంటుందా? 


*తెలుగువాడి ‘న్యాయమే’ వేరు*. 


బడాయి గాని, మాట మాట్లాడితే *మనస్సాక్షిగా* అంటాడు. మనసుకు ఏమన్నా రూపం ఉందా? మాట ఉందా? వచ్చి సాక్ష్యం చెప్పడానికి! 


*అగ్నిసాక్షిగా* పెళ్లాడాను అని కూడా అంటాడు. అగ్ని ఏదో చిటపటలాడుతుంది కానీ ఎవరైనా సంసారంలో చిచ్చుపెడితే అదొచ్చి అడ్డుపడుతుందా ఏంటి? 


*కళ్లలో నిప్పులు* పోసుకుంటున్నాడంటాడు! పోసుకోమనండి చూద్దాం! 


పెళ్లికాని ఆడపిల్లను, *గుండెల మీద కుంపటి* అంటాడు. ఇది ఎంత తప్పు! గుండెల మీద కుంపటి పెట్టుకున్న మొనగాళ్లు యావత్‌ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? 


*మాటేగా* ఏదైనా అంటాడు. *గుండె మీద బరువు* తగ్గించుకున్నానంటాడు. గుండెల మీద బట్టల బరువు తప్ప ఇంకేం బరువు ఉంటుంది! 


*నవ్వితే నవరత్నాలు* రాలతాయంటాడు. రత్నాలా పాడా? మరీ గట్టిగా నవ్వితే పళ్లు రాలిపోతాయేమో! *చిటికెలో పని* అయిపోతుందంటాడు. 

అతిశయం కాకపోతే చిటికె వేస్తే శబ్దం అవుతుంది కానీ పని ఎలా అవుతుంది !

 

*ఒట్టిమాటలు కట్టిపెట్టోయ్‌* అని గురజాడ చెప్పినా మనవాళ్లు వినరు. 


అప్పు తీసుకునేటప్పుడు *నీ డబ్బు వడ్డీతో సహా పువ్వుల్లో పెట్టి* ఇస్తా’నంటారు. వడ్డీ ఇస్తే ఇవ్వచ్చుగానీ పువ్వుల్లో పెట్టి ఇచ్చినవాడు ఎవడైనా ఉన్నాడా? ఇది అప్పిచ్చిన పిచ్చివాడి చెవిలో పువ్వు పెట్టడం కాదూ! 


*ఎవరో చిన్నచూపు* చూస్తున్నారని తెలుగువాడు ఆక్షేపిస్తాడు. దూరపు చూపు, దగ్గరి చూపు ఉంటాయి తప్ప చిన్న చూపు, పెద్ద చూపు అని ఎక్కడైనా ఉంటాయా? 


*వంట చేయడాన్ని చేయి కాల్చుకోవడం* అంటాడు. ఇదే నిజమైతే ఆడవాళ్ల చేతులన్నీ ఏమైపోయేవి !

 

 *సంగీతమంటే చెవి కోసుకుంటానని* ఒక్కొక్కరు వంకర్లు తిరిగిపోతుంటారు. అయితే అతడు ఎంతసేపు పాటలు వింటున్నా కోసుకున్న చెవి కిందపడదే అని నిరాశ పడ్డవాళ్లూ ఉన్నారు. 


*తప్పు చేసినవాడు అడ్డంగా దొరికిపోయాడు* అంటారు. దొరికినవాడెవడైనా అడ్డంగా దొరుకుతాడా? నిలువుగా దొరుకుతాడు తప్ప. 


*అన్నట్టు గిట్టనివాణ్ని అడ్డమైనవాడు* అని తిడతారు. అదేంటి? దాని భావ మేంటి? పండితార్థం ఏమైనా పిండితార్థం ఒకటుంది. 


*పశువా* అని తిట్టినట్టు. మనుషులు నిలువుగా ఉంటారు. పశువులు అడ్డంగా ఉంటాయి. అదీ సంగతి! 


*ఎవడి మీదైనా కోపం వస్తే ఏ మొహం పెట్టుకుని* వచ్చావంటాడు తెలుగువాడు. ఎవడికైనా ఒకటే ముఖం ఉంటుంది కానీ బ్రహ్మలాగా నాలుగు ముఖాలు, రావణబ్రహ్మలాగా పది ముఖాలు ఉండవు కదా! 


*ఫలానావాడు తలలు మార్చేరకం* అనేది కూడా తెలుగువాడి వాడుక. ఇదెలా సాధ్యం? వినాయక వృత్తాంతంలోలాగా తలలు మార్చేశక్తి సామాన్య మానవులకు ఉంటుందా ?


*తెలుగువాడు బండ చాకిరీ* చేస్తానంటాడు. బండ దాని మొహం! ఎక్కడ పడేస్తే అక్కడే ఉంటుంది కానీ అది చేసే చాకిరీ ఏముంటుంది? 


*అదెంతపని ఎడమ చేత్తో చేస్తానంటాడు*. ఎడమ చేత్తో చేసే పనులేంటో అందరికీ తెలుసు. దానితో అన్ని పనులూ అతివేగంగా చేస్తానంటే ఎలా కుదురుతుంది? 


*అన్నం ఉడకలేదా* అంటాడు. ఇదేంటి? ఉడికితే కానీ అన్నం కాదు కదా! 


*జోకులు పేల్లేదు* అంటాడు. జోకు ఏమైనా బాంబా? పేలడానికి! 


*వీపు విమానం మోత* మోగుతుందని అంటాడు. విమానం మోత మోగితే ఆ వీపు అసలు ఉంటుందా? మనిషి అసలు ఉంటాడా? 


*లేస్తే మనిషిని కానంటాడొకడు*. మరి లేచినవాళ్లందరూ ఏంటి? అలాంటప్పుడు కూర్చుని ఉంటేనే మేలు కదా! 


*శక్తిని కూడా భక్తికి ముడి* పెట్టడం తెలుగువాడికి రివాజు. 


*ఉన్న పూజలు చాలక బడితెపూజ ఒకటి*.


  *జంతువుల్లో* కూడా దేవుళ్లను చూసుకుని భారతీయులు ఆరాధిస్తారు. ఇందుకు తెలుగువాడు కూడా మినహాయింపు కాదు. ఎటొచ్చీ మనుషుల్లో జంతువుల్ని చూడటం అతగాడి ప్రత్యేకత. 


*గిట్టనివాళ్లను పంది, కుక్క, గాడిద* అని తిట్టే తెలుగువాడు, ఇష్టమైనవాణ్ని పులి, సింహం, గుర్రం అని అభిమానంగా చూస్తాడు. పిలుస్తాడు.


*ఏదైనా కళ్లారా చూస్తే తప్ప నమ్మకూడదు. తెలుగు భాష ఇందుకు ఇంపు అయిన మినహాయింపు. 

*గుండె జారిపోయింది* అంటారు. ఇప్పటివరకు ఎవరికైనా జారిపోయిందా? లేదే! 


*నీ నోరు పడిపోను* అని తిట్టిపోస్తారు. ఎవరి నోరు అయినా ఎప్పుడైనా పడిపోవడం చూశామా? 


*పాడమని అడిగితే గాయకులు గొంతుపోయింది* అంటారు. గొంతు ఎక్కడికి పోతుంది? పోతే ఎవరు తీసుకురాగలరు? 


*నోరు పారేసుకోవడం* అంటారు. అది ఎలా సాధ్యం? 


*మా ఆయనకు నోట్లో నాలుకలేదని* ఓ ఇల్లాలు వాపోతుంటుంది. నోట్లో నాలుక లేకుండా మనిషి ఎలా ఉంటాడు? 


*‘వాసన చూడు*’ అంటారు. వాసనను పీలుస్తారు కానీ ఎలా చూస్తాం? 


*రుచి చూడటం* కూడా అంతే. ఎవరు చూడగలరు? 


 *పత్రికలు చదివి చదివి వాటిలోని పడికట్టు మాటలను కంఠస్థం చేసేశాడు తెలుగువాడు* 


*ఫలానావాడు *బాధకు గురయ్యాడు* అంటాడు. మధ్యలో గురి ఎందుకు? బాధపడ్డాడు అనొచ్చుగా. 


*దిగ్భ్రాంతి* వ్యక్తం చేశాడంటారు. దిగ్భ్రాంతి చెందాడు అనడు. దిగ్భ్రాంతిని ఎలా వ్యక్తం చేస్తాడంటే చెప్పడు. 


*తప్పు చేస్తే పాపం అంటాడు* సరే. ఎదుటివాడు కష్టాల్లో ఉంటే అయ్యో ‘పాపం’! అంటాడు. తెలుగు భాష ఏమన్నా పుణ్యానికి వచ్చిందా ఏంటి?


 *అందుకే మరి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు ఒక పెద్దాయన*

తెలుగు భాషా జిందాబాద్‌:

💐💐💐

బ్రాహ్మణుడు మోక్షాన్ని పొందగలడు.

బ్రాహ్మణుడు  మోక్షాన్ని పొందగలడు

అనాదిగా మన హిందువాసాంప్రదాయంలో బ్రాహ్మణులు ప్రధాన భూమిక వహిస్తూ వస్తున్నారు. రామాయణ, మహాభారతాది ఇతిహాస కాలంనుండి నేటి కాలం వరకు కూడా సమాజముకు హితంచేయటానికి బ్రాహ్మణులు వారి మేధో సంపత్తిని  వినియోగిస్తున్నారు. మనం ఒక మంచి సినిమా, నాటకం, చూసామంటే దానివెనుక తప్పకుండా ఎక్కడో అక్కడ బ్రాహ్మణుని మేధస్సు దాక్కొని ఉంటుందిఒక క్రొత్త ఆవిష్కరణ జరిగింది అంటే దానికి బ్రాహ్మణుడు ప్రత్యక్షముగానో పరోక్షముగానో తోట్పాడి వుంటాడన్నది సత్యం

మనం మన చరిత్రను పరిశీలించినట్లయితే కాలంలోకూడా బ్రాహ్మణుడు ధనవంతుడిగా మనకు కనపడలేదుకేవలం రామాయణంలో శ్రీ రావణ బ్రహ్మగారు ధనవంతునిగా మనకు  కనపడతారు. నిజానికి ధనవంతుడైన శ్రీ కుబేరులవారు బ్రాహ్మణులు అయినను మరి ఎందుకో అయన బ్రాహ్మణుల పట్ల శ్రార్ధ వహించలేదో మరి

బ్రాహ్మణులు అనాదిగా వారి మేధస్సుతో అనేక శాస్త్రీయ ఆవిష్కరణలు చేసి సమాజానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు, చేస్తున్నారు

అగ్రతశ్చతురో వేదాః పృష్ఠతః సశరం ధనుః
ఇదం బ్రాహ్మమిదం క్షాత్రం శాపాదపి శరాదపి 66
 

తాత్పర్యము-
(
ఇది పరశురాముణ్ణి గూర్చి చెప్పినది). 

ఎదుట (ముఖంలో) నాలుగు వేదాలు; వీపుమీద బాణాలతో కూడిన ధనస్సు, ఇదిగో నా దగ్గర బ్రాహ్మ తేజస్పూ ఉంది క్షాత్రపరాక్రమమూ ఉంది, శాపం చేతనైనా సాధిస్తాను, శరం చేతనైనా సాధిస్తాను.

కాబట్టి నేటి బ్రాహ్మలు ప్రతివారు పరాశరాముని లాగా కావలసిన ఆవశ్యకత వున్నది

పూర్వం బ్రాహ్మణులు రాజులను సహితం శాసించేవారునేడు బ్రాహ్మణులు నటరాజులను కూడా శాసించే స్థితిలో లేరు ఎందువల్ల అని ప్రతి బ్రహ్మమనుడు యోచించాల్సిన సమయం వచ్చింది

ఆత్మా విమర్శ చేసుకోవాలి

మన హిందూ సనాతన ధర్మంలో ప్రతి మనిషి ఆచరించవలసిన ధర్మాలను చెప్పారుకానీ బ్రాహ్మణునికి తత్ బిన్నంగా తాను రెండు ధర్మాలను ఆచరించవలసి వున్నదిఅది ఏమిటంటే ఒకటి తన స్వధర్మాచరణ రెండు సమాజంలో ప్రతివానిచే వారి వారి ధర్మాలను వారు ఆచరించే విధంగా ఉద్యుక్తులను చేయటం. ముందుగా ప్రతి బ్రాహ్మడు తన స్వధర్మాన్ని చక్కగా ఆచరించవలసి వున్నది

బ్రాహ్మణుడు ఆచరించవలసిన షట్కర్మలు (యజనం యాజనం అధ్యయనం అధ్యాపనం దానం- ప్రతిగ్రహణం) చెప్పబడ్డాయి. వాటిలోప్రతిగ్రహణం కూడా ఒకటి. బ్రాహ్మణుడు ఏకార్యాన్నైనా లోకహితం కోసమే చేయాలి.సమాజంలోఅన్ని రకలవారితో మైత్రీ భావాన్ని వహించాలి. తన జీవిత పరమావధి మోక్షంగానే ఎంచాలి. ఎట్టి పరిస్థితులలోను సమాజానికి కీడు చేసే కార్యాన్నికూడా తలపెట్టకూడదు. తాను ధర్మాన్ని ఆచరించి ఇతరులను ధర్మాచరణవైపు నడవటానికి మార్గదర్శనం వహించాలి. యజ్ఞ యాగాది కర్మలు సమాజ శ్రేయస్సుకోసం తాను ఆచరించి ఇతరులను ఆచరించేటట్లు ప్రేరేపించాలి. సత్వ,రజో , తమో గుణాలలో కేవలం సత్వగుణానికే ప్రాధాన్యతనిచ్చి సాత్వికునిగా జీవితాన్ని గడపాలి. నిత్యకర్మలను క్రమం తప్పకుండా ఆచరించాలి. నిత్యం గాయత్రి జపం చేసి జపఫలితాన్ని సమాజ శ్రేయస్సుకోసం ఈశ్వరార్పణ చేయాలి జగత్తుకు రాజు ఈశ్వరుడుఈశ్వరుడు సదా ధ్యానంలో వుంటారు. ఆయనకు వున్నశక్తి అపారంబ్రాహ్మడు ఆయనను మరింత బలోపేతం చేసి జగత్తును సుభిక్షంగా చూడటానికి తాను చేసే కర్మలను ఈశ్వరార్పణ గా చేయాలి. ఈశ్వరుని అనుగ్రహంతోటే సకాలంలో వర్షాలు పడుతాయి, భూములు సస్యశామలంగా ఉంటాయిధాన్యం సమృద్ధిగా లభిస్తుంది. ప్రజలు ఈతిబాధలు లేకుండా సంతోషంగా వుంటారు. బ్రాహ్మణుడు తన హితంకన్నా సమాజ హితాన్ని ఎక్కువగా కోరుకోవాలితాను ఎలాంటి ప్రలోభాలకు లొంగకూడదు, కేవలం తన ధర్మాచరణతో లభించిన దానినే స్వేకరించి జీవనం చేయాలి. సాటి మానవుల యెడ సాటి జీవుల యెడ అనగా మన చుట్టూ సంచరించే పిల్లి, కుక్క, పశుపక్ష్యాదులమీద దయ కలిగి ఉండాలి. నిత్యం బ్రహ్మి ముహూర్తంలోనే మేలుకొనాలితాను మోక్షార్ధి అయి తపమాచరించాలి. బ్రాహ్మణులను భూసురులు బ్రహ్మజ్ఞాన వాంస్తు బ్రాహ్మణః అని బ్రాహ్మణునికి నిర్వచనం చెప్పారు సనాతనులైన మన పూర్వీకులు.

బ్రాహ్మణుడైన వాడు నిత్య ఆచార వంతుడై, అనుష్ఠాన పరుడై, స్వాధ్యాయమును సాగించుచూ క్రొత్త విషయములను వేదములనుండి గ్రహించుచూ, తనకు తెలిసిన వాటిని తెలియని వారికి తెలుపుచూ ఉండవలెను. తాను ఎంత శ్రమకు ఓర్చి అయినను నిత్యానుష్ఠాన,దేవతార్చనాదులను ఆచరించ వలెను. ఆవిధముగా ఆచరించినపుడు మాత్రమే అతడుభూసురుడుఅన్న మాటకు తగిన వాడు అవుతాడు. అటులకాని వాడు భూలోకమున దేవతల రూపముధరించిన కలిపురుషుడే కానీ మరొకడు కాదు.

దైవాధీనం జగత్ సర్వం |  మంత్రాధీనంతు దైవతం ||
తన్మంత్రం బ్రాహ్మణాధీనం | బ్రాహ్మణో మమ దేవత ||

జగత్తు మొత్తము దైవము యొక్క అధీనంలో వుంటుంది. దేవతలు మంత్రముల ద్వారా సంతృప్తి చెంది, మంత్రములకు అధీనులై వుంటారు. మంత్రము సాత్విక లక్షణములు కలిగిన బ్రాహ్మణుల అధీనంలో వుంటుంది. కాబాట్టి అటువంటి బ్రాహ్మణులు దేవతా స్వరూపములు అని తెలుసుకోవాలి

 పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం చేత, మనుష్యులలో బ్రాహ్మణ జన్మ లభిస్తుంది. కానీ, లభించిన జన్మలో చెడు మార్గాల వైపు ప్రయాణం చేస్తూ వుంటే మాత్రం, అందుకు తగిన పరిహారం ఖచ్చితంగా చేల్లించుకోవాలి. వచ్చే జన్మ సంగతి ఎలా వున్నా, జన్మలోనే ముందు దోషముల ఫలితాన్ని అనుభవించక తప్పదు. ఉద్యోగాలు చేసుకునే బ్రాహ్మణుల విషయం ఎలా వున్నా, కనీసం వైదికంలో వుండే బ్రాహ్మణులు (హిందూ ప్రీస్ట్) మాత్రం కొన్ని కనీస నియమాలు పాటించాలి. అవి పాటించటం కష్టం అనుకుంటే, వైదికవృత్తి వదిలేసి వేరే వృత్తి చూసుకోవటం మంచిది.

పవిత్రద్రవ్య ధారణ :
ముఖము నందు బ్రహ్మ తేజస్సు కనిపించాలి. ఎల్లవేళలా, నుదిటిన కుంకుమ లేక విభూది లేక గంధము ధరించినవాడై వుండాలి. వారిని చూస్తే గురు భావన కలగాలి. బ్రాహ్మణుడైన వారు ఎట్టి పరిస్థితిలోకూడా ఇతరులను బాధకలిగించే పని ఏది చేయకూడదుసదా ఇతరులతో ప్రియవచనములనే పలుకుతూ సర్వులకు ప్రీతిపాత్రులుగా ఉండవలెను. అప్పుడే తాను ప్రశాంతంగా ఉండగలడు ఇతరుల ప్రశాంతతకు తాను కారణం కాగలడుసదా యావత్ ప్రపంచం బ్రాహ్మణుని సన్నిధిలో ఉండుటకు, అతని వాక్కుని వినుటకు ఆసక్తిచూపునట్లు తాను వ్యవహరించవలెను. :

సత్కర్మ నిత్స్చ సత్ఫలితం
దుష్కర్మ ఏన దుష్ఫలం
అచ్యుత్కట పున్య పాపానాం
సత్యం వరాని భవమిహం

సత్కర్మలు చేసినచో సత్ఫలితాలు వస్తాయి అలానే దుష్కర్మలను ఆచరించిన దుష్ట ఫలితాలు వస్తాయి. అనగా మనం చేసే కర్మలను బట్టి కర్మపఃలితాలు ఉంటాయి. మంచికర్మల ఫలంగా పుణ్యం, దుష్ట కర్మల ఫలంగా పాపము మనకు సంక్రమిస్తాయిగతజన్మలో పుణ్యకర్మలు చేసినవారే వారి కర్మల ఫలితంగా జన్మలో బ్రాహ్మణులుగా పుడతారు. బ్రాహ్మణులుగా జన్మించటం ఒక ఎత్తు అయితే బ్రాహ్మణులుగా జీవించి అరిషడ్వార్గాన్ని జయించి నిత్యా  సాధన చేయటానికి బ్రాహ్మణ జన్మ ఉత్తమమైనది. బ్రాహ్మణుడి మేధస్సు  గొప్పది,అతనికి సుష్మగ్రాహ్యత  ఉంటుంది. కాబట్టి సదా సత్కర్మలను ఆచరిస్తూ, సత్వగుణ సంపత్తి గలిగి వుండే బ్రాహ్మణుడు జన్మలోనే మోక్షాన్ని పొందగలడు. .

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతిశాంతిహి 

మీ భార్గవ శర్మ