9, అక్టోబర్ 2022, ఆదివారం

బ్రాహ్మణుడు మోక్షాన్ని పొందగలడు.

బ్రాహ్మణుడు  మోక్షాన్ని పొందగలడు

అనాదిగా మన హిందువాసాంప్రదాయంలో బ్రాహ్మణులు ప్రధాన భూమిక వహిస్తూ వస్తున్నారు. రామాయణ, మహాభారతాది ఇతిహాస కాలంనుండి నేటి కాలం వరకు కూడా సమాజముకు హితంచేయటానికి బ్రాహ్మణులు వారి మేధో సంపత్తిని  వినియోగిస్తున్నారు. మనం ఒక మంచి సినిమా, నాటకం, చూసామంటే దానివెనుక తప్పకుండా ఎక్కడో అక్కడ బ్రాహ్మణుని మేధస్సు దాక్కొని ఉంటుందిఒక క్రొత్త ఆవిష్కరణ జరిగింది అంటే దానికి బ్రాహ్మణుడు ప్రత్యక్షముగానో పరోక్షముగానో తోట్పాడి వుంటాడన్నది సత్యం

మనం మన చరిత్రను పరిశీలించినట్లయితే కాలంలోకూడా బ్రాహ్మణుడు ధనవంతుడిగా మనకు కనపడలేదుకేవలం రామాయణంలో శ్రీ రావణ బ్రహ్మగారు ధనవంతునిగా మనకు  కనపడతారు. నిజానికి ధనవంతుడైన శ్రీ కుబేరులవారు బ్రాహ్మణులు అయినను మరి ఎందుకో అయన బ్రాహ్మణుల పట్ల శ్రార్ధ వహించలేదో మరి

బ్రాహ్మణులు అనాదిగా వారి మేధస్సుతో అనేక శాస్త్రీయ ఆవిష్కరణలు చేసి సమాజానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు, చేస్తున్నారు

అగ్రతశ్చతురో వేదాః పృష్ఠతః సశరం ధనుః
ఇదం బ్రాహ్మమిదం క్షాత్రం శాపాదపి శరాదపి 66
 

తాత్పర్యము-
(
ఇది పరశురాముణ్ణి గూర్చి చెప్పినది). 

ఎదుట (ముఖంలో) నాలుగు వేదాలు; వీపుమీద బాణాలతో కూడిన ధనస్సు, ఇదిగో నా దగ్గర బ్రాహ్మ తేజస్పూ ఉంది క్షాత్రపరాక్రమమూ ఉంది, శాపం చేతనైనా సాధిస్తాను, శరం చేతనైనా సాధిస్తాను.

కాబట్టి నేటి బ్రాహ్మలు ప్రతివారు పరాశరాముని లాగా కావలసిన ఆవశ్యకత వున్నది

పూర్వం బ్రాహ్మణులు రాజులను సహితం శాసించేవారునేడు బ్రాహ్మణులు నటరాజులను కూడా శాసించే స్థితిలో లేరు ఎందువల్ల అని ప్రతి బ్రహ్మమనుడు యోచించాల్సిన సమయం వచ్చింది

ఆత్మా విమర్శ చేసుకోవాలి

మన హిందూ సనాతన ధర్మంలో ప్రతి మనిషి ఆచరించవలసిన ధర్మాలను చెప్పారుకానీ బ్రాహ్మణునికి తత్ బిన్నంగా తాను రెండు ధర్మాలను ఆచరించవలసి వున్నదిఅది ఏమిటంటే ఒకటి తన స్వధర్మాచరణ రెండు సమాజంలో ప్రతివానిచే వారి వారి ధర్మాలను వారు ఆచరించే విధంగా ఉద్యుక్తులను చేయటం. ముందుగా ప్రతి బ్రాహ్మడు తన స్వధర్మాన్ని చక్కగా ఆచరించవలసి వున్నది

బ్రాహ్మణుడు ఆచరించవలసిన షట్కర్మలు (యజనం యాజనం అధ్యయనం అధ్యాపనం దానం- ప్రతిగ్రహణం) చెప్పబడ్డాయి. వాటిలోప్రతిగ్రహణం కూడా ఒకటి. బ్రాహ్మణుడు ఏకార్యాన్నైనా లోకహితం కోసమే చేయాలి.సమాజంలోఅన్ని రకలవారితో మైత్రీ భావాన్ని వహించాలి. తన జీవిత పరమావధి మోక్షంగానే ఎంచాలి. ఎట్టి పరిస్థితులలోను సమాజానికి కీడు చేసే కార్యాన్నికూడా తలపెట్టకూడదు. తాను ధర్మాన్ని ఆచరించి ఇతరులను ధర్మాచరణవైపు నడవటానికి మార్గదర్శనం వహించాలి. యజ్ఞ యాగాది కర్మలు సమాజ శ్రేయస్సుకోసం తాను ఆచరించి ఇతరులను ఆచరించేటట్లు ప్రేరేపించాలి. సత్వ,రజో , తమో గుణాలలో కేవలం సత్వగుణానికే ప్రాధాన్యతనిచ్చి సాత్వికునిగా జీవితాన్ని గడపాలి. నిత్యకర్మలను క్రమం తప్పకుండా ఆచరించాలి. నిత్యం గాయత్రి జపం చేసి జపఫలితాన్ని సమాజ శ్రేయస్సుకోసం ఈశ్వరార్పణ చేయాలి జగత్తుకు రాజు ఈశ్వరుడుఈశ్వరుడు సదా ధ్యానంలో వుంటారు. ఆయనకు వున్నశక్తి అపారంబ్రాహ్మడు ఆయనను మరింత బలోపేతం చేసి జగత్తును సుభిక్షంగా చూడటానికి తాను చేసే కర్మలను ఈశ్వరార్పణ గా చేయాలి. ఈశ్వరుని అనుగ్రహంతోటే సకాలంలో వర్షాలు పడుతాయి, భూములు సస్యశామలంగా ఉంటాయిధాన్యం సమృద్ధిగా లభిస్తుంది. ప్రజలు ఈతిబాధలు లేకుండా సంతోషంగా వుంటారు. బ్రాహ్మణుడు తన హితంకన్నా సమాజ హితాన్ని ఎక్కువగా కోరుకోవాలితాను ఎలాంటి ప్రలోభాలకు లొంగకూడదు, కేవలం తన ధర్మాచరణతో లభించిన దానినే స్వేకరించి జీవనం చేయాలి. సాటి మానవుల యెడ సాటి జీవుల యెడ అనగా మన చుట్టూ సంచరించే పిల్లి, కుక్క, పశుపక్ష్యాదులమీద దయ కలిగి ఉండాలి. నిత్యం బ్రహ్మి ముహూర్తంలోనే మేలుకొనాలితాను మోక్షార్ధి అయి తపమాచరించాలి. బ్రాహ్మణులను భూసురులు బ్రహ్మజ్ఞాన వాంస్తు బ్రాహ్మణః అని బ్రాహ్మణునికి నిర్వచనం చెప్పారు సనాతనులైన మన పూర్వీకులు.

బ్రాహ్మణుడైన వాడు నిత్య ఆచార వంతుడై, అనుష్ఠాన పరుడై, స్వాధ్యాయమును సాగించుచూ క్రొత్త విషయములను వేదములనుండి గ్రహించుచూ, తనకు తెలిసిన వాటిని తెలియని వారికి తెలుపుచూ ఉండవలెను. తాను ఎంత శ్రమకు ఓర్చి అయినను నిత్యానుష్ఠాన,దేవతార్చనాదులను ఆచరించ వలెను. ఆవిధముగా ఆచరించినపుడు మాత్రమే అతడుభూసురుడుఅన్న మాటకు తగిన వాడు అవుతాడు. అటులకాని వాడు భూలోకమున దేవతల రూపముధరించిన కలిపురుషుడే కానీ మరొకడు కాదు.

దైవాధీనం జగత్ సర్వం |  మంత్రాధీనంతు దైవతం ||
తన్మంత్రం బ్రాహ్మణాధీనం | బ్రాహ్మణో మమ దేవత ||

జగత్తు మొత్తము దైవము యొక్క అధీనంలో వుంటుంది. దేవతలు మంత్రముల ద్వారా సంతృప్తి చెంది, మంత్రములకు అధీనులై వుంటారు. మంత్రము సాత్విక లక్షణములు కలిగిన బ్రాహ్మణుల అధీనంలో వుంటుంది. కాబాట్టి అటువంటి బ్రాహ్మణులు దేవతా స్వరూపములు అని తెలుసుకోవాలి

 పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం చేత, మనుష్యులలో బ్రాహ్మణ జన్మ లభిస్తుంది. కానీ, లభించిన జన్మలో చెడు మార్గాల వైపు ప్రయాణం చేస్తూ వుంటే మాత్రం, అందుకు తగిన పరిహారం ఖచ్చితంగా చేల్లించుకోవాలి. వచ్చే జన్మ సంగతి ఎలా వున్నా, జన్మలోనే ముందు దోషముల ఫలితాన్ని అనుభవించక తప్పదు. ఉద్యోగాలు చేసుకునే బ్రాహ్మణుల విషయం ఎలా వున్నా, కనీసం వైదికంలో వుండే బ్రాహ్మణులు (హిందూ ప్రీస్ట్) మాత్రం కొన్ని కనీస నియమాలు పాటించాలి. అవి పాటించటం కష్టం అనుకుంటే, వైదికవృత్తి వదిలేసి వేరే వృత్తి చూసుకోవటం మంచిది.

పవిత్రద్రవ్య ధారణ :
ముఖము నందు బ్రహ్మ తేజస్సు కనిపించాలి. ఎల్లవేళలా, నుదిటిన కుంకుమ లేక విభూది లేక గంధము ధరించినవాడై వుండాలి. వారిని చూస్తే గురు భావన కలగాలి. బ్రాహ్మణుడైన వారు ఎట్టి పరిస్థితిలోకూడా ఇతరులను బాధకలిగించే పని ఏది చేయకూడదుసదా ఇతరులతో ప్రియవచనములనే పలుకుతూ సర్వులకు ప్రీతిపాత్రులుగా ఉండవలెను. అప్పుడే తాను ప్రశాంతంగా ఉండగలడు ఇతరుల ప్రశాంతతకు తాను కారణం కాగలడుసదా యావత్ ప్రపంచం బ్రాహ్మణుని సన్నిధిలో ఉండుటకు, అతని వాక్కుని వినుటకు ఆసక్తిచూపునట్లు తాను వ్యవహరించవలెను. :

సత్కర్మ నిత్స్చ సత్ఫలితం
దుష్కర్మ ఏన దుష్ఫలం
అచ్యుత్కట పున్య పాపానాం
సత్యం వరాని భవమిహం

సత్కర్మలు చేసినచో సత్ఫలితాలు వస్తాయి అలానే దుష్కర్మలను ఆచరించిన దుష్ట ఫలితాలు వస్తాయి. అనగా మనం చేసే కర్మలను బట్టి కర్మపఃలితాలు ఉంటాయి. మంచికర్మల ఫలంగా పుణ్యం, దుష్ట కర్మల ఫలంగా పాపము మనకు సంక్రమిస్తాయిగతజన్మలో పుణ్యకర్మలు చేసినవారే వారి కర్మల ఫలితంగా జన్మలో బ్రాహ్మణులుగా పుడతారు. బ్రాహ్మణులుగా జన్మించటం ఒక ఎత్తు అయితే బ్రాహ్మణులుగా జీవించి అరిషడ్వార్గాన్ని జయించి నిత్యా  సాధన చేయటానికి బ్రాహ్మణ జన్మ ఉత్తమమైనది. బ్రాహ్మణుడి మేధస్సు  గొప్పది,అతనికి సుష్మగ్రాహ్యత  ఉంటుంది. కాబట్టి సదా సత్కర్మలను ఆచరిస్తూ, సత్వగుణ సంపత్తి గలిగి వుండే బ్రాహ్మణుడు జన్మలోనే మోక్షాన్ని పొందగలడు. .

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతిశాంతిహి 

మీ భార్గవ శర్మ

 

 

కామెంట్‌లు లేవు: