16, డిసెంబర్ 2023, శనివారం

Moon dust


 

Hyderabad metro


 

Clutch plate


 

China technology


 

Uthareni


 

Adventure


 

DIY


 

Para gliding


 

మొదటిరోజు పాశురం*

*తిరుప్పావై మొదటిరోజు పాశురం*

🕉🌞🌏🌙🌟🚩

🕉🌞🌏🌙🌟🚩 


*1.పాశురము*

*ॐॐॐॐॐॐॐॐॐ*


    మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్

    నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్

    శీర్ మల్ గు మాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్ కాళ్

    కూర్ వేల్ - కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్

    ఏరార్ న్దకణ్ణి యశోదై యిళ శింజ్గమ్

    కార్ మేని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్

    నారాయణనే నమక్కే పఱై దరువాన్

    పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్ !


భావము :-


 సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా~ మార్గశీర్ష మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. శూరుడైన నందగోపుని కుమారుడును, విశాల నేత్రియగు యశోదకు బాల సింహము వంటి వాడును, నల్లని మేఘము వంటి శరీరిమును, చంద్రునివలె ఆహ్లాదకరుడును, సూర్యునివలె తేజోమయుడును యైన నారాయణునే తప్పు, యితరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కాలవసినవిచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ యీ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించునట్లుగ దాని కంగమైన మార్గళి స్నానము చేయు కోరికగల వారందరును ఆలసింపక శ్రీఘ్రముగ రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్నియలందరను ఆహ్వానించుచున్నది.


        తిరుప్పావైగీతమాలిక


    అవతారిక:


వ్రతము చేయుటకు అనువైన సమయము, మాసము - మార్గశీర్షమాసము. కనుక భగవత్సంశ్లేషము కోరే భక్తులందరను వ్రతము చేయగా మార్గళి స్నానం చేదురు, రండీ! అని గోదాదేవి ఆహ్వానిస్తున్నది.


    1వ మాలిక


        (రేగుప్తి రాగము -ఆదితాళము)


ప..    శ్రీ గోకుల వాసులారా! - సిరికన్నియలార!

    భావతాపము దీర్చుకొనగ - వ్రతము చేయరండి!


అ.ప..    మార్గశీర్ష మాసమెంతో - మంచిది కద! రండి!

    మనసు పడిన వారెల్లరు -మార్గళి నీరాడ రండి!


1. చ..    ఆపద శంకించి కాచు - ఆనందుని తనయుని

    యశోదమ్మ యొడి యాడెడు - ఆ  బాల సింహుని

    నీలమేఘశ్యాముని - ఇన శశి సమవదమని

    నారాయణు గొలువనిపుడు - నరుల బొగడ రండి


2. చ.    ఈ నోమును నోచు మనము - ఇతరములను కోరము

    పర సాధన మొసగెడి మన - పరమాత్ముడే, సర్వము

    లోకమంత పొగడగ నీ - నోము మనము నోచెదము

    మనసు పడిన వారెల్లరు - మార్గళి నీరాడరండి.


🕉🌞🌎🌙🌟🚩


ఇది మార్గశిరమాసము. వెన్నెల నిండిన మంచిరోజు. ఓ అందమైన ఆభరణాలుగల పడుచులారా ! ఈ మార్గశిర స్నానము చేయవలెనని సంకల్పమున్నచో రండి, ముందు నడవండి. వాడియగు వేలాయుధమును దాల్చి కృష్ణునకు ఏవిధముగు ఆపద రాకుండా కాపాడుచున్న శ్రీనందగోపుల కుమారుడను, అందములగు కన్నులతో అలరుచున్న యశోద యొక్క బాలసింహమును, నీలమేఘశ్యాముడను, ఎర్ర తామరులను పోలిన కన్నులు కలవాడును, సూర్యునివలే ప్రకాశమును, చంద్రునివలె ఆహ్లాదమును ఇచ్చేటటువంటి దివ్య ముఖమండలము కలవాడును అయినవాడు నారాయణుడే. అతనినే తప్ప వేరొకరిని అర్థించని మనకే, మనసు ఉపేక్షించు వ్రాతసాధనమగు 'పర' అను వాద్యమును ఈయనున్నాడు. మనము ఈ వ్రతము చేయుటను చూచి లోకులందరూ సంతోషించునట్లు, మీరు అందరూ వచ్చి, ఈ వ్రతములో చేరండి.                     

అవతారిక

గోపికలు ఈ వ్రతము చేయుటకు అనుకూలమగు కాలము మనకు లభించినదే అని, ఆ కాలమును ముందుగా పొగుడుచున్నారు. ఈ వ్రతము చేయుటకు తగిన వారెవరో నిర్ణయించుకొనుచున్నారు. ఈ వ్రతము చేసి, తాము పొందదగిన ఫలమేమో, దానిని పొందించు సాధనామేమో స్మరించుచు ఈ పాశురమును పాడుచు ఆనందించు చున్నారు.


🕉🌞🌎🌙🌟🚩


 _*తిరుప్పావై ప్రవచనం - 1 వ రోజు*_


*భగవంతుని మొదటి స్థానం నారాయణ తత్వం*


*పాశురము*


*మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్*

    *నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్*

    *శీర్ మల్ గు మాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్ కాళ్*

    *కూర్ వేల్ - కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్*

    *ఏరార్ న్దకణ్ణి యశోదై యిళ శింజ్గమ్*

    *కార్ మేని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్*

    *నారాయణనే నమక్కే పఱై దరువాన్*

    *పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్ !*



*నారాయణ మంత్ర ఉపదేశంతో వ్రత ప్రారంభం*

   

*"మార్గళి త్తింగళ్"* మార్గశిర్షం మంచి మాసం , ఫలమును నిచ్చే మాసం. అలాంటి పన్నెండు మాసాలు మనకు ఒక సంవత్సరం అయితే , అది దేవతలకు ఒక రోజు అంటారు. దక్షిణాయణం వారికి రాత్రి అయితే ఉత్తరాయణం పగలు. సంక్రాంతి రోజు సూర్యుడు దక్షిణాయణం నుండి ఉత్తరాయణంకు మారుతాడు , అంటే సంక్రాంతికి ఒక నెల ముందుగా వచ్చే మార్గశీర్షం వారికి తెల తెల వారే సమయం. సత్వాన్ని పెంచేకాలం. కాబట్టి ఆచరణ ద్వారా మనం ఈమాసాన్ని వినియోగించుకోవాలి. *"మది నిఱైంద నన్నాళాల్"*  చంద్ర కాంతి మంచిగా ఉండే కాలం , చంద్రుడు పెరిగే కాలం కాబట్టి మనం మంచిరోజులుగా భావిస్తాం.  *"నీరాడ ప్పోదువీర్ పోదుమినో"* స్నానం చేయటానికి వెల్దాం ! ఎలాంటి స్నానం అది అంటే భగవంతుని కళ్యాణ గుణాలతో మన పాపాలను కడిగివేసుకొనే స్నానం. *"నేరిళైయీర్"* భగవంతుని గురించి తెలుసుకోవాలనే జ్ఞానం మాత్రం చాలు ఈ వ్రతం చేయటానికి యోగ్యులమే. 



*"శీర్ మల్గుం ఆయ్ ప్పాడి"* పంటలు బాగా పండే ఆ నందగోకులంలోని *"చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్"* సంపన్నులైన గోప పిల్లల్లా ,  మనమూ అవ్వాలి శ్రీకృష్ణ ప్రేమ కోసం.



ఏ భయమూ అవసరం లేదు. *"కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్"* పరమ సాత్వికుడైన నందగోపుని కుమారుడిగా మన వద్దకు వచ్చాడు కదా పరమాత్మ , ఏ అసురుల భారినుండి శ్రీకృష్ణునికి ముప్పు రాకుండా తాను కత్తి ఎల్లప్పుడు పట్టుకొని కాపాడుతూ ఉన్నాడు ఒక ఆచార్యునివలె. మరి నందగోపుడు మనవాడే కదా ! 



*"ఏరారుంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం"* మరి ఆయనేమో తన చేష్టలతో యశోదమ్మ కళ్ళు అనందంచే పెద్దగా అయ్యేట్టు చేస్తూ ఆమె ఒడిలో చిన్న సింహంపిల్లలా పెరుగుతున్నాడు. *"కార్మేని"* నల్లని మేఘంలాంటి దివ్య కాంతులతో అంతం లేని గుణాలు కల్గి , *"చ్చెంగణ్ "* వాత్సల్యం కల్గినవాడు. *"కదిర్మదియం పోల్ ముగత్తాన్"* చంద్ర సూర్యుల వంటి ముఖం కల్గినవాడు. మిత్రులతో ప్రేమగా శత్రువులతో కోపం కల్గినవాడు. 


*"నారాయణనే నమక్కే పఱైతరువాన్"* నారాయణ అనే మత్రం ఉపదేశం చేస్తూ మనకు సర్వస్వం ప్రసన్నం చేస్తుంది గోదా *"పారోర్ పుగళప్పడింద్"* ఫలం సాక్షాత్తు పరమాత్మే , ఈ లోకంలోని వారందరికీ అందజేస్తుంది అమ్మ గోదా.


*నారాయణ మంత్రం*



ఈ వ్రతంలో మనం భగవంతున్ని ఎట్లాచూస్తామో వివరిస్తుంది. భగవంతుడు ప్రాదేశికుడై అల్ప ఫలాన్ని ఇచ్చేవాడైతే మనం స్వీకరించం. భగవంతునికి ఎన్నెన్నో రూపాలు ఉంటాయి ఆకాశానికి అంతం లేనట్టుగా , సాగరంలో జలానికి అంతంలేనట్టుగా , మన జన్మలకీ కర్మలకీ అంతం లేనట్టుగా భగవంతుని కళ్యాణ గుణాలకు కూడా అంతం లేదు. కేవలం ఆయన గుణాలకేకాదు ఆయన స్వరూపానికి కూదా అంతం లేదు కాబట్టే ఆయనను సర్వవ్యాపి అంటారు.  ఇందుగలడని అందులేడని సందేహము వలదు అని ప్రహ్లాదుడు చెప్పినట్లుగా , అంతటా వ్యాపించి ఉండటం భగవంతుని గొప్పతనం. 



ఆ వ్యాపనశీలాన్ని చెప్పే మంత్రాలే గొప్ప మంత్రాలుగా చెప్పబడి ఉన్నాయి. భగవంతుని వ్యాప్తిని చెప్పేవి కేవలం మూడే అవి *"విష్ణు", "వాసుదేవ" మరియూ "నారాయణ".* విష్ణు అంటే వ్యాపించిన వాడని అర్థం. వాసుదేవ అంటే అంతటా వసిస్తాడు - ప్రకాశిస్తాడు అని అర్థం. ఈ రెండు మంత్రాల్లో కేవలం వ్యాపించి ఉంటాడనే చెబుతాయి కాని ఎలావ్యాపించి ఉంటాడు , ఎందుకు వ్యాపించి ఉంటాడు అనే ప్రశ్నలకు సమాధానం లభించదు కనుక ఆ మంత్రాలకు కొంచెం లోపం ఉంది అంటారు. కాని నారాయణ మంత్రం మాత్రం వ్యాప్తిని చెబుతుంది , వ్యాప్తి ఫలాన్ని చెబుతుంది ,  ఎందుకు వ్యాపించి ఉంటాడని వివరిస్తుంది. ఎందెందులో వ్యాపించి ఉంటాడని తెలియజేస్తుంది , ఆ వ్యాపించి ఉండే వాటితో సంబంధం గురించి తెలియజేస్తుంది. 



నారాయణ అంటే ఒక అద్బుతమైన మంత్రం , నారములు అంటే సకల చరాచర వస్తువులు అని అర్థం. అయణం అంటే ఆధారం అని అర్థం.  సూర్యుడు మనకు ఉత్తరం నుండి ఆధారమైన కాలాన్ని మనం ఉత్తరాయణం , విడదీస్తే ఉత్తర - అయణం అంటాం. నారాయణ శబ్దం లోని అయణ అనే పదాన్ని అర్థం ఆధారం.



  ఈ సకల చరాచర వస్తుజాతానికి ఆధారమైన వాన్ని నారాయణ అంటారు. మరి చరాచర వస్తువులలో ఎట్లావ్యాపించి ఉంటాడు , లోపల - బయట వ్యాపించి ఉంటాడని తెలియజేసేది నారాయణ మంత్రం. ఈ నారాయణ అనే శబ్దాన్ని రెండు సమాసాలు వివరిస్తాయి. ఒకటి తత్పురుష రెండవది బహువ్రీహి సమాసాలు. తత్పురుష అనేది నారములన్నిటికి తాను ఆధారమైన వాడు , ఆధారమై తనలోపల పెట్టుకున్నవాడు అని చెబుతుంది. మరి బహువ్రీహి సమాసం తానీ నారములన్నిటికి తాను లోపల ఉండి రక్షిస్తాడని చెబుతుంది.



అర్థాత్ ఆయన లోపల మరియూ బయట వ్యాపించి ఉంటాడని. అయణ అనే శబ్దంచే ఆయన అన్ని గుణములు కల్గి , చేయిచాస్తే చాలు అందేట్టు ఉంటాడు కాబట్టి ఆయనకు సౌలభ్యాది గుణాలు ఉంటాయి. లోపల ఉంటాడు కాబట్టి దగ్గరగా ఉంటాడు , పైన కూడా ఉంటాడు కనక అయన పరుడు - అందుచే పరత్వం సౌలభ్యం లాంటి గుణాలు కల్గినవాడు.  జ్ఞానులు కూడా ఈ నారములలోని వారేకనుక తాను  జ్ఞానం కల్గి ఉంటాడు.  చేయిజాస్తే అందేవాడు , వారిలోని దోషాలను ఎలా దూరంచేయాలో తెలిసినవాడు , దోషాలున్నా తన నుండి మనల్ని దూరం చేయని వాత్సల్యం కల్గినవాడు.  దోషాలను తొలగించే శక్తి కూడా ఉంది. అర్థాత్ ఆయనలో పరత్వం ఉంది , సౌశీల్యం ఉంది , వీటన్నిటినీ తనవనుకునే స్వామిత్వం ఉంది , వీటి యోగ్యత గుర్తించే జ్ఞానంచే సర్వజ్ఞత్వం ఉంది , తను ఇలాచేస్తానంటె ఎవ్వరూ అడ్డనంత శక్తి ఉంది , ఎంత ఇచ్చినా తరగని నిండుతనం అంటే పూర్ణత్వం ఉంది. 


అన్ని గుణాలు కల్గి ఉన్న ఈ మంత్రాన్ని మన ఆండాళ్ తల్లి మనకు ఊపాస్య మంత్రంగా అందించింది.  


ఈ పాటలో ఆత్మ ఉజ్జీవనానికి చేయాల్సిన కార్యక్రమం ఏమిటో తెలియజేస్తుండి.  శ్రీకృష్ణుడు అందరినీ కలిసి రమ్మన్నాడు , శారీరక సుఖాలు ఏకాంతంలో అనుభవించేవి , కాని భగవత్ అనుభవం అందరితో కలిసి చేసేవి , దాన్నే గోష్టి అంటారు. ఆండాళ్ తల్లి అందరితో కలిసి , నారాయణ మంత్రంతో ముందుకు వెళ్ళుదాం అంటోంది , దీనికి యోగ్యత కేవలం కోరిక మాత్రం చాలు అని ధైర్యం చెబుతోంది.


🕉🌞🌎🌙🌟🚩


(ఒకటవ పాశురం )


మార్గళి త్తింగళ్


సీ చెలికత్తెల పిలిచె చేరగా రమ్మంచు 

        మార్గశిరము యెంతొ మహిమ గలది 

పరవాద్య వ్రతమును పరుగున చేతము

       కంకణములు చేత  కదులుచుండ

అరుణ కిరణములు  ప్రభవించనీయక 

      స్నానమాడి మనము సాదరముగ 

భక్తితో పూజలు  శక్తిగా చేతము

          శ్రీపాద పద్మాల రేణు వగుచు 

కన్నయ్య మనలను కరుణతో చూచును 

     ముందుగా పూజించ మోద మందు 

గీ.  పిలుపు విన్నట్టి గోపికల్ ప్రేమమీర 

చేరుకోరమ్మ మాధవు సేవ కొరకు 

పురుష కారము వైభవ  మురిపె మంద

సరసిజాక్షు నోమును సలుపు కొనగ 

శ్రద్ధ భక్తిని కలిగించి బుద్ధి నిమ్ము

 శ్రీధరుని మానసంబున స్థిరము కమ్ము!!


🕉️🌞🌏🌙🌟🚩

Panchaag


 

ఔషధే చింతయే ద్విష్ణుం

 🙏🏻 ఓం నమో నారాయణాయ నమః 🙏🏻


ఔషధే చింతయే ద్విష్ణుం 

భోజనే చ జనార్ధనమ్ |

శయనే పద్మనాభం చ 

వివాహే చ ప్రజాపతిమ్ ||


యుద్ధే చక్రధరం దేవం 

ప్రవాసే చ ప్రజాపతిమ్ |

నారాయణం తనుత్యాగే 

శ్రీధరం ప్రియసంగమే ||


దుస్స్వస్నే స్మర గోవిందం 

సంకటే మధుసూదనమ్ |

కాననే నారసింహం చ 

పావకే జలశాయినమ్ ||


జలమధ్యే వరాహం చ 

పర్వతే రఘునందనమ్ |

గమనే వామనం చైవ 

సర్వకాలేషు మాధవమ్ ||


షోడశైతాని నామాని 

ప్రాతరుత్థాయ యః పఠేత్ |

సర్వపాప వినిర్ముక్తో 

విష్ణు లోకే మహీయతే ||



ఔషధసేవనం బాచరించెడి వేళ

          వినుతించ వలయును 'విష్ణు' నెపుడు

భోజనమ్మును తాను భుజియించు వేళలో 

          తలచ తగును 'జనార్దను'ని మదిని

శయనించు సమయాన సంతృప్తి తోడను 

          ప్రార్తించ వలయును 'పద్మనాభు'

ప్రార్థించవలె 'ప్రజాపతి' యంచు వినయాన 

          పరిణయ వేళందు భక్తితోడ

సమరంబు నందున 'చక్రధరా' యంచు

          జపియించ వలయును జయము పొంద

పరదేశమున నుండ హరిని 'ప్రజాపతి'

         యనుచు పలుకతగు న్నాత్మ యందు

తనువు నొదులు వేళ తా బల్క వలయును

         'నారాయణా' యంచు నయము గాను

ప్రియసంగమమునందు ప్రియమార స్వామిని 

        'శ్రీధరా' యనుచును చెప్ప తగును

దుస్వప్నముల యందు దుఃఖించకను తాను

       'గోవింద' యని మది కొలువతగును

సంకటసమయాల సద్భక్తి తోడను

        'మధుసూదన' నతగు మదిని నరుడు 

విపినంబునందున వెఱవక మనుజుండు

         కోరి దల్చ తగును 'నారసింహు'

అగ్నిజ్వాలల మధ్య ననయంబు మదియందు 

         'జలశాయి' భజనమ్ము సల్ప తగును

పర్వతంబుల మధ్య 'పట్టాభిరఘురాము'

        నెంచంగ వలయును నెపుడు నరుడు

గమనంబు నందున కల్కంగ నశ్రమ

        భక్తి నెంచ తగును 'వామనుడి'ని

సర్వకాలములందు సర్వేశు "మాధవున్"

        మదిదల్చ  వలెనెప్డు మానవుండు

శుభము లిచ్చు "విష్ణు షోడశనామముల్"

యుదయ వేళ యందు చదివి తేని

సర్వ పాపరాశి సమసియు మనుజుండు 

విష్ణునెలవు చేరు విమల మతిని.


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

సోదరుడి తో సమావేశం.

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..


*సోదరుడి తో సమావేశం..సూచన..*


*(యాభై తొమ్మిదవ రోజు)*


శ్రీ చెక్కా కేశవులు, మీరాశెట్టి గార్ల తో తన శరీర త్యాగం గురించి తన అభిప్రాయాన్ని చేప్పటమూ..వారు నిరాకరించడం జరిగిపోయిన తరువాత.. శ్రీ స్వామివారు తన తపస్సును కొనసాగించ సాగారు..ఒక వారం గడిచిపోయింది..శ్రీధరరావు దంపతులు కూడా తీరిక లేని పనుల్లో ఉండిపోవడం వలన..శ్రీ స్వామివారి వద్దకు వెళ్లలేక పోయారు..పైగా..శ్రీ స్వామివారు తన మానాన తాను తపస్సు చేసుకుంటూ వుంటారు..ఎలాగూ సజీవ సమాధి చేయడం లేదని చెప్పేశాము గదా..ఇక ఆ విషయం గురించి ఆలోచించడం ఎందుకు అనే భ్రమ లో ఉండిపోయారు..


మరో నాలుగైదు రోజుల తరువాత..శ్రీ స్వామివారు మాలకొండలో తపస్సు చేసినంత కాలం క్రమం తప్పకుండా ఆహారపదార్ధాలు చేరవేసిన సోదరుడు పద్మయ్య, అన్నగారిని చూడటానికి ఆశ్రమానికి వచ్చారు..పద్మయ్యను చూసి శ్రీ స్వామివారు పలకరింపుగా నవ్వి..దగ్గరగా కూర్చోబెట్టుకుని..


"నీకు కొన్ని విషయాలను చెపుతాను..అవి నీవు నాకొఱకు చేసిపెట్టాలి..సరేనా?.. " అన్నారు..


" అలాగే ..చెప్పు..చేస్తాను.." అన్నారు పద్మయ్యనాయుడు..


"నాకు తపస్సు చివరి దశకు వచ్చేసింది..ఈ శరీరాన్ని వదిలేయాల్సిన సమయమూ ఆసన్నమైంది..నేను ప్రాణత్యాగం చేసిన తరువాత..నా దేహాన్ని..ఇదిగో..ఈ ఆశ్రమంలో కట్టించుకున్న భూగృహం (నేలమాళిగ) లో పద్మాసనం లో వున్నట్లుగా ఉత్తరాభిముఖంగా కూర్చోబెట్టి సమాధి చేయాలి..అది నీ కర్తవ్యం..నువ్వే చేయాలి.."అన్నారు..


ఈ మాటలు చెప్పేటప్పుడు..లీలామాత్రంగా శ్రీ స్వామివారి కళ్ళు చెమర్చాయి..అది.పద్మయ్యనాయుడు గమనించారు

"చూసావా..నేను సన్యసించి..అన్ని బంధాలనూ తెంచుకున్నా కూడా..రక్త సంబంధం మాత్రం నన్ను ఈ నిమిషంలో కట్టి పడేసింది.." అన్నారు శ్రీ    ఆ నిముషమే శ్రీ స్వామివారు అలా భావోద్వేగానికి గురయింది..ఆ తరువాత మళ్ళీ మామూలు స్థితిలోకి వచ్చేసి..పద్మయ్యనాయుడు తో ఆమాటా..ఈ మాటా మాట్లాడి పంపించివేసారు......(ఈ విషయం పద్మయ్యనాయుడు గారు స్వయంగా నాతో తెలిపారు..) పద్మయ్యనాయుడు వెళ్లిన తరువాత శ్రీ స్వామివారు తన ధ్యానం చేసుకోవడానికి ఆశ్రమం లోపలికి వెళ్లిపోయారు..


మరో మూడు రోజులు గడిచిపోయాయి..1976 ఏప్రిల్ నెల మూడవవారం లో ప్రభావతి శ్రీధరరావు గార్లు శ్రీ స్వామివారిని కలవడానికి ఆశ్రమానికి వచ్చారు..సుమారు ఓ అరగంట వేచి చూసిన తరువాత..శ్రీ స్వామివారు తలుపు తీసుకొని వీళ్ళ ముందుకు వచ్చి నిలబడ్డారు..ఆయన ముఖంలో దివ్య తేజస్సు ఉట్టిపడుతోంది..శరీరం మాత్రం శుష్కించి ఉన్నది..


"నాయనా..బాగా తగ్గిపోయారు..ఆహారం తీసుకోవడం లేదా?.." అన్నారు ప్రభావతి గారు..


"ఆహారం..అంత సమయం కూడా వృధా చేయటం లేదు తల్లీ..నిరంతర ధ్యానం లో ఉంటున్నాను..ఇదిగో ఇప్పుడు మీరొచ్చినారని వాక్కు వినబడితే..లేచి వస్తున్నాను..మళ్లీ అడుగుతున్నానని మీరు కలత పడవద్దు..ఇంకా రోజులే మిగిలివున్నాయి నా శరీరానికి..త్వరగా సమాధి ఏర్పాట్లు చేయండి.." అన్నారు శ్రీ స్వామివారు..


శ్రీధరరావు ప్రభావతి గార్లు ముఖాముఖాలు చూసుకున్నారు..శ్రీ స్వామివారు సజీవ సమాధి విషయాన్ని వదిలేసి ఉంటారని భావించిన తమకు..అదేమీ లేదనీ.. శ్రీ స్వామివారు అదే పట్టు మీద ఉన్నారనీ.. అవగతం అయింది..వాళ్లిద్దరూ కూడా..తమవల్ల కాదని మళ్లీ తేల్చి చెప్పారు..


అయితే చిత్రంగా..ఈసారిమాత్రం శ్రీ స్వామివారు పెద్దగా నవ్వారు..నవ్వి.."మీరు మాత్రం ఏం చేస్తారు..పెంచుకున్న బంధాలు అంత త్వరగా తెగిపోవు కదా..పైగా మీ పరిమితులు మీకుంటాయి..ఇక నా ఏర్పాట్లు నేను చూసుకుంటాను..ఇంత దూరం నన్ను లాక్కొచ్చిన ఆ పార్వతీదేవి..ఆ దత్తాత్రేయుడు నాకు మార్గం చూపక పోతారా?.." అన్నారు..


మొదటిసారి ఆ దంపతులు..శ్రీ స్వామివారు తమకు కాకుండా పోతారేమో అనే భావనకు లోనయ్యారు..


"మళ్లీ నేను చెప్పి పంపేదాకా.. మీరిద్దరూ ఈ ఆశ్రమానికి రాకండి..అమ్మా..కొన్ని దోసకాయలు మాత్రం పంపించు..ధ్యానం నుంచి లేచినప్పుడు వండుకుంటాను.." అన్నారు..


కొద్దిసేపు శ్రీ స్వామివారి వద్ద గడిపి..తిరిగి తమ ఇంటికి చేరారా దంపతులు..


శ్రీధరరావు గారి చివరి ప్రయత్నం..పర్యవసానం..రేపు..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).

Electricity


 

Aaviri kudumu


 

అక్షులన్ దుడిచేది అమ్మ కొంగె

 🌹అమ్మ కొంగు🌹


పొయిమీద గిన్నెను పొదివి పట్టుకొనియు

           ననునువుగా దించేది అమ్మ కొంగె

కన్నీరు నింపిన కన్నబిడ్డల యొక్క 

           అక్షులన్ దుడిచేది అమ్మ కొంగె

బజ్జుండ దలచిన బుజ్జాయి కుండెటి

           ఆచ్ఛాదనమ్మది అమ్మ కొంగె

కొత్తవారినిచూడ కూడగా నును సిగ్గు

           అమ్మాయి కడ్డు యా అమ్మ కొంగె

చలియందు నులివెచ్చ  కలిగించు చుండెడి

           కమ్మని దుప్పటి అమ్మ కొంగె

శ్రమవేళ చేరెడి చెమట బిందువులను

           హాయిగా తుడిచేది అమ్మ కొంగె

పెరటిలో కూరలన్ విరిజాజు లన్నిటి

           న్నరయంగ తెచ్చేది అమ్మ కొంగె

ఇల్లు సర్దునపుడు పిల్లల కున్నట్టి

           బొమ్మలన్ గట్టేది అమ్మ కొంగె

అద్భుతంబైన సాధన మమ్మ కొంగె

హాయినిచ్చెటి సాధన మమ్మ కొంగె

కమ్మనైనట్టి సాధన మమ్మ కొంగె

అమ్మ కొంగుకు మించిన సొమ్ము లేదు


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

అమ్మ (చీర) కొంగు*

 *మా అమ్మ (చీర) కొంగు*

          

*ఇప్పటి పిల్లలకు చాలా మందికి తెలియక పోవచ్చు. ఎందుకంటే ఈనాడు ఇలాంటి సంఘటనలు తక్కువే.*

*చీరకొంగు చీర అందానికే సొగసునుపెంచేె మకుట మాణిక్యం !*

*అంతేకాకుండా...*


*పొయ్యి మీద వేడి గిన్నెలను దింపడానికి పనికొచ్చేి ముఖ్య సాధనం*


*పిల్లల కన్నీటిని తుడిచే ముఖ్యమైన పరికరం*


*చంటిపిల్లలు పడుకోడానికి అమ్మవడి పరుపు  కాగా  వెచ్చటి దుప్పటి‌ చీరకొంగే!*


*కొత్త వారు ఇంటికొచ్చినపుడు సిగ్గు పడే పిల్లలు ముఖం దాచుకునేది అమ్మ కొంగు వెనకే.*

*అలాగే పిల్లలు ఈ మహా  చెడ్డ ప్రపంచంలో కొత్తగా అడుగు లేస్తున్నప్పుడు  అమ్మ కొంగేే పెద్ద దిక్సూచి, మార్గదర్శి!*


*అలాగే వాతావరణం: చలిగా ఉంటే అమ్మ కొంగుతోనే పిల్లలని  వెచ్చగా చుట్టేది !*


*వంటచేసే తల్లి చెమట బిందువులు తుడుచు కొనేది కొంగుతోనే !*


*వంటకు పొయ్యిలోకి తెచ్చే కట్ట ముక్కలు సూదులు తెచ్చేది కొంగులోనే!*


*అలాగే పెరటి తోటలో కూరగాయలు, పువ్వులు, ఆకుకూరలు వంటింటికి తీసుకొచ్చేది కొంగులోనే.* 


*అంతేకాదు ఇల్లు సర్దడం లో భాగంగా పిల్లల ఆట వస్తువులు పాత బట్టలు వంటివి చీర కొంగు లోనే కదా మూట కట్టేది!*


*ఇలాంటి ఎన్నో ఉపయోగాలు ఉన్న అమ్మ చీరకొంగు లాంటి వస్తువు మరొకటి కనిపెట్టాలంటే చాలా కష్టం!*


*ఇంతటి అద్భుతమైన అమ్మకొంగు లో కనిపించేది మాత్రం అమ్మ ప్రేమే !!*


*అంకితం: అమ్మలందరికి*

              

*అమ్మ ఒక మధుర జ్ఞాపకం.* 

*తనకు నా ఆకలి ఎప్పుడు చెప్పాల్సిన అవసరం రాలేదు...*

*కొత్త బట్టలతో బైటకు వెళ్లివస్తే వెంటనే దిష్టి తీసేది...*

*పరీక్షలకు బయలుదేరితే తీపిపెరుగుతో ముందు నిలిచేది...*

*బాల్యంలో నా పిచ్చి భాషను క్షణంలో పసికట్టేది...*

*ఇలా ఎన్నో ఎన్నెన్నో...*


*అమ్మ పాలు తాగుతూ, పలుమార్లు తన్నుతూ ఉంటాడు/ఉంటుంది...*

*తనను తన్నే వారి కడుపు నింపే ఔదార్యం భగవంతుడు ఒక్కఅమ్మకు మాత్రమే ఇచ్చాడు...*


*అమ్మ ఒక వేదం...*

*అమ్మ ఒక భక్తిభావం...*

*అమ్మ ఒక ప్రేమరూపం...*

*అమ్మ ఒక సంవేదన...*

*అమ్మ ఒక భావన...*

*అమ్మ ఒక పుస్తకం...*

*అమ్మ ఒక కలం...*

*అమ్మ ఒక కవిత...*

*అమ్మ ఒక జ్ఞానం...*

*అమ్మ ఒక గుడిలో దీపం...*

*అమ్మ ఒక హారతి పళ్లెం...*

*అమ్మ ఒక సుకుసుమం...*

*అమ్మ ఒక చల్లని చిరుగాలి...*

*అమ్మ ఒక అన్నపూర్ణ...*

*అమ్మ ఒక లాలిత్యం...*

*అమ్మ ఒక చీరకొంగు...*

*అమ్మ ఒక కరుణ...*

*అమ్మ ఒక దీవెన...*

*అమ్మ ఒక అక్షిత...*

*అమ్మ ఒక వర్షపు బిందువు...*

*అమ్మ ఒక మధురగేయం...*

*అమ్మ ఒక శ్వాస...*

*అమ్మ ఒక వూపిరి...*

*అమ్మ ఒక మురళి గానం...*

*అమ్మ ఒక జోలపాట...*

*అమ్మ ఒక పచ్చదనం...*

*అమ్మ ఒక కనురెప్ప...*

*అమ్మ ఒక దేవత...*

*అమ్మ ఒక పుడమి...*

*అమ్మ ఒక స్వచ్ఛత...*

*అమ్మ ఒక ప్రవచనం...*

*అమ్మ ఒక వెలుగు...*

*అమ్మ ఒక సుగుణం...*

*అమ్మ ఒక నమ్మకం...*

*అమ్మ ఒక ఆరోగ్యం...*

*అమ్మ ఒక భద్రత...*

*అమ్మ ఎన్నో ఎన్నెన్నో......*


*ఇది చదివిన వారికి ఒక్క మాట చెప్పగలను ఎవరు అమ్మ దగ్గర ఉంటారో వారు అతిసంపన్నులు. అమ్మ సేవ భాగ్యం కలిగివుంటారో ధన్యులు,*

*అదృష్టవంతులు...*

🌺🌺🌺 🙏🕉️🙏 🌺🌺🌺

వైకుంఠమును పొందును.

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


*శ్రీశంకరాచార్యరచితం సతతం మనుష్య*:

*స్తోత్రం పఠేదిహ తు సర్వగుణప్రపన్నమ్* |

*సద్యో విముక్త కలుషో మునివర్యగణ్యో*

*లక్ష్మీపతే: పద ముపైతి స నిర్మలాత్మా* ||


_ *_శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం - 23_* _


*తా: సమస్త గుణములతో కూడి, శంకర భగవత్పాదులచే రచింపబడిన యీ స్తోత్రమును ఎ మనుష్యుడు ఎల్లప్పుడునూ పఠించుచుండునో అతడు వెంటనే పాపములు నశించి పరిశుద్ధుడై, మునులచే పొగడబడు విష్ణులోకమగు వైకుంఠమును పొందును. లక్ష్మీదేవితో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము*.


🧘‍♂️🙏🪷 ✍️🙏

Power generation


 

New techniques


 

ఆలోచనాలోచనాలు

 ///// ఆలోచనాలోచనాలు /////      "" విద్వాన్ సర్వత్ర పూజ్యతే!""                           ***** అవధాన మధురిమలు*****  శతావధాని శ్రీ డోకూరి కోట్ల బాలబ్రహ్మాచార్యులు ***** సమస్యాపూరణములు *****                                   1* "" అంధత్వంబు పురాభవగ్రధిత పుణ్యప్రాప్త మూహింపగన్.""                    శా. అంధత్వస్థిక మేమి నా బ్రతుకనన్ దానినట్లనెన్/ గాంధారీధవ యిట్లుగానియెడ దుష్కర్మ ప్రపంచపు గో/ డుం ధాత్రిన్ గని కుందఁగావలసి యుండున్, గాన నెంతేని నీ/ యంధత్వంబు పురాభవ గ్రధిత పుణ్యప్రాప్త మూహింపగన్.     2*"" పున్నమ చందమామ పయి ముట్టడి బెట్టెను జిమ్మ చీకటుల్.""                   ఉ. అన్నులమిన్న తావక ముఖాబ్జముపై విరబారుచున్న యా/ క్రొన్నెటిగుంపు భాతినదిగో కనుమా భవనాళి కెంతయున్/ గన్నుల పండువై వెలఁగఁగా గవిసెన్ఁబగ చేత రాహు వీ/ పున్నమ చందమామ పయి ముట్టడి బెట్టెను జిమ్మ చీకటుల్.                     3* "" మంచాలన్ బిగియించి గూటముల కమ్మా బిందియం దేగదే! ""     3* శా. ప్రాంచద్భంగి నొనర్చువత్సముల యంబారవముల్ వించు నే/ తెంచెన్ గోవులు త్రాళ్ళు దెంచుకొని యర్థిన్ జీకెడిన్ దూడలా/ మంచంబల్లుట మాని పిల్వుమిట కామందున్ బాల్పిండి పొ/ మ్మంచాలన్ బిగియించి గూటముల కమ్మా బిందియందేగదే!                   4* ""త్రాడు భుజంగమై కఱచె దాహము గల్గెను మోవి నీయవే.""                    ఉ. నేడు భరింపజాలనిఁక నిద్దపు పేర్మి గృతార్థుఁజేయఁబూఁ/ బోడిరొ నెమ్మనంబునను బూనిక నీవు దలంపనందునన్/ బాడు మరుండు హస్తమునఁబట్టిన చక్కెర వింటి తేటి బల్/ త్రాడు భుజంగమై కఱచె దాహము గల్గెను మోవి నీయవే.                                5* "" తన సుతుఁగూడి గర్భమును దాల్చెనయో ప్రభుఁడేమి సేయునో?""         చం. జనకుఁడెఱింగినన్ గడు దొసంగగునంచు నుషాకుమారి దా/ మనమున నెంచ కిప్పుడవమాన భయంబును లేక నెచ్చెలీ/ ఘనతరమైన మన్మథ వికారము నాపఁగలేక మీనకే/ తన సుతుఁగూడి గర్భమును దాల్చెనయో ప్రభుఁడేమి సేయునో?            దత్తపదులు;---                     1* "అల్లము -- బెల్లము -- పల్లము -- బుల్లము" పదములతో "రామాయణార్థములో" పద్యము.                               ఉ. అల్లముకుందుఁడాశ్రిత బుధావళి నేలగ రాముడొ జనం/ బెల్ల ముదంబునొంది నుతియింప దురాత్ముల రక్తముర్విపైఁ/ బల్లము మిఱ్ఱునేకమయి పాఱెడి యట్టొనరించి సంతసం/ బుల్లము రంజిలన్ బుధులనోమె నయోధ్యాపురాధినాథుఁడై.      3* " ఏడు వారముల పేర్లు వచ్చునట్లుగా భగవత్స్తుతి"                        తే. గీ. ఆదిత్యధామ! కీర్తిజితసోమ!/ మంగళాన్విత! బుధగురుమాన్య చరిత! శుక్ర శిష్య ధరాశని విక్రమఖని/ మన్నమో వాకములఁగొని మనుపుమయ్య!                  ( డా. రాపాక ఏకాంబరాచార్యులవారి అవధాన విద్యా సర్వస్వం సౌజన్యంతో) తేది 13--12--2023, బుధవారం, శుభోదయం.

బ్లడ్ క్యాన్సర్ కు మందు

 చాలా ముఖ్యమైన వార్త


 పూణేలో అందుబాటులో ఉంది


 దయచేసి ఈ ముఖ్యమైన వార్తను చదివిన తర్వాత తప్పకుండాఫార్వార్డ్ చేయండి.                                                         


 నా ప్రియమైన స్నేహితులారా


 బ్లడ్ క్యాన్సర్ కు మందు దొరికింది!!


 దాన్ని మళ్లీ ఫార్వార్డ్ చేయకుండా తొలగించవద్దు

 ఇది భారతదేశంలోని ప్రతి ఇంటికి చేరనివ్వండి.


 'ఎమోటిఫ్ మెర్సిలేట్' బ్లడ్ క్యాన్సర్‌ను శుద్ధి చేసే ఔషధం.


 పూణేలోని యోశోద హెమటాలజీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉచితంగా లభిస్తుంది.


 అవగాహన కల్పించండి.


 ఇది ఎవరికైనా సహాయం చేయగలదు.


 మీకు వీలైనంత వరకు కొనసాగండి.

 నైతికతకు ధర లేదు.


 తెలుసు:

 యశోదా హెమటాలజీ క్లినిక్.  109, మంగళమూర్తి కాంప్లెక్స్, హీరాబాగ్ చౌక్,

 తిలక్ రోడ్,

 పూణే-411002.


 ఫోన్:

 020-24484214 లేదా 09590908080 లేదా 09545027772 లేదా www.practo.comని సందర్శించండి.


 నా వినయపూర్వకమైన అభ్యర్థన: దయచేసి ఫార్వార్డ్ చేయండి

ఆలోచనాలోచనాలు

 !!!!! ఆలోచనాలోచనాలు !!!!!        (కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు!)        -------- O' GOD! --------.           Correct us when we are wrong,.                         Encourage us when we are 'right.'.                   Support us when we are in need.                        We do not seek bouquets too only.                We don't mind brickbats too---.                When we deserve ( them)----.                            ----- Repeat good acts.-----.                             As a horse when he has run, A dog when he has caught the game, A bee when it has made its honey, So a man when he has done a good act, does not call out for others to come and see, but he goes on to another act, as wine goes on to produce again the grapes in season. ---- Marcus Aurelius.                             ------ Where is life? ------.   Where is life? We have lost in living.                       Where is the wisdom? We have lost in knowledge.                       Where is knowledge?  We have lost in information.                     The cycles of Heaven in twenty centuries bring us farther from 'GOD' nearer to the 'Dust.' ---- T.S.Illiet.        -------Foot prints -------.        Lives of great men all remind us.                        We can make our lives sublime,.                  And, departing , leave behind us.                        Foot prints on the sands of time.                  Foot prints that perhaps another.             Sailing over life's solemn main,.                   A forlorn and ship wrecked brother,.             Seeing shall take heart again. ---- H. W. Longfellow.                        ---- The greatest things ----.                                         The best day--- Today.     The greatest sin --- Fear.                                   The best gift ---- Forgiving.                           The meanest feeling ---- Jealousy.                       The greatest need ---- Common sense.              The greatest teacher ---- One who makes you want to learn.              The best part of anyone's religion ---- Tolerance.                          Dt 11-- 12-- 2023, Monday.

*🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*

.                *భాగం - 8*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 3*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱

*కూర్మావతార వర్ణనము*


తథేత్యాహాథ తం విష్ణుస్తతః సర్త్వెః సహామర్తెః | స్త్రీరూపం సంపరిత్యజ్య హరేణోక్తః ప్రదర్శయ. 17


''అటులనే ఆగుగాక'' అని విష్ణువు ఆతనితో పలికెను. పిమ్మట స్త్రీరూపమును త్యజించి దేవతలతో కలిసి యుండగా శివుడు '' ఆ స్త్రీ రూపమును చూపుము'' అని హరితో అనెను.


దర్శయామాస రుద్రాయ స్త్రీరూపం భగవాన్‌ హరిః |


మాయయా మోహితః శమ్భుర్గౌరీం త్యక్త్వా స్త్రియం గతః. 18


భగవంతుడైన శ్రీమహావిష్ణువు రుద్రునకు స్త్రీరూపమును చూపెను. శివుడు విష్ణుమయచే మోహితుడై పార్వతిని విడచి ఆస్త్రీని వెంబడించెను.


నగ్న ఉన్మత్తరూపో భూత్‌ స్త్రీయః కేశానధారయత్‌ |


అగాద్విముచ్చ కేశాన్‌ స్త్రీ అన్వధావచ్చ తాం గతామ్‌. 19


శివుడు ఉన్మత్తుడై, దిగంబరుడై ఆమె కేశపాశమును పట్టుకొనెను. ఆమె జుట్టు విడిపించుకొని వెళ్లిపోయెను. ఇతడు ఆమె వెంట పరుగెత్తెను.


స్ఖలితం యత్ర వీర్యచం కౌ యత్ర యత్ర హరస్య హి | తత్ర తత్రాభవత్‌ క్షేత్రం లిఙ్గానాం కనకస్య చ. 20


ఈశ్వరుని వీర్యము స్ఖలితమై భూమిపై పడిన చోటులలో నెల్ల బంగారు లింగముల క్షేత్ర మయ్యెను.


మాయేయమితి తాం జ్ఞాత్వా స్వరూపస్థో భవద్దరః | శివమాహ హరీ రుద్రజితా మాయా త్వయా హి మే. 21


న జేతుమేనాం శక్తో మే త్వదృతే7న్యః పుమాన్‌ భువి |


ఇది యంతయు మాయ యని గ్రహించి శివుడు స్వస్థచిత్తుయెను. అపుడు విష్ణువు శివునితో ఇట్లనెను : '' రుద్రా! నీవు నా మాయను జయించితివి. ఈ లోకములో నీవు తప్ప మరెవ్వరును నా మాయను జయింపజాలరు. ''


ఆప్రాప్యాథామృతం దైత్యా దేవైర్యుద్ధే నిపాతితాః.


త్రిదివస్థాః సురాశ్చాసన్‌ దైత్యాః పాతాలవాసినః | యో నరః పఠతే దేవవిజయం త్రిదివం వ్రజేత్‌. 23


ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే కూర్మావతారోనామ తృతీయోధ్యయః.


అమృతమును పొందజాలని ఆ దైత్యులను దేవతలు యుద్ధములో జయించిరి. దేవతలు స్వర్గములో నివసించిరి. దైత్యులు పాతళలోకనివాసు లయిరి. ఈ దేవి విజయకథను పఠించువాడు స్వర్గమును పొందను.


*ఆగ్నేయ మహా పురాణములో కూర్మావతార మనెడు తృతీయాధ్యయము సమాప్తము.*

సశేషం....


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱


🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*

.                *భాగం - 9*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 4*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱


*వరాహావతార వర్ణనము - 1* 


*అథ వరాహాద్యవతార వర్ణనమ్‌.*


*అగ్ని రువాచ :-*


అవతారం వరాహస్య వక్ష్యేహం పాపనాశనమ్‌ | హిరణ్యాక్షో సురేశో భూద్దేవాఞ్జీత్వా దివి స్థితః. 1


*అగ్ని దేవడు పలికెను :* పాపములను నశింపచేయు వరాహావతారమును గూర్చి చెప్పెదను. హిరణ్యాక్షుడనెడు రాక్షసరాజు ఉండెను. అతడు దేవతలను జయించి స్వర్గలోకములో నివసించెను.


దేవైర్గత్వా స్తుతో విష్ణుర్యజ్ఞరూపో వరాహకః | అద్భుతం దానవం హత్వా దైత్యైః సాకం చ కణ్టకమ్‌.

ధర్మదేవాది రక్షాకృత్తతః సో7న్తర్దధే హరిః | 2


యజ్ఞస్వరూపు డగు విష్ణువును దేవత లందరును వచ్చి స్తుతింపగా ఆ హరి వరాహరూపము ధరించి, లోకకంటకు డైన ఆ దానవుని దైత్యులతోకూడ ఆశ్చర్యకర మగు విధమున సంహరించి, ధర్మమును దేవతలు మొదలగువారిని రక్షించి అంతర్థానము చెందెను.


హిరణ్యాక్షస్య వై బ్రాతా హిరణ్యకశిపు స్తథా. 

జితదేవయజ్ఞ భాగః సర్వదేవాదికాకృత్‌ | 3


హిరణ్యాక్షుని సోదరుడైన హిరణ్యకశిపుడు దేవతల యజ్ఞభాగములను అపహరించి దేవతలందరిపైనను అధికారమును జరిపెను.


నారసింహం వపుః కృత్వా తం జఘాన సురైఃసహ. 

స్వపరస్థన్‌ సురాంశ్చ క్రే నారసింహః సురైః స్తుతః | 4


విష్ణువు దేవతాసమేపతుడై (వెళ్లి) నరసింహరూపము దాల్చి ఆ హిరణ్యకశిపుని సంహరించెను. దేవతలచే స్తుతింపబడిన ఆ నరసింహుడు దేవతలను తమతమ స్థానములలో నిలిపెను.


దేవాసురే పురా యుద్ధే బలిప్రభృతిబిః సురాః. 

జితాః స్వర్గాత్పరిభ్రష్టా హరిం వై శరణం గతాః | 5


పూర్వము దేవాసుర యుద్దమునందు బలి మొదలగువారిచే సురులు పరాజితులై, స్వర్గమును కోల్పోయిరి. వారు అపుడు హరిని శరణుజొచ్చిరి.


సురాణామభయం దత్త్వా అదిత్యా కశ్యపేన చ. 

స్తుతో  సౌ వామనో భూత్వా హ్యదిత్యాం స క్రతుం య¸° | 6


బలేః శ్రీయజమానస్య రాజద్వారే గృణాచ్ర్ఛుతిమ్‌.


విష్ణువు దేవతలకు అభయ మిచ్చి, అదితికశ్యపులు తనను స్తుతింపగా ఆదితియందు వామనుడగ జన్మించెను. ఆ వామనుడు శోభాయుక్తముగ యజ్ఞము చేయుచున్న బలి చక్రవర్తి యజ్ఞమునకు వెళ్లి అచట రాజద్వారమునందు వేదమును పఠించెను.


వేదాన్పఠన్తం తం దృష్ట్వా వామనం వరదో అబ్రవీత్‌ | నివారితోపి శుక్రేణ బలిర్ర్బూహి యదిచ్ఛసి. 8


తత్తేహం సంప్రదాస్యామి వామనో బలిమబ్రవీత్‌ | పదత్రయం హి గుర్వర్థం దేహి దాస్యే తమబ్రవీత్‌. 9


బలి వేదములను పఠించుచున్న ఆ వామనుని చూచి, ఆతడు కోరు కరముల నీయవలెనని నిశ్చయించుకొని, శుక్రాచార్యుడు నివారించుచున్నను, ఆతనితో '' నీ కేమి కావలెనో కోరుకొనుము; ఇచ్చెదను '' అని పలికెను. వామనుడు బలితో ఇట్లనెను : ''మూడు అడుగుల నిమ్ము; నా గురువునకు కావలెను''. బలి ''అట్లె ఇచ్చెదను'' అని పలికెను.


తోయే తు పతితే హస్తే వామనోభూదవామనః | భూర్లోకం స భువర్లోకం స్వర్లోకం చ పదత్రయమ్‌. 10


చక్రే బలిం చ సుతలే తచ్ఛక్రాయ దదౌ హరిః | శక్రో దేవైర్హరిం స్తుత్వా భువనేశః సుఖీ త్వభూత్‌. 11


దానజలము చేతిలో పడగానే వామనుడు అవామనుడ (పెద్ద శరీరము కలవాడు) ఆయెను. భూలోక-భువర్లోక-స్వర్లోకములను మూడడుగులుగా గ్రహించి బలిని సుతలమునకు త్రొక్కివేసెను.


వామనరూపుడైన హరి ఆ లోక త్రయమును దేవేంద్రున కిచ్చెను. దేవతాసహితు డగు ఇంద్రుడ హరిని స్తుతించి, త్రిభువనాధీశుడై సుఖముగా నుండెను.

సశేషం....


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱

శ్రీ మదగ్ని మహాపురాణము

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*

.                *భాగం - 7*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 2*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱

*శ్రీ గణేశాయ నమః*

 *ఓం నమో భగవతే వాసుదేవాయ.*


*మత్స్యావతార వర్ణనము - 3*


అద్భతమైన ఆ మత్స్యమును చూచి, మనువు ఆశ్చర్యము చెంది ఇట్లు పలికెను.  "నీ వెవరవు? నీవు నిజముగ విష్ణుమూర్తివే. నారాయణా! నీకు నమస్కారము. జనార్థనా! మాయ చేత నీవు నన్నీవిధముగ ఏల మోహపెట్టుచున్నావు?"


మను వీ విధముగా పలుకగా ఆ మత్స్యము ప్రజలకు పాలించుట యందు ( లేదా తనను రక్షించుటయందు) ఆసక్తి గల ఆతనితో ఇట్లనెను- "ఈ జగత్తును నిలుపుటకును, దుష్టులను నశింప చేయటకును అవతరించినాను".


"(నేటినుండి) ఏడవ దివసమున సముద్రము ఈ జగత్తును ముంచివేయును. అపుడు నీదగ్గరకు వ్చచిన నావలో బీజములు మొదలగువాటిని ఉంచుకొని, సప్తర్షిసమేతుడవై బ్రహ్మనిద్రించు రాత్రి అంతయు సంచరింపగలవు. నేను నీ దగ్గరకు వచ్చినపుడు ఆ నావను పెద్ద సర్పముతో నా కొమ్మునకు కట్టి వేయుము".


ఇట్లు పలికి మత్స్యము అంతర్ధానము చెందెను. మనువు ఆ కాలమునకై నిరీక్షించుచు ఉండెను. సముద్రము గట్టు దాటి పొంగగా అపుడు నావను ఎక్కెను. ఒక కొమ్ముగల, పదివేల కోట్ల యోజనములు గల బంగారు మత్స్యము (వచ్చెను). దాని కొమ్మునకు నావను కట్టెను. ఆ మత్స్యమును స్తోత్రములచే స్తుతించుచు, పాపములను తొలగించు మాత్స్యపురాణమును ఆ మత్స్యము చెప్పగా వినెను. 


కేశవుడు బ్రహ్మనుండి వేదములను అపహరించిన హయగ్రీవు డను దానవుని సంహరించి వేదమంత్రాదులను రక్షించెను. పిమ్మట వారాహకల్పము రాగా హరి కూర్మావతారం ధరించెను.


*అగ్ని మహాపురాణములో మత్స్యావతారమను ద్వితీయాధ్యాయము సమాప్తము.*

సశేషం....

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱

మరణం ఎందుకు

 *🍁మరణం ఎందుకు ముఖ్యం*🍁


మరణం ఎందుకు ముఖ్యమైనది అనే ప్రాముఖ్యతను వివరించే చాలా అందమైన కథనం. 

మృత్యువు ప్రతి ఒక్కరూ భయపడే విషయం.  


పుట్టుక మరియు మరణం సృష్టి యొక్క నియమాలు మరియు విశ్వం యొక్క సమతుల్యతకు ఇది చాలా అవసరం. 

లేకపోతే, మానవులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయిస్తారు. 


*ఎలా? ఈ కథ చదవండి...*


ఒకసారి ఒక రాజు తన రాజ్యం వెలుపల ఒక చెట్టు క్రింద కూర్చున్న సన్యాసి వద్దకు వెళ్ళాడు. 


అతను "ఓ స్వామీ, నేను అమరత్వం పొందగలిగే మూలికా ఔషధం ఏదైనా ఉంటే దయచేసి నాకు తెలియజేయండి?" సన్యాసి అన్నాడు.  "ఓ రాజు దయచేసి మీరు ఎదురుగా ఉన్న 2 పర్వతాలను దాటండి మరియు అక్కడ మీకు ఒక సరస్సు దొరుకుతుంది. 


మీరు దాని నుండి నీరు త్రాగండి మరియు మీరు అమరత్వం పొందుతారు. పర్వతాలు దాటిన తర్వాత అతను ఒక సరస్సును కనుగొన్నాడు. 


అతను నీరు తాగడానికి  వెళ్ళబోతున్నప్పుడు  కొన్ని బాధాకరమైన మూలుగులు విన్నాడు, అతను నీరు తాగకుండానే ఆ గొంతును అనుసరించాడు, చాలా బలహీనమైన వ్యక్తి పడుకుని నొప్పితో ఉన్నాడు. 


రాజు కారణం అడగగా, "నేను సరస్సులోని నీటిని తాగాను. మరియు అమరుడయ్యాడు. నాకు నూరేళ్లు నిండిన తర్వాత నా కొడుకు నన్ను ఇంటి నుంచి గెంటేశాడు, గత 50 ఏళ్లుగా నన్ను చూసుకునే వారు లేకుండా పడి ఉన్నాను. 


నా కొడుకు చనిపోయాడు మరియు నా మనుమలు కూడా ఇప్పుడు వృద్ధులయ్యారు. నేను కూడా తినడం మరియు నీరు త్రాగటం మానేశాను, కానీ నేను ఇంకా బ్రతికే ఉన్నాను." రాజు ఆలోచించాడు "అమరత్వం మరియు వృద్ధాప్యం యొక్క ప్రయోజనం ఏమిటి. 


నేను అమరత్వం మరియు యవ్వనం పొందితే?" పరిష్కారం కోసం మళ్లీ సన్యాసిని అడిగాడు. సన్యాసి ఇలా అన్నాడు, "సరస్సు దాటిన తర్వాత మీరు మరొక పర్వతాన్ని దాటండి. 


అక్కడ మీకు పసుపు పండిన పండ్లతో నిండిన చెట్టు కనిపిస్తుంది, వాటిలో ఒకటి తినండి మరియు మీరు అమరత్వంతో మరియు యవ్వనంగా ఉంటారు." రాజు చెప్పినట్లే చేశాడు. 


అతను పండిన పసుపు పండ్లతో నిండిన చెట్టును చూశాడు. పండ్లను తెంపి తినబోతుంటే, కొందరు పోట్లాడుకోవడం అతనికి వినిపించింది. ఇంత మారుమూల ప్రదేశంలో ఎవరు పోట్లాడుకుంటారని ఆలోచిస్తున్నాడు !!


 నలుగురు యువకులు గొంతెత్తి వాదించుకోవడం చూశాడు. అలా మారుమూలలో పోట్లాడుకోవడానికి కారణం ఏమిటని రాజు అడిగాడు. 


వారిలో ఒకరు "నాకు 250 ఏళ్లు, నా కుడి వైపున ఉన్న వ్యక్తి 300 సంవత్సరాలు, అతను నాకు ఆస్తి ఇవ్వడం లేదు. 


అతను సమాధానం కోసం అవతలి వ్యక్తి వైపు చూసినప్పుడు అతను చెప్పాడు" నా కుడి వైపున మా నాన్న ఉన్నారు.


 350 సంవత్సరాల వయస్సు. అతను తన ఆస్తిని నాకు ఇవ్వనప్పుడు, నేను నా కొడుకుకు ఎలా ఇస్తాను? ఆ వ్యక్తి అదే ఫిర్యాదును కలిగి ఉన్న 400 సంవత్సరాల వయస్సు గల అతని తండ్రిని సూచించాడు. 


ఒకరి ఆస్తి కోసం ఒకరి అంతులేని పోరాటాలను తట్టుకోలేక ప్రజలు తమ గ్రామం నుండి వెళ్లగొట్టారని వారందరూ రాజుతో చెప్పారు. 


దిగ్భ్రాంతికి గురైన రాజు సన్యాసి వద్దకు తిరిగి వచ్చి *"మరణం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియచేసినoదుకు ధన్యవాదాలు"* అన్నాడు.  


అపుడు ఆ సన్యాసి ఇలా అన్నారు

_*మరణం ఉంది కాబట్టి ప్రపంచంలో ప్రేమ ఉంది*_


". మరణాన్ని నివారించే బదులు, మీ ప్రతి రోజూ, ప్రతి క్షణం, ప్రతి సెకను జీవించండి. జీవితాన్ని పరిపూర్ణంగా బ్రతకాలి.


మిమ్మల్ని మీరు మార్చుకోండి అపుడు ప్రపంచం మారుతుంది. 


1. మీరు స్నానం చేసేటప్పుడు భగవంతుని నామాన్ని జపిస్తే అది తీర్థ స్నానం (పవిత్ర స్నానం) లాగా ఉంటుంది. 


2. ఆహారం తినేటప్పుడు జపం చేస్తే ప్రసాదం అవుతుంది 


3. నడిచేటప్పుడు జపించండి, అది తీర్థయాత్ర (తీర్థయాత్ర) లాగా ఉంటుంది 


4. ఆహారం వండేటప్పుడు జపం చేస్తే మహా ప్రసాదం అవుతుంది


5. నిద్రించే ముందు జపం చేస్తే ధ్యాన నిద్ర లాగా ఉంటుంది 


6. పనిచేసేటప్పుడు జపిస్తే అది భక్తి అవుతుంది 


7 . ఇంట్లో జపిస్తే దేవాలయం అవుతుంది.

🙏🙏🙏


 సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.

ఇంద్రనీలమణియా

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.      *శివానందలహరీ – శ్లోకం – 32*

.        శ్రీ ఆదిశంకరాచార్య విరచితం

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱


*జ్వాలోగ్రస్సకలామరాతి భయదః క్ష్వేళః కథంవా త్వయా*

*దృష్టః కించ కరే ధృతఃకరతలే కింపపక్వ జంభూఫలం ?*

*జిహ్వాయాం నిహితశ్చ సిద్ధఘుటికావా కంఠదేశేభృతః*

*కిం తే నీలమణి ర్విభూషణ మయం శంభో ! మహాత్మన్వద !!*


*తాత్పర్యము:*

మహాత్మా ! శివా! తీవ్ర జ్వాలలు క్రమ్ముతూ, సకలదేవతలకునూ మిక్కిలి భయమును పుట్టించే, ఆ కాలకూట విషాన్ని కన్నులతో  నీవు ఎలాౘూశావు ? అంతేగాక అరచేతిలో దాన్ని ఎలా ఉంౘుకున్నావు?  అదేమైనా పండిన నేరేడు పండా ఏమిటి?  అదీగాక దానిని నాలుక మీద వేసుకున్నావు. అది సిద్ధఘుటికయా ఏమిటి?  మఱియూ కంఠమునందు నిలుపుకున్నావు. ఇది నీకు ఆభరణంగా వుండే ఇంద్రనీలమణియా?చెప్పు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

               🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - హేమంత ఋతువు - మార్గశిర మాసం - శుక్ల పక్షం  -‌ చతుర్థి -  శ్రవణం  -‌ స్థిర వాసరే* *(16-12-2023)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/dHGMzDJq9lo?si=FynDrlhXimny2aCn


🙏🙏

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️

 •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*16-12-2023 / శనివారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి అవసరానికి ధనసహయం అందుతుంది. ఉద్యోగ, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారములో విజయం సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు  వసూలవుతాయి.

---------------------------------------

వృషభం


ఉద్యోగమున  పదోన్నతులు పెరుగుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం ఉంటుంది. సంఘంలో ప్రముఖులతో  పరిచయాలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు విస్తరిస్తారు.

---------------------------------------

మిధునం


ముఖ్యమైన వ్యవహారాలలో  తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదు. చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి.

---------------------------------------

కర్కాటకం


చేపట్టిన  పనులలో శ్రమ తప్ప ఫలితం ఉండదు. దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. వ్యాపారమునకు సకాలంలో పెట్టుబడులు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కుటుంబ బాధ్యతలు మరింత పెరుగుతాయి.

---------------------------------------

సింహం


సంఘంలో విశేష  గౌరవ మర్యాదలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తు వాహన లాభాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతారు. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. వ్యాపార వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది.

---------------------------------------

కన్య


వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ  సేవలకు తగిన గుర్తింపు అందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.

---------------------------------------

తుల


ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. కుటుంబసభ్యులతో వివాదాలు వలన మానసిక సమస్యలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు  మందగిస్తాయి. ఇంటాబయట చికాకులు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. చేపట్టిన  పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది.

---------------------------------------

వృశ్చికం


ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఇంటాబయట బాధ్యతలు మరింతగా పెరుగుతాయి.  వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలతో తప్పవు.

---------------------------------------

ధనస్సు


భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగ,  వ్యాపారాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో వివాదాలు రాజీ చేసుకుంటారు.

---------------------------------------

మకరం


ఆరోగ్యం మందగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పాత రుణాలు తీర్చడానికి  నూతన రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు ఉంటాయి.

---------------------------------------

కుంభం


నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరణకు తీసుకున్న నిర్ణయాలు కలసి వస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

మీనం


 కొన్ని పనులలో శ్రమ తప్పదు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నవి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. దాయదులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

భక్తిసుధ

 🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

🪔 ॐ卐  *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐 🪔


*శ్రీశంకరాచార్యరచితం సతతం మనుష్య*:

*స్తోత్రం పఠేదిహ తు సర్వగుణప్రపన్నమ్* |

*సద్యో విముక్త కలుషో మునివర్యగణ్యో*

*లక్ష్మీపతేః పద ముపైతి స నిర్మలాత్మా* ||


_ *_శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం - 23_* _


*తా*: సమస్త గుణములతో కూడి, శంకర భగవత్పాదులచే రచింపబడిన యీ స్తోత్రమును ఏ మనుష్యుడు ఎల్లప్పుడునూ పఠించుచుండునో అతడు వెంటనే పాపములు నశించి పరిశుద్ధుడై, మునులచే పొగడబడు విష్ణులోకమగు వైకుంఠమును పొందును. 

*(లక్ష్మీదేవితో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము)*.