🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹
*🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*
. *భాగం - 8*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 3*
🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱
*కూర్మావతార వర్ణనము*
తథేత్యాహాథ తం విష్ణుస్తతః సర్త్వెః సహామర్తెః | స్త్రీరూపం సంపరిత్యజ్య హరేణోక్తః ప్రదర్శయ. 17
''అటులనే ఆగుగాక'' అని విష్ణువు ఆతనితో పలికెను. పిమ్మట స్త్రీరూపమును త్యజించి దేవతలతో కలిసి యుండగా శివుడు '' ఆ స్త్రీ రూపమును చూపుము'' అని హరితో అనెను.
దర్శయామాస రుద్రాయ స్త్రీరూపం భగవాన్ హరిః |
మాయయా మోహితః శమ్భుర్గౌరీం త్యక్త్వా స్త్రియం గతః. 18
భగవంతుడైన శ్రీమహావిష్ణువు రుద్రునకు స్త్రీరూపమును చూపెను. శివుడు విష్ణుమయచే మోహితుడై పార్వతిని విడచి ఆస్త్రీని వెంబడించెను.
నగ్న ఉన్మత్తరూపో భూత్ స్త్రీయః కేశానధారయత్ |
అగాద్విముచ్చ కేశాన్ స్త్రీ అన్వధావచ్చ తాం గతామ్. 19
శివుడు ఉన్మత్తుడై, దిగంబరుడై ఆమె కేశపాశమును పట్టుకొనెను. ఆమె జుట్టు విడిపించుకొని వెళ్లిపోయెను. ఇతడు ఆమె వెంట పరుగెత్తెను.
స్ఖలితం యత్ర వీర్యచం కౌ యత్ర యత్ర హరస్య హి | తత్ర తత్రాభవత్ క్షేత్రం లిఙ్గానాం కనకస్య చ. 20
ఈశ్వరుని వీర్యము స్ఖలితమై భూమిపై పడిన చోటులలో నెల్ల బంగారు లింగముల క్షేత్ర మయ్యెను.
మాయేయమితి తాం జ్ఞాత్వా స్వరూపస్థో భవద్దరః | శివమాహ హరీ రుద్రజితా మాయా త్వయా హి మే. 21
న జేతుమేనాం శక్తో మే త్వదృతే7న్యః పుమాన్ భువి |
ఇది యంతయు మాయ యని గ్రహించి శివుడు స్వస్థచిత్తుయెను. అపుడు విష్ణువు శివునితో ఇట్లనెను : '' రుద్రా! నీవు నా మాయను జయించితివి. ఈ లోకములో నీవు తప్ప మరెవ్వరును నా మాయను జయింపజాలరు. ''
ఆప్రాప్యాథామృతం దైత్యా దేవైర్యుద్ధే నిపాతితాః.
త్రిదివస్థాః సురాశ్చాసన్ దైత్యాః పాతాలవాసినః | యో నరః పఠతే దేవవిజయం త్రిదివం వ్రజేత్. 23
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే కూర్మావతారోనామ తృతీయోధ్యయః.
అమృతమును పొందజాలని ఆ దైత్యులను దేవతలు యుద్ధములో జయించిరి. దేవతలు స్వర్గములో నివసించిరి. దైత్యులు పాతళలోకనివాసు లయిరి. ఈ దేవి విజయకథను పఠించువాడు స్వర్గమును పొందను.
*ఆగ్నేయ మహా పురాణములో కూర్మావతార మనెడు తృతీయాధ్యయము సమాప్తము.*
సశేషం....
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱
🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹
*🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*
. *భాగం - 9*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 4*
🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱
*వరాహావతార వర్ణనము - 1*
*అథ వరాహాద్యవతార వర్ణనమ్.*
*అగ్ని రువాచ :-*
అవతారం వరాహస్య వక్ష్యేహం పాపనాశనమ్ | హిరణ్యాక్షో సురేశో భూద్దేవాఞ్జీత్వా దివి స్థితః. 1
*అగ్ని దేవడు పలికెను :* పాపములను నశింపచేయు వరాహావతారమును గూర్చి చెప్పెదను. హిరణ్యాక్షుడనెడు రాక్షసరాజు ఉండెను. అతడు దేవతలను జయించి స్వర్గలోకములో నివసించెను.
దేవైర్గత్వా స్తుతో విష్ణుర్యజ్ఞరూపో వరాహకః | అద్భుతం దానవం హత్వా దైత్యైః సాకం చ కణ్టకమ్.
ధర్మదేవాది రక్షాకృత్తతః సో7న్తర్దధే హరిః | 2
యజ్ఞస్వరూపు డగు విష్ణువును దేవత లందరును వచ్చి స్తుతింపగా ఆ హరి వరాహరూపము ధరించి, లోకకంటకు డైన ఆ దానవుని దైత్యులతోకూడ ఆశ్చర్యకర మగు విధమున సంహరించి, ధర్మమును దేవతలు మొదలగువారిని రక్షించి అంతర్థానము చెందెను.
హిరణ్యాక్షస్య వై బ్రాతా హిరణ్యకశిపు స్తథా.
జితదేవయజ్ఞ భాగః సర్వదేవాదికాకృత్ | 3
హిరణ్యాక్షుని సోదరుడైన హిరణ్యకశిపుడు దేవతల యజ్ఞభాగములను అపహరించి దేవతలందరిపైనను అధికారమును జరిపెను.
నారసింహం వపుః కృత్వా తం జఘాన సురైఃసహ.
స్వపరస్థన్ సురాంశ్చ క్రే నారసింహః సురైః స్తుతః | 4
విష్ణువు దేవతాసమేపతుడై (వెళ్లి) నరసింహరూపము దాల్చి ఆ హిరణ్యకశిపుని సంహరించెను. దేవతలచే స్తుతింపబడిన ఆ నరసింహుడు దేవతలను తమతమ స్థానములలో నిలిపెను.
దేవాసురే పురా యుద్ధే బలిప్రభృతిబిః సురాః.
జితాః స్వర్గాత్పరిభ్రష్టా హరిం వై శరణం గతాః | 5
పూర్వము దేవాసుర యుద్దమునందు బలి మొదలగువారిచే సురులు పరాజితులై, స్వర్గమును కోల్పోయిరి. వారు అపుడు హరిని శరణుజొచ్చిరి.
సురాణామభయం దత్త్వా అదిత్యా కశ్యపేన చ.
స్తుతో సౌ వామనో భూత్వా హ్యదిత్యాం స క్రతుం య¸° | 6
బలేః శ్రీయజమానస్య రాజద్వారే గృణాచ్ర్ఛుతిమ్.
విష్ణువు దేవతలకు అభయ మిచ్చి, అదితికశ్యపులు తనను స్తుతింపగా ఆదితియందు వామనుడగ జన్మించెను. ఆ వామనుడు శోభాయుక్తముగ యజ్ఞము చేయుచున్న బలి చక్రవర్తి యజ్ఞమునకు వెళ్లి అచట రాజద్వారమునందు వేదమును పఠించెను.
వేదాన్పఠన్తం తం దృష్ట్వా వామనం వరదో అబ్రవీత్ | నివారితోపి శుక్రేణ బలిర్ర్బూహి యదిచ్ఛసి. 8
తత్తేహం సంప్రదాస్యామి వామనో బలిమబ్రవీత్ | పదత్రయం హి గుర్వర్థం దేహి దాస్యే తమబ్రవీత్. 9
బలి వేదములను పఠించుచున్న ఆ వామనుని చూచి, ఆతడు కోరు కరముల నీయవలెనని నిశ్చయించుకొని, శుక్రాచార్యుడు నివారించుచున్నను, ఆతనితో '' నీ కేమి కావలెనో కోరుకొనుము; ఇచ్చెదను '' అని పలికెను. వామనుడు బలితో ఇట్లనెను : ''మూడు అడుగుల నిమ్ము; నా గురువునకు కావలెను''. బలి ''అట్లె ఇచ్చెదను'' అని పలికెను.
తోయే తు పతితే హస్తే వామనోభూదవామనః | భూర్లోకం స భువర్లోకం స్వర్లోకం చ పదత్రయమ్. 10
చక్రే బలిం చ సుతలే తచ్ఛక్రాయ దదౌ హరిః | శక్రో దేవైర్హరిం స్తుత్వా భువనేశః సుఖీ త్వభూత్. 11
దానజలము చేతిలో పడగానే వామనుడు అవామనుడ (పెద్ద శరీరము కలవాడు) ఆయెను. భూలోక-భువర్లోక-స్వర్లోకములను మూడడుగులుగా గ్రహించి బలిని సుతలమునకు త్రొక్కివేసెను.
వామనరూపుడైన హరి ఆ లోక త్రయమును దేవేంద్రున కిచ్చెను. దేవతాసహితు డగు ఇంద్రుడ హరిని స్తుతించి, త్రిభువనాధీశుడై సుఖముగా నుండెను.
సశేషం....
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి