16, డిసెంబర్ 2023, శనివారం

శ్రీ మదగ్ని మహాపురాణము

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*

.                *భాగం - 7*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 2*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱

*శ్రీ గణేశాయ నమః*

 *ఓం నమో భగవతే వాసుదేవాయ.*


*మత్స్యావతార వర్ణనము - 3*


అద్భతమైన ఆ మత్స్యమును చూచి, మనువు ఆశ్చర్యము చెంది ఇట్లు పలికెను.  "నీ వెవరవు? నీవు నిజముగ విష్ణుమూర్తివే. నారాయణా! నీకు నమస్కారము. జనార్థనా! మాయ చేత నీవు నన్నీవిధముగ ఏల మోహపెట్టుచున్నావు?"


మను వీ విధముగా పలుకగా ఆ మత్స్యము ప్రజలకు పాలించుట యందు ( లేదా తనను రక్షించుటయందు) ఆసక్తి గల ఆతనితో ఇట్లనెను- "ఈ జగత్తును నిలుపుటకును, దుష్టులను నశింప చేయటకును అవతరించినాను".


"(నేటినుండి) ఏడవ దివసమున సముద్రము ఈ జగత్తును ముంచివేయును. అపుడు నీదగ్గరకు వ్చచిన నావలో బీజములు మొదలగువాటిని ఉంచుకొని, సప్తర్షిసమేతుడవై బ్రహ్మనిద్రించు రాత్రి అంతయు సంచరింపగలవు. నేను నీ దగ్గరకు వచ్చినపుడు ఆ నావను పెద్ద సర్పముతో నా కొమ్మునకు కట్టి వేయుము".


ఇట్లు పలికి మత్స్యము అంతర్ధానము చెందెను. మనువు ఆ కాలమునకై నిరీక్షించుచు ఉండెను. సముద్రము గట్టు దాటి పొంగగా అపుడు నావను ఎక్కెను. ఒక కొమ్ముగల, పదివేల కోట్ల యోజనములు గల బంగారు మత్స్యము (వచ్చెను). దాని కొమ్మునకు నావను కట్టెను. ఆ మత్స్యమును స్తోత్రములచే స్తుతించుచు, పాపములను తొలగించు మాత్స్యపురాణమును ఆ మత్స్యము చెప్పగా వినెను. 


కేశవుడు బ్రహ్మనుండి వేదములను అపహరించిన హయగ్రీవు డను దానవుని సంహరించి వేదమంత్రాదులను రక్షించెను. పిమ్మట వారాహకల్పము రాగా హరి కూర్మావతారం ధరించెను.


*అగ్ని మహాపురాణములో మత్స్యావతారమను ద్వితీయాధ్యాయము సమాప్తము.*

సశేషం....

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱

కామెంట్‌లు లేవు: