23, అక్టోబర్ 2020, శుక్రవారం

సుభాషితం


*నేటి సుభాషితం* 🌹🌹🙏


*పరోపి హితవాన్ బంధుః ,*

*బంధుర ప్యహితః పరః*

*అహితో దేహజో వ్యాధిః ,* *హితమారణ్యమౌషధమ్.*


*పరుడైనా,మన హితాన్ని కోరేవాడైతే వాడు మనకు బంధువే.మన హితం కోరనివాడు వాడు మన బంధువైనా, పరుడే!*


*హితం కోరని బంధువు మన శరీరంలో పుట్టిన వ్యాధి వంటివాడు. మన హితం కోరిన పరుడు ఆ వ్యాధిని తగ్గించే అరణ్యంలోని ఔషధం వంటివాడు.*


🙏🌹🌹🙏🌹🌹🙏

సంస్కృత సూక్తి*


*ఆత్మాయత్తౌ వృద్ధివినాశౌ*


అభివృద్ధి అయినా, వినాశమైనా తన చేతుల్లోనే ఉంటుంది.


*శుభంభూయాత్*

జోక్

 🌷🌷🌷


చార్లీ చాప్లిన్ ఓ సభలో

ఓ జోక్ చెప్పారు. అందరూ గొల్లున నవ్వారు.


నవ్వులన్నీ ఆగిన తర్వాత చాప్లిన్ ఆ జోకునే మళ్ళీ చెప్పారు. సభలో సగం మందే నవ్వారు.


కాస్సేపు తర్వాత చాప్లిన్ మళ్ళీ ఆ జోకునే చెప్పారు. ఈసారి అతి తక్కువమందే నవ్వారు.

చాప్లిన్ నాలుగోసారి ఆ జోకుని చెప్పినప్పుడు ఒక్కరూ నవ్వలేదు. సభ నిశ్శబ్దంగా ఉంది.


అప్పుడు చాప్లిన్ ఇలా అన్నారు....


"నవ్వులు పుట్టించిన జోకునే పదే పదే చెప్తే నవ్వు తెప్పించనప్పుడు

ఒకే దిగులునే పదే పదే అనుకుని బాధపడడం ఎందుకు? జీవితంలో ఏవీ శాశ్వతం కావు. 


నవ్వుల వెంట కన్నీళ్ళూ, కన్నీళ్ళ వెంట నవ్వులూ ఉంటూ ఉంటాయి....

దేన్నయినా స్వీకరించకతప్పదు" అని...


ఇవి మన జీవితంలో ఉంటూనే ఉంటాయి. దేనిని తక్కువగా చూడొద్దు ఒక దాని వలన ఒకటి మనం పొందగలుగుతున్నాం అనే ఆలోచనతో ముందుకు పయనించడమే.....


🌷🌷🌷🌷🌷🌷

శ్వేతర్కం (తెల్ల జిల్లేడు ) -

 శ్వేతర్కం (తెల్ల జిల్లేడు ) -


     తెల్ల జిల్లేడు  దూదితో ఇప్పనూనే తో 5  దీపాలు చేసి 5 వారాలు వెలిగిస్తే ఆంజనేయస్వామి ప్రసన్నులవుతారు . దీని పూలతో శివపుజ, ఆకులతో  సూర్యపుజ దీని సమిధలతో  సుర్య హోమంచేస్తారు. దీనివేరు తవ్వి తీసుకొనిరావడం ఆదివారం, గురువారం లలో  పుష్యమి నక్షత్రం రోజున మంచిది.


వేరు తీసే విధానం.- 


 *   ముందుగా చెట్టు గుర్తుఉంచుకోవాలి .

 

 *   ఏ రోజున శ్వేతార్కం ఆది, గురు , పుష్యమి నక్షత్రాలు కలిసిన రోజుకి ముందుగా రహస్యంగా (వేరు తీసుకొస్తున్నట్టు ఎవ్వరికి తెలియకూదదు) .


 *   చెట్టు వద్దకు సాయంకాలం వెళ్ళాలి. వెళ్ళేప్పుడు ఎర్రటిధారం , సింధూరం , నీరు ,అగరవత్తులు అగ్గిపెట్ట తీసుకొని వెల్లాలి.

 

 *  చెట్టు దగ్గర తూర్పు ఈశాన్య దిశలలో  ఎటువైపున నిల్చొని  చెట్టుని గణపతిగా భావించి నమస్కరించి చెట్టు మొదలులో నీరుపోసి , సిందూరం సమర్పించి దూపం వెలిగించి ఎర్రని దారాన్ని చెట్టుకి కట్టి ప్రార్ధించాలి.


 ప్రార్ధన - 

 

హే గణపతి ప్రభో , శ్వేతర్క దేవా  నా కార్యసిద్ధికై  రేపు నిన్ను తీసుకుని వెళ్ళడానికి వస్తాను. దయతో మీరు నా కార్యం సిద్ధించే నిమిత్తం నాతో రావలసిందిగా ప్రార్ధిస్తున్నాను. అంటూ నమస్కరించి తిరిగివచ్చి రాత్రి ఒంటరిగా పడుకోవాలి.


తెల్లవారుజామున  లేచి స్నానం చేసి శుభ్రమైన  వస్త్రం, తవ్వడానికి చిన్న సాధనం తీసుకుని చెట్టు వద్దకు వెళ్లి తుర్పు ,ఉత్తర దిశలలో ఎటైన నిలుచొని నమస్కరించి గణపతి మంత్రం చదువుతూ జాగ్రత్తగా వెరు తవ్వి తీయాలి . ఒకవేళ వేరు మధ్యలో విరిగినా దాన్ని జగ్రత్తగా వస్త్రం లొ చుట్టి ఇంటికి తీసుకురావాలి.


మంత్రాలు - 

                  ఓం గం గణపతయే నమః.

                  ఓం గ్లౌం గణపతయే నమః.


అదృష్టం ఉంటే వేరు అచ్చం గణపతిలా లభించొచ్చు . 


   పూజా విదానం - శ్వేతార్కం ని శుద్ధజలం లో  కడిగి శుభ్రంగా తుడిచి ఆసనం పైన ఎర్రటి వస్త్రం పరిచి దానిపైన పెట్టాలి  ఎర్రచందనం పౌడర్ , ఎర్రకుంకుమ, పసుపు, గంధం పొడి ,సిందూరం, పువ్వులు , అక్షింతలు తో పూజించాలి.


సిద్ది, బుద్ధి, ఐశ్వర్యం కోరేవారు  పైన చెప్పిన మంత్రాలలో 2 వ మంత్రం చదువుతూ పైన చెప్పిన వస్తువులు వేసి పుజించాలి. దూప దీపాలు సమర్పిస్తూ గణపతికి నైవేద్యం గా కుడుములు, ఉండ్రాళ్ళు, లడ్లు సమర్పించాలి. ఇది అయినతర్వాత  కనీసం 1116 సార్లు పైమంత్రం జపం చేసి హోమగుండం లొ నెయ్యి, పంచదార, నువ్వులు, జొన్నలు లెదా గోధుమలు గాని కలిపి పై మంత్రం తో హొమం చేయాలి. కనిసం జపసంక్యలొ దశాంశం అనగా 10% హొమం జరగాలి. ఇదైన తర్వాత వీబూది శ్వేతర్కములం పై రాసి దానిని పుజాస్థానం లొ పెట్టి దూప దీప నైవేద్యాలు అర్పించాలి. (వీబుధి హోమాగుండం లోని ధి) .


ఉపయొగాలు -

 

 *  శ్వేతార్కం ఇంట్లో ఉంటే సాక్షాత్తు గణపతి ఇంట్లో ఉన్నట్టే.


 *  ధన, ధన్య  సమృద్ది పెరుగుతుంది. వ్యాపారం అభివృద్ది. అది ఎలా శాఖోపశాఖలుగా  పెరుగునో  వ్యాపారం అలా పెరుగును.


 *   విద్యార్ధులు రాణిస్తారు.


 *  సర్వకార్యాలు జయప్రదం అవుతాయి.

 

ఎలాంటి  పరిస్థితులలోను నిరాదరణ చేయకూడదు..  


 గమనిక  - 


       అదివారం పుష్యమి నక్షత్రం , గురువారం పుష్యమి నక్షత్రం  వచ్చి యుండి ఉన్న ఆ సమయాన్ని "పుష్యార్కయోగం" అని అంటారు. శ్వేతార్కం ఈ సమయంలో మాత్రమే తీయాలి . 


        పుణ్యక్షేత్రాల్లో చెక్కతో చేసిన గణపతి బొమ్మలను శ్వేతార్క గణపతి పేరుతో అమ్ముతున్నారు. వాటివల్ల ఎటువంటి ఉపయోగము లేదు .


   గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

అంత ఎత్తుకు ఎలా వెళతారో


 

కాళరాత్రి

 కాళరాత్రి


ప్రధమం శైలపుత్రీచ ద్వితీయం బ్రహ్మచారిణీ!

తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చథుర్ధకమ్!

పంచమమ్ స్కంధమంతేతి షష్టం కాత్యాయనతిచ!

సప్తమం కాళరాత్రేతి మహాగౌరీతి అష్టమం!

నవమ సిధ్ధిధాత్రీచ నవదుర్గాః ప్రకీర్తితాః 



కాళరాత్రి నవదుర్గలలో ఒక దుర్గా స్వరూపం. శక్తి లేకుండా ఎప్పుడూ ఏ పని జరగదు. శక్తి అనేది ఉంటేనే మనము ఏ పనినైనా పూర్తి చేయగలుగుతాము. నిర్మాణం చేయాలన్న, నిలబెట్టాలన్నా శక్తి ఉండాలి. లోకంలో ప్రళయం అని ఒక మాట వింటూ ఉంటాము. మనము సామాన్యంగా ప్రళయం అనగానే, అది ఒక క్రౌర్యంతో కూడుకున్నదని అనుకుంటూ ఉంటాము. భగవంతునికి కోపం వచ్చి ప్రళయం చేస్తాడనుకుంటాము. ఈశ్వరుడు నిర్వహించేటటువంటి పనులలో కేవలం కారుణ్యము మాత్రమే ఉంటుంది తప్ప క్రౌర్యానికి తావు లేదు. ఆయన ప్రళయం ఎందుకు చేస్తాడంటే, ఎన్ని జన్మలకో ఇచ్చిన భక్తితో ఉండక నన్ను పొందు అని అవకాశం ఇచ్చినా పొందలేకపోతున్నాడు, అని మనమీద కారుణ్యముతో ఆ జీవుడు నన్ను ఎలాగో పొందలేక పోతున్నాడు. నేనే వాడిని పొందేస్తాను అని అందరినీ ఆయన పొందేస్తాడు. ఇలా పొందే ప్రక్రియకు ప్రళయం అని పేరు. సృష్టి చేసేవాడు, పడగొట్టేవాడు కూడా ఆయనే. ఈ ప్రక్రియలు చేయడంలో ఆయనకి కోపం ఏమీ ఉండదు. అమ్మవారు కాళరాత్రి అని ప్రవర్తించేటప్పుడు కూడా ఆవిడ అంత కారుణ్యమూర్తియే.


సంస్కృత భాషలో రాత్రిని 'నిశ' అంటారు. అర్ధరాత్రిని 'నిశీధి' అంటారు. నిశీధి కాలంలో అనగా ఆర్ధరాత్రి కాలంలో జీవన ప్రక్రియలన్నీ ఆగిపోతాయి. మళ్ళీ బ్రహ్మ ముహూర్తం వచ్చేటప్పటికి కార్యక్రమాలు మొదలవుతాయి. దీనిని బట్టి శక్తిని పుంజు కోవాలంటే పరిగెత్తడం ఎంత అవసరమో, ఆపడం కూడా అంతే అవసరం. కాళరాత్రి అంటే ఆపే ప్రక్రియకి సంకేతం. ఆవిడ మొత్తం కదలికలను ఆపుతుంది. రాత్రులు మూడు రాత్రులుగా ఉంటాయి. జీవరాత్రి, ఈశ్వరరాత్రి మరియు కాళరాత్రి.


జీవరాత్రి అంటే జీవులన్నీ పడిపోతాయి. ఇక జీవులు ఉండవు. మహాప్రళయము అంటారు. సముద్రాలలో ఉండే నీరు అంతా భూమి మీదకి వచ్చి ఒక్క జీవి కూడా మిగలదు. అన్ని లయమై పరమేశ్వరుని లోకి వెళ్ళిపోతాయి.


ఈశ్వర రాత్రి అంటే ఈశ్వరుడు కార్య నిర్వహణ చేస్తూ ఉంటాడు. జీవులు లయమవుతూ ఉన్నాయి. అంటే ఈశ్వర సంబంధంగా ఒక పని అవుతున్నది కదా. అందుకని ఈశ్వర కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. ఆ ఈశ్వర కార్యక్రమాలను ఆపేస్తుంది. దానికి ఈశ్వర రాత్రి అంటారు.


కాళరాత్రి ఇవేమీ ఉండకుండా అన్నీ వెళ్లి పరమేశ్వరునిలో చేరిపోతే దానిని కాళరాత్రి అంటారు. ఈ సమయంలో సూర్యోదయ సూర్యాస్తమయాలు ఉండవు. కాలం నడవడం ఉండదు. కటిక చీకటి ఒక్కటే మిగులుతుంది. దానిని కాళరాత్రి అంటారు.


నడవడానికి ఏ తల్లి శక్తి రూపంగా నడిపిస్తుందో ఆ తల్లే ఉప సంహారం కూడా చేస్తుంది. నడకకి కాలం ప్రధానం. కాలం కదులుతూ ఉంటుంది. ఆవిడ కదులుతున్న కాలాన్ని కూడా ఆపేస్తుంది. అలా ఆప గలిగిన శక్తి ఏదో ఆవిడ కాళరాత్రి. ఆవిడ సమస్త బ్రహ్మండాలను ఆపివేస్తుంది. ఆవిడ అనుగ్రహిస్తే ఎక్కడినుండి ఎక్కడి వరకు ఏదైనా ఇచ్చేస్తుంది. శివశక్త్యై రూపిని లలితాంబికా అంటూ ఆవిడ వైపు చూడకుండా ప్రార్ధన చేయక, అనుగ్రహం పొందలేకపోతే దీపపు పురుగులు పుట్టినట్లు కొన్ని కోట్ల జన్మలు పుట్టి, గిడుతూనే ఉంటాము. ఇన్నింటిని నడుపుతున్న తల్లిని చూడాలని ఉన్నది, అని మనసులో అనిపిస్తే, విజయవాడ వెళితే, ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ కాళరాత్రి, ఆవిడ కదుపుతున్నది. ఎర్రగా తాంబూల చర్వణం చేస్తూ, నవ్వుతూ, త్రిశూలం చేతిలో పట్టుకుని నిలబడి ఉంది. ఈ కదలికలు అన్నింటికీ కారణం ఆవిడ కాళరాత్రి. ఏదైనా అనుగ్రహించగలదు. అలాంటి అనుగ్రహాన్ని మనమందరం అ తల్లి దగ్గిరనుండి అపెక్షిస్తూ....


సర్వేజనా సుఖినోభవంతు


శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి


WhatsApp Number: +91 8886240088

*శ్రీ చక్రార్చన

 





*శ్రీ చక్రార్చన*


శ్రీ చక్రం సమస్తములైన శ్రీ విద్యలకు సర్వోత్క్రుష్ట మైన పరమ సూక్ష్మమైన రూపం . తాంత్రికమతంలో ఉన్న మంత్రాలలో శ్రీ చక్రం చాలా ప్రసస్థమైనది . 


శ్రీ చక్రాన్ని మించిన యత్రం వేరొకటి లేదని శాస్త్రవేత్తల అభిప్రాయము . 


శ్రీవిద్య - పరంజ్యోతి - పరా - నిష్కళాశాంభవీ - అజపా అనే పంచ మాతృకలు పంచకోశాలుగా ఈ శ్రీ చక్రంలో పూజింపబడుచున్నారు . 


వీటిలో శ్రీవిద్య (ఆనంద స్వరుపిణి ) మధ్య బిందువు మిగిలిన పరంజ్యోతి - పరా - నిష్కళాశాంభవీ - అజపా చుట్టూ నలువంకల నిల్చి పూజలందుకొంటున్నారు .


చత్వారి శివచక్రాణి శక్తి చక్రాణి పంచ చ

నవచక్రమిదం జ్ఞేయం శ్రీ చక్రం శివయోర్వపుః


శివపరమైన చక్రాలు నాలుగు , శక్తిపరమైన చక్రాలు ఐదు . కలిసి మొత్తం తొమ్మిది .


త్రైలోక్య మోహన చక్రం 

సర్వాశా పరిపూరక చక్రం 

సర్వసంక్షోభక చక్రం . 

సర్వ సౌభాగ్య దాయక చక్రం 

సర్వార్థ సాధక చక్రం 

సర్వ రక్షాకర చక్రం 

సర్వరోగ హర చక్రం 

సర్వసిద్ధి ప్రద చక్రం 

సర్వానందమయ చక్రం 


అట్టి శ్రీ చక్రం పార్వతీ పరమేశ్వరుల శరీరమని తెలుసుకోవాలి . 


శివశక్తి సంభంధమైన ఈ తొమ్మిది చక్రాలను నవావరణ లంటారు . అట్టి నవావరణలతో కూడిన శ్రీ చక్ర సామ్రాజ్యానికి శ్రీ విజయదుర్గా దేవిని మహారాణిగా గుర్తించాలి . శ్రీ చక్రం యొక్క యంత్ర , తంత్ర , మంత్రాల విధానాన్ని శ్రీవిద్య అంటారు . 


ఈ శ్రివిద్యను ఉపాసించిన వారు పద్నాలుగుమంది . 


" విష్ణుః శివః సురజ్యేష్టః మనుశ్చంద్రో ధనాదిపః 

  లోపాముద్ర తధాగస్త్యః స్కందః కుసుమసాయకః 

  సురాధీశో రౌహిణేయః దత్తాత్రేయా మహామునిః 

  దుర్వాసా ఇతి విఖ్యాత ఏతే ముఖ్యా ఉపాసకాః "


విష్ణువు , శివుడు , బ్రహ్మ, మనువు , చంద్రుడు ,కుబేరుడు , లోపాముద్ర , అగస్త్యుడు , కుమారస్వామి , మన్మధుడు , ఇంద్రుడు , శ్రీకృష్ణుడు , దత్తాత్రేయుడు , దుర్వాసుడు అనే పద్నాలుగు మంది శ్రివిద్యోపాసకులలో ముఖ్యులు . 


శ్రీ చక్రారాధన చేసినట్టివారు సకలభోగ భాగ్యలను సుఖ సంతోషాలను ఆధ్యాత్మిక శక్తిని పొందగలరు . శ్రీ అంటే సమస్త సంపదలు . శ్రీ చక్రమంటే సిరులను ప్రసాదించే చక్రం . శ్రీ చక్ర నిర్మాణం భూ ప్రస్తారం , మేరు ప్రస్తారం ,


1వ ఆవరణ ను త్రైలోక్య మోహన చక్రం అంటారు. 

2వ రేఖ పై అష్టమాత్రుకలు కొలువై ఉంటారు.

3వ రేఖ పై ముద్రా శక్తులు కొలువై ఉంటారు.

ఈ ప్రధమావరణ చక్ర నాయకి "త్రిపుర".

ప్రకట యోగినులు పూజ అనంతరం చక్ర మధ్యం లో చక్ర నాయకి త్రిపుర ను మూల మంత్రం తో అర్చిస్తారు. సర్వసంక్షోభిణి ముద్ర ను ప్రదర్శించి నివేదనం సమర్పించాలి.


2వ ఆవరణను సర్వాశపూరక చక్రం అంటారు. ఈ చక్రం లోని దేవతలను గుప్త యోగినులు అంటారు. చక్ర నాయకి "త్రిపుర సుందరి".. ఈ ఆవరణ షోడశదళ పద్మం. ఈ ఆవరణలో ఈ యోగినులను అప్రదక్షిణంగా పూజించాలి. అనంతరం సర్వ విద్రావణి ముద్ర ను ప్రదర్శించి నివేదనం సమర్పించాలి


3వ ఆవరణ ను సర్వ సంక్షోభణ చక్రం అంటారు. ఇది అ‌ష్టదళ చక్రం. ఈ చక్రం లోని దేవతలను గుప్తతర యోగినులు అంటారు. చక్ర అష్ట దళాలలో వీరు కొలువై ఉంటారు. చక్ర నాయకి "త్రిపుర సుందరి". వీరిని పూర్వాదిగా యంత్రం లో చూపిన విధంగా పూజించాలి. అనంతరం సర్వాకర్షిణి ముద్ర ప్రదర్శించి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి.


4వ ఆవరణను సర్వ సౌభాగ్య చక్రం అంటారు. ఈ ఆవరణ దేవతలను సాంప్రదాయ యోగినులు అంటారు. దీనిని చతుర్దశార చక్రం అంటారు. యంత్రం లో చూపిన స్ధానాల్లో పూజించాలి. అనంతరం సర్వ వశంకరి ముద్ర ప్రదర్శించి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి.


5వ ఆవరణను సర్వార్థ సాధక చక్రం అంటారు. దీనిని బహిర్దశార చక్రం అంటారు. ఈ చక్రం లోని దేవతలను కులయోగినులు అని అంటారు. యంత్రం లో చూపిన స్ధానాల్లో పూజించాలి. చక్ర నాయకి "సర్వ సిద్ధిప్రద". ని ఛక్ర మధ్యం లో పూజించాలి. అనంతరం సర్వోన్మాద ముద్ర ను ప్రదర్శించి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి


6వ ఆవరణను సర్వరక్షాకర చక్రం అంటారు. దీనిని అంతర్దశార చక్రం అంటారు.. ఈ ఆవరణ దేవతలను నిగర్భయోగినులు అని అంటారు. చక్ర నాయకి 'త్రిపుర మాలిని'. యంత్రం లో చూపిన స్ధానాల్లో పూజించాలి. అనంతరం సర్వ మహంకుశ ముద్ర ను ప్రదర్శించి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి.


7వ ఆవరణ ను సర్వరోగహర చక్రం అంటారు. దీనిని అష్టకోణ చక్రం అంటారు. ఈ ఆవరణ దేవతలను రహస్య యోగినులు అంటారు. యంత్రం లో చూపిన స్ధానాల్లో పూజించాలి. చక్ర నాయకి 'సిద్ధాంబ'. సర్వ ఖేచరి ముద్ర ను ప్రదర్శించి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి


8వ ఆవరణను సర్వసిద్ధిప్రద చక్రం అంటారు. దీనిని త్రికోణ చక్రం అంటారు. ఈ ఆవరణ దేవతలను పరాపర రహస్య యోగినులు అంటారు. చక్ర నాయకి 'త్రిపురాంబిక'. యంత్రం లో చూపిన స్ధానాల్లో పూజించాలి. అనంతరం సర్వబీజ ముద్ర ను ప్రదర్శించి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి.


8వ ఆవరణ దేవతా పూజానంతరం నిత్యామండల దేవతలను పూజ చేయాలి. అమ్మకు గురువు కు అభేదం. లలితా సహస్రనామ స్తోత్రం లో అమ్మవారి ని గురుమండల రూపిణ్యై నమః,గురుమూర్తయే నమః అంటారు. గురు మండలం ని పూజించాలి


9వ ఆవరణ యే శ్రీ చక్రం లోని బిందువు. లలితా త్రిపుర సుందరీ పరాభట్టారిక కొలువై ఉంటారు. బిందు స్థానం లో లలితా త్రిపుర సుందరీ పరాభట్టారిక ను పూజించాలి. యోని ముద్ర ను ప్రదర్శించి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి.


పళ్ళు బెల్లం దద్ధ్యన్నం (దద్దోజనం) గుడాన్నం ( అన్నం పై బెల్లం వేసి) హరిద్రాన్నం ( నిమ్మ పులిహోర). ఏదేని అన్న ప్రసాదం అమ్మవారి కి దండి గా ఉంటుంది. అభిషేకం చేస్తే ఖచ్చితంగా అన్న ప్రసాదం ఉండాలి. మహా నివేదన శ్రేష్ఠమైనది.


లలితా సహస్రనామ స్తోత్రము పారాయణ చేయడం మంచిది.

గమనిక: పంచమ షష్టమావరణ ల యంత్రాలు ఒకటే. పేరు మారుతుంది అంతే. అంతర్దశారం మరియ బహిర్దశారం

ప్రతి ఆవరణ కు దేవతా పూజా విధానం గురుముఖతః నేర్చుకోవాలి.


*శ్రీ మాత్రే నమః* 

ఐశ్వర్య దీపం

 ఈరోజు ఐశ్వర్య దీపం పెట్టండి 🙏🙏🙏*


ఐశ్వర్యదీపం అంటే ఉప్పుతో పెట్టే దీపం.. 
ఇది ఎందుకు పెడతారు ఎలా పెడతారో తెలుసుకుందాము..!

సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్టు ఖర్చు అవుతుంటుంది, 
అప్పులు తీరకుండా వడ్డీ పెరిగి పోతూ ఉంటుంది, వ్యాపారంలో లాభాలు లేకుండా ఇబ్బందులు ఉన్నవారికి, అరకొర జీతంతో ఆదాయం పెరగని వారికి, బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల దిష్టివల్ల సరిగ్గా జరగకుండా ఉన్నవారికి, 
కొత్తగా ఎదైనా వ్యాపారం మొదలు పెట్టిన వారికి 
అభివృద్ధి కి, అసలు ఏ ఆదాయం ఉపాధి లేని వారికి ఆదాయం కోసం ఈ ఐశ్వర్య దీపం "ఉప్పు దీపం" మంచిపరిహారం..

ఎలా పెట్టాలి..!

ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ 
ఒక పెద్ద ప్రమిదలు రెండు తీసుకొని పసుపుకుంకుమా రాసి  నెలపైన బియ్యం పిండి పసుపు కుంకుమ తో ముగ్గు వేసి దానిపైన ప్రమిధలు ఒకదాని పైన ఒకటి ఒక్కటిగా పెట్టి అందులో ఒక పావు కిలో రాళ్ళ ఉప్పు వేసి 
ఆ రాళ్ళ ఉప్పు పైన పసుపు కుంకుమ చల్లాలి.
ఒక చిన్న ప్రమిధలు ఒకదాని పైన ఒకటి పెట్టి పసుపుకుంకుమా పూలు పెట్టి ప్రమిధలో  నూనె కానీ నైయి కానీ పోసి రెండు ఒత్తులు ఒక్కటిగా వేసి వెలిగించాలి.. 

దీపం శ్లోకం చదువుకోవాలి... 
పళ్ళు కానీ, పాలు పటికబెల్లం, కొబ్బరికాయ ఏదైనా నివేదన నైవేద్యంగా పెట్టి , లక్ష్మీ, వేంకటేశ్వరస్వామి స్త్రోత్రం చదువుకోవాలి... 
కనకధార స్త్రోత్రం కూడా చదివితే మంచిది...

శుక్రవారం ఇలా దీపారాధన చేశాక శనివారం రోజు 
ఆ ప్రమిధలు లో ని ఉప్పు మటుకు తీసి  నీటిలో కలిపి ఇంటి బయట తొక్కని జాగాలో పోయాలి 
అవకాశం ఉన్నవాళ్లు నదిలో కలపవచ్చు, 
ప్రమిధలు మార్చాల్సిన పని లేదు 
ప్రతి వారం అవి వాడుకోవచ్చు ,
ప్రతి శుక్రవారం ఇలా ఉప్పు పైన దీపం వెలిగించి 
శనివారం రోజు ఆ ఉప్పు తీసేయాలి...
అలా 11 శుక్రవారాలు కానీ 16 శుక్రవారాలు కానీ 
21 కానీ 41 శుక్రవారాలు కానీ అనుకోని ఇంట్లో చేయాలి 

ఈ ఉప్పు దీపం ఈశాన్యం మూల పెట్టడం ఇంకా మంచి ఫలితం వస్తుంది.. 
41 శుక్రవారాలు ఈ ఉప్పు దీపం పెట్టే వారికి శాశ్వతంగా ధనము యొక్క ఇబ్బందులు తొలగిపోతాయి.. 
కొందరు ఇది రాక్ సాల్ట్ పైన పెడతారు కానీ రాళ్ళ ఉప్పు పైన పెట్టడమే సంప్రదాయం...
(ఈ తీసేసిన ఉప్పుని ఇంటి బయట ఉన్న షిన్క్ లో కూడా నీటిలో కలిపి పోయవచ్చు సౌకర్యం లేని వారికి).. 
ఇది ఎవ్వరైనా చేసుకోవచ్చు.

*శ్రీ మాత్రే నమః* 









 

దర్గాలకు వెళ్లే

 సనాతన ధర్మానికి ఎలాంటి సంభందం లేని దర్గాలకు వెళ్లే హిందువులకోసం:

ఒక దర్గా ఎలా ఏర్పడుతుంది ? అందులో సమాధైన వ్యక్తి  ఎలాంటి ఘన కార్యం చేస్తే అతని పేరు మీద దర్గా నిర్మిస్తారు ?

ఒక దర్గా చరిత్ర:

ఇప్పటి పాకిస్థాన్లోని ఒక దర్గా ఇది. హజరత్ ఘాజి ఇలీముద్దీన్ షహీద్ దర్గాహ్,లాహోర్. ఈ ఇలీముద్దీన్ అనే వ్యక్తి ఎం చేసాడో తెలుసా ?


1920 దశకంలో లాహోర్లోని ఒక తురుష్కుడు సీతా మాతని అగౌరవ పరుస్తూ ఒక పుస్తకం ప్రచురించాడు. దానికి ప్రతిచర్యగా రంగీలా రసూల్ అనే పుస్తకాన్ని ఆర్య సమాజ్ కి చెందిన మహాశయ రాజ్ పాల్ ముద్రించారు. దీనితో ఆగ్రహించిన తురుష్కులు అయన పై ఫిర్యాదు చేశారు. న్యాయ స్థానం విచారణ తరవాత అతన్ని నిర్దోషిగా ప్రకటించింది.  జులై 1, 1927 లాహోర్ లో ఒక మసీదులోనుంచి భాషన ఇచ్చిన మౌలానా మొహమ్మద్ అలీ రాజ్పాల్ మీద జిహాద్ ప్రకటించాడు. ఈయనగారు గాంధీ గారి దగ్గర "హిందూ ముస్లిం ఐక్యతతకు  ఆదర్శం " అనే బిరుదు పొందినవారు. ఆగ్రహంతో ఊగి పోయిన తురుష్కులు పలు మార్లు అయన పై హత్యాయత్నం చేశారు. తురుష్కులలో ఒకడైన ఇలీముద్దీన్ 1929 ఏప్రిల్ 6 వ తేదీన రాజ్ పాల్ కత్తితో పొడిచి హత్య చేసాడు. సాక్షాత్తు జిన్నా కోర్టులో హాజరై ఇలీముద్దీన్ శిక్ష తగ్గే విదంగా వాదించారు. కానీ  బ్రిటిష్ ప్రభుత్వం అతనికి ఉరి శిక్ష అమలు చేసింది.


ఇలా సాటి మానవుడిని పొడిచి చంపిన ఇలీముద్దీన్ మరణానంతరం "హజరత్" , "ఘాజి" గా కీర్తించబడి,ఇస్లారం కి చేసిన సేవలకు గాను గుర్తింపుగా అతనిపేరుతో ఈ దర్గా నిర్మించారు. 

 ఇలా ప్రతి దర్గా వెనక హిందూ రక్తం చిందిన కథ ఉంది. వాస్తవాలను గ్రహించుకోండి. 

1482 లో  కొండపల్లి లో మొహమ్మెద్ షా బహ్మనీ మరియు  అతని మంత్రి మహమూద్ గవాన్ శివాలయాన్ని ధ్వంసం చేసి, బ్రాహ్మణులను ఊచ కొత కోసి మస్జీద్ నిర్మించారు. 


పెనుగొండలో ఈశ్వర ఆలయాన్ని బాబా ఫక్రుద్దీన్ దర్గా గా మార్చారు. హిందువులను ఆకర్షించటానికి పేరు బాబయ్య స్వామి గా మార్చారు. 


కొండవీడు లో 1337  వ సంవత్సరంలో ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదు, బారాన్ వాలి దర్గా  నిర్మించారు.. 

బిక్కవోలు, రాజముండ్రి, పెడన, నందిగామ, మచిలీపట్టణం ..... చెప్పుకుంటూ పోతే తెల్లవారుతుంది ...


సేకరణ

విజయదశమి

 విజయదశమి అంటే ఆరోజు సూర్యోదయానికి శ్రవణ నక్షత్రం ఉండాలి. శ్రవణ నక్షత్రానికి అధిదేవత విష్ణువు. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది.

అందుకే ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనుకొనేవారు ఈ రోజు ప్రారంభిస్తే విశేషంగా లాభిస్తుంది. శమీ చెట్టు యొక్క పూజ ఈ రోజు విశేషంగా లాభిస్తుంది. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకొన్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజా స్థలంలో, ధన స్థానంలో నగదు గల్ల పెట్టెల్లో పెట్టుకుంటారు. దీనివల్ల ధనవృద్ది జరుగుతుంది.


నవరాత్రి పదంలో నవ శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రాలు అని ధార్మిక గ్రంధాలు వివరిస్తున్నాయి. అంటే తొమ్మిది పగళ్ళు, తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక ప్రత్యక విధానం ఉంది. ఆశ్వయుజ శుక్ల పక్ష పాడ్యమి తిథి నుండి తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు అమ్మవారిని పూజించడం ప్రశస్తంగా చెప్పబడింది. దీనినే 'శరన్నవరాత్రులు' లేదా 'దేవి నవరాత్రులు అంటారు.


నవరాత్రి వాస్తవానికి ఋతువుల సంధికాలం. అందుచేత సృష్టికి కారణమైన మహా మాయ తీవ్రవేగం కలిగి ఉంటుంది. పూజాదుల చేత అమ్మవారిని ఆహ్వానించటం సులభ సాధ్యం. తొమ్మిది రోజులు నవ దుర్గలను నిష్ఠగా ఉపాసించే ఆరాధకులకు దేవి అనుగ్రహం లభిస్తుంది. నవరాత్రులలో రాహుకాల వేళ రాహుకాల దీపం వెలిగించాలి. రాహు ప్రతికూల ప్రభావం తగ్గి, దోష నివారణ జరుగుతుంది. దేవి అర్చనలో లలితా సహస్రనామాలు, దుర్గాసప్తశతి పారాయణ చేసే భక్తుల కోరికలు నెరవేరుతాయి. రోగ పీడలతో బాధపడే వారు, జాతకంలో అపమృత్యు దోషం ఉన్నవారు ఈ తొమ్మిది రోజులు నియమం తప్పకుండా దేవి ఆరాధన చేయడం శుభకరం.


విజయదశమి "దసరా" నిర్ణయం:- 25 అక్టోబర్ 2020 ఆదివారం రోజు దసరా పండగ నిర్వహించుకోవాలని పంచాంగా కర్తలు నిర్ధారించారు. శాస్త్ర ప్రకారం ఆశ్వీయుజ మాసంలో దశమి తిధి రోజు శ్రవణ నక్షత్రం కలిసి ఉన్న రోజు విజయ దశమి పండగ నిర్వహించుకోవడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తున్నది. తేది 24 శనివారం రోజు ఉదయం 11:17 నిమిషాల వరకు అష్టమి తిధి ఉన్నది. నక్షత్ర పరంగా చూస్తే సూర్యోదయం తర్వాత ఉదయం 6:33 నిమిషాలకు శ్రవణ నక్షత్రం ప్రారంభం అవుతుంది.


తేది 25 ఆదివారం రోజు సూర్యోదయంతో శ్రవణ నక్షత్రం ఉంది. ఈ శ్రవణ నక్షత్రం ఉదయం 6:51 నిమిషాల వరకు ఉంటుంది. ఇక మనకు ఆదివారం రోజు సూర్యోదయంతో నక్షత్రం ఉన్నది. తిధి ఆదివారం రోజు ఉదయం 11:02 నిమిషాల వరకు నవమి తిధి ఉన్నది, ఆ తర్వాత 11:03 నిమిషాల నుండి దశమి తిధి ప్రారంభం అవుతుంది కావున శాస్త్ర సూచన ప్రకారం తేది 25 ఆదివారం రోజు దసరా పండగ నిర్వహించుకోవాలి.


శ్లో II ఆశ్వినే శుక్ల పక్షేతు దశామ్యామపరాజితా

పూజనీయా ప్రయత్నేన క్షేమర్ధంచ నృపైస్సదా.


శ్లో II నవమీ శేష యుక్తాయా దశమ్యా మపరాజితా

పూజనీయా ప్రయత్నేన క్షేమార్ధంచ నృపైస్సదా.


శ్లో II నవమీ శేష యుక్తాయా దశమ్యా మపరాజితా

దధాతి విజయందేవి పూజితా జయవర్ధనీ .


అను శాస్త్ర ప్రమాణములను అనుసరించి తేది 26 సోమవారం రోజు ముఖ్య గౌణకాలములందు దశమి తిధి వ్యాప్తి లేనందున, ఆదివారం రోజు ముఖ్య గౌణకాలములందు దశమీ తిధి వ్యాప్తి చెంది ఉన్నందున తేది 25 అక్టోబర్ 2020 ఆదివారం రోజుననే విజయదశమి పండగ ఆచరించవలెను.


అక్టోబర్ 25 ఆదివారం రోజు విజయదశమి పూజ ప్రారంభం సమయం ఉదయం 8:40 నుండి 11:57 నిమిషాలు.


శమీ, ఆయుధ పూజలు ఉదయం 10:25 నుండి 12:14 వరకు.


అపరాజితా దేవీ పూజ సమయం మధ్యాహ్నం 1:00 నుండి 3:18 వరకు.


విజయదశమి విజయ ముహూర్తం మధ్యాహ్నం 1:46 నుండి 2:32 .


విజయదశమి పర్వదిన దుర్గాదేవీ ఉద్వాసన సాయంత్రం 5:36 నుండి రాత్రి 8:00 వరకు


లేదా మరుసటిరోజు 26 సోమవారం రోజు ఉదయం 6:06 నుండి 8:24 వరకు.


* ( అక్టోబర్ 25 వ తేదీ ఆదివారం రోజు ఇతర శుభకార్యా ముహూర్తాలు ) :-


1) ఉదయం 10:43 నిమిషాలకు ధనుర్లగ్నంలో వివాహం, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, అద్దె గృహాలలో ప్రవేశాలకు, ఇతర శుభాదులకు అనుకూలం. ధనుర్లగ్న ముహూర్త సమయం ఉదయం 9:53 నుండి 12:02 వరకు, శుభాంశ ఉదయం 10:43 నిమిషాలకు.


2) సకల శుభకార్యాలకు మధ్యాహ్నం 1:46 నుండి 2:32 వరకు.


3) సాయంత్రం మేషలగ్నం 5:07 నుండి 6:53 వరకు డోలహరణం ( బిడ్డను ఉయాలలో వేయుటకు), శుభ చర్చలకు, విద్య, వ్యాపార, వాహన ప్రారంభాలకు, శుభాంశ సాయంత్రం 6:47 నిమిషాలకు.


4) మిధునలగ్నం రాత్రి 8:54 నుండి 11:06 వరకు వివాహము, గృహాప్రవేశానికి, గర్భాదానానికి, వ్యాపారప్రారంభ హోమాదులకు, శుభాంశ రాత్రి 9:01 నిమిషాలకు.


పరమ శివునికి జగన్మాత దుర్గాదేవికి, సిద్ది ప్రదాత గణపతికి శమీ పత్రి సమర్పించే ఆచారం అనాదిగా వస్తోంది. పూర్వం జమ్మిచెట్టు కాడల రాపిడి ద్వారా సృష్టించిన అగ్నితోనే యజ్ఞ యాగాదుల క్రతువులు నిర్వహించేవారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో శమీ వృక్షంలో అగ్ని ఉంటుందనే విశ్వాసం దృడపడింది. అగ్ని వీర్యమే సువర్ణం కనుక జమ్మి బంగారం కురిపించే చెట్టుగా పూజార్హత పొందింది. ఈ రోజే శ్రీ రాముడు రావణునిపై విజయం సాధించాడు. విజయదశమి రోజునే శమీ పూజ కుడా నిర్వహిస్తారు.


శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం జమ్మిచెట్టు చెక్కతోనే నిర్మించారని చెబుతారు. శమి అంటే పాపాల్ని, శత్రువుల్ని నశింపజేసేది. పంచ పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్ళే ముందు తమ ఆయుధాలని శమీ చెట్టుపై పెట్టడం జరిగింది. సామాన్యులే గాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ఆలయాలలో అమ్మవారికి విశేష అలంకరణలు, బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఈ తొమ్మిది రోజులు ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేసి పూజిస్తారు. అమ్మవారు లోక కళ్యాణం కోసం ఒక్కోరోజు ఒక్కో అవతారం ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు

విదురనీతి

 *విదురనీతి*


*నిషేవతే ప్రశస్తాని నిందితాని న సేవతే*

*అనాస్తికః శ్రద్దధానః ఏతత్ పండితలక్షణమ్*


మంచి పనులను చేస్తాడు. నిందింపదగిన పనులను చెయ్యడు. 

నాస్తికుడు కాడు. శ్రద్ధ కలిగి ఉంటాడు. ఇది పండితుని లక్షణం.


*శుభమ్*

Kolhapur Mahalakshmi

 




Sri Kolhapur Mahalakshmi kiranotsava. The Sun rays touching lotus feet and then gradually to crown.🙏

Painting





 

కీర్తనలు/భజనలు

 కీర్తనలు/భజనలు/పాటలు సంబంధ 55 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు

------------------------------------------------


55 పుస్తకాలు ఒకేచోట https://www.freegurukul.org/blog/keerthanalu-pdf


               (OR)


సంకీర్తన లక్షణము-1 www.freegurukul.org/g/Keerthanalu-1


సంకీర్తన మీమాంస www.freegurukul.org/g/Keerthanalu-2


ఆంధ్రుల కీర్తన వాంగ్మయ కళాసేవ www.freegurukul.org/g/Keerthanalu-3


నాచన సోమన అన్నమయ్య www.freegurukul.org/g/Keerthanalu-4


సంకీర్తనల్లో తిరుమల శ్రీనివాసుని ప్రశంస-ఒక పరిశీలన www.freegurukul.org/g/Keerthanalu-5


అమృతసారము www.freegurukul.org/g/Keerthanalu-6


అన్నమయ్య విన్నపాలు www.freegurukul.org/g/Keerthanalu-7


నిత్యపారాయణ పాశురాలు www.freegurukul.org/g/Keerthanalu-8


మంగళాశాసన పాశురములు www.freegurukul.org/g/Keerthanalu-9


చిత్రముల తిరుప్పావై www.freegurukul.org/g/Keerthanalu-10


తిరుప్పావై www.freegurukul.org/g/Keerthanalu-11


విడిచిన విరిదండ -తెలుగు తిరుప్పావు www.freegurukul.org/g/Keerthanalu-12


గోదా గీత మాలిక www.freegurukul.org/g/Keerthanalu-13


అన్నమాచార్య సంకీర్తనామృతము-1,2 www.freegurukul.org/g/Keerthanalu-14


అన్నమయ్య కీర్తనలు www.freegurukul.org/g/Keerthanalu-15


భావయామి వేంకటేశం - 1,2,3,4,5,6 www.freegurukul.org/g/Keerthanalu-16


హరి నీమయమే అంతాను - 1,2,3,4 www.freegurukul.org/g/Keerthanalu-17


హరి సేవకే వేంకటేశ మకుటం - 1,2 www.freegurukul.org/g/Keerthanalu-18


హరి యేమనెనో అలిగెనో - 1,2,3,4 www.freegurukul.org/g/Keerthanalu-19


ముకుందమాల www.freegurukul.org/g/Keerthanalu-20


అమృత రామాయణం www.freegurukul.org/g/Keerthanalu-21


అన్నమాచార్యులు అమృతవర్షిణి www.freegurukul.org/g/Keerthanalu-22


కృష్ణ దాసి -మధుర భక్తి గేయములు www.freegurukul.org/g/Keerthanalu-23


తెలుగు తమిళ లాలిపాటలు www.freegurukul.org/g/Keerthanalu-24


స్త్రీల నవీన మంగళ హారతులు www.freegurukul.org/g/Keerthanalu-25


మంగళ హారతులు www.freegurukul.org/g/Keerthanalu-26


పల్నాటి సీమలో కోలాటం www.freegurukul.org/g/Keerthanalu-27


కోలాటము పాటలు ఇతర భజనలు www.freegurukul.org/g/Keerthanalu-28


పిల్లన గ్రోవి పిలుపులు www.freegurukul.org/g/Keerthanalu-29


హంసధ్వని -లలిత గీతాలు www.freegurukul.org/g/Keerthanalu-30


పెళ్లి పాటలు-1 www.freegurukul.org/g/Keerthanalu-31


శ్రవణానంద మంగళహారతులు www.freegurukul.org/g/Keerthanalu-32


స్త్రీ ల వేడుక పాటలు www.freegurukul.org/g/Keerthanalu-33


సర్వదేవతా భజనలు www.freegurukul.org/g/Keerthanalu-34


108 దివ్య దేశప్పాసుర క్కుటిప్పు www.freegurukul.org/g/Keerthanalu-35


అన్నమయ్య సంకీర్తనా స్రవంతి www.freegurukul.org/g/Keerthanalu-36


అన్నమాచార్య సంకీర్తనములు-1000 www.freegurukul.org/g/Keerthanalu-37


అన్నమాచార్యులవారి అధ్యాత్మ శృంగార సంకీర్తనలు-1,2,3 www.freegurukul.org/g/Keerthanalu-38


అధ్యాత్మ, శృంగార సంకీర్తనలు-10 www.freegurukul.org/g/Keerthanalu-39


అధ్యాత్మ సంకీర్తనలు-1,2,3,4,5,7,9,10 www.freegurukul.org/g/Keerthanalu-40


అభినవ శ్రీ కృష్ణ లీలలు www.freegurukul.org/g/Keerthanalu-41


ఆనంద మంగళం - మధుర భక్తి గీతములు www.freegurukul.org/g/Keerthanalu-42


ఎంకి పాటలు www.freegurukul.org/g/Keerthanalu-43


కాలజ్ఞాన తత్వములు www.freegurukul.org/g/Keerthanalu-44


కృష్ణ తాండవము గోపికా లాస్యము www.freegurukul.org/g/Keerthanalu-45


కృష్ణ లీలలు www.freegurukul.org/g/Keerthanalu-46


కృష్ణ లీలా తరంగిణి www.freegurukul.org/g/Keerthanalu-47


గీత గోవిందము-ఆంధ్రష్టపది www.freegurukul.org/g/Keerthanalu-48


చూతపురీ విలాసము www.freegurukul.org/g/Keerthanalu-49


తాళ్ళపాక అన్నమయ్య పాటలు www.freegurukul.org/g/Keerthanalu-50


తెలుగు మీరా www.freegurukul.org/g/Keerthanalu-51


త్యాగరాజ కీర్తన హారము www.freegurukul.org/g/Keerthanalu-52


త్యాగరాజ దివ్యనామ సంకీర్తనలు www.freegurukul.org/g/Keerthanalu-53


త్యాగరాజ హృదయము www.freegurukul.org/g/Keerthanalu-54


త్యాగరాజ కీర్తనలు-3 www.freegurukul.org/g/Keerthanalu-55


కీర్తనలు/భజనలు గురించి తెలుసుకోవడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి.

నమస్తేస్తు మహామాయే

 Today’s Alamkaram is Sri Mahalakshmai Devi. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే | శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమో‌உస్తు తే || నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి | సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే || సర్వఙ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి | సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే || సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని | మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే || ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి | యోగఙ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమో‌உస్తు తే || స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే | మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే || పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి | పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమో‌உస్తు తే || శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే | జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమో‌உస్తు తే || మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః | సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా || ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ | ద్వికాల్ం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః || త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ | మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ||

లేకపోతే

 మన శరీరంలోకి వెళ్లిన ఆహారం 24 గంటల్లో మలినంగా బయటికి వెళ్లి పోవాలి. 

లేకపోతే జబ్బులు.


మన శరీరంలోకి వెళ్ళిన నీరు 4 గంటల్లో బయటికి వెళ్లి పోవాలి. లేకపోతే జబ్బులు. 


మన శరీరంలోకి వెళ్లిన గాలి ఒక నిముషంలోగా బయటికి వెళ్లిపోవాలి. లేకపోతే మనం రోగ గ్రస్థులం అవుతాం.


మరి మనలోకి చేరిన కోపం, అసూయ, ద్వేషం, మోసం ఇలాంటి వన్నీ సంవత్సరాలుగా మనలోనే ఉంటే... 

ఏమౌతుందో తెలుసా... మనం నిత్య రోగ గ్రస్తులుగా అవుతాం.


కామాశ్చ, క్రోధశ్చ, లోబశ్చ దేహే తిష్ఠంతి తస్కరా:

జ్ఞాన రత్నప హారాయ   తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త.

(కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, అనే ఆరుగురు శత్రువులు ఈ జ్ఞానమనే రత్నమును అపహరించడం కోసం నీ దేహమునే తిష్ట వేసి ఉన్నారు. జాగరూకుడవై ఉండు.)


*అందుకే ఋషులు అంటారు...* 

మనం రోజూ జీవిస్తున్నాం అని అనుకుంటున్న మూర్ఖులం... 

నిజానికి మనం రోజూ కొద్ది కొద్దిగా మరణిస్తున్నాం. 

మనకు వయసు పెరిగితే... ఆయుష్షు తగ్గినట్టా ? పెరిగినట్టా ? మనం ప్రతి రోజూ... నెగెటివ్ ఎనర్జీ లతో కొద్ది కొద్దిగా మరణిస్తున్నామన్న చేదు నిజాన్ని త్వరగా గ్రహించాలి.


మనలో చేరి బయటికి వెళ్లి పోకుండా తిష్ట వేసుకొని...  మన జీవితాల్ని మృత ప్రాయం చేస్తున్న కోపాన్ని, ఒత్తిడిని, ద్వేషాన్ని, బద్ధకాన్ని, అనారోగ్యాన్ని… ప్రతి రోజూ ధ్యానం, యోగ చెయ్యడం ద్వారా ప్రాణ శక్తిని ఎక్కువగా పొంది నెగెటివ్ ఎనర్జీ దూరం చెయ్యాలి.  

మన శరీరంలోకి అధిక మొత్తంలో ప్రాణ శక్తిని చేర్చే ఏకైక మార్గం  ధ్యానం, యోగాయే...

సీతాదేవి ఆలయం

 🔔🔔

సీతాదేవి ఆలయం

🔔🔔


శ్రీ లంకలో నువరేలియా

నుండి కండి వెళ్ళే మార్గంలో

సుమారు 5 కి.మీ దూరంలో

సీతా ఎలియ అనే ప్రాంతంలో

సీతాదేవి ఆలయం వున్నది.

పచ్చని ప్రకృతి అందాలతో

వున్న కొండ ప్రాంతంలో అశోకవృక్షాలు దట్టంగా వున్న వనంలో మధ్యగా ఈ ఆలయం

వున్నది. ఈ అశోక వనంలోనే

రావణుడు సీతదేవిని బంధించి వుంచినట్లు చెప్తారు.

అశోకం అంటే దుఃఖం లేనిచోటు అని అర్ధం. 

ఇక్కడి రాతి బండల మీద వలయాకారంలో వున్న అడుగుల ముద్రలు

రావణాసురుని ఏనుగు యొక్క కాళ్ళ ముద్రలుగా అంటారు.  

ఈ ఆలయంలో శ్రీ రాముడు,సీతాదేవి, లక్ష్మణుడు 

నిలబడిన భంగిమలో 

దర్శనం అనుగ్రహిస్తున్నారు. 

సీతాదేవి మసిలిన ఆ స్ధలంలో

తాము అడుగు పెడితే

పుణ్యం లభిస్తుంది అని

భక్తుల ధృఢవిశ్వాసం.


🔔🔔శేషశ్రీ

🤣Wonderful Definitions

 *🤣Wonderful Definitions🤣*


*🟡School* .....

A place where Parents pay and children play


*Life Insurance* 

A contract that keeps you poor all your life, so that you can die Rich. 


*🟤Nurse*: 

A person who wakes u up to give you sleeping pills. 


*🟣Marriage* 

It's an agreement in which a man loses his bachelor degree and a woman gains her masters.. 


*⚫Tears* 

The hydraulic force by which masculine willpower is defeated by feminine waterpower.


*🟣Conference* 

The confusion of one man multiplied by the number present. 


*🔵Conference Room* 

A place where everybody talks, nobody listens and everybody disagrees later on 


*🟢Father* 

A banker provided by nature 


*🔴Criminal* 

A person no different from the rest 

....except that he/she got caught


*⚫Boss* 

Someone who is early when you are late and late when you are early


*Politician* 

One who shakes your hand before elections and your Confidence after 


*🟠 HOSPITAL* 

An institution  which holds your ills by pills, and kills you by bills. 


*😁Smile* 

A curve that can set a lot of things straight. 


*🟢Office* 

A place where you can relax after your strenuous home life. 



*🟡Yawn* 

The only time  married men ever get to open their mouth. 


*🔵Etc*. 

A sign to make others believe that you know more than you actually do. 


*🟤Committee* 

Individuals who can do nothing individually and sit to decide that nothing can be done together. 


Laughter makes life Easy!😜🤪🤣😁😝😆🤓

Eye exarcise


 

మునగాకు

 ఔషధ విలువల పత్రాలు 25/108

మునగాకు



మునగ ఔషధమ్ము మున్నూరు రోగాల*

మునగ తినిన చాలు ముదిమి రాదు*

మునగ  కాయ, జిగురు పువ్వులు మందులే*

మునగ నెక్కరాదు మూతి పగులు*


***నాగమంజరి గుమ్మా***

మునగ ఆకులు చాలా బలమైన ఆహారం. వేర్లు, ఆకులు, కాయలు, జిగురు, విత్తనాలు వైద్యంలో ఉపయోగిస్తున్నారు. ఆకులు, బెరడు, వాత, కంటి సమస్యలకు మంచి మందు. బాక్టీరియా, శిలీంధ్ర, కీటక సంహారిగా ఎరువుగా కూడా దీన్ని ఉపయోగిస్తారు. పాడి పశువులకు ఆకులు బలవర్ధకం. పాల ఉత్పత్తి 43-60 శాతం వరకు పెరుగుతుంది


 నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్తి మునగ కలిగి ఉంది. కంటిచూపు తగ్గినా, అల్జీమర్స్, ఎముకల, కీళ్ల నొప్పులు , స్త్రీల వ్యాధులు, రక్తహీనత ఇంకా ఎన్నో కొన్ని వందల శారీరక రుగ్మతలు మునగ వల్ల నయమవుతాయి. ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో ఉన్నాయి.


ఇతర ఆకుకూరల్లానే మునగాకుతో పప్పూ కూరలూ పచ్చళ్లూ పొడులూ రైస్‌ వెరైటీలూ కోఫ్తాలూ... అన్ని రకాలూ వండుకోవచ్చు. దోసెల్లో రొట్టెల్లో దట్టించినా రుచే. పొడిని టీ రూపంలో తాగొచ్చు, సూపుల్లో అన్నంలో కూరల్లో... ఎలా కావాలంటే అలా తినొచ్చు. అయితే ముదిరిన ఆకుల్లో పీచెక్కువ. ఇన్ని విశేషాలు ఎందుకు... మునగ తింటే మూడు వందల రకాల జబ్బులు పరార్... 

*మునగ విషయంలో చేయకూడనిది ఒక్కటే... మునగచెట్టు ఎక్కడం. చెట్టు పెళుసు. ఎక్కితే కొమ్మ విరిగి , మూతి పగలవచ్చు. ఇంకేదైనా కూడా అవవచ్చు*

జటియు పక్షి


 

ఇదే జీవితం.

 జీవితం ఊపిరి పోసుకోవడం...ఊపిరి ఆగిపోవడం..ఇవి రెండూ మనిషికి అంతుపట్టని విషయాలు... తెలుసుకోవడం కూడా కష్టమే... కానీ ఈ రెంటికీ మధ్యలో ఉన్నదే జీవితం.. అలాంటి జీవితం కొందరికి ఆనందమయంగా.. మరికొందరికి మధ్యస్థంగా...ఇంకొందరికీ అందరూ ఉన్నా.. అన్నీ ఉన్నా...ఏదో తెలియని వ్యధగా..వెలితిగా ఉంటుంది... మనిషి జీవితంలో చిన్న తనంలో చదువుకోవడం.. తర్వాత స్థిరపడటం...ఆ తర్వాత తన భవిష్యత్ తరాలను గెలిపించడానికి పరితపించడం...ఇలా కొనసాగే మనుగడలో చివరి వరకూ పోరాటమే...ఇందులో గెలిచిన వారు.. ఓడినవారు ఉంటారు... చిత్రం ఏమిటంటే ఊపిరి ఆగేసమయానికి ఆలోచించే సమయం కూడా ఉండదేమో..ఏమి సాధించామో కూడా తెలియని స్థితిలో మరణం...అంటే తుది శ్వాస... ఈ. తుది శ్వాసలో కూడా కొందరి పొగ్తలు...ఉన్నపాటుగా ఊపిరి ఆగిపోతే అదృష్టవంతులు అంటారు... అలా అనారోగ్యంతో ఉండి ఊపిరి ఆగిపోతే పాపం అని తెలియని పాపానికి కారకులను చేస్తారు.. ఒకటి మాత్రం నిజం..ఊపిరి పోసుకోవడం.. ఊపిరి ఆగిపోవడం రెండూ మన చేతుల్లో లేవు..ఒంటరిగా వస్తాము.. ఒంటరిగా పోతాము..ఈ మధ్యలో ప్రయాణం ఒక నాటకీయంగా ఉంటుంది.. ఇదే జీవితం..

నిద్రలో ఒక కల

 😭ఒకరోజు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఎంతో దుఃఖం తో

నిండివున్న ఒక భక్తుడు


🏚️ తన ఇంట్లోతనకు ఎంతో ఇష్టమైన దైవ రూపం తో చిత్రించి ఉన్న క్యాలెండర్ నీ తదేకంగా చూస్తు నిద్రలోకి జారుకున్నాడు


😣అప్పుడు ఆ భక్తుడికి నిద్రలో ఒక కల వచ్చింది ఆ కలలో 


🔱తనకు ఎంతో ఇష్టమైన తను రోజు పూజించే దైవం ఎంతో దిగాలుగా కూర్చొని కనిపిస్తాడు


😣అప్పుడు ఆ భక్తుడు తన కళ్ళ ముందు కూర్చున్న ఆ దైవానికి నమస్కారం చేసి


స్వామి నేనంటే ఎన్నో కష్టాలు బాధలు అనుభవిస్తున్న కాబట్టి

దిగులుగా ఉన్నాను మరి మీరు

దైవం కదా మరి మీరు ఎందుకు

దిగులుగా ఉన్నారు స్వామి అని ప్రశ్నిస్తాడు


🔱దానికి బదులుగా ఆ దైవం ఇలా అంటాడు

నా భక్తుడు కష్టాల్లో ఉంటే నేనెలా సంతోషంగా ఉండగలను అందుకే  దిగులు

గా ఉన్నాను అంటాడు


😣అప్పుడు ఆ భక్తుడు ఎవరు స్వామి ఆ భక్తుడు అని ప్రశ్నిస్తాడు


🔱అప్పుడు ఆ దైవం ఇంకెవరో కాదు నాయన నువ్వే అని అంటాడు


😣అప్పుడు ఆ భక్తుడు ఎంతో సంతోషించి ఆ ఆనందం తో నేన అని అంటాడు


🔱ఆవును నువ్వే  నువ్వు కష్టాల్లో ఉన్నావని నిన్ను చూసి వెల్దాం   అని వచ్చాను అంటాడు


😣అయితే మీరు దైవం కదా

మీ దగ్గర ఎంతో శక్తి ఉంది కదా ఆ శక్తి తో మీరు నాకు వచ్చిన కష్టాలను తిర్చేస్తే అప్పుడు నాకు కష్టాలు ఉండవు మీకు ఈ దిగులు ఉండదు కదా స్వామి అంటాడు


🔱అప్పుడు ఆ దైవం ఇంకెక్కడి  శక్తి నాయన మిమ్మల్ని సృష్టించి నప్పుడే నా శక్తినంతా కర్మ సిద్ధాంతానికి ఇచ్చేశాను ఇప్పుడు నాదగ్గర బూడిద కూడ లేదు

ఇప్పుడు నీ విషయంలో ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను

అంటాడు


😣అప్పుడు భక్తుడు నోట్లో నీళ్ళు మింగుతూ అదేంటి స్వామి అలా అంటున్నారు మీరు ఉన్నారనే కదా నా కష్టాలను తిరుస్తారనే కదా నేను నాకున్న సమయం లో పావొంతు సమయాన్నీ మీకు

 దేవాలయాల కడుతు మీ దేవాలయాల చుట్టు తిరుగుతూ మీ విగ్రహరాలకు

అభిషేకం చేసి పసుపు కుంకుమ తో పూలతో అలంకరణ చేసి మీకు కొబ్బరికాయలు కొట్టి మీకు హారతి పళ్ళం పట్టి గంటలు గంటలు మీ నామ స్మరణ చేసి మీ హుండీలో నా సగం జీతం వేసింది ఇప్పుడు మీరే ఇలా అంటే ఎలా స్వామి అన్ని మరచి పోయారా ఎంటి అని అడుగుతాడు


🔱అప్పుడు ఆ దైవం అందుకే కదా నాయన నేనిక్కడకు వచ్చాను 


అయినా నువ్వు కూడా నీ భక్తితో  ఆనంద పడుతున్నానని చూస్తు ఊరుకున్నా అయిన నువ్వు నాకు సమర్పించింది ఏమున్నది  నువ్వు సమర్పించిన

ఆ వస్తువులన్నీ నేను సృష్టినవే కదా అంటే నవే కదా ఇంకేంటి

అంటాడు


😣దానికి భక్తుడు సరే స్వామి అందరి లాగే అందర్నీ చూసి నేనుకూడ చేశాను ఇప్పుడు మీరే ఎదో ఒకటి చేసి నన్ను గట్టెంకిచాలి అంటాడు


🔱అప్పుడు దైవం చెప్పాను కధయ్య నేనేమీ చేయలేనని


😣అప్పుడు భక్తుడు అయితే నా కష్టాలు తీరే పరిష్కారమే లేదా అంటాడు


🔱దానికి దైవం ఎందుకు లేదు కచ్చితంగా నీ కష్టాలు తీరే పరిష్కారం ఉన్నది అదే ధర్మ మార్గం అంటాడు 

 

😣అప్పుడు భక్తుడు ధర్మ మార్గం అంటే ఏమిటి స్వామి అంటాడు


🔱దానికి దైవం సత్యాన్ని తెలుసుకొని సదా సత్యాన్ని మరచి పోకుండా జీవించడమే ధర్మ మార్గం


😣అప్పుడు భక్తుడు అయితే నేను ఇన్ని రోజులు జీవించిన మార్గం ధర్మ మార్గం కదా స్వామి అంటాడు 


🔱అప్పుడు దైవం ఇలా నీకు సత్యమే తెలియదు ఇంకా ధర్మం ఏమి తెలుస్తుంది ముందు సత్యాన్ని తెలుసుకో ధర్మం అదే అర్థం అవుతుంది అంటాడు


😣అయితే నేను సత్యాన్ని తెలుసు కోవడం ఎలా స్వామి అంటాడు


🔱దానికి దైవం..  నువ్వు ముందు నీ మనస్సుని నిర్మలం చేసుకో దానికి మార్గం ధ్యానం 

ఎప్పుడైతే నీవు ధ్యాన సాధన  చేయడం  ప్రారం భిస్తావో

  

అప్పుడు నీ చెంచలమైన మనస్సు నిర్మల మౌతుంది

ఎప్పుడైతే మనస్సు నిర్మల మౌ తుందో నీలోని బుద్ధి వికసిస్తుంది ఆ వికసించిన బుద్ధితో నీ శరీరం తో పాటు ఉన్న  ఆత్మను గుర్తించ గలుగు తావు అప్పుడు నువ్వు గుర్తించిన ఆత్మయే నువ్వు అని

శరీరంతో కేవలం కలసి ఉన్నావని నీకు అర్థం అవుతుంది


😣అప్పుడు భక్తుడు నేను ఆత్మ అని తెలుసు కుంటే ఏమౌతుంది స్వామి అంటాడు


🔱అప్పుడు దైవం నువ్వు ఆత్మ అని తెలుసుకున్నాక

నీ ఒక్కడివే ఆత్మ కాదని ఇక్కడున్న ప్రతి మనుషులతో పాటు భూమి మీద నివసిస్తున్న

ప్రతి జీవి ఆత్మయే అని తెలుస్తుంది తరువాత తరువాత ఈ అత్మలన్ని కూడ ఆ పరమాత్మ 

నుండి వచ్చిన పరమాత్మ బిందువు లు అని అర్థం అవుతుంది ఆ తరువాత నీలోనే అందరినీ  అందరిలోనూ నిన్ను   చేసుకొని 

నీవే ఆ పరమాత్మ  అహం బ్రహ్మాస్మి వని తెలుసు కుంటావు 

ఈ విషయ ఆధారం తోనే కర్మ సిద్ధాంతం రూపొందించ బడింది  నీవు ఎవరికి ఏమి ఇచ్చినా తిరిగి అది నీ దగ్గరకు వస్తుంది ఎందుకంటే అందరిలో నీవే ఉన్నావు కనుక 

ఈ విషయాన్ని నీవు తెలుసుకున్న తెలుసుకోక పోయిన ఈ కర్మ సిద్దాంతం పనిచేస్తూనే ఉంటుంది

 అని చెప్పి దైవం ధ్యానం లోకి వెళ్లిపోతాడు 


😣అప్పుడు భక్తుడు కొంత సేపటి తరువాత 

ధ్యానం నుంచి లేచిన దైవం తో 

ఏమిటి స్వామి తమరు  కూడ ధ్యానం చేస్తారా అని అడుగుతాడు 


🔱అప్పుడు దైవం ధ్యానం చేయడానికి నేనేంటి నేవెంటి అందరం చేయవలసిందే ధ్యానం లో దొరికే ఆ బ్రహ్మానందం ఇంకెక్కడ దొరకదయ్య అయిన అన్ని మీకే వదిలేసాను కదా ఇంకా నాకు పనేమున్నది నిత్యం ధ్యానం లో ఉంటూ సాక్షిగా ఉండడం తప్ప అని చెప్పి మౌనం గా ఉండిపోతాడు


😌అప్పుడు భక్తుడు కొంత సమయానికి నిద్రనుండి లేచి ధ్యాన సాధన చేయడం ప్రారంభిస్తాడు ధ్యాన సాధన ద్వారా సత్యం తెలుసుకొని

ధర్మ మార్గం లో ఉంటూ హాయిగా జీవిస్తాడు

😁🌈🌹🦚💘💐

విజయదశమి నిర్ణయం*

 *విజయదశమి నిర్ణయం*

----------------------------------


 ఈ సంవత్సరము  నిజ ఆశ్వీజ శుక్ల నవమి ఆదివారం తేదీ 25 /10 /2020 రోజున నవమి ఘడియలు 11-24 విఘడియలు అనగా ఉ.గం.-10-46 నిముషాలు,శ్రవణా నక్షత్ర ఘడియలు 01-05.విఘడియలు అనగా ఉ.గం.06-38.నిముషాలు.నిజ ఆశ్వీయుజ శుధ్ధ దశమి 

సోమవారము తేదీ :- 26/10/2020. రోజున దశిమి ఘడియలు 12-.01 విఘడియలు ఉ.గం.11-02నిముషాలు, ధనిష్ఠా నక్షత్ర ఘడియలు 03-01 విఘడియలు ఉ.గం.07-25.నిముషాలు ఉన్నందున " సాచ శ్రవణర్షయుతాగ్రాహ్య "

అని ఉన్నది దీనికి గాను (కాలనిర్ణయ చంద్రిక,నిర్ణయసింధు,ధర్మసింధు,ధర్మప్రవృత్తి,కాలనిర్ణయ చంద్రిక,వ్రత రత్నాకరాది) ధర్మ గ్రంధాలలో ఈవిధంగా చెప్పబడినది,

శ్లో) నవమీకలయాచైవ విధ్ధత్యాజ్యాభవేత్సదా!

      పరవేధాయుతాయాంతు దశమ్యాముత్సవంచరేత్!!

శ్లో)శ్రవణర్షయుతాంచాపి పూర్వవిధ్ధాంపరిత్యజేత్!

     అపరాజితార్చనే భూయాచ్చ్రవణ2ర్షాధిక్యతాభువిః!

తదైవశుభత్సాయా స్సాయంకాలస్థితాతిధిః!!


శ్లో)యదావృధ్ధౌతిధీవాంతు దశమీద్వయసంభవం!

     తదాతుప్రథమంత్యక్త్వా ద్వితీయేహ్యోత్సవంచరేత్!!


శ్లో)సాయాహ్నవ్యాపినీయాస్యాద్ దశమీవిజయాబిధా!

     నవమీశేషయుక్తాపి సాగ్రాహ్యావైష్ణవోత్తమైః!

    ఈషత్సంధ్యామతిక్రాంన్తః కించిదుద్భిన్నతారకః!

    విజయోనామకాలో2యం సర్వకర్మర్థసిధ్ధిదః!

    తస్మాత్ సాయాహ్నాసంయుక్త దశమీక్షేమదానృణాం!!

పై ప్రమాణములనుసరించి శ్రవణానక్షత్రం ఉదయంకాల స్పర్శకలిగిన దశమి విజయముహూర్తము కనుక సాంకాలం వ్యాప్తంగాఉండి అపరాహ్ణవ్యాప్తి పొంది ఉన్నందున సోమవారం తెది:- 26/10/2020 దశమికి శ్రవణా యోగము లేనందున,పూర్వదినమగు ఆదివారము తేదీ:-25/10/2020 రోజునే విజయదశమి శమీదర్శనం (పూజ) దసరాపండుగ చేయుటం అందరికీ శ్రేయస్కరము అందువలననే ఆదివారము దసరా పండుగగా నిర్ణయం చేయడమైనదని పండితులందరి అభిప్రాయం వ్యక్తంచేయటమైనది,

26/10/2020,సోమవారం రాజులకు పట్టాభిషేకం చేయవలేనని ధర్మశాస్త్రము తెలుపుతున్నది.

                                                    ఇట్లు

                             దేవళ్ళవసంతసాయినాథశర్మ

                      పురోహితులు/జ్యోతిష్య పండితులు

                       జిల్లా అర్చక పురోహిత సంయోజక్

                                విశ్వహిందూ పరిషత్

అమ్మ






 

వేద సంబంధ

 *వేద  సంబంధ 56 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

56 పుస్తకాలు ఒకేచోట  https://www.freegurukul.org/blog/vedamulu-pdf


               (OR)


వేదముల యధార్ద స్వరూపం www.freegurukul.org/g/Vedamulu-1


ఋగ్వేదం www.freegurukul.org/g/Vedamulu-2


శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహిత-2 www.freegurukul.org/g/Vedamulu-3


ఋగ్వేద సంహిత www.freegurukul.org/g/Vedamulu-4


యజుర్వేదం www.freegurukul.org/g/Vedamulu-5


అధర్వవేదం www.freegurukul.org/g/Vedamulu-6


అధర్వవేదం www.freegurukul.org/g/Vedamulu-7


యజుర్వేద భాష్యం-1నుంచి6భాగాలు www.freegurukul.org/g/Vedamulu-8


వేద విజ్ఞానము www.freegurukul.org/g/Vedamulu-9


వేద రహస్యం www.freegurukul.org/g/Vedamulu-10


వేదములు-2 www.freegurukul.org/g/Vedamulu-11


సంస్కృత సాహిత్య చరిత్ర www.freegurukul.org/g/Vedamulu-12


వేదాలలో విజ్ఞాన బీజాలు-1 www.freegurukul.org/g/Vedamulu-13


భారతీయ సంస్కృతి-1,2,3 www.freegurukul.org/g/Vedamulu-14


సంస్కృత వాగ్మయ చరిత్ర-1-వైదిక www.freegurukul.org/g/Vedamulu-15


సంస్కృత వాగ్మయ చరిత్ర-2-లౌకికము www.freegurukul.org/g/Vedamulu-16


ఆర్ష సంస్కృతి www.freegurukul.org/g/Vedamulu-17


భారతీ నిరుక్తి -వేదస్వరూప దర్శనము www.freegurukul.org/g/Vedamulu-18


మహాభారతంలో విద్యావిధానము www.freegurukul.org/g/Vedamulu-19


వేదామృతము www.freegurukul.org/g/Vedamulu-20


ఋగ్వేద రహస్యాలు www.freegurukul.org/g/Vedamulu-21


వేద వేదాంగ చంద్రిక www.freegurukul.org/g/Vedamulu-22


వేద వాంగ్మయము www.freegurukul.org/g/Vedamulu-23


వేదాంత సంగ్రహము www.freegurukul.org/g/Vedamulu-24


వేద భూమి www.freegurukul.org/g/Vedamulu-25


వేదోక్త ధర్మ తత్వము www.freegurukul.org/g/Vedamulu-26


విశ్వకర్మ విశ్వరూపము www.freegurukul.org/g/Vedamulu-27


అమర సాహిత్యం www.freegurukul.org/g/Vedamulu-28


వేదాలలో అప్సరస - గంధర్వులు www.freegurukul.org/g/Vedamulu-29


విశ్వబ్రాహ్మణులకు ప్రధమ సత్కారార్హత www.freegurukul.org/g/Vedamulu-30


వేద స్వరూపము-1 www.freegurukul.org/g/Vedamulu-31


శిల్పకళా దర్శనము-2-యజ్ఞ శిల్పము www.freegurukul.org/g/Vedamulu-32


సాయణాచార్య భాష్యమునకు తెలుగు అనువాదము www.freegurukul.org/g/Vedamulu-33


చతుర్ధశ భువనములు ఏవి,ఎక్కడ www.freegurukul.org/g/Vedamulu-34


వేద వాంగ్మయము www.freegurukul.org/g/Vedamulu-35


ఆర్ష  విజ్ఞాన సర్వస్వం-1 నుంచి 3 భాగాలు www.freegurukul.org/g/Vedamulu-36


చతుర్వేద సంహిత www.freegurukul.org/g/Vedamulu-37


కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహిత-వేదార్ధదీపిక-షష్ఠ కాండ-షష్ఠ సంపుటం www.freegurukul.org/g/Vedamulu-38


అధ యజుర్వేద భాష్యము -1 www.freegurukul.org/g/Vedamulu-39


అధ యజుర్వేద భాష్యము -2 www.freegurukul.org/g/Vedamulu-40


యజుర్వేదానుక్రమణికలు www.freegurukul.org/g/Vedamulu-41


శ్రీదేవీసూక్త పరమార్ధము www.freegurukul.org/g/Vedamulu-42


ఆంధ్ర వేదములు - ఋగ్వేదము-1 www.freegurukul.org/g/Vedamulu-43


ఆంధ్ర వేదములు - కృష్ణ యజుర్వేదము-1 www.freegurukul.org/g/Vedamulu-44


ఆంధ్ర వేదములు - సామవేదము www.freegurukul.org/g/Vedamulu-45


ఆంధ్ర పద్య ఋగ్వేద సంహిత-ప్రధమ సంపుటము-1,2 మండలములు www.freegurukul.org/g/Vedamulu-46


ఆంధ్ర పద్య ఋగ్వేద సంహిత-తృతీయ సంపుటము-7,8 మండలాలు www.freegurukul.org/g/Vedamulu-47


ఆంధ్ర పద్య ఋగ్వేద సంహిత-ఐదవ సంపుటము-10 వ మండలము www.freegurukul.org/g/Vedamulu-48


నృసింహ వాజపేయ భాష్య సహితం www.freegurukul.org/g/Vedamulu-49


యజుర్వేద భాష్యము www.freegurukul.org/g/Vedamulu-50


యజుర్వేద భాష్యము-16-నమక చమకములు www.freegurukul.org/g/Vedamulu-51


యజుర్వేద భాష్యము-పంచమ అధ్యాయము www.freegurukul.org/g/Vedamulu-52


అధర్వ వేద సంహిత -5 www.freegurukul.org/g/Vedamulu-53


యజుర్వేద దర్శనము-1 www.freegurukul.org/g/Vedamulu-54


చతుర్వేద పరమార్ధ రహస్యము www.freegurukul.org/g/Vedamulu-55


వేదాంత సిద్ధాంత కౌముది www.freegurukul.org/g/Vedamulu-56


వేదముల పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి

ఓం శ్రీ మాత్రే నమ

 💐 ఓం శ్రీ మాత్రే నమ

..,🌷

🏵️పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే!

నారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవసర్వదా!!

క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే!

సుస్థిరా భవమే గేహే సురాసుర నమస్కృతే!!

💐లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం

దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురమే.

శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం!

త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం.

🌷శుభ శుక్రవారం శుభోదయం.

🥀మహాలక్ష్మి కరుణ కటాక్ష సిద్ధిరస్తు..

మహాళలకు



 

పితృ పూజ మహత్తు

 ఈ జన్మలో జా త కం లో రవి ఉచ్చ మిత్ర మూల త్రికోణ స్వ క్షేత్ర సమ స్థా నం లో తున్న ఖచ్చితంగా అతను గత జన్మలో తండ్రికి పాద పూజ చేసి తండ్రి మనసు నొప్పి o పని పితృ వాక్య పరిపాలకుడు అయి ఉండాలి అటువంటి వారు రాజకీయ అధికార ఆరోగ్య ఆదర్శ న్యాయ న య న తదితర సంబంధ వాటికి చెందిన వాటిలో గొప్పవారు అవుతారు అందుకే ఈ జన్మలో పితృ సేవ చేసుకు న్న ఈ జన్మలో మ రు జన్మ లోనూ గొప్పవారు అవుతారు తథ్యం BL Narasimha Murthy MA ASTRO AND PUROHIT 9440989496

విష్ణు సహస్రనామ

 విష్ణు సహస్రనామ. యిది వేదములో వర్ణించిన శక్తి యెుక్క పూర్ణమైన పదార్ధ లక్షణము. దీనిని ఎందరో ఎన్నో రకాలుగా ఎన్నో సందర్భాలలో పదేపదే చెప్పవలసివచ్చినదీ అంటే మానవులలో అంత అఙ్ఞానం పేరుకుపోయి అనగా రాతివలె గడ్డకట్టుకుని వుంది. అది యిది అని తత్ సతు అని ఆంగ్లంలో దట్ దిస్ ఎలా తెలియును. ఎవరైనా చెప్పారు. వకవేళచెబితే పూర్తిగా తెలియదు. ఎంతోకొంత మిగిలి యుంటుంది. అది పూర్తిగా తెలియుట అనగా సోహం  ఏకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః అనుమానం లేకుండా అర్జునినికి కూడా అనుమానము. నివృత్తికి సోహం అనేది మాత్రమే శరణ్యం. ఏ గురువు ప్రత్యక్షంగా చూడలేదు. దారి చూపుట మాత్రమే. నడవవలసిన వాడు గురువు కాదు. ఎవడికివాడే. మహర్షులు దర్శించి చూపిన మార్గం. వారు దర్శించిరిగావున వారికి అమరత్వం. వారు ఎక్కడ ఎప్పుడైనా అవసార్ధం ధర్మోధ్దరణకు భగవంతుని తో సమానంగా వారు కారకంగా వారి పని నిర్వర్తిస్తారు. మనం కూడా ఎవరైనా అవసరం వుంటేనే లేకపోతే వారి గురించి కాని లేక వారిని అవసరార్ధమే ఉపయెూగిస్తాము. ఏ అవసరం లేకపోతే ఎవరినీ ఆఖరుకు భగవంతుని కూడా. అదే అఙ్ఞానమనగా. యుద్దానికి వచ్చి యుద్దం మాని పిరికితనం. వీరుడు యుధ్ధం చేసి తనువు చాలించి. జీవన విషయం కూడా అంతే. వకరు కారణము  వేరొకరు కారకులు. మన జీవనం కూడా అంతే సృష్టి కూడా అంతే. భగవంతుని వైపు ధర్మం రూపంలో శక్తి బలంగా యున్నది. అందుకే జయం. కొందరు కృష్ణ తత్వాన్ని నరులు అఙ్ఞానంగా కొందరు ఙ్ఞానులు దైవంగా. వకే వ్యక్తి రెండు రకాలుగా ఎందుకు యీ సంఘర్షణ. యిది అఙ్ఞానమే. వక మూర్ఖుడి మూర్ఖత్వం అంత సైన్యాన్ని నాశనమునకు దారితీయుట.యీ స్తోత్రం సృష్టి పరిణామ క్రమము. అంతిమంగా సోహం ఆంగ్లంలో సో అందువలన. సో లో వున్న ౦ పూర్ణమని అది మగా మారినది అదే సో అహం అయినది. అందువలన అనగా ఎందువలన అన్న విషయం తెలియాలి. అప్పుడే సో అన్నదానికి అర్ధం. నేను అనేది తెలియుటే సో సోహం సో అహం.

ధార్మికగీత - 58*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                             *ధార్మికగీత - 58*

                                       *****

           *శ్లో:- సంసార సాగరం ఘోరం ౹*

                  *తర్తు మిచ్ఛతి యో నరః ౹*

                  *గీతా నావం సమాసాద్య ౹*

                   *పారం యాతి సుఖేన సః ౹౹*

                                     *****

*భా:-  సంసార మనేది ఒక సముద్రం. ప్రతి మనిషికి సంసార బంధం అనివార్యం. సంసార సాగరంలో త్రివిధ తాపాలు, అరి షడ్వర్గము, అష్టవిధ మదాలు, అష్ట కష్టాలు, ఈతి బాధలు అనే మొసళ్ళు, తిమింగలాలు, జల చరాలు,సుడి గుండాలు మనిషిని నానా బాధలు పెడుతూ, ఒడ్డుకు చేరకుండా అవరోధాలు కలిగిస్తుంటాయి. దాన్ని దాటాలని కోరుకునే మానవునికి  "గీత" ఒక్కటే చక్కని మార్గము, గీత ఆత్మవిద్య. విన్నా, చదివినా పాపుల పాపాలను, తాపాలను హరింప జేస్తుంది. గంగాస్నాన ఫలాన్ని ఇస్తుంది. నరకము నుండి కాపాడుతుంది. ముక్తిని ప్రసాదిస్తుంది. గీత ఉన్న చోట తాను ఉంటానన్నాడు కృష్ణుడు. కాన మనం గీతా నావను   ఎక్కి, సంసార సాగరాన్ని అతి సులువుగా  దాటవచ్చు. జనకాది రాజర్షులు "గీత" వలన ఉత్తమ గతులు పొందారు. ప్రతి ఇంటా గీతాపఠనం  నిత్యకృత్య మవ్వాలని  సారాంశము. గాంధీజీ వంటి పెద్దలు "భగవద్గీత" మన సకల దైనందిన సమస్యా పరిష్కార మార్గ దర్శినిగా తమ  ప్రగాఢ విశ్వాసం ప్రకటించారు.*

                                    *****

                      *సమర్పణ :  పీసపాటి*      

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

తల్లి














 

కాళి రాత్రి