23, అక్టోబర్ 2020, శుక్రవారం

ధార్మికగీత - 58*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                             *ధార్మికగీత - 58*

                                       *****

           *శ్లో:- సంసార సాగరం ఘోరం ౹*

                  *తర్తు మిచ్ఛతి యో నరః ౹*

                  *గీతా నావం సమాసాద్య ౹*

                   *పారం యాతి సుఖేన సః ౹౹*

                                     *****

*భా:-  సంసార మనేది ఒక సముద్రం. ప్రతి మనిషికి సంసార బంధం అనివార్యం. సంసార సాగరంలో త్రివిధ తాపాలు, అరి షడ్వర్గము, అష్టవిధ మదాలు, అష్ట కష్టాలు, ఈతి బాధలు అనే మొసళ్ళు, తిమింగలాలు, జల చరాలు,సుడి గుండాలు మనిషిని నానా బాధలు పెడుతూ, ఒడ్డుకు చేరకుండా అవరోధాలు కలిగిస్తుంటాయి. దాన్ని దాటాలని కోరుకునే మానవునికి  "గీత" ఒక్కటే చక్కని మార్గము, గీత ఆత్మవిద్య. విన్నా, చదివినా పాపుల పాపాలను, తాపాలను హరింప జేస్తుంది. గంగాస్నాన ఫలాన్ని ఇస్తుంది. నరకము నుండి కాపాడుతుంది. ముక్తిని ప్రసాదిస్తుంది. గీత ఉన్న చోట తాను ఉంటానన్నాడు కృష్ణుడు. కాన మనం గీతా నావను   ఎక్కి, సంసార సాగరాన్ని అతి సులువుగా  దాటవచ్చు. జనకాది రాజర్షులు "గీత" వలన ఉత్తమ గతులు పొందారు. ప్రతి ఇంటా గీతాపఠనం  నిత్యకృత్య మవ్వాలని  సారాంశము. గాంధీజీ వంటి పెద్దలు "భగవద్గీత" మన సకల దైనందిన సమస్యా పరిష్కార మార్గ దర్శినిగా తమ  ప్రగాఢ విశ్వాసం ప్రకటించారు.*

                                    *****

                      *సమర్పణ :  పీసపాటి*      

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: