*ధార్మికగీత - 53*
*శ్లో:- అసంభవం హేమ మృగస్య జన్మ ౹*
*తథాపి రామో లులుభే మృగాయ ౹*
*ప్రాయ స్సమాపన్న విపత్తి కాలే ౹*
*థియో౽పి పుంసాం మలినా భవంతి ౹౹*
హేమమృగమ్ము యీ భువిని
యెక్కడ లేదని దెల్సియుండియున్
రాముడు మైథిలీ మదిని
రంజీల సేయగ నెగె దానికై
యీ మహిలోన యాపదలు
యేర్పడు కాలము దాపురించినన్
నీమము దప్పు మానవుడు,
నిక్కము , బుద్ధియు మారు నప్పుడున్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి