జీవితం ఊపిరి పోసుకోవడం...ఊపిరి ఆగిపోవడం..ఇవి రెండూ మనిషికి అంతుపట్టని విషయాలు... తెలుసుకోవడం కూడా కష్టమే... కానీ ఈ రెంటికీ మధ్యలో ఉన్నదే జీవితం.. అలాంటి జీవితం కొందరికి ఆనందమయంగా.. మరికొందరికి మధ్యస్థంగా...ఇంకొందరికీ అందరూ ఉన్నా.. అన్నీ ఉన్నా...ఏదో తెలియని వ్యధగా..వెలితిగా ఉంటుంది... మనిషి జీవితంలో చిన్న తనంలో చదువుకోవడం.. తర్వాత స్థిరపడటం...ఆ తర్వాత తన భవిష్యత్ తరాలను గెలిపించడానికి పరితపించడం...ఇలా కొనసాగే మనుగడలో చివరి వరకూ పోరాటమే...ఇందులో గెలిచిన వారు.. ఓడినవారు ఉంటారు... చిత్రం ఏమిటంటే ఊపిరి ఆగేసమయానికి ఆలోచించే సమయం కూడా ఉండదేమో..ఏమి సాధించామో కూడా తెలియని స్థితిలో మరణం...అంటే తుది శ్వాస... ఈ. తుది శ్వాసలో కూడా కొందరి పొగ్తలు...ఉన్నపాటుగా ఊపిరి ఆగిపోతే అదృష్టవంతులు అంటారు... అలా అనారోగ్యంతో ఉండి ఊపిరి ఆగిపోతే పాపం అని తెలియని పాపానికి కారకులను చేస్తారు.. ఒకటి మాత్రం నిజం..ఊపిరి పోసుకోవడం.. ఊపిరి ఆగిపోవడం రెండూ మన చేతుల్లో లేవు..ఒంటరిగా వస్తాము.. ఒంటరిగా పోతాము..ఈ మధ్యలో ప్రయాణం ఒక నాటకీయంగా ఉంటుంది.. ఇదే జీవితం..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి