లక్ష్మీదేవి
౼౼౼౼౼
తండ్రి పోలికనందు తనయనా, క్షీరాబ్ధి౼
సిత దీధితులతోడ చెలగుతల్లి,
సహజన్ముల కొక లక్షణమునా, చందురు౼
వెన్నెలల్, స్మేరమై వెలుగుతల్లి,
పతికిష్టసతి, సౌఖ్యవతియౌనునా, విష్ణు౼
హృదయ వాసమ్మునం దెసగుతల్లి,
నడలె యశోదీప్తినిడునునా, జగములే
సతతమ్ము కొలువగాజాలు తల్లి,
కాలుసేతులు కన్నులు కడకు నుండె
డాసనము లబ్జములెగాగ యలరుతల్లి
సిరులు కురిపించు లక్ష్మిగా వరలుతల్లి
కనకదుర్గా!ప్రణామ సౌమనసు, లివియె.
రాయప్రోలు సీతారామశర్మ, భీమవరం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి