23, అక్టోబర్ 2020, శుక్రవారం

విజయదశమి నిర్ణయం*

 *విజయదశమి నిర్ణయం*

----------------------------------


 ఈ సంవత్సరము  నిజ ఆశ్వీజ శుక్ల నవమి ఆదివారం తేదీ 25 /10 /2020 రోజున నవమి ఘడియలు 11-24 విఘడియలు అనగా ఉ.గం.-10-46 నిముషాలు,శ్రవణా నక్షత్ర ఘడియలు 01-05.విఘడియలు అనగా ఉ.గం.06-38.నిముషాలు.నిజ ఆశ్వీయుజ శుధ్ధ దశమి 

సోమవారము తేదీ :- 26/10/2020. రోజున దశిమి ఘడియలు 12-.01 విఘడియలు ఉ.గం.11-02నిముషాలు, ధనిష్ఠా నక్షత్ర ఘడియలు 03-01 విఘడియలు ఉ.గం.07-25.నిముషాలు ఉన్నందున " సాచ శ్రవణర్షయుతాగ్రాహ్య "

అని ఉన్నది దీనికి గాను (కాలనిర్ణయ చంద్రిక,నిర్ణయసింధు,ధర్మసింధు,ధర్మప్రవృత్తి,కాలనిర్ణయ చంద్రిక,వ్రత రత్నాకరాది) ధర్మ గ్రంధాలలో ఈవిధంగా చెప్పబడినది,

శ్లో) నవమీకలయాచైవ విధ్ధత్యాజ్యాభవేత్సదా!

      పరవేధాయుతాయాంతు దశమ్యాముత్సవంచరేత్!!

శ్లో)శ్రవణర్షయుతాంచాపి పూర్వవిధ్ధాంపరిత్యజేత్!

     అపరాజితార్చనే భూయాచ్చ్రవణ2ర్షాధిక్యతాభువిః!

తదైవశుభత్సాయా స్సాయంకాలస్థితాతిధిః!!


శ్లో)యదావృధ్ధౌతిధీవాంతు దశమీద్వయసంభవం!

     తదాతుప్రథమంత్యక్త్వా ద్వితీయేహ్యోత్సవంచరేత్!!


శ్లో)సాయాహ్నవ్యాపినీయాస్యాద్ దశమీవిజయాబిధా!

     నవమీశేషయుక్తాపి సాగ్రాహ్యావైష్ణవోత్తమైః!

    ఈషత్సంధ్యామతిక్రాంన్తః కించిదుద్భిన్నతారకః!

    విజయోనామకాలో2యం సర్వకర్మర్థసిధ్ధిదః!

    తస్మాత్ సాయాహ్నాసంయుక్త దశమీక్షేమదానృణాం!!

పై ప్రమాణములనుసరించి శ్రవణానక్షత్రం ఉదయంకాల స్పర్శకలిగిన దశమి విజయముహూర్తము కనుక సాంకాలం వ్యాప్తంగాఉండి అపరాహ్ణవ్యాప్తి పొంది ఉన్నందున సోమవారం తెది:- 26/10/2020 దశమికి శ్రవణా యోగము లేనందున,పూర్వదినమగు ఆదివారము తేదీ:-25/10/2020 రోజునే విజయదశమి శమీదర్శనం (పూజ) దసరాపండుగ చేయుటం అందరికీ శ్రేయస్కరము అందువలననే ఆదివారము దసరా పండుగగా నిర్ణయం చేయడమైనదని పండితులందరి అభిప్రాయం వ్యక్తంచేయటమైనది,

26/10/2020,సోమవారం రాజులకు పట్టాభిషేకం చేయవలేనని ధర్మశాస్త్రము తెలుపుతున్నది.

                                                    ఇట్లు

                             దేవళ్ళవసంతసాయినాథశర్మ

                      పురోహితులు/జ్యోతిష్య పండితులు

                       జిల్లా అర్చక పురోహిత సంయోజక్

                                విశ్వహిందూ పరిషత్

కామెంట్‌లు లేవు: