23, అక్టోబర్ 2020, శుక్రవారం

సీతాదేవి ఆలయం

 🔔🔔

సీతాదేవి ఆలయం

🔔🔔


శ్రీ లంకలో నువరేలియా

నుండి కండి వెళ్ళే మార్గంలో

సుమారు 5 కి.మీ దూరంలో

సీతా ఎలియ అనే ప్రాంతంలో

సీతాదేవి ఆలయం వున్నది.

పచ్చని ప్రకృతి అందాలతో

వున్న కొండ ప్రాంతంలో అశోకవృక్షాలు దట్టంగా వున్న వనంలో మధ్యగా ఈ ఆలయం

వున్నది. ఈ అశోక వనంలోనే

రావణుడు సీతదేవిని బంధించి వుంచినట్లు చెప్తారు.

అశోకం అంటే దుఃఖం లేనిచోటు అని అర్ధం. 

ఇక్కడి రాతి బండల మీద వలయాకారంలో వున్న అడుగుల ముద్రలు

రావణాసురుని ఏనుగు యొక్క కాళ్ళ ముద్రలుగా అంటారు.  

ఈ ఆలయంలో శ్రీ రాముడు,సీతాదేవి, లక్ష్మణుడు 

నిలబడిన భంగిమలో 

దర్శనం అనుగ్రహిస్తున్నారు. 

సీతాదేవి మసిలిన ఆ స్ధలంలో

తాము అడుగు పెడితే

పుణ్యం లభిస్తుంది అని

భక్తుల ధృఢవిశ్వాసం.


🔔🔔శేషశ్రీ

కామెంట్‌లు లేవు: