11, మే 2022, బుధవారం

*రైల్వే సమాచారం

 *రైల్వే సమాచారం*

 🚂🚂🚂🚂🚂🚂🚂

 =====================

 *జూలై 1 నుండి* రైల్వే యొక్క ఈ 10 నియమాలు మార్చబడ్డాయి ....

 =====================

 *1*) వెయిటింగ్ లిస్ట్ యొక్క ఇబ్బంది ముగుస్తుంది.  *రైల్వే నడుపుతున్న సువిధ రైళ్లలో ప్రయాణీకులకు ధృవీకరించబడిన టికెట్ల సౌకర్యం ఇవ్వబడుతుంది.*

 ...................................

 *2*) జూలై 1 నుండి *తత్కాల్ టిక్కెట్ల రద్దుపై 50 శాతం మొత్తం తిరిగి ఇవ్వబడుతుంది.*

 ...................................

 *3*) జూలై 1 నుండి తత్కాల్ టిక్కెట్ల నిబంధనలలో మార్పు ఉంది. *ఎసి కోచ్ కోసం ఉదయం 10 నుండి 11 వరకు టికెట్ బుకింగ్ చేయగా, స్లీపర్ కోచ్ ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 వరకు బుక్ చేయబడుతుంది.*

 ...................................

 *4*) జూలై 1 నుండి రాజధాని మరియు శతాబ్ది రైళ్లలో పేపర్‌లెస్ టికెటింగ్ సౌకర్యం ప్రారంభించబడుతోంది. ఈ సౌకర్యం తరువాత, శతాబ్ది మరియు రాజధాని రైళ్లలో పేపర్ టిక్కెట్లు అందుబాటులో ఉండవు, *బదులుగా టికెట్ మీ మొబైల్‌లో పంపబడుతుంది.*

 ........................

 *5*) త్వరలో రైల్వే టికెటింగ్ సౌకర్యం వివిధ భాషలలో ప్రారంభం కానుంది.  ఇప్పటివరకు, రైల్వేలలో హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి, *కానీ కొత్త వెబ్‌సైట్ తరువాత, ఇప్పుడు టికెట్లను వివిధ భాషలలో బుక్ చేసుకోవచ్చు.*

 ......................

 *6*) రైల్వేలో టిక్కెట్ల కోసం ఎప్పుడూ పోరాటం ఉంటుంది.  ఇలాంటి పరిస్థితుల్లో *జూలై 1 నుంచి శాతాబ్ది, రాజధాని రైళ్లలో బోగీల సంఖ్య పెరుగుతుంది.*

 ......................

 *7*) ప్రత్యామ్నాయ రైలు సర్దుబాటు వ్యవస్థ, సువిధ రైలు మరియు *ముఖ్యమైన రైళ్ల రద్దీ సమయంలో మెరుగైన రైలు సౌకర్యాన్ని అందించడానికి ప్రణాళిక చేయబడ్డాయి.*

 ......................

 *8*) జూలై 1 నుంచి *రాజధాని, శాతాబ్ది, దురోంటో, మెయిల్-ఎక్స్‌ప్రెస్ రైళ్ల మార్గాల్లో సువిధ రైళ్లను రైల్వే మంత్రిత్వ శాఖ నడుపుతుంది.*

 ........................

 *9*) జూలై 1 నుండి రైల్వే ప్రీమియం రైళ్లను పూర్తిగా ఆపబోతోంది.

 ......................

 *10*) సువిధ రైళ్లలో *టిక్కెట్ల వాపసుపై 50% ఛార్జీలు తిరిగి ఇవ్వబడతాయి.*  ఇది కాకుండా, ఎసి -2 లో రూ .100, ఎసి -3 పై రూ .90 /, స్లీపర్‌లో ప్రయాణీకుడికి రూ .60 / - తగ్గించబడుతుంది.

 ప్రజా ప్రయోజనాల కోసం జారీ చేస్తారు

 ........................................

 *రైలులో నిర్లక్ష్యంగా నిద్రించండి*, మీ గమ్యం స్టేషన్ వద్దకు వచ్చే కొద్ది సమయంలోనే రైలు యాప్  మేల్కొపుతుంది ....

 =====================

 మీరు 139 కు కాల్ చేసి మీ పిఎన్‌ఆర్‌లో *వేకప్ కాల్-డెస్టినేషన్ అలర్ట్ సదుపాయాన్ని సక్రియం చేయాలి.*

 ...................................

 గమ్యస్థాన స్టేషన్‌కు చేరుకునే ముందు రాత్రి రైలులో ప్రయాణించే *ప్రయాణికుల కోసం రైల్వే వేకప్ కాల్-డెస్టినేషన్ హెచ్చరిక సౌకర్యాన్ని ప్రారంభించింది.*

 .........................

 *గమ్యం హెచ్చరిక అంటే ఏమిటి*

 =====================

 > ఈ సదుపాయాన్ని *గమ్యం హెచ్చరిక* అని పేరు పెట్టారు.

 =====================

 సౌకర్యాన్ని సక్రియం చేసినప్పుడు, *గమ్యం స్టేషన్ రాకముందే మొబైల్‌లో అలారం వినిపిస్తుంది.*

 ........................

 > ఈ సదుపాయం పొందటానికి,

 ...................

 *హెచ్చరిక* అని టైప్ చేసిన తరువాత

 ...................

  *పిఎన్‌ఆర్ నంబర్* టైప్ చేసి

  139 కు పంపండి.

 ...................

 > 139  కాల్ చేయాలి *.

 *కాల్ చేసిన తరువాత, భాషను ఎంచుకుని, ఆపై 7 డయల్ చేయండి.*

 ...................

 *7 డయల్ చేసిన తరువాత, పిఎన్ఆర్ నంబర్ డయల్ చేయాలి *ఆ తరువాత ఈ సేవ మొదలు అవుతుంది.

 ...................................

 > ఈ సదుపాయానికి *వేక్-అప్ కాల్* అని పేరు పెట్టారు.

 ......................

 అది మీరు మొబైల్ లిఫ్ట్ చేసే వరకు *మొబైల్ బెల్ మోగుతుంది.*

 ......................

 ఈ సదుపాయం మీరు ఉపయోగించితే, స్టేషన్ రాకముందే మొబైల్ గంట మోగుతుంది.  మీరు ఫోన్‌ను స్వీకరించే వరకు ఈ గంట మోగుతూనే ఉంటుంది.  ఫోన్ అందిన తరువాత, స్టేషన్ రాబోతున్నట్లు ప్రయాణికుడికి సమాచారం ఇవ్వబడుతుంది.

 ........................................

 🙏🏻 *దయచేసి ఈ సందేశాన్ని అందరికీ పంపండి.*

రతి దుఃఖము - దేవతల ఊరడింపు

 వైశాఖ పురాణం - 11

11వ అధ్యాయము - రతి దుఃఖము - దేవతల ఊరడింపు


నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమహాత్మ్యమును వివరించునిట్లనెను. మిధిలాపతియగు శ్రుతకీర్తి శ్రుతదేవుని ముక్కంటి కంటిమంటకు యెర అయిన ఆ మన్మధుని జన్మయెట్టిది? అతడు చేసిన కర్మ వలన అతడెట్టి దుఃఖముననుభవించెనో వివరింపుమని కోరెను. శ్రుతదేవుడిట్లనెను.


కుమారస్వామి జన్మకథ పవిత్రమైనది. విన్నంతనే చేసిన పాపములన్నియు నశించును. కీర్తిని, పుత్రులను కలిగించును. ధర్మబుద్దిని కలిగించును. సర్వరోగములను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను సావధానముగ వినుము.


శివుని కంటిమంటకు మన్మధుడు దహింపబడుటను చూచి మన్మధుని భార్యయగు రతి బూడిగప్రోగు అయిన భర్తను జూచి దుఃఖపీడితయై మూర్చిల్లెను. ముహూర్త కాలమునకు తెప్పరిల్లి బహువిధములుగ దుఃఖించెను. ఆమె దుఃఖము చూచు వారికిని దుఃఖమును కలిగించుచుండెను.


ఆమె తన భర్తతో సహగమనము చేయవలెనని తలచెను. అందులకై తగిన యేర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుని తలచెను. వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారము చితిని యేర్పరచుటకై వసంతుడచటకు వచ్చెను. మిత్రుని దుర్మరణమునకు, మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు రతిదేవిని ఊరడించుచునిట్లనెను. అమ్మా నేను నీ పుత్రునివంటివాడను. పుత్రుడనగు నేనుండగ నీవు సహగమనమొనర్ప వలదు. అని వసంతుడు బహువిధములుగ జెప్పినను రతి సహగమనము చేయుటకే నిశ్చయించుకొనెను. వసంతుడు ఆమె నిశ్చయమును మరలింప లేకపోయెను. ఆమె కోరినట్లు చితిని నదీతీరమున యేర్పరచెను ఆమె గంగాస్నానము చేసి సహగమనమున చేయవలసిన పనులను పూర్తిచేసి భర్తను తలచుకొనుచు చితినెక్కబోయెను. అప్పుడు ఆకాశవాణి కల్యాణీ పతిభక్తిమతీ! అగ్ని ప్రవేశము చేయకుము. శివుని వలనను, శ్రీకృష్ణావతారము నెత్తిన శ్రీమహావిష్ణువు వలనను నీ భర్తకు రెండు జన్మలు కలవు. రెండవ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీ దేవికి ప్రద్యుమ్నుడుగా జన్మించును. నీవు బ్రహ్మశాపమున శంబరాదురుని యింటనుందువు. అప్పుడు నీ భర్తయగు ప్రద్యుమ్నుడునీతో గలసి శంబరాసురుని యింటనుండగలడు. ఆ విధముగ నీకు భర్తృసమాగమము కలదు. అందువలన అగ్ని ప్రవేశమును మానుమని పలికెను. ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్నిప్రవేశమును మానెను. తరువాత బ్ర్హస్పతి యింద్రుడు మున్నగు దేవతలు ఆటకు వచ్చిరి. తమ ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యయగు రతిదేవిని బహువిధములుగ నూరడించిరి. ఆమెకు అనేక వరములనిచ్చిరి. శివుని కంటి మంటలో దహింపబడి శరీరము లేనివాడై అనంగుడను పేరును మన్మధుడు పొందును. నీకు మాత్రము యధాపూర్వముగ కనిపించునని ఆమెకు వారు వరములనిచ్చి యూరడించి పెక్కు ధర్మములను నుపదేశించి యిట్లనిరి.


కల్యాణీ! పూర్వజన్మలోనితడు సుందరుడను మహారాజు. అప్పుడును నీవే యితని భార్యవు. అప్పుడు రజోదోషమునందినను ఆ ధర్మములను పాటింపక పోవుటచే నీకిప్పుడీ స్థితి వచ్చినది. కావున వైశాఖమాసమున గంగాస్నానము చేయుచు వైశాఖ వ్రతము నాచరింపుము. పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తమగును. ప్రాతఃకాలమున గంగాస్నానము చేసి శ్రీమహావిష్ణువునర్చింపుము. పూజానంతరము విష్ణు కథా శ్రవణము చేయుము. నీవిట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి అశూన్యశయన వ్రతము నాచరించు విధమును చెప్పి దేవతలు వెళ్లిరి.


రతిదేవియు అతి కష్టముపై దుఃఖమును మ్రింగి సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖమాసమున వైశాఖవ్రతము నాచరించుచు అశూన్యశయనమను వ్రతమును చేసెను. ఆ వ్రత ప్రభావమున ఆమెకు భర్తయగు మన్మధుడు కంటికి కనిపించెను. ఆమెతో యధాపూర్వముగ సుఖించుచుండెను. మన్మధుడు పూర్వజన్మలో సుందరుడను మహారాజుగనుండెను. అప్పుడతడు వైశాఖవ్రతము చేయలేదు. వైశాఖదానములను చేయలేదు. అందుచే నితడు శ్రీమహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొనెను. విష్ణుపుత్రునికే వైశాఖవ్రతము నాచరింపకపోవు వలన నిట్టి పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికేమి చెప్పవలయును? కావున యిహలోక సుఖముల నాశించువారు అందరును తప్పక వైశాఖవ్రతము నాచరింపవలయును సుమా!


ఓం నమః శివాయ

శివాష్టకం

 *శ్రీ ఆదిశంకరాచార్య కృతం శివాష్టకం*



*1) తస్మై నమః పరమకారణకారణాయ!దీప్తోజ్జ్వలజ్వలితపిఙ్గలలోచనాయ!!*


*నాగేన్ద్రహారకృతకుణ్డలభూషణాయ!బ్రహ్మేన్ద్రవిష్ణువరదాయ నమః శివాయ!!*



*2) శ్రీమత్ప్రసన్నశశిపన్నగభూషణాయ! శైలేన్ద్రజా వదన చుమ్బితలోచనాయ!!*


*కైలాసమన్దిరమహేన్ద్రనికేతనాయ!లోకత్రయార్తిహరణాయ నమః శివాయ!!*



*3) పద్మావదాత మణికుణ్డల గోవృషాయ! కృష్ణాగరుప్రచుర చన్దనచర్చితాయ!!*


*భస్మానుషక్తవికచోత్పలమల్లికాయ!*

*నీలాబ్జకణ్ఠసదృశాయ నమః శివాయ!!*



*4) లమ్బత్సపిఙ్గల జటాముకుటోత్కటాయ!దంష్ట్రాకరాలవికటోత్కటభైరవాయ!!*


*వ్యాఘ్రాజినామ్బరధరాయ మనోహరాయ!త్రైలోక్యనాథ నమితాయ నమః శివాయ!!*



*5) దక్షప్రజాపతి మహామఖ నాశనాయ*

*క్షిప్రం మహాత్రిపుర దానవఘాతనాయ!!*


*బ్రహ్మోర్జితోర్ధ్వగకరోటినికృన్తనాయ! యోగాయ యోగనమితాయ నమః శివాయ!!*



*6) సంసారసృష్టి ఘటనా పరివర్తనాయ! రక్షః పిశాచగణసిద్ధసమాకులాయ!!*


*సిద్ధోరగగ్రహ గణేన్ద్రనిషేవితాయ!శార్దూల చర్మ వసనాయ నమః శివాయ!!*



*7) భస్మాఙ్గరాగ కృతరూప మనోహరాయ! సౌమ్యావదాతవనమాశ్రితమాశ్రితాయ!!*


*గౌరీకటాక్ష నయనార్ధ నిరీక్షణాయ!*

*గోక్షీరధారధవలాయ నమః శివాయ!!*



*8) ఆదిత్య సోమవరుణా నిలసేవితాయ!యజ్ఞాగ్నిహోత్రవరధూమనికేతనాయ!!*


*ఋక్సామవేద మునిభిః స్తుతి సంయుతాయ!గోపాయ గోపనమితాయ నమః శివాయ!!*



*శివాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ! శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥*



*ఇతి శ్రీ ఆది శంకరాచార్య కృతం శివాష్టకం సమ్పూర్ణమ్!!*

తిరుమల దర్శనం RTC ప్రకటన :

 తిరుమల దర్శనం RTC ప్రకటన :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులలో తిరుమల వెళ్ళి దైవ దర్శనం చేసుకునే ప్రయాణికుల సౌకర్యార్థం, ప్రతి రోజు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో 1000 దైవ దర్శనం టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.

ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో తిరుమలకు విచ్చేయు ప్రయాణికులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ అమూల్యమైన అవకాశం కల్పించినారు.

ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ఛార్జీతోపాటు 300 రూపాయలు అదనంగా చెల్లించి బస్సులోనే శీఘ్ర దర్శనం టికెట్ పొందవచ్చును.

ప్రతి రోజు ఉదయం 11. 00 గంటలకు మరియు సాయంత్రం 4.00 గంటలకు ఈ శీఘ్ర దర్శనం ఏర్పాటు కలదు.

తిరుమల బస్సు స్టేషన్ చేరుకున్న తర్వాత శీఘ్ర దర్శనం చేసుకొనుటకు ప్రయాణికులకు RTC సూపర్ వైజర్లు సహాయం చేసెదరు.

కావున తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ముందుగా RTC బస్సులలో శీఘ్ర దర్శనం టికెట్ పొందే అవకాశాన్ని వినియోగించుకోవలసినదిగా కోరడమైనది. APSRTC ప్రతి రోజు తిరుపతికి 650 బస్సులు నడుపుతున్నది. ప్రతి డిపో నుండి తిరుపతికి బస్సు సౌకర్యం కలదు. బెంగుళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుండి దైవ దర్శనం కొరకు వచ్చు ప్రయాణికులకు ఇది చాలా మంచి సౌకర్యం.

నాకెక్కడ దాపురించావురా

 నాకెక్కడ దాపురించావురా, కాలుమడిచేందుకు కూడా వెళ్ళనివ్వవు.

........................................................


ఈ క్రింది పదాలకు అర్థాలు ప్రయత్నించగలరు.


(౧) పర్ణశాల =  


(౨) నిటలాక్షుడు =  


(౩) దిమ్మరి =  


(౪) కూరిమి =  


(౫) ఆగరా బాబూ కాల్మడిచి వస్తా -  కాల్మడిచి అంటే   


(౬) అంతలంపటెందుకు లో  లంపటము =  


(౭) రక్తసిక్తమైన రహదారులు లో  సిక్తము =  


(౮) పాండవబీడు =  


(౯) కరదీపిక -  


(౧O) ఉత్థానపతనాలు =


(౧౧) ఆటపట్టు =  


(౧౨) అనుశ్రుతి =  


 (౧౩) అజగరము =  


 (౧౪) క్షణభంగురము =


( ౧౫ ) బేవారసు= 


 (౧౬) బావురుపిల్లి= 


 (౧౭) కౌపీనము =  


( ౧౮) పుట్టచెండు =


 (౧౯) దాపరించు =  


(౨O) నీ కిటుకు తెలిసిందిలే. కిటుకు =  


........................................... జిబి విశ్వనాథ, 9441245857, అనంతపురము.

ధర్మో రక్షతి రక్షితః

 శ్లోకం:☝️ధర్మో రక్షతి రక్షితః

*ధర్మ ఏవ హతో హంతి*

   *ధర్మో రక్షతి రక్షితః l*

*తస్మాద్ధర్మో న హంతవ్యో*

   *మానో ధర్మాహతో వధీత ll*


భావం: చంపబడిన ధర్మం ఆ ధర్మాన్ని చంపినవాణ్ణి చంపుతుంది.

రక్షింపబడిన ధర్మం అ ధర్మాన్ని రక్షించినవారిని రక్షిస్తుంది.

కనుక, ధర్మం చేత మనం ఎప్పుడూ చంపబడకుండా ఉండేందుకు మనం ఆ ధర్మాన్ని సదా రక్షించాలి!🙏

నన్ను కన్నరోజు

 🕉️ *నన్ను కన్నరోజు (ఓ కథ)*

 

 *సౌదామిని వంట పూర్తి చేసి రెండోసారి కాఫీ చేసి పేపర్ చదువుతున్న భర్త అశోక్ కు ఇచ్చి తానూ తాగుతూ అక్కడే కూర్చోబోయింది.*


 *ఇంతలో లాండ్ లైన్ మ్రోగింది. ఒక చేత్తో కాఫీ కప్పు పట్టుకుని రెండో చేత్తో ఫోన్ రిసీవర్ ఎత్తింది.* 


 “ *హలో అమ్మా!  ఏం చేస్తున్నావ్? నేను చెప్పింది గుర్తుందిగా. తొందరగా పని తెముల్చుకుని ఐదుగంటల వరకు రెడీగా ఉండండి.*  *నేనిచ్చిన కొత్తచీర మాత్రమే కట్టుకోవాలి . బ్లౌజ్ కూడా కుట్టించాకదా. నాన్నగారికి కూడా చెప్పు. నేను కార్ పంపిస్తా..లేట్ చేయొద్దు మరి.“ అని హడావిడిగా చెప్పింది కూతురు భావన..* 


 *“అమ్మలూ... నీ* *పుట్టినరోజు నాడు కూడా ఈ హడావిడి ఎందుకురా? నీ ఆఫీసు ప్రోగ్రాం కాగానే పిల్లలు, అల్లుడు గారితో కలిసి ఇంటికొచ్చేయి. నీకిష్టమైనవి చేసి ఉంచుతా. అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కలిసి తిందాం.. ఎన్ని రోజులైంది మనమంతా కలిసి. నువ్వేమో ఎప్పుడూ బిజీ బిజీ అంటావు”  అనునయంగా చెప్పింది సౌదామిని.* 


 *“అమ్మా! పది రోజుల* *మందునుండి చెప్తున్నా. ఇవాళ మా ఆఫీసు* *వార్షికోత్సవంతోబాటు నాకు అవార్డు ఇస్తున్నారు.  నా పుట్టినరోజు కూడా  అని నిన్నూ, నాన్నగారిని రమ్మని. మళ్లీ ఇప్పుడిలా అంటావేంటి. నా మాటంటే అసలు లెక్కలేదా నీకు. అవునులే.. నిన్ను రమ్మన్నాను చూడు నాదే తెలివితక్కువతనం. ఇంతకీ వస్తున్నావా లేదా. ఆఖరిసారి అడుగుతున్నా!” కోపంగా అరిచింది భావన.* 


 *“వస్తున్నా తల్లీ! అంత నిష్టూరాలెందుకు? నువ్వు ఇచ్చిన చీరనే కట్టుకునే వస్తాను. సరేనా!!  ఐదుగంటలకు కార్ పంపించు“ నవ్వుకుంటూ చెప్పింది.*


*పేపర్ చదువుతూనే ఇటువైపో చెవి వేసిన అశోక్ కూడా గుంభనంగా నవ్వుకున్నాడు..*


*ఫోన్ పెట్టేసి తర్వాత సౌదామిని నిశ్శబ్దంగా కూర్చుంది. ఏమీ మాట్లాడలేదు. అశోక్ అలసిపోయినట్టుంది అని కాస్సేపు చూసాడు. కాని తన ధోరణిలో మార్పు రాలేదు.*


*“ఏంటి సౌదా! ఏమైంది? ఈ మధ్య నువ్వు చాలా డల్ గా ఉంటున్నావు. ఆరోగ్యం బావుంది కదా. ఏధైనా జరిగిందా. నాకు చెప్పొచ్చుగా.. ఇంట్లో ఉన్నదే మనమిద్దరం. నువ్విలా ఉంటే ఎలా?”*


*“అంత సీరియస్ ఏమీ లేదండి. బాధ్యతలేమీ లేవు, పిల్లలు ఎవరి సంసారాల్లో వాళ్లు సంతోషంగా ఉన్నారు. అబ్బాయి కూడా మనకు దగ్గరలో లేడు. వాడి పిల్లలను కూడా చూడలేదు మనం.*


 *అయిదేళ్లయిపోయింది వాడు ఇండియా వచ్చి. రమ్మంటే సెలవులు లేవంటాడు.  అమ్మాయి పిల్లలు కూడా పెద్దవాళ్లయ్యారు. వాళ్లు స్కూళ్లు అంటూ మనకు కనపడడం తగ్గిపోయింది.*


 *వాళ్లను నేనేమీ అనడం లేదు, కాని ఈ ఒంటరితనాన్ని కాదు గాని, ఖాళీ సమయాన్ని భరించలేకపోతున్నాను.*


 *మనిద్దరికి వంట చేయడం, పూజ, పుస్తకాలు తప్ప నాకు వేరే పనేమీ లేదు. మీరన్నా కనీసం స్నేహితులతో క్లబ్బులో కలుస్తుంటారు..” ఉదాసీనంగా అంది సౌదామిని.*


*“అలాంటప్పుడు నువ్వు మళ్లీ ఎందుకు చదువుకోకూడదు. రోజూ కాలేజీకి వెళ్లేపని లేకుండా దూరవిద్యలో చేరు. పెళ్లప్పుడు ఎమ్.ఏ.తో ఆపేసావు కదా. ఇంకా చదువు. మనకు డబ్బులకేమీ కొదువ లేదు. నీకు తీరిక సమయం కూడా చాలా ఉంది.  ఎమ్.ఫిల్. లేదా పిహెచ్.డి చేయొచ్చుగా.. కాలక్షేపం ఉంటుంది. ఈ నిరాశ, నిరాసక్తత కూడా మాయమైపోతుంది.”  అన్నాడు అశోక్.*


*“ఇప్పుడు చదువా? అందరూ నవ్వుతారేమోనండి.. చదువంటే నాకు ఇష్టమే కాని చిన్నపిల్లలతో కలిసి పరీక్షలు రాయడం.. అదీ నావల్ల కాదేమో.. సరేలెండి చూద్దాం. ఏది ఎలా జరగాలనుందో” అంటూ లేచి వంటింట్లోకి వెళ్లి సర్దడం మొదలుపెట్టింది. కాని తన ఆలోచనల్లో మౌనంగా మారిపోయింది.*

*****


*సాయంత్రం సరిగ్గా ఐదుగంటలకు భావన పంపిన కారు వచ్చింది.* *అప్పటికే తయారై ఉన్న సౌదామిని, అశోక్ లు ఇంటికి తాళం వేసి బయలుదేరారు.* 

*వాళ్లు భావన ఆఫీసు ప్రాంగణానికి చేరుకునేసరికి, అక్కడంతా కోలాహలంగా ఉంది. ఉద్యోగులంతా హాలులోకి ప్రవేశిస్తున్నారు.*


 *తల్లిదండ్రులను చూసిన భావన వారికి ఎదురొచ్చి అమాంతంగా తల్లిని కౌగిలించుకుంది.*


 *“అమ్మా! ఈ నెమలిపింఛం రంగు  పట్టుచీర నీకు ఎంత బావుందో... చాలా అందంగా కనిపిస్తున్నావు.*

*కదా నాన్నగారు?” అని అడిగింది.*


*అశోక్ మందహాసం చేసాడు.  సౌదామిని మాత్రం సిగ్గుపడిపోయింది. భావన వాళ్లిద్దరినీ మొదటి వరుసలో కూర్చోబెట్టి మళ్లీ కలుస్తానని స్టేజి వెనుకవైపు వెళ్లిపోయింది.*


*మెల్లిగా హాలు నిండిపోయింది. కంపెనీ 10వ వార్షికోత్సవంతోబాటు, ఇటీవలే ఒక పెద్ద విదేశీ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసినందుకు చాలా ఘనంగా ఏర్పాట్లు చేసారు.*


 *ఈ కార్యక్రమానికి ప్రాజెక్ట్ మానేజర్ భావన కాబట్టి తనకి ఇంకా ఎక్కువ భాధ్యతలు ఉన్నాయి. కంపెనీలోని అన్ని విభాగాలలో పనిచేసే ఉద్యోగులందరూ వచ్చినట్టున్నారు. కోలాహలంగా ఉంది హాలంతా..*


*భావన పిల్లలను అల్లుడు తీసుకుని వస్తాడని వాళ్లకోసం ఎదురు చూడసాగింది  సౌదామిని.* 

*****

*మరోగంటలో ముఖ్య అతిధి రాగానే కార్యక్రమం మొదలైంది. కంపెనీ డైరెక్టర్లు, ముఖ్య అతిధి ప్రసంగాలు ముగిసిన తర్వాత ప్రాజెక్టులో పాల్గొన్నవారందరికీ బహుమతులు ఇచ్చారు.*


 *వాళ్ల నాయకురాలిగా ఎంతో సమర్ధవంతంగా పనిచేసిన భావనను అందరూ ప్రశంసించారు.*


 *అంతేకాకుండా ఈరోజు భావన పుట్టినరోజు కాబట్టి  మరింత ఘనంగా శుభాకాంక్షలు అందిద్దామని కంపెనీ చైర్మన్ ప్రకటించాడు.*


 *సౌదామిని భావన పిల్లలకోసం అటూఇటూ చూస్తూనే భావనకు  వస్తోన్న అభినందనలు చూసి మురిసిపోతోంది.*

*పది నిమిషాల్లో ఒక పెద్ద కేకును స్టేజ్ మధ్యలో టేబుల్ మీద పెట్టారు. స్టేజ్ మొత్తం రంగురంగుల బెలూన్లను కట్టారు. భావనను పిలిచారు. భావన ముందుకొచ్చింది.*


*కాని “ఒక్క నిమిషం“ అంటూ మైక్ దగ్గరకు వెళ్లి “అమ్మా! ఒక్కసారి స్టేజ్ మీదకు రావా? నాన్నగారు కూడా రావాలి. నాకోసం..” అని పిలిచింది. వెంటనే అందరూ చప్పట్లు కొట్టారు.*


*మేమెందుకు అనుకుంటూ సందేహంగానే సౌదామిని, భర్తతో కలిసి స్టేజ్ మీదకు వచ్చింది. భావన తల్లిని కేక్ ముందు నిలబెట్టింది. అటు, ఇటు తను, తండ్రి నిలబడ్డారు. కేక్ మీద రాసింది చదివిన సౌదామిని నివ్వెరపోయింది..  భావనకు బదులు తన పేరు కనఫడింది. అమ్మకు శుభాకాంక్షలు అని..*


 *అయోమయంగా కూతురివైపు చూసింది.*

*భావన చిరునవ్వుతో మైక్ ముందుకు వచ్చి “ ఫ్రెండ్స్! ఇవాళ కంపెనీ విజయోత్సవాలతోబాటుగా నా  పుట్టినరోజు కూడా జరపాలని అనుకోవడం చాలా సంతోషంగా ఉంది. కాని ఇవాళ నా పుట్టినరోజు కాదు” అని ఆగింది..*


 *“అవును.. ఇది నా పుట్టినరోజు కాదు. మా అమ్మ, నన్ను కన్నరోజు. తను అమ్మగా మారినరోజు.  ఈ రోజు నా జన్మకు కారణమైన నా తల్లికి కాక నాకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడమేంటి?*

*అందుకే ఈ రోజును మా అమ్మ నన్ను కన్నరోజుగా జరుపుకోవాలనుకుంటున్నాను. చిన్నప్పుడు ప్రతీ సంవత్సరం అమ్మ మన పుట్టినరోజు పండగలా జరుపుతుంది. కొత్తబట్టలు, చాక్లెట్లు, స్వీట్లు... ఎన్ని చేసేదో, కాని పెద్దయ్యాక మన  పుట్టినరోజులో అమ్మ అంతగా కనిపించదు. స్నేహితులు, కాబోయే భర్త లేదా అత్తవారింటివారు మాత్రమే ఉంటారు. కాని  మన పుట్టుకకు కారణమైన అమ్మలేని మన పుట్టినరోజును ఎంత ఘనంగా జరుపుకున్నా  వృధాయే కదా. అందుకే ఈ విజయోత్సవ వేళ  అమ్మకే  ఈ రోజు అంకితం.. అమ్మా! అటు చూడు"అంటూ స్టేజ్ కుడివైపుకు చూపించింది..*


*అది చూసిన సౌదామిని ఆశ్చర్యపోయింది. తను చూస్తుంది కలయా? నిజమా ? అని నమ్మలేకపోయింది.*

*అమెరికాలో ఉండే  సౌదామిని కొడుకు అన్వేష్, కోడలు స్వప్న, మనవరాళ్లు శిల్ప, శ్రేయ కనబడ్డారు. వారి వెనకాలే అల్లుడు, మనవళ్లు  నేహాంత్, శ్రేయాంశ్...* *మనవరాళ్లు ముచ్చటగా పట్టుపరికిణీలలో, మనవళ్లు సిల్క్ కుర్తా పైజామాలు వేసుకుని ఎంత ముద్దుగా ఉన్నారో..*


*సౌదామిని తన కొడుకును చూసి అయిదేళ్లయింది.  మనవరాళ్లను కూడా మొదటిసారి ప్రత్యక్షంగా చూస్తోంది. వాళ్లు పుట్టినప్పటినుండి వాళ్ల ఆటలన్నీ స్కైప్ లోనే చూడడం. వాళ్లంతా వచ్చి సౌదామినిని చుట్టుముట్టారు. మనవళ్లు, మనవరాళ్లు అమ్మమ్మా! బామ్మా! అంటూ కౌగిలించుకున్నారు..*

*సౌదామినికి సంతోషంతో కళ్లనీళ్లు వచ్చేసాయి.  అది చూసి హాల్లో ఉన్నవారికి కూడా మనసు చెమరించింది.*


*భావన పిలవగానే పిల్లలు నలుగురూ వచ్చి మైక్ ముందు నిలబడి నెల రోజులనించి ప్రాక్టీసు చేసిన, సౌదామినికి ఇష్టమైన అన్నమయ్య కీర్తనను పాడారు.*

  

*కంపెనీ చైర్మన్, డైరెక్టర్లు కూడా ఈ ఏర్పాట్లు ముందే తెలుసన్నట్టు చిరునవ్వులతో నిలబడ్డారు*.


*అన్వేష్ వచ్చి మైక్ అందుకున్నాడు..” ఫ్రెంఢ్స్.. నిజానికి ఇది అక్కకి సంబంధించిన ప్రోగ్రామ్.. తన కంపెనీ, తన ప్రాజెక్టు విజయంతోపాటు తన పుట్టినరోజు కూడా..  కాని ఇలా తన పుట్టినరోజను అమ్మ కన్నరోజుగా మార్చడం అన్న ఆలోచన వచ్చినందుకు నిజంగా హాట్సాఫ్ అక్కా.. నువ్వు చెప్పింది నిజమే..*


 *అమ్మలేకుండా మనం లేము.  మన పుట్టినరోజును అమ్మ ఎప్పుటికీ మర్చిపోదు కారణం తను నవమాసాలు మోసి కని, అల్లారుమద్దుగా, క్రమశిక్షణతో పెంచుతుంది. అమ్మకు తోడుగా నాన్న ఎప్పుడూ వెన్నంటే ఉన్నారు. నాన్న డబ్బులు కట్టినంత మాత్రాన మనం  ఇంజనీర్లు, డాక్టర్లం అయిపోతామా.. మనకోసం, మన చదువులు, సంతోషంకోసం నాన్న సంపాదనలో బిజీగా ఉంటారని, మన ప్రతీ ఆవసరం అమ్మకు తెలుసుకుంటుంది..ఎంత కష్టమైనా తీర్చడానికి ప్రయత్నిస్తుంది. నాన్నను, మనను, మన పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది అమ్మ*.


 *కాని తన అవసరాలు, ఇష్టాల గురించి ఎవరికి ఎంత తెలుసని. కనీసం తన  పుట్టినరోజు కూడా మనం గుర్తుపెట్టుకోము. ఎందుకంటే మనం మన ఉద్యోగ, వ్యాపార, కుటుంబ వ్యవహారాల్లో బిజీ కాబట్టి...*


 *ఇప్పుడు అక్క కారణంగా నేను చేస్తున్న తప్పు కూడా తెలిసి వచ్చింది. అందుకే  సెలవులు లేవు, తీరిక లేదు అంటూ అమ్మ దగ్గరకు రావడాన్ని వాయిదా వేస్తున్న నేను వెంటనే వచ్చేసా. నేను రావడమే అమ్మకు పెద్ద బహుమతి అని నాకు తెలుసు కదా” అని ఉద్వేగంతో మాట్లాడిన అన్వేష్ కళ్లు తుడుచుకుంటూ తల్లి దగ్గరకు వెళ్లాడు.*


*సౌదామిని ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఏం మాట్లాడాలో కూడా తెలీడం లేదు. కూతురి ఆలోచనకు సంతోషించాలా? తన  పిల్లలు తనను ఇంతగా ప్రేమిస్తూ, గౌరవిస్తున్నందుకు సంతోషించాలా అర్దం కాని స్థితిలో ఉంది.  భర్త, పిల్లలు, మనవళ్లతో  కేక్ కట్ చేసింది. హాలు మొత్తం కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది.*


*“అమ్మా! మీరు మా అందరికీ  రెండు మంచి మాటలు చెప్పండి. తల్లిమీద ఇంత మంచి అభిప్రాయం , ప్రేమ, ఆఫ్యాయతలు ఉన్న మీ పిల్లలను చూస్తే మీ పెంపకం, మీరు నేర్పిన సంస్కారం కనిపిస్తున్నాయి. ఇవి ఈనాటి పిల్లలందరికీ  అర్ధమవ్వాలి. చెప్పండి ప్లీజ్.. ” అని రిక్వెస్ట్ చేసాడు కంపెనీ చైర్మన్ నారాయణరావు..*

 

*“అయ్యో! నేనేం మాట్లాడగలను.  మీరనుకున్నంత గొప్పదాన్నేమీ కాదు. అందరిలాంటి తల్లినే. వద్దు” అంటూ చేతులు జోడించి మొహమాటంగా చెప్పింది సౌదామిని.*


*“మాట్లాడాలి....మాట్లాడాలి.. “అంటూ హాల్లో కేకలు వినపడ్డాయి..*


*భావన కూడా తల్లిని మాట్లాడమనడంతో తప్పనిసరై మైక్ ముందుకు వచ్చింది.*


*“వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక క్రింద ఉన్న పెద్దలకు నమస్కారాలు. పిల్లలకు ఆశీర్వాదాలు. మా పిల్లలు నామీద ఉన్న ప్రేమతో మరీ గొప్పగా చెప్తున్నారు కాని నేను చేసిందేమీ లేదు. అందరు అమ్మలలాగానే నా  పిల్లలు కూడా గొప్ప చదువులు చదవాలి, మంచి ఉద్యోగంలో స్థిరపడాలి. పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. వారికి తగిన సహాయ సహకారాలను అందించాను.*


 *కాని మీరంతా నా పిల్లల ఈడువాళ్లే కాబట్టి ఒక్క మాట మాత్రం చెప్పాలనుకుంటున్నాను.*

*పెద్ద చదువులు చదవండి. ఉద్యోగాలు చేయండి. సంపాదించండి.*


*కాని కుటుంబాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. కుటుంబం అంటే తల్లిదండ్రులే కాదు భాగస్వామి, పిల్లలు కూడా... మీరు ఎంత సంపాదించినా మీకోసం మీ పిల్లలకోసమే కదా. మీరు మీ భాగస్వామితో , పిల్లలతో ఆనందంగా ఉండడానకి కావలసినంత సంపాదించండి చాలు.*


 *తరతరాలకు సంపాదించడం కోసం ఇప్పటి మీ సంతోషాలను, జీవితాలను పణంగా పెట్టకండి. యంత్రాలలా కాకుండా మనుషుల్లా మీ మనసుకు తగినట్టుగా బ్రతకండి.. అంతే..*


*మరొక్కమాట.. మీ పుట్టినరోజు సంబరాలు  మీకు మాత్రమే  సొంతం కాదు. మీ జన్మకు కారణమైన అమ్మానాన్నలు కూడా ఉన్నారని మాత్రం మరచిపోవద్దు. ఉంటాను “  అని వినయంగా చెప్పింది.*

 

*కంపెనీ ఉద్యోగులు, చైర్మన్, డైరెక్టర్ల కరతాళ ధ్వనులతో హాలంతా మారుమ్రోగిపోయింది.*

*భర్త, పిల్లలతో కలిసి సంతోషంగా ఇంటికి బయలుదేరింది సౌదామిని.*


 *ఇప్పుడు ఆమెకు ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉంది.. కారులో కూడా మనవళ్లు, మనవరాళ్లతో తెగ కబుర్లు చెప్పసాగింది, వాళ్ల కబుర్లు వింటూ చిన్నపిల్లలా మారిపోయింది..  తన కూతురు, కొడుకు కలిసి చేసిన ఈ కార్యక్రమంలో తన వంతు బాధ్యతను పూర్తి చేసానన్న తృప్తితో ఆ మనోహరమైన దృశ్యాన్ని అశోక్ చూస్తూ ఉండిపోయాడు.*


*ఇంటికి రాగానే అందరూ హాల్లో చేరారు. వాళ్లకు భోజనం ఏర్పాట్లు చేయడానికి వంటింట్లోకి వెళ్లబోతున్న సౌదామినిని బలవంతంగా హాల్లోనే కూర్చోబెట్టారు. అంతలోనే హోటల్ నుండి ఆర్డర్ చేసిన భోజనం వచ్చేసింది.*


 *సౌదామిని, భర్తను, పిల్లలను, వాళ్ల పిల్లలను చూసుకుంటూ  పట్టరాని ఆనందంతో పొంగిపోయింది. వాళ్లు రావడం ఒక ఎత్తైతే తను కన్నరోజు అంటూ అంత గొప్ప గౌరవాన్ని ఇవ్వడం గురించి తలుచుకుని ఇంకా ఆశ్చర్యంగానే ఉంది.*


*తమ పిల్లలతో పాటు అమ్మకు అటు ఇటు కూర్చున్న భావన, అన్వేష్ కలిసి తాము నెలరోజులనుండి ప్లాన్ చేసిన ఈ కార్యక్రమం గురించి తల్లికి వివరించసాగారు.  వాళ్లకు తోడుగా నిలిచిన  కోడలు, అల్లుడు, అశోక్ దూరం నుండే వాళ్లను చూసి నవ్వుకున్నారు.  వాళ్ల మాటలు ఎంతకీ ఆగడం లేదు..*


*“సౌదా! ఇదిగో నా తరఫున నీకో చిన్న బహుమతి. నీకు చాలా ఇష్టమైనదే అని నాకు తెలుసు” అంటూ అశోక్ ఒక కవర్ ఆమె చేతిలో పెట్టాడు.*


*“అయ్యో! ఇప్పుడు మీరు కూడా బహుమతి ఇవ్వాలా? పిల్లలకు తోడుగా ఉండి ఇదంతా చేయించారు చాలదూ.. ఏముంది ఈ కవర్ లో?” అంటూ కవర్ తెరిచింది.*


*పిల్లలందరూ కూడా ఆ కవర్ లో ఏముందా అని ఆసక్తిగా చూసారు.*


*సౌదామిని పేరు మీద ఎమ్.ఫిల్  అఫ్లికేషన్ ఫారమ్ పూర్తిగా నింపి, కావలసిన సర్టిఫికెట్లు జతచేసి ఉన్న కాగితాలవి. సంతకం పెట్టి సబ్మిట్ చేస్తే చాలు.*


*అది చూసి పిల్లలంతా సంతోషంగా చప్పట్లు కొట్టారు.. ఆ నవ్వులు, కేరింతలు సౌదామిని మొహంలో  కూడా ప్రస్ఫుటంగా కనిపించాయి.!


*************************************************


నా స్పందన:


అద్భుత ఆలోచన … ఊహించని జన్మదినం … 

ఎంత గొప్పగా అనిపించిందో, మిత్రమా!


నిజంగా … ఇదో గొప్ప టర్నింగ్ పాయింట్!


జన్మదినమంటూ పుట్టినవారే చేసుకోవడం తప్ప … 

కన్నవారు ఏం సంబంధమన్నట్టు చేసుకున్న ఇన్నాళ్ళ పుట్టినరోజుల్నీ మరిపింపజేశారుగా?


సూపర్భ్ థాట్!


రచయిత ఎవరో తెలీదు … 

చాలా గొప్ప క్రియేటివ్ థాట్!


హ్యాట్సాఫ్ ఫర్ హిజ్/హర్ రైటప్!

యుద్ధం ఎవరి మీద

 *🏵️మనం మొదటి యుద్ధం ఎవరి మీద చేయాలి..??*

*పాకిస్థాన్ మీద నా...? చైనా మీదనా...?*

*లేక....*


*తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దే నీచ నికృష్ట దేశద్రోహులతోనా..?*


*(RK)*


*నిజవాస్తవాలతో .......👇*    


🏵️వేలమంది హింధువులను హత్యలు చేసిన నిజాం నిరంకుశ పాలన చాలా బాగుంది అని ప్రశంసించి నిజాం పరిపాలన తెస్తాను అని బాజాప్త చెప్పిన KCR గారిని CM గా ఎన్నుకున్న   దేశంలో ..


🏵️కృష్ణప్రసాద్ లాంటి IPS ఆఫీసర్ను చంపిన ఉగ్రవాదులకు క్షమాభిక్ష క్రింద రూల్స్ ను పక్కన పెట్టి విడుదల చేసిన YSR ను ఎన్నుకునే దేశంలో..



🏵️దేశసంపదలో మొదటిముద్ద మీద ముస్లిములదే మొదటిహక్కు అని ప్రకటించిన మన్‍మోహన్ గారిని పదిసంవత్సరాలు ప్రధానమంత్రిగా భరించిన దేశంలో


🏵️కోయంబత్తూరు బెంగుళూరు తదితర ఉగ్రవాద దాడుల్లో వందలమందిని పొట్టన పెట్టుకున్న రాక్షసుడు అబ్దుల్ నాసర్ మదానీ విడుదల కోసం ఏకంగా కేరళ అసెంబ్లీలో తీర్మానం చేసిన కమ్యూనిస్టులను ఎన్నుకునే ప్రజలున్న దేశంలో


🏵️అదే అబ్దుల్ నాసర్ మదానీ కోసం కన్నీరు కార్చిన కరుణానిధికి ఏళ్ళతరబడి పట్టం కట్టిన దేశంలో


🏵️గుళ్ళు పగలగొట్టిన చేత్తోనే పదుల ఎకరాల స్థలంలో మసీదులు చర్చీలు వందల కోట్ల ఖర్చుతో నిర్మించడానికి కట్టుబడ్డ చంద్రబాబు గారిని ఎన్నుకునే దేశంలో


🏵️బంగ్లదేశ్ అక్రమ వలసదారులకు సర్వసౌకర్యాలు కల్పించిన కమ్యూనిస్టులను, మమతాబెనర్జీలను ఎన్నుకునే దేశంలో


🏵️ముస్లిముల పండగ కోసం హిందు పండగలను నిషేధించి, హిందూ దేవాలయాలకు ప్రధాన ధర్మకర్తగా ముస్లిమును నియమించిన మమతాబెనర్జీ లాoటి వారు దేశప్రధాని పదవికి అభ్యర్ధిగా సగర్వంగా పోటీ పడే దేశంలో


🏵️పాకిస్థాన్ నుండి వచ్చి ముంబాయిలో ""స్థానికుల సహాయం లేకుండా" కేవలం GPS సాయంతో దాడులు నిర్వహించారని నమ్మింపజేసిన ప్రభుత్వాలు రాజ్యం ఛేసిన దేశంలో


🏵️అదే ముంబాయి దాడుల అప్ డేట్స్ తమ చానెల్ ద్వారా ఉగ్రవాదులకు లైవ్ టెలికాస్ట్ ద్వారా అందించిన బర్ఖాదత్ లాంటి వారు లౌకికవాదులుగా వెలిగిపోతున్న దేశంలో


🏵️రిపబ్లిక్ డే ను భహిష్కరించమని పబ్లిగ్గా పిలుపునిచ్చిన దిల్లీ ఇమామ్ బుఖారి కాళ్ళ దగ్గర కూర్చుని అభ్యర్ధులను ఫైనలైజ్ చేసిన వీపీ సింగ్ లాటి వారు లౌకికవాదులుగా వెలిగిపోయిన దేశంలో


🏵️కశ్మీర్ లో రాళ్ళు విసిరే బాచ్ మీద రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించి నియంత్రిస్తే, అదేదో ఘోరమారణ కాండ అని గొంతుచించుకున్న మేధావులు, వారికి వత్తాసుగా రబ్బర్ బుల్లెట్ల వాడకం నిషేధించిన గౌరవ న్యాయస్థానాలూ ఉన్న దేశంలో


🏵️చెదురుమదురుగా మొత్తం మీద పదికి మించని, అందులోనూ నిజమెన్నో అబద్దమెన్నో తెలియని గోరక్షక హత్యలకు తల్లడిల్లిపోయి రొచ్చురొచ్చు చేసి, గుండెలు అవిసేలా రొమ్ములు బాదుకుని బాధపడి, బెంగాల్ సహరాన్‍పూర్ , మాల్టా, బర్సీహాత్, ఉత్తరప్రదేశ్ కైరనా తదితర ప్రాంతాలలో వేలాది బంగ్లాదేశి అక్రమవలస ముస్లిములు, దేశీయ ముస్లిములు హిందువులను విరగబాదినా పట్టించుకోని దేశంలో


🏵️గతంలో ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతుందోనని హడలి చచ్చే దేశం, రోజుకొక ఉగ్రదాడి పేపర్లలో ప్రముఖంగా వచ్చే వార్తను చదవటానికి అలవాటు పడ్డ దేశంలో ఇన్నాళ్ళు ఎక్కడా ఏ బాంబూ పేలకపోయినా, నిన్న పేలిన ఉగ్రవాద ప్రేలుడుకు రక్తం మరిగిపోయిన సోషల్ మీడియా మేదావులకు, కోపం రావటం ఆశ్చర్యం లేదు, మోదీని తిట్టిపోసేందుకు దూక్కుంటూ లగెత్తుకుంటూ వచ్చి తీరాలి, వాళ్ళను కార్యోన్ముఖులను చేయటానికి కంకణం కట్టుకున్న తమకు అర్ధమయిన సెక్యులరిజం, టాలరిజమ్ ను రుబ్బి వడగట్టి రసం పిండి జనానికి పట్టించటానికి కృషి చేసే కుహాన లౌకిక వాదుల ముసుగులో ఉన్న కృిస్టియన్ మతోన్మాద ముస్లిం మతోన్మాద సంస్థల బానిసలు వున్న దేశంలో 


🏵️ఇప్పుడు చెప్పండి.. మొదటి యుద్ధం ఎవరిమీద చెయ్యాలి..? 


పాకిస్థాన్ మీద నా...? చైనా మీదనా...? 


లేక..


మీరు పైన చదివిన ...తల్లి పాలు తాగి రొమ్ముగుద్దే నీచ నికృష్ట దేశద్రోహులతోనా..?

బ్రహ్మ్మము

 బ్రహ్మ్మము 

తెలియని వారికి తెలియదు 

తెలిసిన వారికి తెలియదు 

తెలిసి తెలియని వారికి తెలియనే తెలియదు 

తెలిసిన వాడు లేడు

తెలిసిన తెలియ చెప్పలేడు కదా బ్రహ్మము 

పరమాచార్య స్వామివారు

 పరమాచార్య స్వామివారు మకాం చేసిన ఊర్లో ఉన్న ఒకావిడకి స్వామివారంటే అనన్యమైన భక్తిప్రపత్తులు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆవిడ తరచూ ఇంటినుండి బయటకు వచ్చి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉండేది కాదు. ఒకరోజు ఎలాగో ఇంటినుండి బయటకు వచ్చి మహాస్వామి వారు బస చేసిన చోటికి వచ్చింది.

అది మద్యాహ్న సమయం. పూజావేదిక పైనుండే కూర్చుని పరమాచార్య స్వామివారు భక్తులతో మాట్లాడుతున్నారు. ఈమె చేతిలో హారతి పళ్ళెంతో మహాస్వామి వారి దగ్గరకు వెళ్ళి హారతివ్వడానికి స్వామివారికేసి చూసింది. వెంటనే స్వామివారు ముఖాన్ని మరోవైపుకు తిప్పుకున్నారు. రెండు మూడు సార్లు ప్రయత్నించినా పరమాచార్య స్వామివారు ఆమెకు వారి ముఖ దర్శనం ఇవ్వలేదు.

ఆవిడకు చాలా బాధవేసింది. మహాస్వామివారు తన వైపు తిరిగినట్టనిపించి హారతిపళ్ళెంలో కర్పూరాన్ని వెలిగించింది. ముందుకు వెళ్ళి హారతి ఇచ్చే లోపల స్వామివారు లేచి లోపలికి వెళ్ళిపోయారు. ఆవిడ నిచ్చేష్టురాలై మనసులో “అమ్మా అంబికా! ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? నేను చేసిన పాపం ఏమిటి?” అని రోదించసాగింది. తరువాత తమాయించుకొని “సరే! నేను ఈ హారతిని నీకే సమర్పిస్తాను” అని పూజా వేదికపైన ఉన్న త్రిపురసుందరి అమ్మవారికి హారతిచ్చి చాలా నిరాశతో ఇంటికి వెనుతిరిగింది.

ఆ పందిరి నుండి బయటకు రాగానే, ఒకరు ఆవిడ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి, “అమ్మా! పెరియవ నిన్ను పిలుస్తున్నారు” అని చెప్పాడు. “నన్ను పిలుస్తున్నారా? నన్ను కాదేమో” అని సంశయంగా చెప్పింది. “అవును అమ్మా మిమ్మల్నే. లోపలికి రండి” అని చెప్పాడు. అనుమానంగా లోపలికి వెళ్ళింది. వేదికపైన కూర్చున్న మహాస్వామి వారు ఆవిడతో, “నాకు ఇవ్వాల్సిన హారతి అమ్మవారికి ఇచ్చానని ఏమి మధనపడకు. ఇప్పుడు నాకు హారతి ఇవ్వు” అని చెప్పారు.

ఉద్వేగంతో కర్పూరాన్ని పళ్ళెంలో పెట్టింది. చేతులు వణుకుతుండగా కర్పూరాన్ని వెలిగించింది. కొద్దిగా ధైర్యము తెచ్చుకుని స్వామివారి ముందుకు వెళ్ళి హారతి ఇస్తూ మహాస్వామి వారి ముఖంలోకి చూసింది. ఆవిడ కళ్ళకి మహాస్వామి వారు ఒకచేతిలో చెరుకు విల్లుతో, మరొక చేతిలో పరాంకుశముతో మందస్మితయై సాక్షాత్ కామాక్షి అమ్మవారిలాగా కనపడ్డారు. స్వామివారిని అలా చూడగానే ఆవిడ గట్టిగా లెంపలేసుకుంటూ భక్తితో “అమ్మా! అమ్మా!” అని అరవసాగింది. వేదికపైన ఉన్న కామాక్షి, పరమాచార్య స్వామివారు ఒక్కటే అన్న విషయం ఈ సంఘటన వల్ల మనకు తెలుస్తుంది.

[కాల్చి పుటం పెడితేనే వన్నె చేకూరుతుంది బంగారానికి. భగవంతుడు పెట్టే పరీక్షలకు తట్టుకుని నిలబడితేనే భక్తుని భక్తి, ఆర్తి తెలిసేది. కష్టాలలో కూడా భగవంతుని నమ్మి నిలిచినవాడే నిజమైన భక్తుడు. అటువంటి వారికి ఉన్నదే నిజమైన భక్తి. కష్టాలు వచ్చినప్పుడు భగవంతుణ్ణి తిట్టడం సరికాదు. సుఖాలు ఇచ్చినప్పుడు పొగిడావా? లేదు కదా!!

పరమాచార్య స్వామివారు అలా చెయ్యకపోయి ఉంటే ఆవిడకు స్వామివారిలో కామాక్షి దర్శనం అయ్యుండేది కాదు. స్వామివారు అలా చెయ్యడం వల్ల ఆవిడ మనస్సు క్లేశపడి పురాకృత పాపం శేషం పోయి అమ్మవారి దర్శనం అయ్యింది. మహాత్ములు ఏమి చేసినా అది లోకకళ్యాణానికే!!]