లివర్ మరియు స్ప్లీన్ ( ప్లీహ ) వ్యాధులు -
లివర్ అంటే ఏమిటి ? -
లివర్ మానవ శరీరంలో హృదయానికి పక్కటేముకలకి క్రిందుగా కుడివైపున ఉండే అవయవం . ఇది రక్తం వలన పుట్టినది. దీనిని కార్జం మరియు లివర్ అంటారు. ఇది నలుపు , ఎరుపు మిశ్రమ వర్ణంతో మిక్కిలి మృదువుగా ఉండే మాంస ఖండం .
ప్లీహము అంటే ఏమిటి ? -
ప్లీహము మానవ శరీరంలో ఎడమ బాగంలో హృదయానికి క్రిందుగా ఉండే అవయవం . ఇది కూడా రక్తం వలెనే జనిస్తుంది. రక్తాన్ని తీసుకుని పొయే సిరలన్నిటికి ఈ ప్లీహమే మూలం అని బారతీయ మహర్షులు పేర్కొన్నారు.
లివర్ , ప్లీహ రోగాలు ఎందుకు వస్తాయి ? -
* శరీరానికి వేడిచేసే పదార్దాలు అయిన మినుములు , ఉలవలు, ఆవాలు మొదలయిన వాటితో వండిన పదార్దాలను అధికంగా సేవించడం .
* గేదె పెరుగు ఎక్కువుగా తినడం .
* పగటిపూట అధికంగా నిద్రపోవడం.
ఇటువంటి కారణాల వలన శరీరంలో రక్తం , కఫం ఎక్కువుగా వృద్ది చెంది లివర్ ని మరియు ప్లీహం వృద్ది చెందుతాయి. లివర్ , ప్లీహం చెడిపోయి ప్లీహం వృద్ది అవుతుంది. దీనినే ప్లీహభివ్రుద్ధి ( enlargement of spleen ) అంటారు.ఇదే ప్లీహ వ్యాధి అంటారు. ఇదే దోషం వలన లివర్ వృద్ది చెందుతుంది దానిని లివర్ వ్యాధి అంటారు. అయితే లివర్ వ్యాధి కుడివైపున , ప్లీహ వ్యాధి ఎడమ వైపున కలుగుతుంది అని తెలుసుకోవాలి.
లివర్ మరియు ప్లీహ వ్యాధుల లక్షణాలు -
* ఈ వ్యాధుల వల్ల రోగులు బాగా కృశించి బలహీనులు అయిపోతారు.
* ఎల్లప్పుడు కొద్ది జ్వరం వెంటాడుతూనే ఉంటుంది.
* ఉదరంలో జట రాగ్ని మందగించిపోయి అజీర్ణం అగ్నిమాన్ధ్యం కలుగుతాయి.
* దీనివలన శరీరంలో రక్తం , కఫం దుషిమ్పబడి వ్యాధికారకం అవుతాయి. కావున శరీరం నందలి రక్తం తగ్గినా , విపరీతంగా పెరిగినా అనర్ధమే .
* శరీరమంతా ఎంతో బరువుగా , బడలికగా ఉంటుంది. నీరసం అనిపిస్తుంది.
* దేహమంతా వివర్ణం అయి శరీరం తిరిగి పోతున్నట్టుగా ఉంటుంది.
* పోట్టపైన చర్మం ఎరుపుగా ఉండి , పొట్ట బరువు పెరుగుతుంది.
* మనసుకి మైమరపు, భ్రమ , మొహం కలుగుతాయి .
లివర్ మరియు ప్లీహ రోగాలకు సులభ యోగాలు -
* 50 గ్రా శనగలను నీళ్లలో వేసి ఉడకబెట్టి రుచికోసం కొద్దిగా ఉప్పు కలిపి రోజు ఉదయం పూటనే తినాలి . కొంత సమయం తరువాత నేతిలో వేయించిన 50 గ్రా శనగలని కొద్దిగా ఉప్పు చేర్చి తినాలి . ఈ ప్రకారంగా కనీసం 15 రోజుల పాటు చేయాలి . ఈ 15 రొజుల్లొ కారం అసలు ముట్టుకోకుడదు చప్పిడి ఆహారమే తినాలి . ఈ నియమం పాటిస్తే ఎంతోకాలం నుంచి పీడించే లివర్ సమస్యలు అయినా పరిష్కారం అయి లివర్ శుభ్రపడుతుంది.
* 50 గ్రా వాము తీసుకుని బాగా చెరిగి శుభ్రం చేసి ఆ వాముని ఒక మట్టి మూకుడులో పోసి అది మునిగేంత వరకు కలబంద మట్టల లోని రసం పోయాలి. దీనిని ఒక రాత్రి నానబెట్టి ఒక పగలు ఎన్దించాలి . ఎండ ప్రభావానికి వాము కలబంద రసాన్ని పీల్చుకుంటుంది. తరువాత సాయంత్రం పూట మళ్లి కలబంద రసాన్ని పోసి రాత్రి నానబెట్టి తెల్లారి ఎండలో పెట్టాలి. ఇలా మూడు రోజులు చేసిన తరువాత కలబంద రసాన్ని గ్రహించిన వాముని తీసుకుని నిలువచేసుకోవాలి. రోజు ఉదయం , సాయంత్రం వేళల్లో పూటకు 3 గ్రా మోతాదుగా తింటూ అనుపానంగా కొంచం మంచి నీళ్లు తాగుతూ ఉంటే ప్లీహబివ్రుద్ధి ( కడుపులో పెరిగే బల్ల ) హరించి పొతుంది.
దీనికి పుదినా పచ్చడి , గోధుమ రొట్టెలు , ముల్లంగి కూర తినాలి . సగం బోజనమే చేయాలి . అంటే కడుపు నిండా తినకుడదని అర్ధం . పప్పులు , దుంపలు , మినుములు , పచ్చిపాలు, వెన్న, నెయ్యి మొదలయిన ఆలస్యంగా జీర్ణం అయ్యే పదార్ధాలు తినకుడదు.
* రోజు ఉదయం , సాయంత్రం వేళల్లో తులసి ఆకుల రసం రెండు మూడు చెంచాలు తాగుతూ ఉంటే క్రమంగా కడుపులో బల్లలు కరిగిపోతాయి.
* వెంపలి చెట్లు ప్రతిచోటా పెరుగుతాయి. వెంపలి వేళ్ళు తెచ్చి కడిగి ఎండబెట్టి దంచి చూర్ణం చేసి నిలువ ఉంచుకుని రోజు 5 గ్రా మోతాదుగా ఆవు మజ్జిగ లో కలుపుకుని తాగుతూ ఉంటే కడుపులో బల్లలు కరిగిపోతాయి . ఆహారం ద్రవ పదార్ధంగా మాత్రమే తీసుకోవాలి . తెల్ల వెంపలి వేళ్ళు వాడటం శ్రేష్టం .
* రావిచెట్టు బెరడు తెచ్చి నీడలో ఎండబెట్టి కాల్చి బూడిద చేయాలి . దాన్ని జల్లెడ బట్టి నిలువ ఉంచుకొవాలి. దానిని రోజు ఉదయం పూట 2 గ్రా బూడిద ని అరటిపండు ముక్క మద్యలో పెట్టి తింటూ ఉంటే 40 రోజుల్లో లివర్, ప్లీహ సమస్యలు పరిష్కారం అవుతాయి.
* ఉత్తరేణి సమూలంగా పీకి తెచ్చి కడిగి చిన్నచిన్న ముక్కలు చేసి ఎండబెట్టి కాల్చి బూడిద చేయాలి . ఈ బుడిదని జల్లెడ పట్టి నిలువ ఉంచుకొవాలి. శోంటి ముక్కలని మంచి నీళ్లలో వేసి శొంటి కషాయం తయారు చేసి ఆ కషాయం 30 గ్రా మోతాదుగా తీసుకుని అందులో రెండు గ్రాముల ఉత్తరేణి భస్మాన్ని కలిపి రోజుకొక మోతాదుగా తాగుతూ ఉంటే మూడు వారాలలొ లివర్, ప్లీహ రోగాలు పొతాయి.
* కలబంద మట్టలు చీల్చి లొపల ఉండే గుజ్జు తీసి ఆ గుజ్జుని 10 గ్రా మోతాదుగా అందులో 3 గ్రా పసుపు కలిపి రోజు సేవిస్తూ ఉంటే ప్లీహభివృద్ధి తగ్గిపొతుంది.
* నాటు ఆవు యొక్క మూత్రం తెచ్చి గుడ్డలో వడపోసి 50 గ్రా మోతాదుగా తీసుకుని అందులొ చిటికెడు ఉప్పు కలిపి రోజు ప్రాతః కాలంలో తాగుతూ ఉంటే మూడు , నాలుగు వారాలలొ లివర్, ప్లీహ వ్యాదులు తగ్గిపోతాయి . జెర్సీ ఆవులు, పట్టణాలలో ప్లాస్టిక్ కవర్లు తినే ఆవులు మూత్రం పనిచేయదు . పొలాలొ తిరిగే నాటు ఆవులు మూత్రం పనిచేయదు .
లివర్ ఆరోగ్యంగా ఉండటానికి తీసుకోవల్సినవి -
* పచ్చి గుంటగలగర చిగురాకు తెచ్చి పచ్చడి నూరుకొని అన్నంలో కలుపుకుని వారానికి ఒకసారి తింటూ ఉంటే ఎప్పటికప్పుడు లివర్ శుభ్రపడుతూ ఎటువంటి అనారోగ్యానికి గురికాకుండా ఉంటుంది. అంతే కాకుండా వెంట్రుకలు తెల్లబడకుండా , కంటి చూపు తగ్గకుండా ఉంటుంది. అంతేకాక వెంట్రుకలు తెల్లబడకుండా కంటిచూపు తగ్గకుండా కూడా శరీరాన్ని సంరక్షిస్తుంది.
* పచ్చి గుంటగలగర ప్రతీసారి దొరకనివారు ఒకేసారి గుంటగలగర మొక్కలను సమూలంగా తెచ్చుకుని కడిగి నీడలో ఎండబెట్టి చూర్ణం చేసుకోని రోజు పూటకు 3 గ్రా మోతాదుగా ఆ చూర్ణాన్ని రెండు పూటలా మంచినీళ్ళతో సేవించవచ్చు.
* తమలపాకు లకు ఆముదం రాసి వేడి చేసి కట్టుకడుతూ ఉంటే లివర్ గట్టిపడటం తగ్గి యధాస్థితి వస్తుంది.
* నిమ్మపండ్ల రసం , టమాటో పండ్ల రసం , బొప్పాయి పండ్లు తరచుగా వాడుకుంటూ ఉంటే లివర్ , స్ప్లీన్ వ్యాదులు కలగకుండా ఉంటాయి.