ఒక అద్భుత సంస్కృత పద్యం.
అశోక వృక్షం క్రింద వున్న సీత దగ్గరకు వచ్చిన రావణుడు రాముని నిందించడం ఆత్మస్తుతి చేసుకోవడం మొదటి మూడు పాదాల్లో వుంటుంది!
సీత “ఒరే మూర్ఖుడా! నీమాటలలో ఫలానా అక్షరాన్ని తీసేయ్!” అంటుంది. అంతే మొత్తం అర్థం మారిపోతుంది! రామనింద రామస్తుతిగా మారుతుంది! రావణుని ఆత్మస్తుతి స్వనిందగా మారుతుంది!
అద్భుతమైన ఈ శ్లోకాలను వ్రాసిన వారు కర్నూలు జిల్లా ఔకు గ్రామవాసి కీ.శే. బచ్చు సుబ్బరాయగుప్త!
ఆంధ్ర టీకా తాత్పర్యం వ్రాసిన వారు కర్నూలు వాసి అష్టావధాని కీ.శే. పుల్లాపంతుల వేంకట రామ శర్మ!
వాటిని అలాగే పెట్టడానికి ప్రయత్నిస్తా!
(పై వాక్యాలన్నీ శ్రీ కె. శేషఫణి శర్మ గారివి)
1 (_ల)
భూజాతేఽ లసమాన విగ్రహయుతః సీతేహ్యలర్కోపమః
భర్తా తే వికలస్వర స్వవదనో యుద్ధే చలశ్రీవృతః।
నిష్ణాతో లలనానురూప తను సంయుక్తో స్మ్యహం పాలనే
వాక్తే పాప! సదావిలేతి సుజనాః కే న బ్రువంతి క్షితౌ!
........ఉన్నది ఉన్నట్టుగా చూస్తే
రావణోక్తి: రామనింద
అలసమాన విగ్రహయుతః = ప్రకాశించని విగ్రహము కలవాడు
అలర్కోపమః = పిచ్చి కుక్కతో సమానుడు
వికలస్వర స్వవదనః = నోరెత్తి మాటలాడలేనివాడు
చల శ్రీవృతః = సంపద తొలగినవాడు
రావణ ఆత్మస్తుతి:
పాలనే నిష్ణాతః = పాలనా దక్షుడను
లలనానురూప సంయుక్తః = స్త్రీలకు మనోహర సౌందర్యము కలవాడను
సీత ప్రత్యుక్తి.....
అవిలా = ఎప్పుడునూ కలుషమైనది (రావణునిమాట) అని సామాన్యార్థం
విశేషార్థం....
అవిలా = లకార రహితమైనది
....ఇప్పుడు అన్నింటా లకారాన్ని తీసివేసి చూద్దాం...
అసమాన విగ్రహయుతః = సాటి లేని శరీరము కలవాడు
అర్కోపమః = సూర్య సమానుడు
వికస్వర స్వవదనః = ప్రకాశించు కంఠధ్వని కలవాడు
శ్రీవృతశ్చ = సంపద్యుక్తుడు
అని రామస్తుతిగా మారింది
ఇక ల తీసేస్తే రావణుడేమైనడో చూడండి
నానురూప తను సంయుక్తః = అనర్హ శరీర యుతుడను
పానే నిష్ణాతః = మద్య పాన నిరతుడను
అని రావణ ఆత్మస్తుతి ఆత్మనిందగా మారింది.
అద్భుతమైన ఈ శ్లోకాలను వ్రాసిన వారు కర్నూలు జిల్లా ఔకు గ్రామవాసి కీ.శే. బచ్చు సుబ్బరాయగుప్త గారు🙏🏻
ఇంతటి అద్భుతాలు చేసిన కవులున్నారు! అటువంటి వారికి శిరసా నమామి!🙏🏻
🚩🙏🏻👌🏻🙏🏻🚩