వెలుగు...
చీకటి కమ్మిన కుల,మతం
చీలిక పీలిక సమాజ వస్త్రం
చీల్చేస్తున్న వర్గ పోరాటం
చీడ పురుగుల విన్యాసం.
మనిషికో రంగు విషమ్యం
మనిషిని విడదీసిన వైనం
మానవత్వం మంట కలిసే
మానవుడాడే వర్గ నాటకం.
అశ్పృశ్యతకు ఆనవాలు
అక్కడక్కడ అవే దృశ్యాలు
ప్రపంచమంత అదే తీరు
నలుపు,తెలుపు వర్ణాలు.
మనిషి మనిషికి మధ్య తారతమ్యం
భిన్న జాతులుగా విడదీసిన తతంగం
సమాజ స్థితిగతులలో
కానవస్తున్న వికృత లీల.
అంతరించని కుల,మతరక్కసి
వీడదీసే అంతరాల జాడ్యం
మనిషిని మనిషిగా చూడక...
ఎందరో మహానుభావులు అంతరాలు పోవాలని
మానవత్వానికి పట్టం
కట్టాలని...
నవ ప్రపంచం నిర్మించాలని
సమ సమాజం ఏర్పడాలని
అంతరాలు లేని లోకం ఉండాలని..
ఆ కోవలో లోకానికి మార్గదర్శనం చేసిన మహనీయుడు
డా.బి.ఆర్.అంబేద్కర్.
అంబేద్కర్ చూపిన దారిలో
ప్రపంచం పయనించాలని కోరుకుంటూ...
సమత,మమతలతో మానవ జాతివివక్ష తొలగాలి...
మానవత్వమనే
వెలుగు జ్యోతి ప్రకాశించాలి.
అశోక్ చక్రవర్తి.నీలకంఠం.
9391456575.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి