ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
25, సెప్టెంబర్ 2020, శుక్రవారం
మోక్షంఅంటే
మోక్షంఅంటే నిరాకారమైన మహా చైతన్య శక్తి ఒకటి ఉంది అది తెలిస్తేనే గాని, నిత్యమైననటువంటి స్వయంప్రకాశమైనటువంటి సర్వ వ్యాపకమైన నిరాకారమైన మహా చైతన్య శక్తి ఒకటి ఉంది, అని తెలిస్తేనే గాని ఆ అనుభూతి పొందితే గాని, మానవుడు పునర్జన్మ పొందకుండా మోక్షాన్ని లేదా ముక్తిని తెలుసుకుని పరమాత్మలో లీనంఅవలేడు. పరమాత్మ తానని తెలుసుకోవడమే. సాధన అద్వైత సిద్ధాంత చర్చిస్తున్నప్పుడు సాధన అయిపోతుంది. సాధన చేస్తూనే సిద్ధి పొందడం జరుగుతుంది.
ప్రత్యేకంగా అద్వైత వేదాంతం జపాలు పూజలు ఈ సాధనలేం ఉండవు. శంకరులు చెప్పారు కదా పూజలు స్తోత్రాలు కూడా రాశారు అంటే అధికారభేధం వలన, మానవులందరూ కూడ ఒకవిధమైన స్థాయిలో ఉండరు. ఉత్తమ అధికారులకు బ్రహ్మ సూత్రాలు, మధ్య మాధికారులకు ఉపనిషత్తులు, అధమాధికారులకు పూజలు స్తోత్రాలు, జపాలు, తపాలు చేసి కర్మకాండ ఆచరిస్తే అప్పుడు చిత్త శుద్ధి కలిగి నిర్మలమైన అంతఃకరణ తోటి సాకారాన్ని ధ్యానించి నిరాకార స్థితి పొందగలుగుతారు. అంతే తప్ప విగ్రహారాధన వల్ల మోక్షం రాదు. కర్మల వల్ల గానీ, భక్తి వల్లగాని, ఉపాసన వల్ల గానీ, యోగం వల్ల గానీ, ధ్యానం వల్ల గానీ, ఏ విధమైనటువంటి మోక్షము రాదు. ఫలితం వస్తుంది పుణ్యం వస్తుంది. "క్షీణే పుణ్యేమత్యలోకం వినశ్యంతి "అనేది వేదం
ఆ పుణ్యఫలం వల్ల మహారాజ వంశంలో పుడతాడు భోగాలు అనుభవిస్తాడు. పుణ్యం పూర్తవగానే మళ్ళీ జన్మ ఎత్తుతాడు.
జనన మరణ చక్రం నుండి తప్పించుకోలేడు. జ్ఞానంవల్లే మోక్షం సిద్ధిస్తుందని భగవద్గీత లో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. సాధన చేసి జ్ఞానం వల్ల ఆత్మ జ్ఞానం పొందాలి. తానే పరమాత్మని గుర్తించడం గమ్యం
మనిషి స్తూలదేహం పోతుంది. కానీ నేను అనే దేహం పోతుంది. నేను అనే జ్ఞానం సూక్ష్మ శరీరంతో పాటు ఆ వాసనలు తీసుకుంటుంది. ఇక్కడ స్తూలశరీరంలో జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు అనే ఏకాదశ ఇంద్రియం కల్సి ఉంటుంది
కోట్లాది జన్మజన్మల నుంచి వస్తున్నదే వాసనలు ఆ వాసనలు అన్నీ గట్టిపడి పోయి వృత్తులుగా ఏర్పడాతాయి. చనిపోయిన పోయిన తర్వాత సూక్ష్మ దేహం పొంది ఆ వాసనలతోటి కర్మలను అనుసరించి ఇంకో జన్మ ఎత్తడానికి మరో చొక్కా తొడుక్కోవడానికి మరో జన్మ ఎత్తుతుంది. ఆ వాసనలు కూడా పోతే లింగ శరీరం పొందుతుంది.దాన్నే కారణ శరీరం అన్నారు. కారణ శరీరంలో అహంకారం ఒక్కటే ఉంటుంది. అదీ కూడా పోయి విశ్వచైతన్యంలో కలిసిపోతుంది.అప్పుడు జీవాత్మ తన ఉనికిని కోల్పోయి పరమాత్మ అయిపోతుంది. అప్పుడు భిన్నత్వం అనేది ఉండదు అంతా ఏకత్వం అయిపోతుంది అదీ మోక్ష స్థితి.
ఓం శ్రీ మాత్రే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే 🙏🙏.
ఓం నమస్తే సర్వలోకానాం జననీమబ్దిసంభవాం ౹
శ్రియమున్నిద్రపద్మాక్షీం విష్ణువక్షస్స్ధలస్ధితామ్ ౹౹
త్వం సిధ్ధిస్త్వం స్వధా స్వాహా సుధా త్వం లోకపావనీ ౹
సంధ్యా రాత్రిః ప్రభా మూర్తిః మేధా శ్రధ్ధా సరస్వతీ ౹౹
యజ్ఞవిద్యా మహావిద్యా గుహ్యవిద్యా చ శోభనే ౹
ఆత్మవిద్యా చ దేవి త్వం విముక్తి ఫలదాయినీ ౹౹
ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీమ్ ౹
దాసీభూతసమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ ౹
శ్రీమన్మన్దకటాక్షలబ్ద విభవ బ్రహ్మేంద్రగజ్ఞ్గాధరాం ౹
త్వాం త్ర్యైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ ౹
సిధ్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ ౹
శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా ౹౹
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే ౹
శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ౹౹
ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహీ
తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ౹౹🙏🙏
ఓం నమస్తే సర్వలోకానాం జననీమబ్దిసంభవాం ౹
శ్రియమున్నిద్రపద్మాక్షీం విష్ణువక్షస్స్ధలస్ధితామ్ ౹౹
త్వం సిధ్ధిస్త్వం స్వధా స్వాహా సుధా త్వం లోకపావనీ ౹
సంధ్యా రాత్రిః ప్రభా మూర్తిః మేధా శ్రధ్ధా సరస్వతీ ౹౹
యజ్ఞవిద్యా మహావిద్యా గుహ్యవిద్యా చ శోభనే ౹
ఆత్మవిద్యా చ దేవి త్వం విముక్తి ఫలదాయినీ ౹౹
ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీమ్ ౹
దాసీభూతసమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ ౹
శ్రీమన్మన్దకటాక్షలబ్ద విభవ బ్రహ్మేంద్రగజ్ఞ్గాధరాం ౹
త్వాం త్ర్యైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ ౹
సిధ్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ ౹
శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా ౹౹
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే ౹
శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ౹౹
ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహీ
తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ౹౹🙏🙏
మాణిక్యవీణా ముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసమ్!
మహేంద్ర నీలద్యుతికోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి
శుక్ర గ్రహ ప్రార్ధన.
హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం !!
సర్వేజనా సుఖినోభవంతు. సమస్త సన్మంగళానిసంతు.
ఓం శాంతిః శాంతిః శాంతిః.
Important Msg for all
The hot water you drink is good for your throat. But this corona virus is hidden behind the paranasal sinus of your nose for 3 to 4 days. This hot water we drink does not reach there. After 4 to 5 days this virus that was hidden behind the paranasal sinus of the nose reaches your lungs. Then you have trouble breathing.
That's why it is very important to take steam, which reaches the back of your paranasal sinus. You have to kill this virus in the nose with steam.
At 40°C, this virus becomes disabled i.e. paralyzed. At 60°C this virus becomes so weak that any human immunity system can fight against it. At 70°C this virus dies completely.
This is what steam talks about, this is what our entire health department knows. But everyone wants to take advantage of this corona.
One who stays at home should take steam once a day. If you go to the market to buy vegetables, take it twice. Anyone who meets some people or goes to office should take steam 3 times.
Forward to your dear and near ones☘
*దేవగణం మధ్యలో గాన గంధర్వుడు*
ఇంద్రుడు శుక్రవారం స్వర్గంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు ఊహించని అతిధి వస్తున్నారని.
అలసిపోయిన ఆ గొంతుకు ఇక్కడ అమృతo ఇచ్చి, ఆహ్లాద పరచాలని, భూమండలం మీద బంధాలను తెంచుకొని వస్తున్న విశిష్ట అతిథికి గౌరవ సూచకంగా గానా బజానా ఏర్పాటు చేయాలని ఇంద్రుడు సహచరులకు ఆదేశాలు జారీ చేశారు.
ఎవర్రా ఆ విశిష్ట అతిధి అంటూ అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు.
కరెక్ట్ గా 1 గంట 4 నిమిషాలకు పుష్పక విమానం ఇంద్రలోకం వచ్చింది. అందులో నుంచి ఓ వ్యక్తి మైకు, పుస్తకం చేతపట్టుకొని కిందకు దిగడం కనిపించింది. తెలుగుదనం ఉట్టి పడేలా ఎప్పుడు నిండుగా కనిపించే ఆ వ్యక్తి 53 రోజులుగా ఆసుపత్రిలో బక్కచిక్కి పోవడంతో చాలామంది పోల్చుకోలేక పోయారు.
అయితే అప్పటికే సభలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ లు సుసర్ల దక్షిణామూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు, సాలూరు రాజేశ్వరరావు, కోదండపాణి, మరో గాన గంధర్వుడు ఘంటసాల, గేయ రచయితలు ఆరుద్ర, ఆత్రేయ, శ్రీ శ్రీ, వేటూరి వంటి వారు ఎస్పీ బాలసుబ్రమణ్యం ను గుర్తుపట్టారు.
ఆప్యాయంగా పలకరించి 50 ఏళ్ల నాటి గతాలను గుర్తు చేసుకున్నారు. మమ్మల్ని కలవడానికి ఇన్నాళ్లకు నీకు తీరిక అయ్యిందా అంటూ ఆట పట్టించారు.
ఇది ఇలా ఉండగా సభలో తెలుగు మాటలు వినబడడం తో సేద తీరుతున్న ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, శ్రీదేవి వంటి అందాల నటులు వచ్చారు. ముందుగా ఏం బ్రదర్ ఎలా ఉన్నారు, తెలుగు ప్రజలు ఏమంటున్నారు, అంటూ ఎన్టీఆర్ ఆలింగనం చేసుకున్నారు. వేటగాడు పాటలు మళ్లీ సభలో వినిపించాయి.
ఏం బాలసుబ్రమణ్యం ఏమయింది ఇలా వచ్చారు అంటూ అక్కినేని పలకరించారు వందనం అభివందనం నీ పాటకే అభివందనం సాంగ్ సభలో వినిపించింది.
అందుకు తగ్గట్లు రంభ, ఊర్వశి మేనకలు స్టెప్పులతో మైమరిపించారు.
ఇది ఇలా ఉండగా సభలోకి సర్దార్ పాపారాయుడు దాసరి నారాయణరావు వచ్చారు. ఏం బాలు గారు మీరు వచ్చారా, అక్కడ తెలుగు పాటకు రిపేర్ ఎవరు చేస్తారు అని ప్రశ్నించారు.
మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బాలుని కలవడానికి కేంద్రం నుంచి కొంతమంది వస్తున్నారని ఇంద్రుడికు కబురు వచ్చింది. దీంతో ద్వారపాలకులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
సుమారు 5 గంటలకు మాజీ రాష్ట్రపతులు అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీ , మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ, వాజ్పేయిలను బాలుకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా బాలు తాను కేంద్రం నుంచి మీ చేతుల మీదుగా ఎన్నో పురస్కారాలు అందుకున్నానని గతాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా బాలు తన డిక్షనరీలో నుంచి కొన్ని పాటలు పాడి వినిపించారు.
బాలు గొంతు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబులా ఉండడంతో ఇంద్రుడుతో పాటు కొలువుదీరిన వారు ఆశ్చర్య పోయారు.
ఇక సభలో ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకు స్వరాభిషేకం, పాడుతా తీయగా వంటి కార్యక్రమాలు ఉంటాయని దేవేంద్రుడు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద బాలు మొదటిరోజు స్వర్గ యాత్ర బిజీబిజీగా సాగింది.
బాలుగారు తన భూలోక ప్రేక్షక స్రవంతిని వదిలి యిక దేవదేవుల హృదయాలను కొల్లగొట్టడానికి ఉపక్రమించినట్టే
ఆ స్వర్గ సంతోషాలను చవిచూడడానికి వారికి యిప్పుడే ఆస్కారం దొరికింది. అందువలననే వారు స్వర్గస్తులయ్యారు.
వారి జీవన ప్రయాణంలో మరో ఘట్టం ఈ స్వర్గారోహణ. తన సుస్వరాలతో వారందరిని మైమరపింప జేయగలరని నేను ఆశిస్తున్నాను.
*యిక ఈ స్వర్గవినోదాలు చవి చూసినవారికి ఈ భూప్రపంచం గుర్తుండదేమో మరి*
ఎందుకుంటే యిప్పటికి దాకా అటువైపు వెళ్ళిన వారెవరు మళ్ళీ యిటువైపు వచ్చినట్టు దాఖలాలు లేవు కదా.
సేకరణ
ప్రార్థన చివరిలోనయిన మనం ‘ ఓం శాంతి శాంతి శ్శాంతి: ‘ అని మూడుసార్లు ఉచ్చరిస్తుంటాం
మంత్రం చివరిలో ‘ ఓం శాంతి శాంతి శ్శాంతి: ‘ అని అంటారు ఎందుకు? 🕉️
ఏ ప్రార్థన చివరిలోనయిన మనం
‘ ఓం శాంతి శాంతి శ్శాంతి: ‘ అని మూడుసార్లు ఉచ్చరిస్తుంటాం.
ఆ విధంగా మూడుసార్లు అనడంద్వారా మూడు రకాలయినటువంటి తాపాలు (బాధలు) తొలగాలని భగవంతుడిని ప్రార్థించడమన్నమాట.
ఓం శాంతి: (ఆధ్యాత్మిక తాపం చలారుగాక)
ఓం శాంతి: (అధి భౌతిక తాపం చల్లరుగాక)
ఓం శాంతి: (అధివైవిక తాపం చల్లరుగాక)
1. ఆధ్యాత్మిక తాపం అంటె, శరీరానికి సంబంధించి నటువంటి వివిధ రకాలయిన రుగ్మతలు (రోగాలు మొదలైనవి) తొలగాలని
2. అధి భౌతిక తాపం అంటే, దొంగలు మొదలైన వారివల్ల కలిగే బాధలు, ప్రమాదాలు తొలగాలని.
3. అధి దైవికతాపం అంటే, దైవవశంవల్ల కలిగే బాధలు – యక్షులు, రాక్షసులు మొదలైనవారివల్ల కలిగే ఊహకు కూడా అందని బాధలు – ప్రమాదాలు మొదలైనవి తొలగాలని ప్రార్థించడమన్నమాట.
‘ఓం శాంతి శ్శాంతి శ్శాంతి:’ అని మూడుసార్లు చెప్పడంలో ఇంత అర్థం దాగివుంది.
సనాతన_హిందూ_ధర్మం
ఆచమనం
పూజలు, వ్రతాల్లో ''ఆచమనం'' అనే మాట
చాలా సార్లు వింటాం.
కానీ ఆ పదానికి అర్ధం చాలామందికి సరిగా తెలీదు.
అందుకే ''ఆచమనం'' అంటే ఏమిటో,
దాని వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
"ఆచమనం" అనే ఆచారం అపరిమితమైనది.
ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత,పూజకు ముందు, సంధ్యావందనం చేసే సమయంలో పలుసార్లు,
భోజనానికి ముందు, తర్వాత,
బయటకు ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత
ముఖం, కాళ్ళూ చేతులూ కడుక్కున్న తర్వాత
ఆచమనం చేయొచ్చు.
ఆచమనం చేసే వ్యక్తి శుచిగా,శుభ్రంగా ఉండాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉద్ధరణి చొప్పున మంత్రయుక్తంగా మూడుసార్లు చేతిలో నీరు పోసుకుని తాగాలి.
ఆచమనం గురించి సంస్కృతంలో ''గోకర్ణాకృతి హస్తేన మాషమగ్నజలం పిబేత్'' అని వర్ణించారు.
అంటే, కుడి అరచేతిని ఆవు చెవి ఆకారంలో ఉంచి, ఇందులో మూడు ఉద్ధరణిల నీటిని
(ఒక మినపగింజమునిగేంత పరిమాణంలో నీళ్ళు)
పోసి, వాటిని తాగాలి.
చేతిలో పోసేనీళ్ళు అంతకంటే ఎక్కువ కానీ,
తక్కువ కానీ ఉండకూడదు. నీరు కొలత అంతే ఉండాలి.
ఆచమనం ఎన్నిసార్లు అయినా చేయొచ్చు అని చెప్తున్నారు.. బాగానే ఉంది.
1.అసలు ఆచమనం ఎందుకు చేయాలి?
2.నీటిని అరచేతిలో పోసుకుని తాగడం వల్ల ప్రయోజనం ఏమిటి?
3.అలా ఎందుకు తాగాలి?
4.ఉద్ధరణితో తిన్నగా నోట్లో పోసుకుని ఎందుకు తాగకూడదు?
5.మూడు ఉద్ధరణిల నీరు మాత్రమే ఎందుకు తీసుకోవాలి?
6. నీరు కొంతఎక్కువో తక్కువో అయితే ఏమవుతుంది? 7.“కేశవాయ స్వాహా,నారాయణాయ స్వాహా,
మాధవాయ స్వాహా...” అని మాత్రమేఎందుకు చెప్పాలి?
ఇలాంటి సందేహాలు కలగడం సహజం.
అందుకే ఆచమనం చేయడంలో పరమార్థం ఏమిటో విపులంగా తెలుసుకుందాం.
మన గొంతు ముందు భాగం లోంచి శబ్దాలు వస్తాయి.
దీన్ని స్వరపేటిక అంటాం.
దీనిచుట్టూ కార్టిలేజ్ కవచం ఉంటుంది కనుక
కొంత వరకూ రక్షణ లభిస్తుంది.
అయినప్పటికీ, ఇది ఎంత అద్భుతమైనదో,
అంత సున్నితమైనది.
ఈ గొంతు స్థానంలో చిన్నదెబ్బ తగిలినా ప్రమాదం. స్వరపేటిక దెబ్బతిని మాట పడిపోవచ్చు,
ఒక్కోసారి ప్రాణమే పోవచ్చు.
స్వరపేటిక లోపలి భాగంలో ధ్వని ఉత్పాదక పొరలు ఉంటాయి.
ఇవి ఇంగ్లీషు అక్షరం 'V' ఆకారంలో పరస్పరం కలిసిపోయి ఉంటాయి.
ఈ తంత్రులు సూక్ష్మంగా ఉండి,ఎపెక్స్ ముందుభాగంలో పాతుకుని ఉంటాయి.
స్వరపేటిక కవాటాలు పల్చటి మాంసపు పొరతో ముడిపడి ఉంటాయి.
ఈ శరీర నిర్మాణం గురించి చెప్పుకోవడం ఎందుకంటే, మన భావవ్యక్తీకరణకు కారకమైన స్వరపేటిక మహా సున్నితమైనది. ముక్కు,నోరు, నాలుక, పెదవులు, పళ్ళు, గొంతు నాళాలు, అంగిలి, కొండనాలుక,గొంతు లోపలి భాగం, శ్వాస నాళం, అన్ననాళం, స్వర తంత్రులు, వాటిచుట్టూ ఉన్న ప్రదేశం ఇవన్నీ ఎంతో నాజూకైనవి. వీటికి బలం కలిగించడమే ఆచమనం పరమోద్దేశం.
ఆచమనంలో మూడు ఉద్ధరణిల నీరు మాత్రమే తాగాలి అనిచెప్పుకున్నాం కదా!
గొంతులోంచి శబ్దం వెలువడేటప్పుడు అక్కడున్న గాలి బయటికొస్తుంది.
ఇలా లోపలి నుండి గాలి బయటకు వస్తున్నప్పుడు అందులో వేగం ఉండకూడదు.
శబ్దం సులువుగా, స్పష్టంగా రావాలి.
ఇలా కొన్నినీటిని జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని,
అంతే జాగ్రత్తగా మెల్లగాతాగడం అనే అలవాటు వల్ల మనం చేసే ప్రతి పనిలో శ్రద్ధ,జాగ్రత్త అలవడుతుంది.
రోజులో ఆచమనం పేరుతొ అనేకసార్లు మెల్లగా నీరు తాగడంవల్ల గొంతు, ఇతర అవయవాలు వ్యాయామం చేసినట్లు అవుతుంది.
“కేశవాయ స్వాహా" అన్నప్పుడు అది గొంతునుండి వెలువడుతుంది.
నారాయణాయ స్వాహా" అనే మంత్రం నాలుక సాయంతో బయటకు వస్తుంది.
చివరిగా "మాధవాయ స్వాహా" అనే మంత్రం పెదవుల సాయంతో వెలువడుతుంది.
ఆచమనం అనే ఆచారాన్ని పాటించి ఈ మంత్రాలను ఉచ్చరించడం వల్ల గొంతు,నాలుక, పెదాలకు
వ్యాయామం లభిస్తుంది.
పైగా ఇవి పరమాత్ముని నామాలు కనుక,
భక్తిభావంతో ఉచ్చరించడం వల్లమేలు జరుగుతుంది.
ఇక ఉద్ధరణితో తిన్నగా ఎందుకు తాగకూడదు,
చేతిలో వేసుకునే ఎందుకు తాగాలి అంటే,
మన చేతుల్లో కొంతవిద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. చేతిలో నీళ్ళు వేసుకుని తాగడం వల్ల ఆ నీరు విద్యుత్తును పీల్చుకుని నోటి ద్వారా శరీరంలోనికి ప్రవేశిస్తుంది.
అక్కడ ఉన్న విద్యుత్తుతో కలిసిశరీరం అంతా సమానత్వం ఉండేలా, సమ ధాతువుగా ఉండేలా చేస్తుంది.
ఒక ఉద్ధరణి చొప్పున కొద్దికొద్దిగా నీరు సేవించడం వల్ల ఆకొద్దిపాటి విద్యుత్తు పెదాలు మొదలు నాలుక, గొంతు,పెగుల వరకూ ఉన్న సున్నితమైన అవయవాలను ఉత్తేజ పరుస్తాయి.
ఈ ప్రయోజనాలే కాకుండా ఒక పవిత్ర ఆచారంగా భావిస్తూ రోజులో అనేకసార్లు పాటించడం వల్ల మనసు దానిమీద కేంద్రీకృతమై,లేనిపోని బాధలు, భయాలు తొలగుతాయి.
ఏదో అలవాటుగా పాటించే ఆచారాల వెనుక ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శాస్త్రీయత ఉంది.🙏
*సేకరణ*
ఆనందం పొందాలి అంటే వృత్తులను ఆపివేయాలి.
ఆనందం పొందాలి అంటే వృత్తులను ఆపివేయాలి. చేతనని మేలుకొలపాలి. వస్తువులపై ఆకర్షితులు అవకూడదు. ఆసక్తి పెంచుకోకూడదు. ఆసక్తి ఏర్పడడానికి ముందే మేలుకోవడం అవసరం. ఒకవేళ సుఖం ఉంది అనుకుంటే, అది ప్రారంభమౌతుంది, ముగుస్తుంది. ఒకవేళ అది వున్నా కూడా దాని ఆఖరి పరిణామం దుఃఖమే అవుతుంది. ఈ విషయం తెలుసుకున్నవారు సుఖం ఒక్క క్షణం కూడా దొరకదు అని అంటారు
కోరికని పూర్తిగా వదలి వేయడం కానీ, కోరికని ఆపివేయడం కానీ, సమస్యకి పరిష్కారం కాదు. కామ క్రోధాల వేగానికి అతీతంగా ఉండాలి. ఆ రెండింటి విషయం లో అనాసక్తుడై ఉండాలి.
మీరు, ముందు కొంచెం ఆనందం లభిస్తే, అప్పుడు లోపలికి వెడతాము అని అంటే, అలా ఎప్పటికి జరగదు. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఒక్క క్షణం కళ్ళుమూసుకోండి. ఒక్క క్షణం లోపలికి వెడుతున్నాను అనే ఆలోచన కలిగి ఉండండి. బాహ్యాన్ని మరచిపోండి. అలా మరచిపోవడం అలవాటు చేసుకోవాలి. కారులో, బస్సులో, రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆఫీసులో ఉన్నప్పుడు ఓ పది, ఇరవై సార్లు అలా బాహ్యాన్ని మరచిపోయి కళ్ళు మూసుకుని ఉండండి. నేను ఒక్కడినే వున్నాను అనుకోండి. మీ శ్వాసను, గుండె చప్పుడుని గమనిస్తూ ఉండండి. లోపలికి ప్రవేశించండి. యోగము అంటే అర్థం నీతో నీవు జోడింపబడడమే.
**అనంత వాసుదేవ ఆలయం**
*దశిక రాము**
**మన సంస్కృతి సాంప్రదాయాలు**
అనంత వాసుదేవ ఆలయం శ్రీకృష్ణునికి అంకితమైన ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఈ దేవాలయం శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు ప్రధాన దైవంగా గలది. ఇది భారతదేశంలోని ఒడిషా రాష్ట్రం నందలి భువనేశ్వర్ లో కలదు. ఈ దేవాలయం 13వ శతాబ్దంలో నిర్మించబడినది. ఈ దేవాలయంలో ప్రధానంగా శ్రీకృష్ణుడు, బలరాముడు మరియు సుభద్ర అనే దేవతలను ప్రదానంగా కొలుస్తారు. ఈ దేవాలయంలో దేవతలైన బలరాముడు ఏడు పడగలు గల సర్పం క్రింద నిలుచుంటాడు. సుభద్ర రత్నాల కుండ మరియు తామరపువ్వు లను ఇరు చేతులతో కలిగి యుండి. ఎడమ పాదాన్ని వేరొక రత్నాల కుండపై ఉంచేటట్లుంటుంది. శ్రీకృష్ణుడు గద ను , చక్రాన్ని, కమలాన్ని మరియు శంఖాన్ని కలిగియుండేటట్లుంటుంది. ఈ దేవాలయం "భానుదేవుని" పరిపాలనా కాలంలో "అనంగాభిమ III" యొక్క కుమార్తె అయిన చంద్రికాదేవి కాలంలో నిర్మితమైనది.
* ఇతిహాసం
ఈ దేవాలయం 13 వ శతాబ్దంలో కట్టబడినది. దీనికి పూర్వం ఈ ప్రాంతంలో నిజమైన విష్ణువు చిత్రాన్ని కొలిచేవారు. "తూర్పు గంగా రాజ్యం" యొక్క రాణి అయిన చంద్రిక ఈ స్థానంలో కొత్త దేవాలయం కట్టుటకు నిశ్చయించుకుంది. అదే ప్రదేశంలో అనంత వాసుదేవ ఆలయాన్న్ని నిర్మించింది. ఈ ప్రాంతంలో విష్ణుమూర్తి చిత్రంతో కూడిన పాత దేవాలయం తప్పనిసరిగా ఉంటుంది. "మహానది" వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించిన "మరాఠాలు" 17 వ శతాబ్దం చివరలో భువనేశ్వర్ లో వైష్ణవాలయం పునరుద్ధరణకు బాధ్యత వహించారు.
* నిర్మాణం
రూపంలో ఈ దేవాలయం లింగరాజ ఆలయం తో పోలి ఉంటుంది. కానీ ఇది వైష్ణవ శిల్పాలను కలిగి ఉంటుంది. ఈ ఆలయం, సూక్ష్మ రేఖాంశ పట్టీలను కలిగిన శిఖరాలు (విగ్రహాలు) ఖచ్చితంగా లింగరాజ ఆలయం వలెనే కలిగి ఉంటుంది. కానీ శిఖరాల సంఖ్య ఒక రేఖాంశపట్టీ కి మూడు చొప్పిన కలిగి ఉంటుంది. ఈ దేవాలయ భాహ్య గోడలపై గల శిల్పాలు భువనేశ్వర్ లో గల ప్రతి దేవాలయం వలెనే లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ దేవాలయంలో స్త్రీ శిల్పాలు మితిమీరిన ఆభరణాలు కలిగి యున్నందున వాస్తవికత కనిపించదు.
* జగన్నాథ దేవాలయం, పూరి తో గల తేడాలు
ఈ దేవాలయంలో గల "గర్భగృహం" లో గల విగ్రహాలు పూర్తిగా తయారైనవి. అవి పూరీ లోని జగన్నాధ దేవాలయంలోని విగ్రహాలకు భిన్నంగా ఉంటాయి. ఇచట శ్రీమూర్తులు (విగ్రహాలు)పూరీ దేవాలయంలో వలెనే చెక్కతో కాకుండా నలుపు గ్రానైట్ శిలల నుండి తయారుచేశారు.ఈ దేవాలయం మూలంగా ఈ పట్టణానికి "చక్ర క్షేత్రం" (వృత్తాకార స్థలం) గా పిలువబడుతుంది. పూరీ లో గల దేవాలయం "శంఖ క్షేత్రము" (వక్రాకార స్థలం) గా పిలువబడుతుంది.
🙏🙏🙏
సేకరణ
**ధర్మము-సంస్కృతి*
మధుర గాయకులు
మధుర గాయకులు శ్రీ బాలు గారి కి నివాళులర్పిస్తుంది తెలుగు కవులు
S.P.బాలసుభ్రమణ్యం ఇంకా లేరనెది తెలుగు సినిమా పరిశ్రమ జీర్ణీంచుకౌలేక పోతున్నది
మధుర గాయకులు శ్రీ బాలు గారి కి నివాళులర్పిస్తుంది తెలుగు కవులు బ్లాగు
(శ్రీ లలితా సహస్ర నామములలో 679వ నామము.)
ఓం బృహత్ సేనాయై నమః.🙏
శా. శ్రీమన్మంజుల వేద శాస్త్రములునాచిద్బోధనా గ్రంథముల్,
నీమంబొప్పగ నీకు సేన. మదిలోనే నిల్చు యీ దుష్టులౌ
కామాది ప్రతివీర శత్రువులనే ఖండింప నీవుంటివే.
శ్రీ మన్మంగళ కార్య శోభిత! బృహత్ సేనా! కృపన్ గావుమా.🙏
అమ్మ పాదములకు కైమోడ్పులతో🙏
చింతా రామకృష్ణారావు.
హాత్ సే కామ్ మన్ మే రామ్"
*జైశ్రీరామ్*
"
🌺🌺🌺🌺🌺🌺🌺🌺 *సుభాషితం*
" మా నిషాద ప్రతిష్టాం
త్వమగమః శాశ్వతీః సమాః |
యత్ క్రౌంచ మిధునా దేక
మవధీః కామ మోహితమ్"||
(వాల్మీకి మహర్షి)
*భావం*
ప్రపంచ భాష లన్నిటికి తల్లిఅయిన సంస్క్రుత భాషలో *వాల్మీకిమహర్షి* నోటినుండి యాదృచికంగా వెలువడిన మొట్టమొదటి శ్లోకం. ఇది సంస్కృత సాహిత్యంలో మొదటి శ్లోకం.ఈ శ్లోకం *అనుష్ఠప్* చందస్సు లో ఉంటుంది. మొత్తం వాల్మీకి రామాయణంలో ఉన్న 24000 శ్లోకాలు కూడా ఇదే ఛందస్సులో ఉంటాయి.
కామమోహితమైన క్రౌంచ పక్షుల జంటలో ఒక పక్ఛిని బోయవాడు తన బాణంతో కొట్టి చంపినపుడు ఆగ్రహంతో మహర్షి వాల్మీకి అన్న మాటలివి.
ఓరీ! కామపరవశమై ఉన్న క్రౌంచ మిధునంలోని ఒక పక్ఛిని నిష్కారణంగా చంపావుకదరా. ఇంత ఘోరానికి ఒడిగట్టిన నువ్వు కూడా ఇక ఎక్కువ కాలం జీవించవు.
*అమృతవచనం*
*భరతవర్షం*
*ఇస్కాన్* సంస్థకి చెందిన పూజ్య *శ్రీ నితాయి సేవిని మాతాజీ* వారు ఒక సందర్భంలో భరతవర్షం గురించి మాట్లాడిన విషయం మీకు అందిస్తున్నాను.
*భరతవర్షం* అంటే చాలామంది *ఇండియా* అనుకుంటారు, కాదు భరతవర్షం అంటే మొత్తం ప్రపంచం.ఒకప్పుడు *యుధిష్ఠిరుడు* (ధర్మరాజు) *హస్తినాపురం* రాజధానిగా చేసుకుని మొత్తం ప్రపంచాన్ని పరిపాలించాడు. ఇండియా అన్ని దేశాలకు నాయకుని (leader) వంటిది. అందరూ మన దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం (developing country) గా చెబుతూ ఉంటారు. కాని మనదేశం ఎప్పుడో చాలా అభివృద్ధి చెందింది. చాలామంది అనేక చోట్లనుంచి వచ్చి భారత్ మీద దాడులు చేసి ఆక్రమించుకున్నారు. ఎందుకని ప్రపంచ దేశాలన్నీ భారత్ నే ఆక్రమణకు ఎంచుకున్నాయంటే ఇక్కడ ఉన్న సంపద ఎక్కడా లేదు కాబట్టే.
*సోమనాథ్* దేవాలయాన్ని 11 వ శతాబ్దంలో *గజనీ* వెండి, బంగారాలు ఎంత దోచుకుని తరలించినా అవి తరగలేదు. సోమనాథ్ దేవాలయ ప్రధాన ద్వారాలన్ని పూర్తిగా బంగారంతో చేసినవి.
కేరళలోని *అనంతపద్మనాభ* *స్వామి* వారి ఆలయంలో ఎంత సంపదవుందో అది లెక్కించటం కూడా ఎవరితరం కాదు,అంతు చిక్కని సంపద ఉంది.అందరూ దోచుకుని పోగా ఇంకా ఎంతో మిగిలిఉంది.కేరళలో ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని ఎలా కాజెయ్యాలా అని చూస్తోంది.
భారత్ ఎంతో ధనిక దేశం.ఖనిజాలు, రత్నాలు అన్నీ భారత్ నుంచే ఎగుమతి అయ్యేవి. కట్టుకునే బట్టలు మనమే ఎగుమతి చేసేవాళ్ళం.
పూర్వం మీద ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా ఉంది అని అంటారు. 800,900 మంది ఎక్కే *జంబోజెట్* విమానాలు తయారు చేసారు అని చెబుతారు. కాని ఆరోజుల్లో *కశ్యపముని* తన భార్యకోసం ఊరంత విమానాన్ని తయారుచేసాడు. అందులో లభ్యం కానిదంటూ ఏమీ ఉండదు. షాపింగ్ మాల్స్ కూడా అందులో ఉండేవి.
ఆ రోజుల్లో కూడా *ప్లాస్టిక్*సర్జరీ* చేసేవారు. ప్రపంచంలో 2500 సంవత్సరాలకు పూర్వం మొట్టమొదటి శస్త్రచికిత్స చేసినది *సుశ్రృతుడు* .
సుశ్రుతుని గురువు
*ధన్వంతరి* .ఈయన వైద్య పితామహుడు.
మనది డెవలప్డు కంట్రీ అల్లా ఇప్పుడు డెవలపింగ్ కంట్రీ గా మారిపోయింది. *చరకుడు* , *ధన్వంతరి* , *సుశృతుడు* వైద్యరంగంలో కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే అద్భుతమైన ఆవిష్కరణలు చేశారు.
భూమి గుండ్రంగా ఉంటుందని *కోపర్నికస్* , *గెలీలియోలు* మొదటగా చెప్పారు అంటారు. వీరు ఈమధ్య కాలంలోవారే 16,17 శతాబ్దాలకు చెందినవారు. కాని వేల సంవత్సరాలకు పూర్వం ఋగ్వేదంలో "చక్రాణాసః పరీణహం పృధివ్యా" అనివుంది. అంటే గుండ్రంగా ఉన్న భూమి అంచున మానవులు ఉన్నారు అని అర్ధం.
బ్రహ్మాడం మధ్యలో భూగోళం ఆకాశంలో నిలచిఉన్నది అని *ఆర్యభట్టు* 5 వ శతాబ్దంలో చెప్పాడు. దీనిని ఆధారం చేసుకునే అరబిక్ ఖగోళశాస్త్రం పట్టికలు ఏర్పాటు చేసుకున్నారు.
*భూమాకర్షణశక్తి* (law of gravitation) కనుగొన్నది *న్యూటన్* అంటారు. అతను 17 వ శతాబ్దం (1643-1727) వాడు. కానీ *వరాహమిహిరుడు* 6 వ శతాబ్దం ప్రారంభంలో 505 లో *పంచసిద్ధాంతి* అనే గ్రంధంలో ఈ విషయం వ్రాసాడు.
*ఆస్ట్రేలియా* అని పిలువబడే దేశం అసలుపేరు *అస్త్రాలయా* . అంటే పాండవులు వాళ్ళ అస్త్రాల నన్నిటిని అక్కడ పెట్టారు.
*మారిషస్* అంటున్నాము అక్కడ *మారీచుడు* ఉండేవాడు. మారీచ,సుబాహువులు సూర్పణక కుమారులు. గొప్ప బలవంతులు.ఇద్దరూ కూడా రాముని చేతిలో మరణిస్తారు.
*ఆఫ్రికాఖండం* అసలుపేరు *కుషినగర్* . రాముని కుమారులు కుశ, లవులలో కుశుడు అక్కడ నివసించేవాడు.
జర్మనీదేశ నియంత *హిట్లర్* యొక్క సైనిక గుర్తు *స్వస్తిక్* .
*రష్యా* అనేది *ఋషులు* ఉండే ప్రదేశం. అక్కడ బహుసీతలంగా ఉంటుంది.అక్కడ వారి అనుష్ఠానానికి ఆటంకాలు ఉండవని ఋషులు అక్కడ ఉండేవారు. *ఋషియా* రష్యాగా మారింది.
*కుతుబ్ *మినార్* అసలుపేరు *విష్ణుద్వజం* . ఢిల్లీలోని కుతుబ్ మినార్ వాస్తవానికి 2300 సంవత్సరాలకు పూర్వం *సముద్రగుప్తుడు* నిర్మించిన నక్ఛత్ర వేదశాల యొక్క ధ్వజస్తంభం అని చరిత్రకారులు చెబుతున్నారు.
సంస్క్రతభాష అన్ని భాషలకు తల్లి. అన్ని భాషల్లోనూ గమనిస్తే సంస్కృత ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. Hand అనేది హస్తం నుంచి, Mind అనేది మన (మనసు) నుంచి, Simha అనేది సింహ నుంచి, Man అనేది మనుష్య నుంచి వచ్చాయి. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ప్రపంచమంతా ధర్మరాజు పరిపాలించాడు.ఎటువంటి వివక్ఛ లేకుండా ప్రజలందరినీ కన్నబిడ్డల్లా చూసేవాడు.ప్రజలు అన్నిచోట్లా వేదధర్మాన్ని పాటించేవారు. *మలేషియాలో* అనేక రామాలయాలు ఉన్నాయి. అక్కడ రాజులపేర్లు రామ్-1, రామ్-2 అలా ఉంటాయి.
ముస్లిందేశం *ఇండోనేషియా* ఐర్లైన్సు పేరు *గరుడ*(విష్ణుమూర్తి వాహనం).
16' ఎత్తుఉన్న చదువులతల్లి *సరస్వతి* అమ్మవారి విగ్రహాన్ని ఇండోనేషియా అమెరికాకు బహూకరించింది. రాజధాని వాషింగ్టన్ డి సి లో ఆ విగ్రహాన్ని పెట్టారు.
వీటన్నింటినీ బట్టి చూస్తే ప్రపంచమంతా భారతీయ సంస్కృతి,వేదధర్మం ఉండేవని అర్ధమవుతోంది. భరతవర్ష అంటే కేవలం ఇండియా కాదు అన్నది సుస్పష్టం.
ఆయుర్దాయ నిర్ణయం⏳
ప్రాచీన జ్యోతిష రచయితలు అష్టక వర్గాయువు, జీవ శర్మాయువు , పిండాయువు, నైసర్గికాయువు, అంశాయువు వంటి అనేక రకములైన ఆయుర్దాయములను తెలియజేసారు.
ప్రాచీన జ్యోతిష గ్రంథాలలో షుమారు 32 పద్దతులు చెప్పబడ్డాయి.
"ప్రాచీన ప్రామాణికులు వీటిలో ఏ పద్దతులు ఖచ్చితమైనవో, సర్వత్రా అంగీకరింపబడగలవో తెల్పియుండలేదు."
విధేయతతో కూడిన అభి ప్రాయము ప్రకారము
గణిత విధానముల రీత్యా అయుర్దాయ నిర్ణయం చేయటం అంత క్షేమకరంగా ఆధారపడదగినది కాదు.
చాలా ఉదాహరణ లతో అంశాయు పద్దతి సరియైన ఫలితాలు ఇయ్యగల్గినా
అష్టక వర్గు రిత్యా నిర్ణయింపబడిన ఆయుర్థాయం చాలా ఉదాహరణములతో సంతృప్తి కరంగా గుర్తింపబడలేదు.
అందు వలన స్వర్గీయ శ్రీ డాక్టర్ B.V. రామన్
"ఎడిటర్ ది ఎస్ట్రాలాజికల్ మాగజైన్ గారు" రెండు పద్దతులను తెలియజేసారు. అవి భిన్నాష్టక వర్గు పద్దతి ద్వారా , రెండవది సర్వాష్టక పద్దతి ద్వారా ఆధారపడినవి.
వారు ఆయుర్దాయ నిర్ణయం(లగ్నచక్రం నుంచి)
రెండు పద్దతులను తెలియజేసారు.
1. భిన్నాష్టక వర్గురీత్యా ఆయుర్థాయ గణన చేయు విధానము.(రాశిగుణకార సంఖ్య భచక్ర
భాజకములు), గ్రహగుణకార సంఖ్య(గ్రహ భాజకములు)
2. నక్షత్రాయు పద్దతి : సర్వాష్టక వర్గు యొక్క శోధ్య పిండ సంఖ్యను కనుగొనుట మరియు
రేఖాగ్రహపిండ +రేఖారాశి పిండ : రేఖాశోధ్యపిండ.
🏵అష్టక వర్గు పద్దతి ద్వారా గణన చేసిన ఆయుర్దయము సాధారణంగా వాస్తవ సాధనలో బాగా వర్తిల్లటంలేదు అన్న విషయం గ్రహించాలి.
జ్యోతిష్య శాస్త్ర అధ్యయనం చేసే వారి అవగాహన(కుతూహలం) చేసుకోవడము కోసం నేను ఉదాహరణ సహితంగా పద్దతులను రాబోయె పోస్ట్ లలో తెలియజేయగలవాడను.
చివరిగా
🏵 వివిధ యోగముల ననుసరించి వాటితో పాటుగా వింశోత్తరి దశాఫలితాలను
అనుసరించి ఆయుర్దాయం యోక్క ఖచ్చితమైన అంచనా ఆధారపడి వుండాలి.
⏳ గణిత సంబంధమైన పద్దతులు మాత్రమే రాజమార్గం కాజాలవు.⏳
(సశేషం)
🙏
*నిత్యమూ పఠించవలసిన ప్రార్దనలు*
ఉదయం కరదర్శనం :-
“కరాగ్రే వసతే లక్ష్మీ: కరమద్యే సరస్వతి
కరమూలేతుదైి గౌరి ప్రభాతే కరదర్శనం”
ఉదయం భూప్రార్ధన :-
“సముద్రమేఖలే దేవి పర్వతస్తన మండలే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే”
మానసిక శుద్ది :-
“అపవిత్ర: పవిత్రోవా సర్వావస్థాంగతోపినా
య:స్మరేత్పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శ్శుచి:”
స్నాన సమయంలో :-
“గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు"
భోజనానికి ముందు :-
“అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే
జ్ణాన వైరాగ్య సిద్ద్యర్దం భిక్షాందేగి కృపాకరి
అన్నం బ్రహ్మారసోవిష్ణుః భోక్తాదేవో మహేశ్వరః
ఇతి స్మ్రరన్ ప్రభుంజాన: దృష్టిదోషై: నలిప్యతే ”
భోజనము తరువాత :-
“అగస్త్యం కుంభ కర్ణం చ శమ్యం చ బడబానలం
ఆహార పరిణామార్ధం స్మరామి చ వృకోదరం"
ప్రయాణ సమయంలో 21 పర్యాయములు పఠించాలి :-
“గచ్చ గౌతమ శీఘ్రంమే ప్రయాణమ్ సపలం కురు
ఆసన శయనం యానం భోజనం తత్ర కల్పయ
విద్యాప్రాప్తి కోరకు ప్రతి నిత్యం 1 గంట లేక 28 పర్యాయాలు పఠించాలి :-
“ప్రాచీసంధ్యా కాచిదంతర్నిశాయా: ప్రజ్ణా దృష్టే రంజన్అ శ్రీరపూర్వా
వక్రీవేదాన్ పాతుమే వాజివక్ర్తా వాగిశాఖ్యా వాసుదేవస్య మూర్తిః
ప్రణతాజ్ణానసందోహ ధ్వాంత ధ్వంసనకర్మఠం
నమామి తురగ్రీవ హరీం సారస్వత ప్రదం
శ్లోకద్వయం మిదం ప్రాతః అష్టావింశతి వారకం
ప్రయతః పఠతే నిత్యం కృత్న్సా విద్యా ప్రసిద్ద్యతి”
విద్యార్జన లేక ఉద్యోగ నిమిత్తం నివాసానికి దూరంగ ఉన్నప్పుడు ...
మానసిక / ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండటానికి పఠించాల్సిన మంత్రం :-
“గచ్చ గౌతమ శీఘ్రంత్వం గ్రామేషు నగరేషు చ
ఆశనం వసనం చైవ తాంబూలం తత్ర కల్పయ”
చేపట్టిన కార్యం లొ, పోటి పరిక్షలొ ను విజయం సాదించడానికి మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 1008 పర్యాయాలు పఠించాలి.
“శ్రీ రామ జయరామ జయజయ రామరామ”
అన్ని సమస్యలకు ప్రతి నిత్యం సూర్యోదయానికి సూర్య నమస్కారం ఉత్తమం :-
“ఓం సూర్యాయ నమ:”
ఉత్తమ భర్తను పొందుటకు మంత్రాన్ని ప్రతి దినం
1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి :-
“హే గౌరి శంకరార్దాంగి యధాత్వం శంకరప్రియా
తధామాం కురు కళ్యాణి కాంత కాంతం సుదుర్లభమ్”
ఉత్తమ భార్యను పొందుటకు మంత్రాన్ని ప్రతి దినం
1 గంట లేక 108 పర్యాయాలు 40 రోజులు పఠించాలి :-
“పత్నీం మనోరమాందేహి మనోవృత్తాను సారిణీమ్
తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవామ్”
వివాహాం తోందరగా జరగడానికి మంత్రాన్ని 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి :-
“ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని
వివాహాం భాగ్యమారోగ్యం శీఘ్రలాభంచ దేహిమే”
అమ్మాయిలకు వివాహాం తోందరగా జరగడానికి.
మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి :-
“కాత్యాయని మహామాయే మహాయోగినదీశ్వరీ
నందగోపసుతం దేవిపతిం మేకురుతేనమ:
పతింమనోహరం దేహి మనోవృత్తానిసారిణం
తారక దుర్గ సంసార సాగరస్య కులోద్బవాం
పత్నీమనోరమాం దేహి మనోవృత్తానిసారిణం
తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్బవాం”
అబ్బాయిలకు వివాహాం తొందరగా జరగడానికి
మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి :-
“విశ్వాసో గందర్వరాజ కన్యాం సాలంకృతాం
మమాబీప్సితాం ప్రయచ్చ ప్రయచ్చ నమః”
స్త్రీల కు వైవాహీక జీవన సౌఖ్యం కొరకు
మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి :-
“హరిస్త్వా మారాధ్య ప్రణిత జనసౌభాగ్య జననీం
పురానారి భూత్వా పురరిపుమపి క్షోభమనయత్
స్మరోపిత్వాం వత్యా రతినయన లేహ్యేన వవుషా
మునీనాప్యంత: ప్రభవతి మోహాయ మహతామ్”
వైవాహీక జీవన సౌఖ్యం కొరకు దంపతులు ఇరువురు
మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాలి :-
“శ్రీరామచంద్రః శ్రితపారిజాతః సమస్తకళ్యాణ గుణాభిరామః
సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు
హే గౌరి శంకరార్దాంగి యధాత్వం శంకరప్రియే
తధామాం కురు కళ్యాణి కాంత కాంతాం సుదుర్లభాం”
కుటుంభాన్ని నిర్లక్ష్యం చేయు భర్తను మార్చుకోవడానికి మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 108 పర్యాయాలు 40 రోజులు పఠించాలి :-
“ఓం త్రయంబకం యజామాహే సుగంధీం పతిర్వర్దనమ్
పతిం ఉర్వారుకవ బంధతృతి మోక్ష మామృతాత్
కుటుంబంలొ వచ్ఛు సమస్యలను తొలగి సౌఖ్యం ఉండడానికి మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 1008 పర్యాయాలు పఠించాలి :-
“ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ"
ఆరోగ్య సమస్యలు లేని గర్భధారణకొరకు ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం :-
“ఓం దేవకిసుత గోవింద జగత్పతె
దేహిమే తనయం కృష్ణ త్వామహాం శరణాగత:”
సుఖ ప్రసవం కొరకు ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం :-
“ఆస్తి గోదావరీ జలతీరే జంభలానామ దేవతా
తస్యాః స్మరణ మత్రేణ విశల్యాగర్బిణీ భవేత్ జంభలాయై నమః”
ఆపదలు తగ్గడానికి ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం :-
“గౌరి వల్లభకామారే కాలకూట విషాదన
మాముద్దరాపదాంభోధేః త్రిపుర ఘ్నాంతకాంతక”
ఆపదలు పూర్తిగా తొలగడానికి ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం :-
“అపదామపర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం మోక్షదం తం నమామ్యహం”
( లేక )
“దుర్గాపత్తరిణీం సర్వదుష్టగ్రహ నివారిణీ
అభయాపన్నిహంత్రీచ సర్వానంద ప్రదాయిని”
సర్వకార్యసిద్దికి ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం :-
“నమః సర్వనివాసాయ సర్వశక్తియుతాయచ
మమాభీష్టంకురుష్వశు శరణాగతవత్సల”
రాజయోగ సాధన - కాలామృతము
ఏదేని జాతకమున యే యే గ్రహములు, ఉచ్చ, స్వ, మిత్ర, క్షెత్రములయందున్నను, పంచమ నవమ స్థానముల యందున్నను, శుభాగ్రహములచే చూడ బడుచున్నను, ఈ మూడు గాని ఇందే దయినగాని, మూల త్రిలోనము నందున్నను. ఇట్టి గ్రహములు, కేంద్ర కోణాదిపతులై ఒకరికొకరు సంభందమున్నా రాజయోగము నిత్తురు.
చంద్ర సంభందమగు యోగము -- పూర్ణ చంద్రుడు బలవంతుడై భాగ్యమున గాని, చతుర్ధమున గాని, దశమమందు గాని, సప్తమమున గాని, తన స్వ, ఉచ్చ,మిత్ర, క్షెత్రమున ఉండిగాని, గురు శుక్ర సంభందము కలిగియున్న గాని, లగ్నమునుండి ద్వితీయ, దశమమున, వరుసగా కుజ, శనులుండగా పుట్టిన వాడు, భోగి, గుణవంతుడు, దాత, ప్రజామన్ననలు పొందు వాడు అగును.
భావములకు వ్యతిరేక ఫలములిచ్చు యోగములు --- భావము, భావాధిపతి, కారకకుడు , ఈ మూడు గ్రహములు, పాపగ్రహ మద్యమమున ఉన్నచో, బలవంతులగు పాపులతో కూడిన వారైనను, ఆ భావదోష మగును.
రోజూ జిల్లేడు పువ్వులతో అర్చించేవారు బంగారాన్ని దానం చేసిననంత ఫలితాన్ని పొందుతారు
🙏ఓం నమఃశివాయ🙏
.
శివపూజకు సంబంధించినంత వరకు వేయి జిల్లేడు పువ్వుల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం.
వేయి గన్నేరు పూల కంటే ఒక మారేడు దళం ఉత్తమం.
వేయి మారేడు దళాలకంటే ఒక తామరపువ్వు ఉత్తమం.
వేయి తామరపువ్వుల కంటే ఒక పొగడపువ్వు ఉత్తమం.
వేయి పొగడపువ్వుల కంటే ఒక ఉమ్మేత్తుపువ్వు ఉత్తమం.
వేయి ఉమ్మెత్త పువ్వుల కంటే ఒక ములక పువ్వు ఉత్తమం.
వేయి ములక పూవుల కంటే ఒక తుమ్మిపూవు ఉత్తమం.
వేయి తుమ్మిపూవులకంటే ఒక ఉత్తరేణు పువ్వు ఉత్తమం.
వేయి ఉత్తరేణు పువ్వుల కంటే ఒక దర్భపువ్వు ఉత్తమం.
వేయి దర్భపూల కంటే ఒక జమ్మిపువ్వు శ్రేష్ఠం.
వేయి జమ్మి పువ్వుల కంటే ఒక నల్లకలువ ఉత్తమం అని సాక్షాత్తు శివ పరమాత్మే చెప్పాడు. శివపూజకు పువ్వులన్నింటిలోకి నల్లకలువపువ్వు ఉత్తమోత్తమమైనది. శివునికి వేయినల్ల కలువలతో మాలను అల్లి సమర్పించినవారు, శివునితో సమమయిన పరాక్రమంగలవారై వందల, వేలకోట్ల కల్పాలు నిత్యకైలాసంలో నివశిస్తారు. ఈ పుష్పమాలతో కాక మిగతా పుష్పాలతో పూజించే భక్తులు కూడా ఆయా పుష్పాలకు సంబంధించిన ఫలితాలను పొందుతారు.
పరమశివునికి పొగడపూలంటే అమితమైన ఇష్టం. ఆ స్వామిని ప్రతిదినం ఒక పొగడపువ్వుతో అర్చించే భక్తుడు వేయిగోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు.
ఒక నెలపాటు పొగడపూలతో పూజించినవారు స్వర్గ సుఖాలను పొందుతారు. రెండునెలలపాటు పూజించిన వారు యజ్ఞం చేసినంత ఫలితాన్ని పొందుతారు. మూడు నెలల పాటు పొగడపూలతో అర్చించినవారికి బ్రహ్మలోక ప్రాప్తి. నాలుగు నెలలు పూజించినవారికి కార్య సిద్ధి. ఐదు నెలలు పూజించినవారికి యోగసిద్ధి. ఆరు నెలలు పూజించినవారికి రుద్రలోక ప్రాప్తి కలుగుతుంది.
సాధారణంగా శివునికి బిల్వపత్రాలే ప్రీతిపాత్రమైనవి. మిగతా పత్రాలు ప్రీతికరం కావని అనుకుంటుంటాం. లింగపురాణం ఆ స్వామికి ఇషామైన మరిన్ని పత్రాలను గురించిన వివరాలను అందిస్తోంది. మారేడు, జమ్మి, గుంట గలగర, అడ్డరసము, అశోకపత్రాలు, తమాలము, చీకటి చెట్టు, ఉలిమిడి, కానుగు, నేల ఉసిరి, మాచీపత్రి, నల్ల ఉమ్మెత్త, తామరాకు, నీతికలువ, మెట్టకలువ ఆకులు, సంపెంగ పత్రి, తుమ్మి, ఉత్తరేణి ఆకులను పత్రాలను పూజలో ఉపయోగించవచ్చు. అంటే, ఆయా పుష్పాలు లభించనపుడు, ఆయా పత్రిని ఉపయోగించవచ్చు.
ఇక పుష్పదానానికి సంబంధించినంతవరకు, పుష్పాన్ని గాని, ఫలాన్నిగాని దైవానికి నివేదిస్తున్నప్పుడు ఆ పుష్పం ముఖం బోరగిలబడకూడదు. అలా చేయడంవల్ల దుఃఖం కలుగుతుంది. అయితే ఆ పుష్పాలను లేక పత్రిని దోసిట్లో పెట్టుకుని నివేదించేటప్పుడు బోర్లాపడినప్పటికీ దోషం కాదు. ఉమ్మెత్త, కడిమిపువ్వులను శివునికి రాత్రివేళ సమర్పించాలి. మిగిలిన పూలతో పగిటిపూట. మల్లెలతో రాత్రివేళ, జాజి పూలతో మూడవజామున, గన్నేరుతో అన్నివేళలా పూజించవచ్చు.
ఇప్పటివరకు మనం ఏయే పూలతో శివుని పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో తెలుసుకున్నాం. అయితే మన మనసులోని కోరికననుసరించి కూడ శివునికి పువ్వులను సమర్పించవచ్చు. ఉదాహరణకు ధనం కావాలను కున్నవారు శివుని గన్నేరుపూలతో, మోక్షం కావాలంటే ఉమ్మెత్తపూలతో, సుఖశాంతుల కోసం నల్లకాలువతో, చక్రవర్తిత్వం కోసం తెల్లతామరలతో, రాజ్యప్రాప్తి కోసం ఎర్రతామరలతో, నాగకేసరం, కేసరీపుష్పాలతో అనుకున్న కోరికలు నెరవేరుతాయట. గన్నేరు, అశోకం, ఊడుగు, తెల్లజిల్లేడులతో పూజించిన వారికి మంత్రసిద్ధి, రోజాపుష్పాలతో లాభాసిద్ధి, దంతి ప్రత్తి పూలతో సౌభాగ్యం కలుగుతుంది. కోరుకున్న కన్యను పొందాలంటే శివుని సన్నజాజి పూలతో పూజించాలి. సంతానం కావాలనుకునేవారు శివుని మొల్లపువ్వులతో పూజించాలి. దర్భపూలతో ఆరోగ్యం, రేలపూలతో ధనం, తుమ్మిపూలతో వశీకరణం, కడిమిపూలతో శత్రుజయం కలుగుతుంది. బిల్వదళ పూజ దారిద్ర్యాన్ని తొలగిస్తుంది. శివుని మరువంతో పూజిస్తే సుఖం, లోద్దుగపూలతో పూజిస్తే గోసంపద కలుగుతుంది. మోదుగ, బూరుగు పూలతో పూజిస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది.
ఇక, శివపూజకు పనికిరాని పువ్వుల గురించి మన పురాణ గ్రంథాలు పేర్కొన్నాయి.
మొగిలి, మాధవి, అడవిమల్లి, సన్నజాజి, దిరిసెన, సాల, మంకెన పువ్వులు శివార్చనకు పనికిరావు. బావంచి ఆకులు, పువ్వులు, కానుగపూలు, తాండ్ర ఆకులు, దాసాని, ఎర్రమద్ది, మందార, విషముష్టి, అడవిమొల్ల, తెల్ల విష్ణుక్రాంత, ఎర్ర, తెల్ల గులాబీలు, దిరిసెన పువ్వులు శివపూజకు పనికిరావు. వేప, వెలగ, గురివింద పూలు కూడా శివపూజకు అర్హం కావు.
దశసౌగంధికం పుష్పం నిర్గంధియది భామిని
శాతసాహస్రి కామాలా అనంతం లింగపూజసే
పది సుగంధపుష్పాలతో (ఒకవేళ పరిమళం లేకపోయిన వైనప్పటికీ) శివలింగాన్ని పూజిస్తే, శతసహస్రమాలలతో పూజించిన అనంత పుణ్యఫలం లభిస్తుందని శివధర్మ సంగ్రహం చెబుతోంది.
🙏ఓం అరుణాచలేశ్వరాయ నమః🙏
🌼🌿కామాక్షీ కామదాయినీ.......🌼🌿*
అమ్మవారు కేవలం తన దృష్టిపాతం చేతనే భక్తులందరిని ప్రసన్నం చేయడం చేత కమనీయమైన ఆమె నేత్రాల వల్ల కామాక్షీ అనే పేరు వచ్చింది.
కామాక్షీ, కామేశ్వరీ అనే రెండు పేర్లతో బ్రహ్మదేవుడు అమ్మవారిని కీర్తించాడు.
నమస్కరించిన ప్రతీ జీవుని మనోరథాన్ని తన దృష్టిమాత్రంచేతనే నేరవేర్చే తల్లి కనుక కామాక్షీ.
ఆవిడ ఈశ్వరుని ఇచ్ఛాశక్తి. కళ్ళు విప్పడం అనేది ఒక గొప్ప శక్తి.
స ఐక్ష్యతా బహుస్యామ్ ప్రజాయేయా అని వేదమంత్రం.
ఐక్ష్యతా అంటే చూసాడని అర్థం. కళ్ళు మూసుకుని ఉంటే లయం. కళ్ళు విప్పితేనే సృష్టి. కళ్ళు విప్పితేనే పనులన్నీ ఉన్నాయి.పరమేశ్వరుడు కళ్ళు విప్పితేనే సృష్టి, స్థితి, లయలు అన్నీ జరుగుతున్నాయి.
ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః. పరమేశ్వరుని కన్నులు విప్పుట అనే శక్తి ఏదైతే ఉన్నదో అదే అమ్మవారు. అదే ఇచ్ఛా జ్ఞాన క్రియాత్మకమైన శక్తి. ఆవిడే కామాక్షీ.
కశ్చ అశ్చ మశ్చ ఇతి కామః అని ఒక అర్ధం చెప్పారు.
కామాక్షీ - ఆవిడ కళ్ళు తెరిస్తే సృష్టి. ఆ తెరిచి అలా నిలిపితే స్థితి. మూస్తే లయం. ఆ కళ్ళతోనే సృష్టి, స్థితి, లయ అనే మూడూ కనుచూపులతోనే చేస్తున్నారు అమ్మవారు.
సృష్టికి ప్రతీకైన బ్రహ్మదేవుడు ’క’ కారం ద్వారా, స్థితికి ప్రతీకైన విష్ణువు ’అ’కారం ద్వారా, లయకి ప్రతీకైన రుద్రుడు ’మ’కారం ద్వారా తెలియజేయడుతున్నారు.
’క’ ’అ’ ’మ’ - బ్రహ్మ విష్ణు రుద్రులు - సృష్టి స్థితి లయలు ఇవన్నీ కళ్ళల్లోనే ఉన్న తల్లి కనుక కామాక్షీ.
కామాక్షీ అన్నమాటలో ఇంత లోతైన అర్ధం ఉంది.
అమ్మవారు చిదగ్నికుండం నుండి ఆవిర్భవించిన వెంటనే కామాక్షీ కామదాయినీ అని కీర్తించి ’దేవర్షిగణసంఘాతసూయమానాత్మవైభవా’ అని దేవతలందరూ కలిసి అమ్మవారిని కీర్తించారు.
-----పూజ్యగురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు
*🌼🌿శ్రీ మాత్రే నమః🌼🌿*
దుర్గతులను భస్మం చేసే శక్తివంతమైన దుర్గా స్తోత్రం*
ఎవరైనా అమితమైన కష్టాలను అనుభవిస్తున్నారనుకున్న వారికి ఈ స్తోత్రాన్ని ఇవ్వగలరు
దుర్గతులను భస్మం చేసే మహా శక్తివంతమైన దుర్గా ద్వాత్రింశన్నామ మాలా స్తోత్రము.
ఈ స్తోత్రము చాలా శక్తిమంతమయినది.
దుర్గాదేవికి సంభందించిన 32 నామాలు ఇందులో ఉన్నాయి . ఈ స్తోత్రం దుర్గాసప్తసతి లో కనిపిస్తుంది . ఈ స్తోత్రాన్ని ఎవరు రోజూ చదువుతారో వారు అన్ని భయాలనుంచీ కష్ఠాలనుంచీ విముక్తులవుతారు.
*శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామ మాలా స్తోత్రం*
దుర్గా దుర్గార్తి శమనీ దుర్గాపద్వినివారిణీ
దుర్గమచ్ఛేదినీ దుర్గసాధినీ దుర్గనాశినీ
ఓం దుర్గతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా
ఓం దుర్గమజ్ఞానదా దుర్గ దైత్య లోక దవానలా
ఓం దుర్గ మాదుర్గమాలోకా దుర్గమాత్మ స్వరూపిణీ
ఓం దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా
ఓం దుర్గమ జ్ఞాన సంస్థానా దుర్గమ ధ్యాన భాసినీ
ఓం దుర్గ మోహాదుర్గ మాదుర్గమార్ధ స్వరూపిణీ
ఓం దుర్గ మాసుర సంహంర్త్రీ దుర్గమాయుధధారిణీ
ఓం దుర్గమాంగీ దుర్గమాతా దుర్గమాదుర్గమేశ్వరీ
ఓం దుర్గభీమా దుర్గభామా దుర్లభా దుర్గ దారిణీ
నామావళి మిమాం యస్తు దుర్గాయా మమ మానవః
పఠేత్సర్వ భయాన్ముక్తో భవిష్యతి నసంశయః
*శ్రీ మాత్రే నమః*
భగవంతుని లీలలు.... మనుషులకు అర్దం కావు.
🌷
*వీధులు ఊడ్చేవాడు..... ఒకరోజు దేవుడితో మొర పెట్టుకున్నాడు.*
*"రోజూ హాయిగా నీవు పూజలందుకుంటూ ఉంటావు.*
*నా బతుకు చూడు. ఎంత కష్టమో.ఒక్క రోజు... ఒకే ఒక్క రోజు నా పనిని నువ్వు చెయ్యి. నీ పనిని నేను చేస్తా," అని సవాలు విసిరాడు.*
*దేవుడు విని.... 'సరే' నన్నాడు. "అయితే ఒక్క షరతు. ఎవరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు. నోరు మెదపకూడదు."అన్నాడు దేవుడు. "సరే" అన్నాడు మనోడు.*
*తెల్లారికి మనోడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు.*
*కాసేపటికి ఓ ధనిక భక్తుడు వచ్చాడు.*
*"దేవా ... నేను కొత్త బిజినెస్ మొదలుపెడుతున్నాను. ఇబ్బడి ముబ్బడిగా లాభాల వర్షం కురిపించు" అంటూ ముందుకు వంగి దణ్ణం పెట్టాడు.*
*అప్పుడు జేబులోని పర్సు కింద పడిపోయింది.*
*అతను చూడకుండా వెళ్లిపోయాడు.*
*మనోడు "ఒరేయ్... పర్సు వదిలేశావు చూసుకోరా..." అందామనుకున్నాడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకు తెచ్చుకుని మౌనంగా ఉండిపోయాడు.*
*ఇంకాస్సేపటికి ఓ పేదవాడు వచ్చాడు*
*"దేవా... నా దగ్గర ఒక్క రూపాయి మాత్రమే ఉంది. అదినీకు సమర్పించుకుంటున్నాను.* *దయచూడు తండ్రీ" అంటూ మోకరిల్లాడు.*
*కళ్లు తెరిచేసరికి డబ్బులతో నిండిన పర్సు కనిపించింది.*
*"ఇలా దయ చూపించావా తండ్రీ" అని ఆ పర్సును తీసుకుని వెళ్లిపోయాడు.*
*"ఒరేయ్ దొంగా.... " అని అరుద్దామనుకున్నాడు మనోడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకొచ్చి ఎలాగోలా తమాయించుకున్నాడు.*
*ఆ తరువాత ఒక నావికుడు వచ్చాడు.*
*"దేవా రేపు సముద్ర ప్రయాణం ఉంది. నన్ను చల్లగా కాపాడు స్వామీ" అన్నాడు. అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వచ్చి...*
*"నా తరువాత వచ్చింది ఇతడే. కాబట్టి ఇతడే నా పర్సును దొంగిలించి ఉంటాడు. పట్టుకొండి" అన్నాడు.పోలీసులు అతడిని అరెస్టు చేశారు.*
*ఈ అన్యాయాన్ని చూసి మనోడు ఉండబట్టలేకపోయాడు.*
*"ఆగండ్రా... ఇతను నిర్దోషి. అసలు దొంగ ఇంకొకడు. వాడు పర్సును తీసుకెళ్లాడు." అని అరిచేశాడు.*
*దేవుడే చెబుతుంటే ఇంకా సాక్ష్యాలెందుకని నావికుడిని వదిలేసి, పేదోడిని పట్టుకుని వెళ్లిపోయారు పోలీసులు.*
*ఇచ్చిన ఒక్క రోజు గడువు అయి పోవడంతో...*
*సాయంత్రానికి వీధులు ఉడ్చేవాడు దేవుడి డ్యూటీ నుంచి దిగేశాడు. దేవుడు కూడా తన అసలు డ్యూటీకి వచ్చేశాడు.*
*"దేవా... ఇవాళ్ల ఎంత మంచి పని చేశానో తెలుసా... నేను ఒక నిర్దోషిని అరెస్టు కాకుండా కాపాడాలని. ఒక దోషిని అరెస్టు చేయించాను." అన్నాడు మనోడు సంతోషంగా!*
*దేవుడు "ఎంతపని చేశావోయ్.* *నిన్ను అసలు స్పందించొద్దన్నానా... ఎందుకలా చేశావు."*
*అన్నాడు నిష్ఠూరంగా.*
*"అదేమిటి? నువ్వు నన్ను మెచ్చుకుంటావను కున్నాను."అన్నాడు మనోడు బాథగా!*
*అప్పుడు దేవుడు అసలు విషయం బయట పెట్టాడు.....*
*"ధనవంతుడు మహాపాపాత్ముడు.*
*వాడు అందరినీ దోచుకుంటాడు.*
*వాడి డబ్బు కొంత పేదోడికి అందితే వాడికి కొంచమైనా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను. పేదోడికి కష్టాలు తీరేవి. వాడు కొన్నాళ్లైనా ఆకలి దప్పులు లేకుండా ఉండేవారు.*
*ఇక నావికుడు తెల్లారితే సముద్రయానం చేయబోతున్నాడు. దారిలో పెను తుఫాను వచ్చి వాడి పడవ మునిగి అందరూ చనిపోతారు. వీడు అరెస్టై జైల్లో ఉంటే బతికిపోయేవాడు.*
*ఇప్పుడు చూడు... పేదోడు జైల్లో ఉన్నాడు. ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు. నావికుడు చావబోతున్నాడు. ఎంత పని చేశావు నువ్వు... అన్నాడు దేవుడు.*
*దేవుడి ప్రణాళిక ఏమిటో ఎవరికీ తెలియదు.*
*కష్టంలా కనిపించేది వాస్తవానికి మేలు చేయొచ్చు. తప్పులా కనిపించేంది నిజానికి ఒప్పై ఉండచ్చు.*
*ఆయన ఆలోచనల లోతు, అవగాహన ఎత్తు అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.*
*అందుకే ఏది జరిగినా మన మంచికే అనుకుంటూ ఆ భగవంతుడిని ధ్యానించండి..*
శ్రీమత్సింహాసనేశ్వరి
Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 8 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu
‘’
ఆకలివేసి అందరికీ తినడానికి దొరికి, తిన్నతరవాత అది జీర్ణమవడానికి, ఇంట్లోవాళ్ళు ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకోకుండా సంతోషముగా ఉన్నారు అంటే సింహాసనములో ఉన్న పరమాత్మ ప్రసన్నుడై పరిపాలిస్తున్నాడు అని. అమ్మవారు ఒక్కతే నిజమైన సింహమును ఆసనముగా చేసుకుని సింహవాహన అయింది. ఆవిడ సింహమును అధిరోహించే యుద్ధములు చేసింది. అది మామూలు సింహము కాదు పెద్ద పెద్ద రాక్షసులను పంజాతో కొట్టి చంపేస్తుంది. యుద్ధభూమిలో సింహము పరిగెడుతుంటే రథముమీద వెళ్ళినట్టుగా ఉండదు. సింహపు వేగమునకు ఒరిగిపోకుండా, తాను కూడా కదులుతూ ఉగ్రముగా కూర్చుని రాక్షసులను చంపుతుంది. దేవతలు –
అయిగిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతే
గిరివరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే |
సింహము మీద కూర్చుని మహిషాసుర సంహారము చేసినప్పుడు తల్లిని చూసి కీర్తించారు. ఉగ్రముగా ఉన్న అమ్మను ఉపాసన చెయ్యడము భయము కాదు. ఆవిడ శత్రువులను చంపుతుంది. ఆ తల్లిని ఉపాసన చెయ్యడము వల్ల భక్తులపట్ల ప్రసన్నురాలు అవుతుంది. సింహాసనములో ఉన్న తల్లికి భయపడి లోకములో పరిపాలన అంతా జరుగుతున్నది. అమ్మవారి ఆజ్ఞకు భయపడి వాయువు వీస్తున్నది, నీరు ప్రవహిస్తున్నది. ఆ తల్లికి భయపడి భూమి తిరుగుతున్నది. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. అగ్ని వేడిగా ఉన్నది.
సింహ శబ్దమును అటు ఇటు మారిస్తే హంసి అవుతుంది. హంస అనగా మెల్లగా నడవవలసినది. నడకకు ప్రసిద్ధి హంస. పరమహంసలు జగత్తును బ్రహ్మమును వేరు చేసి చూస్తారు. యోగనిష్ఠలోకి ప్రవేశించేవారు ఊపిరిని చాలా మెల్లగా పీల్చి మందముగా విడచిపెడుతూ ఉంటారు. ఊపిరి రూపములో ఒకావిడ లోపలికి, బయటికి హంసనడకతో మెల్లగా నడుస్తూ తిరుగుతున్నది. హృదయగుహలో శ్రీమత్సింహాసనేశ్వరి కూర్చుని ఉన్నంతసేపు హంస తిరుగుతూ ఉంటుంది. ఆవిడ లేచింది అంటే హంస తిరగడము ఆగిపోతుంది. ఆవిడ ఉండటమే శోభ. లలితా సహస్రము చదువుతూ శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరి అని ఊపిరి పీల్చేసరికి మనలోనే ఉన్న ఆవిడ పాదపద్మముల దగ్గరకే ఈ ఊపిరి వెళ్ళి వస్తున్నది అన్న భావన కలిగితే తరవాత నామము జ్ఞాపకమునకు రాదు. మనసు లోపలకు వెళ్ళి ఈ దర్శనము మొదలు పెట్టిందని గుర్తు. స్తోత్రం చదవడము ఆగిపోతుంది. అలా ఆగిపోతే నిజముగా లలితాసహస్రనామము చదివారని గుర్తు. అర్థమయి చదవడము అంటే దర్శనము పొందడము. ఏ నామము దగ్గర అనుభవించి రమించి ఆగిపోతే అక్కడ జన్మధన్యము అయిపోతుంది. పంచభూతములలోనుంచి వచ్చి మళ్ళీ పంచభూతములలోకి వెళ్ళిపోవడమునకు మధ్యలో ఉన్నసంధికాలమే జీవితము. వెళ్ళిపోయేట్టుగా చేసే శక్తిని ‘యత్ప్రయంతపి తనిష్వంతి’ సంహారప్రక్రియ అంటారు. పిపీలికాది పర్యంతము అనేక ప్రాణులు పుట్టి వెళ్ళిపోతుంటాయి. ఒక ప్రాణి పంచభూతములలో కలసిపోవడము కూడా కదలికయే. ఈశ్వరుని చేరిపోవడమే మనిషి జీవితములో ప్రధానలక్ష్యము. సింహ అన్న శబ్దమునకు హింసించునదని అర్థము. ప్రళయకాలములో తనను పొందకుండా ఉండిపోయిన జీవులను అమ్మవారు తానే పొందుతుంది అదే సింహాసనేశ్వరి. ఐదింటితో సింహాసనము అని తల్లిని చెపితే ఆ ఐదు శాక్తేయ ప్రణవములు అన్నారు. ‘శ్రీం హ్రీం క్లీం ఐం సౌః’ అన్న బీజాక్షరముల మీద కూర్చుంటుంది. తూర్పు, పశ్చిమం, ఉత్తరం, దక్షిణం నాలుగుదిక్కుల మధ్యలో పంచభూతములైన పృథ్వి ఆపస్ తేజో వాయు ఆకాశములు ఐదూ సింహాసనముగా అమ్మవారు కూర్చున్న ప్రదేశమే అంతటా నిండిపోయిన ఆవిడ సింహాసనము. పంచముఖములు కలిగిన సద్యోజాత, అఘోర, తత్పురుష, వామదేవ, ఈశానములనే అయిదు ముఖములతో అయిదు క్రియలు చేసే తత్త్వాన్ని అధిరోహించి పంచప్రేతాసీనయి బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులనే నాలుగు కోళ్ళు గల తల్పము ఉన్న సింహాసనము మీద కూర్చుని ఉంటుంది. ఇన్ని విధములుగా ఆవిడ శ్రీమత్సింహాసనేశ్వరి.
https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage
**హిందూ ధర్మం* - 48
**దశిక రాము**l
(విద్య - 2)
ఎన్నో గొప్ప గొప్ప చదువులు చదువుతున్నారు, ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీలు పొందుతున్నారు, లక్షల్లో సంపాదిస్తున్నారు. కానీ ఎంత సంపాదించినా, ఆనందంగా ఉండలేకపోతున్నారు, జీవితంలో ఒక అసంతృప్తి, ఏది తెలియని వెలితి. ఎందుకు? ఎంత గొప్ప చదువులు చదివినా తల్లిదండ్రులను వీధిన పడేస్తున్నారు, తన్ని తరిమేస్తున్నారు, జీతం తక్కువగా వస్తోంది, కలిసి ఉంటే మన జీతం కూడా మన అన్నకో, తమ్ముడికో ఇవ్వాల్సి వస్తుందని వేరు కాపురం పెడుతున్నారు ఎందుకు? సొంత చెల్లెలి పెళ్ళి భారంగా భావిస్తున్నారు ఎందుకు?
ఎందుకంటే ఈ రోజు మనం చదువుతున్న చదువులు సంస్కారాన్ని ఇవ్వడంలేదు. ప్రేమలు, అనుబంధాల గురించి చెప్పడంలేదు, నైతిక విలువల గురించి మనము, మన పిల్లలు చదువుకున్న చదువులో ఏమి ఉండదు. పిల్లలను కేవలం ఒక యంత్రాలుగా చూస్తూ, నిత్యం ఏదో ఒకటి నూరి పోయడమే విద్యా విధానం అయిపొయింది. అసలు ఇది విద్యనే కాదు, ఇది ఒక మిధ్య. ఆస్తికులుగా వెళ్ళిన పిల్లలను నాస్తికులుగా, భౌతికవాదులుగా మారిపోతున్నారు. ఆత్మనూన్యతకు లోనవుతున్నారు, ఒత్తిడికి గురవుతున్నారు, కనీసం 8 గంటల సుఖనిద్ర కూడా లేని స్థితికి చేరుకున్నారు. ఇది భారతీయ విద్యావిధానం కాదు.
విద్య వినయాన్నిస్తుంది, అందరిని, అన్నిటిని అంగీకరించడం నేర్పిస్తుంది. ఆస్తికతను పెంచుతుంది, నైతికవిలువలను వృద్ధి చేస్తుంది. సమాజం పట్ల బాధ్యతలను, తోటి మనుష్యుల పట్ల ప్రేమానురాగాలను కలిగిస్తుంది. స్వార్ధాన్ని తొలగిస్తుంది, పదిమందికి సాయపడే మనస్తత్వాన్ని కలిగిస్తుంది. సహనాన్ని ఇస్తుంది, ఓర్పును పెంచుతుంది. అన్నిటికి మించి సంతృప్తినిస్తుంది. ఇది ఒక్క ఋషుల చేత ఏర్పరిచిన భారతీయ విద్యావిధానంలోనే కనిపిస్తుంది. ఈ రోజు సొంత చెల్లలికి పెళ్ళి చేయడం అన్నకు భారంగా మారింది. కానీ ఒకప్పడు భారతదేశంలో గృహస్థులు తమ కుటుంబీకులతో పాటు, బంధువుల బాగోగులను కూడా దగ్గరుండి చూసుకున్నారు. వారి నుంచి ఏమి ఆశించకుండా సాయం చేశారు. భారతీయ విద్యావిధానంలో చదువుకున్న ఏ విద్యార్ధి అడుక్కుతిన్న దాఖలాల్లేవు. ఎవరు ఆత్మహత్య చేసుకోలేదు, దోచుకులేదు, మోసం చేయలేదు, తల్లిదండ్రులను ఇంట్లో నుండి వెళ్ళగొట్టలేదు, ముసలివారిని భారంగా భావించలేదు. ఇవన్నీ ఒక భారతీయ విద్య మాత్రమే అందించింది. విద్య అంటే భారతీయ విద్యనే. అటువంటి విలువలను పెంచే విద్యను అభ్యసించడం ధర్మం.
తరువాయి భాగం రేపు......
🙏🙏🙏
సేకరణ
**ధర్మము-సంస్కృతి*
https://chat.whatsapp.com/HUn5S1ETDNTG580zg5F9PU
**ధర్మో రక్షతి రక్షితః**
https://chat.whatsapp.com/Iieurm6WILS6u4QsiHHq95
*ధర్మము - సంస్కృతి* గ్రూప్
ద్వారా క్షేత్ర దర్శనాలు , పురాణాలు , ఇతిహాసాలు, దైవ లీలలు పోస్ట్ చేస్తూ అందరికీ మన సనాతన ధర్మ వైభవాన్ని తెలియజేయాలనే ప్రయత్నం చేస్తున్నాము.మీరు కూడా సహకరిస్తే అందరం కలిసి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటుదాం.
**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**
**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏
**మహాభారతము**
**దశిక రాము**
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /
దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//
93 - అరణ్యపర్వం.
కౌశికుడు ఆశ్చర్యం లోనుండి తేరుకోకునే లోపే, ' మహాత్మా ! ఇది మాంస విక్రయ ప్రదేశం. తమబోటివారు సంచరించే ప్రదేశం కాదు. మా గృహం పావనం చెయ్యండి. అక్కడ మనం మాట్లాడుకుందాము. ' అని ధర్మవ్యాధుడు తన యింటికి తీసుకువెళ్లి, అర్ఘ్యపాద్యాదులతో పూజించాడు.
అప్పటిదాకా వుగ్గబట్టుకుని మౌనంగా వున్న కౌశికుడు, ' ధర్మవ్యాధా ! నీకు విశేష గుణాలు వున్నాయని నాకు విదితమౌతున్నది. అయితే, మూగజంతువులను చంపి మాంసం విక్రయించే నీచమైన పనిలో నీవు యెందుకు పాలుపంచుకుంటున్నావు. ఈ విషయంలో నాకు వ్యధగా వున్నది. ' అని తన మనసులోని మాట బయటపెట్టాడు. ఆయన సందేహానికి ధర్మవ్యాధుడు ఈ విధంగా సమాధానం చెబుతున్నాడు :
' మీరు నాపై చూపించిన సానుభూతికి నా కృతజ్ఞతలు. విప్రోత్తమా ! మాంసవిక్రయం నా కులవృత్తి. మా తాత ముత్తాతల కాలంనుండీ యిదే మా జీవనాధారము. మేము తప్పు చేస్తున్నామన్న భావన మాలో అణుమాత్రం కూడా లేదు. ఎందుకంటె, మేము పుట్టినదీ, పెరుగుతున్నదీ యీ వాతావరణంలోనే. ఇది నాకై నేను యెంచుకున్న వృత్తికాదు. అందువలన, యేదోషమూ నాకు అంటదు. '
' ఇక నా ప్రవ్రుత్తి, ప్రవర్తన అంటారా, నేను మా అమ్మా నాన్నలను భక్తితో దైవాలలాగా సేవిస్తాను. వచ్చే అతిధులను ఆదరిస్తాను. దైవకార్యాలు చేస్తాను. భృత్యులని ఆదరిస్తాను. వారి పట్ల పరుషంగా వుండను. ఇతరుల దోషాలను గురించి మాట్లాడను. నాకంటే అధికులను చూసి అసూయపడను. సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మల గురించి నాకు తెలుసు. అందుకే, ఈ జన్మలో చేసే కర్మఫలాలు మోక్ష ప్రతిబంధకాలు కాకుండా చూసుకుంటున్నాను. '
' విప్రోత్తమా ! నేను జీవహింస చెయ్యను. మాంసభక్షణ చెయ్యను. కేవలం యితరులు తెచ్చే మాంసాన్ని ముక్కలుగా కొట్టి విక్రయిస్తాను. స్వధర్మాన్ని త్యజించకూడదు అనే భావంతో, పెద్దలను సేవిస్తూ, పిన్నలను ఆదరిస్తూ, నా విధులు నేను నిర్వర్తిస్తూ వుంటాను. ' అని అనేక విషయాలు ఉపనిషత్తుల లోని సారమంతా తన అనుభవ రూపం లో చెప్పిఅబ్బురపరచాడు, కౌశికుని, ధర్మవ్యాధుడు. ఇంకా యిలా అంటున్నాడు :
' బ్రాహ్మణోత్తమా ! నేను చేసే వృత్తి ఘోరమైనదే. కానీ నేను దానిని కోరుకుని స్వీకరించలేదు. నా పూర్వజన్మ పుణ్యపాపఫలాల చేత నేను యీ బోయకులం లో ఈ ఇంట జన్మించాను. పుణ్య శేషం వలన నా ప్రవ్రుత్తి సాత్వికంగా మారిపోయింది. మనం ధర్మమార్గంలో ప్రయాణిస్తే, ఇహపర లోకాలలో సుఖాలకు కొదువ వుండదు. ఈ దేహమే రధము. ఇంద్రియాలు రథానికి కట్టిన గుర్రాలు. బుద్ధియే రథసారధి. ఇంద్రియాలు వాటి సహజమైన విషయాలవైపే పరుగులు తీస్తాయి. వాటిని నియంత్రించి పరమాత్మలో మనస్సు లగ్నం చేసి, సచ్చిదానంద స్థితిలో రమించడమే, మనం చెయ్య వలసిన పని. '
ఈ మాటలన్నీ సంభ్రమంగా వింటున్న కౌశికుడు, ' ధర్మవ్యాధా ! నీకు ఇట్టి ధర్మ సాక్షాత్కారము ఎక్కడినుండి వచ్చింది. ఏ గురువు శుశ్రూష చేశావు? ' అని అడిగాడు. దానికి ధర్మవ్యాధుడు, ' నేను పెద్దల నుండి నేర్చుకున్న విషయాలనే మీకు చెప్పాను ప్రత్యేకంగా ఏ గురువు నుండి నేర్చుకొనలేదు. మీరు ఒకసారి లోనికి వచ్చి మా తల్లిదండ్రులను కూడా కలవండి, వారు కూడా సంతోషిస్తారు. ' . అనిచెప్పి లోనికి తీసుకువెళ్ళాడు.
లోపల భవనం కడు సుందరంగా స్వర్గలోకాన్ని తలపించేటట్లు వున్నది. ఆతని తల్లిదండ్రులు శయనించేగదిలో సుగంధ ద్రవ్యాల పరిమళం వ్యాపించి వున్నది. చక్కని శయ్య, కూర్చునే శుభ్రమైన ఆసనాలు అమర్చి వున్నవి. వాటిపై ధర్మవ్యాధుని తల్లిదండ్రులు కూర్చుని సంతోషంగా కబుర్లు చెప్పుకుంటున్నారు.
లోపలికి వస్తూనే, ధర్మవ్యాధుడు వారిరువురకూ నమస్కరించి, వారి ఆశీర్వాదం తీసుకున్నాడు. కౌశికునకు తన తల్లిదండ్రులను పరిచయం చేశాడు ధర్మవ్యాధుడు. తాను మాంసపుదుకాణం లో చూసిన ధర్మవ్యాధుడూ, ఇతడూ ఒకడేనా అని ఆశ్చర్యం తో అతడి వైపూ, అతని తల్లిదండ్రుల వైపూ, ఆ గృహంలోని సౌకర్యముల వైపూ, చూస్తూ బొమ్మలా నిలబడిపోయాడు కౌశికుడు.
' కౌశికా ! వీరే నాతల్లిదండ్రులు, నాకు దేవతాసమానులు. వీరి సేవలన్నీ నేనే స్వయంగా చేస్తాను. వారిని ఆనందపరచే విషయాలే వారి దగ్గర ప్రస్తావిస్తాను. వారికి బాధ కలిగించే విషయాలు, వారిని నొప్పించే మాటలు మాట్లాడను. యిదే నా తపస్సు. ఆతపస్సుతోనే నాచిత్తం నాఆధీనంలో వుంటుంది. విషయపరిజ్ఞానం చేస్తుంది. మిమ్ములను నావద్దకు పంపిన పతివ్రతాశిరోమణి కూడా,పవిత్రురాలు. ఆమె దివ్యదృష్టితోనే, మిమ్ములను నా వద్దకు పంపింది. నేను కూడా నాకు తెలిసినది మీకుచెప్పాను. ' అని కౌశికుని సందేహ నివృత్తి చేస్తూ, ' కౌశికా ! మీరు వేరే విధంగా అనుకోనంటే, ఒక విన్నపము. మీరు యెంతో విద్య సంపాదించారు. తపస్సు చేశారు. కానీ మీ తల్లిదండ్రులను వారి వృద్ధాప్యంలో విడిచిపెట్టి తపస్సుకై అరణ్యాలకు వెళ్లారు. వారు మీ గురించి రోదిస్తూ అంధులైపోయి జీవితం గడుపుతున్నారు. ముందుగా మీరు మీ తల్లిదండ్రులను కలుసుకుని, వారిసేవలో ధన్యులుకండి. ' అని చెప్పాడు ధర్మవ్యాధుడు.
ధర్మవ్యాధుని మాటలకూ భక్తి భావంతో పులకించిపోయి, కౌశికుడు, ' ధర్మవ్యాధా ! నీవు బోయకులంలో జన్మించినా, బ్రాహ్మణోత్తముని వలే జీవిస్తున్నావు. నా కళ్ళు తెరిపించి నాకు దిశానిర్దేశం చేశావు. నరకకూపంలో పడకుండా కాపాడావు. ఇప్పుడే వెళ్లి నా మాతా పితల సేవలో తరిస్తాను. ' అని ఆతనికి నమస్కరించి వెళ్లిపోతుండగా, యింకా అనేక మంచి విషయాలు ధర్మవ్యాధుడు కౌశికునికి బోధించి, సాదరంగా వీడ్కోలు పలికాడు.
అని మార్కండేయమహర్షి, ' పతివ్రతా ధర్మము, మాతాపితల సేవ యెంత ప్రభావ వంతమైనవో చెప్పడంకోసమే, మీకు ధర్మవ్యాధుని ఉపాఖ్యానం చెప్పాను. ' అంటూ ధర్మరాజు మొదలైనవారు, ఆనందంగా పరవశులై కధలో లీనమైన విధానం చూసి సంతోషించాడు.
స్వస్తి.
వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.
🙏🙏🙏
సేకరణ
**ధర్మము-సంస్కృతి*
🙏🙏🙏
**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**
**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏
*ధార్మికగీత - 31*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*****
*శ్లో:- చితా చింతా ద్వయో ర్మధ్యే ౹*
*చింతా నామ గరీయసీ ౹*
*చితా దాహతి నిర్జీవమ్ ౹*
*చింతా ప్రాణయుతం వపు: ౹౹*
*****
*భా:- "చిత" అంటే చితి అని; "చింత" అంటే విచారము అని అర్థం. ఈ రెంటికి మధ్య "సున్న" మాత్రమే తేడా. మనిషి సజీవంగా ఉంటే "శివం" అని ; నిర్జీవంగా ఉంటే "శవం" అని లోక వ్యవహారము . "చితి" అచేతనమైన కళేబరాన్ని మాత్రమే కాల్చివేస్తుంది. ఇక "చింత" అనేది ముప్పూటా అన్నపానీయాలు సేవిస్తూ, అన్ని పనులు మానుకొని, సంసార సమస్యలతో సతమతమవుతూ, అదేపనిగా పరిష్కార మార్గాలు వెతుకుతూ, దిగులు పడేవాడిని ప్రాణాలు ఉండగానే నిలువునా కాల్చివేస్తుంది. దానితో ఆ వ్యక్తి చిక్కి శల్యమై, నీరసించి, కృంగి, కృశించి నశిస్తాడు. కాన అయినదానికి, కానిదానికి దిగులు పడకూడదు. ప్రతి చిన్న విషయానికి ఒత్తిడికి గురియై , డీలాపడి పోవడం నేటి తరానికి పరిపాటి. దశరథు డంతటి వాడు రాముని ఎడబాటుకు దిగులు పడి, అసువులు బాయడం చారిత్రక ప్రసిద్ధమే కదా! పైగా "చితి" ఒకేసారి కాల్చగా, "దిగులు" అనుక్షణం, అనునిత్యం, అణువణువునా మనిషిని వెన్నాడి కాల్చి చంపుతుంది. కాన "చితి" కంటే "చింత"యే బలీయము, ప్రమాదకరము, వినాశకరము అని చెప్పక తప్పదు. తన సుఖమే స్వర్గమని, తన దుఃఖమే నరకమనే శతకకర్త తీర్మానము అక్షరసత్యము. సుఖదుఃఖాలలో సంయమనం అలవరచుకోవాలని సారాంశము*.
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
పర్వతలింగం
పాల్కురికి సోమనాథుడు శ్రీశైల మహాత్మ్యమును "పండితారాధ్య చరిత్ర" పర్వతప్రకరణంలో శిలాదమహర్షియొక్క కఠోరమైన తపస్సుకు మెచ్చి శివుడు అతనికి ముగ్గురు పుత్రులను ప్రసాదించినట్టుగా చెపుతాడు. మొదటివాడు నందీశ్వరుడు. ఇతడు ఎన్నో వేల ఏండ్లు తపస్సు చేసి, శివుణ్ణి మెప్పించి శివుడికి వాహనత్వాన్ని, ప్రమథాధిపత్యాన్ని పొందాడు. రెండవవాడు పర్వతుడు. ఇతడు కఠోరమైన తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి "పర్వతుడను పేరు గల నేను మహాపర్వతాకారాన్ని ధరించి స్థిరంగా నెలకొంటాను. నీవు నా ఉత్తమాంగం(శిరస్సు) పై అధివసించి పూజలు గైకొనుము" అని వేడుకుంటాడు. శివుడు "తథాస్తు" అంటాడు. మూడవవాడు భృంగీశ్వరుడు. ఇతడు కూడా కఠోరమైన తపస్సు చేసి, శివుణ్ణి మెప్పించి, "శివైకనిష్ఠాభక్తుడిగా, శివసభలో విదూషకుడిగా, నాట్యాచార్యుడిగా" ప్రసిద్ధికెక్కాడు. ఈ విషయం స్కాందపురాణంలో కూడా ఉన్నది.
🔹ఇది శ్రీశైల ఆలయ ప్రాకారం పైన గల శిల్పం. కుడి వైపు శిలాదుడు తపస్సు చేస్తున్న దృశ్యం. శివుడు అతణ్ణి అనుగ్రహిస్తున్న దృశ్యం. ఎడమ వైపు శిలాదుని ముగ్గురు పుత్రులు నందీశ్వరుడు, పర్వతుడు, భృంగీశ్వరుడు ఒకే చోట ఉన్న దృశ్యం. మధ్యలో శ్రీశైలం కొండ పైన శ్రీమల్లికార్జున లింగరూపంలో శివుడు వెలసిన దృశ్యం.
#శ్రీశివయోగపీఠం#
రామాయణమ్..74
రాముడు అలా ప్రయాణం చేస్తూనే ఉన్నాడు.కోసలదేశాన్ని దాటి వాయువేగ మనోవేగాలతో రధం ప్రయాణం చేస్తున్నది.దారిలో వేదశృతి,గోమతీ,స్యందిక అనే నదులను దాటారు.
.
మధ్యమధ్యలో సుమంత్రుడితోప్రేమగా సంభాషిస్తూ ఇంత అందమైన నా జన్మభూమికి తిరిగి వచ్చి సరయూ నదిలో మరల ఎప్పుడు క్రీడిస్తానో కదా అని పలుకుతూ దారి పొడవునా ఉన్న అందమయిన ప్రదేశాలను సీతకు చూపుతూ ఉల్లాసంగా ముందుకు సాగుతున్నాడు.
.
దారిలో తనను కలువ వచ్చిన గ్రామస్థులు తనస్థితిని చూసి దుఃఖిస్తుంటే వారందరికీ హితముచేప్పి "ఎక్కువకాలము రోదించటము మంచిదికాదు ,పాపము" (చిరం దుఃఖస్య పాపీయః)అని చెప్పి వారి తో మధురంగా సంభాషించి సాయంసంధ్యాసమయంలో కనుమరుగయ్యే సూర్యుడిలా కనపడకుండా వేగంగా వెళ్ళిపోతున్నాడు రామచంద్రుడు.
.
వెళ్ళి,వెళ్ళి ఉత్తుంగ తరంగాలతో,మంగళప్రదమై నాచులేకుండా నిర్మలంగా ఉన్నజలాలతో,దేవ,దానవ,గంధర్వ,కిన్నరులు,సదా సేవించే గంగానదిని చూశారు వారు.
.
ఆ గంగ నీరు కొన్నిచోట్ల అట్టహాసంగా భయంకరంగా ఉన్నది,
కొన్ని చోట్ల జలతరంగఘోష మృదంగధ్వనిని పోలిఉన్నది,
.
కొన్ని చోట్ల దీర్ఘంగా ప్రవహిస్తూ జలము అందమైన స్త్రీల పొడుగాటి జడలా వంపులు తిరిగి వయ్యారంగా సాగుతున్నది.
.
కొన్నిచోట్ల సుడులుతిరుగుతూ చూసేవారికి భయంగొల్పుతూ ఉన్నది !
కొన్నిచోట్ల విశాలమై తెల్లటి ఇసుకతిన్నెలు వ్యాపించి ఉన్నాయి.
హంసలు,సారసపక్షులు,చక్రవాకములు,నదిలోవిహరిస్తూ,క్రీడిస్తూ మనోహరమైన ధ్వనులుచేస్తూ సంగీతగోష్ఢులు జరుపుతున్నట్లుగా ఉన్నాయి.
.
నది ఒడ్డున పెరిగిన వృక్షరాజములు పచ్చని మాలల లాగా గంగాదేవిని అలంకరిస్తున్నాయి .
.
ఏ విధమైన మలినములు లేకుండా నిర్మలస్ఫటికమణికాంతితో జలములు శోభిల్లుతున్నాయి.
.
ఇంత అందమైన గంగ ఒడ్డున ప్రయాణం చేస్తూ సీతారాములు తమను తాము మరచిపోయినారు .ఏకబిగిన ప్రయాణంచేస్తూ శృంగబేరిపురం వద్ద గంగ సమీపంలోకి చేరుకున్నారు.
.
ఆ నది ఒడ్డున ఒక మహావృక్షము క్రింద ఆ రాత్రికి విశ్రమించాలని రామచంద్రుడు నిర్ణయించుకొని సుమంత్రుని రధం ఆపమన్నాడు.
.
శ్రీరామ ఆగమన వార్త ఏ గాలి చెప్పిందో తెలవదుగానీ ! రాముడి ప్రియమిత్రుడు ,ప్రాణసమానుడు నిషాదరాజు అయిన గుహుడు పరివారంతో సహా అక్కడ వచ్చి వాలాడు.
.
జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....
*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
హిందూ ధర్మం..7
**దశిక రాము**
-
धारणाद्धर्ममित्याहु: धर्मो धारयते प्रजा:
यस्याद्धारणसंयुक्तं स धर्म इति निश्चय: |
ధర్మం అన్నమాట ధారణ అనే పదం నుంచి వచ్చింది. ధర్మో ధారయతే ప్రజాః - ప్రజలచే ధరించబడేది, ఆచరించబడేది ధర్మం. ప్రజలలో ఐక్యభావాన్ని తీసుకువచ్చేది, సమాజాన్ని ఒక్కటిగా ఉంచేది, అందరిని భగవంతుని దగ్గరకు చేర్చేది ధర్మం
ధర్మం అన్న పదానికి అర్దం చెప్పడం చాలా కష్టం. ధర్మం దేశకాలాలని బట్టి, వ్యక్తులను బట్టి, వృత్తులను బట్టి, వయసును బట్టి మారుతుం
ధర్మాన్ని కాపాడండి! ధర్మాన్ని రక్షించండి! అంటూ తరచూ వింటూ ఉంటాం. పూజలు ఎక్కువగా చేస్తే, అదే ధర్మాన్ని రక్షించడం అనుకుంటారు చాలా మంది. కానీ అది చాలా పెద్ద పొరపాటు. ధర్మం కేవలం పూజల గురించి, భక్తి గురించి మాత్రమే చెప్పేది కాదు. ధర్మం జీవన విధానం గురుంచి, మనిషి యొక్క మానసిక, భౌతిక, ఆధ్యాత్మిక ప్రవర్తన గురించి చెప్తుంది. మనిషి పుట్టుక ముందు నుంచి, మరణం తరువాతి వరకు, మరణానంతరం ఉండే స్థితిలో కూడా ధర్మం పతిష్టితమై ఉంటుంది. ఈ సృష్టిలో అన్ని ధర్మాన్ని అనుసరించే జరుగుతున్నాయి. మతం ఆచరించే వ్యక్తుల వరకు మాత్రమే పరిమితం. కానీ ధర్మం ఈ లోకంలో జీవం ఉన్నవాటికి, జీవం లేనివాటికి, కదిలేవాటికి, కదలనివాటికి, అన్నిటికి అన్వయం అవుతుంది. అన్నిటి యందూ సూక్ష్మరూపంలో ఉండి నడిపిస్తుంది. మానవ మేధస్సుకు అతీతంగా ధర్మం యొక్క పరిధి విస్తరించి ఉంది
తరువాయి భాగం రే
**ధర్మో రక్షతి రక్షితః
సర్వరోగ నివారిని
సర్వరోగ నివారిని పేరుతో ఎప్పుడో 25 ఏళ్ళ క్రితం ఆయిల్ పుల్లింగ్ అని వచ్చింది. పొద్దున్న ఎవరికి ఫోన్ చేసిన మా ఆయన ఆయిల్ పుల్లింగ్ చేస్తున్నాడనే వాళ్ళు. అదీ ఆగిపోయింది.
తరువాత నీళ్ళ రాజు వచ్చాడు. కుండలు కుండలు నీళ్ళు తాగితే రోగాలు మాయం అన్నాడు. అదీ పోయింది.
పశువుల మాదిరి పచ్చి కూర గాయలు తింటే బలమని ప్రచారం చేశాడు. అదీ పోయింది.
ఈ మధ్య ఒక ఆయన చికెన్ తింటె కొవ్వు తగ్గుద్దని ప్రచారం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకొకాయన వచ్చి రాగులు, సజ్జలు, జొన్నలు, కూరగాయలు అన్నీ కలిపి రసం చేసుకొని తాగండీ అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వము వారేమో యోగా చెయ్యండి రొగాలు మటు మాయమంటుంది.
ఆ మధ్య, అంటే చాన్నాళ్ళ క్రిందట గోదావరి జిల్లాల నుంచి ఒక రాజు గారు వచ్చి, ‘ఉప్పా..! మీరు ఉప్పు తింటున్నారా? అడవిలో జంతువులూ ఉప్పు తినట్లేదు, ఆకాశంలో పక్షులూ ఉప్పు తినట్లేదు. మరి మనుషులెందుకు ఉప్పు తింటున్నారు? ఛీ ఛీ’ అన్నాడు. జనమంతా ఉప్పుని విసిరికొట్టారు.
అంతటితో ఊరుకున్నాడా? ‘నూనా, నెయ్యా - మీరంతా నూనె తాగుతున్నారా? నెయ్యి తింటున్నారా?’ మళ్ళీ సేమ్ డైలాగ్ ‘అడవిలో జంతువులకి నూనె మిల్లులున్నాయా?, అవి డబ్బాలు డబ్బాలు నూనె తాగుతున్నాయా?’ అన్నాడు.
నూనె చుక్క లేకుండా బజ్జీలూ, గారెలూ, పకోడీలు అనబడే పిండి వంటల్ని ఎలా వండుకోవాలో జనాలందరికీ వొలిచి చేతిలో పెట్టినట్లు చెప్పాడు కూడా. సరే అని జనమంతా నూనె డబ్బాలకి సెలవిచ్చి, చుక్కనూనెతో తాళింపులు మొదలు పెట్టారు...!
జనాలంతా ఒక పక్క ఎండు రొయ్యలై, బుద్ధిగా మాటవినే దశకొచ్చారన్న నమ్మకం కుదిరాక, ఒకానొక మంచిరోజు చూసుకుని కృష్ణానది పక్కన మాంఛి స్థలంలో ‘ప్రకృతి ఆహార ఆశ్రమం’ అని ఒకటి మొదలైంది.
ఇంకేఁవుందీ?రోజుకింత, నెలకింతని ప్యాకేజ్ రూపంలో వసూళ్లు చేస్తూ ప్రజలకి ఉప్పూ, నూనె లేని విందులు చేస్తూ, మూడు పచ్చి కూర ముక్కలూ ఆరు ఆకుకూర రసాలతో నిత్యనూతనంగా విలసిల్లుతుంది...!
*
సరే ఇది ఇలా ఉండగా, ఇంకొకాయన ఎవరో రాగి చెంబులంట.. రాగి చెంబుల్లో నీళ్ళు నింపి చంద్రుడి ఎదురుగా పెట్టి, తెల్లారి ఆ నీళ్ళు తాగితే అసలు చావే రాదని ఘంటాపథంగా చెప్పాడు. ఇంకేవుంది, కొట్లలో పడి రాగి చెంబుల వేట...! కాస్త గట్టి బుర్రోడు, గురువుగారు చెప్పిన దానికి ఇంకాస్త తోక తగిలించి, అతుకేయని రాగి చెంబు అన్నాడు..! షాపుల్లోకెళ్ళి లిప్ స్టిక్ వేసుకున్న పెదాలతో రాగి చెంబులున్నాయా అని నాజూగ్గా అడగటం మొదలైంది.
*
అలా అలా వెన్నెల్లో పెట్టిన రాగి చెంబుల్లో నీళ్ళు తాగుతూ, ఉప్పు, నూనె, పులుపూ, తీపీ లేని రాజు గారి వంటలు తింటూ, రెండు వందలేళ్ళు గ్యారంటీ అనుకుంటున్న దశలో గబుక్కున మళ్ళీ కృష్ణాజిల్లా నుంచే మహారాజశ్రీ మాచినేని ఉద్బవించారు!
“నూనె మానేసారా? పిచ్చోల్లారా! మిల్లులో ఆడించిన కొబ్బరి నూనె వంద గ్రాములు తాగండి, ఇక చూడండి!’ అన్నాడు. “నేను చెప్పింది తప్ప మీరు ఇంకేవీ తినకూడదు...! నో నో అంటే నో…!” అన్నాడు కూడా. ఇంకేఁవుంది, కొబ్బరి చిప్పలు సంచిలో యేసుకుని గానుగలంట బడ్డారు జనం...! మాచినేని ప్రొడక్ట్స్ మనకందుబాటులోకొచ్చే మంచిరోజు కోసం మనమంతా ఎదురు చూద్దాం...!
*
సీమ నుంచో, కర్నాటక నుంచో స్వతంత్ర శాస్త్రవేత్తనంటూ (అనుకుంటూ) ఇంకొక సామొచ్చి, ‘పురుగుమందులు తింటున్నారా? ఇళ్ళల్లో రోగాల పంట పండిస్తున్నారా?‘ అంటూ జనాలను ఆహార జ్ఞాన దారుల్లో పరుగులు పెట్టించడం మొదలు పెట్టాడు. ‘పురుగు మందులు లేని చిరుధాన్యాలు తినండీ! మీ ఆరోగ్యాన్ని మీరే సంరక్షించుకోండి!’ అని ఆషాడ మాసం డిస్కౌంట్ లెక్క ప్రజలకి ఆరోగ్య విజ్ఞానాన్ని చవగ్గా పంచి పెడుతున్నాడు.
‘చిరు’ ధాన్యాలండోయ్, ‘చిరు ధాన్యాలు’, ‘సిరి ధాన్యాలు’ అంటూ, ‘పాలు తాగితే హార్మోన్స్ ఇన్ బాలన్స్ అయి ఛస్తారు, సిరి ధాన్యాలు తినండి - చావకుండా కలకాలం బ్రతకండి’ అంటున్నాడు. ఇంకేఁవుంది, తెల్లటి మొలకొలుకల అన్నం, కర్నూలు సోనా బియ్యపు అన్నం తినే బేబక్కాయిలంతా “సామలున్నాయా? అరికలున్నాయా? సొజ్జలున్నాయా?” అని షాపులాల్లని పరుగులు దీయిస్తున్నారు.
*
వీళ్ళంతా ఇలా ఉన్నారు నేనేం తక్కువా అంటూ, ''మట్టి కుండల్లో వండుకుని తినడం మంచి ఆరోగ్యం'' అని మూలనున్న మరో మట్టి శాస్త్రవేత్త గారు, పురావస్తు గృహంలో నిద్ర లేచి మట్టి కుండ యాష్ ట్యాగ్ అన్నాడు.
***
విచిత్రం ఏంటంటే, వీళ్ళెవరూ డాక్టర్లు కాదు. ఆరోగ్య శాస్త్రం చదువుకున్న వైద్యులని మాత్రం ధాటీగా విమర్శిస్తారు.
ఆ ఉపన్యాసాలు చెప్పే వాళ్ళు కానీ, ఈ వినే జనాలు కానీ మిద్దె మీద మొక్కలు పెట్టుకుందాం అనుకుంటారే కానీ, ‘పురుగు మందులని బ్యాన్ చేయమ’ని ప్రభుత్వాలను అడగరు.
ఆరోగ్యానికి హానికదా ‘లిక్కర్ బ్యాన్ చెయ్యండీ’ అని అస్సలు అడగరు.
ధూమపానం చెరుపు చేస్తుంది కదా, ‘సిగరెట్లు బ్యాన్ చెయ్యండీ’ అని కూడా అడగరు.
చెయ్యాల్సింది చేయకుండా ఎంతకాలమని వాళ్ళు చెప్పారనీ, వీళ్ళు చెప్పారనీ ఆరోగ్యం కోసం చెంబులేసుకుని, సంచులేసుకుని పరుగెడతారు?
ఇకనయినా పరుగులాపి ప్రంశాతంగా జీవించండి.
మన పూర్వీకులు అన్నీ తిని చక్కగా పని చేసుకున్నారు.
మనం పని మాని ఇలాంటి వాటి వెనుక
దీనదయాళ్ జీ ఏకాత్మ
దీనదయాళ్ జీ ఏకాత్మ- మానవ సిధ్ధాంతకర్త. వ్యక్తి వికాసమే ఈ సమాజానికి ఆలంబన అని బోధించిన మహనీయుడు. బిజెపి కి "ఆత్మ" "పరమాత్మ" కూడా దీనదయాళ్ జీ ప్రవచించిన సిద్ధాంతమే! మన ప్రియతమ ప్రధాని నరేంద్ర దాస్ మోదీజీ అవిరళ కృషికి ఆలంబన ఆ మహనీయుడు నిర్వచించిన "అంత్యోదయ పథకం". మానవుడు కేవలం కూడు, గూడు, గుడ్డతో సంతృప్తి చెందడు. మనిషి క్రమశిక్షణతో కూడిన స్వేచ్ఛ కోరుకుంటాడు. మానవునికి వికాసమన్నది ఏకకాలంలో అన్ని వైపులనుండి లభించాలన్నదే పండిట్ దీనదయాళ్ళ్ జీ సిద్ధాంత సారాంశం. అందుకే మోదీజీ తన పథకాల్లో భాగంగా (i) భౌతిక వికాసం కొరకు స్వచ్ఛాభారత్, ఇంటింటా మరుగుదొడ్డి నిర్మాణం, యోగా వంటి పలు పధకాలు, (ii) ఆర్థిక వికాసానికి నాటి జనధన్, Make in India, ముద్ర పధకాల నుండి నేటి ఆత్మనిర్భర భారత్ మరియు దళారీలను నిర్మూలించి వ్యవసాయ రైతుకు లభింపచేసిన స్వేచ్ఛ వరకు అనేకానేక పథకాలు, ప్రభుత్వం నేరుగా బ్యాంకుల ద్వారా లబ్థిదారునికి ఖాతా కి చేరవేయటం కూడా ఇందులో భాగమే! (iii) సమాజ వికాసానికి బృహత్తర రహదారులు నిర్మాణం, విసృత గృహనిర్మాణ పథకాలు, దేశంలో అన్ని గ్రామలకు విద్యుత్ సరఫరా మెరుగు పడటం, పేద వారికి ఉచిత గ్యాస్ పంపిణీ, విద్యుత్ మిగులుదేశంగా భారత్ ను ప్రపంచం గుర్తించడం వగైరా వగైరా, (iv) చివరగా Last but not the least "స్వేచ్ఛ" నా దేశం స్వేచ్ఛా దేశం, నా దేశ సరిహద్దులను తాకిన వాడవడైనా పరాజితుడు కావాల్సిందే అనేటువంటి ఒక గొప్ప ఆత్మగౌరవంతో యావత్ దేశప్రజలు ప్రపంచంలోని అగ్రదేశాల సరసన గర్వంగా తలెత్తుకునే విధంగా జీవించటం, అందుకు అనుగుణంగా దేశరక్షణ కల్పనలో వెనుతిరగకపోవటం. తద్వారా యావత్ భారత్ ఖ్యాతి ఖండాంతరాలకు విస్తరించటం ఇదంతా ఆరు సంవత్సరాల బిజెపి పాలనలో దేశప్రజలుకు అందించబడిన ఫలాలు. దశాబ్దాలుగా ఒక సిద్ధాంతం, క్రమశిక్షణ లేకుండా అసలు "తెల్లవాడు పాలిస్తున్నాడో, నల్లవాడు పాలిస్తున్నాడో తెలియని" అయోమయంలో దేశ ప్రజలు అలమటిస్తూ నిరాశ, నిస్పృహలతో, ఇక ఈ అవినీతి కూపం నుండి నా దేశం బాగుపడదు అని దిగులు చెందుతున్న వేళ, సర్వతోముఖంగా ఉదయించిన కమలం, ఒక స్వయం సేవక్ గా ప్రజాసేవలో పూర్తి శిక్షణ పొందిన నరేంద్రుడు నాయకత్వాన అధికార పగ్గాలు చేపట్టి సాధించిన విజయాలకు మూల సిద్ధాంత కర్త అయిన పండిట్ దీనదయాళ్ జీ జన్మదిన వేళ వారిని స్మరించుకుంటూ యావత్ భారత జాతి ఆ మహనీయుని ఆశయాల సాధన కొనసాగింపుకు పునరంకిత మౌతూ కమల వికాసమే కలకాలం దేశానికి రక్ష అని ఎలుగెత్తి చాటుతున్న వేళ ఆ మహనీయునికి ఇవే నా జోహార్లు
శ్రీమద్భాగవతము
**దశిక రారామ
తృతీయ స్కంధం -29
దేవమనుష్యాదుల సృష్టి
ఆ విధంగా ప్రశ్నించిన విదురునితో మైత్రేయుడు ఇలా అన్నాడు “జీవులకు అగోచరుడూ, పురుషోత్తముడూ, యోగమాయా సమేతుడూ, కాలస్వరూపుడూ, నిర్వికారుడూ అయిన జగన్నివాసుడు ఆదికాలంలో సృష్టిని గురించి తీవ్రంగా ఆలోచించాడు. ఆ ఆలోచనా ఫలితంగా సత్త్వం, రజస్సు, తమం అనే మూడు గుణాలు పుట్టాయి. ఆ మూడు గుణాలలో రజోగుణం నుండి మహత్తత్త్వం పుట్టింది. ఆ మహత్తత్త్వం నుండి మూడు గుణాల అంశలు కల అహంకారం పుట్టింది. ఆ అహంకారం నుండి పంచతన్మాత్రలు పుట్టాయి. వాటినుండి సమస్త సృష్టికి మూలకారణాలైన పంచభూతాలు పుట్టాయి. ఆ పంచభూతాలలో ఏ ఒక్కదానికీ ప్రత్యేకంగా లోకాన్ని సృష్టించడం చేతకాక, అన్నీ ఒక గుంపుగా కలిసి పాంచభౌతికమైన ఒక బంగారు గ్రుడ్డును సృష్టించాయి. ఆ గ్రుడ్డు మహాజలాలలో తేలియాడుతూ వృద్ధి పొందుతూ ఉండగా...నారాయణుడనే పేరుతో ప్రసిద్ధి కెక్కే పరబ్రహ్మం వెయ్యి దివ్యసంవత్సరాలు ఆ అండాన్ని అధిష్టించి ఉన్నాడు. ఆ వాసుదేవుని బొడ్డునుండి వేయి సూర్యుల కాంతితో వెలుగుతూ, సమస్త ప్రాణిసమూహంతో కూడిన ఒక పద్మం పుట్టింది. ఆ పద్మంలో నుండి భగవదంశతో చతుర్ముఖ బ్రహ్మ పుట్టాడు. స్వయం ప్రకాశుడైన ఆ బ్రహ్మ నామ రూప గుణాలు అనే సంకేతాలు కలిగి సమస్త జగత్తులనూ సృష్టించాడు. బ్రహ్మదేవుడు తామిస్రం, అంధతామిస్రం, తమం, మోహం, మహామోహం అనే ఐదు విధాలైన మోహస్థితి కలిగిన అవిద్యను పుట్టించి, అది తనకు మోహమయమైన శరీరమని భావించి ఏవగించుకొని, ఆ దేహాన్ని వదిలివేశాడు. బ్రహ్మ వదిలిపెట్టిన ఆ దేహం ఆకలి దప్పులకు స్థానమై రాత్రమయ మయింది. దానిలో నుండి యక్షులూ, రక్షస్సులూ అనే ప్రాణులు పుట్టగా వారికి ఆకలి దప్పులు అధికం కాగా కొందరు బ్రహ్మను భక్షిద్దా మన్నారు, మరి కొందరు రక్షిద్దా మన్నారు. ఈ విధంగా పలుకుతూ వారు బ్రహ్మ సమీపానికి వెళ్ళగా, బ్రహ్మ భయకంపితుడై “నేను మీ తండ్రిని. మీరు నా కుమారులు. నన్ను హింసించవద్దు” అంటూ “మా భక్షత... రక్షత” అనే శబ్దాలను ఉచ్చరించాడు. ఆ కారణంగా వారికి యక్షులు, రక్షస్సులు అనే పేర్లు వచ్చాయి. ఆ తరువాత బ్రహ్మ తేజోమయమైన మరొక దేహాన్ని ధరించి, సత్త్వగుణంతో కూడినవారూ, ప్రకాశవంతులూ అయిన దేవతలను ప్రముఖంగా సృష్టించి, ఆ తేజోమయమైన దేహాన్ని వదలివేయగా అది పగలుగా రూపొంది దేవతలందరికీ ఆశ్రయ మయింది. తరువాత బ్రహ్మ తన కటిప్రదేశం నుండి మిక్కిలి చంచలచిత్తులైన అసురులను సృష్టించాడు. వారు అతికాముకులు కావడం వల్ల ఆ బ్రహ్మదేవుణ్ణి చుట్టుముట్టి రతిక్రియను అపేక్షించి, సిగ్గు విడిచి వెంట పడగా బ్రహ్మ నవ్వుతూ పరుగులు తీసి, శరణాగతుల కష్టాలను తొలగించేవాడూ, భక్తులు కోరిన రూపంలో దర్శనం ఇచ్చేవాడూ అయిన నారాయణుని చేరి ఆయన పాదాలకు ప్రణమిల్లి ఇలా అన్నాడు. సమస్త దేవతలచేత పొగడబడేవాడా! విశ్వానికి క్షేమాన్ని కలిగించేవాడా! రక్షించు! రక్షించు! ఉపేక్షించక నన్ను రక్షించు. నా మాటను ఆలకించు. నేను నీ ఆజ్ఞను తలదాల్చి క్రమంగా...ఈ ప్రజలను సృష్టించగా వారిలో పాపాత్ములైన ఈ రాక్షసులు నన్నే రమించాలని రాగా చింత చెంది ఇక్కడికి వచ్చాను. ఓ సుచరిత్రా! నన్ను రక్షించు.అంతేకాక లోకంలో ఉండేవారికి కష్టాలను కలిగించడానికి, కష్టాలు పడేవారి కష్టాలను దూరం చేయడానికి నీకంటె సమర్థు లెవరున్నారు?” అని స్తోత్రం చేయగా, బ్రహ్మదేవుని దైన్యాన్ని తెలిసికొని నిస్సందేహంగా అందరి హృదయాలను దర్శించే శ్రీహరి “ఓ బ్రహ్మా! నీ ఈ ఘోరమైన శరీరాన్ని విడిచిపెట్టు” అని ఆజ్ఞాపించగా బ్రహ్మ ఆ దేహాన్ని త్యాగం చేసాడు. అప్పుడు ఆ దేహం నుండి మణులు పొదిగిన క్రొత్త బంగారు కాలి అందెలు ఘల్లుఘల్లుమని మ్రోగే పాదపద్మాలు కలది, మెత్తని పట్టుచీరపై మిలమిల మెరుస్తున్న మొలనూలుతో ఇసుకతిన్నెలవలె ఉన్న కటిప్రదేశం కలది, ఒకదానితో ఒకటి ఒరసికొంటున్న కుచకుంభాల బరువుకు నకనకలాడే నడుము కలది, మద్యపానం మత్తుతో చలిస్తున్న అప్పుడే వికసించిన పద్మాలవంటి కన్నులు కలది, కృష్ణపక్షపు అష్టమినాటి చంద్రుని పోలిన నుదురు కలది, మదించిన తుమ్మెదలకు సాటి వచ్చే శిరోజాలు కలది, అందమైన సంపంగి పువ్వు వలె సోగదేలిన ముక్కు కలది, చిరునవ్వులు చిందే చూపుల కలది, తామరపూలవంటి చేతులు కలది....
అబ్జపాణి అని పిలునదగిన ఆ సుందరి సంధ్యారూపంలో పుట్టగా, రాక్షసులు చూచి కౌగలించి, తమలో తాము ఇలా మాట్లాడుకున్నారు. “ఈ సౌకుమార్యం, ఈ నవయౌవనం, ఈ సౌందర్యం, ఈ జాణతనం, ఈ సౌభాగ్యవిశేషం ఏ స్త్రీలకూ లేదు. ఇది చాల చిత్రంగా ఉంది”. అని ఆశ్చర్యపడి ఆ రాక్షసులు “మనమంతా ఈమెను చూచినప్పటినుండి కామోత్కంఠులమై ఉండగా ఈమె మాత్రం మన మీద ఏమాత్రం మక్కువ చూపకుండా ఉండటానికి కారణం ఏమిటి?” అని అనేక విధాలుగా అనుకొని, ఆ సంధ్యాసుందరితో....ఇలా అన్నారు.అరటి బోదెల లాంటి నున్నటి తొడలు గల సుందరీ! నీదే కులం? నీదే ఊరు? నీ తల్లిదండ్రులు ఎవరు? ఎందుకు నీవు ఇక్కడ వంటరిగా తిరుగుతున్నావు? మాకు తెలిసేలా చెప్పు.
సృష్టి ఆదిలో తను సృష్టించిన రాక్షసులబారి నుండి తప్పించుకోడానికి బ్రహ్మదేవుడు తన దేహాన్ని విడిచాడు. ఆ దేహంనుండి ఆ రాక్షసులను మోహంలో పడేసిన సంధ్యాసుందరి జనించింది.
(చిట్టిపొట్టి పదాలతో ఎంతటి గంభీర భక్తిభావాలైనా, సరస శృంగారమైనా పండించగల మేటి పోతన గారి ఆ సంధ్యాసుందరి వర్ణన యిది.)
నీ సౌందర్య సంపదతో ఇంపైన ఈ పుణ్యభూమిలో మోహంతో నీవెంట పడిన దుర్బలులమైన మమ్మల్ని ఎందుకు చేరనివ్వవు? మన్మథుని బాధ మాకు ఎక్కువయింది కదా!”అంటూ వాళ్ళు ఆమె సౌందర్యాన్ని వర్ణించడానికి అలవి కాక ఆలోచిస్తూ...కుచకుంభాల బరువువల్ల జవజవలాడే నడుము ఆకాశం కాగా, అందమైన చిగురాకువంటి హస్తంలో ప్రకాశించే పూలచెండు అస్తమించే సూర్యబింబం కాగా, నల్లగా మెరుస్తూ విప్పారిన కొప్పుముడి చీకటి రేకలు కాగా, స్వచ్ఛమైన భావాలను వెల్లడిస్తూ మెరిసే చూపులు నక్షత్రాలు కాగా, శరీరానికి పూసుకున్న గంధపు పూత సంధ్యారాగం కాగా, స్త్రీరూపాన్ని ధరించిన ఆ సంధ్యాదేవిని అసురులు చుట్టుముట్టి, హృదయాలలో పెచ్చరిల్లిన మోహావేశంతో ఆమెతో మళ్ళీ ఇలా
అన్నారు. క్రొత్తగా వికసించిన తామరపువ్వు వంటి ముఖం కలదానా! పద్మం ఒకే స్థలంలో ఉంటుంది, కాని నీ పాదాలనే పద్మాలు అనేక స్థలాలలో అనేక ప్రకారాలుగా ప్రకాశిస్తున్నాయి కదా!”
అని ఈ విధంగా ఆ రాక్షసులు పలుకుతూ తమ మనసులో తమకం అధికం కాగా ఆ సంధ్యాసుందరిని పట్టుకున్నారు. అది చూచి బ్రహ్మ తన మనస్సులో ఎంతో సంతోషించాడు. అప్పుడు బ్రహ్మ తన చేతిని వాసన చూడగా గంధర్వులూ అప్సరసలూ పుట్టారు. బ్రహ్మ తన శరీరాన్ని వదలివేయగా అది...వెన్నెల రూపాన్ని పొందగా, ఆ దేహాన్ని విశ్వావసువు ముందు నడుస్తున్న గంధర్వులూ అప్సరసలూ తీసుకున్నారు. మళ్ళీ బ్రహ్మ కునుకుపాటు, ఉన్మాదం,ఆవులింత, నిద్రలతో కూడిన శరీరాన్ని ధరించి పిశాచాలనూ, గుహ్యకులనూ, సిద్ధులనూ, భూతాలనూ పుట్టించగా వాళ్ళు దిగంబరులై వెండ్రుకలు విరబోసుకొని ఉండడం చూచి బ్రహ్మ కన్నులు మూసుకొని అప్పటి తన శరీరాన్ని వదలి వేయగా దానిని పిశాచులు గ్రహించారు. అనంతరం బ్రహ్మ తనను అన్నవంతునిగా భావించి అదృశ్య శరీరుడై పితృదేవతలనూ సాధ్యులనూ పుట్టించగా వారు తమను పుట్టించిన అదృశ్యదేహానికి కార్యమైన దేవభాగాన్ని అందుకొనగా ఆ కారణం వల్ల శ్రాద్ధ సమయాలలో పితృగణాలనూ సాధ్యగణాలనూ ఉద్దేశించి హవ్యకవ్యాలను సమర్పిస్తారు. సజ్జనులు సంస్తుతించే ఓ పరీక్షిన్మహారాజా! విను. బ్రహ్మదేవుడు తిరోధానశక్తి వల్ల నరులను, సిద్ధులను,విద్యాధరులను పుట్టించి వారికి తిరోధానం అనే పేరుగల ఆ దేహాన్ని ఇచ్చాడు. తర్వాత బ్రహ్మ తనకు ప్రతిబింబంగా ఉన్న శరీరంనుండి కిన్నెరులనూ, కింపురుషులనూ పుట్టించగా వారు ఆ బ్రహ్మదేవుని ప్రతిబింబాలైన శరీరాలను ధరించి ఇద్దరిద్దరు జతకూడి బ్రహ్మదేవునికి సంబంధించిన గీతాలను గానం చేయసాగారు. అప్పుడు బ్రహ్మ తన మనస్సులో...తాను చేసిన సృష్టి అభివృద్ధి చెందకుండా ఉన్నందుకు బ్రహ్మ చింతించి, నిద్రించి, కాళ్ళూ చేతులూ విదిలించగా రాలిన రోమాలన్నీ పాములుగా మారాయి.
బ్రహ్మదేవుడు తాను పూనిన పని నెరవేరినట్లుగా భావించి తన అంతరాత్మ తృప్తిపడే విధంగా సమస్త జగత్తులో పవిత్రులూ, ముల్లోకాలలో శ్రేష్ఠులూ ఐన మనువులను సృష్టించాడు. ఆ విధంగా పుట్టించి బ్రహ్మ వారికి పురుషరూపమైన తన దేహాన్ని ఇవ్వగా ఆ మనువులు తమకంటే ముందుగా సృష్టింపబడిన వారితో కలిసి బ్రహ్మతో ఇలా అన్నారు. “దేవా! సకల లోకాలకు సృష్టికర్తవైన నీవు చేసిన ఈ విస్తృతమైన సుకృతం ఆశ్చర్యకరమైనది. యజ్ఞాలు మొదలైన క్రియాకాండ అంతా ఈ మనువులను సృష్టించడం వల్ల ప్రశంసనీయమయింది. యజ్ఞాలలోని హవిర్భాగాలను మా నాలుకలతో ఆస్వాదించే అవకాశం మాకు లభించింది” అని అంతరంగాల్లో సంతోషం పెల్లుబుకుతూ ఉండగా బ్రహ్మదేవుని ప్రస్తుతించారు.
బ్రహ్మ శ్రేష్ఠమైన తపస్సు, యోగం, విద్య, సమాధి వీటితో కూడినవాడై ఋషివేషాన్ని ధరించి, ఇంద్రియాలతో కలిసిన ఆత్మస్వరూపుడై ఋషిగణాలను సృష్టించి, వారికి తన శరీరాంశాలైన సమాధి, యోగం, ఐశ్వర్యం, తపస్సు, విద్య, వైరాగ్యం అనే వాటిని క్రమంగా ఒక్కొక్కరికి సంక్రమింపచేసాడు” అని మైత్రేయుడు తెలియజేయగా విని విదురుడు మహానందం పొంది గోవిందుని పాదారవిందాలను తన మనస్సులో స్మరించి, మళ్ళీ మైత్రేయునితో ఈ విధంగా అన్నాడు. ఉత్తమ గుణాలు కల మైత్రేయా! భూమిమీద స్వాయంభువ మనువు వంశం ధర్మసమ్మతమనీ, ఆ వంశంలో స్త్రీపురుష యోగం వల్ల ప్రజావృద్ధి జరిగిందనీ నీవు చెప్పావు. అంతేకాక ఆ స్వాయంభువ మనువుకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారనీ అన్నావు. వారు ఏడు దీవులతో కూడిన భూమండలమంతా ధర్మమార్గం ఎంతమాత్రం తప్పకుండా పుణ్యాత్ములై ఎట్లా పాలించారు? ఓ మునివరా! వారి చరిత్ర అంతా నాకు దయార్ద్రబుద్ధితో వివరించు. అంతేకాక ఆ స్వయంభువ మనువు యోగలక్షణ సంపన్నురాలైన తన కుమార్తె దేవహూతి అనే కన్యారత్నాన్ని ఏ విధంగా కర్దముడనే ప్రజాపతికి ఇచ్చి వివాహం చేసాడు? ఆ దేవహూతి యందు మహాయోగీశ్వరుడైన కర్దముడు ఏ విధంగా సంతానాన్ని కన్నాడు? అంతేకాక ఆ కర్దమ ప్రజాపతి తన కూతురైన రుచి అనే కన్యను దక్షప్రజాపతికి ఇచ్చాడని నీవు చెప్పావు. ఆ రుచి యందు దక్షప్రజాపతి ప్రజలను ఎట్లా సృష్టించాడు? ఇవన్నీ వివరంగా నాకు చెప్పు” అని అడుగగా మైతేయుడు ఇలా అన్నాడు.
🙏🙏🙏
సేకరణ
**ధర్మము-సంస్కృతి*
🙏🙏🙏
**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**
**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏