25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

దీనదయాళ్ జీ ఏకాత్మ

 దీనదయాళ్ జీ ఏకాత్మ- మానవ సిధ్ధాంతకర్త. వ్యక్తి వికాసమే ఈ సమాజానికి ఆలంబన అని బోధించిన మహనీయుడు. బిజెపి కి "ఆత్మ" "పరమాత్మ" కూడా దీనదయాళ్ జీ ప్రవచించిన సిద్ధాంతమే! మన ప్రియతమ ప్రధాని నరేంద్ర దాస్ మోదీజీ అవిరళ కృషికి ఆలంబన ఆ మహనీయుడు నిర్వచించిన "అంత్యోదయ పథకం". మానవుడు కేవలం కూడు, గూడు, గుడ్డతో సంతృప్తి చెందడు. మనిషి క్రమశిక్షణతో కూడిన స్వేచ్ఛ కోరుకుంటాడు. మానవునికి వికాసమన్నది ఏకకాలంలో అన్ని వైపులనుండి లభించాలన్నదే పండిట్ దీనదయాళ్ళ్ జీ సిద్ధాంత సారాంశం. అందుకే మోదీజీ తన పథకాల్లో భాగంగా (i) భౌతిక వికాసం కొరకు స్వచ్ఛాభారత్, ఇంటింటా మరుగుదొడ్డి నిర్మాణం, యోగా వంటి పలు పధకాలు, (ii) ఆర్థిక వికాసానికి నాటి జనధన్, Make in India, ముద్ర పధకాల నుండి నేటి ఆత్మనిర్భర భారత్ మరియు దళారీలను నిర్మూలించి వ్యవసాయ రైతుకు లభింపచేసిన స్వేచ్ఛ వరకు అనేకానేక పథకాలు, ప్రభుత్వం నేరుగా బ్యాంకుల ద్వారా లబ్థిదారునికి ఖాతా కి చేరవేయటం కూడా ఇందులో భాగమే! (iii) సమాజ వికాసానికి బృహత్తర రహదారులు నిర్మాణం, విసృత గృహనిర్మాణ పథకాలు, దేశంలో అన్ని గ్రామలకు విద్యుత్ సరఫరా మెరుగు పడటం, పేద వారికి ఉచిత గ్యాస్ పంపిణీ, విద్యుత్ మిగులుదేశంగా భారత్ ను ప్రపంచం గుర్తించడం వగైరా వగైరా, (iv) చివరగా Last but not the least "స్వేచ్ఛ" నా దేశం స్వేచ్ఛా దేశం, నా దేశ సరిహద్దులను తాకిన వాడవడైనా పరాజితుడు కావాల్సిందే అనేటువంటి ఒక గొప్ప ఆత్మగౌరవంతో యావత్ దేశప్రజలు ప్రపంచంలోని అగ్రదేశాల సరసన గర్వంగా తలెత్తుకునే విధంగా జీవించటం, అందుకు అనుగుణంగా దేశరక్షణ కల్పనలో వెనుతిరగకపోవటం. తద్వారా యావత్ భారత్ ఖ్యాతి ఖండాంతరాలకు విస్తరించటం ఇదంతా ఆరు సంవత్సరాల బిజెపి పాలనలో దేశప్రజలుకు అందించబడిన ఫలాలు. దశాబ్దాలుగా ఒక సిద్ధాంతం, క్రమశిక్షణ లేకుండా అసలు "తెల్లవాడు పాలిస్తున్నాడో, నల్లవాడు పాలిస్తున్నాడో తెలియని" అయోమయంలో దేశ ప్రజలు అలమటిస్తూ నిరాశ, నిస్పృహలతో, ఇక ఈ అవినీతి కూపం నుండి నా దేశం బాగుపడదు అని దిగులు చెందుతున్న వేళ, సర్వతోముఖంగా ఉదయించిన కమలం, ఒక స్వయం సేవక్ గా ప్రజాసేవలో పూర్తి శిక్షణ పొందిన నరేంద్రుడు నాయకత్వాన అధికార పగ్గాలు చేపట్టి సాధించిన విజయాలకు మూల సిద్ధాంత కర్త అయిన పండిట్ దీనదయాళ్ జీ జన్మదిన వేళ వారిని స్మరించుకుంటూ యావత్ భారత జాతి ఆ మహనీయుని ఆశయాల సాధన కొనసాగింపుకు పునరంకిత మౌతూ కమల వికాసమే కలకాలం దేశానికి రక్ష అని ఎలుగెత్తి చాటుతున్న వేళ ఆ మహనీయునికి ఇవే నా జోహార్లు

కామెంట్‌లు లేవు: