పాల్కురికి సోమనాథుడు శ్రీశైల మహాత్మ్యమును "పండితారాధ్య చరిత్ర" పర్వతప్రకరణంలో శిలాదమహర్షియొక్క కఠోరమైన తపస్సుకు మెచ్చి శివుడు అతనికి ముగ్గురు పుత్రులను ప్రసాదించినట్టుగా చెపుతాడు. మొదటివాడు నందీశ్వరుడు. ఇతడు ఎన్నో వేల ఏండ్లు తపస్సు చేసి, శివుణ్ణి మెప్పించి శివుడికి వాహనత్వాన్ని, ప్రమథాధిపత్యాన్ని పొందాడు. రెండవవాడు పర్వతుడు. ఇతడు కఠోరమైన తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి "పర్వతుడను పేరు గల నేను మహాపర్వతాకారాన్ని ధరించి స్థిరంగా నెలకొంటాను. నీవు నా ఉత్తమాంగం(శిరస్సు) పై అధివసించి పూజలు గైకొనుము" అని వేడుకుంటాడు. శివుడు "తథాస్తు" అంటాడు. మూడవవాడు భృంగీశ్వరుడు. ఇతడు కూడా కఠోరమైన తపస్సు చేసి, శివుణ్ణి మెప్పించి, "శివైకనిష్ఠాభక్తుడిగా, శివసభలో విదూషకుడిగా, నాట్యాచార్యుడిగా" ప్రసిద్ధికెక్కాడు. ఈ విషయం స్కాందపురాణంలో కూడా ఉన్నది.
🔹ఇది శ్రీశైల ఆలయ ప్రాకారం పైన గల శిల్పం. కుడి వైపు శిలాదుడు తపస్సు చేస్తున్న దృశ్యం. శివుడు అతణ్ణి అనుగ్రహిస్తున్న దృశ్యం. ఎడమ వైపు శిలాదుని ముగ్గురు పుత్రులు నందీశ్వరుడు, పర్వతుడు, భృంగీశ్వరుడు ఒకే చోట ఉన్న దృశ్యం. మధ్యలో శ్రీశైలం కొండ పైన శ్రీమల్లికార్జున లింగరూపంలో శివుడు వెలసిన దృశ్యం.
#శ్రీశివయోగపీఠం#
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి