25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

**అనంత వాసుదేవ ఆలయం**

 *దశిక రాము**


**మన సంస్కృతి సాంప్రదాయాలు**




అనంత వాసుదేవ ఆలయం శ్రీకృష్ణునికి అంకితమైన ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఈ దేవాలయం శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు ప్రధాన దైవంగా గలది. ఇది భారతదేశంలోని ఒడిషా రాష్ట్రం నందలి భువనేశ్వర్ లో కలదు. ఈ దేవాలయం 13వ శతాబ్దంలో నిర్మించబడినది. ఈ దేవాలయంలో ప్రధానంగా శ్రీకృష్ణుడు, బలరాముడు మరియు సుభద్ర అనే దేవతలను ప్రదానంగా కొలుస్తారు. ఈ దేవాలయంలో దేవతలైన బలరాముడు ఏడు పడగలు గల సర్పం క్రింద నిలుచుంటాడు. సుభద్ర రత్నాల కుండ మరియు తామరపువ్వు లను ఇరు చేతులతో కలిగి యుండి. ఎడమ పాదాన్ని వేరొక రత్నాల కుండపై ఉంచేటట్లుంటుంది. శ్రీకృష్ణుడు గద ను , చక్రాన్ని, కమలాన్ని మరియు శంఖాన్ని కలిగియుండేటట్లుంటుంది. ఈ దేవాలయం "భానుదేవుని" పరిపాలనా కాలంలో "అనంగాభిమ III" యొక్క కుమార్తె అయిన చంద్రికాదేవి కాలంలో నిర్మితమైనది.


* ఇతిహాసం


ఈ దేవాలయం 13 వ శతాబ్దంలో కట్టబడినది. దీనికి పూర్వం ఈ ప్రాంతంలో నిజమైన విష్ణువు చిత్రాన్ని కొలిచేవారు. "తూర్పు గంగా రాజ్యం" యొక్క రాణి అయిన చంద్రిక ఈ స్థానంలో కొత్త దేవాలయం కట్టుటకు నిశ్చయించుకుంది. అదే ప్రదేశంలో అనంత వాసుదేవ ఆలయాన్న్ని నిర్మించింది. ఈ ప్రాంతంలో విష్ణుమూర్తి చిత్రంతో కూడిన పాత దేవాలయం తప్పనిసరిగా ఉంటుంది. "మహానది" వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించిన "మరాఠాలు" 17 వ శతాబ్దం చివరలో భువనేశ్వర్ లో వైష్ణవాలయం పునరుద్ధరణకు బాధ్యత వహించారు.


* నిర్మాణం


రూపంలో ఈ దేవాలయం లింగరాజ ఆలయం తో పోలి ఉంటుంది. కానీ ఇది వైష్ణవ శిల్పాలను కలిగి ఉంటుంది. ఈ ఆలయం, సూక్ష్మ రేఖాంశ పట్టీలను కలిగిన శిఖరాలు (విగ్రహాలు) ఖచ్చితంగా లింగరాజ ఆలయం వలెనే కలిగి ఉంటుంది. కానీ శిఖరాల సంఖ్య ఒక రేఖాంశపట్టీ కి మూడు చొప్పిన కలిగి ఉంటుంది. ఈ దేవాలయ భాహ్య గోడలపై గల శిల్పాలు భువనేశ్వర్ లో గల ప్రతి దేవాలయం వలెనే లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ దేవాలయంలో స్త్రీ శిల్పాలు మితిమీరిన ఆభరణాలు కలిగి యున్నందున వాస్తవికత కనిపించదు.


* జగన్నాథ దేవాలయం, పూరి తో గల తేడాలు


ఈ దేవాలయంలో గల "గర్భగృహం" లో గల విగ్రహాలు పూర్తిగా తయారైనవి. అవి పూరీ లోని జగన్నాధ దేవాలయంలోని విగ్రహాలకు భిన్నంగా ఉంటాయి. ఇచట శ్రీమూర్తులు (విగ్రహాలు)పూరీ దేవాలయంలో వలెనే చెక్కతో కాకుండా నలుపు గ్రానైట్ శిలల నుండి తయారుచేశారు.ఈ దేవాలయం మూలంగా ఈ పట్టణానికి "చక్ర క్షేత్రం" (వృత్తాకార స్థలం) గా పిలువబడుతుంది. పూరీ లో గల దేవాలయం "శంఖ క్షేత్రము" (వక్రాకార స్థలం) గా పిలువబడుతుంది.

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

కామెంట్‌లు లేవు: