25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

ఆనందం పొందాలి అంటే వృత్తులను ఆపివేయాలి.

ఆనందం పొందాలి అంటే వృత్తులను ఆపివేయాలి. చేతనని మేలుకొలపాలి. వస్తువులపై ఆకర్షితులు అవకూడదు. ఆసక్తి పెంచుకోకూడదు. ఆసక్తి ఏర్పడడానికి ముందే మేలుకోవడం అవసరం. ఒకవేళ సుఖం ఉంది అనుకుంటే, అది ప్రారంభమౌతుంది, ముగుస్తుంది. ఒకవేళ అది వున్నా కూడా దాని ఆఖరి పరిణామం దుఃఖమే అవుతుంది. ఈ విషయం తెలుసుకున్నవారు సుఖం ఒక్క క్షణం కూడా దొరకదు అని అంటారు 


కోరికని పూర్తిగా వదలి వేయడం కానీ, కోరికని ఆపివేయడం కానీ, సమస్యకి పరిష్కారం కాదు. కామ క్రోధాల వేగానికి అతీతంగా ఉండాలి. ఆ రెండింటి విషయం లో అనాసక్తుడై ఉండాలి.


మీరు, ముందు కొంచెం ఆనందం లభిస్తే, అప్పుడు లోపలికి వెడతాము అని అంటే, అలా ఎప్పటికి జరగదు. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఒక్క క్షణం కళ్ళుమూసుకోండి. ఒక్క క్షణం లోపలికి వెడుతున్నాను అనే ఆలోచన కలిగి ఉండండి. బాహ్యాన్ని మరచిపోండి. అలా మరచిపోవడం అలవాటు చేసుకోవాలి. కారులో, బస్సులో, రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆఫీసులో ఉన్నప్పుడు ఓ పది, ఇరవై సార్లు అలా బాహ్యాన్ని మరచిపోయి కళ్ళు మూసుకుని ఉండండి. నేను ఒక్కడినే వున్నాను అనుకోండి. మీ శ్వాసను, గుండె చప్పుడుని గమనిస్తూ ఉండండి. లోపలికి ప్రవేశించండి. యోగము అంటే అర్థం నీతో నీవు జోడింపబడడమే.

కామెంట్‌లు లేవు: