**దశిక రాము**
**ఆది శంకరాచార్యుల వారి**
67 హృదాకాశోదితోహ్యాత్మా
బోధభానుస్తమో 2 పహృతా
సర్వవ్యాపి సర్వాధారీ
భాతి భాసయతే 2 ఖిలమ్ || 67
+ ఆకాశ + ఉదితః = హృదయం అనే ఆకాశంలో పుట్టిన, ఆత్మాహి = ఆత్మయే, బోధభానుః = జ్ఞానం అనే సూర్యుడై, తమః = అజ్ఞానమనే చీకటిని, అపహృతః = పారద్రోలి, సర్వవ్యాపి = అంతటా వ్యాపించి, సర్వ + ఆధారి = సమస్తానికి ఆధారమై, భాతి = ప్రకాశిస్తూ, అఖిలం = సమస్తాన్నీ, భాసయతే = ప్రకాశింపచేస్తుంది.
తా|| హృదయం అనే ఆకాశంలో పుట్టిన ఆత్మయే జ్ఞానమనే సూర్యుడై వెలుగొంది అజ్ఞానమనే చీకటిని పారద్రోలి, అంతటా వ్యాపించి, సమస్తానికి ఆధారమై ప్రకాశిస్తూ సమస్తాన్నీ ప్రకాశింప చేస్తుంది.
సాధకుడు ఏదో ఒక క్రియను ప్రత్యేకంగా చేయాలని సాధన లక్ష్యంకాదు. సాధకునితో గురువు ఎన్ని క్రియలు చేయించినా సాధకుని సంస్కారానుసారం ఆతని దుస్సంస్కారాలన్నింటినీ క్షీణింప చేయటానికే చేయిస్తారు. ఆ విధంగా సాధకుని సాధనలో దుస్సంస్కారాలన్నీ క్షీణించగానే సాధకుడు ఏ క్రియలు లేని నిర్మలమైన స్థితిలో హృదయారామంలో ఆత్మారామునితో నిలుస్తాడు. అందువల్ల సాధకుడు ఏ క్రియా విశేషంలో కూడా ఆసక్తుడై ఉండకూడదు. సాధకునకు సాధనలో ఏ క్రియాలేని స్థితి ఎప్పుడు లభిస్తుందో అప్పుడు ఆతనికి ఏ శ్రమాలేని స్థితి సిద్ధిస్తుంది. సాధకుడు తన స్వస్థానంలో తాను నిలుస్తాడు. ఆ పరిస్థితుల్లో సాధకుడు లయయోగంలో తనకు తాను తెలియకుండానే నిలుస్తాడు. సాధకునకు ఏమీ తెలయకుండానే లోన దానంతట అదిగా విన్పిస్తున్న నాదముతో మనస్సు లీనమై ఉండటాన్నే లయ యోగం అంటారు. దీనినే అనహతనాదంతో లీనమై ఉండటం అని కూడా అంటారు.
🙏🙏🙏
సేకరణ
**ధర్మము-సంస్కృతి*
**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**
**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి