5, జనవరి 2025, ఆదివారం

శాంతి మంత్రం

 ✴️✴️✴️✴️✴️✴️✴️✴️

       శాంతి మంత్రం

✴️✴️✴️✴️✴️✴️✴️✴️

*ఓం సర్వేత్ర సుఖిన: సంతు,*

*సర్వే సంతు నిరామయా,*

*సర్వే భద్రాణి పశ్యన్తు*

*మాకశ్చి: దుఃఖ:మాప్నుయాత్...*


*తాత్పర్యం:-*


*సర్వులు సుఖ సంతోషాలతో వర్ధిల్లు గాక..*

*సర్వులు ఏ బాధలు లేక ఆరోగ్యంతో ఉండు గాక..*

*అందరికీ ఉన్నతి కలుగు గాక..*

*ఎవరికీ బాధలు లేకుండు గాక..*


*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వే జనాః సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్ !!!*


*తత్సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!!*


*ఓం నమః శివాయ!!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️

(*సంకలనం : భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

☸️☸️☸️☸️☸️☸️☸️

*విష్ణు సహస్రనామ స్తోత్రము*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

 *విష్ణు సహస్రనామ స్తోత్రము*

           *రోజూ ఒక శ్లోకం*

*అర్థం, తాత్పర్యం, ఆడియోతో*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*శ్లోకం (10)*


*సురేశః శరణం శర్మ*

*విశ్వరేతాః ప్రజాభవః|*


*అహ స్సవంత్సరో వ్యాళః*

*ప్రత్యయః సర్వదర్శనః||*


*ప్రతి పదార్థం:~*


*86) సురేశః -దేవతలకు ప్రభువైనవాడు*


*87) శరణం -తన్ను శరణు జొచ్చినవారిని రక్షించువాడు; ఆర్తత్రాణ పరాయణుడు;*


*88) శర్మ - పరమానంద స్వరూపుడు*


*89) విశ్వరేతాః -విశ్వమంతటికిని బీజము, మూల కారణము.*


*90) ప్రజాభవః - సకల భూతముల ఆవిర్భావమునకు మూలమైనవాడు, జన్మకారకుడు.*


*91) అహః - పగలువలె ప్రకాశించు వాడు. ఎవరినీ ఎన్నడూ వీడనివాడు;*


*92) సంవత్సరః - కాల స్వరూపుడైనవాడు*


*93) వ్యాళః --- పామువలె పట్టశక్యము గానివాడు (చేజిక్కనివాడు)*


*94) ప్రత్యయః - ప్రజ్ఞా స్వరూపుడైనవాడు,  ప్రజ్ఞకు మూలమైనవాడు.*


*95) సర్వదర్శనః -సమస్తమును దర్శించగలవాడు. సమస్తమును చూచుచుండెడివాడు.*


*తాత్పర్యం:~*


*దేవతలకు రాజును, భక్తులకు దేవతలకు వరప్రదాతయును, తన్ను హృదయపూర్వకంగా శరణు పొందినవారిని రక్షించువాడును, పరమానంద స్వరూపుడును, సంసారమను మహావృక్షమునకు బీజమైన వాడును, సకల ప్రాణకోటికి జన్మకారణమైన వాడును, సూర్యకాంతివలె ప్రకాశించువాడును, కాలస్వరూపుడును, తన్నాశ్రయించిన భక్తులను కాపాడువాడును, నాశనములేని కాలస్వరూపుడును, దుర్మార్గులకు సర్పమువలె మహా భయంకరుడును, జ్ఞానస్వరూపుడును, సమస్తమును చక్కగా చూచువాడును అగు శ్రీమన్నారాయణుడికి శిరస్సు వంచి వందనం మొనర్చుచున్నాను*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*(ఏరోజుకా రోజు ఇచ్చిన శ్లోకాన్ని కంఠస్థం వచ్చేదాకా మననం చేద్దాం)*


*సూచన: కృత్తిక నక్షత్రం 2వ పాదం జాతకులు పై 10వ శ్లోకమును నిత్యం కనీసం 11 పర్యాయములు పఠించడం ద్వారా వారు సకల శుభాలను పొందగలరు.*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ఓం నమో నారాయణాయ!*

*ఓం నమః శివాయ!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

*శ్రీమద్ భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

             *(పదవ రోజు)*

 *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*బ్రహ్మ సృష్టి* - *కాల పరిమాణం*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడలేనంటూ, తట్టుకోలేనంటూ విదురుడు తీర్థయాత్రలకు తరలిపోయాడు. అప్పుడు అతనికి మైత్రేయ మహాముని సందర్శనభాగ్యం సంభవించింది. ఆ మహర్షి చెప్పగా భగవంతుని తత్త్వాన్ని తెలుసుకోగలిగాడు విదురుడు.*


*బ్రహ్మదేవుని జన్మవృత్తాంతాన్ని కూడా అప్పుడే తెలుసుకున్నాడతను.*


*బ్రహ్మనాలుగు ముఖాల నుండి ప్రధానమైన నాలుగు వేదాలూ ముందు పుట్టాయి. తర్వాత ఉపవేదాలూ, పురాణ ఇతిహాసాలయిన పంచమవేదం పుట్టాయి.*


*బ్రహ్మ తూర్పు ముఖం నుండి ఋగ్వేదం పుట్టింది. దక్షిణ ముఖం నుండి యుజుర్వేదం పుట్టింది. పశ్చిమ ముఖం నుండి సామవేదం పుడితే, ఉత్తర ముఖం నుండి అధర్వణ వేదం పుట్టింది. ఇలాగే ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వవేదం, శిల్పశాస్త్రం తదితరాలు పుట్టాయి. ఊర్ధ్వ రేతస్కులయిన సనకసనందన, సనత్కుమార, సనత్సు జాతులనూ, మునీంద్రులనూ బ్రహ్మే పుట్టించాడు. అయితే వారంతా సృష్టికి తోడ్పడక, మోక్షాన్ని ఆశించి మరలిపోయారు.*


*దాంతో బ్రహ్మ ఆత్మసమానులయిన పదిమంది మానస పుత్రులను పుట్టించాడు. బ్రహ్మ బొటనవేలు నుండి దక్షుడు పుట్టాడు. తొడ నుండి నారదుడు పుట్టాడు. నాభి నుండి పులహుడు పుడితే, కళ్ళ నుండి క్రతువు, ముఖం నుండి అంగిరసుడు, ప్రాణం నుండి వసిష్ఠుడు, హృదయం నుండి మరీచి పుట్టారు. బ్రహ్మ కుడి చేతి నుండి ధర్మం పుడితే, వెన్ను నుండి కర్దమ ప్రజాపతి పుట్టాడు. ఈ కర్దముడే తర్వాత దేవహూతికి భర్త అయినాడు. ఇలా బ్రహ్మ మనస్సు నుండి, శరీరం నుండి ఎందరు పుట్టినా సృష్టి వృద్ధి కాలేదు. ఏం చేయాలో పాలుపోలేదతనికి.*


*అప్పుడు బ్రహ్మ శరీరం రెండు భాగాలుగా చీలిపోయింది. కుడి భాగం నుండి స్వాయంభువ మనువు పురుషుడుగా పుడితే, ఎడమ భాగం నుండి శతరూప స్త్రీగా పుట్టింది. వారిద్దరూ దంపతులయ్యారు. వారు దంపతులు కావడంతో సృష్టి కొనసాగింది.*


*స్వాయంభువ మనువుకూ, శతరూపకూ ఇద్దరు కుమారులు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడుతో పాటు ముగ్గురు కుమార్తెలు ఆకూతి, దేవహూతి, ప్రసూతి జన్మించారు.*


*ఆకూతి రుచికుణ్ణి పెళ్ళాడింది. దేవహూతి కర్దముని పెళ్ళాడింది. ప్రసూతి దక్షుణ్ణి పెళ్ళాడింది. ఈ పెళ్ళిళ్ళతో, వారి సంతతితో జగత్తు అంతా నిండిపోయింది.*


*కాలపరిమాణం:~*


*పరమాణువు కంటే చిన్న వస్తువూ, విరాట్టు కంటే పెద్ద వస్తువూ లేవు. సమస్త కార్యాచరణ అంతా పరమాణు సంకల్పమే! పరమాణువులు ఒకటికొకటి కలియడంతోనే చర్య సిద్ధిస్తోంది. కాలపరిమాణానికీ, పరిణామానికీ కూడా పరమాణువులే కారణం.*


*సూర్యగమనంతో ఈ కాలాన్ని విభజిస్తున్నారు. సూర్యుడు ఎంతకాలంలో పరమాణువుని చేరగలుగుతాడో ఆ కాలాన్ని పరమాణువుగా పేర్కొంటున్నారు. కాల పరిమాణంలో స్వల్పమైనది పరమాణుకాలం. ఈ విధంగా సూర్యుడు ద్వాదశరాశులతో తేజరిల్లే భువనాన్ని దాటేందుకు ఎంత కాలం పడుతుందో దాన్ని ‘సంవత్సరం’ అంటున్నారు.*


*ఇలాంటి సంవత్సరాలు అనేకానేకం కలిస్తేనే మన్వంతరాలు ఏర్పడుతున్నాయి. రెండు పరమాణు కాలాల్ని కలిపి ‘అణుకాలం’ అంటున్నారు. మూడు అణువుల కాలాన్ని ‘త్రసరేణువు’ అని పేర్కొంటున్నారు. కిటికీ రంధ్రాల నుంచి ప్రసరించే సూర్యకిరణాల్లో కనిపించి, ఆకాశానికి ఎగసిపోయే పరాగకణమే త్రసరేణువుగా గుర్తించాలి. ఈ త్రసరేణువు ఉన్న ప్రదేశాన్ని సూర్యుడు ఎంత సేపట్లో అతిక్రమిస్తాడో అదే త్రసరేణు కాలం. ఇలాంటి మూడు త్రసరేణు కాలాల్ని కలిపి ఒక ‘త్రుటి’ అంటున్నారు. నూరు త్రుటుల కాలం ఒక ‘వేధ’. మూడు వేధల కాలం ఒక లవం. మూడు లవాల కాలం ఒక నిమేషం. మూడు నిమేషాలు ఒక క్షణం. అయిదు క్షణాలు ఒక కాష్ఠ. పది కాష్ఠలు ఒక లఘువు. పదిహేను లఘువులు ఒక నాడిక. రెండు నాడికలు లేదా రెండు ఘడియలు ఒక ముహూర్తం. ఆరేడు నాడికల కాలాన్ని ‘జాము’ అంటున్నారు.*


*పగటి పరిమాణాన్ని తెలుసుకునేందుకు ఓ సాధనాన్ని కనుగొన్నారు. పన్నెండున్నర పలము(మూడు తులాల బరువు)ల గల రాగిపాత్రను తయారు చెయ్యాలి. నాలుగు మినపగింజల ఎత్తుగల బంగారంతో నాలుగు అంగుళాల పొడవుండే ఒక కణిక తయారు చెయ్యాలి. ఈ కణికతో ఆ రాగిపాత్రకు ఒక రంధ్రం చెయ్యాలి. ఈ రంధ్రం ద్వారా నీరు లోపలికి ప్రవేశిస్తే, పాత్ర ఎంత సేపట్లో నిండుతుందో ఆ కాలాన్ని ఒక ‘నాడిక’ అంటారు. ఈ నాడికకే ‘ఘడియ’ అని మరో పేరు కూడా ఉంది.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం)*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

తిరుప్పావై 21వ పాశురం*

 🔱ఓం నమః శివాయ🔱:

*తిరుప్పావై 21వ పాశురం*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైత చైతన్య జాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*21)పాశురం* *ॐॐॐॐॐॐॐॐ*


    *ఏత్తకలఙ్గళ్ ఎదిర్ పొఙ్గి మీదళిప్ప*      

    *మాత్తాదే పాల్* *శొరియుమ్ వళ్లల్ పెరుమ్ పశుక్కళ్* 

    *ఆత్తప్పడ్తెత్తాన్ మగనే! యఱివుఱాయ్;*

    *ఊత్తముడైయాయ్ పెరియాయ్! ఉలగినిల్* 

    *తోత్తయాయ్ నిన్ఱశుడరే.* *తుయిలెళాయ్;*

    *మాత్తారునక్కు* *వలితులైన్దు ఉన్ వాశఱ్కణ్* 

    *ఆత్తాదు వన్దు ఉన్నడి పణియు మాప్పోలే*

    *పోత్తియామ్ వన్దోమ్ పుగళన్దు ఏలోరెమ్బావాయ్!!*



*భావం :-* 

*ॐॐॐॐॐॐॐ*


పొదుగు క్రిందనుంచిన కడవలు చరచరనిండి, పొంగిపొరలునట్లు ఆగక, పాలు స్రవించు అసంఖ్యాకములగు, ఉదారములగు బలసిన ఆవులుగల నందగోపుని కుమారుడా ! మేల్కొనుము. ప్రమాణదార్థ్యముగల మహామహిమ సంపన్నా !



ఈ లోకములో ఆవిర్భవించిన జ్యోతిస్వరూపా ! నిద్రనుంచి లెమ్ము, శతృవులు నీ పరాక్రమమునకు లొంగి మేముకూడా నిన్ను వీడియుండలేక నీ పాదములనే స్తుతించి మంగళాశాసనము చేయుటకై వచ్చితిమి. 



పాలను పిడుకుటకై పొదుగల క్రింద ఎన్ని భాండములుంచినను అవన్నియు పొంగి పొరలి పోవునట్లు క్షీరధారలను వర్షించే గోసంపద గల్గిన శ్రీ నందగోపుని కుమారుడవైన ఒ శ్రీకృష్ణా! మేల్కొని మమ్ము కనరా వయ్యా!



 అప్రతిహత ధైర్య సాహసములను కల్గియును ఆశ్రితపక్షపాతివై, సర్వులకును ఆత్మ స్వరూపుడవైన నీవు యీ భూలోకమునందు అవతరించిన ఉజ్జ్వల రత్న దీపమా! వేద ప్రమాణ ప్రసిద్ధుడా! ఆ వేదము చేతనైనను ఎరుక పడనంతటి మహా మహిమాన్వితుడా! ఈ దీనులను కటాక్షించి మేలుకొనుము.



 శత్రువులెల్లరు నీ పరాక్రమమునకు తాళజాలక భయపడి నీకు ఓడిపోయి, నీవాకిట నిల్చి, నన్ను శరణుజొచ్చిన రీతిని మేమందరమూ అనన్య ప్రయోజనులమై 'నీవే తప్ప ఇతః పరంబెరుగ'మని నీ పాదానుదాసులమై వచ్చితిమి.



నీ దాసులమైన మేమందరమును నీ దివ్య కల్యాణ గుణ సంకీర్తనము చేయగా వచ్చినాము. నీ దివ్య మంగళ విగ్రహమునకు దివ్య మంగళా శాసనము చేయ నిల్చినాము స్వామీ! నిన్నాశ్రయించి వచ్చిన మమ్ము కరుణించుటకు మేలుకొనుస్వామీ! లేచి రావయ్యా! అని వేడుకొంటున్నారు. 



*అవతారిక :-*

*ॐॐॐॐॐॐॐॐॐ*


గోపికలు పురుషాకార భూతురాలగు నీలాదేవిని మేల్కొలిపిరి. ఆమె మేల్కొని 'నేను మీలో ఒకదానిని కదా ! నన్ను ఆశ్రయించిన మీకు ఎన్నడును లోపము ఉండదు.



రండి. మనమందరము కలసి శ్రీకృష్ణుని మేల్కొలిపి అర్థింతుము.' అని తాను  శ్రీకృష్ణ భగవానుని సమీపమునకు వారిని తోడ్కొనిపోయి 'నీ గుణములకు ఓడి వచ్చినారము, అనుగ్రహింపుము'. అని ఈ పాశురమున నీలాదేవి  గోపికలతో కూడి శ్రీకృష్ణుని అర్థించుచున్నది.    



నీళాకృష్ణులను మేల్కొల్పిన గోపికలందరూ నీళాదేవిని స్వామి కరుణాకటాక్ష వీక్షణ రసఝరిలో ఆనందస్నానం చేయించమని ప్రార్ధించారుకద! మరి వారి ప్రార్ధనను విన్న ఆమె 'భోగ్యదశలో నేనును మీలో ఒకతెనే కదా!



 కావున మనమంతా కలిసి 'శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే! శ్రీమతే నారాయణాయనమః' అని స్వామిని వేడుకొందామన్నది. ఈనాటి మాలికలో నీళాదేవితో కూడిన ఆండాల్ తల్లి తమ సఖులందరితో కలిసి స్వామిని కృపజేయుడని ప్రార్ధిస్తున్నది. శ్రీకృష్ణుని మేల్కొలుపుతున్నది.

   


*శహనరాగము - ఏకతాళము*

*ॐॐॐॐॐॐॐॐॐ*


ప.. కడవల పాలిచ్చు గో సంపద గల నందపుత్ర!

    విడిచిరావొ? నిద్ర! ఇంక మేలుకో!


అ..ప.. పుడమిని నిను నమ్మువారి కాపాడ నవతరించిన 

    వాడ! తేజోరూపుడా! నిద్ర మేలుకో!


చ.. ఎదుట నీకు నిలువలేక, బలహీనత శత్రువులు 

    పదముల శరణన్న రీతి, నీదు వాకిటచే నిలిచి 

    నీదు గుణ విశేషములను కీర్తించగ వచ్చినాము 

    నీకు మంగళాశాసన మాచరింప వచ్చినాము 

    కడవల పాలిచ్చు గోసంపద గల నందపుత్ర!

    విడిచిరావొ? నిద్ర! యింక మేలుకో!


*ॐॐॐॐॐॐॐॐॐ*


*ఆచార్యుడి ద్వారా శరణాగతి*

*ఆండాళ్ తిరువడిగలే శరణం*    


*ॐॐॐॐॐॐॐॐॐ* 


భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఫలితాలు దక్కుతాయో దక్కవో చెప్పలేం కానీ, "న సంశయోస్తి తత్ భక్త పరిచర్య రతాత్మనామ్" ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అందిచేటివట్టి భక్తాగ్రేసరులైన ఆచార్య ఆశ్రయణం చేసిన వారికి సిద్ది తప్పక కలిగే తీరును, సంశయం అక్కర లేదు అని నిరూపిస్తారు.



 అయితే ఆచార్యులయందు విశ్వాసం కలగటం కొంచం కష్టం, ఎందుకంటే ఆచార్యులు కూడా మనలాగే ఉంటారు. భగవంతుణ్ణి చేర్చటానికి వీరు తోర్పడుతారని విశ్వాసం కలగదు. ఆండాళ్ తిరుప్పావైలో కనిపించిన దాన్ని విశ్వసిస్తూ కనిపించని దానివైపు సాగవలే అని నేర్పుతుంది.



ఇక్కడ మనకు రెంటిపై విశ్వాసం కలగాలి, ఒకటి ఇక్కడ భగవంతుణ్ణి చూపించే ఆచార్యుడిమీద, రెండవది ఆ భగవంతునికి మరొక రూపమై ఉన్న మనకు కనిపించే అర్చామూర్తి యందు. మన కంటికి కనిపించే సరికి మనకు నమ్మకం కలగటం కొంచం కష్టం. అయితే ఈ యుగంలో మాత్రం కేవలం విగ్రహ రూపంలోనే కనిపిస్తాడు.



ఇతర యుగాల్లో కృష్ణుడిగా, రామునిగా కనిపించేట్టు తానూ వచ్చాడు. కనిపిస్తున్నాడు కదా, ఇతనేంటి దేవుడు అని సామాన్యులేకాదు వేదాధ్యనం చేసిన చతుర్ముఖ బ్రహ్మ, ఇంద్రుడంతటి వారే పొరపాటు పడక తప్పలేదు.


ఇంద్రుడు దేవతల అధిపతి, పరమ గర్విష్టి. అలాంటి వానికి ఇంద్రయాగం అని చేస్తుండేవారు గోకులంలో పెద్దలు. వానలు

ఇచ్చేవాడు ఇంద్రుడని వారి విశ్వాసం. ఒకరోజు గోకులంలో పెద్దలంతా ఇంద్రయాగం తలపెట్టారు.



అందరూ ఇంద్రుడికి అర్పించటానికి పదార్థాలను తయారుచేస్తున్నారు. అయితే కృష్ణుడికి ఇదేంటో తెలుసుకోవాలని కూతుహలపడి, పెద్దలని ఆడిగాడు.



అయితే వారు వర్షాలు ఇచ్చే వరణుడు, ఇంద్రుడి ఆదీనంలోనే ఉంటాడుకదా, ఆ వర్షాలు వస్తేనేకదా మనకు పంటలు పండుతాయి, గోవులకు ఆహారం లభిస్తుంది. ఆ గోవుల పాడిపై మన జీవనం ఆధారపడి ఉంది అందుకే చేస్తున్నాం అని చెప్పారు. అయితే ఇంద్రుడు దేవతల అధిపతి, ఒక ఉద్యోగి, ఇలాంటివారెందరో తన ఆధీనంలో పని చేస్తున్నవారు ఉన్నారు.



 ఈ విశ్వం యొక్క స్థితి కోసం. అలాంటిది తాను ఇక్కడే ఉంటుంటే తనను మరచిపోయి, ఆ ఇంద్రుడి కి చేయటం ఏంటీ, ఆ ఇంద్రుడు ఇవ్వాలన్నా తాను వెనకనుండి ఇస్తేనేకదా, ఇవ్వగలడు అని, ఆ ఇచ్చేవాన్ని నేనిక్కడే ఉండగా నన్ను కాదని చేస్తున్నారే అని శ్రీకృష్ణుడు అనుకున్నాడు.



 వాళ్ళకందరికి ఈ విషయం ఎలాగో తెలుపాలి అని అనుకుని, అందరినీ ఒక దగ్గరికి చేర్చి, వానలు ఇచ్చేది ఇంద్రుడా కాదు, సూర్యుని శక్తికి సముద్రంలోని నీరు మేఘాలుగా మారితే, ఆపై గాలి వీస్తె మన దగ్గరకు వచ్చాయి.



 ఆ గోవర్థన పర్వతం అడ్డుకోవడంచే మనకు వర్షంగా వస్తుంది. మనం గోవర్థన పర్వతానికే ఈ పదార్థాలను అర్పించి కృతజ్ఞత తెలుపుకోవాలి అని విన్నపించుకున్నాడు. అందరికి సభబే అనిపించి అందరూ ఆ గోవర్థన పర్వతానికే పదార్థాలను సమర్పించారు. తనే పర్వతంలో ఆవేశించి, నైవేద్యం పుచ్చుకున్నాడు.



ఇంద్రుడికి పదార్థాలు అందకపోవడంచే ఆగ్రహించి ఏడు రోజులు వరుసగా రాల్ల వాన కురిపించాడు. ఇదిగో మనం చేసిన తప్పుకి ఇంద్రుడు ఆగ్రహించాడు, కన్నయ్యా అని అందరూ కృష్ణుణ్ణి చేరగానే, మనం ఆరగింపు ఇచ్చిన ఆ కోండే మనల్ని కాపాడదా ఏం అంటూ ఒంటి వ్రేలితో కొండను ఎత్తి అందరిని రక్షించాడు. గోవర్థనోద్దారి అయ్యాడు ఆయన.



 ఇంద్రుడు తనకని అర్పించినవి తానే తినాలి అనుకున్నాడు, ఆ ఇంద్రుడిలోనూ ఉండేవాడు కృష్ణుడేకదా, అదే శ్రీకృష్ణార్పణ మస్తూ అని అనుకునేవాడైతే అన్ని పదార్థాలు ఉండేవి, నేనే తింటున్నాను, నాలోని పరమాత్మకు కాదు అని భావించాడు కాబట్టే ఇంద్రుడికి బుద్ది చేప్పే పరిస్థితి కల్పించాడు కృష్ణుడు. ఇంద్రుడంతటి వానికే తన ప్రభువు ఇతను అని ఇంగితం లేదు అంటే మన లాంటి సామాన్యులం మనం ఏం చెప్పగలం. 



అయితే ఇంద్రుడు దేవతల లో ఒకడు, మరి ఆ దేవతల అందరికి అదిపతిగా ఉండే చతుర్ముఖ బ్రహ్మకు కూడా ఈ పరిస్థితి తప్పలేదు. గోకులంలో కృష్ణుడి లీలలు అందరూ చెప్పుకుంటుంటే, బ్రహ్మకు కూడా అసూయ కలిగి, ఇదేదో చూడాలి అని గోకులంకు వచ్చాడట.



 ఆ రోజు కృష్ణుడు ఆ గోపబాలుర మద్య కూర్చుని సద్దులు ఆరగిస్తుండగా చూసి, ఈ ఎంగిలి వేషాలు వేసే వాడా దేవుడంటే అని అనుకుని, ఈ వ్యక్తి ఏంటో ఇంద్రజాలం చేస్తున్నాడు.



 వీడికి బుద్ది చెప్పవలె అని అనుకున్నాడు. గోవులను అపహరించి ఒక గుహలో దాచాడు. అంతలో ఒక గోప బాలుడు వచ్చి కృష్ణా మన గోవులు కనిపించటం లేదు అని చెప్పాడు.



 కృష్ణుడు వాటిని వెతుకుతూ అటు వెళ్ళగానే, గోపబాలురనూ అపహరించి మరొక గుహలో దాచాడు బ్రహ్మ. అయితే గోప బాలురను వదిలి వెడితే గోకులంలోని వారంతా కృష్ణుణ్ణి దేహశుద్ది చేస్తారు అని అనుకున్నాడు బ్రహ్మ.



ఇక బ్రహ్మ లోకం కి బయలుదేరాడు బ్రహ్మ, ఇది చూసి శ్రీకృష్ణుడు బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నాడు.ఎన్నెన్ని దూడలు, ఎన్నెన్ని గోవులు, ఎందరెందరి గోపబాలురను బ్రహ్మ దాచాడో అందరి రూపాలను తనదిగా చేసుకున్నాడు కృష్ణుడు.



అందరి రూపాలు ఆయనే దాల్చాడు, వారి వారి ప్రవృత్తులతో సహా ఏడాది కాలం అట్లానే ఉన్నాడు. గోకులంలో ఇప్పుడు అందరి రూపాల్లో ఉన్నది కృష్ణుడే అవటంతో నందగోకులం అంతా ఆనంద తరంగితం అయ్యింది. 



ఇక్కడిది చేస్తూ బ్రహ్మ లోకం వెళ్ళి బ్రహ్మ రూపు దాల్చి, అక్కడివారితో తన రూపు వేసుకొని ఒకడు వస్తాడు బాగా శుద్ది చేయండి అని చెప్పి వచ్చాడు కృష్ణుడు.



బ్రహ్మకు తనలోకంలో కూడా ఆదరణ లేకుండాపోయి నంద గోకులం చేరి చూస్తే ఎక్కడి పిల్లలు అక్కడ, ఎక్కడి గోవులు అక్కడ కనిపించాయి. ఆశ్చర్య పడి తాను దాచిన గుహల్లో చుస్తే తను దాచినవి కనిపించాయి. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూస్తే ప్రతి రూపంలో కృష్ణుడే కనిపించాడు.



అప్పుడు ఆ చిన్నారి కృష్ణుడిపై మూడు తలలు వాల్చి స్వామి స్వరూపాన్నీ కీర్తన చేసి, ఎందుకిచ్చావీ బ్రహ్మ పదాన్ని, ఎంత పదవి కట్టబెట్టావో అంత గర్వం కూడ నాకు పెరిగింది, ఈ గర్వం లేని గోప జనం ఎంత అదృష్టవంతులయ్యా, అలాంటి వారి పాద దూళినైనా బాగుండేది అని బ్రహ్మ అంతటివాడు పశ్చాత్తాపం చేందాడు. 



అలాగే ఒక చిన్న స్వరూపం భగవంతుడు దరించే సరికి మనకు ఒక అవజ్ఞత, చులకన భావం ఏర్పడుతుంది.



 కనిపించక పోతే అమ్మో అంటాం, కనిపిస్తే ఓసీ ఇంతేనా అంటాం. ఆనాడు బ్రహ్మ, ఇంద్రులకి కనిపించే వాడిపై విశ్వాసం కలగలేదు కారణం ఆచార్య అనుగ్రహం లేక పోవటం. అదే భగవంతుడు ఈనాడు అర్చా స్వరూపం లో ఉన్నాడు.


అయితే కొందరు కనిపించే శక్తిని బట్టి తత్వాన్ని గుర్తించాలని అది అగ్నిహోత్రంలో, ఆదిత్యున్నిలో, జ్ఞానుల హృదయాల్లో భగవంతుణ్ణి దర్శించాలని అని చెప్పారు.



 సామాన్యులకి మానసికఆధారం కోసం ఏదో ఒక రూపం ఉండాలి కనుక మొదటి మెట్టుగా ఈ విగ్రహాంలో చూడొచ్చు, ఆపై విగ్రహం లేకుండా శక్తిరూపాల్లో భగవంతుణ్ణి చూడాలి అని చెప్పారు.



కాని అది తప్పు. ఒకటి తర్వాత ఒకటి పై పై కి చూపిస్తూ ఉన్నాయి కనుక, కాలుస్తోంది కనుక అగ్ని, ఆపై కాల్చకుండానే నిత్యం కాంతినిస్తుంది కనుక సూర్యుడు, ఆపై కదల్చ కుండానే చైతన్యంచే కదుపుతోంది కనుక హృదయాన్ని ఉపాసన చేస్తాం.



 *"ప్రతిమాసు అప్రబుద్దానాం"* అంటే విగ్రహం అనేది వీటికంటే ఎదో పైకే చెంది ఉండాలి. కేవలం శక్తిని బట్టేనా గుర్తించేది, తత్వం బట్టి కదా, అలా తత్వాన్ని గుర్తించగలిగేవాడు ప్రతిమ లేక విగ్రహంలో గుర్తిస్తాడు. అలాంటివాడు బాహిరమైన వాటియందు దృష్టి ఉండని వాడు మాత్రం గుర్తిస్తాడు. ఎలాగంటే, ఒక విద్యుత్ తీగను చూసి అదేం కాలటం లేదు.



వెలగటం లేదు అని ముట్టు కుంటే ప్రాణం తీస్తుంది. కాని అదే తీగ అంచుకు చేరగానే ఒక విద్యుత్ దీపాన్ని వెలిగిస్తుంది అని తెలిసినవాడు ఈ బాహిరమైన వాటియందు దృష్టి లేకున్నా ఆ లోపల విద్యుత్ తత్వాన్ని తెలుసుకొని ఉంటాడే.



అలాగే విగ్రహ స్వరూపం కదలక పోయినా, భగవత్ సాక్షాత్కారానికి మొదటి మెట్టే కాదు, చివరి మెట్టు కూడా. విగ్రహంలో కూడా తత్వం ఉందని కాదు, *"విగ్రహమే తత్వం"* అని గుర్తించాలి. 



ఆండాళ్ తిరుప్పావై సారాంశం ఆ విగ్రహం పై విశ్వాసం కలిగించటమే. అందుకే ఆండాళ్ శ్రీవెల్లిపుత్తూర్ లో వటవత్రశాయిని కొలిచింది, వేంకటాచలపతినికి శరాణాగతి చేసింది.



 తిరుమాలైజోలు సుందరభాహునికి మొక్కుబడి చేసింది, శ్రీరంగనాథున్ని చేరింది, శ్రీకృష్ణుడిని మనస్సులో భావించింది, పాల్కడలిలో స్వామిని పాడింది.



ఇన్నింటిలో తత్వం ఒకటే అని తన ఆచరణ ద్వారా మనకు చూపించింది ఆండాళ్. అలాగే ఆచార్యుని ద్వారా భగవంతుణ్ణి దర్శించవలెనని తెలిపింది. భగవంతుణ్ణి ఆరో స్వరూపంగా ఆచార్యులలో చూడవచ్చునని తెలియజేసింది. మొదట ఆ విశ్వాస పూర్ణత మనకు ఏర్పడితే, ఆ పూర్ణతత్వాన్ని మనం దర్శించగలం. 



నిన్న అమ్మని లేపారు, ఆమ్మ లేచి నేను మీ తోటిదాన్నే కదా, పదండి అందరం కల్సి స్వామిని లేపుదాం అని వీళ్ళతో కలిసింది. ఇక మనవాళ్ళంతా స్వామి వద్దకు చేరి *"శ్రీమన్నారయణ చరణౌ శరణం ప్రపద్యే"* అంటూ శరణాగతి చేస్తున్నారు. ఉపాయం భగవంతుడే అని మనకు తెలుసు, అమ్మ మనల్ని ఆయనతో చేర్చే ప్రాపకురాలిగా ఉంది. అమ్మ ద్వారా పొందిన జ్ఞానంతో మన వాళ్ళు ఇలా ప్రార్థన చేసారు.



 ఈరోజు మనవాళ్ళు *"మగనే!"* కుమారుడా *"అఱివుఱాయ్"* తెలివి తెచ్చుకో అంటున్నారు. ఐతే మన వాళ్ళకు శ్రీకృష్ణుడిని నేరుగా ఆశ్రయించకూడదు, ఆచార్యుడైన నందగోపుని ద్వారా ఆశ్రయించాలి అని తెలుసు.



 అందుకే నందగోపుడి లక్షణాలు తెలుపుతూ *"ఆత్త ప్పడైత్తాన్"* లెక్కకు అందనన్ని *"వళ్ళల్ పెరుం పశుక్కళ్"* ఇచ్చే ఔదార్యం కల్గిన పశువులు, శ్రీకృష్ణుడికీ ఇదే ఉదార స్వభావం కదా ఇది నందగోపుని సంబంధంతోనే కదా వచ్చింది.



 ఇచ్చే స్థితి తనది పుచ్చు కోనివాడిదే లోటు అన్నట్లు ఆ పశువులు ఎప్పుడు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా పాలు ఇచ్చేవి, ఎలా ఇచ్చేవి ఆ పాలు అంటే

"ఏత్త కలంగళ్" ఎన్ని కుండలు పెట్టినా, "ఎదిర్ పొంగి మీదళిప్ప మాత్తాదే పాల్ శొరియుమ్" పాల ధారలు పొంగుతుంటాయి, ఆ పొంగటం క్రింది నుండా పాలు పొంగుతున్నాయి అన్నట్లు ఇచ్చేవి.



ఇక్కడ నందగోపుడు ఆచార్యుడు, గోవులు శాస్త్రములను అధ్యయనం చేసిన మహనీయులు, ఆ శాస్త్రములు కఠినమైనవి, గోవులు వనం అంతా తిరిగి అక్కడి పచ్చికను తిని, అనుభవించి మనకు స్వచ్చమైన పాలను అందించినట్లే, జ్ఞానులైన మహనీయులు శాస్త్రారణ్యాలలో సంచరించి అక్కడి క్లేషాలను తాము అనుభవించి తత్-సారమైన భగవత్-గుణములైన పాల దారలను మనపై కురిపిస్తారు. 



కుండలు శిష్యులలాంటివి అనుకోవచ్చు, ఆ ఇవ్వడం నాలుగు కారణాలనే పొదుగుల ద్వారా ఇస్తుంటారు, తమకు పెద్దలు ఇచ్చారు కనుక ఇవ్వాలని కొందరు, ఆవలి వాడు అడుగుతున్నాడే అని కొందరు, ఆవలి వాడు కష్టపడుతున్నాడే అని తీర్చడానికి కొందరు, తమకు తెల్సింది చెప్పకుండా ఉండాలేక కొందరు ఇస్తుంటారు. అలాంటి జ్ఞానులనెందరినో శిష్యులుగా కల వారు మన రామానుజాచార్యులవారు.



అలాంటి ఆచార్యులవద్ద కుమారుడిగా ఉండే స్వామి తెలివి తెచ్చుకో, నీవు వచ్చింది గోకులానికి, నీవై కోరి వచ్చావు మాలాంటి వారి వద్దకి. పరమపదం లో నిత్యశూరులవద్ద తన సంకల్పాన్ని గుర్తించి చేసేవారుండగా, తనను తాను తెలియనివాడైనందుకే కదా, మా మద్యకు వచ్చి మా అరాధన అందుకుంటున్నావు, ఇది మా పాలిట నీదయ. *"ఊత్త ముడైయాయ్! పెరియాయ్!"* నీకు దృడమైన ప్రమాణం నీకుంది వెనకాతల, వేదైక వేద్యుడివి.



 ఆ వేదానికే అందనివాడివి, అలా అందనివాడివి *"ఉలగినిల్ తోత్తమాయ్ నిర్ఱ"* మా మద్యకు అందే వాడిలా వచ్చి *"శుడరే!"* దివ్య కాంతులీడుతూ ఉన్నావు, మేం క్రమం తప్పకుండా మీ అమ్మ నాన్నలను లేపి వారి ఆజ్ఞతో వచ్చాం *"తుయిల్ ఎరాయ్"* తెలివి తెచ్చుకో.


వాళ్ళు ఎట్లా వచ్చారో విన్నపించుకున్నారు *"మాత్త్తార్"* శత్రువులైన వాళ్ళు *"ఉనక్కు వలి తొలైందు"* వాళ్ళ భలాన్ని ప్రక్కన పెట్టుకొని *"ఉన్-వాశఱ్కణ్"* నీ ద్వారం ముందు పడిగాపులు పడేవాళ్ళలా *"ఆత్తాదు వందు"* ఎక్కడైతే నీ భాణాల దెబ్బలకు బయపడి *"ఉన్-అడిపణియుమా పోలే"* నీపాదాలనే సేవించుకొనేట్లుగ వస్తారో, మేం అలానే వచ్చాం.



దీంతో స్వామికి భాద అయ్యి, మీకు శత్రువుల పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నట్లుగా భాద పడ్డాడు, లేదయ్యా *"పోత్తియాం వందోమ్"* మేం కుడా ఒకనాడు వాళ్ళకేం తిసిపొలేదయా, ఒకప్పుడు మేం అభిమానం కల్గి మేం నీ దగ్గరకి రావటం ఏంటి అనుకునే వాళ్ళం, కానీ నీవంతటివాడివి ఇక్కడికి దిగి వచ్చావు, మాదగ్గరికి కూడా రాగలవు, కానీ మేం ఆగలేక పోతున్నాం, అర్తి తక్కుటుకోలేక నీ పాద ఆశ్రయణం కోసం వచ్చాము. 



అయితే శత్రువులు వాళ్ళ శరీరాన్నీ కాపాడుకోవటానికి నీ దగ్గరికి శరణూ అంటూ వస్తారు, మేం మా ఆత్మ రక్షణ కోసం వచ్చాం, వాళ్ళు నీ బలానికి లొంగి వస్తే మేం నీ గుణాలకు లొంగి వచ్చాం.



వాళ్ళు నీ భాణాల దెబ్బలకు తట్టుకోక వస్తే మేం నీ కళ్యాణ గుణాల దెబ్బలకు తట్టుకోక నీ కళ్యాణ గుణాల కీర్తన చేద్దాం అని వచ్చామయ్యా *"పుగరందు"* ఆనందంతో వచ్చాం, ఇక పై అంతా నీ భాద్యత అంటూ శరణాగతి చేసారు.


🕉️🌞🌏🌙🌟🚩


*తిరుప్పావై 21 వపాశురము/తెలుగు పద్యానువాదము* 


*ॐॐॐॐॐॐॐॐॐॐ*


సీసమాలిక.

బంగారు కడవలు పాలతో నిండెను 

         పొంగి పొరలి పోయి భువిని చేరె 

సంపద నిండైన స్వామిగా జనియించె

          నందుని గారాల నందనుండు 

వైకుంఠమును వీడి వైరుల వెదకుచు 

           జగములందు తిరిగి చంపినావు 

ముక్తి నొసగుటకు భక్తుల చేరెడు

      మేలుకో మా స్వామి జాలమేల

శౌరిని చూసిన వైరులు పారిరి

         ఎదిరింప బీరులై బెదిరినారు!!


తే.గీ. సర్వ శక్తులు నీచెంత సన్నగిల్లె 

ఉలుకు పలుకు లేక యిపుడు యుండనేల 

పక్షి వాహనుండా మాకు పరను యొసగు  

మంగళాశాసనము చేసి మమ్ము గావు 

శ్రద్ధ భక్తిని కల్పించి బుద్ధి నొసగు 

శ్రీధరుని మానసంబున స్థిరము కమ్ము!!


🕉🌞🌎🌙🌟🚩

జయమంత్రము

 *జయమంత్రము*


*ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మనసు దుర్బలంగా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ జయమంత్రాన్ని నమ్మకం తో పఠించి  హనుమంతునికి ఒక్క కొబ్బరి కాయ పంచదార ను నివేదించి నిర్భయంగా ముందుకు వెళ్ళండి ఒక్క సారిగా మీ మనసు తేలిక పడి యధార్థమైన త్రోవ భోధ పడుతుంది!!  మీ మనసు తేలిక పడిన తరువాత చిన్న పిల్లల కు పానకం వడపప్పు పంచండి.


 


జయత్యతి బలో రామః 

లక్ష్మణస్య మహా బలః !

రాజా జయతి సుగ్రీవో 

రాఘవేణాభి పాలితః !!


దాసోహం కౌసలేంద్రస్య 

రామస్యా క్లిష్ఠ కర్మణః !

హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుతాత్మజః !!


నరావణ సహస్రం మే 

యుధ్ధే ప్రతిబలం భవేత్ !

శిలాభిస్తు ప్రహారతః

పాదపైశ్చ సహస్రశః !!


అర్ధయిత్వాం పురీం లంకాం 

మభివాద్యచ మైథిలీం !

సమృధ్ధార్థ్యో గమిష్యామి 

మిషతాం సర్వ రక్షసాం !!


హనుమాన్ అంజనాసూనుః

వాయుపుత్రో మహాబలః

రామేష్ఠ ఫల్గుణః స్సఖః

పింగాక్షోమిత విక్రమః

ఉదధిక్రమణశ్చైవ సీతా శోక వినాశకః

లక్ష్మణః ప్రాణదాతాశ్చ దశగ్రీవశ్చ దర్పహ.


ద్వాదశైతాని నామాని

కపీంద్రశ్చ మహాత్మనః

స్వాపకాలే పఠేన్నిత్యం 

యాత్రాకాలే విశేషతః

తస్యమృత్యు భయంన్నాస్తి 

సర్వత్ర విజయీ భవేత్!!


(ఈ హనుమంతుని ద్వాదశనామాలను

విశేషించి యాత్రలకు వెళ్ళేటప్పుడు లేదా

ఏదైన ముఖ్యమైన పనులకోసం వెళ్ళేటప్పడు

పఠించండి సర్వత్రా విజయాన్ని పొందండి)


ఇది పఠించిన వారికి జయం తధ్యం !!

*విష్ణు సహస్రనామ స్తోత్రము*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

 *విష్ణు సహస్రనామ స్తోత్రము*

           *రోజూ ఒక శ్లోకం*

*అర్థం, తాత్పర్యం, ఆడియోతో*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*శ్లోకం (9)*


*ఈశ్వరో విక్రమీ ధన్వీ*

*మేధావీ విక్రమః క్రమః|*


*అనుత్తమో దురాధర్షః*

*కృతజ్ఞః కృతిరాత్మవాన్||*


*ప్రతి పదార్థం:~*


*75) ఈశ్వరః -సర్వశక్తి సంపన్నుడైనవాడు, సర్వులనూ పాలించి పోషించువాడు.*


*76) విక్రమీ - బలము, తేజస్సు, పరాక్రమము మొదలగు వీరుల గుణములు కలవాడు.*


*77) ధన్వీ --- ధనస్సును ధరించినవాడు.* *(దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు శార్ఙ్గము అను ధనుసును ధరించినవాడు.)*


*78) మేధావీ - అసాధారణ, అపరిమిత మేధ (జ్ఞాపక శక్తి) గలవాడు; సర్వజ్ఞుడు.*


*79) విక్రమః - బ్రహ్మాండమును కొలిచిన అడుగులు గలవాడు (శ్రీవామన మూర్తి) ; పక్షిరాజగు గరుత్మంతునిపై పాదములుంచి పయనించువాడు.*


*80) క్రమః - నియమానుసారము చరించువాడు, సమస్తము ఒక క్రమవిధానములో చరించుటకు హేతువు (క్రమ - పద్ధతి) ;*


*81) అనుత్తమః - తనకంటె ఉత్తములు లేనివాడు.*


*82) దురాధర్షః - తననెదిరింపగల గల శక్తి వేరెవ్వరికి లేనట్టివాడు.*


*83) కృతజ్ఞః - సమస్త ప్రాణుల పుణ్య, అపుణ్య కర్మలనెరిగినవాడు.*


*84) కృతిః --- కర్మకు లేదా పురుష ప్రయత్నమునకు ఆధారభూతుడై యున్నవాడు.*


*85) ఆత్మవాన్ - తన వైభవమునందే సర్వదా సుప్రతిష్ఠుడై యుండువాడు.* 


*తాత్పర్యము:~*


*సర్వమును శాసించువాడును, సర్వశక్తి సంపన్నుడును, బలము, తేజస్సు, పరాక్రమము మొదలగు వీరుల గుణములు కలవాడును, ధనుస్సును ధరించినవాడును, మహాజ్ఞాన భాండారమును,* *వామనావతారమెత్తిన వాడును, విశ్వమంతా నిండి విస్తరించి, వికసించి, వ్యాప్తిచెందిన పరబ్రహ్మమును, ఉత్తమోత్తముడును, సర్వ శక్తి సంపన్నుడును, సమస్త జీవుల ఆలోచనలు గ్రహింపగలిగినవాడు మరియు వారి భక్తిశ్రద్ధలకనుగుణముగా ఫలములను ప్రసాదించువాడును, చరాచరాత్మకమగు విశ్వమందంతటను ఆత్మ స్వరూపుడై భాసిల్లు పూర్ణస్వరూపుడును అగు శ్రీమన్నారాయణుడికి శిరస్సు వంచి వందనం మొనర్చుచున్నాను*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*(ఏరోజుకా రోజు ఇచ్చిన శ్లోకాన్ని కంఠస్థం వచ్చేదాకా మననం చేద్దాం)*


*సూచన: కృత్తిక నక్షత్రం మొదటి పాదం జాతకులు పై 9వ శ్లోకమును నిత్యం కనీసం 11 పర్యాయములు పఠించడం ద్వారా వారు సకల శుభాలను పొందగలరు.*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ఓం నమో నారాయణాయ!*

*ఓం నమః శివాయ!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

*శ్రీమద్ భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

             *(పదవ రోజు)*

 *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

   *విదురుడు-మైత్రేయుడు*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*‘‘పరీక్షన్మహారాజా! చావు తప్పదని, చేసేదేమీ లేదని దిగులు పడకు. భక్తి కుదిరితే ముహూర్త కాలం చాలు, మోక్షం లభిస్తుంది.*


*నీకింకా ఏడు రోజులు ఆయుః పరిమాణం ఉంది. సునాయసంగా మోక్షసాధన సమకూర్చుకోగలవు.’’ అన్నాడు శుకుడు. ఆశగా చూశాడు పరీక్షిత్తు.* 


*‘‘నా తండ్రి వ్యాసమహర్షి నాకు మాత్రమే ఉపదేశించిన మహాభాగవతం నీకు బోధిస్తాను. విని, శుభపరంపరలు అందుకో.’’ అన్నాడు శుకుడు.పరీక్షిత్తునకు భాగవతాన్ని చెప్పాడు.*


*భక్తియోగం:~*


*భాగవత తత్త్వానికి భక్తియోగమే ప్రధానం. ఇంద్రియాలను జయించి, మనస్సును విషయ వాంఛల వైపునకు పోనీయకుండా జాగ్రత్త వహించాలి. గుర్రాన్ని కళ్ళెంతో పట్టినట్టుగా చెలరేగే భావనలన్నిటినీ నిగ్రహించుకోవాలి. భగవంతుని మీదే మనస్సును లగ్నం చెయ్యాలి. ఉరుకుల పరుగుల నది సముద్ర సంగమంతో శాంతించినట్టుగా మనస్సు ఎక్కడైతే స్థిరపడి శాంతి పొందుతుందో అదే వైకుంఠం.*


*మనస్సు చెదిరితే శ్రీహరి నామ సంకీర్తనంతో దాన్ని నిరోధించాలి. సంకీర్తన ప్రియుడు శ్రీహరి భక్తియోగానికే పట్టుబడతాడు అన్నాడు శుకుడు.*


*ఈ అఖిలాండకోటి బ్రహ్మాండం అంతా విరాట్పురుషుని స్థూలరూపం అన్నాడు. విశ్వం యావత్తూ విష్ణుమయం. బ్రహ్మాదులంతా విష్ణువును ధ్యానించే కృతార్థులయినారు. నారదునికి బ్రహ్మ బోధించిన తత్త్వాన్ని వివరించి, సమస్త లోకాల సృష్టి పరిణామాన్ని కూడా పరీక్షిత్తుకి చెప్పాడు శుకుడు. భగవంతుని అనంతకోటి అవతారాల్లో కృష్ణావతారమే గొప్పదన్నాడు. కాల స్వరూపం, యుగధర్మాల గురించి కూడా చెప్పాడు.*


*విదురుడు-మైత్రేయుడు*


*వ్యాసునికీ-దాసికీ పుట్టిన కుమారుడు విదురుడు. ఇతడు ధృతరాష్ట్రునికి తమ్ముడు. ధర్మమూర్తి యముడు మాండవ్యు ముని శాప కారణంగా భూలోకంలో విదురునిగా జన్మించాడు. ధర్మమూర్తే విదురుడవడంతో అతను నీతికీ, న్యాయానికీ, ధర్మానికీ మారుపేరుగా నిలిచాడు. పాండవులకు కౌరవులు చేసిన అన్యాయాలను నిరసించాడితను. కౌరవుల అన్యాయాల గురించి ధృతరాష్ట్రునికి చెప్పి, ముందే హెచ్చరించాడు. అయినా పాండవులకూ కౌరవులకూ యుద్ధం తప్పలేదు. యుద్ధాన్ని తప్పించడానికి, సంధి కోసం ఎంతగానో ప్రయత్నించాడు. ఫలించలేదు. కురుక్షేత్ర సంగ్రామం మొదలయింది. విదురుడు ఎవరి పక్షానా నిలవలేదు. దాయాదుల మధ్య యుద్ధం చూడలేనంటూ తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు.*


*తిరిగి వచ్చే వేళకి యుద్ధం ముగిసింది. కౌరవలంతా చనిపోయారు. అప్పుడు ధృతరాష్ట్రునికి వైరాగ్యాన్ని బోధించింది విదురుడే! అతన్ని తపోవనానికి పంపింది కూడా విదురుడే! ఉద్దవుని ముఖతః శ్రీకృష్ణ నిర్యాణాన్ని తెలుసుకున్నాడు. ఇక జీవించడం చాలనుకున్నాడు. హిమవత్పర్వత ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ తనువు చాలించాడు. విదురుడు మహా నీతివేత్త కావడంతో అతను బోధించిన నీతి ‘విదురనీతి’గా ప్రసిద్ధి చెందింది. అందరికీ ప్రమాణమయింది.*


*విదురుడు తీర్థయాత్రలు చేస్తున్న సమయంలోనే అతను, మైత్రేయుడనే మహామునిని సందర్శించాడు. ఆయన చెప్పగా భగవంతుని తత్త్వాన్ని తెలుసుకున్నాడు. ఆత్మజ్ఞానం పొందాడు. యోగులెవరూ తెలుసుకోలేని సంగతులెన్నో విదురునికి మైత్రేయుడు తెలియజేశాడు. బ్రహ్మదేవుని జన్మ వృత్తాంతం, కాల లక్షణం, సృష్టి విధానం... చాలా చెప్పాడతనికి.*


*శ్రీమన్నారాయణుని నాభి కమలం నుండే బ్రహ్మ ఉద్భవించాడు. సమస్త లోకాల్నీ ఏకకాలంలో చూసేందుకు వీలుగా అతనికి నాలుగు ముఖాలు ఏర్పడ్డాయి. అలా ఏర్పడిన నాలుగు ముఖాలతో ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేశాడు బ్రహ్మ. అప్పుడు నారాయణుని అనుగ్రహం పొందాడు. పరమేశ్వర తత్త్వాన్ని తెలుసుకున్నాడు. సమస్త లోకాలనూ, సకల జీవరాసులనూ సృష్టించే శక్తి సామర్థ్యాలు సాధించాడు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం)*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

భజగోవిందం (మోహముద్గరః)*

 🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య*.     

              *విరచిత*

*భజగోవిందం (మోహముద్గరః)*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*రోజూ ఒక శ్లోకం (లఘు వివరణతో)*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*శ్లోకం - 9*


*సత్సంగత్వే నిస్సంగత్వం*

*నిసంగత్వే నిర్మోహత్వమ్|*


*నిర్మోహత్వే నిశ్చలతత్త్వం*

*నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః||*


*శ్లోకం అర్ధం : ~*


*జ్ఞానులైన సజ్జనుల సాంగత్యము వలన సంసార బంధములు విడిపోవును. బంధములు విడిపోయిన అజ్ఞానమూలకమైన మోహము పోవును. మోహము నశించినచో నిశ్చలమగు పరిశుద్ధ తత్వము గోచరమగును. అది తెలిసినపుడు జీవన్ముక్తి కలుగును.*


*వివరణ : -*


*సజ్జన సాంగత్యము వలన నీకు ప్రాపంచిక విషయముల గురించి నిజము తెలియును. దాని వలన వానిపై వ్యామోహము నశించును. దాని ఫలితముగా నీకు అజ్ఞానము అంతరించును. అజ్ఞానము అంతరించిన హృదయములో ఏకాగ్రత కలిగి, భగవంతునిపై మనసు నిలుచును. దాని ఫలితముగ నీకు ముక్తి చేకూరును. కావున సత్ సంగములకు వెళ్ళుట, సత్ పురుషులను కలయుట చాలా ముఖ్యము. సువాసన గల వనములో నడచిన, ఆ సువాసన నీకు లభించినట్లే, సాధు సాంగత్యము వలన మంచి చేకూరును. గురువులు, పెద్దలు, ప్రజ్ఞావంతులను గౌరవించుచూ, వారి సేవ చేయుచూ, వారి సాంగత్యములో మంచిని తెలుసుకొని, మాయను వీడి, భగవన్ ముఖముగా మనసు మళ్ళించి విముక్తి బడయుము.*


*ఓం నమో నారాయణాయ।*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*(తిరిగి రేపు మరో శ్లోకంతో కలుద్దాం)*

తిరుప్పావై 20 వ పాశురము

 తిరుప్పావై  20 వ పాశురము

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్ఱు

కప్పమ్ తవిర్కుమ్ కలియే! తుయిలెళాయ్;

శెప్పముడైయాయ్! తిఱలుడైయాయ్! శెత్తార్కు

వెప్పఙ్గొడుక్కుమ్ విమలా! తుయిలెళాయ్;

శెప్పన్న మెన్ములైచ్చెవ్వాయ్ చ్చిఱు మరుఙ్గుల్

నప్పిన్నై నఙ్గాయ్! తిరువే! తుయిలెళాయ్;

ఉక్కముమ్ తట్టొళియుమ్ తన్దున్ మణాళనై

ఇప్పోతే యెమ్మై నీరా ట్టేలో రెమ్బావాయ్


 ⚜️🌷⚜️🌷⚜️🌷⚜️🌷⚜️🌷⚜️


అమ్మను కీర్తిస్తే స్వామికి ఆనందం, మరి అమ్మను కఠినంగా మట్లాడితే స్వామికి కష్టంగా అనిపిస్తుంది, నిన్న మన వాళ్ళు అమ్మను కొంచం కఠినంగా మాట్లాడే సరికి స్వామికి కొంచం కోపం వచ్చింది, అందుచే స్వామి లేచి రాలేదు. ఈ రోజు స్వామిని ఆయనకున్న పరాక్రమాది గుణాలతో కీర్తిస్తారు, ఆయనలో ఉండే జ్ఞానం, శక్తి, బలం, ఋజుత్వం ఇలాంటి గుణాలతో కీర్తిస్తారు. అయినను లేవలేదని, ఆయనకు ఆనందాన్నిచ్చేలా అమ్మను కీర్తిస్తారు.


ఆండాళ్ తల్లి స్వామిని మేల్కొల్పడానికి ఆయన వైభవాన్ని చెబుతున్నారు. "ముప్పత్తు మూవర్ అమరర్క్కు" ముప్పై మూడు వర్గాల దేవతలను "మున్ శెన్ఱు" ఆపదరావడానికంటే ముందే వెళ్ళి కాపాడే "కప్పం తవిర్క్కుం కలియే!" గొప్ప భలం కలవాడివే. "తుయిల్ ఏరాయ్" లేవవయ్యా. చావు అంటూ లేని దేవతలనేమో వారు పిలవకముందే వెళ్ళి కాపాడుతావు, ఏమాత్రం కోరిక లేకుండా, కేవలం నువ్వు ఆనందంగా ఉంటే చూసిపోవాలని కాంక్షించే మాలాంటి వాళ్ళను మాత్రం కాపాడవా, మేం నీదగ్గరికి రావడం తప్పైందా.


"శెప్పం ఉడైయాయ్!" సత్య పరాక్రమశాలీ, అడిన మాట తప్పని వాడా, నిన్న మాతో అందరూ కలిసి రమ్మని చెప్పి, మాట ఇచ్చి, ఇప్పుడు నీ చుట్టూ తిప్పుకుంటున్నావా? ఏమైంది నీ మాట. "తిఱలుడైయాయ్" సర్వలోక రక్షణ సామర్థ్యం కలవాడా! "శేత్తార్క్కు వెప్పమ్కొడుక్కుం విమలా!" శత్రువులకు దుఃఖాన్ని ఇచ్చే నిర్మలుడా, ఏ దోషం అంటనివాడా. "తుయిల్ ఎరాయ్" నిద్ర లేవయ్యా.


అయితే స్వామి లేవకపోయే సరికి, అయితే నిన్న వీళ్ళు అమ్మను కొంచం కఠినంగా మాట్లాడినందుకు స్వామికి కోపం వచ్చిందని గమనించి అమ్మను కీర్తిస్తారు ఇలా. "శెప్పన్న మెల్-ములై చ్చెవ్వాయ్ చ్చిఱు మరుంగుల్" సముదాయ అంగ సౌందర్యం కల్గి, "నప్పినై" స్వామి సంబంధంతో "నంగాయ్!" పరిపూర్ణమైన అందం కలదానా! "తిరువే!" సాక్షాత్తు నీవే లక్ష్మివి "తుయిలెరాయ్" అమ్మా మేల్కో.


వీళ్ళ ప్రార్థనకి అమ్మ కరిగి, లేచి వీళ్ళ దగ్గరకు వచ్చి, ఏం కావాలర్రా అని అడిగింది. "ఉక్కముమ్" స్నానానికి తర్వాత మాకు స్వేదం ఏర్పడితే దాని అపనౌదనానికి విసనకర్ర కావాలి, "తట్టొళియుమ్" స్నానం తర్వాత అలంకరించు కోవడానికి ఒక నిలువుటద్దం కావాలి, "తందు" ఈ రెండు ఇచ్చి "ఉన్మణాళనై" నీ స్వామిని "ఇప్పోదే" ఇప్పుడే "ఎమ్మై" మాతో కలిపి "నీరాట్టు" నీరాడించు. ఇలా అడగటం మనకు కొంచం ఎలాగో అనిపిస్తుంది. బాహ్యంగా చూస్తే తప్పు కదా అనిపిస్తుంది. కాని దోషమేమి లేదు.


పురుషుడు ఆయనొక్కడే మిగతా జీవ వర్గం అంతా ఆయనకు చెందిందే. అందులో కొందరు ముందు ఉన్నవారుంటారు, కొందరు వెనక ఉన్నవారుంటారు. ముందున్న వారు వెనక వాళ్ళకు మార్గ నిర్దేశం చేస్తారు. అక్కడ పరమ పదంలో నిత్యశూర వర్గానికి చేందిన వారిలో మొదటిదైన లక్ష్మీదేవి, ఆ తత్వాన్ని తెలిసిన వారు, ఆ తత్వాన్ని సరిగా చూప గలిగిన వారు. మనం కొత్తగా ఒక ఊరుకి వెళ్ళి అక్కడ చెఱువులో స్నానం చేయాలంటే ఆ వూరి గురించి బాగా తెలిసిన వారి సలహాతో చేస్తాం కదా, అలాగే.


కులశేఖర ఆళ్వార్ పరమాత్మను గురించి చెబుతూ..


"హరి సరస్సివి గాహ్య ఆపీయ తేజోజలౌగం

భవమరు పరి ఖిన్నః ఖేదమద్య త్యజామి"


హరీ అనేది ఒక గొప్ప సరస్సు, సంసార తాపాన్ని తొలగించ గలిగేది అదే. అందులో అందరూ మునగాల్సిన వాళ్ళే. తాపం తగ్గాలనుకొనేవారంతా అక్కడే మునగాలి, వీళ్ళు వాళ్ళు అని నియమం లేదు. జీవులమైన మనకు కానీ, పరమ పదంలోని నిత్యశూరులకు గాని ఉన్నది ఒకే సరస్సు, అందులో మునిగితే ఈ సంసారంలో ఉన్న తాపం అంతా తొలుగుతుంది.


ఆ హరి సరస్సు గురించి తెలిసినదానివి, నీవు మార్గం చూపిస్తే మేం దాంట్లో ప్రవేశించగలం అని, అమ్మ ఆండాళ్ తల్లి నీళాదేవిని అదే కోరుతుంది. పరమాత్మను చేరటానికి అమ్మ ఒక ప్రాపకురాలుగా పని చేస్తుంది. భగవంతుని యొక్క కళ్యాణగుణాల జలాలలో మనం నీరాడుతాం. దాన్నే మనకు తిరుప్పావై అందిస్తోంది. ఇప్పుడు అమ్మ కూడా వీళ్ళతో కల్సి మార్గ నిర్దేశం చేస్తుంది. రేపటి నుండి స్వామిని అందరూ కల్సి మేల్కోల్పుతారు.  


ఆండాళ్ తిరువడిగలే శరణం..శరణం..🙏🙏


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

వేద వాఙ్మయం

 🙏వేద వాఙ్మయం -- వేదాంగములు 🙏

వేదం అంటే ఙ్ఞానం అని అర్థం. బుద్ధి సూక్ష్మతను పెంచుకోవాలంటే వ్యక్తులు వేదాలను ఆశ్రయించాలి. ఇవి కేవలం ఒక మతానికి పరిమితమైనవి కాదు. ఙ్ఞానాభివృద్ధి కోసం ఉద్దేశించిన గ్రంథాలు. భగవంతుడి గురించి ముఖ్యంగా పరమ ఙ్ఞానం గురించి మనిషి తెలుసుకోవాలి. ఎందుకంటే అసంపూర్ణమైన ఇంద్రియాల వల్ల ఇతర ప్రాణులు ఈ ఉత్తమమైన ఙ్ఞానాన్ని గ్రహించలేవు. దేహా పోషణకు అవసరమైన ప్రాథమిక ఙ్ఞానం మాత్రమే అంటే ఆహారం, నిద్ర, భయం, లైంగిక చర్యలకు సంబంధించిన తెలివి మాత్రమే వాటికి ఉంటుంది. వాటికి పైన ఉండే ఙ్ఞానం మానవులకు కావాలి. అది భగవంతుడు, ప్రకృతి మనకు ప్రసాదించిన విశేషమైన వరం. దీనిని ఉపయోగించుకుని మనుషులందరూ ఙ్ఞాన మార్గంలో ముందుకు సాగాలి

వేదములను శ్రుతులు (వినబడినవి) అనీ, ఆమ్నాయములు అనీ అంటారు. "విద్" అనే ధాతువుకు "తెలియుట" అన్న అర్ధాన్నిబట్టి వేదములు భగవంతునిద్వారా "తెలుపబడినవి" అనీ, అవి ఏ మానవులచేతనూ రచింపబడలేదు అనీ విశ్వాసము. కనుకనే వేదాలను అపౌరుషేయములు అని కూడా అంటారు. వేదములను తెలిసికొన్న ఋషులను ద్రష్టలు అని అంటారు. ద్రష్ట అంటే దర్శించినవాడు అని అర్ధం. హిందూ శాస్త్రాల ప్రకారం వేదాలను ఋషులు భగవంతుని నుండి విని గానం చేశారు. అందుకే వీటిని శ్రుతులు అని కూడా అంటారు.


వేదాలకు పేర్లు

వేదాలకు (1). శ్రుతి, (2). అనుశ్రవం, (3). త్రయి, (4). సమమ్నాయము, (5). నిగమము, (6). ఆమ్నాయము, (7). స్వాధ్యాయం, (8). ఆగమం, (9). నిగమం అని తొమ్మిది పేర్లున్నాయి.


శ్రుతి - గురువు ఉచ్చరించినదాన్ని విని అదేవిధముగా శిష్యుడు ఉచ్చరిస్తూ నేర్చుకుంటాడు.

అనుశ్రవం - గురువు ఉచ్చరించినదాన్ని సరిగా తిరిగి అదేవిధముగా శిష్యుడు ఉచ్చరిస్తూ ఉంటాడు.

త్రయి - ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదములను కలిపి "త్రయి" అని పేరు.

సమమ్నాయము - ఎల్లప్పుడూ అభ్యసింపబడునవి.

నిగమము - భగవంతుని నిశ్వాస రూపములో బయలు పడేవి. యాస్కుడు నిగమము అని వీటిని వ్యవహరించాడు.

ఆమ్నాయము - ఆవృత్తి లేదా మననం ద్వారా నేర్చుకోబడే విద్య.

స్వాధ్యాయం - స్వాధ్యాయం అంటే—స్వ అధ్యయనం అంటే మనల్ని మనం విశ్లేషించుకోవడం

ఆగమం - భగవంతుని నిశ్వాస రూపములో బయలు పడేవి.

నిగమం - యాస్కుడు నిగమము అని వ్యవహరించాడు.

వేదాలు సంఖ్య


వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు అన్నీ కలిసి ఒకే ఒక వేదరాశిగా ఉండేది. ఎవరయినా వేదం నేర్చుకునేవారు చేయాలంటే మొత్తం వేదరాశిని అధ్యయనము చేయాల్సిందే. కృతయుగం నుండి ద్వాపరయుగం వచ్చేసరికి వేదరాశిని అధ్యయనము చేయవలెనంటే బహుకష్టమని ఎక్కువ మంది అంతగా ఉత్సాహము చూపించే వారు కాదు. మొదట కలగలుపుగా ఉన్న వేదరాశి (వేదాలను) ని వ్యాస మహర్షి ఒక క్రమం ప్రకారం విభజించాడు. ఈ వేదరాశిని వ్యాసుడు ఋక్కులు అన్నింటిని ఋక్సంహితగాను, యజస్సులు అన్నింటిని యజుస్సంహితగాను, సామలన్నింటినీ సామసంహితగాను విడదీసి అలాగే అథర్వమంత్రాలన్నీ ఒకచోట చేర్చి అథర్వసంహితగా తయారు చేసాడు. కనుకనే ఆయన భగవానుడు వేదవ్యాసుడు అయ్యాడనీ చెబుతారు. అలా నాలుగు వేదాలు మనకు లభించాయి.


ఋగ్వేదము

యజుర్వేదము

సామవేదము

అధర్వణవేదము

వ్యాసుడు అలా వేదాలను విభజించి తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనేవారికి ఉపదేశించాడు. వారు తమ శిష్యులకు బోధించారు. అలా గురుశిష్యపరంపరగా ఈ నాలుగు వేదాలు వేల సంవత్సరాలుగా తరతరాలకూ సంక్రమిస్తూ వచ్చాయి. వేదాలను ఉచ్ఛరించడంలో స్వరానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు.

మళ్ళీ ఒక్కొక్క వేదంలోను నాలుగు ఉపవిభాగాలున్నాయి. అవి


మంత్ర సంహిత

బ్రాహ్మణము

ఆరణ్యకము

ఉపనిషత్తులు


మంత్ర సంహిత:

సంహిత" అంటే మంత్రాల సంకలనం. నాలుగు వేదాలకు నాలుగు సంహితలున్నాయి. అసలు వేదం అంటే సంహితా విభాగమే. అంటే మంత్రాల సముదాయం. ఋక్సంహితలోని మంత్రాలను ఋక్కులు అంటారు. యజుర్వేదంలో యజుస్సులు, సామవేదంలో సామాలు, అధర్వవేదంలో అంగిరస్‌లు అనబడే మంత్రాలుంటాయి. యజ్ఞంలో నలుగురు ప్రధాన ఋత్విజులు ఉంటారు. ఋగ్వేద మంత్రాలను పఠించే ఋషిని "హోత" అని, యజుర్మంత్రాలు పఠించే ఋషిని "అధ్వర్యుడు" అని, సామగానం చేసే ఋషిని "ఉద్గాత" అని, అధర్వాంగిరస్సులను పఠించే ఋషిని "బ్రహ్మ" అని అంటారు. ఈ నలుగురూ యజ్ఞ వేదికకు నాలుగు వైపుల ఉంటారు.

వేద సంహితలలో యజుస్సంహితలో మాత్రమే గద్యభాగం ఎక్కువగా ఉంది. ఋక్సంహిత, సామ సంహిత పూర్తిగా గద్యభభాగమే అయినా వాటిని కూడా మంత్రాలలా పఠిస్తారు.[2]

చతుర్వేద సంహితలు

ఋగ్వేద సంహిత దేవతల గుణగణాలను స్తుతిస్తుంది.

యజుర్వేద సంహిత వివిధ యజ్ఞాలను నిర్దేశిస్తుంది.

సామవేద సంహిత దేవతలను ప్రసన్నులను చేసుకొనే గానవిధిని తెలుపుతుంది.

అధర్వవేద సంహిత బ్రహ్మజ్ఞానం సహితంగా అనేకానేక లౌకిక విషయాలను వివరిస్తుంది.

యజుర్వేద సంహితలో మళ్ళీ రెండు భాగాలున్నాయి. (1) వాజసనేయ మాధ్యందిన శుక్ల యజుర్వేద సంహిత (2) కృష్ణ యజుర్వేద తైత్తరీయ సంహిత.


బ్రాహ్మణము:

బ్రాహ్మణాలలో పురాణాలు, తత్వశాస్త్రం, వేదాల ఆచారాలు గురించి వ్యాఖ్యానాలు ఉంటాయి. వేదసంహితలు తదుపరి మహోన్నత స్థానం బ్రాహ్మణాలు కలిగి ఉన్నాయి. ఇవి వేదాలలోని అంతర్భాము. చతుర్వేదాలలోని సంహిత (శ్లోక, మంత్ర) భాగములకు బ్రహ్మ పదాన్ని, వ్యాఖ్యాన రూపంగా ఉన్నదానికి బ్రాహ్మణం అని చెప్పబడు తున్నది. ఈ నాలుగు వేదాలలో గల మంత్రాలను, ఎక్కడెక్కడ, ఏఏ యజ్ఞములకు ఈ మంత్రాలను ఎలా వినియోగించాలి, ఆయా వాటిని అవసరమైన చోట వ్యాఖ్యానిస్తూ ఉన్నటువంటి గ్రంథాలకు బ్రాహ్మణాలు అని అంటారు. బ్రాహ్మణాల గ్రంథాలందు సంహితలలోని శ్లోకాల నిగూఢ అర్థాన్ని చెబుతూ అనేక వివరణలతో పాటుగా, ఉపాఖ్యానలు కూడా తెలియజేస్తాయి

బ్రాహ్మణాలనేవి సంహితలకు వ్యాఖ్యాన రూపాలు. వేద రాశిలో సంహితలు, బ్రాహ్మణాలు వరుసగా ఒకటి, రెండు స్థానములు కాగా అరణ్యకాలు మూడవ స్థానమును పొందినవి. అరణ్యకాలు అంటే అనేకమంది ద్వారా ఈ క్రింది విధముగా అనేక అర్థాలు ప్రతిపాదించబడినవి.

అరణ్యకాలు:

అరణ్యంలో దీక్షతో అధ్యయనము చేసిన గ్రంథాలే అరణ్యకాలు.

గృహస్థాశ్రమము వదలి సన్యాసము లేదా సన్యసించుట వలన అరణ్యాలకు వెళ్ళి ప్రశాంత వాతావరణములో తపదీక్షతో వేదాధ్యయనము చేయటకు కావలసిన గ్రంథాలే అరణ్యకాలు.

కర్మఫలంతో పాటు జ్ఞానం సంపాదించు మేలు కలయిక అరణ్యకాలు.

యజ్ఞాలలోని రహస్యాలను అరణ్యాలలోనే మహర్షులు చర్చించారు.

బ్రాహ్మణములలో ఉండే గృహస్థాశ్రమ కర్మకాండలు, జ్ఞానం మాత్రము ప్రధానముగా ఉండే ఉపనిషత్తు ల మేలు కలయికయే అరణ్యకాలు.

అరణ్యాలలో మాత్రమే ఆచరించవలసినవి కావున అరణ్యకాలు.

వేదాల సారమే అరణ్యకాలు.


ఉపనిషత్తులు:

సంహితలు - మంత్ర భాగం, స్తోత్రాలు, ఆవాహనలు

బ్రాహ్మణాలు - సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు.

అరణ్యకాలు - వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి.

ఉపనిషత్తులు - ఇవి పూర్తిగా జ్ఞానకాండ. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడా అనేకములు ఉన్నాయి. వాటిలో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి. వాటిల్లో 10 ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి. వీటినే దశోపనిషత్తులు అంటారు. వేద సాంప్రదాయంలో దశోపనిషత్తులు పరమ ప్రమాణములు గనుక ఆచార్యులు తమ తత్వ బోధనలలో మాటిమాటికిని ఉపనిషత్తులను ఉదహరించారు.

ఈ విభాగాలలో మొదటి రెండింటిని "కర్మకాండ" అనీ, తరువాతి రెండింటిని "జ్ఞానకాండ" అనీ అంటారు.

వేదముల అర్ధాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే ఆరు అంగాలను వేదాంగములు అంటారు. వేదాంగాలు ఏవి? అన్న దానికి సమాధానంగా ఉపయోగపడే శ్లోకం ఇది:


శిక్షా వ్యాకరణంఛందో నిరుక్తం జ్యోతిషం తథా

కల్పశ్చేతి షడంగాని వేదస్యాహు ర్మనీషిణః

ఒక్కొక్క వేదాంగాన్ని గురించి క్లుప్తంగా ఇక్కడ వ్రాయబడింది.


శిక్ష: పాణిని శిక్షాశాస్త్రమును రచించెను. ఇది వేదమును ఉచ్ఛరింపవలసిన పద్ధతిని బోధిస్తుంది. వేదములలో స్వరము చాలా ముఖ్యము.

వ్యాకరణము: వ్యాకరణ శాస్త్రమును కూడ సూత్రూపమున పాణినియే రచించెను. ఇందులో 8 అధ్యాయాలున్నాయి. దోషరహితమైన పదప్రయోగమునకు సంబంధించిన నియమాలు అన్నీ ఇందులో చెప్పబడ్డాయి.

ఛందస్సు: పింగళుడు "ఛందోవిచితి" అనే 8 అధ్యాయాల ఛందశ్శాస్త్రమును రచించెను. వేద మంత్రములకు సంబంధించిన ఛందస్సులే కాక లౌకిక ఛందస్సులు కూడా ఇక్కడ చెప్పబడినవి.

నిరుక్తము: నిరుక్త శాస్త్రమునకు కర్త యాస్కుడు. వేదమంత్రములలోని పదముల వ్యుత్పత్తి ఇందులో చెప్పబడింది. పదములన్నీ ధాతువులనుండి పుట్టినవని యాస్కుని అభిప్రాయము.

జ్యోతిషము: వేదాలలో చెప్పిన యజ్ఞాలు చేయడానికి కాలనిర్ణయం చాలా ముఖ్యం. ఆ కాలనియమాలు జ్యోతిషంలో ఉంటాయి. లగదుడు, గర్గుడు మున్నగువారు ఈ జ్యోతిష శాస్త్ర గ్రంథాలను రచించారు.

కల్పము: కల్పశాస్త్రంలో యజ్ఞయాగాదుల విధానము, వాటిలోని భేదాలు చెప్పబడ్డాయి. అశ్వలాయనుడు, సాలంఖ్యాయనుడు ఈ శాస్త్ర సూత్రాలను రచించారు

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..*


*ఆఖరి ప్రయత్నం.. బోధ..పర్యవసానం..*


*(అరవై వ రోజు)*


తాను కబురు పెట్టేదాకా ఆశ్రమానికి రావొద్దని శ్రీధరరావు దంపతుల తో శ్రీ స్వామివారు చెప్పిన తరువాత..శ్రీ స్వామివారు కఠోర తపస్సు చేయనారంభించారు..ఆహారం దాదాపుగా విసర్జించారు..ఏ రెండు మూడు రోజులకో ఒకసారి కొద్దిగా ఆహారాన్ని స్వీకరిస్తూ తిరిగి తపస్సు లోకి వెళ్లిపోయేవారు..ఏప్రిల్ నెల 1976 వ సంవత్సరం..చివరి వారం లో ఒకసారి శ్రీధరరావు గారిని రమ్మని కబురు పంపించారు..


అంతకుముందు శ్రీ స్వామివారు తనకు దోసకాయలు కావాలని అడిగిన విషయం గుర్తుకువచ్చి ప్రభావతి గారు దోసకాయల కోసం మొగలిచెర్ల అంతా వాకబు చేశారు..చిత్రంగా ఆ ఊర్లో ఒక్క దోసకాయా దొరకలేదు..సరే..ప్రాప్తంలేదు..ఆమాటే చెపుదాము అని శ్రీధరరావు గారు అనుకోని..గూడు బండి ఎక్కబోతున్నారు..ఇంతలో నెత్తిన గంప పెట్టుకొని ఒక ఆడమనిషి నేరుగా వచ్చింది..తాను లింగసముద్రం నుంచి వస్తున్నాననీ..దోసకాయలు అమ్మడానికి తెచ్చాననీ..చెప్పి..కొన్ని మంచి కాయలను తానే ఏరి..చేతికిచ్చింది..శ్రీధరరావు గారు ఆశ్చర్యపోతూ..వాటిని తీసుకొని బండి తోలే బాలయ్య చేతికిచ్చి..బండిలో పెట్టించారు..


ఆరోజు శ్రీధరరావు గారు ప్రభావతి గార్లు ఆశ్రమానికి చేరేసరికి..శ్రీ స్వామివారు అత్యంత ఉత్సాహంగా వున్నారు..వీళ్ళను చూడగానే.."రండి!..రండి!!..మీ కోసమే ఎదురు చూస్తున్నాను.." అన్నారు..


"అమ్మా..శ్రద్ధగా వినండి..కేవలం కొద్దీ రోజులు మాత్రమే మిగిలివుంది..మీకు మళ్లీ మళ్లీ బోధ చేసేవారు ఇంకొకరు లభ్యం కావడం దుర్లభం..నేను చెప్పే మాటలు ఆకళింపు చేసుకోండి..నా తపస్సుకు మీరు ఎంతగానో సహకరించారు..నేను చేసిన ఈ సాధన ఫలించే రోజు దగ్గరలోనే ఉంది..ఈ ఆశ్రమానికి ఉత్తరాధికారం మీ చేతుల్లోనే ఉండబోతోంది..క్షేత్రంగా మారుతుంది.."


"అపార జ్ఞానానికి ప్రతీకలు అవధూతలు..వారి సహచర్యమూ సేవా అత్యంత పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాయి..నిరంతరం తనను తాను శోధించుకుంటూ..దైవదత్తమైన జ్ఞానాన్ని నలుగురికీ పంచుతూ..తనను తాను ఉద్ధరించుకుంటూ..తన చుట్టూ వున్న సంఘాన్ని కూడా ఉద్ధరించేవాడే అవధూత..శ్రీధరరావు గారూ మీరు ఒకటి రెండుసార్లు..నాగురించి ప్రస్తావిస్తూ.."బాలోన్మత్త పిశాచ వేషాయ.." అన్నారు..పైకి పిచ్చి వాడిలా..పసిపిల్లల చేష్టలతో..శుచీ శుభ్రత లేని వారిలా ప్రవర్తించినా..వారి ప్రతి చర్యలోనూ ఒక పరమార్ధం దాగివుంటుంది..అవధూత అనగానే..పిచ్చివాడు..మద్యం మాంసం స్వీకరిస్తూ వుండేవాడు అనుకోవడం ఒక అపోహ మాత్రమే..అలా ఉన్న వాళ్ళందరూ అవధూతలు కారు..అవధూత మూర్తీభవించిన జ్ఞాన స్వరూపం అని గుర్తించండి..పొట్టకూటికోసం గారడీలు చేసేవాడినో..మాటలతో కోటలు కట్టేవారినో ఆశ్రయించి..విలువైన సమయాన్ని..ధనాన్ని కోల్పోతారు కొందరు..వాళ్ళ అజ్ఞానం వల్ల..అవతలివాడు సుఖాలు పొందుతారే కానీ..వీళ్లకు ఒరిగేదేమీ లేదు.."


"గృహస్థులు మీరు..ఎన్నో బాధ్యతలుంటాయి..కొన్ని కష్టాలుంటాయి..కొన్ని సుఖాలూ వెంటనే ఉంటాయి..సమదృష్టి తో చూడండి..బండి చక్రం లోని ఆకుల వలె.. ఒకటి పైకి వచ్చిన తరువాత..మరొకటి క్రింద ఉంటుంది..మళ్లీ కొద్దిసేపటికే పరిస్థితి తారుమారు అవుతుంది..సంసారపు ప్రయాణం సాగుతూ ఉంటుంది..ఎటువంటి పరిస్థితులలోనూ సంయమనం పాటించండి!..మీరు చేసిన ఈ సేవ ఫలితం ఊరికే మాత్రం పోదు!..మీరు ఎందరో పండితులను నా వద్దకు తీసుకువచ్చారు..కొందరు నా పాండిత్యాన్ని పరీక్షించారు..మరికొందరు నాలోని వేదాంత సారాన్ని వెలికితీయాలని భావించారు..నాకున్న ఈ పాండిత్యం కానీ..మరోటి కానీ..అన్నీ ఆ దత్తుడి అనుగ్రహం తోనే వచ్చాయి..మరో విధంగా రాలేదు.."


"నేనే కాదు..ఏ సాధకుడైనా ఎక్కువ మౌనాన్ని ఆశ్రయిస్తాము..మౌనమే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది..క్లుప్తంగా మాట్లాడటం సాధన లోని మొదటి మెట్టు అయితే..సంపూర్ణ మౌనం చివరి మెట్టు..అవసరం ఉన్నంతవరకే వాక్కును ఉపయోగించాలి..నిర్మోహత్వం నుంచి నిశ్చలస్థితి..అక్కడినుంచి జీవన్ముక్తి పొందుతామని ఆది శంకరులు చెప్పింది తెలుసుకదా..అక్షర సత్యమది.."


అద్భుతమైన కంఠస్వరంతో శ్రీ స్వామివారు చేస్తున్న బోధను.. పరిసరాలు మర్చిపోయి విన్నారా దంపతులు..తమకు ఈ బోధ చేయడానికి పిలిపించారని అర్ధమయింది వాళ్లకు..ఇక ఈ యోగిపుంగవుడు ఎక్కువ కాలం తమతో కలిసివుండడు అని రూఢీ అయిపోయింది..మనసు స్థిర పరచడానికే ఈరోజు శ్రీ స్వామివారు ఇలా బోధ చేశారు..


శ్రీధరరావు ప్రభావతి గార్లు.."నాయనా!..మీ నిర్ణయం లో మార్పు లేదా?.." అని చివరిగా అడిగారు..


"లేదమ్మా!..లేదు!..నాకు సమయం ముంచుకొస్తున్నది..మీరు వ్యాకులపడొద్దు..శ్రీధరరావు గారూ మరో నాలుగు రోజుల తరువాత ఇక్కడికి రండి..మీతో కొన్ని విషయాలు చెప్పాలి.." అన్నారు..


ఆ దంపతుల అంతరంగంలో ఇంతకుముందు ఉన్నంత భారం ఇప్పుడు లేదు..మనసంతా తేలిక గా ఉంది..ఆ మార్పు ఆ దంపతులకు తెలిసివచ్చింది..శ్రీ స్వామివారి వద్ద సెలవు తీసుకొని తిరిగి ఇంటికి వచ్చేసారు..


అంతుపట్టని అంతరంగం..రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..*


*సోదరుడి తో సమావేశం..సూచన..*


*(యాభై తొమ్మిదవ రోజు)*


శ్రీ చెక్కా కేశవులు, మీరాశెట్టి గార్ల తో తన శరీర త్యాగం గురించి తన అభిప్రాయాన్ని చేప్పటమూ..వారు నిరాకరించడం జరిగిపోయిన తరువాత.. శ్రీ స్వామివారు తన తపస్సును కొనసాగించ సాగారు..ఒక వారం గడిచిపోయింది..శ్రీధరరావు దంపతులు కూడా తీరిక లేని పనుల్లో ఉండిపోవడం వలన..శ్రీ స్వామివారి వద్దకు వెళ్లలేక పోయారు..పైగా..శ్రీ స్వామివారు తన మానాన తాను తపస్సు చేసుకుంటూ వుంటారు..ఎలాగూ సజీవ సమాధి చేయడం లేదని చెప్పేశాము గదా..ఇక ఆ విషయం గురించి ఆలోచించడం ఎందుకు అనే భ్రమ లో ఉండిపోయారు..


మరో నాలుగైదు రోజుల తరువాత..శ్రీ స్వామివారు మాలకొండలో తపస్సు చేసినంత కాలం క్రమం తప్పకుండా ఆహారపదార్ధాలు చేరవేసిన సోదరుడు పద్మయ్య, అన్నగారిని చూడటానికి ఆశ్రమానికి వచ్చారు..పద్మయ్యను చూసి శ్రీ స్వామివారు పలకరింపుగా నవ్వి..దగ్గరగా కూర్చోబెట్టుకుని..


"నీకు కొన్ని విషయాలను చెపుతాను..అవి నీవు నాకొఱకు చేసిపెట్టాలి..సరేనా?.. " అన్నారు..


" అలాగే ..చెప్పు..చేస్తాను.." అన్నారు పద్మయ్యనాయుడు..


"నాకు తపస్సు చివరి దశకు వచ్చేసింది..ఈ శరీరాన్ని వదిలేయాల్సిన సమయమూ ఆసన్నమైంది..నేను ప్రాణత్యాగం చేసిన తరువాత..నా దేహాన్ని..ఇదిగో..ఈ ఆశ్రమంలో కట్టించుకున్న భూగృహం (నేలమాళిగ) లో పద్మాసనం లో వున్నట్లుగా ఉత్తరాభిముఖంగా కూర్చోబెట్టి సమాధి చేయాలి..అది నీ కర్తవ్యం..నువ్వే చేయాలి.."అన్నారు..


ఈ మాటలు చెప్పేటప్పుడు..లీలామాత్రంగా శ్రీ స్వామివారి కళ్ళు చెమర్చాయి..అది.పద్మయ్యనాయుడు గమనించారు

"చూసావా..నేను సన్యసించి..అన్ని బంధాలనూ తెంచుకున్నా కూడా..రక్త సంబంధం మాత్రం నన్ను ఈ నిమిషంలో కట్టి పడేసింది.." అన్నారు శ్రీ    ఆ నిముషమే శ్రీ స్వామివారు అలా భావోద్వేగానికి గురయింది..ఆ తరువాత మళ్ళీ మామూలు స్థితిలోకి వచ్చేసి..పద్మయ్యనాయుడు తో ఆమాటా..ఈ మాటా మాట్లాడి పంపించివేసారు......(ఈ విషయం పద్మయ్యనాయుడు గారు స్వయంగా నాతో తెలిపారు..) పద్మయ్యనాయుడు వెళ్లిన తరువాత శ్రీ స్వామివారు తన ధ్యానం చేసుకోవడానికి ఆశ్రమం లోపలికి వెళ్లిపోయారు..


మరో మూడు రోజులు గడిచిపోయాయి..1976 ఏప్రిల్ నెల మూడవవారం లో ప్రభావతి శ్రీధరరావు గార్లు శ్రీ స్వామివారిని కలవడానికి ఆశ్రమానికి వచ్చారు..సుమారు ఓ అరగంట వేచి చూసిన తరువాత..శ్రీ స్వామివారు తలుపు తీసుకొని వీళ్ళ ముందుకు వచ్చి నిలబడ్డారు..ఆయన ముఖంలో దివ్య తేజస్సు ఉట్టిపడుతోంది..శరీరం మాత్రం శుష్కించి ఉన్నది..


"నాయనా..బాగా తగ్గిపోయారు..ఆహారం తీసుకోవడం లేదా?.." అన్నారు ప్రభావతి గారు..


"ఆహారం..అంత సమయం కూడా వృధా చేయటం లేదు తల్లీ..నిరంతర ధ్యానం లో ఉంటున్నాను..ఇదిగో ఇప్పుడు మీరొచ్చినారని వాక్కు వినబడితే..లేచి వస్తున్నాను..మళ్లీ అడుగుతున్నానని మీరు కలత పడవద్దు..ఇంకా రోజులే మిగిలివున్నాయి నా శరీరానికి..త్వరగా సమాధి ఏర్పాట్లు చేయండి.." అన్నారు శ్రీ స్వామివారు..


శ్రీధరరావు ప్రభావతి గార్లు ముఖాముఖాలు చూసుకున్నారు..శ్రీ స్వామివారు సజీవ సమాధి విషయాన్ని వదిలేసి ఉంటారని భావించిన తమకు..అదేమీ లేదనీ.. శ్రీ స్వామివారు అదే పట్టు మీద ఉన్నారనీ.. అవగతం అయింది..వాళ్లిద్దరూ కూడా..తమవల్ల కాదని మళ్లీ తేల్చి చెప్పారు..


అయితే చిత్రంగా..ఈసారిమాత్రం శ్రీ స్వామివారు పెద్దగా నవ్వారు..నవ్వి.."మీరు మాత్రం ఏం చేస్తారు..పెంచుకున్న బంధాలు అంత త్వరగా తెగిపోవు కదా..పైగా మీ పరిమితులు మీకుంటాయి..ఇక నా ఏర్పాట్లు నేను చూసుకుంటాను..ఇంత దూరం నన్ను లాక్కొచ్చిన ఆ పార్వతీదేవి..ఆ దత్తాత్రేయుడు నాకు మార్గం చూపక పోతారా?.." అన్నారు..


మొదటిసారి ఆ దంపతులు..శ్రీ స్వామివారు తమకు కాకుండా పోతారేమో అనే భావనకు లోనయ్యారు..


"మళ్లీ నేను చెప్పి పంపేదాకా.. మీరిద్దరూ ఈ ఆశ్రమానికి రాకండి..అమ్మా..కొన్ని దోసకాయలు మాత్రం పంపించు..ధ్యానం నుంచి లేచినప్పుడు వండుకుంటాను.." అన్నారు..


కొద్దిసేపు శ్రీ స్వామివారి వద్ద గడిపి..తిరిగి తమ ఇంటికి చేరారా దంపతులు..


శ్రీధరరావు గారి చివరి ప్రయత్నం..పర్యవసానం..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం..SPSR  నెల్లూరు జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).

నిద్ర - నియమాలు

 నిద్ర - నియమాలు  -


      మానవుడు ఆరోగ్యముగా ఉండవలెను అనిన ఆహారం మరియు నిద్ర ఇవి రెండు ముఖ్యమైనవి . నిద్ర వలన శ్రమ , అలసట తొలగిపోవును . నిద్ర సరిగ్గా పోనిచో శరీరం అశక్తతో నీరసంగా తయారగును. ముఖ్యంగా చిన్నపిల్లలకు , వృద్దులకు నిద్ర అత్యంత ముఖ్యం అయినది. ప్రతిమనిషి 5 గంటల నుంచి 8 గంటలపాటు తప్పకుండా నిద్రించవలెను. నిద్రను రెండురకాలుగా విభజించవచ్చు. అవి  


              1 . గాఢనిద్ర.


              2 . కలతనిద్ర .


 గాడనిద్ర  - 


       మైమరచి , బాహ్య విషయాలు తెలియకుండా రెండు నుంచి మూడు గంటల పాటు నిద్రించుట . దీనివల్ల మానసికపరమైన ఉల్లాసం , విశ్రాంతి లభించి మానవుడు దైనందిక కార్యక్రమాలు చురుకుగా నిర్వర్తించగలడు.


 కలతనిద్ర  -


        మనుష్యుడు నిద్రించునప్పుడు కొంతవరకు బాహ్యవిషయాలు తెలియుచుండును. ఎవరైనా బిగ్గరగా మాట్లాడటం , శబ్దము చేసిన వెంటనే మెలుకువ వచ్చును. ఈ నిద్ర వలన పూర్తి విశ్రాంతి కలుగదు. కొంతవరకు శారీరక విశ్రాంతి మాత్రం లభించును.


 నిద్ర నియమాలు  -


 *  కొన్నాళ్ళు జబ్బు పడి లేచినవారు , జ్వరముతో బాధపడువారు , నిద్రవచ్చినప్పుడు కునికిపాట్లు పడవచ్చు కాని పూర్తిగా నిద్రపోగూడదు అని ఆయుర్వేదం స్పష్టంగా చెప్పినది.


 *  జ్వరంతో ఉన్నప్పుడు ఆహారం తీసుకుని మరలా నిద్రించినచో జ్వరం వెంటనే తిరగబెట్టును. కావున వైద్యుడు చెప్పిన నియమాల ప్రకారమే నిద్రించవలెను.


 *  ఎదైనా పరిస్థితులలో రాత్రి జాగరణ చేసినచో రాత్రి ఎంతకాలం నిద్ర తగ్గినదో అంత సమయంలో సగభాగం ఉదయాన్నే ఆహారం తీసుకొకుండా నిద్రించవలెను.


 *  ఏప్రిల్ మరియు మే నెలలలో అనగా గ్రీష్మఋతువు నందు ఎండలు అధికంగా పగలు నిద్రించుట పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఆరోగ్యం కలిగించును.


 *  సాయంత్రం సమయంలో టీ మరియు కాఫీని తాగడం ఆపినచో రాత్రి సమయం నందు చక్కటి నిద్రపట్టును .


 *  ఎక్కువుగా పొగ తాగేవారికి నిద్రపట్టదు. పొగలోని నికోటిన్ అంటూ విషపదార్థం శరీరంలోని నరములకు ఉత్తేజం కలిగించి నిద్రను రానివ్వదు.


 *  నిద్రించుటకు ముందు ఆలోచనలను దూరం పెట్టి ప్రశాంతంగా ఉండి వెలికిలిగా పడుకొని ధ్యానం చేయుట ద్వారా మంచి నిద్రపట్టును . మధ్యలో మెలకువ వచ్చిన ఎడమ చేతి వైపు తిరిగి పడుకోవలెను .


 *  పొలం పనిచేయువారు మరియు ఫ్యాక్టరీ పనిచేయువారు సాయం సమయాన గోరువెచ్చని నీటితో స్నానం చేసి 10 గంటల లోపు నిద్రకు ఉపక్రమించవలెను.


 *  శారీరక శ్రమ లేనివారు చన్నీటి స్నానము చేయవచ్చు . గదిలో తక్కువకాంతి ఇచ్చే బల్బ్ లను ఉంచరాదు.


 *  ఉదయం నిద్రలేచే ముందు మంచం పైన అటూఇటూ నాలుగు నుంచి అయిదు సార్లూ పొర్లి చేతులు , కాళ్లు విదల్చవలెను.


 *  నిద్ర లేచించిన వెంటనే కాళ్లు , చేతులు వేళ్లు మెటికలు విరవడం వలన శరీర అవయవాలు శక్తిని పుంజుకోనును.


  

  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .  


గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

ఫలమునుc గోరువాcడె కద

 *ఫలమునుc గోరువాcడె కద పండితుcడున్ సద సద్వివేకియున్*

ఈ సమస్యకు నాపూరణ. 


పలువిధ పద్ధతుల్ సలుపు పట్టుదలన్ విడకుండ సాధకుం


డలయక రూపు దాల్చుటకు నాశయ సిద్ధిని పొందగోరుచున్


ఫలమునుc గోరువాcడె కద - పండితుcడున్ సద సద్వివేకియున్


ఫలము నపేక్షయున్ వదిలి బాధ్యతతో నెరవేర్చు వాడహో. 



అల్వాల లక్ష్మణ మూర్తి.

పిల్లలు - పెద్దలు - సభ్యతా - సంప్రదాయము*

 *పిల్లలు - పెద్దలు - సభ్యతా -  సంప్రదాయము*


ఈ రోజుల్లో చాలా మంది తాత, అమ్మమ్మ, నానమ్మ,  తల్లిదండ్రులకు ఒక వేదన కలుగుతుంటుంది. తమ  పిల్లలకు మన సంప్రదాయాల మీద గౌరవం లేదు. వినయం, విధేయత  లాంటివి లేవు. తమ మాట వినడం లేదు అని. ఇలా దిగులుచెందే వారెందరో! దానికి తోడు  'గ్లోబలైజేషన్' పేరుతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నో విలువలు తారుమారౌతున్నాయి. మార్పుని తట్టుకోలేని వారి హృదయం కించిత్తు బాధకి గురౌతోంది.


 కాలంలో వస్తున్న సాంకేతిక పరిణామాల ప్రభావం, దూరాలు తగ్గి దేశాలు సైతం గ్రామాలంత దగ్గర కావడం... ఇలాంటి ఎన్నో నేపథ్యాలలో 'వేగం’ పెరుగుతోంది. ఇది వరకు పాతికేళ్ళు పట్టే మార్పుకి, ఈ రోజు రెండు రోజులు చాలు.

 మార్పుని ఆహ్వానించడం మంచిదే. కానీ ఆ మార్పులు తరతరాల సంస్కృతి విలువలను ధ్వంసం చేసేటంతగా జరగడం ఆహ్వానించదగినది కాదు. ఆధునీకరణను 'పాశ్చాత్యీకరణ'గా భ్రమిస్తున్న యువత మనదైన ఘనతను తెలుసుకోకపోవడం విచారకరమైతే, దానిని ఉపేక్షించడం మరియు తృణీకరిచడం మరీ మరీ దౌర్భాగ్యం.

         

మానవ సంబంధాలు, తరతరాల నుండి సంక్రమిస్తున్న కొన్ని ముఖ్యమైన విలువలు - వీటిని పదిలపరచుకుంటూనే, ఆధునికంగా కూడా ఎంతో ఎదగవచ్చు. అయితే వీటిపై అవగాహన, గౌరవం కలిగించాల్సిన బాధ్యత మాత్రం పెద్దలదే.  దీనికి రెండు పద్ధతులున్నాయి. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ మన సంస్కృతి పట్ల గౌరవం కలిగించే అంశాలను తెలియజేయాలి. ఒక పాఠ్యాంశాల బోధనలా కాకుండా, వారికి పరిసరాలలో కలిసిపోయేలా పరిచయానికి రావాలి. సంస్కృతితో కలిసి జీవింపజేయాలి. ఈ రోజుల్లో పాఠశాలల ద్వారా సంస్కృతి బోధన జరుగుతుందని ఆశించడం పొరపాటే. కేవలం ర్యాంకుల లక్ష్యంగా సాగే పోటీ చదువుల పోరులో *ఈ విలువల పరిరక్షణను విద్యాసంస్థల నుండి ఆశించడం పొరపాటు.* పౌష్టికాహారాన్నిచ్చి పోషించే బాధ్యతతోపాటు, సంస్కృతి - నాగరికతల వివేక సంస్కారాలను పిల్లలకు అలవరచడం కూడా తల్లిదండ్రుల కర్తవ్యమే.

        

 ముఖ్యంగా తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు తల్లిదండ్రులు కూడా గౌరవంగా వాటిని పాటిస్తుండాలి, *పిల్లలకు నేర్పుతూ ఉండాలి* వివిధ సంస్కృతి సంస్థలు నిర్వహించే కార్యక్రమాల్లో పిల్లలతో పాటు తాము పాల్గొనడం చేయాలి. వారి ముందు *మంచి పద్ధతులు* కనిపిస్తుంటే అనుకరించడం పిల్లల సహజం.

         

కుటుంబంలోని పెద్దలు ముందు సమన్వయంతో ఉండాలి. భార్యలను చిన్న చూపు చూసే భర్తలు, భర్తలను గద్దించే భార్యలు. అత్త మామలను కించపర్చే కోడళ్ళు, ఈలా సంసారంలో ఎన్నెన్నో అవకతవకలు. *ముందు పెద్దలే  ఇతర పెద్దలపట్ల వినయ విధేయతల్నీ, సంస్కారాన్నీ కనబరుచుతుంటే పిల్లలకీ అది అవగతమవుతుంది*.

         

ప్రధానంగా ‘గౌరవం' కలిగించడం అత్యావశ్యకం. పరిజ్ఞానం కన్నా ముందు 'గౌరవం’ కావాలి. *అన్నీ తెలిస్తేనే గాని చేయను*' అని మొండికేస్తే నష్టపోయేది వారే. ముందు  *పూర్వాచారాలను పాటిస్తూ ఉంటే క్రమేణ అవగాహన మరింత చక్కని అభ్యాసం సిద్ధిస్తుంది*.

 

ఇటువంటి నైతిక విలువలను ఒక తరం తరువాతి తరానికి అందించాలి. ఆస్తినే కాదు, తమదైన ప్రాచీన విలువల్నీ, విద్యలనీ ప్రబోధించాలి' అనే బాధ్యతను పెద్దలు తీసుకోవాలి.


*ప్రస్తుత పరిస్థితి ఎంతగా దిగజారి పోయిందంటే...* *పెద్ద వాళ్ళను పలకరించక పోవడము, రహస్య జీవితాలు, తమ జీవిత దారులను తామే ఎన్నుకోవడం*

*ఇంకా ఇంకా ఎన్నెన్నో*

          

జీవితానికి పనికొచ్చే భౌతిక విద్యలను నేర్చుకోవడంతో పాటు, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ప్రాచీన ధర్మవిద్యలు మొదటి నుండీ నేర్పాలి.  సెలవు రోజుల్లో తీరిక వేళల్లో సంబంధంలేని ఏవో విదేశీభాషల కోసమో, కొత్త కోర్సుల కోసమో పిల్లల్ని పంపిస్తుంటారు, వాటితో పాటు మనదైన ఉత్తమ విలువల్నీ, ప్రాచీన కళల్నీ,  వేదానికి సంబంధించిన విద్యల్నీ కూడా నేర్పించగలగాలి.

    

సూర్యోదయానికి ముందే నిద్రలేవడం, ధ్యానం, యోగాభ్యాసం, ప్రవర్తనా సరళి  ఇంటి పనుల్లో చేయూత, అవసరంలో ఉన్న వారికి సహాకారం..పూర్వ గ్రంథాలలోని విలువలు, విశేషాలు, వాటి కథలు, బోధనలు, నైతికత... ఇలాంటి అభ్యాసాలను బాల్యం నుండి తాము అందించే ప్రయత్నం పెద్దలు చేపట్టాలి. అటువంటి పరిసరాలలో సంచరించేలా చేయాలి. పరిసరాల ప్రభావం కూడా ఉంటుంది కదా!

          

          

 *విలువల్నీ, ధర్మాన్ని బోధించడం చేత ఆరోగ్యవంతమైన, సత్సంస్కారం కలిగిన ఉత్తమ పౌరులు ఏర్పడతారు*.


 అవినీతి, బాధ్యతా రాహిత్యం వంటివి సమాజంలో తగ్గాలంటే నాటి సంస్కారాలని, నైతికతని బాల్యం నుండే అందించాల్సిన అవసరముంది.


 ముందుగా పెద్దలే వాటి పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ, పిల్లల ముందు పాటిస్తూ, పాటిస్తున్నట్లు కన్పిస్తూ, వాటిపై గౌరవం కలిగిన కుటుంబాల స్నేహసంబంధాలను పిల్లలతో కొనసాగింపజేస్తూ జాగ్రత్తపడడం బాధ్యత.

           

మనదైన ఘనచరిత్ర, కట్టడాలు, పవిత్ర స్థలాలు దేవాలయాలు వాటి పురాణ సాంఘిక నేపథ్యం, చారిత్రక ఔన్నత్యం - ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ బోధించాలి. అదే వారికి వినోదంతో కూడిన విజ్ఞానాన్నీ, విజ్ఞానంతో కూడిన దేశభక్తినీ, సంస్కారాన్నీ ప్రసాదిస్తుంది.


ధన్యవాదములు.


*సేకరణ*

వేద వాఙ్మయం -- వేదాంగములు

 🙏వేద వాఙ్మయం -- వేదాంగములు 🙏

వేదం అంటే ఙ్ఞానం అని అర్థం. బుద్ధి సూక్ష్మతను పెంచుకోవాలంటే వ్యక్తులు వేదాలను ఆశ్రయించాలి. ఇవి కేవలం ఒక మతానికి పరిమితమైనవి కాదు. ఙ్ఞానాభివృద్ధి కోసం ఉద్దేశించిన గ్రంథాలు. భగవంతుడి గురించి ముఖ్యంగా పరమ ఙ్ఞానం గురించి మనిషి తెలుసుకోవాలి. ఎందుకంటే అసంపూర్ణమైన ఇంద్రియాల వల్ల ఇతర ప్రాణులు ఈ ఉత్తమమైన ఙ్ఞానాన్ని గ్రహించలేవు. దేహా పోషణకు అవసరమైన ప్రాథమిక ఙ్ఞానం మాత్రమే అంటే ఆహారం, నిద్ర, భయం, లైంగిక చర్యలకు సంబంధించిన తెలివి మాత్రమే వాటికి ఉంటుంది. వాటికి పైన ఉండే ఙ్ఞానం మానవులకు కావాలి. అది భగవంతుడు, ప్రకృతి మనకు ప్రసాదించిన విశేషమైన వరం. దీనిని ఉపయోగించుకుని మనుషులందరూ ఙ్ఞాన మార్గంలో ముందుకు సాగాలి

వేదములను శ్రుతులు (వినబడినవి) అనీ, ఆమ్నాయములు అనీ అంటారు. "విద్" అనే ధాతువుకు "తెలియుట" అన్న అర్ధాన్నిబట్టి వేదములు భగవంతునిద్వారా "తెలుపబడినవి" అనీ, అవి ఏ మానవులచేతనూ రచింపబడలేదు అనీ విశ్వాసము. కనుకనే వేదాలను అపౌరుషేయములు అని కూడా అంటారు. వేదములను తెలిసికొన్న ఋషులను ద్రష్టలు అని అంటారు. ద్రష్ట అంటే దర్శించినవాడు అని అర్ధం. హిందూ శాస్త్రాల ప్రకారం వేదాలను ఋషులు భగవంతుని నుండి విని గానం చేశారు. అందుకే వీటిని శ్రుతులు అని కూడా అంటారు.


వేదాలకు పేర్లు

వేదాలకు (1). శ్రుతి, (2). అనుశ్రవం, (3). త్రయి, (4). సమమ్నాయము, (5). నిగమము, (6). ఆమ్నాయము, (7). స్వాధ్యాయం, (8). ఆగమం, (9). నిగమం అని తొమ్మిది పేర్లున్నాయి.


శ్రుతి - గురువు ఉచ్చరించినదాన్ని విని అదేవిధముగా శిష్యుడు ఉచ్చరిస్తూ నేర్చుకుంటాడు.

అనుశ్రవం - గురువు ఉచ్చరించినదాన్ని సరిగా తిరిగి అదేవిధముగా శిష్యుడు ఉచ్చరిస్తూ ఉంటాడు.

త్రయి - ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదములను కలిపి "త్రయి" అని పేరు.

సమమ్నాయము - ఎల్లప్పుడూ అభ్యసింపబడునవి.

నిగమము - భగవంతుని నిశ్వాస రూపములో బయలు పడేవి. యాస్కుడు నిగమము అని వీటిని వ్యవహరించాడు.

ఆమ్నాయము - ఆవృత్తి లేదా మననం ద్వారా నేర్చుకోబడే విద్య.

స్వాధ్యాయం - స్వాధ్యాయం అంటే—స్వ అధ్యయనం అంటే మనల్ని మనం విశ్లేషించుకోవడం

ఆగమం - భగవంతుని నిశ్వాస రూపములో బయలు పడేవి.

నిగమం - యాస్కుడు నిగమము అని వ్యవహరించాడు.

వేదాలు సంఖ్య


వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు అన్నీ కలిసి ఒకే ఒక వేదరాశిగా ఉండేది. ఎవరయినా వేదం నేర్చుకునేవారు చేయాలంటే మొత్తం వేదరాశిని అధ్యయనము చేయాల్సిందే. కృతయుగం నుండి ద్వాపరయుగం వచ్చేసరికి వేదరాశిని అధ్యయనము చేయవలెనంటే బహుకష్టమని ఎక్కువ మంది అంతగా ఉత్సాహము చూపించే వారు కాదు. మొదట కలగలుపుగా ఉన్న వేదరాశి (వేదాలను) ని వ్యాస మహర్షి ఒక క్రమం ప్రకారం విభజించాడు. ఈ వేదరాశిని వ్యాసుడు ఋక్కులు అన్నింటిని ఋక్సంహితగాను, యజస్సులు అన్నింటిని యజుస్సంహితగాను, సామలన్నింటినీ సామసంహితగాను విడదీసి అలాగే అథర్వమంత్రాలన్నీ ఒకచోట చేర్చి అథర్వసంహితగా తయారు చేసాడు. కనుకనే ఆయన భగవానుడు వేదవ్యాసుడు అయ్యాడనీ చెబుతారు. అలా నాలుగు వేదాలు మనకు లభించాయి.


ఋగ్వేదము

యజుర్వేదము

సామవేదము

అధర్వణవేదము

వ్యాసుడు అలా వేదాలను విభజించి తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనేవారికి ఉపదేశించాడు. వారు తమ శిష్యులకు బోధించారు. అలా గురుశిష్యపరంపరగా ఈ నాలుగు వేదాలు వేల సంవత్సరాలుగా తరతరాలకూ సంక్రమిస్తూ వచ్చాయి. వేదాలను ఉచ్ఛరించడంలో స్వరానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు.

మళ్ళీ ఒక్కొక్క వేదంలోను నాలుగు ఉపవిభాగాలున్నాయి. అవి


మంత్ర సంహిత

బ్రాహ్మణము

ఆరణ్యకము

ఉపనిషత్తులు


మంత్ర సంహిత:

సంహిత" అంటే మంత్రాల సంకలనం. నాలుగు వేదాలకు నాలుగు సంహితలున్నాయి. అసలు వేదం అంటే సంహితా విభాగమే. అంటే మంత్రాల సముదాయం. ఋక్సంహితలోని మంత్రాలను ఋక్కులు అంటారు. యజుర్వేదంలో యజుస్సులు, సామవేదంలో సామాలు, అధర్వవేదంలో అంగిరస్‌లు అనబడే మంత్రాలుంటాయి. యజ్ఞంలో నలుగురు ప్రధాన ఋత్విజులు ఉంటారు. ఋగ్వేద మంత్రాలను పఠించే ఋషిని "హోత" అని, యజుర్మంత్రాలు పఠించే ఋషిని "అధ్వర్యుడు" అని, సామగానం చేసే ఋషిని "ఉద్గాత" అని, అధర్వాంగిరస్సులను పఠించే ఋషిని "బ్రహ్మ" అని అంటారు. ఈ నలుగురూ యజ్ఞ వేదికకు నాలుగు వైపుల ఉంటారు.

వేద సంహితలలో యజుస్సంహితలో మాత్రమే గద్యభాగం ఎక్కువగా ఉంది. ఋక్సంహిత, సామ సంహిత పూర్తిగా గద్యభభాగమే అయినా వాటిని కూడా మంత్రాలలా పఠిస్తారు.[2]

చతుర్వేద సంహితలు

ఋగ్వేద సంహిత దేవతల గుణగణాలను స్తుతిస్తుంది.

యజుర్వేద సంహిత వివిధ యజ్ఞాలను నిర్దేశిస్తుంది.

సామవేద సంహిత దేవతలను ప్రసన్నులను చేసుకొనే గానవిధిని తెలుపుతుంది.

అధర్వవేద సంహిత బ్రహ్మజ్ఞానం సహితంగా అనేకానేక లౌకిక విషయాలను వివరిస్తుంది.

యజుర్వేద సంహితలో మళ్ళీ రెండు భాగాలున్నాయి. (1) వాజసనేయ మాధ్యందిన శుక్ల యజుర్వేద సంహిత (2) కృష్ణ యజుర్వేద తైత్తరీయ సంహిత.


బ్రాహ్మణము:

బ్రాహ్మణాలలో పురాణాలు, తత్వశాస్త్రం, వేదాల ఆచారాలు గురించి వ్యాఖ్యానాలు ఉంటాయి. వేదసంహితలు తదుపరి మహోన్నత స్థానం బ్రాహ్మణాలు కలిగి ఉన్నాయి. ఇవి వేదాలలోని అంతర్భాము. చతుర్వేదాలలోని సంహిత (శ్లోక, మంత్ర) భాగములకు బ్రహ్మ పదాన్ని, వ్యాఖ్యాన రూపంగా ఉన్నదానికి బ్రాహ్మణం అని చెప్పబడు తున్నది. ఈ నాలుగు వేదాలలో గల మంత్రాలను, ఎక్కడెక్కడ, ఏఏ యజ్ఞములకు ఈ మంత్రాలను ఎలా వినియోగించాలి, ఆయా వాటిని అవసరమైన చోట వ్యాఖ్యానిస్తూ ఉన్నటువంటి గ్రంథాలకు బ్రాహ్మణాలు అని అంటారు. బ్రాహ్మణాల గ్రంథాలందు సంహితలలోని శ్లోకాల నిగూఢ అర్థాన్ని చెబుతూ అనేక వివరణలతో పాటుగా, ఉపాఖ్యానలు కూడా తెలియజేస్తాయి

బ్రాహ్మణాలనేవి సంహితలకు వ్యాఖ్యాన రూపాలు. వేద రాశిలో సంహితలు, బ్రాహ్మణాలు వరుసగా ఒకటి, రెండు స్థానములు కాగా అరణ్యకాలు మూడవ స్థానమును పొందినవి. అరణ్యకాలు అంటే అనేకమంది ద్వారా ఈ క్రింది విధముగా అనేక అర్థాలు ప్రతిపాదించబడినవి.

అరణ్యకాలు:

అరణ్యంలో దీక్షతో అధ్యయనము చేసిన గ్రంథాలే అరణ్యకాలు.

గృహస్థాశ్రమము వదలి సన్యాసము లేదా సన్యసించుట వలన అరణ్యాలకు వెళ్ళి ప్రశాంత వాతావరణములో తపదీక్షతో వేదాధ్యయనము చేయటకు కావలసిన గ్రంథాలే అరణ్యకాలు.

కర్మఫలంతో పాటు జ్ఞానం సంపాదించు మేలు కలయిక అరణ్యకాలు.

యజ్ఞాలలోని రహస్యాలను అరణ్యాలలోనే మహర్షులు చర్చించారు.

బ్రాహ్మణములలో ఉండే గృహస్థాశ్రమ కర్మకాండలు, జ్ఞానం మాత్రము ప్రధానముగా ఉండే ఉపనిషత్తు ల మేలు కలయికయే అరణ్యకాలు.

అరణ్యాలలో మాత్రమే ఆచరించవలసినవి కావున అరణ్యకాలు.

వేదాల సారమే అరణ్యకాలు.


ఉపనిషత్తులు:

సంహితలు - మంత్ర భాగం, స్తోత్రాలు, ఆవాహనలు

బ్రాహ్మణాలు - సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు.

అరణ్యకాలు - వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి.

ఉపనిషత్తులు - ఇవి పూర్తిగా జ్ఞానకాండ. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడా అనేకములు ఉన్నాయి. వాటిలో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి. వాటిల్లో 10 ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి. వీటినే దశోపనిషత్తులు అంటారు. వేద సాంప్రదాయంలో దశోపనిషత్తులు పరమ ప్రమాణములు గనుక ఆచార్యులు తమ తత్వ బోధనలలో మాటిమాటికిని ఉపనిషత్తులను ఉదహరించారు.

ఈ విభాగాలలో మొదటి రెండింటిని "కర్మకాండ" అనీ, తరువాతి రెండింటిని "జ్ఞానకాండ" అనీ అంటారు.

వేదముల అర్ధాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే ఆరు అంగాలను వేదాంగములు అంటారు. వేదాంగాలు ఏవి? అన్న దానికి సమాధానంగా ఉపయోగపడే శ్లోకం ఇది:


శిక్షా వ్యాకరణంఛందో నిరుక్తం జ్యోతిషం తథా

కల్పశ్చేతి షడంగాని వేదస్యాహు ర్మనీషిణః

ఒక్కొక్క వేదాంగాన్ని గురించి క్లుప్తంగా ఇక్కడ వ్రాయబడింది.


శిక్ష: పాణిని శిక్షాశాస్త్రమును రచించెను. ఇది వేదమును ఉచ్ఛరింపవలసిన పద్ధతిని బోధిస్తుంది. వేదములలో స్వరము చాలా ముఖ్యము.

వ్యాకరణము: వ్యాకరణ శాస్త్రమును కూడ సూత్రూపమున పాణినియే రచించెను. ఇందులో 8 అధ్యాయాలున్నాయి. దోషరహితమైన పదప్రయోగమునకు సంబంధించిన నియమాలు అన్నీ ఇందులో చెప్పబడ్డాయి.

ఛందస్సు: పింగళుడు "ఛందోవిచితి" అనే 8 అధ్యాయాల ఛందశ్శాస్త్రమును రచించెను. వేద మంత్రములకు సంబంధించిన ఛందస్సులే కాక లౌకిక ఛందస్సులు కూడా ఇక్కడ చెప్పబడినవి.

నిరుక్తము: నిరుక్త శాస్త్రమునకు కర్త యాస్కుడు. వేదమంత్రములలోని పదముల వ్యుత్పత్తి ఇందులో చెప్పబడింది. పదములన్నీ ధాతువులనుండి పుట్టినవని యాస్కుని అభిప్రాయము.

జ్యోతిషము: వేదాలలో చెప్పిన యజ్ఞాలు చేయడానికి కాలనిర్ణయం చాలా ముఖ్యం. ఆ కాలనియమాలు జ్యోతిషంలో ఉంటాయి. లగదుడు, గర్గుడు మున్నగువారు ఈ జ్యోతిష శాస్త్ర గ్రంథాలను రచించారు.

కల్పము: కల్పశాస్త్రంలో యజ్ఞయాగాదుల విధానము, వాటిలోని భేదాలు చెప్పబడ్డాయి. అశ్వలాయనుడు, సాలంఖ్యాయనుడు ఈ శాస్త్ర సూత్రాలను రచించారు

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

తిరుప్పావై ప్రవచనం- 21 వ రోజు*

 🌹🌷🪷🏹🛕🏹🪷🌷🌹

*🌞ఆదివారం 5 జనవరి, 2025🌞*

  *వేకువఝామున పాడుకొనుటకు*



*తిరుప్పావై ప్రవచనం- 21 వ రోజు*

               

   *🏹 21వ పాశురము🏹*


*ఏత్తకలఙ్గళ్ ఎదిర్ పొఙ్గి మీదళిప్ప* 

*మాత్తాదే పాల్* *శొరియుమ్ వళ్లల్ పెరుమ్ పశుక్కళ్* 

*ఆత్తప్పడ్తెత్తాన్ మగనే! యఱివుఱాయ్;*

*ఊత్తముడైయాయ్ పెరియాయ్! ఉలగినిల్* 

*తోత్తయాయ్ నిన్ఱశుడరే.* *తుయిలెళాయ్;*

*మాత్తారునక్కు* *వలితులైన్దు ఉన్ వాశఱ్కణ్* 

*ఆత్తాదు వన్దు ఉన్నడి పణియు మాప్పోలే*

*పోత్తియామ్ వన్దోమ్ పుగళన్దు ఏలోరెమ్బావాయ్*



                  *భావం*

పాలను పిదుకుటకై పొదుగుల క్రింద ఎన్ని భాండములుంచినను అవన్నియు పొంగి పొరలి పోవునట్లు క్షీరధారలను వర్షించే గోసంపద గల్గిన శ్రీ నందగోపుని కుమారుడవైన 

ఓ శ్రీకృష్ణా! మేల్కొని మమ్ము 

కనరావయ్యా! అప్రతిహత 

ధైర్య సాహసములను కల్గియును ఆశ్రితపక్షపాతివై, సర్వులకును 

ఆత్మ స్వరూపుడవైన నీవు యీ భూలోకమునందు అవతరించిన ఉజ్జ్వల రత్న దీపమా! వేద ప్రమాణ ప్రసిద్ధుడా! ఆ వేదము చేతనైనను ఎరుక పడనంతటి మహా మహిమాన్వితుడా! ఈ దీనులను కటాక్షించి మేలుకొనుము. శత్రువులెల్లరు నీ పరాక్రమమునకు తాళజాలక భయపడి నీకు ఓడిపోయి, నీవాకిట నిల్చి, నిన్ను శరణుజొచ్చిన రీతిని మేమందరమూ అనన్య ప్రయోజనులమై 'నీవే తప్ప ఇతః పరంబెరుగ'మని నీ పాదానుదాసులమై వచ్చితిమి. 

నీ దాసులమైన మేమందరమును 

నీ దివ్య కల్యాణ గుణ సంకీర్తనము చేయగా వచ్చినాము. నీ దివ్య మంగళ విగ్రహమునకు దివ్య మంగళా శాసనము చేయ నిల్చినాము స్వామీ! నిన్నాశ్రయించి వచ్చిన మమ్ము కరుణించుటకు మేలుకొనుస్వామీ! లేచి రావయ్యా! అని వేడుకొంటున్నారు. 



               *అవతారిక*

నీళాకృష్ణులను మేల్కొల్పిన గోపికలందరూ నీళాదేవిని స్వామి కరుణాకటాక్ష వీక్షణ రసఝరిలో ఆనందస్నానం చేయించమని ప్రార్ధించారుకద! మరి వారి ప్రార్ధనను విన్న ఆమె 'భోగ్యదశలో నేనును మీలో ఒకతెనే కదా! కావున మనమంతా కలిసి *'శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే! శ్రీమతే నారాయణాయనమః'* అని స్వామిని వేడుకొందామన్నది. 

ఈనాటి మాలికలో నీళాదేవితో కూడిన ఆండాళ్ తల్లి తమ సఖులందరితో కలిసి స్వామిని కృపజేయుడని ప్రార్ధిస్తున్నది. శ్రీకృష్ణుని మేల్కొలుపుతున్నది.



        *🌷21.వ మాలిక🌷*

  *(శహనరాగము - ఏకతాళము)*


ప.. కడవల పాలిచ్చు గోసంపద గల నందపుత్ర!

విడిచిరావొ? నిద్ర! ఇంక మేలుకో!


అ..ప.. పుడమిని నిను నమ్మువారి కాపాడ నవతరించిన 

వాడ! తేజోరూపుడా! నిద్ర మేలుకో!


చ.. ఎదుట నీకు నిలువలేక, బలహీనత శత్రువులు 

పదముల శరణన్న రీతి, నీదు వాకిటచే నిలిచి 

నీదు గుణ విశేషములను కీర్తించగ వచ్చినాము 

నీకు మంగళాశాసన మాచరింప వచ్చినాము 

కడవల పాలిచ్చు గోసంపద గల నందపుత్ర!

విడిచిరావొ? నిద్ర! యింక మేలుకో!



*🪷ఇరవై ఒకటవరోజు ప్రవచనము🪷*


*ఆచార్యుడి ద్వారా శరణాగతి*

*🙏ఆండాళ్ తిరువడిగలే శరణం🙏* 



   *🏹21 వ పాశురము🏹*


*ఏత్త కలంగళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప*

*మాత్తాదే పాల్ శొరియుం వళ్ళల్ పెరుం పశుక్కళ్*

*ఆత్త ప్పడైత్తాన్ మగనే! అఱివుఱాయ్*

*ఊత్త ముడైయాయ్! పెరియాయ్! ఉలగినిల్* 

*తోత్తమాయ్ నిర్ఱ శుడరే! తుయిల్ ఎరాయ్*

*మాత్త్తార్ ఉనక్కు వలి* *తొలైందు ఉన్-వాశఱ్కణ్*

*ఆత్తాదు వందు* *ఉన్-అడిపణియుమా పోలే*

*పోత్తియాం వందోం* *పుగరందు-ఏలోర్ ఎంబావాయ్*


భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఫలితాలు దక్కుతాయో దక్కవో చెప్పలేం కానీ, "న సంశయోస్తి తత్ భక్త పరిచర్య రతాత్మనామ్" ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అందిచేట్టి భక్తాగ్రేసరులైన ఆచార్య ఆశ్రయణం చేసిన వారికి సిద్ది తప్పక కలిగే తీరును, సంశయం అక్కర లేదు అని నిరూపిస్తారు. అయితే ఆచార్యులయందు విశ్వాసం కలగటం కొంచెం కష్టం, ఎందుకంటే ఆచార్యులు కూడా మనలాగే ఉంటారు. భగవంతుణ్ణి చేర్చటానికి వీరు తోర్పడుతారని విశ్వాసం కలగదు. ఆండాళ్ తిరుప్పావైలో కనిపించిన దాన్ని విశ్వసిస్తూ కనిపించని దానివైపు సాగవలే అని నేర్పుతుంది. ఇక్కడ మనకు రెంటిపై విశ్వాసం కలగాలి, ఒకటి ఇక్కడ భగవంతుణ్ణి చూపించే ఆచార్యుడిమీద, రెండవది ఆ భగవంతునికి మరొక రూపమై ఉన్న మనకు కనిపించే అర్చామూర్తి యందు. మన కంటికి కనిపించే సరికి మనకు నమ్మకం కలగటం కొంచెం కష్టం. అయితే ఈ యుగంలో మాత్రం కేవలం విగ్రహ రూపంలోనే కనిపిస్తాడు, ఇతర యుగాల్లో కృష్ణుడిగా, రామునిగా కనిపించేట్టు తానూ వచ్చాడు. కనిపిస్తున్నాడు కదా, ఇతనేంటి దేవుడు అని సామాన్యులేకాదు వేదాధ్యనం చేసిన చతుర్ముఖ బ్రహ్మ, ఇంద్రుడంతటి వారే పొరపాటు పడక తప్పలేదు. 



ఇంద్రుడు దేవతల అధిపతి, పరమ గర్విష్టి. అలాంటి వానికి ఇంద్రయాగం అని చేస్తుండేవారు గోకులంలో పెద్దలు. వానలు ఇచ్చేవాడు ఇంద్రుడని వారి విశ్వాసం. ఒకరోజు గోకులంలో పెద్దలంతా ఇంద్రయాగం తలపెట్టారు. అందరూ ఇంద్రుడికి అర్పించటానికి పదార్థాలను తయారుచేస్తున్నారు. అయితే కృష్ణుడికి ఇదేంటో తెలుసుకోవాలని కుతుహలపడి, పెద్దలని అడిగాడు. అయితే వారు… వర్షాలు ఇచ్చే వరుణుడు, ఇంద్రుడి ఆదీనంలోనే ఉంటాడుకదా, ఆ వర్షాలు వస్తేనేకదా మనకు పంటలు పండుతాయి, గోవులకు ఆహారం లభిస్తుంది. 

ఆ గోవుల పాడిపై మన జీవనం ఆధారపడి ఉంది అందుకే చేస్తున్నాం అని చెప్పారు. అయితే ఇంద్రుడు దేవతల అధిపతి, ఒక ఉద్యోగి, ఇలాంటివారెందరో తన ఆధీనంలో పని చేస్తున్నవారు ఉన్నారు ఈ విశ్వం యొక్క స్థితి కోసం. అలాంటిది తాను ఇక్కడే ఉంటుంటే తనను మరచిపోయి, ఆ ఇంద్రుడికి చేయటం ఏంటీ, ఆ ఇంద్రుడు ఇవ్వాలన్నా తాను వెనకనుండి ఇస్తేనేకదా, ఇవ్వగలడు అని, ఆ ఇచ్చేవాణ్ణి నేనిక్కడే ఉండగా నన్ను కాదని చేస్తున్నారే అని శ్రీకృష్ణుడు అనుకున్నాడు. వాళ్ళకందరికి ఈ విషయం ఎలాగో తెలుపాలి అని అనుకుని, అందరినీ ఒక దగ్గరికి చేర్చి, వానలు ఇచ్చేది ఇంద్రుడా కాదు, సూర్యుని శక్తికి సముద్రంలోని నీరు మేఘాలుగా మారితే, ఆపై గాలి వీస్తె మన దగ్గరకు వచ్చాయి, ఆ గోవర్థన పర్వతం అడ్డుకోవడంచే మనకు వర్షంగా వస్తుంది. మనం గోవర్థన పర్వతానికే ఈ పదార్థాలను అర్పించి కృతజ్ఞత తెలుపుకోవాలి అని విన్నవించుకున్నాడు. అందరికి సబబే అనిపించి అందరూ ఆ గోవర్థన పర్వతానికే పదార్థాలను సమర్పించారు. తనే పర్వతంలో ఆవేశించి, నైవేద్యం పుచ్చుకున్నాడు. ఇంద్రుడికి పదార్థాలు అందకపోవడంచే ఆగ్రహించి ఏడు రోజులు వరుసగా రాళ్ళ వాన కురిపించాడు. ఇదిగో మనం చేసిన తప్పుకి ఇంద్రుడు ఆగ్రహించాడు, కన్నయ్యా అని అందరూ కృష్ణుణ్ణి చేరగానే, మనం ఆరగింపు ఇచ్చిన ఆ కొండే మనల్ని కాపాడదా ఏం అంటూ ఒంటి వ్రేలితో కొండను ఎత్తి అందరిని రక్షించాడు. గోవర్థనోద్దారి అయ్యాడు ఆయన. ఇంద్రుడు తనకని అర్పించినవి తానే తినాలి అనుకున్నాడు, ఆ ఇంద్రుడిలోనూ ఉండేవాడు కృష్ణుడేకదా, అదే శ్రీకృష్ణార్పణ మస్తూ అని అనుకునేవాడైతే అన్ని పదార్థాలు ఉండేవి, నేనే తింటున్నాను, నాలోని పరమాత్మకు కాదు అని భావించాడు కాబట్టే ఇంద్రుడికి బుద్ది చేప్పే పరిస్థితి కల్పించాడు కృష్ణుడు. ఇంద్రుడంతటి వానికే తన ప్రభువు ఇతను అని ఇంగితం లేదు అంటే మన లాంటి సామాన్యులం మనం ఏం చెప్పగలం. 



అయితే ఇంద్రుడు దేవతలలో ఒకడు, మరి ఆ దేవతలు అందరికి అధిపతిగా ఉండే చతుర్ముఖ బ్రహ్మకు కూడా ఈ పరిస్థితి తప్పలేదు. గోకులంలో కృష్ణుడి లీలలు అందరూ చెప్పుకుంటుంటే, బ్రహ్మకు కూడా అసూయ కలిగి, ఇదేదో చూడాలి అని గోకులంకు వచ్చాడట. ఆ రోజు కృష్ణుడు ఆ గోపబాలుర మధ్య కూర్చుని సద్దులు ఆరగిస్తుండగా చూసి, ఈ ఎంగిలి వేషాలు వేసే వాడా దేవుడంటే అని అనుకుని, ఈ వ్యక్తి ఏంటో ఇంద్రజాలం చేస్తున్నాడు, వీడికి బుద్ది చెప్పవలె అని అనుకున్నాడు. గోవులను అపహరించి ఒక గుహలో దాచాడు. అంతలో ఒక గోప బాలుడు వచ్చి కృష్ణా మన గోవులు కనిపించటంలేదు అని చెప్పాడు, కృష్ణుడు వాటిని వెతుకుతూ అటు వెళ్ళగానే, గోపబాలురనూ అపహరించి మరొక గుహలో దాచాడు బ్రహ్మ. అయితే గోప బాలురను వదిలి వెడితే గోకులంలోని వారంతా కృష్ణుణ్ణి దేహశుద్ది చేస్తారు అని అనుకున్నాడు బ్రహ్మ. ఇక బ్రహ్మ లోకంకి బయలుదేరాడు బ్రహ్మ, ఇది చూసి శ్రీకృష్ణుడు బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఎన్నెన్ని దూడలు, ఎన్నెన్ని గోవులు, ఎందరెందరి గోపబాలురను బ్రహ్మ దాచాడో అందరి రూపాలను తనదిగా చేసుకున్నాడు కృష్ణుడు. అందరి రూపాలు ఆయనే దాల్చాడు, వారి వారి ప్రవృత్తులతో సహా ఏడాది కాలం అట్లానే ఉన్నాడు. గోకులంలో ఇప్పుడు అందరి రూపాల్లో ఉన్నది కృష్ణుడే అవటంతో నందగోకులం అంతా ఆనంద తరంగితం అయ్యింది. ఇక్కడిది చేస్తూ బ్రహ్మ లోకం వెళ్ళి బ్రహ్మ రూపు దాల్చి, అక్కడివారితో తన రూపు వేసుకొని ఒకడు వస్తాడు బాగా శుద్ది చేయండి అని చెప్పి వచ్చాడు కృష్ణుడు. బ్రహ్మకు తనలోకంలో కూడా ఆదరణ లేకుండాపోయి నంద గోకులం చేరి చూస్తే ఎక్కడి పిల్లలు అక్కడ, ఎక్కడి గోవులు అక్కడ కనిపించాయి. ఆశ్చర్య పడి తాను దాచిన గుహల్లో చూస్తే తను దాచినవి కనిపించాయి. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూస్తే ప్రతి రూపంలో కృష్ణుడే కనిపించాడు. అప్పుడు ఆ చిన్నారి కృష్ణుడిపై మూడు తలలు వాల్చి స్వామి స్వరూపాన్నీ కీర్తన చేసి, ఎందుకిచ్చావీ బ్రహ్మ పదాన్ని, ఎంత పదవి కట్టబెట్టావో అంత గర్వం కూడ నాకు పెరిగింది, ఈ గర్వం లేని గోప జనం ఎంత అదృష్టవంతులయ్యా, అలాంటి వారి పాద దూళినైనా బాగుండేది అని బ్రహ్మ అంతటివాడు పశ్చాత్తాపం చెందాడు. 


అలాగే ఒక చిన్న స్వరూపం భగవంతుడు ధరించే సరికి మనకు ఒక అవజ్ఞత, చులకన భావం ఏర్పడుతుంది. కనిపించక పోతే అమ్మో అంటాం, కనిపిస్తే ఓసీ ఇంతేనా అంటాం. ఆనాడు బ్రహ్మ, ఇంద్రులకి కనిపించే వాడిపై విశ్వాసం కలగలేదు కారణం ఆచార్య అనుగ్రహం లేక పోవటం. అదే భగవంతుడు ఈనాడు అర్చా స్వరూపంలో ఉన్నాడు. అయితే కొందరు కనిపించే శక్తిని బట్టి తత్వాన్ని గుర్తించాలని అది అగ్నిహోత్రంలో, ఆదిత్యున్నిలో, జ్ఞానుల హృదయాల్లో భగవంతుణ్ణి దర్శించాలి అని చెప్పారు. సామాన్యులకి మానసిక ఆధారం కోసం ఏదో ఒక రూపం ఉండాలి కనుక మొదటి మెట్టుగా ఈ విగ్రహంలో చూడొచ్చు, ఆపై విగ్రహం లేకుండా శక్తిరూపాల్లో భగవంతుణ్ణి చూడాలి అని చెప్పారు. కాని అది తప్పు. ఒకటి తర్వాత ఒకటి పై పైకి చూపిస్తూ ఉన్నాయి కనుక, కాలుస్తోంది కనుక అగ్ని, ఆపై కాల్చకుండానే నిత్యం కాంతినిస్తుంది కనుక సూర్యుడు, ఆపై కదల్చ కుండానే చైతన్యంచే కదుపుతోంది కనుక హృదయాన్ని ఉపాసన చేస్తాం. *"ప్రతిమాసు అప్రబుద్దానాం"* అంటే విగ్రహం అనేది వీటికంటే ఏదో పైకే చెంది ఉండాలి. కేవలం శక్తిని బట్టేనా గుర్తించేది, తత్వం బట్టి కదా, అలా తత్వాన్ని గుర్తించగలిగేవాడు ప్రతిమ లేక విగ్రహంలో గుర్తిస్తాడు. అలాంటివాడు బాహిరమైన వాటియందు దృష్టి ఉండని వాడు మాత్రం గుర్తిస్తాడు. ఎలాగంటే, ఒక విద్యుత్ తీగను చూసి అదేం కాలటంలేదు, వెలగటం లేదు అని ముట్టు కుంటే ప్రాణం తీస్తుంది. కాని అదే తీగ అంచుకు చేరగానే ఒక విద్యుత్ దీపాన్ని వెలిగిస్తుంది అని తెలిసినవాడు ఈ బాహిరమైన వాటియందు దృష్టి లేకున్నా ఆ లోపల విద్యుత్ తత్వాన్ని తెలుసుకొని ఉంటాడే. అలాగే విగ్రహ స్వరూపం కదలక పోయినా, భగవత్ సాక్షాత్కారానికి మొదటి మెట్టే కాదు, చివరి మెట్టు కూడా. విగ్రహంలో కూడా తత్వం ఉందని కాదు, *"విగ్రహమే తత్వం"* అని గుర్తించాలి. 



ఆండాళ్ తిరుప్పావై సారాంశం ఆ విగ్రహంపై విశ్వాసం కలిగించటమే. అందుకే ఆండాళ్ శ్రీవిల్లిపుత్తూర్ లో వటపత్రశాయిని కొలిచింది, వేంకటాచలపతికి శరాణాగతి చేసింది, తిరుమాలైజోలు సుందరభాహునికి మొక్కుబడి చేసింది, శ్రీరంగనాథున్ని చేరింది, శ్రీకృష్ణుడిని మనస్సులో భావించింది, పాల్కడలిలో స్వామిని పాడింది. ఇన్నింటిలో తత్వం ఒకటే అని తన ఆచరణ ద్వారా మనకు చూపించింది ఆండాళ్. అలాగే ఆచార్యుని ద్వారా భగవంతుణ్ణి దర్శించవలెనని తెలిపింది. భగవంతుణ్ణి ఆరో స్వరూపంగా ఆచార్యులలో చూడవచ్చునని తెలియజేసింది. మొదట ఆ విశ్వాస పూర్ణత మనకు ఏర్పడితే, ఆ పూర్ణతత్వాన్ని మనం దర్శించగలం. 



నిన్న అమ్మని లేపారు, అమ్మ లేచి నేను మీ తోటిదాన్నే కదా, పదండి అందరం కల్సి స్వామిని లేపుదాం అని వీళ్ళతో కలిసింది. ఇక మనవాళ్ళంతా స్వామి వద్దకు చేరి *"శ్రీమన్నారయణ చరణౌ శరణం ప్రపద్యే"* అంటూ శరణాగతి చేస్తున్నారు. ఉపాయం భగవంతుడే అని మనకు తెలుసు, అమ్మ మనల్ని ఆయనతో చేర్చే ప్రాపకురాలిగా ఉంది. అమ్మ ద్వారా పొందిన జ్ఞానంతో మన వాళ్ళు ఇలా ప్రార్థన చేసారు. ఈరోజు మనవాళ్ళు *"మగనే!"* కుమారుడా *"అఱివుఱాయ్"* తెలివి తెచ్చుకో అంటున్నారు. ఐతే మన వాళ్ళకు శ్రీకృష్ణుడిని నేరుగా ఆశ్రయించకూడదు, ఆచార్యుడైన నందగోపుని ద్వారా ఆశ్రయించాలి అని తెలుసు, అందుకే నందగోపుడి లక్షణాలు తెలుపుతూ *"ఆత్త ప్పడైత్తాన్"* లెక్కకు అందనన్ని *"వళ్ళల్ పెరుం పశుక్కళ్"* ఇచ్చే ఔదార్యం కల్గిన పశువులు, శ్రీకృష్ణుడికీ ఇదే ఉదార స్వభావం కదా ఇది నందగోపుని సంబంధంతోనే కదా వచ్చింది. ఇచ్చే స్థితి తనది పుచ్చు కోనివాడిదే లోటు అన్నట్లు ఆ పశువులు ఎప్పుడు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా పాలు ఇచ్చేవి, ఎలా ఇచ్చేవి ఆ పాలు అంటే

"ఏత్త కలంగళ్" ఎన్ని కుండలు పెట్టినా, "ఎదిర్ పొంగి మీదళిప్ప మాత్తాదే పాల్ శొరియుమ్" పాల ధారలు పొంగుతుంటాయి, ఆ పొంగటం క్రింది నుండా పాలు పొంగుతున్నాయి అన్నట్లు ఇచ్చేవి. ఇక్కడ నందగోపుడు ఆచార్యుడు, గోవులు శాస్త్రములను అధ్యయనం చేసిన మహనీయులు, ఆ శాస్త్రములు కఠినమైనవి, గోవులు వనం అంతాతిరిగి అక్కడి పచ్చికను తిని, అనుభవించి మనకు స్వచ్చమైన పాలను అందించినట్లే, జ్ఞానులైన మహనీయులు శాస్త్రారణ్యాలలో సంచరించి అక్కడి క్లేశాలను తాము అనుభవించి తత్-సారమైన భగవత్-గుణములైన పాల ధారలను మనపై కురిపిస్తారు. కుండలు శిష్యులలాంటివి అనుకోవచ్చు, ఆ ఇవ్వడం నాలుగు కారణాలనే పొదుగుల ద్వారా ఇస్తుంటారు, తమకు పెద్దలు ఇచ్చారు కనుక ఇవ్వాలని కొందరు, ఆవలి వాడు అడుగుతున్నాడే అని కొందరు, ఆవలి వాడు కష్టపడుతున్నాడే అని తీర్చడానికి కొందరు, తమకు తెల్సింది చెప్పకుండా ఉండాలేక కొందరు ఇస్తుంటారు. అలాంటి జ్ఞానులనెందరినో శిష్యులుగా కల వారు మన రామానుజాచార్యులవారు. అలాంటి ఆచార్యులవద్ద కుమారుడిగా ఉండే స్వామి తెలివి తెచ్చుకో, నీవు వచ్చింది గోకులానికి, నీవై కోరి వచ్చావు మాలాంటి వారి వద్దకి. పరమపదంలో నిత్యశూరులవద్ద తన సంకల్పాన్ని గుర్తించి చేసేవారుండగా, తనను తాను తెలియనివాడైనందుకే కదా, మా మధ్యకు వచ్చి మా ఆరాధన అందుకుంటున్నావు, ఇది మా పాలిట నీదయ. *"ఊత్త ముడైయాయ్! పెరియాయ్!"* నీకు దృఢమైన ప్రమాణం నీకుంది వెనకాతల, వేదైక వేద్యుడివి, ఆ వేదానికే అందనివాడివి, అలా అందనివాడివి *"ఉలగినిల్ తోత్తమాయ్ నిర్ఱ"* మా మధ్యకు అందే వాడిలా వచ్చి *"శుడరే!"* దివ్య కాంతులీడుతూ ఉన్నావు, మేం క్రమం తప్పకుండా మీ అమ్మ నాన్నలను లేపి వారి ఆజ్ఞతో వచ్చాం *"తుయిల్ ఎరాయ్"* తెలివి తెచ్చుకో. 



వాళ్ళు ఎట్లా వచ్చారో విన్నవించుకున్నారు *"మాత్త్తార్"* శత్రువులైన వాళ్ళు *"ఉనక్కు వలి తొలైందు"* వాళ్ళ బలాన్ని ప్రక్కన పెట్టుకొని *"ఉన్-వాశఱ్కణ్"* నీ ద్వారం ముందు పడిగాపులు పడేవాళ్ళలా *"ఆత్తాదు వందు"* ఎక్కడైతే నీ బాణాల దెబ్బలకు భయపడి *"ఉన్-అడిపణియుమా పోలే"* నీపాదాలనే సేవించుకొనేట్లుగ వస్తారో, మేం అలానే వచ్చాం, దీంతో స్వామికి బాధ అయ్యి, మీకు శత్రువుల పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నట్లుగా బాధ పడ్డాడు, లేదయ్యా *"పోత్తియాం వందోమ్"* మేం కుడా ఒకనాడు వాళ్ళకేం తీసిపొలేదయా, ఒకప్పుడు మేం అభిమానం కల్గి మేం నీ దగ్గరకి రావటం ఏంటి అనుకునే వాళ్ళం, కానీ నీవంతటివాడివి ఇక్కడికి దిగి వచ్చావు, మాదగ్గరికి కూడా రాగలవు, కానీ మేం ఆగలేక పోతున్నాం, ఆర్తి తట్టుకోలేక నీ పాద ఆశ్రయణం కోసం వచ్చాము. అయితే శత్రువులు వాళ్ళ శరీరాన్నీ కాపాడుకోవటానికి నీ దగ్గరికి శరణూ అంటూ వస్తారు, మేం మా ఆత్మ రక్షణ కోసం వచ్చాం, వాళ్ళు నీ బలానికి లొంగి వస్తే మేం నీ గుణాలకు లొంగి వచ్చాం, వాళ్ళు నీ బాణాల దెబ్బలకు తట్టుకోక వస్తే మేం నీ కళ్యాణ గుణాల దెబ్బలకు తట్టుకోక నీ కళ్యాణ గుణాల కీర్తన చేద్దాం అని వచ్చామయ్యా *"పుగరందు"* ఆనందంతో వచ్చాం, ఇక పై అంతా నీ బాధ్యత అంటూ శరణాగతి చేసారు.


*🌷భాగస్వామ్యం చేయడమైనది🌷*

 *🙏న్యాయపతి నరసింహారావు🙏*

*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐* *🌞ఆదివారం🌞* *🌹05, జనవరి, 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

        *🌞ఆదివారం🌞*

*🌹05, జనవరి, 2025🌹*

     *దృగ్గణిత పంచాంగం*                 


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - హేమంత ఋతౌః*

*పుష్యమాసం - శుక్లపక్షం*


*తిథి      : షష్ఠి* రా 08.15 వరకు ఉపరి *సప్తమి*

*వారం    : ఆదివారం*

(భానువాసరే)

*నక్షత్రం  : పూర్వాభాద్ర* రా 08.18 వరకు ఉపరి *ఉత్తరాభాద్ర*


*యోగం  : వ్యతీపాత* ఉ 07.32 *వరీయాన్* రా 04.51 తె వరకు 

*కరణం  : కౌలువ* ఉ 09.08 *తైతుల* రా 08.15 ఉపరి *గరజి*


*సాధారణ శుభ సమయాలు*

 *ఉ 07.30 - 10.30 మ 02.00 - 04.00*

అమృత కాలం  : *మ 12.39 - 02.11*

అభిజిత్ కాలం  :  *ప 11.51 - 12.35*


*వర్జ్యం             : ఈరోజు లేదు*

*దుర్ముహూర్తం  : సా 04.19 - 05.04*

*రాహు కాలం  : సా 04.25 - 05.49*

గుళికకాళం       : *మ 03.01 - 04.25*

యమగండం     : *మ 12.13 - 01.37*

సూర్యరాశి : *ధనుస్సు* 

చంద్రరాశి : *కుంభం/మీనం* 

సూర్యోదయం :*ఉ 06.37*

సూర్యాస్తమయం :*సా 05.49*

*ప్రయాణశూల  : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం    :  *ఉ 06.37 - 08.52*

సంగవ కాలం     :      *08.52 - 11.06*

మధ్యాహ్న కాలం :*11.06 - 01.20*

అపరాహ్న కాలం: *మ 01.20 - 03.34*

*ఆబ్ధికం తిధి    : పుష్య శుద్ధ షష్ఠి*

సాయంకాలం  :  *సా 03.34 - 05.49*

ప్రదోష కాలం   :  *సా 05.49 - 08.22*

రాత్రి కాలం       :  *రా 08.22 - 11.47*

నిశీధి కాలం       :*రా 11.47 - 12.39*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.55 - 05.46*

_____________________________

          *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


  *🌞IIశ్రీ సూర్య సోత్రంII🌞*


*ప్రతిబోధితకమలవనః కృతఘటనశ్చక్రవాకమిథునానాం*

*దర్శితసమస్తభువనః పరహితనిరతో రవిః సదా జయతి*


🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

అంతరంగిక అందం

 🙏🕉️శ్రీ మాత్రేనమః. శుభోదయం🕉️🙏      🔥అంతరంగిక అందం అనునిత్యం ఆత్మానందం చేయక తప్పదు..గర్వం ఉన్న వారికి గర్వ భగం తప్పదు.. సద్గుణములు ఉన్న వారికి సన్మానం తప్పదు..అహం ఉన్న వారికి జీవితంలో అన్ని దూరం కాక తప్పదు..అణుకువ ఉన్న వారికి అన్ని దగ్గర అవడం తప్పదు🔥అవసరం లేని కోపం, అర్ధం లేని ఆవేశం ఈరోజు మనకు బాగానే ఉంటుంది.. కానీ రేపనే రోజు అవే మనల్ని ఒంటరి చేస్తాయి..మంచిగా ఆలోచించు.. మంచిగా మాట్లాడు.. మంచి పని చెయ్యి.. ఎందుకంటే నువ్వు ఏమి చేస్తావో అదే తిరిగి నీదగ్గరికి తప్పక వస్తుంది🔥మంచి ఆలోచన, మంచి కర్మల ద్వారా సంపాదించగలం.. ఒకే ఒక డిగ్రీ మానవత్వం.. వేసవిలో సూర్యుడిని తిట్టుకున్న వాళ్ళే శీతాకాలంలో అయన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు..మంచి ఆలోచనతో, మంచి మనసుతో  ఉంటే ఇవాళ నిన్ను కాదన్న వాళ్ళే  రేపు నిన్ను తప్పక ఆదరిస్తారు..మంచిగా ఉంటూ మంచి మనసుతో ఉండి అందరిని అందరించి అభిమానించే వారికి ఆ పరమాత్ముని ఆశీర్వాదం  తప్పక లభిస్తుంది🔥🔥 మీ అల్లంరాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ అండ్ జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయిన వారు రాలేని వారు కొత్తవారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593.9182075510* 🙏🙏🙏

కాల చక్రం

 హిందూ పంచాంగం


కాల చక్రం



60 సంవత్సరాలు - 1 సంవత్సర చక్రం (షష్టిపూర్తి)


4,32,000 సంవత్సరాలు - కలి యుగం


8,64,000 సంవత్సరాలు - ద్వాపర యుగం


12,96,000 సంవత్సరాలు - త్రేతా


యుగం"


17,28,000 సంవత్సరాలు - కృత యుగం


మొత్తము 43,20,000 సంవత్సరాలు - 1 మహా యుగం


71 మహా యుగాలు - 1 మన్వంతరం -


14 మన్వంతరాలు – 1 కల్పం


2 కల్పాలు - బ్రహ్మ కి ఒక్క రోజు


2000 కల్పాలు - బ్రహ్మ ఆయుష్షు


విష్ణువుకు 200 కల్పాలు - శివునికి ఒక్క రోజు శివునికి 200 కల్పాలు - ఆది పరాశక్తి కి ఒక కనురెప్పపాటు కాలం.

చినుకులు

 *మనం లెక్కబెట్టు కోగలిగినంత వరకే అవి చినుకులు ఆ తర్వాత దాన్ని వర్షం అంటారు*


అలాగే మనం చక్కబెట్టుకోలేకనంత వరకే అవి సమస్యలు ఆ తర్వాత దాన్ని పరిష్కారం అంటారు.


ఇక్కడ లెక్క చూసుకోవాల్సింది రాలిన చినుకులు ఎన్నని కాదు దాహం ఎంత తీరిందని.


అలాగే ఎన్ని సమస్యలు వచ్చాయన్నది కాదు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఎంతగా పోరాడమన్నదే ముఖ్యం.


ప్రతి సమస్యకు పరిష్కారం ధైర్యమే ముందుకు కొనసాగటమే మన ప్రయాణం.☝️

యోగజీవనమనేది

 *యోగజీవనం*


అప్సరసలు దిసమొలగా కొలనులో దిగి జలకాలాడుతున్నారు. శుకముని ఆ దిశగా రావడం అందరూ చూశారు. ఎవరూ పట్టించుకోలేదు. శుకుణ్ణి పిలుస్తూ వ్యాసమహర్షి పరుగున వస్తున్నాడు. స్త్రీలు కంగారుగా బట్టలు చుట్టబెట్టుకోబోయారు.  విస్తుపోయాడా మహర్షి. "నవ యవ్వనంతో మెరిసిపోతున్న నా కొడుకును చూసినప్పుడు లేని కలవరపాటు వయోవృద్ధుడనైన నన్ను చూస్తే ఎందుకు కలిగింది?" అని అడిగాడు. "నీ కొడుకు నిర్మలుడు, నిస్సంగుడు" అన్నారు అప్సరసలు. "అనుక్షణం పరమాత్మ స్వరూపాన్ని ఉపాసిస్తూ, దర్శిస్తూ, పరవశిస్తూ, బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయినవాడు" అన్నది భాగవతం. ఆ స్థితిలో ఉన్నవాడిని 'ఆరూఢుడు' అంటారు. "ఇది నగరము, ఇది అరణ్యము, ఇది సౌఖ్యము, అది అసౌఖ్యము, ఇతడు పురుషుడు, ఆమె స్త్రీ' వంటి తేడాలేవీ అలాంటి పరిణత మనస్కులకు తోచవు.


ఆరూఢుడికి ( బ్రహ్మజ్ఞానికి ) ఏది చూచినా బ్రహ్మమయమే. అతడు సంగములు సర్వమునూ కలిగి సంగి ( లోబడినవాడు ) కాడు. భోగములు సర్వమునూ చెంది భోక్త కాడు. లోకంలో సన్యాస దీక్షాపరుల పరమ గమ్యం అదే!


సన్యాసం తీసుకోవడమనేది ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ! "సన్యాసం స్వీకరించార"ని మనం అంటూ ఉంటాం. కానీ అది పుచ్చుకుంటే వచ్చేది కాదు. తిరకాసంతా -  మనసుతోనే ! "బంధానికైనా, మోక్షానికైనా కారణం మనసే" అన్నది ఉపనిషత్తు. అంటే సాధ్యమూ మనసే, సాధనమూ మనసే.


సన్యాసాశ్రమ స్వీకరణకు వైరాగ్యం తొలిమెట్టు. సన్యాసం అంటే కాషాయం కాదు. పరిపక్వ, వైరాగ్య, జీవన ఫలసాయం. భవబంధాలను, సుఖదుఃఖాలను పరిపూర్ణంగా చక్కగా విడిచిపెట్టటం (సత్ + న్యాసం ). అదే సన్యాసం. తన భారాన్ని పరమాత్మ పాదాల చెంత సమర్పించడం భరన్యాసం. అదే అనన్య శరణాగతి. అది మానసిక పరిణయం. వైరాగ్యభావసమృద్ధి.


స్త్రీ, ధన, పుత్ర వ్యామోహాలనే మూడింటినీ "ఈషణత్రయం" అంటారు. ఈషణం అంటే కోరిక, వ్యామోహం. దారేషణ,  ధనేషణ, పుత్రేషణ అనే మూడు రకాలైన మోహాలతో మానవులు పీడింపబబడుతుంటారు, కర్మబంధితులై వుంటారు. వాటి కోసం ఎలాంటి తప్పుడు పనులు చేయడానికయినా సాహసిస్తారు. వైరాగ్యమనేది ఈషణ త్రయానికి ఎదురు చుక్క. వాటిని త్యజించి సద్గురువునాశ్రయించి దేహంలో ఆరు పువ్వులలో పూజలను చేస్తానని దృఢ సంకల్పాన్ని స్వీకరిస్తాడు సన్యాసి. దేహంలో ఆరు పువ్వులంటే షట్చక్రాలు. వాటినే షడాధార కమలాలని అంటారు. సాధన చేయగా చేయగా, హృదయాకాశంలో ఓంకారం గంటమాదిరి మోగుతుందట. అది తుదిమెట్టు. చివరికలా జ్ఞాన, వైరాగ్య, నిశ్చల, ఆనందపూర్ణులైనవారు జీవన్ముక్తులవుతారు. ఇదంతా ఒక్క మానవజన్మ లోనే సాధ్యం. వివేక చూడామణిలో శంకర భగవత్పాదులు మనిషి జన్మను ఉత్తమం అనలేదు, దుర్లభం అన్నారు. మురిసిపోవటానికి కాదది, ముక్తి పొందటానికని చెప్పారు.


యోగజీవనమనేద సాధనతోనే సాకారమవుతుంది.

🙏🙏🙏

ఆఫీస్ అసిస్టెంట్

 అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రం నందు, 

రామేశ్వరం, 

నైమిశారణ్యం, 

బృందావనం,

కాశీ, 

భద్రాచలం, 

ఆఫీస్ అసిస్టెంట్, క్లర్క్, పోస్టులు తగినన్ని ఖాళీలు ఉన్నాయి, డిగ్రీ పాసై,మంచి కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన బ్రాహణ  అభ్యర్థుల నుండి వాట్సాప్ ద్వారా ధరకాస్తు చేసుకొనవచ్చును. 


ఎన్నికైన వారికి ఉచిత,వసతి భోజన సౌకర్యాలతో తొమ్మిది నుండి పదివేల రూపాయల జీతం ఇవ్వబడును, వచ్చిన అభ్యర్థులు నిజాయితీ పరులైన, సేవాభావం కలిగేవారై ఉండాలి,ఇది బ్రాహ్మణ నిరుద్యోగ యువతీ యువకులకు, భార్య భర్తలకు,మంచి సదావకాశం 

సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్లు,9704833439,

8333907808,


#గమనిక: 

మన గ్రూపులో వారు లేక ఈ గ్రూపులో వారి తాలూకా వారు ఎవరికైనా  ఆ ఉద్యోగాలు వస్తే ఈ గ్రూపులో వారి వివరాలతో  తెలియపరచండి.  మనకి ఉపయోగపడతారు అక్కడ వసతి సౌకర్యాలకి సహాయంచేసేలా. ఇప్పటికే మనవాడు అక్కడ సేవ చేస్తుంటే తెలియపరచండి. మరచిపోవద్దు.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం - హేమంత ఋతువు - పుష్య మాసం - శుక్ల పక్షం - షష్ఠి - పూర్వాభాద్ర -‌‌ భాను వాసరే* (05.01.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*