27, జులై 2020, సోమవారం

Why should companies recruit

Why should companies recruit
people over 60
for senior and responnsible positions ?
Because they are more productive
than those below 60 !

A massive study in America
has found that the most productive age
in a man's life is
60-70,

From 70-80
is the 2nd most productive age.

The 3rd most productive age is 50-60.

The average age of a Nobel Prize winner is 62.

The average age of a CEO
in a Fortune 500 company is 63.

The average age of the pastors
of the 100 biggest churches in America is 71.

The average age of Pope is 76

This tells us somehow

God has designed that the best years of your life are 60-80 !

IT IS WHEN YOU DO YOUR BEST WORK.

A study published in NEJM found
that at 60
you reach your peak of potential
and continue up to 80 !

So, if you are between 60-70, or 70-80, you have the best and second best years of your life with you !

Source:
 New England Journal of Medicine: 70.389
(2018)

******************

తెలుగు అనువాదం

కంపెనీలు ఎందుకు నియమించుకోవాలి

కంపెనీలు సీనియర్ మరియు రెస్పాన్సిబుల్ స్థానాలకు
60
ఏళ్లు పైబడిన వారిని ఎందుకు నియమించాలి ?
ఎందుకంటే అవి
60 కంటే తక్కువ వయస్సు ఉన్నవారి కంటే ఎక్కువ ఉత్పాదకత కలిగి ఉంటాయి!

అమెరికాలో ఒక భారీ అధ్యయనం
ప్రకారం,
మనిషి జీవితంలో అత్యధిక ఉత్పాదక వయస్సు
60-70,

70-80 నుండి
2 వ అత్యంత ఉత్పాదక యుగం.

3 వ అత్యంత ఉత్పాదక వయస్సు 50-60.

నోబెల్ బహుమతి గ్రహీత

యొక్క సగటు వయస్సు 62.
ఫార్చ్యూన్ 500 కంపెనీలో ఒక CEO

యొక్క సగటు వయస్సు 63.
అమెరికాలోని 100 అతిపెద్ద చర్చిల పాస్టర్ల

సగటు వయస్సు 71. పోప్ యొక్క సగటు వయస్సు 76

ఇది మాకు ఏదో

మీ జీవితంలోని ఉత్తమ సంవత్సరాలు 60-80 అని దేవుడు రూపొందించాడు!

మీరు మీ ఉత్తమ పని చేసినప్పుడు ఇది.

NEJM లో ప్రచురించబడిన ఒక అధ్యయనం
60 వద్ద
మీరు మీ గరిష్ట స్థాయికి చేరుకుని
80 వరకు కొనసాగుతుందని కనుగొన్నారు!

కాబట్టి, మీరు 60-70, లేదా 70-80 మధ్య ఉంటే, మీ జీవితంలోని ఉత్తమ మరియు రెండవ ఉత్తమ సంవత్సరాలు మీతో ఉన్నాయి!

మూలం:
 న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్: 70.389

శ్రావణ సోమవారం నీలకంఠుడిని పూజిస్తే..

శ్రావణ సోమవారం నీలకంఠుడిని పూజిస్తే.. 
విశేష ఫలప్రదము.

మాసాలన్నింటిలో శ్రావణమాసం ప్రత్యేకతను ... ప్రాధాన్యతను కలిగివుంది. శ్రావణమాసం శుభాన్ని సూచిస్తుందనీ ... శుభకార్యాలకు ద్వారాలు తెరుస్తూ ఆనందాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రవణా నక్షత్రంతో పౌర్ణమి చంద్రుడు కూడిన మాసమే 'శ్రావణ మాసం'గా భావించబడుతోంది. శ్రావణ మాసంలో సోమవారం ... మంగళవారం ... శుక్రవారం ...శనివారం... పౌర్ణమి విశిష్టమైనవిగా చెబుతుంటారు

పరమ శివుడు సముద్రమధనంలో వెలువడిన హాలాహలాన్ని శ్రావణమాసంలోనే సేవించి నీలకంఠుడైనాడని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం పరమ శివుని పూజిస్తే అనుకున్న కార్యాలు చేకూరుతాయి. పార్వతి దేవికి కుంకుమ పూజ చేస్తే ఐదవతనం కలకాలం నిలుస్తుందని భక్తులు ప్రగాడంగా నమ్ముతారు.
శ్రావణ సోమవారం రోజున చేసిన శివారాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని మహర్షులు చెప్పడం జరిగింది. ఈ రోజున సాక్షాత్తు విష్ణుమూర్తి కూడా శివరాధాన చేస్తాడట. అందువలన ఈ రోజున పరమశివుడిని భక్తితో అభిషేకించిన వారిని ఆయనతో పాటు విష్ణువు కూడా అనుగ్రహిస్తాడు.

ఇంకా శివాలయాల్లో జరిగే అభిషేకాలు, పూజలు చేయించేవారికి వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ఇక అమ్మవారిని మంగళ గౌరీ అంటారు కనుక మంగళవారం రోజున అమ్మవారిని పూజిస్తూ 'శ్రావణ మంగళవారం' నోము నోచుకుంటూ వుంటారు. తమ సౌభాగ్యాన్ని కాపాడమంటూ వివాహిత స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ నోము నోచుకుంటారు.

మహిళలు అత్యంత పవిత్రంగా భావించే శ్రావణమాసంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయిస్తే సకలసంపదలు చేకూరుతాయి. శ్రావణ మాసంలో పెళ్ళిల్లు, వ్రతాలు, పూజలు, శుభకార్యాలు వంటి కార్యక్రమాలతో ప్రతిరోజు ఇల్లంతా సందడిగా ఉంటుంది.

శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి గురించి సామవేదం షణ్ముఖశర్మ గారు చెప్పిన విశేషాలు
శర్మ గారి ప్రసంగం శివరాత్రి ముందురోజున ఏర్పాటు చేశారు. నిజానికి శ్రీకాళహస్తీశ్వరాలయ అధికారులు చాలా సంవత్సరాల నుంచీ ఆయన్ను శివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో ప్రవచనం కోసమని ఆహ్వానిస్తూనే ఉన్నారట. ఆయనకు ముందుగానే వేరే ఆలయాల్లో పూజలకు ఒప్పుకొని ఉండటం వల్ల రాలేకపోయానని చెప్పారు. అయితే ఈసారి కొంచెం ముందస్తుగా ఏర్పాటు చేసుకొని రాగలిగినందుకు సంతోషాన్ని వెలిబుచ్చారు.
శ్రీకాళహస్తి పేరు వినగానే అందరికీ గుర్తు వచ్చేది శ్రీ – సాలె పురుగు, కాళ – సర్పము, హస్తి – ఏనుగు అనే మూగజీవాలకు ముక్తి నిచ్చిన క్షేత్రమని చాలా మంది వినే ఉంటారు. కాబట్టి దీన్ని గురించి ఎక్కువగా విడమరిచి చెప్పడం లేదు. ఇది జరగక మునుపే ఇక్కడ చాలా సంఘటనలు జరిగున్నాయట. అప్పుడు ఈ ప్రాంతాన్ని గజకాననం అనే వారట.
బ్రహ్మ ముందు ఇక్కడ పరమశివుడి గురించి తపస్సు చేసిన తర్వాతనే సృష్టికార్యం ప్రారంభించాడట. ఇక్కడ శివుడు జ్ఞానానికి ప్రతీకయైన దక్షిణామూర్తి స్వరూపంలో కూడా వెలసిఉన్నాడు.
వశిష్ట మహర్షికి విశ్వామిత్రునితో వైరము వలన తన నూర్గురు పుత్రులనూ పోగొట్టుకుంటాడు. ఆయన జ్ఞాన సంపున్నుడే అయినా పుత్రశోకంతో మాయ కప్పివేయడం మూలాన గజకాననానికి వచ్చి ఓ పర్వతం ఎక్కి ఆత్మహత్య చేసుకోబోయాడట. అప్పుడు భూమత అతన్ని రక్షించింది. శివుని గురించి తపస్సు చేయమని కర్తవ్యబోధ చేసింది. అలా కొన్నేళ్ళపాటు తపస్సు గావించిన వశిష్టునికి మహాశివుడు, దక్షిణామూర్తి స్వరూపంలో మర్రిచెట్టు కింద దర్శనమిచ్చాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. మహాజ్ఞానియైన ఆయన ప్రాపంచిక విషయాల గురించి ఏం కోరుకుంటాడు?. అయినా లోక కల్యాణం కోసం శివుడిని జ్ఞానప్రదాత గా ఆ క్షేత్రంలో కొలువై ఉండమని కోరుకున్నాడట. అలా శ్రీకాళహస్తి జ్ఞానక్షేత్రమైంది. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ.
శ్రీకృష్ణదేవరాయలు కొలువులోని అష్టదిగ్గజాల్లో ధూర్జటి ఒకరు. అవి ప్రభంద సాహిత్యపు రోజులు. అందరు కవులూ రాజుల గురించి ఇతివృత్తాలను ఎన్నుకుంటుంటే ఆయన మాత్రం ఆయన ఇష్టదైవమైన శ్రీకాళహస్తీశ్వరుని ఇతివృత్తంగా ఎన్నుకొని శ్రీకాళహస్తీశ్వర మహత్మ్యం రాశాడు. అలాగే శ్రీకాళహస్తీశ్వర శతకం కూడా రాశాడు. ఆయన శైలిని గురించి రాయలు స్వయంగా

స్తుతమతి యైన యాంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల కల్గెనీ యతులిత మాధురీ మహిమ ? 
అని కీర్తించినట్లు చెబుతుంటారు. తర్వాత ఆస్థానంలో ఆయనపై కొంతమంది ఏవో నిందలు వేయడంతో రాయలవారు ధూర్జటికి రాజ్య బహిష్కార శిక్షను విధించారట. వెంటనే ధూర్జటి కట్టుబట్టలతో భార్యతో కలిసి ఒక అడవికి వచ్చేశాడట. అక్కడే ఇద్దరు ముని దంపతుల ఆశ్రమంలో ఉంటూ వాళ్ళకు సేవ చేస్తూ, వాళ్ళు పెట్టే భోజనం తింటూ దైవ ప్రార్థనలో ప్రశాంత జీవనం గడుపుతున్నారట.

ఒకరోజు ధూర్జటి దంపతులు నదీ స్నానం కోసం వెళ్ళగా అక్కడికి వచ్చిన రాయల వారి సైనికులు వీరిని గుర్తు పట్టి, ఆయన మీద వేసిన నిందలు అసత్యాలుగా నిరూపణలు అయ్యాయనీ,  రాజు వాళ్ళను తిరిగి రాజ్యానికి ఆహ్వానించారనీ చెప్పారు. వెళ్ళాలా? వద్దా అని ఆలోచిస్తూ ఆశ్రమం వైపు నడుస్తున్నారు. కానీ వారికి ఎంత సేపు వెతికినా ఆయాశ్రమమూ కనిపించలేదు, వృద్ధ దంపతులూ కనిపించలేదు. చివరికి అది శ్రీకాళహస్తీశ్వరుని మహత్తుగా భావించి తాము వారితో రావడం లేదని ఆ సైనికులను తిరిగి పంపించి వేసి తమ శేష జీవితాన్ని శ్రీకాళహస్తి క్షేత్రంలోనే గడిపాడని చెబుతారు. అయితే దీనికి చారిత్రక ఆధారలేమీ లేవని శ్రీ శర్మ గారే స్వయంగా చెప్పారు.
ఇక్కడ ప్రవహించే స్వర్ణముఖీ నది అసలు పేరు సువర్ణముఖరీ నది. అగస్త్య మహర్షి ప్రభావంతో ఈ నదీ ప్రవాహం ఏర్పడ్డదని స్థల పురాణం చెబుతోంది.
(ఇనగంటి రవిచంద్ర)
సేకరించి భాగస్వామ్యం చేయబడింది 

****************

చాణిక్యుని అర్థశాస్త్రం

ఇది " ప్రణవ " సమూహం సమర్పణ ! 

చాణుక్యుడు అర్థశాస్త్రం వ్రాసాడని 19వ శతాబ్దము దాకా అందరికీ తెలుసు, కానీ ఆ పుస్తకప్రతి ఎవరి వద్దా దొరకలేదట. ఆశ్చర్యంగా లేదూ?!!  

భరధ్వాజముని వైమానిక శాస్త్రం కూడా అంతే. వీటి ప్రస్తావనలు కథలలో పురాణాలలో ఉంటాయేమో కానీ, ఆ పుస్తకాలు ఎక్కడా దొరికేవు కావు. అలాగే భోజరాజు వ్రాసిన సమరాంగణసూత్రధార కూడా దొరకదు. చెప్పుకుంటూ పోతే ఇటువంటి వైజ్ఞానిక గ్రంథాలు ఎన్నో. ఎన్నెన్నో. ప్రస్తుతానికి చాణిక్యుని అర్థశాస్త్రం ఎలా దొరికిందో అన్న విషయాన్ని పరిశీలిద్దాము.

అందరూ అర్థశాస్త్రం ఉండేదని చెప్పేవారే కానీ, అందులో ఏముందో తెలిసిన వారు అసలు ఎవరూ 19వ శతాబ్ది నాటిదాకా ఎవరూ లేరట. భరతావనిపైన ఇస్లాముక్రైస్తవమతస్తుల దాడులలో మన ఆర్షవిజ్ఞాన ప్రతులను నాశనం చేయడమే కాదు, అవి నేర్చుకున్నవారిని కూడా చంపేసారు (ఇలా చంపడం, నాశనం చేయడం వంటి దుర్మార్గాలు కేవలం భారతదేశంలోనే కాఉ, ఈ దుష్టులు వెళ్ళిన ప్రతి దేశంలోనూ ఇలాగే చేసారు). చివరికి మన ఆర్షవిజ్ఞాననం నేర్చుకున్నవారు కూడా అది తమకు తెలుసునని చెప్పుకోవడానికి కూడా జంకే పరిస్థిని ఏర్పరచారు. అలా కాలక్రమేణా హిందువులకి విజ్ఞానమన్నదే లేదని, అలా మనవారి చేతనే నమ్మించారు. హిందువులకు దేవుడి గురించి మూఢనమ్మకాలే తప్ప వారికి విజ్ఞానశాస్త్రాలేవీ తెలియవు అని మనచేతే నమ్మబలికించారు.  దానితో ఆర్షవిజ్ఞానాన్ని నేర్చుకున్నవారు, కనీసము వాటి పట్ల ఆసక్తి కనబరచినవారు కూడా కరువైపోయారు ఆరోజుల్లో. 

తరువాత బ్రాహ్మణులు మీ విజ్ఞానాన్ని ఎవరికీ నేర్పలేదు, అందుకే అవి మీకు అందలేదు అని అబద్దాలను కూడా వ్రాయిపించి, మిగితా కులాల వారిని బ్రాహ్మణులపైకి రెచ్చగొట్టి, "డివైడ్ అండ్ రూలు" అన్న కుయుక్తిని ప్రయోగించారు. దీనితో బ్రాహ్మణులపైన కొద్ది పాటి గౌరవమైనా మిగిలి వుంటే, అది కూడా తుడిచి పెట్టుకు పోయింది. ఇంత అకృత్యాలు చేసినా హిందూమతం ఇంకా నిలబడే ఉంటోందన్న కసితో, ఆ మతాన్ని కాపాడుకుంటూ వస్తున్న ఎందరో బ్రాహ్మణులను ఇస్లాముక్రైస్తవ పాలకులు ఊచకోత కోసి చంపేసారు.వారి వైజ్ఞానికపుస్తకాలను నాశనం చేసారు.  అయినా సరే కొందరు బ్రాహ్మణులు ప్రాణాలకు తెగించి, రహస్యంగా వేదవిద్యలను, ఆర్షవిజ్ఞానాన్ని నేర్చుకుని, వాటిని తమలోనే బ్రతికించుకుంటూ వచ్చారు.  పైన చెప్పిన అర్థశాస్త్రము, సమరాంగణ సూత్రధార, వైమానిక శాస్త్రము వంటి గ్రంథాలు నేడు మనకు అందుతూ వున్నాయీ అంటే అది వీరి చలువే. వీరి బలిదానము వల్లనే అలనాటి విజ్ఞానము కొంతమటుకు ఐనా ఇంకా దొరుకుతూనే వుంది. వేదాలు కూడా ఇంకా దొరుకుతూ ఉన్నాయి అంటే అవి వీరు మౌఖికముగా తరువాతి తరాలుకు అందించుకుంటూ రావడమే కారణము. పుస్తకాలలో కనుక వేదాలను భద్రపరిస్తే అవి ఎప్పుడో తగులబెట్టేసి వుండేవారు ఆ దుర్మార్గమతస్తులు. 
  
బ్రాహ్మణులు తాళపత్రాలపైన ఈ గ్రంథాలను వ్రాసి, దాచి పెట్టుకుని, ఆ తాటాకులు కాలక్రమంలో పాడైపోతూ వుంటే వాటిని తిరిగి మళ్ళీ క్రొత్త తాటాకులపైన వ్రాసి దాచుకునేవారు. తరువాతి తరాలవారు ఇవి తమకు అర్థమయినా కాకపోయినా సరే, వాటిని తిరిగి కొత్త తాటాకులపైన మళ్ళీ వ్రాసి భద్రపరచుకుని భావితరాలకు అందించాలనే నిష్ఠతో జీవించారు. నిజానికి ఇది ఎవరిచేతా గ్రుర్తింపబడని సామాజిక సేవే. ఇలా దాచుకున్నవి కూడా కొన్ని పాశ్చాత్యమతస్తుల చేతుల్లో దొరికి నాశనము చేయబడ్డాయి.

కానీ కాలక్రమంలో మన అదృష్టం బాగుండి, ఒక మంచి బ్రిటీషు అధికారి వచ్చి, తనకు దొరికిన కొన్ని పురాతన తాళపత్రాలని నాశనం చేయకుండా, అవి ఏమిటో అని పరిశీలించడానికి ప్రయత్నించాడట. బ్రిటీషువారిలో కూడా అప్పుడప్పుడు కొందరు మంచి వారు వస్తూవుండేవారు. వారు ఈ తాళపత్రాలని పరిశీలించి అందులో ఏముందో చెప్పమని, రుద్రపట్నం శ్యామాశాస్త్రి  అనే ఒక సంస్కృతపండితుడిని నియమించారట. అందులో ఎన్నో పాడైపోయిన తాళపత్రాలు .... ...  ఒక్కో తాళపత్రం ఒక్కో గ్రంథంలోనివి, ... ఒక్కో తాళపత్రం ఒక్కోలిపిలో ఉన్నవి, ... కొన్ని మంచి వ్రాతలు, కొన్ని పిచ్చివ్రాతలు, ... .. ఇలా ఇటువంటివన్నీ ముందేసుకుని ఆయన తన పరిశోధనలు సాగిస్తూవుంటే, అనుకోకుండా ఒక అద్భుతం జరిగిందట. 

ఒక అజ్ఞాత బ్రాహ్మణ రైతు తనవద్ద ఒక తాళపత్రాలకట్ట వున్నాయి అని, అవి శ్యామాశాస్త్రికి ఇచ్చాడట. మీరు ఏదోమంచి పని చేస్తున్నారు అని విన్నాను, ఈ తాళపత్రాలు కూడా మీకు పనికొస్తాయేమో చూడండి, అని ఇచ్చి వెళ్ళిపోయాడట ఆ గుర్తు తెలుపని పేద బ్రాహ్మణుడు. తరువాత ఎప్పుడో శ్యామశాస్త్రి ఈ బ్రాహ్మణుడిచ్చిన గ్రంథమేమిటో చూద్దామని చూస్తే, అది గ్రంథాలిపిలో ఉంది అని నిర్థారించాడట, కానీ ఆ గ్రంథాలిపిని చదువలేక పోయాడట. ఒక కథనం ప్రకారం అది చదవటానికి కావలసిన జ్ఞానము శ్యామశాస్త్రిగారికి స్వప్నావస్థలో దైవానుగ్రహం వల్ల కలిగిందట. వెంటనే నిద్రలేచి చదవటం మొదలు పెడితే అది మొత్తం చదివేయగలిగాడట. అదే చాణిక్యుని అర్థశాస్త్రంగా ఆయన అప్పుడు గుర్తించాడట. ఇలా ఇది 1905వ సంవత్సరములో అనుకోకుండా జరిగింది. అప్పటినుంచీ అంటే 1905వ సంవత్సరము నుంచీ మళ్ళీ మనకు మన చాణిక్యుని అర్థశాస్త్రం దొరుకుతూ వచ్చింది. ఎప్పటి చాణిక్యుడు,ఎప్పటి అర్థ శాస్త్రము? దాదాపు రెండువేల సంవత్సరాల తరువాత మళ్ళీ పునర్దర్శనం కలిగింది భారతీయులకు.  

అలాగే, 1918–1923 సంవత్సరాల మద్య పండిత్ సుబ్బరాయ శాస్త్రి అనే ఒక పండితుడు, తనకు భరధ్వాజముని స్వప్నంలో దర్శనం కలిగించి, వైమానిక శాస్త్రాన్ని బోధించారని చెప్పాడు. అలా సుబ్బరాయ శాస్త్రి నేర్చుకుని చెబుతుంటే విని, ఆయన శిష్యులు   వ్రాసుకున్నదే నేడు మనకు లభించే భరధ్వాజముని విరచిత వైమానిక శాస్త్రము. ఇది నమ్మలేని వారికి సుబ్బరాయ శాస్త్రిగారి వంశస్తులు గుప్తంగా అనేక వేల సంవత్సరాలుగా ఎన్నో కష్టాలకు ఒర్చి గుప్తంగా దాచుకుని, మౌఖికముగా వంశపారపర్యముగా అభ్యసించి భద్రపరచి, మనకు అందించినదే ఈ భరద్వాజవైమానిక శాస్త్రము. ఏదైతేనేమి 19వ శతాబ్దిదాకా ఈ పుస్తకం కూడా మరుగున పడాల్సివచ్చింది. శాస్త్రిగారి వంటివారి కృపచేత మళ్ళీ మనకు లభించింది.  

అలాగే భోజరాజు వ్రాసిన సమరాంగణ సూత్రధార భారతదేశంలో ఎక్కడా దొరకదు. కానీ అమెరికాలోని వాషింగుటన్ లైబ్రరిలో ఒక ప్రతి లభ్యమవుతుంది అని వినికిడి. బ్రిటిషువారి ద్వారా వారి కాలంలో  ఎలాగో అలాగ అమెరికావారు దీన్ని సంపాదించుకుని వుంటారు. ఈ మన విజ్ఞానం మళ్ళీ మనకెప్పుడు దొరుకుతుందో మరి. దొరికినా వీటిని మన యూనివర్సిటీలు ఎప్పటికి నేర్పుతాయో?

మొన్న భారతీయ వైమానికశాస్త్రం గురించి ఒక సైన్సు కాంఫరెన్సులో ఒక మినిస్టరుగారు మాట్లాడినందుకే మన పిచ్చి సెక్యులరులంతా పిచ్చికుక్కలలాగా అరచి గగ్గోలు పెట్టారు. ఆత్మాభిమానమే లేని ఈ సన్నాసులు, ఇది సైన్సు సభా లేక హిందూ సభా అని కాకిగోల చేసారు. ఇక ఆర్షవిజ్ఞానాన్ని యూనివర్సిటీల ద్వారా ప్రపంచానికి అందనిస్తారా? వీటిని లోకి రానిస్తారా? చూద్దాం.

                                  ఇట్లు 
                                     మీ
                   అవధానుల శ్రీనివాస శాస్త్రి

వాక్సిన్ కి డిమాండ్ ఉంటుందా



Dr. A. Venu Gopala Reddy

హెర్డ్ ఇమ్మ్యూనిటి వచ్చే లోపల వాక్సిన్ అమ్మేసుకోవాలి ఇది వాక్సిన్ సంస్థల తాపత్రయం. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా కోవిడ్ 19 వాక్సిన్ తయారు చేసే పనిలో నిమగ్నమయిన 150 కి పైగా సంస్థలకు కొత్త సమస్య వచ్చిపడ్డది. వీటిలో ఒక 15 సంస్థలు బాగా ముందంజలో ఉన్నాయి. 

కానీ ఈ సంస్థల కన్నా కరోన వైరస్ చాలా స్పీడ్ గా ఉంది. ఇప్పటికే అనేకమందికి సోకి వారిలో రోగ నిరోధక వ్యవస్థని ఉత్తేజితం చేసింది. వారిలో antibodies, t సెల్స్ ఉత్పత్తి అయ్యేలా చేసింది. వాక్సిన్ చేయాల్సిన పని వైరస్ చేసేస్తోంది. దీనిని సహజ రోగ నిరోధకత అంటారు. వాక్సిన్ ఇచ్చినపుడు కూడా జరిగేది ఇదే. మరి రెండింటికి తేడా ఏమిటంటే సహజ రోగనిరోధకత ప్రక్రియలో మనిషిలో కొంత నష్టం జరుగుతుంది. కృత్రిమ రోగ నిరోధకత (వాక్సిన్) లో అటువంటి నష్టం ఉండదు. రెండిటి గమ్యం ఒకటే, ఫలితం ఒక్కటే. నిజం చెప్పాలంటే కృత్రిమ రోగ నిరోధకత కంటే సహజ రోగ నిరోధకత ఎక్కువకాలం ఉంటుంది, ఖచ్చితంగా పనిచేస్తుంది.

ఎక్కడ వైరస్ వ్యాప్తి బాగా ఉందొ అక్కడ ఇప్పటికే 25% మందిలో రోగ నిరోధకత ఉంది. కొందరిలో antibodies సంఖ్య తగ్గిపోయినా రోగనిరోధకత ఉంది. అంటే మెమరీ సెల్స్ ఉత్పత్తి అయిందన్నమాట. ఇంకొంత మందిలో అంతర్గత రోగ నిరోధకత ఉంది. మరికొంత మందిలో త్వరలో వచ్చేస్తుంది. 

ఇదంతా చాలా వేగంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ వైరస్ ఇన్ఫెక్టీన్ వేగం ఎక్కువ. ఇంత త్వరగా ఏ వైరస్ వ్యాప్తి చెందలేదు గతంలో.

వాక్సిన్ protocols అన్ని పాటిస్తే వచ్చే మార్చి వరకు కూడా విడుదల కావు. కానీ వైరస్ వ్యాప్తి
ఇలాగే కొనసాగితే డిసెంబర్ వరకు ప్రపంచ వ్యాప్తంగా అందరికి హెర్డ్ ఇమ్మ్యూనిటి వస్తుంది.  ఇక వాక్సిన్ తో పనే ఉండదు. 

అందుకే, అన్ని protocols ప్రక్కకి పెట్టి vaccineలను వివిధ దేశాలు ముందుకు తెస్తున్నాయి. లేదంటే పెట్టిన పెట్టుబడి ఖలాస్.

మరి ఇలా హడావుడి గా వాక్సిన్ తెస్తే ఆరోగ్య సమస్యలు ఉండవా!
ఉండకపోవచ్చు, ఇది ఒక మాములు వైరస్. 10వేల మందిలో ఒక్కరికి ప్రమాదకర వైరస్. వాక్సిన్ తయారు చేసేపుడు దీనిలో ఉండే ప్రమాదకర లక్షణాలు తొలిగిస్తున్నారు అందువల్ల భారీ ఆరోగ్య సమస్యలు ఉండకపోవచ్చు. ఇది మామూలు వైరస్ కాబట్టే ఇంత త్వరగా, ఇన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఎయిడ్స్ లాంటి వాటికి ఇప్పటికి వాక్సిన్ ఇస్తామని ఏ సంస్థ గట్టిగా చెప్పడం లేదు. 

డిసెంబర్ తరువాత వస్తే వాక్సిన్ కు పెద్దగా డిమాండ్ ఉండకపోవచ్చు...అందుకే ఈ హడావుడి వడ్డన.. చూద్దాం....Dr. A. Venu Gopala Reddy, Microbiologist
9948106198
(Please share with my name and details)

గతం నేర్పిన పాఠం:
మనకు గతంలో ఇన్ఫ్లుఎంజా అనే వ్యాధి కూడా ఇదే మాదిరిగా ప్రబలి చాలా మంది ప్రాణాలను తీసుకుంది. కానీ ఇప్పుడు మనం ఇన్ఫ్లుఎంజాను ఒక సాధారణ వ్యాధిగా మాత్రమే చేస్త్తున్నాము.  కాబట్టి కొంత కాలం పోయిన తరువాత ఈ కరోనాను కూడా తట్టుకొనే శక్తి మన శరీరాలకు వస్తుంది.  అప్పుడు కరోనా వస్తే ఒక విక్స్ బిళ్ళ లాంటి ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది లేదంటే ఒక వారం రోజులు బాధిస్తుంది. ఆ సమయం తొందరలో రావాలని మనం భగవంతుణ్ణిప్రార్ధిద్దాము .
ఇప్పుడు మనం చేయాలసింది ఒకటే ఇంట్లోంచి బైయటికి వెళ్లకుండా ఉండటం. ఏరకమైన మానసిక వత్తిడికి లోనుగాకుండా ఉండటం, మన రోగ నిరోధక శక్తీ  పెంచుకోటం కోసం, కాషాయం తాగటం, ఆవిరి పట్టి మన శ్వాస కోశాలని, గొంతుని శుభ్రపరుచుకోటం, ఇది మనం క్రమం తప్పకుండ చేస్తూ, సమతులన ఆహరం తీసుకోటం. అప్పుడప్పుడు నిమ్మకాయ లేక ఇతర విటమిన్ C వున్నా ఆహరం తీసుకోటం మంచిది. ఆరోగ్యవంతులనీ కరోనా ఏమి చేయలేదు గుర్తుంచుకోండి మనం శారీరకంగా, మానసికంగా పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడు మనకు ఏవిధమైన భయం ఉండదు.
అవకాశం వదలని మందుల షాపు వారు: మీరు ఈ క్రింది టాబులెట్లని మందుల షాపులో కొనటానికి వెళితే అప్పుడు మందుల షాపు వాళ్ళు ఎలా ఎక్కువ ధరలకు అమ్ముతున్నారో తెలుస్తుంది.
నిజానికి ఇవి సాధారణ ఫుడ్ సప్లీమెంట్స్ చాలా చౌకగా దొరకాలి కానీ రేట్లు చూసి తెలుసుకోండి.
zinco vit- tab: ఇది జింకు విటమినులు కలసి వున్నా మాత్ర.  దేనివల్ల మనకు శక్తి వస్తుంది.
Vit-C tab: శరీరంలో రోగ నిరోధకత పెరుగుతుంది.
B.Complex tab: మరియు ఇతర విటమిన్ టాబిలెట్లు.
నిజానికి ఇవి మందులు కావు వీటిని ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు అంటే మన శరీరంలో మనకు మనం తినే ఆహరం శరీర పోషణకు సరిపోక పొతే దానికి వాడేవి . ఈ కొరోనా నేపథ్యంలో వైద్యులు ఈ మందులు వాడమని చెపుతున్నారు.  ఒక వేళ జ్వరం ఉంటే Paracetamol tab. వాడాలి అంటున్నారు.
మనం ఇప్పుడు ఈ క్రిందివి ఆహారంలో ఉండేట్లు చూసుకోవాలి.
మిరియాలు, అల్లం, శొంఠి, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాఎచెలు, తులసి ఆకులు, బెల్లం,
మనం నిత్యం మన ఆహారంలో చారు పెట్టుకుంటే మనకు చాలా మంచిది. వేరే మందుల జోలికి పోనవసరం లేదు.
బెల్లం: మనం పూర్వం బెల్లం నిత్యం వాడే వాళ్ళం పూర్తి ఆరోగ్యంగా వుండే వాళ్ళాం. బెల్లం, చక్కర రెండు చెరకు గడనుంచి తీసిన తీపి పదార్ధాలు ఐనా బెల్లంలో కార్బోహైడ్రేట్స్ (చెక్కర పదార్ధం) తో పాటు ఖనిజాలు కూడా వున్నాయి ఇవి మన శరీరానికి చెక్కరకన్నా ఎక్కువ బలాన్ని ఇస్తాయి. ఇంకా బెల్లం చెరకు రసం పూర్తిగా ఏ పదార్ధం కూడా వేరు చేయకుండా చేస్తారు కాబట్టి అందులో చెరకురసంలో వున్న అన్ని పోషకాలు ఉంటాయి. చెక్కర తయారీకి గంధకం మొదలగు రసాయనాలు వాడుతారు, మరియు చాలా పదార్ధాలను తీసి శుద్ధి చేసి తయారు చేస్తారు. కాబట్టి చెక్కర ఒక శుద్ధి చేసిన చెరకు రసం అంటే రసంలో ఎన్నో ఖనిజాలు తొలగించబడ్డాయి.. కేవలం నాజూకుగా చెక్కర మిగిలింది. మీకు ఒక రకంగా చెప్పాలంటే చెక్కర A.C గదిలో కూర్చొని పనిచేసే నాజూకు మనిషి అయితే బెల్లం ఎండలో తిరిగి పనిచేసే రైతు లాంటిది. బెల్లం తింటే శరీరం పుష్టిగా ఉంటుంది, చెక్కర తింటే నాజూకుగా కష్టానికి తట్టుకోదు.  కాబట్టి బెల్లం వాడకం పెంచండి బలాన్ని పెంచుకోండి.
ఇంకొక విషయం మనం మన వంటలే కాదు వంట పాత్రల్ని మార్చాము దీని పరిణామం మనకు తెలియటం లేదు కానీ డాక్టర్ బిల్లులో అది మనం చూస్తున్నాం.
పూర్వం ఇనప మూకుడు, ఇనప పోపు గరిటె ఉండేవి. ఇప్పుడు అన్ని అల్యూమినియమ్ పాత్రలు కదా.
ఇనుప మూకుడులో చేసిన పచ్చళ్ళు, పోపులు ఇనుముని తమలో కరిగించుకొని మనకు తగినంత ఇనుముని అందించేవి అప్పుడు ఎవ్వరు రక్త హీనతతో బాధ పడలేదు. ఇప్పుడు నేను చెప్పను మీకే తెలుసు.
ఇంట్లో తప్పకుండా ఇనుప మూకుడు ఉండాలి, దానిలోనే బండ పచ్చళ్ళు (ఇప్పుడు మిక్సీ పచ్చళ్ళు అనాలి కాబోలు) వేయించాలి దానితో మనకు తగినంత ఇనుము దొరుకుతుంది.
మన వంట విషయంలో శ్రర్ధ తీసుకుంటే మనం డాక్టర్ దగ్గరికి పోనవసరం లేదు.
తృప్తిగా తిందాం, ఆరోగ్యంగా ఉందాం.



*మట్టి దీపం*



రోజూ దీపాలు కడిగి పెట్టే ఓపిక లేదు ఏదైనా ఉపాయం చెప్పండి...అని ఎవరో అడిగారు ! దానికి సమాధానం...

లోహం దీపం ఏదైనా కడిగి పెట్టాలసిందే, *మట్టి దీపాలు నిత్య దీపంకి వాడితే ఒత్తి మారిస్తే సరిపోతుంది మట్టి దీపం కడగాల్సిన పని లేదు, లోహం దీపాలు కాకుండా పాత కాలంలో మట్టి దీపాలే ఎక్కువగా వాడేవారు..* మట్టి దీపం శ్రేష్టం కూడా, పండగలు, పర్వదినాల్లో సమయం ఉంటుంది కనుక ఇత్తడి వెండి దీపాలు పెట్టుకోండి రోజూ వారి దీపారాధన లో మట్టిదీపాలు జతగా ఉంచి దీపం పెట్టుకోండి. భగవంతుడు ముందు రోజూ నీళ్లు పెట్టాలి, చిన్న బెల్లం ముక్క అయినా పెట్టాలి. మంత్రాలు చదివే సమయం లేకుంటే కులదేవత, లేక ఇంటి దేవతగా కొలిచే దైవాన్ని నామ స్మరణచేసి నమస్కరించుకోండి హారతి ఇవ్వండి భక్తిగా ఒక నమస్కారం చేయండి చాలు సమయం ఉన్నప్పుడు ప్రశాంతంగా చేసుకోండి,  కానీ హడావిడిగా కాసేపు పూజ కాసేపు వంట ఈ హడావుడి వద్దు.

రోజూ నూనె దీపాలు తోముతూ సమయం అవుతుంది అనుకునేటప్పడు ఓ రెండు మూడు జతలు దీపాలు అధికంగా ఉంచుకుంటే సమయం ఉనప్పుడు వాడిన దీపాలు శుభ్రం చేసుకోవచ్చు, ఇటువంటి కొన్ని నియమాలు వల్ల రోజూ దీపారాధన చేయడం లేదు అని కొందరు అన్నారు అలా అనకండి దీపం జ్యోతి పరబ్రహ్మము అన్న పదాన్ని ఇంక ఏ కైంకర్యానికి లేదు దీపం ప్రత్యక్ష దైవం ఆ ఉద్దేశం తోనే రోజు దీపం  కడిగి పెట్టమంటారు.. అందులో జ్యోతి రూపంలో మీ ఇంటి ఇల వేలుపు కొలువై ఉంటుంది నియమాలు మన క్రమశిక్షణ కోసం శుభ్రత కోసం కొందరు 6 గం ఇంటి నుండి బయలు దేరితే కానీ వారి వృత్తి కార్యాలయానికి చేరుకోలేరు అది వారి నిత్య జీవితం అయినా శ్రమ అనుకోకుండా భక్తిగా దీపం పెట్టి వెళ్ళాలి అనుకున్నారు అందుకు సంతోషం తో కృతజ్ఞతలు కూడా చెప్తున్నాను, ఆ దీపం అమ్మవారు ఆ దీపం అగ్ని దేవుడు ఆ దీపం మహా యజ్ఞం అది మీకు సదా రక్షణగా ఉంటుంది.. ఇటువంటి పరిస్థితి అందరూ దాటి వచ్చిన వాళ్ళమే ఉదయం 5 గం లేచి దీపారాధన చేసి పండో పాలో పెట్టి.. ప్రయాణంలో చెప్పులు విడిచి స్త్రోత్రలు నామజపం మంత్ర జపం చేసుకుంటాము, మనము తీరికగా కాళీగా పని లేనప్పుడు చేద్దాము అనుకోకుండా దేవుడు మనకు ఇచ్చిన అవకాశంలో వినియోగించుకుందాము.. ఏ పని చేస్తున్నా నామ స్మరణ చేసుకోవచ్చు. 

ప్రతి హిందువు ఇంట్లో దీపం వెలగాలి అదే మీకు రక్షణ అవుతుంది అందులోనూ అంత ఉదయాన్నే దీపం ఇంట్లో వెలగటం చాలా భాగ్యం మంత్రాలు చదివి గంటలు గంటలు స్త్రోత్రలు చదివితేనే భక్తి కాదు.. పాత కాలంలో ఆడవాళ్లకు చదువురాదు, స్ట్రోత్రాలు రావు అయినా ఇల్లు శుభ్రంగా ఉంచుకునే రెండు పూటలా దీపారాధన చేసుకుంటూ అన్ని పండగలు తెలిసిన విధంగానే చేసుకుని సంతోషంగా ఉండేవాళ్ళు..

ఇలా చేస్తేనే నేను ప్రసన్నం. అవుతాను అని దేవుడు ఎవరితో చెప్పలేదు ఎలా చేసిన భక్తితో చేస్తే స్వీకరిస్తాను అన్నారు అంతే అదే గుర్తు పెట్టుకోండి. ఏ దీపం పెడితే పుణ్యం వస్తుంది ఎన్ని ఒత్తులు వేస్తే పుణ్యం వస్తుంది ఈ సోది అంతా వినకండి కొత్త వస్తువులు అమ్ముకోవడానికి మార్కెటింగ్ కోసం ఎన్నో కల్పించి చెప్తారు, ఏవేవో అమ్ముతున్నారు ఇవన్నీ విని ఏది నమ్మాలి తెలియని స్థితిలో ఉన్నారు. ఒకప్పుడు ఇలాంటి tv షోలు యూట్యూబ్ లు ఆడవాళ్లకు తెలియదు కనుక ప్రశాంతంగా పూజ చేసుకునే వారు ఇప్పుడు వెర్రి వాళ్ళు అయిపోతున్నారు. నువ్వు బంగారు దీపంలో పెట్టిన అందులో కూడా ఒత్తి నూనె కానీ నైయి కాని పోయాలి అలాగే వెలిగిపోదు, అలాగే పెట్టె సమయంలో మీ మనసు మీరు పెట్టె టైం మీకు ఫలితాన్ని ఇస్తుంది.

ఉదాహరణకు సూర్యోదయానికి 40 ని ముందు దీపం వెలిగించి విష్ణు సహాస్రనామం క్రమంగా చేస్తూ ఉంటే ఒక నెల రోజుల్లో మీ జీవితం లో ఊహించని మంచి పరిణామాలు జరుగుతుంది అంటే ఉద్యోగం వ్యాపారం వివాహం సమస్యలు అన్ని తొలగి పోతుంది అయితే రోజు అదే సమయంలో పాటించాలి అప్పుడే ఫలితం ఉంటుంది, అలాగే లలితా సహాస్ర నామం కూడా సమయం నియమంగా  పాటిస్తూ చేస్తే మీకు అద్భుతమైన ఫలితం దక్కుతుంది గొప్ప పరిస్కారం అవుతుంది, నమ్మకం ఉండాలి, గుడ్డిగా అన్నీ నమ్మకూడదు మూఢ నమ్మకం ఉండకూడదు. సమయం పాటించి చేసేది నిత్య  అనుష్ఠానం అంతే కాని పెట్టే దీపం ఖరీదు ని బట్టి పుణ్యం రాదు.

*పెద్ద వారి కాలంలో దీపం కోసం దీపంగూడు (దీపం గుడి)అని ఉంచే వారు అందులో ఒత్తి మార్చే వారు కానీ రోజూ మట్టి దీపం కుందులు మార్చే ఆనవాయితి ఇది వరకు లేదు...అవన్నీ బుర్రలోకి ఎక్కితే ఎదో సామేత చెప్పినట్టు ఉన్నది కాస్త పోతుంది..*

కృష్ణ__విగ్రహము ఇస్తున్న సందేశం

దేవతా విగ్రహాలు పరిశీలించినట్లయితే అందులో సహజయోగాతత్వము అర్ధమౌతుంది. కృష్ణుని విగ్రహం పరిశీలిస్తే 

౧. కృష్ణుడు నిల్చున్నతీరు గమనిస్తే, ఒక కాలు భూమిమీద, మరొక కాలు భూమిమీద ఆనీ అననట్లు ఉంటుంది. దీని ద్వారా ఇస్తున్న సందేశమేమిటంటే - అన్నింటా ఉంటూ అంటీముట్టనట్లు ఉండమని. తామరాకుపై నీటిబిందువులాగా దేనికీ అంటకుండా సమతుల్యతాభావంతో జీవించమన్నదే కృష్ణబోధ. 

౨. కృష్ణుని చేతిలో మురళి వెదురుతో చేయబడింది. లోపలంతా ఖాళీ (శూన్యం). ఇది స్వచ్ఛతను సూచిస్తుంది. అంతరంగములోపల అహం లేకుండా భావాతీతస్థితిలో ఉండమని సూచిస్తుంది. అలానే మురళిలోని ఏడురంద్రాలు మనలోని ఏడు చక్రాలకు సూచన. కృష్ణుడు అందరిలో ఉన్న ఆత్మస్వరూపుడు. ఏ అహంలేని స్వచ్ఛమైన అంతరంగం మురళి (వేణువు). ఆ వేణువులో తిరిగాడే గాలి ప్రాణవాయువు.
కృష్ణుడు ఎక్కువగా మురళివాయిస్తూ, నాట్యం చేస్తూ, ఆటలాడుతూ జీవితాన్ని అలవోకగా ఆహ్లాదంగా గడుపుతున్నట్లు కన్పించడంలో మానవులు కూడా ఎప్పుడూ పరమానందంలోనే ఉండాలన్న సూచన ఉంది. కృష్ణుడు అంటేనే అపరిమితమైన ఆనందం. అత్యున్నత ఆనందం. ప్రాణాయామం..👇
..👆 ..ప్రాణాయామం అనే సాధనద్వారా మూలాధారం నుంచి సహస్రారం వరకు శ్వాస (వాయువు) క్రిందకు పైకీ సాగిస్తే తదేకదృష్టి కల్గి మనస్సు ప్రాణంలో, ప్రాణం ఆత్మలో, ఆత్మ పరమాత్మలో లయమైనటువంటి సమాధిస్థితి కల్గుతుంది. ఈ స్థితే సహజయోగ పరమానందకరస్థితి. ఈ స్థితిలో మానవులుండాలన్నదే కృష్ణసందేశం. 

౩. కృష్ణుడి వర్ణం నీలం. అంతులేకుండా అంతటా వ్యాపించిన ఆకాశం ప్రకృతిలో భాగం. శూన్యమైన ఆకాశం నీలివర్ణం. కృష్ణుడుని నీలంరంగులో చూపించడానికి కారణం నిరంతరం ప్రకృతిలోనే ఉన్నాడని, అనంతమై ఉన్నాడని  అర్ధం. ఎప్పుడూ ప్రకృతిలోనే ఉండాలన్న విషయాన్ని నీలంరంగు సూచిస్తుంది. ప్రకృతిలో ఉండడంవలన భూతదయ, సంయమనం, మానసిక ప్రశాంతత పెరుగుతుంది.

౪. దేవాదిదేవుడు, చతుర్దశ భువన భాండాగారుడు, చరాచర సృష్టికి అధిపతి అయినను నెమలిఫించంనే ధరించడంలో సందేశమేమిటంటే ఏ స్థితియందున్న ఏదీ మోయకూడదని, ఆడంబ అహంకారములు లేకుండా నిర్మలంగా నిరాడంబరంగా జీవించాలని.

౫. గోవు జ్ఞానానికి గుర్తు. గోవు చెంతనే ఉండడం ద్వారా జ్ఞానం చెంతనే మానవులు ఉండాలని, జ్ఞానం ద్వారానే తరిస్తారన్న సందేశముంది.
సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః / 
పార్ధో వత్స స్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహాత్ // 
యుద్ధభూమిలో ఉపనిషత్తులనే గోవులనుండి, అర్జునుడనే దూడను నిమిత్తంగా చేసుకొని గీత అనే అమృతాన్ని పితికి అందర్నీ ముక్తులను చేసే కృష్ణభగవానుడికి నమస్కరించడం తప్ప ఏమివ్వగలం? అది చాలు అంటాడు బీష్మపితామహుడు -

ఏకోపి కృష్ణస్య కృత ప్రణమో
దశాశ్వమేదావభ్రుదే: నతుల్యః
దశాశ్వమేధీ పునరితి జన్మ 
కృష్ణప్రణామీ న పునర్భవాయ

శ్రీకృష్ణునికి చేసిన ఒక నమస్కారం పది అశ్వమేధాలకు సమానం. పదిసార్లు అశ్వమేధం చేసినవారికైన పునర్జన్మ ఉన్నది. కానీ, కృష్ణునికి ప్రణామం చేసినవానికి మరల జన్మ ఉండదని బీష్ముడు చెప్తాడు.

శత్రుచ్చేదైకమన్త్రం సకలముపనిషద్వాక్యసమ్పూజ్యమన్త్రం  
సంసారోచ్చేదమన్త్రం సముచితతమసః సంఘనిర్యాణమన్త్రమ్ 
సర్వైశ్వర్యైకమన్త్రం వ్యసనభుజగసన్దష్టసన్త్రాణమన్త్రం 
జిహ్వే శ్రీకృష్ణమన్త్రం జప జప సతతం జన్మసాఫల్యమన్త్రం (ముకుందమాలా)
సర్వ శత్రువులను నశింపజేయునది, ఉపనిషద్వాక్యములచే పూజింపబడునది, సంసారమునుండి విడిపించునది, అజ్ఞానాంధకారమును తొలగించునది, సమస్త ఐశ్వర్యములను చేకూర్చునది, ప్రాపంచిక దుఃఖమనెడి విషసర్పకాటుకు గురియైనవారిని రక్షించునది, ఈ జగత్తులో జన్మసాఫల్యమును చేకూర్చునది కృష్ణ మంత్రమే. కాబట్టి 
"ఓ జిహ్వా! దయచేసి శ్రీకృష్ణ మంత్రమునే సతతం జపించుము".

శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*

శ్రీమాత్రేనమః  
*622వ నామ మంత్రము* 27.7.2020

*ఓం ఐం హ్రీం శ్రీం క్లీంకర్యై నమః*🙏🙏🙏సృష్టిప్రక్రియకు దోహదకారణమైన *క్లీం* బీజాక్షర కారకురాలై విలసిల్లు జగన్మాతకు నమస్కారము🌹🌹🌹శ్రీలలితా సహస్ర నామావళి యందలి *క్లీంకారీ* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం ఐం హ్రీం శ్రీం క్లీంకర్యై నమః* అని ఉచ్చరించుచూ ఆ శ్రీమాత పాదపద్మముల నారాధించు భక్తజనులకు ఆ తల్లి సుఖసంతోషములను సంప్రాప్తింపజేసి కైవల్యపదమును జూపించి కలియుగ పాప పంకిలమంటకుండా రక్షించును🌻🌻🌻 *క్లీం* అను బీజాక్షరమునకు,  కారణభూతురాలు ఆ జగన్మాత అని ఈ నామ మంత్రమునకు భావము🌺🌺🌺జగన్మాత సర్వమంత్రాత్మిక; అటువంటి సర్వమంత్రములలోను  *క్లీం* అను 
బీజాక్షరము కూడా గలదు. ఈ బీజాక్షరమును కామకళా బీజమంటారు. కామకళా బీజమంటే సృష్టిప్రక్రియకు దోహదపడే బీజాక్షరము గాన జగన్మాత సృష్టిప్రక్రియకు దోహదపడే కామకళాస్వరూపిణి🌹🌹🌹 *క్లీం* అను బీజాక్షరంలో *క* కార, *ల* కార, *ఈం* కారములుంటాయి. ఈ మూడు బీజాక్షరములు వరుసగా సరస్వతి, లక్ష్మీ, శక్తిస్వరూపిణి అయిన పార్వతీ తత్త్వాలను సూచిస్తాయి...దీని అర్థం ఏమంటే సర్వకళా సమన్వయ రూపమునకు  సమన్వయం ఈ *క్లీం* అను బీజాక్షరం. *క్లీం* అను ఈ బీజాక్షరం *శ్రీం*,  *హ్రీం* ల వంటి బీజాక్షరములతో సమానంగా ఎంచబడుతూ పంచప్రణవాలైన *ఐం క్లీం సౌః శ్రీం హ్రీం* లలో ఒక బీజాక్షరమయినది. ఈ క్లీం అనే బీజాక్షరం మన్మథ బీజమనియు చెబుతారు🌸🌸🌸సమిష్టి సృష్టిగా తాను అవుదామని పరమేశ్వరుడు  కామేశ్వరుడుగా మారే ప్రక్రియకు ప్రేరణకారి అయిన ఈ *క్లీం* అనే అమ్మవారి బీజాక్షరం. కృష్ణమంత్రానికి కూడా బీజాక్షరం *క్లీం* అనేదే కావడం విశేషం🌺🌺🌺 *క్లీం* కారణి అయిన శ్రీమాతకు నమస్కరించు నపుడు  *ఓం ఐం హ్రీం శ్రీం క్లీంకర్యై నమః* అని అనవలెను🌹🌹🌹🌹🌹ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* అనుగ్రహముతో, వారి విరచితమైన *శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది🙏🙏🕉🕉🕉నేడు సోమ వారము🌻🌻🌻ఇందు వారము అని కూడా అంటాము🔱🔱🔱నీలకంఠుని ఆరాధించు పవిత్రమైన దినము🙏🙏🙏 *ఓం నమశ్శివాయ* అనే ఈ ప పంచాక్షరిని పదిసార్లు మననం చేసుకుందాము.🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 🌺🌻🌹🌻🌸  🙏🙏
🌹🌹🌹🌹🌹మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*

శ్రీమాత్రేనమః  
*45వ నామ మంత్రము* 27.7.2020

*ఓం ఐం హ్రీం శ్రీం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయై నమః* పద్మములను సైతము తిరస్కరించునటువంటి పాదద్వయ ప్రభాజాలములు (కాంతులు) కలిగిన శ్రీమాతకు నమస్కారము శ్రీలలితా సహస్ర నామావళి యందలి *పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా* అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును *ఓం ఐం హ్రీం శ్రీం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను ఆరాధించు భక్తులకు ఆ తల్లి కరుణించి సకలాభీష్టములను నెరవేర్చును, శాశ్వతమైన బ్రహ్మజ్ఞానమును సంప్రాప్తింపజేయును🌻🌻🌻 *భగవంతుని పాదపద్మములు* అనడం సాధారణం. అంటే పాదాలను పద్మములతో పోల్చిచెప్పడము అని అర్థం. కాని అమ్మవారి పదద్వయమును పోల్చుటకు సరోజములు (తామరపువ్వులు - పద్మములు) సైతము చాలవు. ఎందుకంటే అమ్మవారి పాదముల కాంతులు పద్మముల కాంతుల వలెకాదట. అంతకన్నా దివ్యకాంతితోను, మృదువుగాను, కోమలంగాను అమ్మవారి పాదములు విరాజిల్లుతున్నాయని వశిన్యాదులు  వివరించారు. కారణ మేమిటంటే పద్మములకాంతి మూడునాళ్ళముచ్చటయే రెండుమూడు రోజులలో నీటిలో ఉన్ననూ వాటికాంతులు వెలవెలపోతాయి. అమ్మవారి పాదద్వయము నిరంతరం దివ్యకాంతులు వెదజల్లుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే నీటిలో ఉన్నంతవరకే వాటికాంతులు ఒక్కరోజైనా. ఇంకనూ కలువలకు చంద్రకాంతి, కమలములకు సూర్యుకాంతి ఉంటేనే కళకళలాడుతూ ఉంటాయి. అమ్మవారి పాదములు ఎల్లవేళలా ప్రభాసించుతూ ఉంటాయి🌺🌺🌺 *బ్రహ్మవిష్ణుమహేశాన వేద పూజితాంఘ్రద్వయే* అని వశిష్ట మహర్షి అంటారు అనగా బ్రహ్మవిష్ణుమహేశ్వరుల చేతను, చతుర్వేదముల చేతను పూజింపబడే అమ్మవారి పాదములు సరోజములతో (పద్మములు) ఎలా పోల్చగలము?🌻🌻🌻అమ్మవారి కుడిపాదము  శుక్లవర్ణము, ఎడమ పాదము రక్తవర్ణము గలవి. ఈ రెండునూ అజ్ఞానము, అవిద్యా రూప సంసార బంధమును తొలగించునని భావము. బ్రహ్మ తేజస్సుచే పరమేశ్వరి పాదద్వయ మేర్పడినది🌺🌺🌺 అందుకనే జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం ఐం హ్రీం శ్రీం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయై నమః* అని అంటాము, ఆరాధిస్తాము🌹🌹🌹🌹🌹ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* అనుగ్రహముతో, వారి విరచితమైన *శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది నేడు సోమ వారము🌻🌻🌻ఇందు వారము అని కూడా అంటాము నీలకంఠుని ఆరాధించు పవిత్రమైన దినము  *ఓం నమశ్శివాయ* అనే ఈ ప పంచాక్షరిని పదిసార్లు మననం చేసుకుందాము. మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు 
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి  7702090319  

*శ్రీమదాంధ్ర మహాభాగవతం - గజేంద్రమోక్షం*

*పోతనామాత్యుల పద్యము*

*8-87-సీస పద్యము*

కలుగఁడే నాపాలికలిమి సందేహింపఁ;
గలిమిలేములు లేకఁ గలుగువాఁడు?
నా కడ్డపడ రాఁడె నలి నసాధువులచేఁ;
బడిన సాధుల కడ్డపడెడువాఁడు?
చూడఁడే నా పాటుఁ జూపులఁ జూడకఁ;
జూచువారలఁ గృపఁ జూచువాఁడు?
లీలతో నా మొఱాలింపఁడే మొఱఁగుల;
మొఱ లెఱుంగుచుఁ దన్ను మొఱగువాఁడు?

*8-87.1-తేటగీతము*

అఖిల రూపముల్ దనరూప మైనవాఁడు
ఆదిమధ్యాంతములు లేక యడరువాఁడు
భక్తజనముల దీనుల పాలివాఁడు
వినఁడె? చూడఁడె? తలఁపడె? వేగ రాఁడె?

*తాత్పర్యము*

నా విషయంలో ఆ భగవంతుడు గురించి అనుమానించాల్సిన పని లేదు. అతడు ఐశ్వర్యం పేదరికం లాంటివి చూడకుండా అందరికి అండగా ఉంటాడు. కాబట్టి నాకు అండగా ఉంటాడు. దుర్జనుల చేతిలో చిక్కుకున్న సజ్జనులకు సాయపడతాడు. అందువల్ల నాకు సాయం చేస్తాడు. బయటి చూపుల వదిలిపెట్టి తననే చూసేవారిని దయతో చూస్తాడు. కనుక నా కష్టాన్ని చూస్తాడు. దీనుల మొరలు విని తన్ను తానే మరచి పోతాడు కదా. నా మొర తప్పక వింటాడు. అన్ని రూపాలు ఆయన రూపాలే. మొదలు నడుమ తుద అన్నవి ఆయనకు లేవు. భక్తులకు దిక్కులేని వారికి ఆయనే ఆధారం. మరి అటువంటి ప్రభువు ఇంకా నా మొర వినడేం? నా బాధ చూడడేం? నన్ను దయ చూడడేం? తొందరగా రాడేం?

*8-90-శా.శార్దూల విక్రీడితము*

లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్;
రావే! యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!

*తాత్పర్యము*

దేవా! నాలో శక్తి కొంచం కూడ లేదు. ధైర్యం సడలి పోయింది. ప్రాణాలు కూడ కదలిపోతున్నాయి. మూర్చ వచ్చేస్తూ ఉంది. శరీరం స్రుక్కిపోయింది. బాగా అలసటగా ఉంది. నాకు నీవు తప్ప వేరే ఇతరు లెవ్వరు నాకు తెలియదు. నీవే దిక్కు. ఆర్తితో ఉన్న నన్ను ఆదుకోవయ్య. ఓ స్వామీ! రావయ్యా! కరుణించు, వరాలిచ్చే ప్రభూ! కాపాడు, పుణ్యాత్ముడా!

*8-91 కంద పద్యము*

విను దఁట జీవుల మాటలు
చను దఁట చనరానిచోట్ల శరణార్థుల కో
యను దఁట పిలిచిన సర్వముఁ
గను దఁట సందేహ మయ్యెఁ గరుణావార్ధీ!

*తాత్పర్యము*

ఓ దయాసాగరా! నీవు సర్వ ప్రాణుల పిలుపులు వింటావట. వారిపై దయ చూపడానికి పోరాని చోట్లకు ఐనా పోతావట. శరణన్న వారికి వెంటనే ఓయ్ అని అంటావుట.కాని ఇప్పుడు ఇదంతా సత్యమేనా అని అనుమానంగా ఉంది.

*ఉత్పలమాల*

ఓ! కమలాప్త! యో! వరద! యో!
.....ప్రతిపక్షవిపక్షదూర! కు
య్యో! కవియోగివంద్య!
.....సుగుణోత్తమ! యో! శరణాగతామరా 
నోకహ! యో! మునీశ్వర మనోహర!
......యో! విమలప్రభావ! రా
వే కరుణింపవే తలఁపవే 
......శరణార్థిని నన్నుగావవే.

*తాత్పర్యము*

ఓ కమలాక్షుడా! ఓ వరాలు ఇచ్చే ప్రభూ! శత్రువులపై కూడ వైరం లేనివాడా! పండితులచే నమస్కారాలు అందుకొనే వాడా! ఉత్తమ సుగుణాలు కలవాడా! శరణు కోరు వారికి కల్పవృక్షం వంటివాడా! మునీంద్రులకు ప్రియమైనవాడా! నిర్మలమైన మహిమ కల వాడా! నా మొర విను. వెంటనే రా. కనికరించు. కరుణించి శరణు వేడుతున్న నన్ను కాపాడు.

*8-93 వచనము*

అని పలికి మఱియు నరక్షిత రక్షకుండైన యీశ్వరుం డాపన్నుఁడైన నన్నుఁ గాచుఁ గాక యని నింగి నిక్కి చూచుచు నిట్టూర్పులు నిగడించుచు బయ లాలకించుచు నగ్గజేంద్రుండు మొఱచేయుచున్న సమయంబున.

*తాత్పర్యము*

ఇలా ప్రార్థించి “రక్షణ లేనివారిని రక్షించే ఆ భగవంతుడు నన్ను కాపాడుగాక!” అని గజరాజు మొరపెట్టుకొన్నాడు. ఆకాశం వైపు నిక్కి నిట్టూర్చాడు. ఆకాశానికి చెవులు అప్పజెప్పి ఆక్రోశించాడు. ఆ సమయంలో.

*8-94 ఆటవెలది*

విశ్వమయత లేమి వినియు నూరక యుండి
రంబుజాసనాదు లడ్డపడక
విశ్వమయుఁడు విభుఁడు విష్ణుండు జిష్ణుండు
భక్తియుతున కడ్డపడఁ దలంచె.

*తాత్పర్యము*

ఆ సమయంలో బ్రహ్మదేవుడు మొదలగు వారికి విశ్వమంతా నిండి ఉండే గుణం లేకపోవుటచేత గజరాజు మొర వినబడినా వారు అడ్డుపడకుండ ఊరికే ఉండిపోయారు. విశ్వమంతా వ్యాపించే వాడు, ప్రభువు, విజయశీలి ఐన విష్ణువు భక్తుడైన గజరాజును రక్షించాలని నిశ్చయించుకొన్నాడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఇక్కడ భాగవత రచన చేస్తున్న పోతన గారికొక విచిత్రమైన సమస్య ఏర్పడింది. ఆయన వైకుంఠవాసియైన శ్రీమహావిష్ణువు ఉన్న వైకుంఠాన్ని వర్ణంచే పద్యం ప్రారంభించారు. 

*అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దాపల*  అంటూ మత్తేభవిక్రీడిత పద్యం వ్రాయడం ప్రారంభించారు.
అదే వైకుంఠాన్ని వర్ణించాలి . తానేమో చూడలేదు . తనకంటే ముందు ఎవరూ వర్ణించిన దాఖలాలు లేవు . ఏం చేయాలి ? భాగవత రచనను ఎలా సాగించాలి? ఈ అలోచనలతో సతమతమౌతూ , కొంత సమయం భాగవత రచనను నిలిపి వేసి , స్నానంచేయడానికా గోదావరికి బయలు దేరాడు పోతనగారు. అంతలో భక్తుడంటే భగవంతునికి అపారమైన ప్రేమ కదా! పోతన స్నానానికి బయలుదేరగానే పోతన వేషంలో  భగవంతుడు వచ్చి , గజేంద్రుడు “పాహి , పాహి ” అని ఆర్తితో పిలిచిన సమయంలో తనెక్కడున్నాడో , తానేమి చేస్తున్నాడో వర్ణించే మధురమైన పై పద్యాన్ని పూర్తిచేసి వెళ్ళిపోయాడు.

 8-95 మత్తేభ విక్రీడితము

అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహిపాహి యనఁ గుయ్యాలించి సంరంభియై.

(ఈ పద్యం సాక్షాత్తు భగవంతునిచే పూర్తి చేయబడినది అని అంటారు)

*తాత్పర్యము*

ఆపదలలో చిక్కుకున్న వారిని కాపాడే ఆ భగవంతుడు ఆ సమయంలో వైకుంఠంలో ఉన్నాడు. అక్కడ అంతఃపురంలో ఒక పక్కన ఉండే మేడకు సమీపంలో ఒక అమృత సరస్సుంది. దానికి దగ్గరలో చంద్రకాంతశిలల అరుగుమీద కలువపూల పాన్పుపై లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు. అప్పుడు భయంతో స్వాధీనం తప్పిన గజేంద్రుడు కాపాడమని పెట్టే మొర విన్నాడు. గజరాజుని కాపాడడానికి వేగిరపడ్డాడు.

*8-96 మత్తేభ విక్రీడితము*

సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
పరివారంబునుఁ జీరఁ" డభ్రగపతిం బన్నింపఁ" డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోత్థితశ్రీకుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.

*తాత్పర్యము*

గజేంద్రుడి ప్రాణాలు కాపాడాలనే వేగిరపాటుతో విష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖచక్రాలను చేతులలో ధరించలేదు. సేవకులను ఎవరిని పిలవలేదు. వాహనం ఐన గరుత్మంతుని పిలవలేదు. చెవికుండలాల వరకు జారిన జుట్టుముడి కూడ చక్కదిద్దుకోలేదు. ఆఖరికి ప్రణయ కలహంలో పట్టిన లక్ష్మీదేవి పైటకొంగు కూడ వదలి పెట్టలేదు.

*8-97-వ.వచనము*

ఇట్లు భక్తజనపాలన పరాయణుండును; నిఖిల జంతు హృదయారవింద సదన సంస్థితుండును నగు నారాయణుండు కరికులేంద్ర విజ్ఞాపిత నానావిధ దీనాలాపంబు లాకర్ణించి; లక్ష్మీకాంతా వినోదంబులం దగులు చాలించి; సంభ్రమించి దిశలు నిరీక్షించి; గజేంద్రరక్షాపరత్వంబు నంగీకరించి; నిజపరికరంబు మరల నవధరించి గగనంబున కుద్గమించి వేంచేయు నప్పుడు.

*తాత్పర్యము*

హరి భక్తులను ప్రోచుట యందు అనురక్తి గలవాడు. సర్వ ప్రాణుల హృదయాలనే పద్మాలలో నివసించేవాడు. ఆయన గజేంద్రుని మొరలన్నీ విన్నాడు. లక్ష్మీదేవితో సరస సల్లాపాలు చాలించాడు. ఆత్రుత చెంది అటునిటు చూసి గజేంద్రుని కాపాడుట అనే బరువైన బాధ్యత తీసుకొని అటుపిమ్మట ఆయుధాలను అవధరించి ఆకాశమార్గాన బయలుదేరాడు. ఆ సమయంలో.

*8-98 .మత్తేభ విక్రీడితము*

తనవెంటన్ సిరి; లచ్చివెంట నవరోధవ్రాతమున్; దాని వె
న్కనుఁ బక్షీంద్రుఁడు; వాని పొంతను ధనుఃకౌమోదకీ శంఖ చ
క్రనికాయంబును; నారదుండు; ధ్వజినీకాంతుండు రా వచ్చి రొ
య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్.

*తాత్పర్యము*

అలా విష్ణుమూర్తి గజేంద్రుని రక్షించటం కోసం లక్ష్మీదేవి కొంగు వదలను కూడ వదలకుండా తటాలున బయలుదేరటంతో – విష్ణువు వెనుక లక్ష్మీ దేవి, ఆమె వెనకాతల అంతఃపుర స్త్రీలు, వారి వెనుక గరుడుడు, ఆయన పక్కనే విల్లూ గదా శంఖచక్రాలు నారదుడు విష్వక్సేనుడు వస్తున్నారు. వారి వెనువెంట వరసగా వైకుంఠపురంలో ఉన్న వాళ్ళందరు కూడా వస్తున్నారు.
ఇది పోతనగారు ప్రసాదించిన పరమాద్భుత పద్యాలలో ఒకటి. పండిత పామరుల నోళ్ళలో తరచుగా నానుతుండే పద్యం. నడకలో భావంలో ఉత్తమ స్థాయి అందుకున్నది. చదువుతుంటేనే వేగంగా పయనమౌతున్న విష్ణుమూర్తి వెనుక అంత వేగంగాను వెళ్తున్న లక్ష్మీదేవి సూదిమొనగా గల బాణంములుకులాగ అనుసరిస్తున్న పరివారం మనోనేత్రానికి దర్శనమిస్తుంది. *{విష్ణుమూర్తి - (అ) ఆయుధములు 1) ధనుస్సు శారఙ్గము, 2) గద కౌమోదకి 3) శంఖము పాంచజన్యము, 4) చక్రము సుదర్శనము, 5) కత్తి నందకము (ఆ) రథము శతానందము (ఇ) సేనానాయకుడు విష్వక్సేనుడు (ఈ) వాహనం గరుత్మంతుడు}

*8-99-వ.వచనము*

తదనంతరంబ, ముఖారవింద మకరందబిందు సందోహ పరిష్యందమానానం దేందిందిర యగు న య్యిందిరాదేవి గోవింద కరారవింద సమాకృష్యమాణ సంవ్యానచేలాంచల యై పోవుచు.

*తాత్పర్యము*

అప్పుడు పద్మం వంటి లక్ష్మీదేవి ముఖంలో చిందుతున్న మకరందం బిందువులు వంటి తియ్యటి చెమట బొట్లకు తుమ్మెదలు ఆనందంతో ముసిరాయి. విష్ణుమూర్తి తన పైట కొంగు పట్టుకొని లాక్కుపోతుంటే వైకుంఠుని వెన్నంటి పోతూ ఇలా అనుకుంది.

*8-100 మత్తేభ విక్రీడితము*

తన వేంచేయు పదంబుఁ బేర్కొనఁ; డనాథస్త్రీ జనాలాపముల్
వినెనో? మ్రుచ్చులు మ్రుచ్చలించిరొ ఖలుల్ వేదప్రపంచంబులన్?
దనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో? భక్తులం
గని చక్రాయుధుఁ డేఁడి చూపుఁ డని ధిక్కారించిరో? దుర్జనుల్.

*తాత్పర్యము*

“ఎందుచేతనో విభుడు తాను వెళ్ళే చోటు చెప్పటం లేదు. దిక్కులేని స్త్రీల దీనాలాపాలు విన్నాడో ఏమో? దుర్మార్గులు ఐన దొంగలు ఎవరైనా వేదాలను దొంగిలించారేమో? దేవతల రాజధాని అమరావతిపై రాక్షసులు దాడి చేసారేమో? విష్ణువు ఎక్కడ ఉన్నాడో చెప్పండి అంటు దుర్మార్గులు భక్తులను బెదిరిస్తున్నారో ఏమో?” అని అనేక విధాలుగా లక్ష్మి సందేహపడసాగింది.

*8-102 శార్దూల విక్రీడితము*

తాటంకాచలనంబుతో; భుజనటద్ధమ్మిల్లబంధంబుతో;
శాటీముక్త కుచంబుతో; నదృఢచంచత్కాంచితో; శీర్ణలా
లాటాలేపముతో; మనోహరకరాలగ్నోత్తరీయంబుతోఁ;
గోటీందుప్రభతో; నురోజభర సంకోచద్విలగ్నంబుతోన్.

*తాత్పర్యము*

గజేంద్రుని కాపాడాలని పరుగు పరుగున వెళ్తున్న భర్త వెంట కోటి చంద్రుల కాంతి నిండిన ముఖంతో లక్ష్మీదేవి వెళుతోంది. అప్పుడు ఆమె చెవి లోలకులు కదుల్తున్నాయి. భుజాల మీద వీడిన కొప్పుముడి చిందు లేస్తోంది. స్తనాలపై పైటకొంగు తొలగిపోయింది. ఒడ్డాణం వదులై పోయింది. నుదిటి మీద రాసుకొన్న లేపనం చెదిరిపోయింది. మోము కోటి చంద్రుల కాంతితో నిండిపోయింది. స్తనాల భారంతో నడుం చిక్కిపోయింది. ఆమె పైట కొంగు ప్రియభర్త చేతిలో చిక్కుకొనే ఉంది.

*8-103 కంద పద్యము*

అడిగెద నని కడువడిఁ జను
నడిగినఁ దను మగుడ నుడుగఁ డని నడ యుడుగున్
వెడవెడ సిడిముడి తడఁబడ
నడు గిడు; నడుగిడదు జడిమ నడు గిడునెడలన్.

*తాత్పర్యము*

అప్పుడు లక్ష్మీదేవి భర్తను అడుగుదా మని వేగంగా అడుగులు వేసేది. అడిగితే మారు పలుకడేమో అని అడుగుల వేగం తగ్గించేది. చీకాకుతో తొట్రుపాటుతో అడుగులు వేసేది. మళ్ళీ ఆగేది. అడుగులు కదిలించలేక తడబాటుతో నడిచేది.
కరిని కాపాడలని కంగారుగా వెళ్తూ విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొంగు వదల లేదు. దానితో భర్త వెనుకనే వెళ్తున్న లక్ష్మీదేవి –

ఈ పద్యంచూస్తున్నామా వింటున్నామా చదువుతున్నామా అనిపిస్తుంది. సందర్భానికి తగిన పలుకుల నడకలు. భావాన్ని స్ఫురింపజేసే పద ధ్వని. ఇంకా ఆపైన సందర్భశుద్ధికేమో బహు అరుదైన సర్వలఘు కంద పద్యం ప్రయోగం. ఆహా ఏమి పద్యం.

*8-104 సీస పద్యము*

నిటలాలకము లంట నివుర జుంజుమ్మని;
ముఖసరోజము నిండ ముసురుఁ దేంట్లు;
నళులఁ జోపఁగఁ జిల్క లల్ల నల్లన చేరి;
యోష్ఠబింబద్యుతు లొడియ నుఱుకు;
శుకములఁ దోలఁ జక్షుర్మీనములకు మం;
దాకినీ పాఠీనలోక మెసఁగు;
మీన పంక్తుల దాఁట మెయిదీఁగతో రాయ;
శంపాలతలు మింట సరణిఁ గట్టు;

*8-104.1 ఆటవెలది*

శంపలను జయింపఁ జక్రవాకంబులుఁ
గుచయుగంబుఁ దాఁకి క్రొవ్వుజూపు;
మెలఁత మొగిలు పిఱిఁది మెఱుఁగుఁదీవయుఁ బోలె
జలదవర్ణు వెనుకఁ జనెడునపుడు.

*తాత్పర్యము*

మేఘం వెంట మెరుపు తీగ వలె లక్ష్మీదేవి విష్ణుమూర్తి వెంట వెళ్ళసాగింది. ఆ సమయంలో ఆమె నుదుటి మీది ముంగురులను చక్కదిద్దుకోబోతే, పద్మంలాంటి ఆమె మోము నిండా తుమ్మెదలు ముసురుకున్నాయి. వాటిని తోలుతుంటే, ఆమె పెదవులను చూసి దొండపం డనుకొని చిలుకలు వచ్చి చేరాయి. చిలకలని తోలుతుంటే, చేపల లాంటి ఆమె కన్నులను చూసి ఆకాశగంగ లోని పెనుచేపలు ఎగసి పడ్డాయి. చేపలను తప్పించుకోగానే ఆమె శరీరపు మెరుపు చూసి ఆ దేహలతని ఒరుసుకోడానికి మెరుపు తీగలు బారులు తీరాయి. మెరుపు తీగలను దాటగానే, చక్రవాకపక్షుల జంటలు మిడిసి పాటుతో గుండ్రటి ఆమె స్తనద్వయాన్ని తాకాయి.

*8-105 మత్తేభ విక్రీడితము*

వినువీథిన్ జనుదేరఁ గాంచి రమరుల్ విష్ణున్ సురారాతి జీ
వనసంపత్తి నిరాకరిష్ణుఁ గరుణావర్ధిష్ణుఁ యోగీంద్ర హృ
ద్వనవర్తిష్ణు సహిష్ణు భక్తజనబృందప్రాభవాలంకరి
ష్ణు నవోఢోల్ల సదిందిరా పరిచరిష్ణున్ జిష్ణు రోచిష్ణునిన్.

*తాత్పర్యము*

విష్ణుమూర్తి రాక్షసుల బతుకు తెరువులను నశింప జేసే వాడు, దయా రసంతో మించేవాడు, మహాయోగుల హృదయా లనే వనాలలో విహరించేవాడు, గొప్ప ఓర్పుగల వాడు, భక్తుల గొప్పదనాన్ని పెంపొందించేవాడు, నవయౌవనంతో వెలుగొందే లక్ష్మీదేవితో కలిసి విహరించే వాడు. జయశీలుడు, మహా కాంతిమంతుడు. అట్టి భగవంతుడిని ఆకాశమార్గంలో వస్తుండగా దేవతలు చూసారు.

*8-107 మత్తేభ విక్రీడితము*

చనుదెంచెన్ ఘనుఁ డల్లవాఁడె; హరి పజ్జం గంటిరే లక్ష్మి? శం
ఖ నినాదం బదె; చక్ర మల్లదె; భుజంగధ్వంసియున్ వాఁడె; క్ర
న్నన యేతెంచె నటంచు వేల్పులు నమోనారాయణాయేతి ని
స్వనులై మ్రొక్కిరి మింట హస్తిదురవస్థావక్రికిం జక్రికిన్.

*తాత్పర్యము*

గజేంద్రుని ఆర్తి బాపటానికి ఆరాటంగా ఆకాశంలో వెళ్తున్న శ్రీమహావిష్ణువును చూసి దేవతలు “అదిగదిగో మహనీయుడైన విష్ణుమూర్తి వస్తున్నాడు. అతని వెనుకనే శ్రీమహాలక్ష్మి వస్తున్నది చూడండి. అదిగో పాంచజన్య శంఖధ్వని. సర్పాలను సంహరించేవాడు గరుత్మంతుడు అదిగో చూడండి వెంట వస్తున్నాడు.” అనుకుంటు “నారాయణునికి నమస్కారం” అంటు నమస్కారాలు చేస్తున్నారు.

*8-108 వచనము*

అ య్యవసరంబునఁ గుంజరేంద్రపాలన పారవశ్యంబున దేవతానమస్కారంబు లంగీకరింపక మనస్సమాన సంచారుం డై పోయిపోయి కొంతదూరంబున శింశుమారచక్రంబునుం బోలె గురుమకరకుళీర మీనమిథునంబై; కిన్నరేంద్రుని భాండాగారంబునుంబోలె స్వచ్ఛ మకరకచ్ఛపంబై; భాగ్యవంతుని భాగధేయంబునుంబోలె సరాగ జీవనంబై; వైకుంఠపురంబునుంబోలె శంఖచక్ర కమలాలంకృతంబై; సంసార చక్రంబునుంబోలె ద్వంద్వసంకుల పంక సంకీర్ణంబై యొప్పు నప్పంకజాకరంబుఁ బొడగని.

*తాత్పర్యము*

ఆ సమయంలో గజేంద్రుడిని రక్షంచాలని వెళ్తున్న తొందరలో, విష్ణుమూర్తి దేవతల మొక్కులు అందుకోలేదు. అలా మనోవేగంతో వెళ్ళి, ఏనుగు మొసలి పోరాడుతున్న మడుగుని చూసాడు. ఆ మడుగులో శింశుమార చక్రంలో లాగ గొప్ప మొసళ్ళు, పీతలు, చేపలు జంటలు జంటలుగా ఉన్నాయి. కుబేరుని ధనాగారంలోని కచ్చపం అనే నిధి వంటి శ్రేష్ఠమైన తాబేళ్ళు ఉన్నాయి, ధనవంతుని సుఖజీవనంలోని అనురాగం లాగ ఎఱ్ఱని జీవనం (నీరు) నిండుగా ఉంది, వైకుంఠం వలె శంఖం, చక్రం (చక్రవాక పక్షులు), కమల (లక్ష్మి) లతో అలంకరింపబడి ఉంది. సుఖ దుఃఖాలనే ద్వంద్వాలతో నిండిన సంసారం వలె జలచరాల జంటలతో కలచబడిన బురద కలిగుంది.

*8-109 మత్తేభ విక్రీడితము*

కరుణాసింధుఁడు శౌరి వారిచరమున్ ఖండింపఁగాఁ బంపె స
త్త్వరితాకంపిత భూమిచక్రము మహోద్యద్విస్ఫులింగచ్ఛటా
పరిభూతాంబర శుక్రమున్ బహువిధబ్రహ్మాండభాండచ్ఛటాం
తరనిర్వక్రముఁ బాలితాఖిల సుధాంధశ్చక్రముం జక్రమున్.

*తాత్పర్యము*

దయాసాగరుడైన నారాయణుడు మొసలిని చంప మని తన చక్రాన్ని పంపాడు. ఆ చక్రం భూమండలాన్ని కంపింప జేసే వేగం కలది. గొప్ప అగ్నికణాల జల్లుతో ఆకాశ మండలాన్ని కప్పివేసేది. అనేక విధమైన బ్రహ్మాండభాండాల సమూహాలలోను ఎదురు లేనిది. దేవతలను అందరిని కాపాడేది.

*8-111 శార్దూల విక్రీడితము*

అంభోజాకరమధ్య నూతన నలిన్యాలింగన క్రీడ నా
రంభుం డైన వెలుంగుఱేని చెలువారన్ వచ్చి నీటన్ గుభుల్
గుంభద్ధ్వానముతోఁ గొలంకును కలంకం బొందఁగా జొచ్చి దు
ష్టాంభోవర్తి వసించు చక్కటికి డాయంబోయి హృద్వేగమై.

*తాత్పర్యము*

ఇలా పంపగానే, చక్రాయుధం సరోవరంలోని లేలేత పద్మాలని కౌగలించుకోడానికి వెళ్తున్న సూర్యబింబంలా వెళ్ళింది. గుభిల్లు గుభిల్లనే పెద్ద చప్పుడుతో మడుగు కలచిపోయేలా లోపలికి దూకింది. రివ్వున మనో వేగంతో ఆ చెడ్డదైన మొసలి ఉన్న చోటు సమీపించింది.

*8-112 శార్దూల విక్రీడితము*

భీమంబై తలఁ ద్రుంచి ప్రాణములఁ బాపెం జక్ర మా శుక్రియన్
హేమక్ష్మాధర దేహముం జకితవన్యేభేంద్ర సందోహముం
గామక్రోధన గేహమున్ గరటి రక్తస్రావ గాహంబు ని
స్సీమోత్సాహము వీత దాహము జయశ్రీ మోహమున్ గ్రాహమున్.

*తాత్పర్యము*

రివ్వున పోయి, చక్రాయధం మొసలి తలని భయంకరంగా తెగనరికింది. ఆ మకరం మేరు పర్వతమంత పెద్ద దేహం గలది, అడవి ఏనుగులకు సైతం భయం కలిగించేది, కామక్రోధాలతో నిండినది. గజరాజు రక్తధారల రుచిమరిగినది, అంతులేని ఉత్సాహంతో అలసటలేకుండ పోరాడుచున్నది, గెలుపుని నమ్మకంగా కోరుతున్నది. విష్ణుచక్రం వెళ్ళి అలాంటి మొసలి శిరస్సుని ఖండించి ప్రాణాలు తీసింది.

*8-113 వచనము*

ఇట్లు నిమిష స్పర్శనంబున సుదర్శనంబు మకరితలఁ ద్రుంచు నవసరంబున.

*తాత్పర్యము*

ఇలా రెప్పపాటు కాలంలో మొసలి శిరస్సును సుదర్శన చక్రం ఖండించిన ఆ సమయంలో

*8-114 కంద పద్యము*

మకర మొకటి రవిఁ జొచ్చెను;
మకరము మఱియొకటి ధనదు మాటున డాఁగెన్;
మకరాలయమునఁ దిరిగెఁడు
మకరంబులు కూర్మరాజు మఱువున కరిగెన్.

*తాత్పర్యము*

ద్వాదశరాశులలో ఉండే మకరం సూర్యుని చాటున నక్కింది. నవనిధులలో ఉండే మకరం కుబేరుని చాటున దాక్కుంది. సముద్రంలో ఉన్న మకరాలు ఆదికూర్మం చాటుకి చేరాయి.
(మకరం అంటే మొసలి. ఇలా మొసళ్ళు అన్ని బెదిరిపోడానికి కారణం భూలోకంలో ఒక మడుగులో ఉన్న గజేంద్రుని హరించ సిద్ధపడ్డ మకరం ఖండింపబడటం. విష్ణుమూర్తి సుదర్శనచక్రం అంటే ఉన్న విశ్వవ్యాప్త భీతిని స్ఫురింపజేసినట్టి కవి చమత్కారం యిది. (1) ఆకాశంలో ఉన్న మకరం అంటే ఆకాశంలో (1.మేషము, 2.వృషభము, 3.మిథునము, 4.కర్కాటకము, 5.సింహము, 6.కన్య, 7.తుల, 8.వృశ్చికము, 9.ధనుస్సు, 1.0మకరము, 11.కుంభము, 12.మీనము అనబడే) ద్వాదశ రాసులు ఉన్నాయి కదా వాటిలోని మకరం, (2) పాతాళంలో ఉన్న మకరం అంటే కుబేరుని వద్ద (1.మహాపద్మము 2.పద్మము 3.శంఖము 4.మకరము 5.కచ్ఛపము 6.ముకుందము 7.కుందము 8.నీలము 9.వరము అనబడే) నవనిధులు ఉన్నాయి కదా వాటిలోని మకరం. (3) సముద్రంలోని మకరాలు అంటే మొసళ్ళకి అదే కదా నివాసం. ఆ మకరాలన్నీ. ఇంకా సముద్ర మథన సమయంలో ఆది కూర్మం సముద్రంలోనే కదా అవతరించింది.)

8-115 మత్తేభ విక్రీడితము

తమముం బాసిన రోహిణీవిభు క్రియన్ దర్పించి సంసారదుః
ఖము వీడ్కొన్న విరక్తచిత్తుని గతిన్ గ్రాహంబు పట్టూడ్చి పా
దము లల్లార్చి కరేణుకావిభుఁడు సౌందర్యంబుతో నొప్పె సం
భ్రమదాశాకరిణీ కరోజ్ఝిత సుధాంభస్స్నాన విశ్రాంతుఁడై.

*తాత్పర్యము*

కారుచీకటి నుండి వెలువడిన చందమామ లాగ, సంసార బంధాల నుండి విడివడిన సన్యాసి లాగ, గజేంద్రుడు మొసలి పట్టు విడిపించుకొని ఉత్సాహంగా కాళ్ళు కదలించాడు. ఆదరంతో ఆడదిగ్గజాలు లాంటి ఆడ ఏనుగులు తొండాలతో పోసిన అమృత జలంలో స్నానం చేసి అలసట తీర్చుకొన్న వాడై గజేంద్రుడు గర్వించి చక్కదనాలతో చక్కగా ఉన్నాడు.

*8-116 శార్దూల విక్రీడితము*

పూరించెన్ హరి పాంచజన్యముఁ గృపాంభోరాశి సౌజన్యమున్
భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్
సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాది రాజన్యమున్
దూరీభూత విపన్నదైన్యమును నిర్ధూతద్విషత్సైన్యమున్.

*తాత్పర్యము*

విష్ణుమూర్తి విజయసూచకంగా పాంచజన్య శంఖాన్ని ఊదాడు. ఆ శంఖం దయారసానికి సాగరం వంటిది. తన మహా గొప్పధ్వనితో పంచభూతాల మహా చైతన్యాన్ని పటాపంచలు చేసేది. అపారమైన శక్తితో కూడిన తెల్లని కాంతితో ఇంద్రాది ప్రభువులకైన బెరకు పుట్టించేది. దీనుల దుఃఖాన్ని పోగొట్టేది. శత్రువుల సైన్యాలను పారదోలేది.

*8-117 మత్తేభ విక్రీడితము*

మొరసెన్ నిర్జరదుందుభుల్; జలరుహామోదంబులై వాయువుల్
దిరిగెం; బువ్వులవానజల్లుఁ గురిసెన్; దేవాంగనాలాస్యముల్
పరఁగెన్; దిక్కులయందు జీవజయశబ్దధ్వానముల్ నిండె; సా
గర ముప్పొంగెఁ దరంగ చుంబిత నభోగంగాముఖాంభోజమై.

*తాత్పర్యము*

శ్రీహరి పాంచజన్యం ధ్వనించగానే దేవతల దుందుభులు మోగాయి. పద్మాల సువాసనలతో కూడిన గాలులు వీచాయి. పూలవానలు కురిసాయి. దేవతా స్త్రీలు నాట్యాలు చేసారు. సకల ప్రాణుల జయజయధ్వానాలు నల్దిక్కుల వ్యాపించాయి. తన తరంగాలతో సముద్రుడు ఉప్పొంగి ఆకాశగంగ ముఖపద్మాన్ని ముద్దాడి ఆనందించాడు.

*8-118 కంద పద్యము*

నిడుద యగు కేల గజమును
మడువున వెడలంగఁ దిగిచి మదజల రేఖల్
దుడుచుచు మెల్లన పుడుకుచు
నుడిపెన్ విష్ణుండు దుఃఖ ముర్వీనాథా!

*తాత్పర్యము*

మహారాజా! విష్ణుమూర్తి తన పొడవైన చేతితో గజేంద్రుని సరస్సులోంచి బయటకు తీసుకొని వచ్చాడు. అతని మదజల ధారలు తుడిచాడు. మెల్లగా దువ్వుతు దుఃఖాన్ని పోగొట్టేడు.

*8-119 కంద పద్యము*

శ్రీహరి కర సంస్పర్శను
దేహము దాహంబు మాని ధృతిఁ గరిణీసం
దోహంబుఁ దాను గజపతి
మోహన ఘీంకార శబ్దములతో నొప్పెన్.

*తాత్పర్యము*

విష్ణుమూర్తి చేతి స్పర్శ వల్ల గజేంద్రుని శరీరతాపం అంతా పోయింది. గజరాజు సంతోషంగా ఆడఏనుగుల సమూహంతో కలిసి చేస్తున్న ఘీంకర నాదాలతో సొంపుగా ఉన్నాడు.

*8-120 కంద పద్యము*

కరమున మెల్లన నివురుచుఁ
గర మనురాగమున మెఱసి కలయం బడుచుం
గరి హరికతమున బ్రతికినఁ
గరపీడన మాచరించెఁ గరిణుల మరలన్.

*తాత్పర్యము*

శ్రీహరి దయవల్ల బతికినట్టి గజేంద్రుడు, ఇదివరకు లానే తన ఆడ ఏనుగులను తన తొండంతో మెల్లగా తాకాడు. మళ్ళీ మిక్కిలి ప్రేమగా వాటి తొండాలను తన తొండంతో నొక్కాడు.

*8-121 సీస పద్యము*

జననాథ! దేవలశాప విముక్తుఁడై;
పటుతర గ్రాహరూపంబు మాని
ఘనుఁడు హూహూ నామ గంధర్వుఁ డప్పుడు;
తన తొంటి నిర్మల తనువుఁ దాల్చి
హరికి నవ్యయునకు నతిభక్తితో మ్రొక్కి;
తవిలి కీర్తించి గీతములు పాడి
యా దేవు కృప నొంది యందంద మఱియును;
వినత శిరస్కుఁడై వేడ్కతోడ

*ఆటవెలది*

దళిత పాపుఁ డగుచు దనలోకమున కేగె
నపుడు శౌరి కేల నంటి తడవ
హస్తి లోకనాథుఁ డజ్ఞాన రహితుఁడై
విష్ణురూపుఁ డగుచు వెలుఁగుచుండె.

*తాత్పర్యము*

పరీక్షిన్మహారాజా! అప్పుడు దేవల ముని పెట్టిన శాపం నుండి విముక్తి కావడంతో “హూహూ” అనే పేరు గల ఆ గంధర్వుడు ఆ కఠినమైన మొసలి రూపం విడిచిపెట్టేడు. తన పూర్వపు నిర్మల మైన రూపం ధరించాడు. మిక్కిలి భక్తితో విష్ణుమూర్తికి మొక్కి స్తోత్రాలు చేసి ఆ దేవదేవుని అనుగ్రహం పొందాడు. భక్తిగా వంచిన శిరస్శుతో మరల మరల నమస్కరిస్తు సంతోషంగా పుణ్యాత్ముడై గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు విష్ణుమూర్తి గజరాజును చేతితో దువ్వాడు. వెంటనే గజరాజు అఙ్ఞాన మంతా తొలగిపోయింది. అతను విష్ణుదేవుని సారూప్యం పొంది ప్రకాశించాడు.

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

*శూర్పణఖ పునర్జన్మ విశేషాలు :*



➡️ మనపురాణాల్లో ఎన్నో పునర్జన్మ విశేషాలున్నాయి. త్రేతాయుగంలో రాముడే ద్వాపరయుగంలో కృష్ణునిగా అవతరించడం జరిగింది. ఇది చక్రభ్రమణం. అందరూ యుగాలతో పాటు జన్మలెత్తుతూనే ఉంటారు. రాముని కాలంలోని వానరులు, కృష్ణుని కాలంలో గోపగోపికలు, ఈ కలియుగంలో మానవులుగా జన్మించారంటారు. స్వభావాన్ని బట్టి మంచివారు, చెడ్డవారు అనుకోవాలి. అంతే…ఎలాగంటే? శూర్పణఖ కుబ్జగా పుట్టింది. రాముని వరించి, లక్ష్మణునితో, ముక్కు చెవులు కోయించుకుంది. సీతాదేవి అందచందాలు వర్ణించి, రావణునితో సీతాపహరణం చేయించి, రామరావణ యుద్ధానికి కారకురాలయ్యింది. ఆ తరువాత ఆమె ప్రసక్తి రామాయణంలో ఎక్కడా కన్పించదు. కానీ ఆమె, రావణునికి పినతల్లి కూతురు, భర్త చనిపోతే సోదరులయిన ఖర,దూషణల దగ్గర దండకారణ్యంలో ఉండేది. ఆ సమయంలోనే రాముడు, సీతా, లక్ష్మణులతో కలిసి వనవాసానికి వచ్చి దండకారణ్యంలో పంచవటి దగ్గర పర్ణశాల నిర్మించుకొని ఉంటున్నారు.

➡️ లక్ష్మణుడు పండుకోయటానికి అడవిలో తిరుగుతూ దేవతలను చంపే శక్తికోసం తపస్సు చేస్తున్న శూర్పణఖ కొడుకు తలపొరపాటున ఖండిస్తాడు. భర్తను కోల్పోయిన శూర్పణఖ కొడుకు కూడా చనిపోయాడని తెలిసి చాలా దుఃఖించి, తన కొడుకును చంపిన వానిని చంపాలని, పర్ణశాలకి వస్తుంది. అక్కడ రాముని అందానికి బానిసై తనని పెళ్లి చేసుకోమని రాముని కోరుతుంది. నేను ఏకపత్నీ వ్రతుడను. అదిగో అక్కడ ఉన్న నా తమ్ముని వరించు, అని లక్ష్మణుని చూపించాడు రాముడు. లక్ష్మణుని దగ్గరకు వెళ్లిన శూర్పణఖకు అవమానమే ఎదురయ్యింది. ముక్కు చెవ్ఞలు కోయించుకున్న శూర్పణఖ రావణునికి సీత అందచందాలు చెప్పి రెచ్చగొట్టి సీతాపహరణం చేయించింది. ఆమె శ్రీరాముని అందచందాలకు మోహితురాలై శివుని గురించి పుష్కర తీర్థములో నీటిలో నిలబడి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసింది. శివుడు ఆమె తపస్సుకు ప్రసన్నుడై వరం కోరుకోమన్నాడు. రాముడినే నాకు భర్తగా ప్రసాదించమని కోరుకుంది.

➡️ అది ఈ జన్మలో తీరేది కాదని, మరుజన్మలో తప్పక తీరుతుందని రాముడే కృష్ణునిగా అవతరించి నీ కోరిక తీరుస్తాడని వరమిచ్చాడు శివుడు. మరుజన్మలో గూనితో వంకర్లతో కుబ్జగా పుట్టి, కంసుని దాసిగా చందన లేపనాలు అత్తర్లు, పూలు రోజూ కంసుని మందిరానికి తీసుకువెడుతూ ఉండేది. అష్టవంకర్లున్నా ముఖం మాత్రం కాంతితో అందంగా ఉండేదట. కానీ గూని వలన సిగ్గుతో ఎప్పుడూ తలదించుకొని ఉండేదట. కంసుడు కృష్ణుని వధించాలనే ఉద్దేశ్యంతో ధనుర్‌యాగము చేస్తున్నట్లు చెప్పి, బలరామకృష్ణులను తీసుకురమ్మని అక్రూరుని పంపుతాడు. అక్రూరునితో మధురకు వచ్చిన బలరామకృష్ణులు చందన లేపనాలతో తలవంచుకుని వెళుతున్న కుబ్జను చూసి అదేమిటని పలకరిస్తారు. తననుచూసి ఎగతాళి చేసే వాళ్ళు వెటకారంగా నవ్వేవాళ్లే కానీ, ఆప్యాయంగా పలుకరించే వాళ్ళు లేరు కదా అని వంచిన తల ఎత్తివారిని చూస్తుంది.

➡️ అందచందాలతో వెలిగిపోతున్న వాళ్లను చూడగానే ముగ్ధురాలై, కంసునికి తీసుకువెడుతున్న ఆ చందన లేపనాలు వాళ్లకి పూస్తుంది. మెడలో పూలదండలు వేసింది. ఆమె చేసిన పనికి కృష్ణుడు సంతోషంతో తన పాదముతో ఆమె కాలు అదిమి గడ్డము పట్టుకొని ఆమెను పైకి లేపుతాడు. మూడు వంకర్ల గూనితో ఉన్న కుబ్జ మంచి సుందరాంగిగా మారిపోతుంది అది చూసిన వాళ్లందరూ కృష్ణుని మాయకు ఆశ్చర్యపోతారు. ఆమె కృష్ణుని పాదాలపై బడి, తన ఇంటికి రమ్మని బ్రతిమాలుతుంది. కాని కృష్ణుడు తను వచ్చిన పని పూర్తిచేసుకోవాలని తరువాత వస్తానని చెప్పి కంస మందిరానికి వెళ్లిపోతాడు.

➡️ అప్పుడు కృష్ణుని వయస్సు పన్నెండు సంవత్సరాలే. తరువాత కంస వధ జరిపి, తల్లిదండ్రుల చెర విడి పించి, సాందీపుని దగ్గర విద్యాభ్యాసము ముగించుకుని నవయవ్వనుడై ఒకసారి కుబ్జ ఇంటికి వెళతాడు. కుబ్జ సుందరి కృష్ణుని కొరకే ఎదురు తెన్నులు చూస్తూ ఉంటుంది. శివుని వరం నిజం చేయాలి కనుక కృష్ణుడు కుబ్జ దగ్గర కొన్నిరోజులు ఉండి శూర్పణఖ కోరికను తీరుస్తాడు. వారికి ఉపశ్లోకుడనే పుత్రుడు పుడతాడు. అతడు నారదునికి శిష్యుడవుతాడు. ఇదంతా కృష్ణుడు, రుక్మిణీదేవిని పెండ్లి చేసుకోకముందే జరిగింది. ఆవిధంగా రాముని మోహించిన మునిజనాలు, కృష్ణుని కాలంలో పదహారు వేల భామలయి ఆయన సాన్నిధ్యాన్ని పొందారు.
🙏 *వరలేఖరి.నరసింహశర్మ*🙏

సత్యవ్రతుడు

కొన్ని వేల సంవత్సరాల క్రితం సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. ఆయన గుణగణాలు, పరిపాలనా దక్షత తెలియనివారు లేరు. ఆయన ధర్మదీక్ష, కీర్తి ప్రతిష్ఠలు దేవలోకం వరకు వ్యాపించి ఉండేవి.

అటువంటి ఆ మహారాజు ఒకనాటి రాత్రి రెండవజామున రాజ్యపు దక్షిణద్వారం వద్ద పచార్లు చేస్తున్నాడు. ఆ సమయంలో ఎవరో ఒక దేవతా స్త్రీ మూర్తి రాజ్యపు ప్రధాన ద్వారాన్ని దాటుకొని పోతూ కనబడ్డది ఆయనకు.

ఆయన ఆమెను ఆపి, గౌరవంగా "ఎవరు తల్లీ, నువ్వు? ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళ్తున్నావు?" అని అడిగాడు.

"రాజా, నేను ధనలక్ష్మిని. ఏ ఒక్కచోటా ఆగటం నా స్వభావంలో లేదు. అయినా ఇన్నేళ్లుగా నీ రాజ్యంలో నేను ఆగిపోయాను. ఇక ఆగను. వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నది ఆమె.

మహారాజు "తల్లీ! నిన్ను ఆపటం నావల్ల ఎలాగూ కాదు. సంతోషంగా వెళ్లు" అని ఆమెను సాగనంపాడు.

ఆమె అటు వెళ్లిందో, లేదో- ఇటుగా ఒక దివ్య పురుషుడు బయలు దేరాడు బయటికి. "అయ్యా! మీరెవరు? ఎటు వెళ్తున్నారు?" అని అడిగాడు రాజు, ఆయనను.

"రాజా నేను దానాన్ని. ధనం ఉన్నచోట దానం ఉంటుంది. ధన సంపద లేని నీ రాజ్యం ఇప్పుడు నాకు న్యాయం చేయజాలదు. నేనూ ధనాన్ని అనుసరించాల్సిందే. నీ రాజ్యాన్ని విడిచి వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నాడు ఆ దివ్య పురుషుడు.

"సంతోషంగా వెళ్లండి" అని సాగనంపాడు మహారాజు.

అంతలోనే మరొక దేవతామూర్తి బయటికి పోతూ కనబడింది ఆయనకు. "తల్లీ! నువ్వెవ్వరు? ఎందుకు నన్ను వదిలి పోతున్నావు?" అడిగాడు రాజు.

"రాజా! నేను కీర్తికాంతను. ధన సంపత్తీ, దాన సంపదా లేని ఈ రాజ్యంలో నేను ఉండజాలను. నన్ను వెళ్లనివ్వు" అన్నది ఆ దేవతామూర్తి.

"సరేనమ్మా! నీ ఇష్టం వచ్చినట్లే కానివ్వు." అన్నాడు రాజు.

ఇంకొంతసేపటికి మరొక దివ్య మూర్తి బయటి దారి పట్టింది. రాజుగారు అడిగారు "స్వామీ! మీరెవ్వరు?" అని.

"రాజా! నేను శుభాన్ని. సంపదా, దానం, కీర్తీ లేని ఈ రాజ్యంలో నేను ఉండీ ప్రయోజనం లేదు. అందువల్ల నేను వారిని అనుసరించి పోవటమే మంచిది. నన్ను క్షమించి, పోనివ్వు" అన్నాడా దివ్యమూర్తి. రాజుగారు శుభాన్నీ సాగనంపారు.

'ఇంకా ఏమి చూడాల్సి వస్తుందోనని రాజుగారు విచార పడుతుండగానే మరో దేవతా మూర్తి బయటికి పోతూ కనబడ్డది. "తల్లీ! నువ్వెవ్వరు?" అని అడిగాడు సత్యవ్రతుడు.

"రాజా, నేను సత్య లక్ష్మిని. ధనలక్ష్మీ, దాన లక్ష్మీ, యశోలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ నిన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇక నీకు నా అవసరం ఉండదని, నేనూ పోనెంచాను. నాకూ అనుమతినివ్వు" అన్నది సత్యం.

రాజుగారు వెంటనే ఆమె పాదాలపై పడి " తల్లీ! నీకు ఆ అవసరం ఏమున్నది? వేరే ఏ సంపదనూ నేను కోరలేదు- వారంతట వారువచ్చారు; వారంతట వారు వెళ్ళారు. కానీ తల్లీ, నేను నీ పూజారిని. సత్యాన్ని కోరి, సత్యం కోసమే జీవించే నన్ను వదిలి వెళ్లటం నీకు భావ్యం కాదు. నన్ను వదిలి వెళ్ళకు!" అన్నాడు.

సత్యం సంతోషపడింది. సరేలెమ్మన్నది. తిరిగి రాజ్యంలోకి వెళ్లిపోయింది.

రాజుగారు నిట్టూర్చారు. సూర్యోదయం కాబోతున్నది. రాజుగారు కూడా వెనుదిరిగి తమ మందిరానికి పోబోతున్నారు- అంతలోనే ఒక దివ్యమూర్తి- ఈమారు ఆమె ప్రధాన ద్వారం గుండా రాజ్యంలోనికి ప్రవేశిస్తూ కనబడింది; చూడగా, ఆమె ధనలక్ష్మి! "ఏం తల్లీ! మళ్ళీ వస్తున్నావు?" అడిగారు రాజుగారు.

"అవును సత్య వ్రతా! సత్యం లేనిచోట నేనూ ఉండలేను. అందుకే తిరిగి వస్తున్నాను" అన్నది ధనలక్ష్మి.

అంతలోనే దానలక్ష్మీ, ఆపైన యశోలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ ఒకరి తరువాత ఒకరు తిరిగి వచ్చారు రాజ్యానికి.

మళ్లీ రాజ్యం కళకళలాడింది.

ఉపనిషత్తులలోని ఈ కథ, సత్యం ఎంత గొప్ప సంపదో వివరిస్తున్నది. అన్ని విషయాల్లోనూ నిజం చెప్పగల్గటం అన్నది నిజంగానే గొప్ప సంపద. ప్రపంచంలో మనకు అబద్ధమే రాజ్యమేలుతున్నట్లు అనిపిస్తుంది కానీ, అంతిమంగా నిలిచేది సత్యమే, సందేహం లేదు....మిత్రమా!!! *ఇట్లు...మీ ఉపాధ్యాయుడు*
వాట్సాప్ పోస్ట్.

పోతన తలపులో...(2)



ప‌ర‌మ శివుడిపై పోత‌న‌రాసిన ప‌ర‌మాద్భుత ప‌ద్యం
కైలాసం నుంచి శివ‌య్య‌ను మ‌న క‌ళ్ల‌ముందు నిలిపే ప‌ద్యం.
                              ****
వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్ దయా
శాలికి శూలికిన్ శిఖరిజా ముఖ పద్మ మయూఖ మాలికిన్
బాల శశాంక మౌళికిఁగ పాలికి మన్మథ గర్వ పర్వతో
న్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాలికిన్.
                              ****

అనంత లీలాతాండవలోలు డైన పరమ శివునికి, మిక్కలి దయ గలవానికి, త్రిశూల ధారికి, పర్వతరాజ పుత్రి పార్వతీదేవి  ముఖ పద్మం పాలిటి సూర్యునికి, తలపై నెలవంక ధరించిన వానికి, మెడలో పుర్రెల పేరు ధరించిన వానికి, మన్మథుడి గర్వం సర్వ‌మూ అణిచేసిన వానికి, నారదాది మునుల మానస సరోవరాలలో విహరించే వానికి... శిరస్సు వంచి భక్తి పురస్సరంగా ప్రణామం చేస్తున్నాను...... అని శివుడికి అక్షరార్చన చేశాడు పోతన.
ఈ పద్యంతో పరమశివుడిని  కైలాసం నుంచి మన కళ్లముందుకు తెచ్చినిలిపి తరింప చేసిన పోతనకు  తెలుగుజాతి ఎన్నటికీ రుణపడి ఉంటుంది.
🏵️పోత‌న ప‌ద్యాలు...కైవ‌ల్య ప‌థాలు 🏵

నారీణాం కీర్తి,

నారీణాం కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధా, ధృతి, క్షమ.....

స్త్రీలలో కనిపించే ఈ ఏడు గుణాలు నా విభూతులే అంటున్నాడు భగవానుడు.

 దీనిని బట్టి ఈ ఏడు లక్షణాలు పురుషులలో కన్నా స్త్రీలలోనే ఎక్కువగా శోభిస్తాయని కావచ్చు. లేదా ఈ ఏడు లక్షణాలు స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తాయని కావచ్చు. ఇవి స్త్రీలకు సహజగుణాలు కూడా. 

ప్రతి వస్తువులోను ఒక్కొక్క విభూతిని చెప్పి, స్త్రీలలో మాత్రం ఏడు విభూతులుగా నేనున్నాను అని భగవంతుడు అనటంలో స్త్రీల యొక్క విశిష్ఠతను చాటుతుంది. ఏమిటా ఏడు విభూతులు...

 1) కీర్తి...

సత్కర్మలు, దానధర్మాలు, పూజాపునస్కారాలు, యజ్ఞయాగాదులు మోదలైన కర్మల ద్వారా, త్యాగభావన ద్వారా కీర్తిని సంపాదించటం, భర్తకు అనుకూలంగా కుటుంబ నిర్వహణ గావించటం ఇవి స్త్రీ సహజగుణాలు. 

 2) శ్రీ...

శ్రీ అంటే సంపద. అంతేకాదు సంపదతో బాటు శరీర సౌందర్యాన్ని కాపాడుకుంటూ అందంగా అలంకరించుకోవటం కూడా స్త్రీ యొక్క సహజగుణమే. శ్రీ అంటే లక్ష్మి. 

 3) వాక్కు...

వాక్కు అంటే సరస్వతి. విద్య, బుద్ధి, జ్ఞానం సంపాదించటం, చల్లగా, తియ్యగా, మధురంగా మాట్లాడటం కూడా భగవంతుని విభూతియే. 

 4) స్మృతి...

జరిగిపోయిన విషయాలను గుర్తుపెట్టుకొనే జ్ఞాపకశక్తి, జ్ఞానాన్ని మరచిపోకుండా ఉండటం.

 సందర్భానికి తగినట్లు జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకోవటం స్మృతి. ఇదీ భగవంతుని విభూతియే. 

 5) మేధా...

ధారణా శక్తి. విన్న విషయాలను బుద్ధిలో నిలుపుకొనే శక్తి. జ్ఞానవిషయాలు, తత్త్వవిచారణ చేయటానికి కావలసిన మేధాశక్తి స్త్రీలలో అధికం. ఇది కూడా భగవంతుని విభూతియే.

 6) ధృతి...

ధర్మ కార్యాలలో, దైవకార్యాలలో ధైర్యంతో, పట్టుదలతో పాల్గొనటం, మోక్ష సిద్ధి కొరకు పట్టుదల. ఇంద్రియ, మనస్సులను నిగ్రహించగల బలం. ఇది కూడా స్త్రీలలో అధికమే.

 7) క్షమా...

 అత్తమామలను ఆదరించటంలోను, *భర్తకు* అనుకూలంగా నడుచుకోవటంలోను, *పిల్లల పోషణలోను, బావలు, మరుదులు, తోటికోడళ్ళు మొదలైన వారితో నేర్పుతో వ్యవహరించటంలోను ఎంతో ఓర్పు* ఉండాలి. ఇది కూడా స్త్రీ సహజగుణమే. ఇవన్నీ స్త్రీలలో ఉంటే వాటిని భగవంతుని విభూతులుగా చూడాలి.

 విశేషార్థం...

'నార' అంటే భగవత్ సంబంధమైన.. అని. భగవత్ కార్యాలలో, లేదా భగవత్ సంబంధమైన జ్ఞానంలో జీవించేవారు పురుషులైనా, స్త్రీలైనా పైన చెప్పిన సద్గుణాలు వారిలో ప్రకాశిస్తే అవి భగవత్ విభూతులే...

ఒంటరితనం



*జీవితంలో ఒంటరి తనాన్ని తప్పించుకోవడానికే మనిషి నానారకాలుగా వ్యాపకాలలో మునిగి తేలుతుంటాడు. నిజానికి చుట్టూ సమూహలే. మన చుట్టూరా మనుషులే. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా తన మనిషి అనుకునేవారు వుండరు. ఎంతటి దురవస్థ ఇది. సముద్రం మధ్యన ఉండి దాహంతో అల్లాడిపోయే స్థితి ఇది. ఇదే ఇవాలిటి మానవుడి దుస్థితి. తమ లోపలి ఒంటరితనాన్ని తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ వుంటారు. ఆ క్రమంలో అసలు జీవితాన్నే కోల్పోతారు. ఎందుకీ ఒంటరితనం? జీవితాన్ని జీవించలేక పోవడంలోనే ఈ లోపం ఉంది. అనవసరమైన ఆరాటాలలో పడి తమ సహజాతాల్ని కోల్పోవడంలోనే మానవ జీవిత విషాదం ఇమిడి ఉంది. ఎవరినీ ప్రేమించలేరు, ప్రేమను పొందలేరు. ప్రేమ లేనప్పుడు జీవితంలో మిగిలేది ఒంటరితనమనే చీకటే. చాలామంది బతుకులు ఈ చీకట్లోనే హరించుకుపోతాయి. లోలోపల పెను దుఃఖం సుడులు తిరుగుతున్నా పైకి మాత్రం నిబ్బరంగా వుంటారు. లోపల దుఃఖ పునాదుల్ని బయటకు రాకుండా ఒడిసి పట్టుకునే యత్నం లొనే బతుకులు దగ్దమైపోతాయి. ఎందుకీ విషాదం?  ఎందుకీ పెను దుఃఖం? మనిషికి తోడుగా మరో మనిషి లేకపోవడమే ఈ దౌర్భాల్యానికి  మూలం. "నిన్ను నిన్నుగా ప్రేమించుటకు, నీకోసమే జీవించుటకు తోడు ఒకరుండిన అదే చాలును" అన్నాడో కవి. కానీ సుదీర్ఘ జీవిత కాలంలో అలా ఒక్క మనిషీ కనిపించక పోవడమే మానవుడికి అసలు విషాదం. జీవితంలో సంపదలు పొగుచేసుకోగలరు, కీర్తి ప్రతిష్టలు పెంచుకోగలరు. కానీ జీవిత కాలమంతా కలసి తనని త్రికరణ శుద్ధిగా ప్రేమించే ఒక్క మనిషినైన సంపాదించుకోలేరు. ఎందుకని? తనకు ఏం కావాలో  తను తెలుసుకోలేకపోవడమే దీనికి కారణం. బుచ్చిబాబు "చివరకు మిగిలేది" నవలలో దయానిధి అన్నట్టు 'మనిషికి కావలసింది కాసింత దయ, ప్రేమ". అవి మనుషులకు లభించనంత కాలం ఈ ఒంటరితనం, దుఃఖం నుంచి విముక్తి లేదు మరి.*

*సర్వేజనా సుఖినో భవంతు....మీ ఆకొండి రామ మూర్తి....27.07.2020....

అక్షరాలూ -శబ్దాలు

అక్షరమాల లో కొన్ని  శబ్దములు ప్రయెూగం అనగా పలుకుట దాని లక్ష్యము నిర్ధిష్ట ముగా తెలియుటయే. ఏభాషయైనా శబ్ద శక్తి లక్షణము తెలుసుకొనుటయే. అచ్చులు హల్లులలో కలిసిన గాని అనగా శబ్ద శక్తి అగ్ని వాయు తత్వం అచ్చు లుగా అతడు నుండి అహ వరకు వీటికి హల్లులు క నుండి ఱ వరకు కలిసిన గాని శబ్ద శక్తి మెటీరియలైజ్కాదు. శక్తిని ప్రథమంగా ర,ఋ,ఱ, శ, స, యివి ప్రధనమైనవిగా తెలియుచున్నది. ర అనే శబ్ద లక్షణము రజో అగ్ని మూలక సంభందంగా రుద్ర శక్తియని యిట్టి శక్తి ఋ అనగా అక్కడ యని రెండవ రూపం ప్రకృతిగా మారి నది. పైన తెలిపిన ప్రకృతి కి మూల తత్వం స అనే శక్తి సత్ గా మారి శం పూర్ణత్వం చెంది జీవునికి తెలియుచున్నది. భాషకు మూలం శబ్దము. శబ్దం నకు మూలం శక్తి. యివి యే వాక్ అర్ధావివ పరస్త్రీ పురుష తత్వ మైన ప్రకృతిగా మనకు తెలియును. సమస్త వేద వాగ్ఙ్మయము శబ్ద శక్తి లక్షణమే.శక్తియే జీవ ప్రధాన లక్షణము. దాని మరో రూపం ఆయన నీటి చైతన్య లక్షణం. నీరే జీవన లక్షణము.

దశాంశ పద్దతి ఒక వివరణ

ఆర్యభట్ట '0' ని కనుక్కున్నాడని చెప్తారు కదా మరి ఆయన కలియుగంలో కనుక్కున్నాడు కదా అలాంటప్పుడు పూర్వ యుగాలలో కౌరవులు 100 అని రావణుడికి 10 తలలు అని ఎలా లెక్కపెట్టారు అని ఒక విద్యార్ధి అడగగా, ఆ టీచర్ రాజీనామా చేసి అన్వేషిస్తూ, అన్వేషిస్తూ వేదిక్ స్కూల్ లో చేరాడు. పైన చెప్పింది హాస్యంగా అనిపించినా కానీ అందులో ముఖ్య విషయం వుంది. ఒక పండితుడు ఐన వేదాంతీకుడి మాటలలో 

నేను మీకు వేదాల నుండి ఒకటి పురాణాల నుండి ఒకటి చొప్పున ఆధారం ఇస్తున్నాను.

1)వేదాల నుండి యజుర్వేదం ప్రకారం మేధాతిథి మహర్షి ఒక యజ్ఞం చేయటానికి ఇటుకలు పేరుస్తూ అగ్నికి ఈ విధంగా ప్రార్ధించాడు.

ఇమం మే ఆగ్నా ఇష్టక దేనవ, సంత్వేక కా, దశ కా, శతం కా, సహస్రం కా, యుతం కా, నియుతం కా, ప్రయుతం కా, అర్బుదం కా, న్యార్బుదం కా, సముద్రం కా,మధ్యం కా, అంతం కా, పరార్ధం కా, ఇత మే అగ్నా ఇష్టక దేనవ సంత్వాముత్రం ముష్మిన్లోకే.

అగ్ని ప్రతిష్టకు అర్చకులు ఈ మంత్రాన్ని మొదటగా చదువుతున్నారు. అంటే, ఓ అగ్ని దేవా! ఈ ఇటుకలే నాకు పాలిచ్చే ఆవులుగా మారాలి అలా నాకు వరం ఇవ్వండి అవి ఒకటి, పది, వంద, వేయి, పది వేలు, లక్ష, పది లక్షలు, కోటి, పది కోట్లు, వంద కోట్లు, వేయి కోట్లు, లక్ష కోట్లు ఈ విశ్వంలో వేరే విశ్వాలలో.

ఇక మంత్రం అర్ధం చూస్తే

ఏక -  1

దశ -  10 (10  to the power of 1)

శత -  100(10 to the power of 2)10×10

సహస్ర -  1000 (10  to the power of 3)10×10×10

ఆయుతం -  10,000 (10  to the power of 4)10×10×10×10

నియుతం -  1,00000(10 to the power of 5)10×10×10×10×10

ప్రయుతం -  10,00000(10 to the power of 6)10×10×10×10×10×10

అర్బుధం - 10,000,000(10 to the power of 7)10×10×10×10×10×10×10

న్యార్బుదం - 100,000,000 (10 to the power of 8)10×10×10×10×10×10×10×10

సముద్రం - 1,000,000,000( 10 to the power of 9)

10×10×10×10×10×10×10×10×10

మద్యం -  1,000,0000,000( 10 to the power of 10)10×10×10×10×10×10×10×10×10×10

అంతం -  100,000,000,000(10 to the power of 11)10×10×10×10×10×10×10×10×10×10×10

పరార్ధం -  1,000,000,000,000(10 to the power of 12)10×10×10×10×10×10×10×10×10×10×10×10.

రిఫరెన్సులు 2 గురించి భాగవతంలోని 3.11లో సమయం గురించి వివరించబడింది. అందులో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న "నానో సెకండ్స్" గురించి లక్షల, కోట్ల సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది. నేను కేవలం 2 రిఫరెన్సులు మాత్రమే ఇచ్చాను. మనం మనసు పెట్టి కనుక చూస్తే అలాంటివి చాలా కనిపిస్తాయి. దీన్ని బట్టి భారతీయులు ఎప్పటి నుండో లెక్కల గురించి వాటి ఖచ్చితత్వం గురించి పూర్తిగా తెలుసుకున్నాం అని, మరియు వాటి స్థానాల గురించి నిజం వున్నా కూడా మనకు వ్యతిరేకంగా అతి తెలివితో  ఇలాంటి ప్రశ్నలు ఎందుకు  వేస్తారో తెలియదు.!?

1)ప్రశ్న ఎప్పుడు వస్తుంది? దాన్ని మనం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినప్పుడు. బ్రిటీషర్లు పవిత్రమైన మన గురు శిష్యుల మైత్రి వలన భావితరాలకు ఉత్తమ విద్యను అందించకుండా ఆ ఆచార పరంపరను వారి తెలివితో నాశనం చేయడం. మనం తెలివి తక్కువ పని చేస్తున్నాం మళ్ళీ మళ్ళీ చేస్తున్నాం. మన పూర్వం గురించి చెప్పుకోవడానికి మనం సిగ్గు పడుతున్నాం ఒకవేళ కొందరు ధైర్యంతో మాట్లాడినా వారు కూడా గిల్టీ ఫీల్ అయ్యేలా చేస్తున్నారు.

2) మనం గుడ్డిగా పాటిస్తున్న మెకాలే విద్యావ్యవస్థను బ్రిటీషర్లు మన మీద రుద్దినది. మనకు మరో పిచ్చి ఏంటంటే ఆర్యభట్ట '0'  కనుక్కున్నాడు అని అనడం! ఇది పిచ్చి స్టేట్మెంట్. మరొక పిచ్చి విషయం ఏంటంటే క్లాసికల్ సంస్కృతం అని, వేదిక సంస్కృతం అని వేర్వేరు ఉన్నాయని ప్రచారం చెయ్యటం.

3)ఇక మరో పిచ్చి, పెరిగిపోయిన దిక్కుమాలిన సెక్యూలరిజం. దీని వలన ఇలాంటి జోక్స్ వేస్తుండడం మన తరువాత తరాలకు పరిపాటిగా మారుతుంది.

జవాబు: ఆర్యభట్ట "0" ను కనుక్కోలేదు. ఆయన "0" ను సరిగ్గా ఏ స్థానంలో వాడితే దాని విలువ ఎలా, ఎంతలా మారుతుంది అని ఆధారాలతో చెప్పిన మొదటి వాడు ఆర్యభట్ట. ఆయన లెక్కలను విపులంగా, సోదాహరణంగా వివరించాడు. మనకు రోమన్ సంఖ్యలు కూడా వున్నాయి. కానీ,అవి సరిగ్గా సరిపోవు. అందుకే మనం ఆర్యబట్టను, వేదాలను, పురాణాలను ప్రామాణికంగా తీసుకుంటున్నాం.

జై సనాతన ధర్మ.

You’ll love this ..

1. In the 1400s a law was set forth in England that a man was allowed to beat his wife with a stick no thicker than his thumb. 
Hence we have 'the rule of thumb.'

2. Many years ago in Scotland , a new game was invented. It was ruled 'Gentlemen Only...
Ladies Forbidden'... and thus the word GOLF entered into the English language.

3. Each king in a deck of playing cards represents a great king from history:
Spades - King David, 
Hearts - Charlemagne, 
Clubs -Alexander the Great,
Diamonds - Julius Caesar

4. In Shakespeare's time, mattresses were secured on bed frames by ropes.   When you pulled on the ropes the mattress tightened, making the bed firmer to sleep on. Hence the phrase......... 'goodnight, sleep tight.'

5. It was the accepted practice in Babylon 4,000 years ago that for a month after the wedding, the bride's father would supply his son-in-law with all the mead he could drink. 
Mead is a honey beer and because their calendar was lunar based, this period was called the honey month, which we know today as the honeymoon.

6. In English pubs, ale is ordered by pints and quarts... 
So in old England , when customers got unruly, the bartender would yell at them 'Mind your pints and quarts, and settle down.' 
It's where we get the phrase 'mind your P's and Q's'

7. Many years ago in England, pub frequenters had a whistle baked into the rim or handle of their ceramic cups. When they needed a refill, they used the whistle to get some service. 
'Wet your whistle' is the phrase inspired by this practice.

8. In 1696, William III of England introduced a property tax that required those living in houses with more than six windows to pay a levy. In order to avoid the tax, house owners would brick up all windows except six. (The Window Tax lasted until 1851, and older houses with bricked-up windows are still a common sight in the U.K.) As the bricked-up windows prevented some rooms from receiving any sunlight, the tax was referred to as “daylight robbery”!

Now, there you have the origin of these phrases.
Interesting isn’t it!! 😁

**********************
తెలుగు అనువాదం

మీరు దీన్ని ఇష్టపడతారు ..

1. 1400 లలో ఇంగ్లాండ్‌లో ఒక వ్యక్తి తన భార్యను తన బొటనవేలు కంటే మందంగా కర్రతో కొట్టడానికి అనుమతించాడని ఒక చట్టం రూపొందించబడింది. 
అందువల్ల మనకు 'నియమావళి' ఉంది.

2. చాలా సంవత్సరాల క్రితం స్కాట్లాండ్‌లో, కొత్త ఆట కనుగొనబడింది. దీనిని 'జెంటిల్మెన్ ఓన్లీ ...
లేడీస్ ఫర్బిడెన్ '... అందువలన GOLF అనే పదం ఆంగ్ల భాషలోకి ప్రవేశించింది.

3. కార్డుల డెక్‌లోని ప్రతి రాజు చరిత్ర నుండి గొప్ప రాజును సూచిస్తాడు:
స్పేడ్స్ - కింగ్ డేవిడ్, 
హార్ట్స్ - చార్లెమాగ్నే, 
క్లబ్బులు-అలెక్సాండర్ ది గ్రేట్,
వజ్రాలు - జూలియస్ సీజర్

4. షేక్‌స్పియర్ కాలంలో, మంచం చట్రాలపై తాడుల ద్వారా దుప్పట్లు భద్రపరచబడ్డాయి. మీరు తాడులపై లాగినప్పుడు mattress బిగించి, మంచం నిద్రించడానికి గట్టిగా చేస్తుంది. అందువల్ల ......... 'గుడ్నైట్, గట్టిగా నిద్రించండి' అనే పదబంధం.

5. 4,000 సంవత్సరాల క్రితం బాబిలోన్‌లో అంగీకరించిన పద్ధతి ఏమిటంటే, పెళ్లి తర్వాత ఒక నెల వరకు, వధువు తండ్రి తన అల్లుడికి త్రాగడానికి వీలైన అన్ని మీడ్‌లను సరఫరా చేస్తాడు. 
మీడ్ ఒక తేనె బీర్ మరియు వారి క్యాలెండర్ చంద్ర ఆధారితమైనందున, ఈ కాలాన్ని తేనె నెల అని పిలిచేవారు, ఈ రోజు మనకు హనీమూన్ అని తెలుసు.

6. ఇంగ్లీష్ పబ్బులలో, ఆలే పింట్స్ మరియు క్వార్ట్స్ ద్వారా ఆర్డర్ చేయబడుతుంది ... 
కాబట్టి పాత ఇంగ్లాండ్‌లో, కస్టమర్లు వికృతంగా ఉన్నప్పుడు, బార్టెండర్ 'మీ పింట్లు మరియు క్వార్ట్‌లను చూసుకోండి మరియు స్థిరపడండి' అని అరుస్తారు. 
ఇక్కడే 'మీ P ​​మరియు Q లను చూసుకోండి'

7. చాలా సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్‌లో, పబ్ తరచూ వచ్చేవారు వారి సిరామిక్ కప్పుల అంచు లేదా హ్యాండిల్‌లో కాల్చిన విజిల్ ఉంటుంది. వారికి రీఫిల్ అవసరమైనప్పుడు, వారు కొంత సేవ పొందడానికి విజిల్ ఉపయోగించారు. 
'వెట్ యువర్ విజిల్' ఈ అభ్యాసం నుండి ప్రేరణ పొందిన పదబంధం.

8. 1696 లో, ఇంగ్లాండ్‌కు చెందిన విలియం III ఆస్తిపన్ను ప్రవేశపెట్టాడు, దీనికి ఆరు కిటికీలకు పైగా ఉన్న ఇళ్లలో నివసించేవారు లెవీ చెల్లించాల్సిన అవసరం ఉంది. పన్నును నివారించడానికి, గృహ యజమానులు ఆరు మినహా అన్ని కిటికీలను ఇటుక చేస్తారు. .

ఇప్పుడు, అక్కడ మీకు ఈ పదబంధాల మూలం ఉంది.
ఆసక్తికరంగా లేదు !!