శ్రీమాత్రేనమః
*622వ నామ మంత్రము* 27.7.2020
*ఓం ఐం హ్రీం శ్రీం క్లీంకర్యై నమః*🙏🙏🙏సృష్టిప్రక్రియకు దోహదకారణమైన *క్లీం* బీజాక్షర కారకురాలై విలసిల్లు జగన్మాతకు నమస్కారము🌹🌹🌹శ్రీలలితా సహస్ర నామావళి యందలి *క్లీంకారీ* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం ఐం హ్రీం శ్రీం క్లీంకర్యై నమః* అని ఉచ్చరించుచూ ఆ శ్రీమాత పాదపద్మముల నారాధించు భక్తజనులకు ఆ తల్లి సుఖసంతోషములను సంప్రాప్తింపజేసి కైవల్యపదమును జూపించి కలియుగ పాప పంకిలమంటకుండా రక్షించును🌻🌻🌻 *క్లీం* అను బీజాక్షరమునకు, కారణభూతురాలు ఆ జగన్మాత అని ఈ నామ మంత్రమునకు భావము🌺🌺🌺జగన్మాత సర్వమంత్రాత్మిక; అటువంటి సర్వమంత్రములలోను *క్లీం* అను
బీజాక్షరము కూడా గలదు. ఈ బీజాక్షరమును కామకళా బీజమంటారు. కామకళా బీజమంటే సృష్టిప్రక్రియకు దోహదపడే బీజాక్షరము గాన జగన్మాత సృష్టిప్రక్రియకు దోహదపడే కామకళాస్వరూపిణి🌹🌹🌹 *క్లీం* అను బీజాక్షరంలో *క* కార, *ల* కార, *ఈం* కారములుంటాయి. ఈ మూడు బీజాక్షరములు వరుసగా సరస్వతి, లక్ష్మీ, శక్తిస్వరూపిణి అయిన పార్వతీ తత్త్వాలను సూచిస్తాయి...దీని అర్థం ఏమంటే సర్వకళా సమన్వయ రూపమునకు సమన్వయం ఈ *క్లీం* అను బీజాక్షరం. *క్లీం* అను ఈ బీజాక్షరం *శ్రీం*, *హ్రీం* ల వంటి బీజాక్షరములతో సమానంగా ఎంచబడుతూ పంచప్రణవాలైన *ఐం క్లీం సౌః శ్రీం హ్రీం* లలో ఒక బీజాక్షరమయినది. ఈ క్లీం అనే బీజాక్షరం మన్మథ బీజమనియు చెబుతారు🌸🌸🌸సమిష్టి సృష్టిగా తాను అవుదామని పరమేశ్వరుడు కామేశ్వరుడుగా మారే ప్రక్రియకు ప్రేరణకారి అయిన ఈ *క్లీం* అనే అమ్మవారి బీజాక్షరం. కృష్ణమంత్రానికి కూడా బీజాక్షరం *క్లీం* అనేదే కావడం విశేషం🌺🌺🌺 *క్లీం* కారణి అయిన శ్రీమాతకు నమస్కరించు నపుడు *ఓం ఐం హ్రీం శ్రీం క్లీంకర్యై నమః* అని అనవలెను🌹🌹🌹🌹🌹ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* అనుగ్రహముతో, వారి విరచితమైన *శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ* అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది🙏🙏🕉🕉🕉నేడు సోమ వారము🌻🌻🌻ఇందు వారము అని కూడా అంటాము🔱🔱🔱నీలకంఠుని ఆరాధించు పవిత్రమైన దినము🙏🙏🙏 *ఓం నమశ్శివాయ* అనే ఈ ప పంచాక్షరిని పదిసార్లు మననం చేసుకుందాము.🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 🌺🌻🌹🌻🌸 🙏🙏
🌹🌹🌹🌹🌹మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి 7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి