23, అక్టోబర్ 2022, ఆదివారం

ఆప్యాయత " ఉంది

 👏👏👏👏👏👏👏👏👏👏👏👏


" అమ్మ " అనే పిలుపులో  " ఆప్యాయత " ఉంది .. 

" నాన్న " అనే పిలుపులో  " నమ్మకం " ఉంది .. 

" తాత " అనే పిలుపులో " తన్మయత్వం " ఉంది .. 

" అమ్మమ్మ " అనే పిలుపులు " అభిమానం " ఉంది .. 

" నానమ్మ " అనే పిలుపులో " నవ్వు ముఖం " ఉంది .. 

" అత్త " అనే పిలుపులో " ఆదరణ " ఉంది .. 👈

" మామ " అనే పిలుపులో " మమకారం " ఉంది .. 

" బాబాయ్ " అనే పిలుపులో " బంధుత్వం " ఉంది .. 

" చిన్నమ్మ " అనే పిలుపులో " చనువు" ఉంది .. 

" అన్నా " అనే పిలుపులో " అభయం " ఉంది .. 

" చెల్లి " అనే పిలుపులో " చేయూత "  ఉంది .. 

" తమ్ముడు " అనే పిలుపులో " తీయదనం " ఉంది .. 

" అక్క" అనే పిలుపులో " అనురాగం " ఉంది .. 

" బావా " అనే పిలుపులో " బాంధవ్యం " ఉంది .. 

" వదినా " అనే పిలుపులో " ఓర్పు " ఉంది ..  👈

" మరదలు " అనే పిలుపులో " మర్యాద " ఉంది .. 

" మరిది " అనే పిలుపులో " మానవత్వం " ఉంది .. 

    " గురువు " అనే పిలుపులో " గౌరవం" ఉంది .. 


 నేడు మనం కట్టే బట్ట, చదివే చదువు,

 తినే తిండి అన్నీ పరాయి పోకడలను,

 అనుసరిస్తున్నాయి,కనీసం" పిలుపులో, 

" నయినా  మన " అచ్చ తెలుగులో " 

       పిలుచుకుందాం బంధాలను ,

          నిలబెట్టుకుందాం ..

     🙏❤️🙏🤝💐🌻

వున్నకాలాన్ని సద్వినియోగం చేసుకొ

 శ్లోకం.


ఆయుర్వర్ష శతం నృణాంపరిమితం,రాత్రౌ తదర్ధం గతం

తస్యార్ధస్య పరస్య చార్ధమపరం బాలత్వవృద్దత్వయోః

శేషం వ్యాధివియోగదుఃఖసహితం సేవాదిభిర్నీయతే,

జివే వారితరఙ్గచఞ్చలతరే సౌఖ్యం కుతం ప్రాణినామ్॥


బ్రహ్మదేవుడు మనిషికి వంద సంవత్సరాలు ఆయుష్షును ఇచ్చాడు. అందులో సగం అంటే యాభై సంవత్సరాలు నిద్రకే సరిపోతుంది. ఇక ముసలితనంలో రోగాలు రొచ్చులతో ఇరవైఐదు సంవత్సరాలు గడపాల్సి. వస్తుంది. మిగిలింది ఇరవై ఐదు సంవత్సరాలే, ఆ ఇరవైఐదు సంవత్సరాలు కూడా రోగాలకు, ఎడభాట్లకు దు:ఖానికి సేవకా వృత్తికి అంటే ఉద్యోగానికే సరిపోతుంది. కనుక ఓ మనిషి నీకు జీవితంలో సుఖమనేది వుందా ? సుఖమనేది మనశ్శాంతనేది తృప్తిపై ఆధారపడివుంటుంది. కనుక వున్నకాలాన్ని సద్వినియోగం చేసుకొని తృప్తిగా మనశ్శాంతితో జీవించు.


............ భర్త్రహరి సుభాషితమ్.

యవ్వనకాలములో

 శ్లోకం.


వ్యాఘ్రీవ తిష్టతి జరా పరితర్ణయంతీ రోగాశ్చ శత్రవ ఇవ ప్రహరంతి దేహం ।

ఆయు: పరిస్రవతి భిన్నఘటా దివామ్భోI

లోకస్థథా ప్యమిత మాచర తీతి చిత్రమ్॥


యవ్వనకాలములో మితిమీరిన దర్పముతో ఇష్టమైన రీతిలో పనులు చేసే ఓ యువతా, తొందరపడకు అదిగో చూడు ముసలితనం కాచుకు కూర్చుంది, నువ్వు వద్దన్నా వార్ధక్యం నీ చెంతకు రాకమానదు, అదిగో చూడు బెబ్బులిలా ముసలితనం కాచివుంది. రోగాలు శత్రువులా నీ శరీరం మీద దాడి చేయటానికి సిద్ధంగా వున్నాయి. చిల్లుకుండలో నీల్లులాగా నీ ఆయువు కూడా కారిపోతున్నది.

ఈ ప్రమాద కారణాలన్ని నీకు దగ్గరలోనే వున్నాయి. కనుక వీటన్నింటిని లక్ష్యపెట్టక

చేరాల్సిన గమ్యాన్ని నిర్దేశించి ముందుకు వెళ్ళు.


............ భర్త్రహరి సుభాషితమ్.

ధన్వంతరి జయంతి

 🙏🏵️🙏ఈరోజు ధన్వంతరి జయంతి.🙏🏵️🙏


వైద్యశాస్త్ర భగవానులు ,  పితామహులు  శ్రీ  ధన్వంతరి జయంతి..!!  ఆరోగ్యం  ఆశించే  ప్రతి ఒక్కరు  ఈ  వైద్యమూల  పురుషున్ని  స్మరించండి.  మీ  అనారోగ్యం బాగావుతుంది , ఆరోగ్యం అజరామరంగంగా వర్ధిల్లుతుంది ...నిత్యం  ఎవరైతే  ఈ మూల పురుషున్ని అతని మూల మంత్రంతో  స్మరిస్తారో  వారింటినుండి  అనారోగ్యం  వెలివేయ బడుతుంది. ప్రపంచమంతా  సంపూర్ణ ఆరోగ్యంతో  ఉండాలని  మనస్పూర్తిగా  ఆశిస్తూ .


మూల మంత్రం 


ఓం  నమామి  ధన్వంతరామాదిదేవం 

సురాసురైర్వందిత  పాద పద్మం !

లోకే జారారుగ్భయ మృత్యునాశం

ధాతా రామీశం వివిధౌషధీనామ్ !!


కనీసం 8  సార్లు  జపించండి  చాలు !!                           


ధన్వంతరి మంత్రం...!!                                                                   దీర్ఘ రోగ విముక్తికై రొజూ జపించండి 


ఓం హ్రీం వ్రం శ్రీ ధన్వంతరియే అమృత హస్తాయ సర్వ రోగ నివారకాయ వ్రం హ్రీం ఓం స్వాహా*                      


ఆరోగ్యం గురించి ధన్వంతరి మంత్రం..!!💐


ఓం నమో భగవతే మహా సుధర్శనాయ

వాసుదేవాయ ధన్వంతరయే,

అమృత కలశ హస్తాయ, సర్వ భయ వినాశనాయ,

సర్వ రోగ నివారనాయ, త్రి లోకయ పతయే,

త్రి లోకయ నిధయే, శ్రీ మహా విష్ణు స్వరూపాయ,

శ్రీ ధన్వంతరీ స్వరూపాయ,

శ్రీ శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణాయ నమః

గోళీసోడా తాగు

 

గోళీసోడా తాగు
తిరునల్వేలికి చందిన శివం పరమాచార్య స్వామివారి భక్తుడు. స్వామివారి దర్శనార్థమై అప్పుడప్పుడు కాంచీపురం వస్తుంటాడు. ఎప్పుడు దర్శనానికి వచ్చినా, స్వామివారి దగ్గరకు వెళ్ళడం కాని, వారితో మాట్లాడడం కాని చేసేవాడు కాదు. కేవలం స్వామివారి ముందు కూర్చుని వారిని చూస్తూ సంతోషపడేవాడు. ఒక్కోసారి అలా కొన్నిరోజులపాటు చేసేవాడు. ఈ శివన్ చాలా సాత్వికుడు. ఆహారపు అల్వాట్లు కూడా చాలా సాత్వికమైనవే. ఎప్పుడూ నుదుటన విభూతి పెట్టుకునేవాడు. అతని ఆహార్యము, పనులు చూడగానే చాలా భక్తి తత్పరుడు అని ఎవరికైనా తెలుస్తుంది.
ఒకసారి దర్శనం తరువాత సెలవు పుచ్చుకోవడానికి స్వామివద్దకు వెళ్ళాడు. సమాన్యంగా స్వామివారు వెళ్ళమన్నట్టు చేతితో సంజ్ఞ చేసేవారు. కాని ఆరోజు శివంతో స్వామివారు, “బయలుదేరుతున్నవా? సరే కనీసం వెళ్ళే దార్లో సోడా అయినా తాగు” అని సెలవిచ్చారు.
శివం తన ఊరికి బయలుదేరాడు. చంగల్పేట్ కు వచ్చి తిరునల్వేలికి బయలుదేరాడు. అదే బస్సులో ఆకతాయిలైన ఒక నలుగురు యువకులు కూడా ఎక్కారు. చాలా అల్లరి చేస్తూ ప్రయాణీకులతో గొడవపడుతూ వారికి ఇబ్బంది కలిగిస్తూ ప్రయాణిస్తున్నారు. శివం తనపాటికి తాను ఊరికే కూర్చున్నాడు. ఆ తిరునల్వేలికి వెళ్ళే బస్సు మధురై దరిదాపుల్లో ఉండగా, ఒక చిన్న గ్రామంలో ఆపారు. శివం బస్సులో నుండి బయటికి చూడగా, ఒకచిన్న అంగడిలో గోళీసోడా వరుసగా పేర్చబడి ఉంది. పరమాచార్య స్వామివారు మాటలు గుర్తుకురావడంతో, అతడికి కూడా కొద్దిగా దాహంగా అనిపించడంతో బస్సుదిగి వెళ్ళి సోడా తాగడానికి అంగడి దగ్గరకు వెళ్ళాడు.
సోడాతాగి బస్సు ఎక్కి తన సీటువద్దకు రాగానే అక్కడ ఉండాల్సిన తన సంచీ కనబడలేదు. అతని సంబంధించిన వస్తువులు, డబ్బు మొదలైనవి అందులోనే ఉంచుతాడు. ఆ గాభరాలో ఉండాగా ఆ నలుగురు యువకులు అమర్యాదగా అతడిపై అరుస్తూ, “నీ సంచీ వెనుకనున్న సీట్లలో పడేసాము. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. మాకు ఈ సీటు కావాలి” అని నిర్లక్ష్యంగా చెప్పారు.
శివం తన సంచీ ఉన్న సీటు దగ్గరికి వెళ్ళి కూర్చుని ప్రయాణం కొనసాగించాడు. సరిగ్గా గంట ప్రయాణం తరువాత అతను పర్యాణిస్తున్న ఆ బస్సుకు పెద్ద ప్రమాదం జరిగింది. అతను ఇంతకు ముందు కూర్చున్న సీట్లో కూర్చున్న ఇద్దరు కుర్రవాళ్ళు మృత్యువాత పడ్డారు.
శివం ఆ సంఘటనను చూసి మ్రాన్పడిపోయాడు. ఎప్పుడూ లేనిది పరమాచార్య స్వామివారు సోడా తాగమని ఎందుకు చెప్పారో, ఆ బస్సు అక్కడ ఎందుకు ఆగిందో, అతను ఆ అంగడిలోని సోడాను ఎందుకు చూసాడో, దాహార్తిగా అనిపించి బస్సు దిగి సోడా ఎందుకు తాగాడో అన్నీ అతనికి అర్థమై కళ్ళముందు మెదలసాగాయి.
పరమాచార్య స్వామివారి కారుణ్యం అంత గొప్పది.

చాతుర్యము

 శ్లోకం:☝️

*ఇదమేవ హి పాండిత్యం*

 *చాతుర్యమిదమేవ హి |*

*ఇదమేవ సుబుద్ధిత్వమ్-*

 *ఆయాదల్పతరో వ్యయః ||*


భావం: ఒకని పాండిత్యము, చాతుర్యము, నైపుణ్యము అంతా తన స్తోమతని తెలుసుకొని ఖర్చుపెట్టుటలో ఇమిడి యుంటుంది.

_ఆస్తి మూరెడు ఆశ బారెడు_ అనర్థదాయకము.

_తృప్తిన్ జెందని మనుజుడు_

_సప్తద్వీపములనైన చక్కంబడునే_


ఇదమేవ హి పాండిత్యం

చాతుర్యమిదమేవ హి |

ఇదమేవ సుబుద్ధిత్వమ్-

ఆయాదల్పతరో వ్యయః || 


నరుని పాండిత్యపటిమయు మరియుతెలివి

నిపుణతయు బుద్ధికుశలత నిక్కముగను 

శక్తినెఱిగియు  వ్యయముల  సల్పుటందు

యిమిడి యుండును జగతిన నెంచి చూడ 


గోపాలుని మధుసూదనరావు శర్మ

శ్రీపాద శ్రీవల్లభ స్వామి

 శ్రీపాద శ్రీవల్లభ స్వామి 1320 సంవత్సరంలో వినాయకచవితి నాడు చిత్తా నక్షత్ర శుభ దినాన శ్రీ క్షేత్ర పీఠికాపురంలో జన్మించి, 1336 సంవత్సరంలో భరతఖండంలోని వివిధ పుణ్య ప్రదేశాల్లో సంచరించి, నేటి తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా, మఖ్తల్ పట్టణానికి సమీపంలో కృష్ణావేణీ నదీ సంగమంలోని, " కురువపురమనే ద్వీపంలో ", 1336 సంవత్సరం నుంచి 1350 సంవత్సరంలో ఆశ్వయుజ మాసంలో కృష్ణ పక్ష ద్వాదశి వరకు తపమాచరించి, అనేక మంది భక్తులకు భారతీయ సంస్కృతి, వేద ధర్మాచరణ గురించి బోధించిన పిదప 1350 సంవత్సరంలో ఆశ్వయుజ మాసంలో కృష్ణ పక్ష ద్వాదశినాడు హస్తా నక్షత్ర పుణ్య తిథి నాడు కృష్ణావేణీ నదీ సంగమంలో అంతర్హితులై, నేటికీ కురువపురానికి వచ్చే భక్తులకు శుభాశీస్సులు అందిస్తున్నారు. " నేడు ఆశ్వయుజ కృష్ణ పక్ష ద్వాదశి. శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆశీస్సులు యావత్ విశ్వ జీవరాశికి అందాలని మనసారా ఆశిస్తూ... 🙏🌹💐🌹🙏 గుళ్లపల్లి ఆంజనేయులు 

మానవ జన్మకు సార్థకత.

 _*త్వమేవాహమ్‌*_

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


కన్నతల్లి కడుపులోంచి బయటపడి, తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణం నుంచి, పుడమి తల్లి కడుపులోకి చేరుకు నేందుకుఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా 

సాగే ప్రస్థానం పేరే


 *నేను*


ఈ నేను ప్రాణశక్తి అయిన "ఊపిరి" కి మారుపేరు

ఊపిరి ఉన్నంతదాకా 'నేను' అనే భావన కొనసాగుతూనే ఉంటుంది. జననమరణాల మధ్యకాలంలో సాగే జీవనస్రవంతిలో ఈ 'నేను' ఎన్నెన్నో పోకడలు పోతుంది. మరెన్నో విన్యాసాలూ చేస్తుంది.ఈ 'నేను' లోంచే 'నాది' అనే భావన పుడుతుంది!


ఈ *నాది* లోంచి  


1. నావాళ్ళు, 

2. నాభార్య, 

3. నాపిల్లలు, 

4. నాకుటుంబం, 

5. నాఆస్తి, 

6. నాప్రతిభ, 

7. నాప్రజ్ఞ, 

8. నాగొప్ప... 

అనేవీ పుట్టుకొచ్చి చివరికి ఈ *నేను* అనే భావన

భూమండలాన్ని కూడా మించిపోయి, ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి, నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి *అహం* గా ప్రజ్వరిల్లుతుంది.


అహం అనే మాయ పొర కమ్మేసిన స్థితిలో ఈ 'నేను' 'నేనే సర్వాంతర్యామిని'

అని విర్రవీగుతుంది. నాకు ఎదురే లేదని ప్రగల్భాలూ పలుకుతుంది.


1. పంతాలతో 

2. పట్టింపులతో, 

3. పగలతో

4. ప్రతీకారాలతో 


తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికీ సిద్ధపడుతుంది 


1 .బాల్య, 

2. కౌమార, 

3. యౌవన, 

4. వార్ధక్య 


దశలదాకా విస్ఫులింగ తేజంతో విజేతగా నిలిచిన 'నేను'అనే ప్రభ ఏదో ఒకనాడు 

మృత్యుస్పర్శతో కుప్పకూలిపోతుంది.


వందిమాగధులు కైవారం చేసిన శరీరం కట్టెలా మిగులుతుంది.

సుందరీమణులతో మదనోత్సవాలు జరుపుకొన్న దేహం నిస్తేజంగా పడి ఉంటుంది.

సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగిన 'నేను' చుట్టూ చేరిన బంధుమిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది.

కడసారి చూపులకోసం, కొన్ని ఘడియలపాటు ఆపి ఉంచిన విగతజీవికి అంతిమయాత్ర మొదలవుతుంది.

మరుభూమిలో చితిమంటల మధ్యే సర్వబంధనాల నుంచీ విముక్తి కలుగుతుంది.

మొలకుచుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా, మొత్తంగా కాలి బూడిద అవుతుంది.


నేనే శాసన కర్తను, 

నేనే ఈ భూమండలానికి అధిపతిని, 

నేనే  జగజ్జేతను... 

అని మహోన్నతంగా భావించిన

 🔥నేను🔥

లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది. 

రోజు మారుతుంది.

ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన 'నేను' కథ అలా సమాప్తమవుతుంది.


*అందుకే ఊపిరి ఆగకముందే 🔥నేను🔥*

*గురించి తెలుసుకో అంటుంది భగవద్గీత*


చితిమంటలను చూస్తున్నప్పుడు కలిగేది *శ్మశానవైరాగ్యం* మాత్రమే. 


             *అది శాశ్వతం కానే కాదు*


 *నేను* గురించిన సంపూర్ణమైన అవగాహనతో ఉన్నప్పుడే, పరిపూర్ణమైన 

' వైరాగ్యస్థితి ' సాధ్యమవుతుంది.


వైరాగ్యం = అంటే అన్నీ వదిలేసుకోవడం కానేకాదు. 

*దేనిమీదా మోహాన్ని కలిగి ఉండకపోవడం*. 

 తామరాకుమీద నీటి బొట్టులా జీవించగలగడం.


స్వర్గ ~నరకాలు ఎక్కడో లేవు. మనలోనే ఉన్నాయి.

మనిషికి, ఆత్మదృష్టి నశించి బాహ్యదృష్టితో జీవించడమే = నరకం

అంతర్ముఖుడై నిత్యసత్యమైన ఆత్మదృష్టిని పొందగలగడం = స్వర్గం.


ఈ జీవన సత్యాన్ని తెలియచేసేదే వేదాంతం.


1. నిజాయతీగా,


2. నిస్వార్థంగా, 


3. సద్వర్తనతో,


4. సచ్ఛీలతతో 


5. భగవత్‌ ధ్యానం తో జీవించమనేదే


 *వేదాంతసారం*.


 *'అహం బ్రహ్మాస్మి'* అంటే 'అన్నీ నేనే' అనే స్థితి నుంచి


*త్వమేవాహమ్‌* = అంటే నువ్వేనేను 

అని భగవంతుడి పట్ల చిత్తాన్ని నిలుపుకోగల తాదాత్మ్య స్థితిని చేరుకోగలిగితేనే మానవ జన్మకు సార్థకత.


*మీ నేను కాని నేను*

***  *సేకరణ*

🍁🍁🍁🍁🍁☘️🍁🍁🍁🍁🍁

*ధన త్రయోదశి

 

*ధన త్రయోదశి - బలి త్రయోదశి*


_(బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారి అనుగ్రహ భాష్యం నుంచి)_


ధన త్రయోదశి అని ఉత్తర భారతంలో ప్రాచుర్యం పొందిన ఆశ్వీయుజ బహుళ త్రయోదశి దక్షిణ భారతంలో బలి త్రయోదశిగా ప్రాచుర్యంలో ఉంది.


అననుకూల,ప్రతికూల ఆలోచనలతో, అపమృత్యు భయంతో ఉన్న మనకు ఆత్మబలాన్ని ఇచ్చేదే బలి త్రయోదశి.


సాధారణంగా అమావాస్య ముందు వచ్చే బహుళ త్రయోదశి మనిషికి మానసికంగా,  బుద్ధిపరంగా నీరసాన్ని కలగజేస్తుదన్నది శాస్త్ర విదితం.


శరత్, వసంత కాలాలు  అన్ని ప్రాణులకు మృత్యువును తీసుకువచ్చే కాలాలని పేరు. అందులోనూ ప్రత్యేకంగా ఆశ్వీయుజ, కార్తిక మాసాలకు అపమృత్యుమాసాలని పేరు. ఈ మాసాలలో అటువంటి వార్తలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. అందుకని దీపావళి ముందు వచ్చే బహుళ త్రయోదశి రోజు నాడు చేసే దీప దానము మన మానసిక ఆందోళనలు తొలగించి ఆత్మస్థైర్యాన్ని, ఆత్మ బలాన్ని చేకూరుస్తుంది.


ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి స్వచ్ఛమైన పత్తితో చేసిన రెండు వత్తులు ఒకటిగా కలిపి వెలిగించి ఆ దీపాన్ని ఒక బ్రాహ్మణునకు దానంగా ఇవ్వాలి.

*తిలేభ్యః ఇదం తైలం*  అంటే నువ్వుల నుంచి తీసినదానికే తైలం అని పేరు. అందుకే నువ్వుల నూనె మాత్రమే వాడాలి. ఆ దీపం నుంచి వచ్చిన వెలుతురు చూడడం వలన మన కంటి శుక్లాలు కూడా తొలగి స్వచ్ఛమైన చూపును పొందగలం.


దీపదానం చేసే సమయాన చదువుకోవలసిన మంత్రం


*మృత్యునా  పాశదండాభ్యాం*

*కాలేన శ్యామలా సహా!*

*త్రయోదశ్యాం దీపదానాత్*

*సూర్యజః ప్రీయతాం మమ!!*



అలాగే ఈ రోజు ధన్వంతరి మహా మంత్రాన్ని కూడా జపించాలి.


*ఓం నమో భగవతే మహా సుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే*

*అమృతకలశ హస్తాయ సర్వ భయ వినాశాయ సర్వ రోగ నివారణాయ*

*త్రైలోక్య పతయే త్రైలోక్య నిధయే*

*శ్రీ మహావిష్ణు స్వరూప శ్రీ ధన్వంతరీ స్వరూప*

*శ్రీ శ్రీ శ్రీ ఔషధ చక్ర  నారాయణాయ స్వాహా*.


 ఈ రోజుదీప దానం చేసేవారు మరోక విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోండి.


అననుకూల, ప్రతికూల ఆలోచనలను మన నుంచి దూరం చేసి, మనకు ఆత్మస్థైర్యాన్ని కలగచేయడానికి మనము ఇచ్చే  అపమృత్యు దీపాన్ని ఆ యముని ప్రతినిధిగా మన నుంచి దానంగా స్వీకరించి, మనకు  ఆత్మ బలాన్ని ప్రసాదించే బ్రాహ్మణుడు ఎంత గొప్పవాడో ఆలోచించుకోవాలి.


అటువంటి బ్రాహ్మణోత్తముడిని గౌరవించడం నేర్చుకోండి.


సమాజాన్ని ప్రతికూల వాతావరణ నుంచి రక్షించి ధర్మాన్ని కాపాడే బాధ్యత వహించేవాడు బ్రాహ్మణుడు.


అందుకే హిందూ సమాజం నుంచి బ్రాహ్మణులను దూరం చేసే ప్రయత్నాలు సర్వత్రా జరుగుతున్నాయి. అటువంటి ప్రయత్నాలు వెనుక దురాలోచనలను గ్రహించి,

సమాజాన్ని కాపాడుకుందాం.


అంతేగాక భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి వచ్చిన పితృదేవతలు ఆశ్వీయుజ బహుళ అమావాస్య అనగా దీపావళి తర్వాత తిరిగి ఊర్దలోకాలకు బయలుదేరుతారు.


అందువలన నరక చతుర్దశి రోజు కాగడా వెలిగించి ఊర్ద్వలోకాలకు ప్రయాణమైన పితృదేవతలకు దారి చూపించడం అన్నది ఆనవాయితీగా వస్తోంది.


నరక చతుర్దశి రోజు అందరూ తప్పక యమతర్పణ విధి నిర్వహించాలి.


ధర్మశాస్త్రాన్ని అనుసరిద్దాం, ఆచరిద్దాం.

భావితరాలను తీర్చిదిద్దుదాం.

 మన ధర్మాన్ని మనమే కాపాడుకుందాం.


*మృశి*

(దశిక ప్రభాకర శాస్త్రి)

తలపులకు…* *తలుపులు వేయాలి!*

 080322F1701.   090322-4.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



                 *తలపులకు…*

           *తలుపులు వేయాలి!*

                 ➖➖➖✍️



*తాబేలు తనను తాను రక్షించుకోడానికి దాని మీద ఒక ధృఢమైన కవచం లాంటి డిప్ప ఒకటి సహజంగా అమర్చబడి ఉంటుది.*


*తాబేలు తనకు బయట నుండి ఏదైనా ఆపద సంభవిస్తుంది అని అనిపించిపుడు…      తన తలను, మిగిలిన అంగములను ఆ డిప్పలోకి లాక్కుంటుంది. అప్పుడు దానికి రక్షణ కలుగుతుంది.*


*అలాగే స్థిత ప్రజ్ఞుడు బయట ప్రపంచంలో ఉన్న విషయవాంఛల నుండి తనను తాను రక్షించుకోడానికి తన ఇంద్రియములను వెనక్కు లాక్కుంటాడు.*


*ఇది అర్థం కావాలంటే మనము ఆచరించ వలసిన సాధనల గురించి ముందు తెలుసుకోవాలి!*


*ఇంద్రియ నిగ్రహము అంటే ఇంద్రియములను అదుపులో ఉంచుకోవడం.*


*నిగ్రహము అంటే ఇంద్రియములను అణగతొక్కడం అని అర్థం తీసుకోకూడదు.*


*విపరీతంగా ఇంద్రియములతో స్పందించకూడదు. దేహమును అంటే ఇంద్రియములను నియంత్రించాలి.*


*సాధకుడికి ఇదిముఖ్యం. దీనినే ‘దమము’ అని అంటారు.*


*ఎందుకంటే ప్రాపంచిక విషయములకు ఇంద్రియములు విపరీతంగా స్పందిస్తుంటే నిరంతరం వాటి ప్రభావానికి లోనవుతాడు కానీ అతడికి ఉన్నతస్థితి లభించే అవకాశమే లేదు.*


*ఇంద్రియములనే ఎందుకు నియంత్రించాలి ముందు మనసును నియంత్రించవచ్చు కదా. అంటే ముందు బయటకు కనపడే ఇంద్రియములను నియంత్రించ గలిగితే మనసును నియంత్రించడం సులభం అవుతుంది. అందుకే ముందు ఇంద్రియ నిగ్రహముతో మొదలు పెట్టాలి.*


*సాధారణంగా ఇళ్లకు తలుపులు పెట్టుకుంటాము.     ఎందుకు.. ?అనవసరమైన వాళ్లు ఇంట్లోకి రాకుండా ముందు జాగ్రత్త.    ఇంకా కొంత మంది అనుమతి లేనిదే లోపలకు రాకూడదు అని బోర్డుకూడా పెడతారు. మన ఇంటికే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము కదా. మన శరీరంలోకి ఇంద్రియముల ద్వారా ఎన్ని అనవసరవిషయాలు ప్రవేశిస్తాయో తెలుసుకోవద్దా! వాటిని నిరోధించడానికి తలుపులు పెట్టుకోవాలి కదా! లేకపోతే మన శరీరం ఒక పబ్లిక్ టాయిలెట్ అయిపోతుంది.* 


*పబ్లిక్ టాయిలెట్ కు తలుపులు ఉండవు. ఎవరైనా వచ్చి పని కానిచ్చి పోవచ్చు. కాని వాళ్లు వదిలిన తాలూకు వాసనలు అక్కడే ఉంటాయి. అలాగే మన శరీరం తలుపులు తెరిచిపెడితే, బయట ప్రపంచంలో ఉన్న శబ్ద, స్పర్శ, రస, రూప,గంధములు అన్నీ యధేచ్ఛగా లోపలకు ప్రవేశిస్తాయి. వెళ్లిపోతాయి.* *కాని వాటి వాసనలు మాత్రం మనలను వదలవు. కాబట్టి ఇంద్రియ నిగ్రహము అనే తలుపులు మనం అమర్చుకోవాలి.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Srimadhandhra Bhagavatham

 Srimadhandhra Bhagavatham -- 50 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


హిరణ్యకశిపుడు తపస్సుకు బయలు దేరి బయటకు వచ్చి తన దగ్గర ఉండే మంత్రి, సామంత్రులందరినీ పిలిచి ‘శ్రీమన్నారాయణుడంతటి దుండగీడు ప్రపంచంలో ఇంకొకడు ఉండడు. అతడు చేతకాని వాడు పిరికివాడు. నా తమ్ముడిని సంహరించాడు. ఆ విష్ణువు మహామాయగాడు. అతను ఉండే స్థానములు కొన్ని ఉన్నాయి. అవే బ్రాహ్మణులు, యజ్ఞయాగాది క్రతువులు, హోమములు, వేదము, ఆవులు, సాధుపురుషులు, ధర్మము, అగ్నిహోత్రము మొదలయినవి. చెట్టు మొదలును కాల్చేస్తే పైన ఉండే పల్లవములు శాఖలు తమంతతాము మాడిపోతాయి. ఇలాంటివి ఎక్కడ కనపడినా ధ్వంసం చేయండి. ఎవడయినా తపస్సు చేస్తుంటే నరికి అవతల పారెయ్యండి. ఎవడయినా వేదము చదువుకుంటుంటే వాడిని చంపెయ్యండి’ అన్నాడు. ఆమాటలు వినడముతోనే భటులందరూ లోకం మీద పడ్డారు. ‘నేను అపారమయిన తపశ్శక్తి సంపన్నుడనయి ఈ మూడులోకములను నేను పరిపాలిస్తాను. విష్ణువనేవాడు ఎక్కడ కనపడినా సంహరిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ’ అని బయలుదేరి మంధరపర్వత చరియలలోకి వెళ్ళి తపస్సు మొదలుపెట్టాడు. మహా ఘోరమయిన తపస్సు చేశాడు. ఆయన కపాలభాగమునుండి తపోధూమము బయలుదేరి సమస్త లోకములను కప్పేస్తోంది. అస్థిపంజరం ఒక్కటే మిగిలింది. ఇటువంటి పరిస్థితులలో దేవతలు అందరూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి ‘ఈ హిరణ్యకశిపుని తపో ధూమముచేత మేమందరమూ తప్తమయి పోతున్నాము. నువ్వు తొందరగా వెళ్ళి ఆయనకు దర్శనం ఇచ్చి ఏమి కావాలో ఆయనను అడిగి ఆయన కోర్కె సిద్ధింపచేయవలసింది’ అన్నారు.

పక్కన దక్షప్రజాపతి భ్రుగువు మున్నగువారు కొలుస్తూ వుండగా స్వామి హంసవాహనము మీద ఆరూఢూడై వచ్చి తపస్సు చేస్తున్న హిరణ్యకశిపుని ముందుకు వచ్చి నిలబడి తన కమండలములో ఉన్న మంత్రజలమును తీసి పుట్టలు పట్టిపోయి వున్న హిరణ్యకశిపుని శరీరము మీద చల్లాడు. వెంటనే అతనికి అపారమయిన తేజస్సుతో కూడుకున్న నవయౌవనముతో కూడుకున్న శరీరం వచ్చింది. లేచివచ్చి సాష్టాంగ దండ ప్రణామము చేసి బ్రహ్మగారిని స్తోత్రం చేశాడు. ఆయన ‘నువ్వు దుస్సాధ్యమయిన తపస్సు చేశావు. నాయనా హిరణ్యకశిపా! నీవు ఏమి కోరుకుంటావో కోరుకో’ అన్నాడు.

‘తనకు మృత్యువు ఉండకూడదు. గాలిచేత చచ్చిపోకూడదు. ఏ దిక్కునుంచి వస్తున్న ప్రాణిచేత చచ్చిపోకూడదు. పైనచచ్చిపోకూడదు. క్రిందచచ్చిపోకూడదు. ఇంట్లోచచ్చిపోకూడదు. బయటచచ్చిపోకూడదు. ఆకాశంలోచచ్చిపోకూడదు. ప్రాణం ఉన్న వాటివలన చచ్చిపోకూడదు. ప్రాణం లేని వాటి వలన చచ్చిపోకూడదు. మృగముల చేత, పక్షుల చేత, యక్షుల చేత, గంధర్వుల చేత, కిన్నరుల చేత, దేవతల చేత, అస్త్రముల చేత, శస్త్రముల చేత, వీటి వేటి చేత పగలు కాని, రాత్రి కాని మరణములేని స్థితిని నాకు కటాక్షించు’ అని కోరాడు. ఈ కోరికను విని బ్రహ్మగారు ఆశ్చర్యపోయారు. తథాస్తు ఇచ్చేశాను. కొంచెం క్షేమంగా ఉండడం నేర్చుకుని లోకం గురించి అనుకూల్యతతో మంచినడవడితో ప్రవర్తించు సుమా’ అని చెప్పి హంసవాహనం ఎక్కి వెళ్ళిపోయారు.

హిరణ్యకశిపుడు రాజధానికి తిరిగి వచ్చి అందరిని పిలిచి ‘నేను వరములు పుచ్చుకుని వచ్చాను. విష్ణువు ఎక్కడ ఉన్నాడో పట్టుకొని సంహారం చేయాలి. పైగా ఇంద్రుడిని రాజ్యభ్రష్టుడిని చేయాలి. త్రిలోక్యాధిపత్యము పొందాలి’ అని చెప్పి పెద్ద అసుర సైన్యమును తీసుకొని ఇంద్రలోకము మీదికి యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ ఇంద్రునికి ఈ వార్త అంది ఎప్పుడయితే హిరణ్యకశిపుడు ఇన్ని వరములు పొందాడని తెలిసిందో ఇక వానితో యుద్ధం అనవసరం అనుకుని సింహాసనం ఖాళీ చేసాడు. హిరణ్యకశిపుడు వచ్చి అమరావతిని స్వాధీనము చేసుకున్నాడు. యజ్ఞయాగాది క్రతువులు లేనేలేవు. హవిస్సులన్నీ హిరణ్యకశిపుడికే భయంకరమయిన పాలన సాగిస్తున్నాడు.

దేవతలు అందరూ చాలా రహస్యమయిన సమావేశం ఒకటి పెట్టుకున్నారు. తమ కష్టములు తీర్చమని శ్రీమన్నారాయణుని ప్రార్థన చేస్తే అశరీరవాణి వినబడింది. ‘మీరందరూ దేనిగురించి బాధపడుతున్నారో నాకు తెలుసు. మీరు నాకేమీ చెప్పనవసరం లేదు. నేను సమస్తము తెలిసి ఉన్న వాడిని. నాకంటూ ఒక నియమం ఉన్నది. వాడు ధర్మము నుండి వైక్ల్యబ్యం పొందాలి. బాగా ధర్మం తప్పిపోవాలి. వాడిని చంపేస్తాను’ అని స్వామి ప్రతిజ్ఞచేశారు. ఆ పని వాడు ఎప్పుడు చేస్తాడో కూడా నేను మీకు చెప్తున్నాను. వానికి ఒక కొడుకు పుడతాడు. అతని పేరు ప్రహ్లాదుడు. మహాభక్తుడు. ప్రహ్లాదుని ఆపదల పాలు చేయడం ప్రారంభం చేస్తాడో ఆనాడు వానిని సంహరించేస్తాను. మీరెవ్వరూ బెంగపెట్టుకోకండి’ అన్నాడు. ఈ మాటలు విని దేవతలందరూ సంతోషించారు.

హిరణ్యకశిపునికి లీలావతికి ప్రహ్లాదుడు జన్మించాడు. ఆయన మహానుభావుడు. మహాజ్ఞాని. గురువులు కరచరణాదులతో కదిలివస్తున్న ఈశ్వరుడే అన్న భావన కలిగినవాడు. తనతో కలిసి చదువుకుంటున్న స్నేహితులను కేవలం స్నేహితులుగా కాక తన తోడబుట్టిన వాళ్ళలా చూసేవాడు. గురువులు చండామార్కులు ఉన్నది రాక్షస విద్యార్థులు. ఒక్కనాడు అబద్ధం ఆడింది లేదు. మిక్కిలి మర్యాద కలిగిన వాడు. ప్రహ్లాదుని సుగుణములు అన్నీ ఇన్నీ అని చెప్పడానికి కుదరదు. ప్రహ్లాదుడిని చూసిన హిరణ్యకశిపుడు ‘ఏమిటో కనపడ్డ వాళ్ళందరినీ హింసించడం, బాధపెట్టడం వాడి దగ్గర వీడి దగ్గర అన్నీ ఎత్తుకురావడం ఇలాంటి పనులు చేయకుండా ఏమిటో జడుడిలా కూర్చుంటాడు. తనలో తాను నవ్వుకుంటాడు. కళ్ళు మూసుకొని ఉంటాడు. ధ్యానం చేస్తూ ఉంటాడు. ఓ పుస్తకం పట్టుకోడు. వీడు రేపు పొద్దున్న సింహాసనానికి ఉత్తరాధికారి ఎలా అవుతాడు? ఎలా కూర్చుంటాడు? ఎలా పరిపాలన చేస్తాడు? రాక్షసులను ఎలా సుఖపెడతాడని బెంగపెట్టుకున్నాడు.

శుక్రాచార్యులవారి కుమారులయిన చండామార్కుల వారిని పిలిచాడు. 'మీ భ్రుగు వంశం మా రాక్షసజాతిని ఎప్పటినుంచో ఉద్ధరిస్తోంది. మా బిడ్డడయిన ప్రహ్లాదుడు జడుడిగా తిరుగుతున్నాడు. వీనికి నీతిశాస్త్రమో, ధర్మ శాస్త్రమో, కామశాస్త్రమో బోధ చెయ్యండి. వీనియందు కొంచెం కదలిక వచ్చి నాలుగు విషయములు తెలుసుకొని పదిమందిని పీడించడం నేర్చుకుంటే నా తరువాత సింహాసనం మీద కూర్చోవడానికి కావలసిన యోగ్యత కలుగుతుంది’ అని ప్రహ్లాదుని తీసుకువెళ్ళి చండుడు, మార్కుడికి అప్పచెప్పాడు.

ఆ రోజులలో రాజాంతఃపుర ప్రాంగణంనందు ఒక విద్యాలయము ఉండేది. అందులో గురువులు శిష్యులకు విద్యలు నేర్పుతూ ఉండేవారు. ప్రహ్లాదుడు చిత్రమయిన పని చేస్తుండేవాడు. ఆయన ఏకసంథాగ్రాహి గురువులు చెప్పిన విషయమును వెంటనే ఆయన మేధతో పట్టుకునేవాడు. తానుమాత్రం మరల బదులు చెప్పేవాడు కాదు. ఏమీ మాట్లాడేవాడు కాదు అన్నీ వినేవాడు. వాళ్ళు అర్థశాస్త్రం నేర్చుకోమంటే నేర్చుకునేవాడు. వాళ్ళు దుర్మార్గమయిన నీతులు చెబితే ఆ నీతులు నేర్చుకునే వాడు. అప్పటికి వాళ్ళు చెప్పింది నేర్చుకునే వాడు. అది మనస్సులోకి వెళ్ళలేదు. అనగా అంత దుష్ట సాంగత్యమునందు కూడా తన స్వరూపస్థితిని తాను నిలబెట్టుకున్న మహాపురుషుడు ప్రహ్లాదుడు. ఒకనాడు హిరణ్యకశిపునికి తన పిల్లవాని బుద్ధిని పరీక్షించాలని ఒక కోరిక పుట్టింది. గురువులు వెళ్ళి ‘మీరు చెప్పిన విధిని మేము నిర్వహించాము. మీ అబ్బాయి చాలా బాగా పాఠములు నేర్చుకున్నాడు’ అన్నారు. తన పిల్లవానిని సభామంటపమునకు పిలిచాడు. తన కొడుడు తన తొడమీద కూర్చుని అవన్నీ చెపుతుంటే సభలో ఉన్నవాళ్ళు చూసి తన కొడుకు తనకంటే మించినవాడని పొంగిపోవాలని ఆయన అభిప్రాయం. అందుకని సభకు పిలిపించాడు ప్రహ్లాదుడు వస్తూనే తండ్రికి సాష్టాంగ నమస్కారం చేశాడు. రెండు చేతులు చాపి తన పిల్లవాడిని ఎత్తుకున్నాడు. తన తొడమీద కూర్చోబెట్టుకుని ‘నీవు ఏమి నేర్చుకున్నావో ఏది నాలుగు మాటలు చెప్పు. నీవు నేర్చుకున్న దానిలో నీకు ఇష్టం వచ్చినది నీకు బాగా నచ్చింది ఏది ఉన్నదో అది ఒక పద్యం చెప్పు అని అడిగాడు. ప్రహ్లాదుడు

ఎల్ల శరీరధారులకు నిల్లను చీకటి నూతిలోపలం

ద్రెళ్లక వీరు నే మను మతిభ్రమణంబున భిన్నులై ప్రవ

ర్తిల్లక సర్వమున్నతని దివ్యకళామయమంచు విష్ణునం

దుల్లము జేర్చి తా రడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ !

ప్రతి జీవుడు ప్రతి శరీరధారి శరీరమును పొంది ఇల్లు అనే ఒక చీకటి నూతిలోకి దిగిపోయి అక్కడి నుంచి ‘నేను’, ‘మీరు’ అనే భావన పుట్టి అందులోంచి అహంకారం, మమకారం పుట్టి నా వాళ్లకు మేలు జరగాలి, ఎదుటి వాళ్లకు కీడు జరగాలి అనుకుంటూ ఉంటారు. నేను నా వాళ్ళు అనే భావనను విడిచి పెట్టి జగత్తంతా ఉన్నది పరబ్రహ్మమే అనుకుని గుర్తెరిగి వాడు ఘోరారణ్యములోకి వెళ్ళి కూర్చున్నా ఉద్ధరించ బడుతున్నాడు. ఇది తెలుసుకోకుండా ‘నేను’ ‘నాది’ అన్న భావన పెంచుకున్న వాడు ఊరినడుమ కూర్చున్నా అటువంటి వాని వలన కలిగే ప్రయోజనం ఏమీలేదు. ఎందుకు వచ్చిన దిక్కుమాలిన రాజ్యం. ఇంత తపస్సు చేసి నీవు ఏమి తెలుసుకుంటున్నావు? నీవు మార్చుకోవలసిన పధ్ధతి ఉన్నదని తండ్రితో మాట్లాడుతున్నాడు కనుక అన్యాపదేశంగా మాట్లాడాడు. ఇతని మాటలు విని హిరణ్యకశిపుడు తెల్లబోయాడు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersU...


instagram.com/pravachana_chakravarthy

పరమాచార్య - ప్రదోషం మామ

 పరమాచార్య - ప్రదోషం మామ


దయాసముద్రుడైన ఆ పరమేశ్వరుడే పరమాచార్య స్వామివారిలాగా ఈ భూమిపై అవతరించారు. కేవలం కొంత మంది మాత్రమే ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగారు. కొంతమంది వారి దివ్య లీలలను అనుభవిస్తూ, పొందుతూ ఉండిపోయారు. మరికొంతమంది వారి వైభవాన్ని, గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో నిమగ్నమయ్యారు. వీరు దాన్ని తమ జీవిత ధ్యేయంగా మలచుకొని మహాస్వామివారే అన్ని రోగాలను పోగొట్టే వైదీశ్వరుడని, చిదంబరంలోని నటరాజు అని ప్రజలకు తెలియజేయాలని జీవితాంతం శ్రమించారు. అటువంటి మహా భక్తుల్లో ఒకరు బ్రహ్మశ్రీ ప్రదోషం మామ.


పరమాచార్య స్వామివారు ప్రదోషం మామ యొక్క అనన్య భక్తికి ఎప్పుడూ బద్ధుడై ఉంటారు. మహాస్వామి వారు తనపై చూపిన కరుణని దయని ఎన్ని జన్మలకైనా తిర్చుకోలేనిదని అంటుంటారు ప్రదోషం మామ. పరమాచార్య స్వామి వారిపై మామ భక్తిని వారు నెలనెలా నిర్వహించే ఉత్సవాలలోనూ, సంవత్సరోత్సవాలు, జయంతి, మహారుద్ర, సువాసిని పూజల్లోనూ ప్రస్ఫుటంగా చూడవచ్చు.


మామ పదవి విరమణ పొందిన రైల్వే ఉద్యోగి. వారికి వచ్చే పెన్షన్ వారి కుటుంబానికి ఏమాత్రం సరిపోయేది కాదు. వారికి ఉన్న పెద్ద సంపదల్లా పరమాచార్య స్వామివారి ఆశీస్సులే. అదే వారికి ఇన్ని కార్యక్రమాలు చేయాడానికి తోడ్పడుతోంది. ఈ కార్యక్రమాల నిర్వహణ విషయంలో మామకి ఎవ్వరూ సాటి రారు.


ఒకసారి మహాస్వామి వారు మహాగావ్ లో మకాం చేస్తున్నారు. హఠాత్తుగా రామమూర్తి అయ్యర్ తో తమ భిక్షకి దానం సేకరించవలసిందిగా ఆదేశించారు. అక్కడున్న వారందరూ ఇది నమ్మలేకపోయారు. భిక్ష కోసం మహాస్వామి వారు ధనం అడగడం. రాజులు, జమీందారులు ఇచ్చిన ధనం పైనే ఎప్పుడూ స్వామివారు ఇష్టత చూపలేదు. వాటిని మఠం వారు స్వీకరించి వెంటనే అవసరంలో ఉన్నవారికి ఇచ్చివేసేవారు.


అలాంటిది స్వామివారి మాటలకు ఆశ్చర్యపోయారు. వారి ఆదేశం ప్రకారం రామమూర్తిగారు అక్కడున్న ఐదు మంది బ్రాహ్మణులతో 1500 పోగుచేశారు.

“ఇది అతనికి ఇవ్వు” అని అన్నారు స్వామివారు, ముద్దుగా 64వ నాయనారుగా పిలుచుకునే ప్రదోషం మామను చూపిస్తూ.


ఆరోజు మామకు ఇచ్చిన దానం మేరుపర్వతమంత అయి మామకు సహాయ పడింది. మరుసటి ప్రదోషం నాటికి తమని దర్శించడానికి వచ్చిన మామతో “ఆ దానం బ్యాంకులో వెయ్యి” అని చెప్పారు స్వామివారు. పరమాచార్య స్వామివారి కార్యక్రమములు, వేద సంరక్షణ, గో సంరక్షణ, దేవాలయ ఉత్సవాలు అన్నీ ఆ ధనంతోనే జరుగుతున్నాయి. ఇలా అనుగ్రహింపబడింది కేవలం ప్రదోషం మామ ఒక్కరే.


--- ‘లోకమాత’ 1996 దీపావళి ‘కల్కి’ విశిష్ట సంచిక నుండి


అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

భగవద్గీత శ్లోకం

 🙏 ప్రతిరోజూఒక్క భగవద్గీత శ్లోకం పారాయణం చేద్దాము, చేయిద్దాము 🙏

  🌿భగవద్గీత 1వఅధ్యాయం, అర్జున విషాద యోగం,🌿

               -------------------------------------------------

🌻46-వ,శ్లోకం- యది మామప్రతీకార, మశస్త్రం శస్త్రపాణయః| 

ధార్తరాష్ట్రా రణేహన్యుస్తన్మే క్షేమతరం భవేత్॥🌻

అర్థం- అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు! ఆయుధములు ధరింపకుండా, ఎవరిని ఎదిరించకుండా  ఉన్న నన్ను ఆయుధములు పట్టుకొని ఉన్న దుర్యోధనుడు మొదలైన వారు చంపినా కూడా అది నాకు మరింత క్షేమకరమే అవుతుంది.

               ---------------------------------------------------

  బంధువులను చంపిన పాపము నాకు అంటదు. బంధుమిత్రుల ప్రాణములు దక్కుతాయి. వీళ్లందరినీ కాపాడిన పుణ్యం నాకు మోక్షాన్ని  ప్రసాదిస్తుంది అని అర్జునుడు భావిస్తున్నాడు. 

   ఇక ఒకే ఒక్క శ్లోకంతో అర్జున విషాద యోగం పూర్తవుతుంది. అర్జున విషాద యోగంలో అనేక విషయాలు, అనేక ధర్మాలు మనం తెలుసుకున్నాము. ఎల్లుండి నుండి భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగం ప్రారంభం కాబోతోంది. శ్రీకృష్ణ పరమాత్మ నోటి నుండి వచ్చినటువంటి గీతామృత ధార  ప్రారంభం కాబోతోంది. భక్తిశ్రద్ధలతో చదువుతూ అనంతమైన జ్ఞానాన్ని సంపాదించుకుందాము.

 జ్ఞానేనతు కైవల్యం. జ్ఞానం ద్వారానే కైవల్య ప్రాప్తి కలుగుతుంది. రాధే కృష్ణ ,రాధే కృష్ణ ,రాధే కృష్ణ. 

------------------------------------------------------------------------------

🙏షేర్ చేసి కొన్ని కోట్లమంది ప్రజలు ప్రతిరోజు  ఒక్క భగవద్గీత శ్లోకం  అర్థంతో సహా పారాయణను చేసే అదృష్టాన్ని కల్పిద్దాము. శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని,ఈ భగవద్గీత పారాయణ మహాయజ్ఞ ఫలితాన్ని అందరం పొంది ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవిద్దాము. గీతామృతాన్ని అందరం త్రాగి ఆనందిద్దాము, 🙏

సాంప్రదాయ సౌభాగ్య విషయాలు.*

 *సాంప్రదాయ సౌభాగ్య విషయాలు.*


*పూజ:-*

పూర్వ జన్మ వాసనలను నశింపచేసేది, జన్మ మృత్యువులను లేకుండా చేసేది, సంపూర్ణ ఫలాన్నిచ్చేది.


*అర్చన:-*

అభీష్ట ఫలాన్నిచ్చేది, చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది, దేవతలను సంతోషపెట్టేది.


*జపం:-*

అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది. పర దేవతను సాక్షాత్కరింప చేసేది జపం, ఇది జీవుణ్ణి దేవుణ్ణి చేస్తుంది.


*స్తోత్రం:-*

నెమ్మది నెమ్మదిగా మనస్సుకి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.


*ధ్యానం:-*

ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింప చేసేది.


*దీక్ష:-*

దివ్య భావాలను కల్గించేది, పాపాలను కడిగివేసేది, సంసార బంధాల నుండి విముక్తిని కల్గించేది దీక్ష.


*అభిషేకం:-*

అభిషేకం చేస్తే చేయిస్తే సకల శుభాలు కలుగుతాయి, అభిషేకం అహంకారాన్ని పోగొట్టి పరతత్వాన్ని అందిస్తుంది.


*మంత్రం:-*

తత్త్వం గురించి మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం, అఖండ శక్తిని ఇస్తుంది.


*ఆసనం:-*

ఆత్మసిద్ధి కల్గించేది, రోగాలను పోగొట్టేది, క్రొత్త సిద్ధిని లేదా నవ సిద్ధులను కల్గించేది ఆసనం.


*తర్పణం:-*

పరివారంతో కూడిన పర తత్త్వానికి క్రొత్త ఆనందాన్ని కల్గించేది.


*గంధం:-* 

గంధంలో పరదేవత కొలువై ఉన్నారు. *”మేము కూడా మీ పూజలో ఉండేలా వరం ఇవ్వు తల్లీ” అని దేవతలంతా అమ్మవారిని కోరారు. అప్పుడు అమ్మవారు “మీరు గంధంలో కొలువై ఉందురుగాక” అని వరం ఇచ్చారు. అప్పటినుండి గంధానికి పూజలో ఉన్నత స్థానం లభించింది.*


*అక్షతలు:-*

కల్మషాలను పోగొట్టడం వల్ల తత్ పదార్ధంతో తదాత్మ్యాన్ని కల్గించేవి. పసుపు, కుంకుమ, నూకలు (విరిగిన బియ్యం) లేని మంచి బియ్యం కలిపి చేయాలి.


*పుష్పం:-*

పుణ్యాన్ని వృద్ధి చేసి, పాపాన్ని పోగొట్టేది మంచి బుద్ధిని ఇచ్చేది. *అలాగే ముండ్లు కలిగిన పువ్వులు వాడితే కష్టాలు వస్తాయి.* *మంచి సువాసన కలిగిన పువ్వులు వాడితే శుభం కలుగుతుంది.* *(ఈమధ్య పుష్పాలను చించి రేకలను విడదీసి వాడుతున్నారు. అలా చేయవద్దు. కాగా తొడిమలను తప్పకుండా తుంచి వేశాకే పుష్పాలను పూజలో వినియోగించాలి.*


*ధూపం:-*

చెడు వాసనల వల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది. పరమానందాన్ని ప్రసాదించేది. ధూపం ద్వారా చాలా మంచి జరుగుతుంది. *భూత, ప్రేత, పిశాచాలు పారిపోతాయి.*


*దీపం:-*

సుదీర్ఘమైన అఙ్ఞానాన్ని పొగొట్టేది. అహంకారం లేకుండా చేసేది. పర తత్త్వాన్ని ప్రకాశింప చేసేది. ఈ దీపం జ్ఞానానికి సంకేతం. పూజ గదిలో దీపం వెలిగిస్తే ఇంట్లో ఉన్న దుష్ట ప్రభావం దగ్గరికి రాదు. “అగ్ని” శివుడి కుమారుడైన కుమారస్వామికి ప్రతీక.


*నైవేద్యం:-*

మధుర పదార్థాలను నివేదన చేయుటయే నైవేద్యం.


*ప్రసాదం:-*

భగవంతుడికి నివేదించిన నైవేద్యమే ప్రసాదం. ప్రకాశానందాలనిచ్చేది, సామరస్యాన్ని కల్గించేది, పరతత్త్వాన్ని దర్శింపచేసేది ప్రసాదం. ప్రసాదం భగవదనుగ్రహ సంకేతం. అత్యంత పవిత్రమైన పదార్థం. *ఏ రూపంలోని ప్రసాదాన్నైనా “ప్రసాదం” అని మాత్రమే వ్యవహరించాలి. ఇటీవల అందరూ ‘పులిహోర’, ‘కొబ్బరి’ అని అనడానికి అలవాటు పడ్డారు. అలా అనకూడదు. “పులిహోర ప్రసాదం”, “కొబ్బరి ప్రసాదం” అనవచ్చు.*


*వందనం:-* అష్టాంగాలతో కూడిన నమస్కారం వందనం. చేతులు జోడించి కూడా వందనం చేయవచ్చు. సాష్టాంగ ప్రణామం అంటే వక్షస్థలం, శిరస్సు, మనస్సు, మాట, పాదాలు, కరములు, కర్ణాలు, నేలకు తాకించి చేసేది వందనం. ఈ సాష్టాంగ ప్రణామం పురుషులు మాత్రమే చేయాలి ఇది స్త్రీలు చేయరాదు. స్త్రీలు మోకాళ్ళపై భగవంతుడికి వందనం చేయొచ్చు.


*ఉద్వాసన:-*

దేవతలను, ఆవరణ దేవతలను పూజించి, పూజను ముగించడాన్ని ఉద్వాసనమని అంటారు. చివర్లో ప్రార్థన, దోష క్షమాపణ చెప్పి తీర్థ, ప్రసాదాలు స్వీకరించి స్వస్తి చెప్పి ఉద్వాసన చేయవలసి ఉంటుంది.

🙏🙏🙏🙏🙏🙏🙏

పాక్షిక సూర్యగ్రహణం

 *పాక్షిక సూర్యగ్రహణం*


తేదీ : 25 అక్టోబర్ 2022

ప్రారంభ సమయం : మ. గం.2.28 ని.లకు

ముగింపు సమయం : సా. గం. 6.32 ని.లకు

వారం: మంగళవారం

తిథి : ఆశ్వయుజ అమావాస్య

నక్షత్రం : స్వాతి

రాశి : తుల

గ్రహం : కేతువు


సూర్యగ్రహణం అమావాస్యనాడు. ఏర్పడుతుంది. ఈసారి 24వ తేదీ సా. గం. 5.28 ని.ల నుంచి 25వ తేదీ సా.గం. 4.19 ని.ల వరకు అమావాస్య తిథి ఉంది. రాత్రిపూట నిర్వహించుకునే దీపావళి పండుగను 24నాడే నిర్వహించుకోవాలి. గ్రహణం కారణంగా 25 నాడు నియమాలను పాటించాలి.


సాధారణ నియమాలు: 


గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు. గ్రహణం ప్రారంభమయ్యే లోపుగా అరిగిపోయేలా భోజనం పూర్తి చేసుకోవాలి. నిత్యావసర వస్తువులపై దర్భలు ఉంచాలి. గ్రహణ సమయంలో దానం, జపం వంటివి నిర్వహించేవారు. ప్రారంభ సమయంలో పట్టుస్నానం చేస్తారు. గ్రహణం పూర్తయ్యాక చేసే విడుపు స్నానాన్ని మాత్రం అందరూ విధిగా చేయాలి. గృహశుద్ధి చేసుకోవాలి.


పైన పేర్కొన్న నక్షత్రం, రాశులకు చెందినవారు గ్రహణాన్ని చూడకూడదు. దోష పరిహారం కోసం మరునాడు శివాలయ దర్శనం, అభిషేకం మంచిది. మీన, కర్కాటక, తుల, వృశ్చిక రాశుల వారు కూడా ఈ పరిహారాలు చేసుకోవడం శ్రేయస్కరం.


🚩 * 🚩