23, అక్టోబర్ 2022, ఆదివారం

పాక్షిక సూర్యగ్రహణం

 *పాక్షిక సూర్యగ్రహణం*


తేదీ : 25 అక్టోబర్ 2022

ప్రారంభ సమయం : మ. గం.2.28 ని.లకు

ముగింపు సమయం : సా. గం. 6.32 ని.లకు

వారం: మంగళవారం

తిథి : ఆశ్వయుజ అమావాస్య

నక్షత్రం : స్వాతి

రాశి : తుల

గ్రహం : కేతువు


సూర్యగ్రహణం అమావాస్యనాడు. ఏర్పడుతుంది. ఈసారి 24వ తేదీ సా. గం. 5.28 ని.ల నుంచి 25వ తేదీ సా.గం. 4.19 ని.ల వరకు అమావాస్య తిథి ఉంది. రాత్రిపూట నిర్వహించుకునే దీపావళి పండుగను 24నాడే నిర్వహించుకోవాలి. గ్రహణం కారణంగా 25 నాడు నియమాలను పాటించాలి.


సాధారణ నియమాలు: 


గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు. గ్రహణం ప్రారంభమయ్యే లోపుగా అరిగిపోయేలా భోజనం పూర్తి చేసుకోవాలి. నిత్యావసర వస్తువులపై దర్భలు ఉంచాలి. గ్రహణ సమయంలో దానం, జపం వంటివి నిర్వహించేవారు. ప్రారంభ సమయంలో పట్టుస్నానం చేస్తారు. గ్రహణం పూర్తయ్యాక చేసే విడుపు స్నానాన్ని మాత్రం అందరూ విధిగా చేయాలి. గృహశుద్ధి చేసుకోవాలి.


పైన పేర్కొన్న నక్షత్రం, రాశులకు చెందినవారు గ్రహణాన్ని చూడకూడదు. దోష పరిహారం కోసం మరునాడు శివాలయ దర్శనం, అభిషేకం మంచిది. మీన, కర్కాటక, తుల, వృశ్చిక రాశుల వారు కూడా ఈ పరిహారాలు చేసుకోవడం శ్రేయస్కరం.


🚩 * 🚩

కామెంట్‌లు లేవు: