31, జనవరి 2026, శనివారం

మహాభారతము

 🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*శనివారం 31 జనవరి 2026*

``

            *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                    1️⃣2️⃣1️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*       

     

                    *121 వ రోజు*                 

*వన పర్వము పంచమాశ్వాసము*


*అగ్ని సముద్రములో దాగుట*```


కార్యభారంతో అలసి పోయిన అగ్ని అధర్వునితో ఇలా చెప్పాడు.. 

“యజ్ఞయాగాదులలో సమర్పించే హవిస్సులను దేవతల కందించి నేను అలసి పోయాను. ఇకపై ఆ కార్యాన్ని నీవు నిర్వహించు!” అని చెప్పి అగ్ని సముద్రంలో దాక్కున్నాడు. 


దేవతలందరూ అగ్ని ఎక్కడున్నాడో తెలియక వెదక సాగారు. ఇంతలో సముద్రంలోని చేపలు అగ్ని సముద్రంలో దాక్కుని ఉన్న విషయం దేవతలకు అందించాయి. 


అగ్నిదేవుడు ఆగ్రహించి”మీ చేపజాతిని మానవులు నిర్ధయులై తినెదరు కాక!”అని శపించాడు. 


దేవతలంతా “అగ్నిదేవా! నీవు యధావిధి మాకు హవిస్సులను అందించు!” అని అడిగారు. 


కాని అందుకు అగ్ని సమ్మతించక శరీరాన్ని విడిచి భూమిలో ప్రవేశించాడు. భూమి పై పడిన అగ్ని నుండి అనేక ధాతువులు ఆవిర్భవించాయి. చీము నుండి గంధకం, ఎముకల నుండి దేవదారు వృక్షములు, కఫం నుండి కర్పూరం, పిత్తం నుండి పచ్చలు, వాతము నుండి నల్లటి పాషాణము, గోళ్ళనుండి అభ్రకము, రక్తనాళముల నుండి పగడములు ఏర్పడ్డాయి. 


అగ్ని దేవుడు భూగర్భంలో తపస్సు చేసుకుంటున్నాడు. అధర్వుడు అగ్ని కార్యములన్నీ నిర్వహిస్తున్నాడు. దేవతలంతా అధర్వుని పూజిస్తున్నారు. అధర్వుని కాంతిని దేవతలు అతనిచే తృప్తి పడటాన్ని ఓర్వలేక అగ్ని బయటకు వచ్చి మరల హవిస్సును అందిస్తానని ముందుకు వచ్చాడు. 

ధర్మరాజా ఆ విధంగా ఎందరో అగ్నులు ఉన్నా అందరిలో వెలిగే అగ్ని ఒకటే!” అన్నాడు మార్కండేయుడు. ```


           *కుమారస్వామి*```


ధర్మరాజు “మహర్షీ! మహాసేనాని అని పిలువబడే కుమారస్వామి అగ్నిదేవునికి, కృత్తికలకు, శివునకు కుమారుడెలా అయ్యాడు?” అని అడిగాడు.```


                  *దేవసేన*```


మార్కండేయుడు “ధర్మరాజా! పూర్వం దేవేంద్రుడు రాక్షసులతో యుద్ధం చేసి ఓడి పోయాడు. రాక్షసులను గెలవడమెలా అని దేవేంద్రుడు మానస అనే కొండ మీద ఆలోచించే సమయంలో ఒక స్త్రీ ఆర్తనాదం వినపడింది. దేవేంద్రుడు ఆ స్త్రీని రక్షించాలని వెళ్ళి కేశి అనే రాక్షసుడు ఒక స్త్రీని ఆకాశమార్గంలో తీసుకు వెళ్ళడం చూసాడు. దేవేంద్రుడు తనవజ్రాయుధంతో అతనిని వెంబడించాడు. అతడు తన గధాయుధాన్ని ఇంద్రుని మీద విసరగా ఇంద్రుడు వజ్రాయుధంతో గధను ముక్కలు చేసాడు. కేశి ఆస్త్రీని వదిలి పారిపోయాడు. ఇంద్రుడు ఆ కన్యను చూసి “నీవెవరు? ఈ రాక్షసుడికి ఎందుకు చిక్కావు?” అని అడిగాడు. 


ఆమె “అయ్యా! నాపేరు దేవసేన, 

నా అక్క పేరు దైత్యసేన. మేము అరిష్టనేమి అనే ప్రజాపతి పుత్రికలము. మేము ఇక్కడ విహరిస్తుండగా ఈ రాక్షసుడు కామచేష్టలతో మమ్ము వేధిస్తున్నాడు. నా సోదరి దైత్యసేనకు అవి నచ్చాయి ఆమె అతనితో వెళ్ళింది. నాకు నచ్చలేదు కనుక నేను వెళ్ళలేదు. అతడు అంతటితో ఆగక తిరిగి వచ్చి నన్ను బలవంతంగా తీసుకు పోతున్నాడు. ఆ సమయంలో తమరు వచ్చి నన్ను రక్షించారు” అని చెప్పింది. ఇంద్రుడు మీ తల్లి,మాతల్లి దక్షుని పుత్రికలు. అందు వలన నీవు నాకు సోదరివి. నీకేం వరం కావాలో కోరుకో!” అని దేంద్రుడు అడిగాడు. 


ఆమె “దేవేంద్రా! మా తండ్రి నా చిన్నతనం నుండి నాకు మహా పరాక్రమవంతుడు, కీర్తిప్రతిష్టలు కల వాడు భర్తగా రాగలడని చెప్పాడు. ఆ మాటను మీరు నిజం చెయ్యండి. దేవతలకు రాక్షసులకు గెలువ శక్యం కాని వాడు, భయంకరమైన రాక్షసులను సంహరించే వాడు, ముల్లోకాలను రక్షించే వాడు, నీకు ఇష్టమైన వాడిని నాకు భర్తగా ప్రసాదించు!” అని కోరింది. 


ఆమె మాటలు విని దేవేంద్రుడు.. 

“ఈ రోజు అమావాస్య. సూర్యచంద్రులు ఏక రాశిలో ఉంటారు. ఇది సూర్యోదయం. రౌద్ర ముహూర్తం. అగ్ని మునులు అర్పించిన హవిస్సులను తీసుకుని సూర్య మండలంలో ప్రవేశిస్తున్నాడు. కనుక సూర్యుడు, చంద్రుడు, అగ్ని తేజములతో జన్మించిన వాడు ఈమెకు భర్త కాగలడు” అని అనుకున్నాడు. 

దేవసేనను తీసుకుని బ్రహ్మ వద్దకు వెళ్ళి దేవసేనకు తగిన భర్తను ప్రసాదించమని కోరాడు. 


బ్రహ్మదేవుడు “దేవేంద్రా! ఈ కన్యకు గొప్ప వీరుడు భర్త కాగలడు. అతడు దేవసేనకు సేనాధిపతి కాగలడు. నీ కష్టములు తీర్చగలడు” అన్నాడు.```


              *సశేషం*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

త్యాగరాజ స్వామి

 🙏🌺ఇది చాలా అరుదయిన త్యాగరాజ స్వామి వారి పటాలలో ఒకటి🌺🙏   


🌺ఆ రోజుల్లో బహుశః చిత్రకారులు కొన్ని సన్నివేశాల్నీ ఘట్టాలనీ తమ చిత్రాలలో భద్ర పరచేవారు కాబోలు తరువాతి తరాలకి!.

వెనక గుమ్మం దగ్గర నిలుచున్నావిడ ఆయన సతీమణి. ఈ వర్ణచిత్రం గురించి వెనక పెద్దలు ఒక మాట చెప్పగా నాకు జ్ఞాపకానికొచ్చింది! అది.....

ఒక పర్యాయం త్యాగయ్య గారింటికి సాయంవేళ కొంతమంది అతిథులొచ్చేరుట! శ్రీ త్యాగయ్య ఒక సామాన్య గృహస్తు. రాముని నమ్ముకొని ఆయన మీద కీర్తనలు అల్లి పాడుకుంటూ జీవిస్తున్న వ్యక్తి. ఇంట్లో తగినన్ని దినుసులు లేవని చింతిస్తూ శ్రీ రాముణ్ణి ధ్యానిస్తున్నాడు. ఇంతలో తలుపు ఎవరో కొట్టిన చప్పుడయింది. లేచి తలుపు తీసేడు శ్రీ త్యాగయ్య. ఒక అయిదుమంది పురుషులూ ఒక స్త్రీ కొన్ని మూటలతో నిలబడి ఉన్నారు. అందులో ఒకతను,.🌺

🌺'అయ్యా! మేం యాత్రలో ఉన్నాం. మాదగ్గర వండుకోవడానికి దినుసులున్నాయి. అయితే పాత్ర సామగ్రి లేదు..కాబట్టి మీ ఇంట్లో వండుకోనిస్తారా?' అనడిగేడు. త్యాగయ్య చాలా సాదరంగా అనుమంతించేడు! వారు తమ వస్తువులతో అక్కడున్న వారందరికీ వండి వడ్డించి త్యాగయ్యగారి దగ్గర శెలవు తీసుకోడానికి వచ్చేరు. నాద బ్రహ్మకి అనుమానం వచ్చింది! నిలదీసేడు! అంతే...వారంతా తమ స్వస్వరూపాలతో శ్రీ హన్మత్సమెత సీతారామ భరత, లక్ష్మణ, శత్రుఘ్నులుగా దర్శనం ఇచ్చేరు. త్యాగయ్య పొంగిపోయేడు!🌺

🌺అదీ ఈపటం

ఏవండీ ఇలా ఎక్కడయినా జరుగుతుందా?...అనడిగితే సమాధానం ఒక్కటే...జరుగుతుంది. తన్ను నమ్మిన భక్తుని సమస్య తీర్చటానికి భగవానుడు వస్తాడు. అది తన కర్తవ్యమని ఆయనే రామాయణంలో చెప్పుకున్నాడు.


 మంగళం మహత్.🌺

పంచాంగం 31.01.2026 Saturday, పంచాంగం 31.01.2026 Saturday,

  ఈ రోజు పంచాంగం 31.01.2026 Saturday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాస శుక్ల పక్ష త్రయోదశి తదుపరి చతుర్దశి తిథి స్థిర వాసర పునర్వసు నక్షత్రం నిష్కంభ యోగః తైతుల తదుపరి గరజి తదుపరి వణిజ కరణం.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు. 

  


శ్రాద్ధ తిథి: చతుర్దశి


 

నమస్కారః , శుభోదయం

ఆర్యా శతకం - 1*

  *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 15*


*అంకితశంకరదేహామంకురితో రోజకంకణాశ్లేషైః ।*

*అధికాంచి నిత్యతరుణీమద్రాక్షం కాంచిదద్భుతాం బాలామ్ ||*


*భావము :*


*ఒక నిత్య యౌవన యైన బాలా స్వరూపము శంకరుని దేహమును తన అంకిత సీమగా చేసుకున్నపుడు, ఆమె కౌగిలింతల అంకములు ఈశ్వరుని శరీరముపై ఏర్పడినవి. అటువంటి జగన్మాతను నేను కాంచీపురములో తిలకించాను.*


🙏🙏🙏*శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

భగవద్గీత

  -------------------- భగవద్గీత. -------------------

ద్వితీయోధ్యాయ: సాంఖ్య యోగము.


శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా ।

సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి ।। 53 ।।


ప్రతిపదార్థ:


శృతి-విప్రతిపన్నా — కామ్య కర్మ కాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా; తే — నీ యొక్క; యదా — ఎప్పుడైతే; స్థాస్యతి — ఉండునో; నిశ్చలా — నిశ్చలంగా; సమాధౌ — భగవంతుని యందు; అచలా — స్థిరముగా; బుద్ధిః — బుద్ధి; తదా — అప్పుడు; యోగం — యోగము; అవాప్స్యసి — నీవు పొందెదవు.


 తాత్పర్యము :


కామ్య కర్మ కాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని యందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగ స్థితిని పొందెదవు.


  

 వివరణ:


సాధకులు ఆధ్యాత్మిక పథంలో పురోగమించేటప్పుడు తమ మనస్సులో వారికి భగవంతునితో సంబంధం బలపడుతూ ఉంటుంది. ఆ సమయంలో, తాము పూర్వం చేసే వైదిక కర్మలు ప్రతిబంధకంగా, సమయం తీసుకునేవిగా అనిపిస్తాయి. తమ భక్తితో పాటుగా ఇంకా పూజలు మొదలగునవి చేయాలా అని అనుకుంటారు మరియు పూజాది కార్యాలను వదిలి పూర్తిగా సాధనలో నిమగ్నమైతే ఏదైనా తప్పు చేసినట్టవుతుందా అని సంశయ పడతారు. ఇలాంటి వారు తమ సందేహానికి ఈ శ్లోకంలో జవాబు తెలుసుకొంటారు. కోరికలను తీర్చే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా సాధన లోనే నిమగ్నం అవటం తప్పు కాదని, పైగా అది ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.


మాధవేంద్ర పూరి అనే ప్రఖ్యాత 14వ శతాబ్ద ముని చాలా దృఢంగా ఈ భావాన్ని వ్యక్తం చేస్తాడు. అతను ఒకప్పుడు విస్తృతమైన కర్మకాండ ఆచారాలు పాటించే ఒక వేద బ్రాహ్మణుడు, కానీ సన్యాసం తీసుకుని, పరిపూర్ణంగా శ్రీ కృష్ణభక్తిలో నిమగ్నమైపోయాడు. తన జీవిత తదుపరి దశలో, ఇలా అన్నాడు:


సంధ్యా వందన భద్రమస్తు భవతే


భోః స్నాన తుభ్యం నమః

భో దేవాః పితరశ్చతరపణ విధౌ


నహం క్షమః క్షమ్యతాం


యత్ర క్వాపి నిషద్య యాదవ కులోత్


తాస్య కంసద్విషః

స్మారం స్మారమఘం హరామి తదలం


మన్యే కిమన్యేన మే


 


‘అన్ని వైదిక ఆచారాలకి నా క్షమార్పణ అర్పిస్తున్నాను, ఎందుకంటే వాటిని పాటించటానికి ఇక నావద్ద సమయం లేదు. కాబట్టి ఓ ప్రియమైన, సంధ్యా వందనము (ఉపనయనం జరిగి యజ్ఞోపవీతం పొందినవారు రోజుకు మూడు సార్లు చేసే వైదిక ప్రక్రియ), పుణ్య స్నానాలు, యజ్ఞయాగాదులు, పితృకర్మలు వంటివి, దయచేసి నన్ను క్షమించండి. ఇప్పుడు, నేనెక్కడ కూర్చున్నా, కంస విరోధి అయిన శ్రీ కృష్ణ పరమాత్మనే ధ్యానిస్తున్నాను, అది చాలు నన్ను ఈ భౌతిక బంధాల నుండి విడిపించటానికి.’


శ్రీ కృష్ణుడు 'సమాధౌ-అచలా' అన్న పదాన్ని, భగవంతుని ధ్యాసలో ఉండే దృఢ సంకల్పాన్ని సూచించటానికి, ఈ శ్లోకంలో ఉపయోగించాడు. 'సమాధి' అన్న పదం 'సమ్' (సమత్వము) మరియు 'ధి' (బుద్ధి) అన్న మూలధాతువుల నుండి ఏర్పడింది, అంటే 'పరిపూర్ణ సమత్వ బుద్ధి స్థితి'. ఉన్నతమైన చైతన్యంలో స్థిర బుద్ధి కలిగి, ప్రాపంచిక భౌతిక ప్రలోభాల పట్ల మోహితుడు కానివాడు, ఆ యొక్క 'సమాధి' అంటే సంపూర్ణ యోగ స్థితిని పొందుతాడు.

31-01-2026 శనివారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

31-01-2026 శనివారం రాశి ఫలితాలు


మేషం


ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. నూతన వస్తు వాహనాలు చేస్తారు. ఇంటాబయట నూతన ప్రణాళికలను అమలు పరుస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది.

---------------------------------------


వృషభం


ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనులను మరింత మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు కలసి వస్తాయి. ఉద్యోగమున అధికారులతో సమస్యలు కలుగుతాయి.

---------------------------------------


మిధునం


ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులలో మీ శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. ఇంటాబయట నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు వివాదాలు తీరి ఊరట చెందుతారు.

---------------------------------------


కర్కాటకం


రాజకీయ సంబంధిత సమావేశాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన ఉద్యోగ యత్నాలు కలసి వస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగమున మీ పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.

---------------------------------------


సింహం


దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. సోదరుల నుండి ధన పరమైన ఇబ్బందులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

---------------------------------------


కన్య


ముఖ్యమైన వ్యవహారాలలో పరిస్థితులు అనుకూలించవు. వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరంగా ఆలోచనలో స్థిరత్వం ఉండదు. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు.

---------------------------------------


తుల


గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమ ఫలిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో చికాకులు అధిగమించి ముందుకు సాగుతారు.

---------------------------------------


వృశ్చికం


చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నవి. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి.

---------------------------------------


ధనస్సు


దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతాయి.

---------------------------------------


మకరం


ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. చేపట్టిన పనులలో స్థిరమైన ఆలోచనలు చేయలేరు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. నిరాశ కలుగుతుంది. ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పవు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి.

---------------------------------------


కుంభం


కీలక వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరించి మీ మాటకు విలువ పెంచుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. వ్యాపారాలలో నూతన నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. 

---------------------------------------


మీనం


దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. అధిక శ్రమతో స్వల్ప ఫలితం పొందుతారు. చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వ్యాపార ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

---------------------------------------

31జనవరి2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     *🍁శనివారం🍁*

*🌹31జనవరి2026🌹*   

 *దృగ్గణిత పంచాంగం* 

                 

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*మాఘమాసం - శుక్ల పక్షం*


*తిథి  : త్రయోదశి* ‌ఉ 08.25 *చతుర్దశి* రా.తె 05.52 వరకు

*వారం    : శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం  : పునర్వసు* రా 01.34 వరకు ఉపరి *పుష్యమి*

*యోగం : విష్కుంబ* మ 01.33 వరకు ఉపరి ప్రీతి

*కరణం  : తైతుల* ఉ 08.25 *గరజి* రా 07.07 ఉపరి  

*వణజి* రా.తె 05.52 వరకు ఆపైన *భద్ర*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 11.00 - 01.00 సా 05.00 - 06.00*

అమృత కాలం  : రా 11.21 - 12.49

అభిజిత్ కాలం  : ప 11.58 - 12.44

*వర్జ్యం    : మ 02.30- 03.59*

*దుర్ముహూర్తం  :ఉ 06.39-08.10*

*రాహు కాలం   :ఉ 09.30-10.55*

గుళికకాళం      : *ఉ 06.39- 08.04*

యమగండం    : *మ 01.47 - 03.12*

సూర్యరాశి : *మకరం*                      

చంద్రరాశి : *మిధునం/కర్కాటకం*

సూర్యోదయం :*ఉ 06.48*

సూర్యాస్తమయం :*సా 06.11*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం         :*ఉ 06.39- 08.55*

సంగవ కాలం         :*08.55 - 11.12*

మధ్యాహ్న కాలం    :*11.12 - 01.29*

అపరాహ్న కాలం    : మ *01.29-03.46*

*ఆబ్ధికం తిధి  :మాఘ శుద్ధ చతుర్దశి*

సాయంకాలం    :*సా 03.46- 06.03*

ప్రదోష కాలం      :*సా 06.03- 08.34*

రాత్రి కాలం         :*రా 08.34- 11.56*

నిశీధి కాలం       :*రా 11.56 - 12.46*

బ్రాహ్మీ ముహూర్తం : తె *04.58-05.48*

******************************

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🙏శ్రీ వేంకటేశ్వర స్తోత్రం🙏*


*కమలా కుచ చూచుక కుంకుమతో* 

*నియతారుణితాతుల నీలతనో*

*కమలాయతలోచన లోకపతే* 

*విజయీ భవ వేంకటశైలపతే*


*!!.ఓం నమో వెంకటేశాయ నమః.!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️


        *🍁శ్రీ ఆంజనేయ🍁*

*🍁సహస్రనామ స్తోత్రమ్.!!🍁*


*అనాదిగర్భగవాన్ దేవో* 

*విశ్వ హేతుర్జనాశ్రయః*

*ఆరోగ్యకర్తా విశ్వేశో*

*విశ్వనాధో హరీశ్వరః.!!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - మాఘ మాసం - శుక్ల పక్షం - త్రయోదశి & చతుర్దశి - పునర్వసు -‌‌ స్థిరవాసరే* (31.01.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*