21, జూన్ 2026, ఆదివారం

తిప్పతీగ ఉపయోగాలు -

 తిప్పతీగ ఉపయోగాలు - 


చేలల్లో చెట్లల్లో కంచల్లో విరివిగా పెరిగేటువంటి తీగలలో తిప్పతీగ ఒకటి కొంచెం ఆయుర్వేద పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా తిప్పతీగను గుర్తించవచ్చు తిప్పతీగ ఆకులని నమిలితే కొంచెం చేదుగా ఉంటాయి తిప్పతీగ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకు తెలుసు కరోనా అప్పుడు ఆనందయ్య గారు కరోనాకు మందు తయారు చేశారు ఆ మందు వల్ల చాలామంది వ్యాధిగ్రస్తులు వ్యాధి నుంచి విముక్తి పొంది జీవించాలన్నది సత్యం ఆనందయ్య గారు తయారు చేసిన మందు లో ప్రధానమైన మూలిక తిప్పతీగానే మనలో ఎంతమందికి తెలుసు నిజానికి తిప్పతీగ వల్ల అనేక రకాల వ్యాధులు నివారణ చెందటమే కాకుండా మనలోపడా వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీని బాగా బలపరుస్తుందని అంటారు ఇప్పుడు తిప్పతీగ మాత్రలు కూడా మనకు పతంజలి ఆయుర్వేదం నుండి లభిస్తున్నాయి వాటిని వాడు విధానము అందులో పొందుపరిచి ఉంది దాని ప్రకారం ఆ మాత్రలను తీసుకొని సభ్యులు ఇమ్యూనిటీని పెంపొందించుకోవాలని ఆశిస్తున్నాను


      తిప్పతీగ అనునది ప్రతి వూరు డొంకలలో పెరుగుతుంది . దీనిని సంస్కృతంలో " గుడూచీ" అని పిలుస్తారు . దీనికి అర్థం వ్యాధుల నుండి రక్షించునది అని అర్థం.  " అమృత" అనే పేరు కూడా దీనికి కలదు. అనగా అమృతమునకు సమానం అయినది అని అర్థం.


            ఇప్పుడు మీకు దీనిలోని ఔషధ గుణముల గురించి మీకు వివరిస్తాను. 




  తిప్పతీగ యందలి ఔషధ గుణములు  - 




 *  ఇది వాత , పిత్త , కఫ దోషముల మూడింటి మీద పనిచేస్తుంది . బలకరము , ఆకలిని పెంచుతుంది . మెదడుకు మంచిది . నేత్రములకు బలాన్ని ఇచ్చును. పాండు , కామెర్లు , జ్వరము , మూత్రవ్యాధులు , కుష్ఠు , దగ్గు మొదలగు వ్యాధులను పోగొట్టును . కడుపులోని నులిపురుగులను నశింపచేయును . తల్లిపాలను శుద్ధిచేయును . 




 *  జ్వరములలో తిప్పతీగ కషాయం 20ml ఉదయము , సాయంత్రం ఇచ్చిన జ్వరములు తగ్గును. 




 *  మూత్రసంబంధ వ్యాధులలో తిప్పతీగ రసములో తేనె కలిపి ఇవ్వాలి. కామెర్ల యందు కూడా తిప్పతీగ రసములో ప్రతిరోజూ తేనె కలిపి ఇచ్చిన కామెర్ల సమస్య తగ్గును. 




 *  కీళ్లనొప్పుల యందు తిప్పతీగ , శొంఠి కలిపి ఇచ్చిన కీళ్లనొప్పులు తగ్గును. 




 *  ప్రతిరోజూ తిప్పతీగ రసం తాగించి రోగి బలానుసారం కందికట్టులో నెయ్యి చేర్చిన అన్నము తినుచున్న కుష్ఠు వ్యాధి తగ్గును. 




 *  తిప్పతీగ రసమును ప్రతిరోజూ ఉదయం , సాయంత్రం ఒక నెలరోజుల పాటు సేవిస్తే ఏ వ్యాధులు రాకుండా , ముసలితనం రాకుండా మానవుడు ఆరోగ్యముగా ఉండును. 




 *  తిప్పతీగ చూర్ణము , బెల్లం , నెయ్యి , తేనె కలిపి ముద్దగా చేసి ఉండలా చేసి రోజూ ఒక ఉండ తింటే మానవుడు ఆరోగ్యముగా 100 సంవత్సరాలు జీవిస్తాడు. 




 *  తిప్పతీగ రసం కొద్దిగా నూనెలో కలిపి తాగిన బోదకాలు తగ్గును. 




 *  తిప్పతీగ కషాయంలో పిప్పలి చూర్ణం కలిపి ఇచ్చిన చాలా రోజుల నుంచి వేధిస్తున్న జీర్ణజ్వరం తగ్గును. 




 *  తిప్పతీగ కషాయం ప్రతిరోజూ సేవించిన మధుమేహం తగ్గును. మూత్రాశయపు రాళ్లు కూడా కరిగిస్తుంది. 




 *  మొలల సమస్య ఉన్నవారు తిప్పతీగ స్వరసాన్ని మజ్జిగతో కలిపి వాడవలెను .

20, జూన్ 2026, శనివారం

స్నేహ సంబంధం

 💐స్నేహ సంబంధం ఎలా ఉండాలి ?


💐పాపాన్నివారయతి యోజయతే హితాయ

గుహ్యం చ గూహతి గుణాన్ ప్రకటీకరోతి ।

ఆపద్గతం చ న జహాతి దదాతి కాలే

సన్మిత్రలక్షణమిదం ప్రవదంతి సంతః ॥


ఉత్సవే వ్యసనే చైవ

దుర్భిక్షే శత్రు సంకటే ।

రాజద్వారే శ్మశానే చ

యస్తిష్ఠతి స బాంధవః ॥

అర్థం:

ఉత్సవ సమయంలో, కష్టకాలంలో, కరువు వచ్చినప్పుడు, శత్రువుల వల్ల ప్రమాదం ఏర్పడినప్పుడు, రాజద్వారం (న్యాయస్థానం లేదా అధికారుల వద్ద) అవసరం వచ్చినప్పుడు, చివరికి శ్మశానం వరకు కూడా మనతో నిలబడి ఉండేవాడే నిజమైన బంధువు, నిజమైన స్నేహితుడు.


అందరూ తప్పక చూడండి మరియు మీ కుటుంబ సభ్యులకు అలాగే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి 


శ్రీ దత్త శర్మ గారు ఋగ్వేద అధ్యాపకులు శ్రీ కంచి కామకోటి పీఠ శంకర వేద విద్యాలయం కర్నూలు

పంచాంగం 20.06.2026 Saturday,

 ఈ రోజు పంచాంగం 20.06.2026 Saturday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాస శుక్ల పక్ష షష్ఠి తిథి స్థిర వాసర మఘ నక్షత్రం వజ్ర యోగః తైతుల తదుపరి గరజి కరణం.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

  


శ్రాద్ధ తిథి: షష్ఠి


 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                       పంచమోధ్యాయః

                కర్మ సన్యాస యోగము

 


పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ।

ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ।। 8 ।।



ప్రతిపదార్థ:



  పరిత్రాణాయ — రక్షించుటకు; సాధూనాం — ధర్మపరులను; వినాశాయ — నాశనంచేయటానికి; చ — మరియు; దుష్కృతామ్ — దుష్టులను; ధర్మ — సనాతన ధర్మమును; సంస్థాపన-అర్థాయ — మళ్ళీ స్థాపించుటకు; సంభవామి — నేను ప్రకటమవుతాను; యుగే యుగే — ప్రతి యుగము నందు.


 

 తాత్పర్యము : 


ధర్మాత్ములను కాపాడటానికి, దుష్టులను నిర్మూలించటానికి, మరియు ధర్మ సూత్రములను తిరిగి ప్రతిష్ఠాపించటానికి నేను ఈ లోకంలో ప్రతి యుగము నందు అవతరిస్తాను.




వివరణ:



పూర్వ శ్లోకం లో భగవంతుడు అవతరిస్తుంటాడు అని చెప్పిన శ్రీ కృష్ణుడు, ఇప్పుడు దానికి ఉన్న మూడు కారణాలను వివరిస్తున్నాడు: 1) దుష్టులను సంహరించుట కొరకు 2) సాధు జనులను రక్షించుట కొరకు 3) ధర్మాన్ని స్థాపించుట కొరకు. కానీ, వీటిని నిశితంగా పరిశీలిస్తే ఈ మూడు కారణాలు కూడా నమ్మకంగా అనిపించవు.


సాధు జనులను రక్షించుట కొరకు: పరమాత్మ తన భక్తుల హృదయాల్లో స్థితుడై ఉంటాడు, లోపలనుండి వారిని ఎల్లప్పుడూ పరిరక్షిస్తూనే ఉంటాడు. ఈ పని కోసం ఒక అవతారం తీసుకోవలసిన అవసరం లేదు.


దుష్టులను సంహరించుట కొరకు: భగవంతుడు సర్వ-శక్తివంతుడు, దుష్టులను తన సంకల్ప మాత్రంచేతనే సంహరింపగలడు. దీనికోసం ఒక అవతారం ఎత్తవలసిన అవసరం ఏమున్నది?


ధర్మాన్ని స్థాపించుట కొరకు: అనాది కాలం నుండి వేదములలో ధర్మము వివరించబడింది. భగవంతుడు దానిని ఒక మహాత్ముని ద్వారా తిరిగి స్థాపించవచ్చు. దీనిని సాధించటం కోసం తానే ఒక రూపంలో అవతరించాల్సిన అవసరం లేదు.


మరైతే, ఈ శ్లోకంలో చెప్పబడిన కారణాలను మరెలా అర్థం చేసుకోవాలి? శ్రీ కృష్ణుడు ఏం చెప్తున్నాడో కొంచెం లోతుగా వెళ్లి అర్థం చేసుకుందాం.


జీవాత్మ చేయ గలిగే అత్యున్నత ధర్మం, భగవంతుని భక్తిలో నిమగ్నమవ్వటమే. దీనినే భగవంతుడు తన అవతారం ద్వారా వృద్ది నొందిస్తాడు. భగవంతుడు ఈ లోకంలో అవతరించినప్పుడు తన దివ్య రూపములు, నామములు, గుణములు, లీలలు, ధామములు, మరియు సహచరులను ఆవిష్కరిస్తాడు. ఇది జీవాత్మలకు భక్తి కోసం ఒక సులువైన ఆధారాన్ని అందిస్తుంది. మనస్సుకి ధ్యానం చేయటానికి, అనుసంధానమవటానికి ఒక రూపం అవసరం, అందుకే భగవంతుని నిరాకార తత్త్వం, ఆరాధించటానికి చాలా కష్టతరమైనది. అదే సమయంలో, సాకార రూపంలో ఉన్న భగవంతునిపై భక్తి అనేది, సామాన్య జనులకు అర్థం చేసుకోవటం తేలిక, ఆచరించటానికి సులువైనది, మరియు ఎంతో మధురమైనది.


ఈ విధంగా, ఐదు వేల సంవత్సరాల క్రితం కృష్ణుడు అవతరించినప్పటి నుండి, కొన్ని కోట్ల జీవులు (జీవాత్మలు) కృష్ణుడి దివ్య లీలలను తమ భక్తికి ఆధారంగా వాడుకుని, తమ మనస్సులను సునాయాసంగా, ఆహ్లాదంగా పవిత్రమొనర్చుకున్నారు. ఇదే విధంగా, రామాయణం కూడా ఎన్నో శతాబ్దాలుగా జీవాత్మల భక్తికి, ఎంతో జనాదరణ పొందిన ఆధారంగా ఉపయోగపడింది. భారతదేశంలో ఆదివారాల్లో టీవీలో రామాయణం మొదలయిన రోజుల్లో, దేశంలో అన్ని వీధులు నిర్మానుష్యమయ్యేవి. రామచంద్రుని లీలలు జనులకు ఎంత ముగ్ధమోహనముగా ఉండేవంటే, ప్రజలు తమ టెలివిజన్ తెరలకు, ఆ లీలలను చూడటానికి, అతుక్కుపోయేవారు. శ్రీరామచంద్రుని అవతారం, చరిత్రలో ఎన్నో కోట్ల జీవాత్మలకు తమ భక్తికి ఒక ఆధారాన్ని అందించింది. రామాయణం ఇలా పేర్కొంటున్నది:


రామ ఏక తాపస తియ తారీ, నామ కోటి ఖల కుమతి సుధారీ


‘తన అవతార సమయంలో, రామచంద్ర మూర్తి ఒక్క అహల్యకే (గౌతమ ముని భార్య, ఆమెను రాముడు ఒక రాతి శరీరంనుండి విడిపించాడు) సహాయపడ్డాడు. కానీ, అప్పటి నుండి “రామ” నామము జపించి, కోట్ల మంది పతితులైన జీవులు తమను తాము ఉద్ధరించుకున్నారు.’ కాబట్టి, ఈ శ్లోకానికి నిగూఢమైన అర్థం ఏమిటంటే :


ధర్మాన్ని స్థాపించటం కోసం: జీవాత్మలకు భక్తిలో నిమగ్నమై తమ అంతఃకరణ శుద్దికి సహకరించటానికి, తన నామములు, రూపములు, లీలలు, గుణములు, ధామములు, మరియు సహచరులను ప్రకటించటం ద్వారా, భక్తి అనే ధర్మాన్ని స్థిరపరచటానికి భగవంతుడు అవతరిస్తాడు.


దుష్టులను సంహరించటం: భగవంతుని లీలలలో పాలు పంచుకోవటానికి, ఆయనతో పాటుగా కొంతమంది ముక్త మహాత్ములు కూడా అవతరించి, దుర్మార్గులుగా నటిస్తారు. ఉదాహరణకి, రావణ-కుంభకర్ణులు నిజానికి భగవత్ దివ్య ధామము నుండి దిగివచ్చిన జయ-విజయులే. వారు రాక్షసులుగా నటించారు మరియు రాముడినే ఎదిరించి పోరాడారు. వారు దివ్య పురుషులు కాబట్టి మరెవ్వరి చేత సంహరింపబడలేరు. కాబట్టి, భగవంతుడే అటువంటి రాక్షసులను తన లీలలలో భాగంగా సంహరించాడు. అలా సంహరించి, వారిని తన దివ్య ధామానికి పంపించాడు, ఎందుకంటే వారు నిజానికి అక్కడి నుండి వచ్చిన వారే.


ధర్మాత్ములను రక్షించటం: ఎన్నో జీవాత్మలు, భగవంతుడిని తమ ఎదురుగా దర్శించటానికి తగినంత ఉన్నతిని సాధనలో పొందిఉన్నారు. ఈ అర్హత సంపాదించిన జీవాత్మలు, శ్రీ కృష్ణుడు ఈ లోకంలో అవతరించినప్పుడు, భగవంతుని లీలలలో పాలు పంచుకోవటానికి మొదటి అవకాశాన్ని పొందాయి. ఉదాహరణకి, కొంతమంది గోపికలు (శ్రీ కృష్ణుడు తన లీలలను ప్రదర్శించిన బృందావనానికి చెందిన మహిళలు) నిజానికి శ్రీ కృష్ణుని లీలలలో సహకరించటానికి ఆయన దివ్య ధామము నుండి దిగివచ్చిన ముక్త జీవులు. మరికొంత మంది గోపికలు, మొదటి సారి భగవంతుని కలిసి, సేవించుకుని, ఆయన లీలలలో పాలు పంచుకునే అవకాశమొచ్చిన, భౌతిక బంధములో ఉన్న జీవులు. కాబట్టి శ్రీ కృష్ణుడు ఈ లోకంలో అవతరించినప్పుడు, అలాంటి పరిపక్వత కలిగిన జీవాత్మలకు, ఆయన లీలలలో భాగస్వాములై, తమ భక్తిని పరిపూర్ణమొనర్చుకునే అవకాశం కలిగింది.


ఇది, ఈ శ్లోకం యొక్క నిగూఢమైన అర్థం. అదే సమయంలో, ఎవరైనా ఈ శ్లోకాన్ని ఉన్నదున్నట్లుగానే అర్థం చేసుకోవటంలో కూడా తప్పు లేదు.

పాదారవింద శతకం - 2*

  *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*పాదారవింద శతకం - 2*


*శ్లోకము - 16*


*సరాగః సద్వేషః ప్రసృమరసరోజే ప్రతిదినం*

*నిసర్గాదాక్రామన్విబుధజనమూర్ధానమధికమ్ ।*

*కథంకారం మాతః కథయ పదపద్మస్తవ సతాం*

*నతానాం కామాక్షి ప్రకటయతి కైవల్యసరణిమ్ ॥*


*భావము :*


*ఓ కామాక్షీ! నీ పాదపద్మములు, పద్మముల కాంతిని తిరస్కరించాయి. నీ పాదపద్మముల కాంతిని సకల దేవతలు, విజ్ఞులు శిరసున దాల్చారు. అలాంటి నీ పాదములు, నీ శరణు కోరినవారికి ముక్తిని ప్రసాదించడం మా భాగ్యము కాక మరేమిటి.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

శనివారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏


20-06-2026 శనివారం రాశి ఫలితాలు


మేషం


ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పుణ్య క్షేత్ర దర్శనం చేసుకుంటారు. వ్యాపారమున ఒత్తిడి పెరుగుతుంది. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఉదర అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. ఉద్యోగులకు స్థానచలనాలు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.  

---------------------------------------


వృషభం


చిన్ననాటి మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. స్ధిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలసి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

---------------------------------------


మిధునం


వాహన వ్యాపారస్తులు నూతన లాభాలు అందుకుంటారు. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఆర్థికంగా సన్నిహితుల సహాయం అందుతుంది. స్థిరాస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది.

---------------------------------------


కర్కాటకం


వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. ఇంటా బయట జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. 

---------------------------------------


సింహం


బంధువులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు.

---------------------------------------


కన్య


సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగ యత్నాలలో విజయం వరిస్తుంది. స్నేహితుల నుండి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు.

---------------------------------------


తుల


కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. బంధుమిత్రుల నుండి కొన్ని వ్యవహారాలలో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు.  

---------------------------------------


వృశ్చికం


నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలను పొందుతారు. ఇంటా బయట పెద్దల ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

---------------------------------------


ధనస్సు


ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పెరుగుతాయి. వ్యాపారంలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగుల విషయంలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.

---------------------------------------


మకరం


ఉద్యోగ విషయమై అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నములలో ఆటంకలు తొలుగుతాయి. దేవాలయ దర్శనం చేసుకుంటారు.

---------------------------------------


కుంభం


ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత వివాదాల నుంచి తెలివిగా బయటపడతారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. కీలక వ్యవహారాలలో మీ కలలు నిజమవుతాయి. ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది.

---------------------------------------


మీనం

 

ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి. వృధా ఖర్చులు తప్పవు. కీలక వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. కొన్ని పనులలో సన్నిహితుల నుండి నిందలు పడవలసి వస్తుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.

---------------------------------------

వృక్షయర్వేద విచిత్రాలు

 వృక్షయర్వేద విచిత్రాలు -


• కొబ్బరి చెట్లకు ఎక్కువు గా కాయలు కాయలంటే ప్రతి రోజు " మరువం , పెసలు, మిణుములు" ఈ మూడింటి తో తయరు అయిన కషాయాన్ని చల్లార్చి పోస్తూ ఉండాలి. అప్పుడప్పుడు ఈ ముడింటి ముద్దను చెట్ల మొదళ్లకు పట్టించాలి. అలా చేయడం వలన కొబ్బరి చెట్టు కి విపరీతమైన బలం వస్తుంది. చాలా పెద్ద మొత్తం లొ కాయలు కాస్తూ యవ్వనం గా తయారు అవుతుంది.


• మల్లెపూలు తెల్లగా ఉంటాయని మనకు తెలుసు.వాటిని ఎరుపు రంగులో పూయించ వచ్చు. పారిజాతం ( పగడ మల్లె ) చెట్టు వేరుకు రంధ్రం చేసి ఆ రంద్రం లొ మల్లె తీగను తీసుకొచ్చి గుచ్చాలి.ఆ తరువాత దానిపై మట్టి కప్పాలి. రోజు నీళ్లు పొస్తూ ఉంటే పారిజాతం తో పాటు మల్లె చెట్టు కుడా కలిసిపోయి పెరుగుతుంది. ఆ తరువాత భూమిని తవ్వి మల్లె వేరుని పారిజాతం నుంచి వేరు చేసి విడిగా పాతి పెడితే కొద్ది రోజుల్లోనే తెల్ల మల్లె చెట్టు ఎర్ర మల్లె పూలు పూస్తుంది.మంచి సువాసన కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఏ చెట్టు విత్తనాలు అయినా నాటి వాటికి ఏ రంగు నీళ్లు అయితే పోస్తామో ఆ రంగు పువ్వులే పూస్తాయి.


• మునగ చెట్టుకి కాసిన మునగ కాయలు చెట్టు మీదే పండి ఎండిన తరువాత వాటిని సేకరించాలి. ఆ కాయలను సగం విప్పదీసి , అందులోని మునగ గింజలని తీసివేసి వాటి స్థానం లొ కాకర గింజల్ని పెట్టి , దారం తొ కాయని గట్టిగా చుట్టి భూమిలో పాతి పెట్టాలి. కొన్నాళ్ళకి చెట్టు మొలుస్తుంది. ఆ చెట్టుకి ఒకవైపు మునగ కాయలు, మరోవైపు కాకరకాయలు పుడతాయి.


• విత్తనాలు లేని కాయలు కాయలంటే వంకాయ,గుమ్మడి కాయ , పొట్ల కాయ మొదలయిన చెట్ల విత్తనలని వస రసం లొ నానబెట్టి భుమి లొ పాతి పెట్టాలి.చెట్లు మొలిచేవరకు ప్రతి రోజు వస నీళ్ళను పాదుల్లో పోయాలి.ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే చెట్లు ఆరోగ్యం గా పెరిగి గింజలు లేని పెద్ద కాయలు కాస్తాయి.


• కొన్ని పువ్వులు ఎంతో అందం గా ఉంటాయి.కాని వాటికి సువాసన ఉండదు.అలాంటి పూల చెట్టుకి ప్రతి రోజు " చెంగల్వ కోస్టు ,ఆకుపత్రి, సారాయి,తుంగ ముస్థలు , తగిరస, వట్టివేళ్ళు,"మొదలయిన ఔషధ చుర్ణముని నీళ్లలో కలిపి ఆ నీళ్లను చెట్ల పాదుల్లో పొస్తూ ఉంటే క్రమం గా ఆ చెట్లకి పూచే పూలకి అద్బుతమైన సుగంధం అబ్బుతుంది. ఒక నెల వరకు పూల సువాసనలు గుబాళిస్తునే ఉంటాయి.


" వృక్ష జాతులు అనగా తిన్త్రిని మామిడి మొదలగు చెట్లు ను తీగలుగా మార్చుట

బియ్యపు పొడి 1 భాగము , మినుముల 1 బాగము , నలగ దంచిన వడ్ల పిండి 1 భాగము , నువ్వుల పిండి 1 భాగము, వీటిని మాంసము కడిగిన నీళ్లలో కడిగి పసుపు పొడి పోగవేసి పాటి మట్టి నేలలో నాటితే అవి తీగలుగా మారును.


• చెట్లు అప్పటికి అప్పుడే పెరిగి చిగుర్చుట -

అంకోల తైలము లొ యే చెట్టు యెక్క బీజములు నైనా నూరు మాట్లు తడిపి వడగండ్లతో కలిపి పాటిమట్టి లొ నాటితే అప్పటికప్పుడే చెట్టు మొలిచి పండ్లు, పువ్వులు ఇచ్చును.


• బీజములు తొందరగా మొలుచుటకు -

ఆయా పండ్లు కాచే సమయమున వాటి విత్తనాలు సేకరించి వాటిని బాగుగా ఎండించి పాలలో తడిపి అయిదు దినములు ఎండనించి వాయు లవంగాల కషాయముతో కలిసిన నేతితో పోగవేసి పంచాంగం, బృహతి, నిప్పుల బూడిద ను పాలలొ కలిపి ఆ విత్తనాలను దీనితో పిసికి ఆ ప్రకారము అయిదు రోజులు అయిన పిమ్మట ఆ బీజములు ఆవు పేడతో , ఆవు మూత్రములో ఒక్కో దినము నానబెట్టి విత్తిన మొక్కలు తొందరగా మొలుచును .


• చెట్లకు విపరీతముగా పువ్వులు , పండ్లు కాచుటకు -

చేప మాంసమును , ఆవు పేడతో కలిపి చెట్లకు వేసి యావలు, నువ్వులు , మిణుములు, పెసలు, వులవులు ఈ ఐదింటిని సమబాగాలుగా కలిపి నీళ్లు పోసి వుడకపెట్టి ఆ నీళ్లు చల్లార్చి రెండు దినములు వరసగా చెట్లకు చల్లితే చెట్లు విశేషముగా ఫలించును.

మామిడి చెట్లకు నక్క మాంసం , ఉడుము మాంసం లేదా లేడి, పంది మాంసం , రావి చిగుల్లు, మర్రి చిగుల్లు , అత్తి చిగుల్లు, మామిడి చిగుల్లు, నేరేడు చిగుల్లు, కషాయం పెట్టి చల్లార్చి పాదులో పొసిన మంచి పండ్లు పండును.

మామిడి చెట్టు వేరు దగ్గర చుట్టు గొడ్డలితో కొంచం కాటు చేసి కషాయం పొసిన విశేషమైన ఫలములు ఇచ్చును.

పెసలు , మినుములు ఉడక పెట్టి చల్లార్చి ఆ నీళ్లు తేట వంచి ఆ గుజ్జు కొబ్బరి చెట్టు వేళ్ళకు పట్టించి ఉప్పు నిండా వేసి ఆ నీళ్లు పోస్తే పెద్ద పెద్ద కాయలు కాయును , కాయలు రాలవు.

*. పోక చెట్లకు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో పైన ఎండిపోయిన మట్టలు కోసి చెట్ల చుట్టు త్రవ్వి పైన చెప్పిన కషాయము పొస్తే అధికముగా పండును.


* అరటి చెట్టు కు ఏనుగు దంతపు పొట్టు కాల్చిన నిప్పులోగాని, పంది పెంటికలు, గుర్రపు పెంటికలు కాల్చిన నిప్పులో గాని ఇనప సలాకు ఎర్రగా కాల్చి చెట్టు మొదట వేరులో గుచ్చితే చాలా గొప్ప ఫలితాలు ఇచ్చును.

రేగు చెట్టుకి నువ్వులు , పెసలు సమబాగములు గా చేర్చి దానితో కొంచం అతిమధురం వేసి చెట్టు చుట్టు వేసి మాంసం కడిగిన నీళ్లు పొసిన మరియు నూవుల పిండి , అతిమధురం కలిపి ఎరువు వేసిన తియ్యటి ఫలములు మరియు తియ్యటి ఫలములు ఇచ్చును.


* పత్తి విత్తనాలను ఆవు పేడలో , ఆవు పంచితములో చాలుమార్లు తడిపి పేడనీళ్ళు చల్లుతూ నాటిన తరువాత పందికొవ్వు, మాంసం కడిగిన నీళ్లు చల్లిన అది తన జాతిని విడిచి నిమ్మ జాతిగా మారును.


* మామిడి టెంక నాటిన పిదప మొలచిన మొక్క జానెడు వరకు పెరిగిన పిదప చిగురు కత్తిరించిన యెడల నాలుగైదు కొమ్మలు పుట్టి పెరుగును. ఆ కొమ్మలు వ్రేళ్ళు వలె పెరిగిన పిమ్మట నాలుగు కొమ్మలకు నాలుగు జాతుల అంటు మామిడి అంట్లు కట్టిన నాలుగు వైపులా నాలుగు రంగుల కాయలు కాచును.


* పనస మొక్కకు మామిడి కొమ్మ కట్టి నాటిన మొదటను పనస కాయలును, కొమ్మలకు మామిడి కాయలను కాయును .


* నేరేడు మొక్క యెక్క కొమ్మకు గులాబి, జామ, అంటును కట్టవచ్చు.

నిమ్మ , దబ్బ , కమలా, నారింజ, ఈ జాతులు ఒక జాతి మొక్కకు అన్ని జాతుల మొక్కలు అంట్లు కట్టవచ్చును.

పాల మొక్కకు సపోటా, పనస అంటు కట్టవచ్చును.


* పొగాకుకు , గరుడ వాహన , జాజికి చమెలి, గులాభికి పల్ల సంపెంగి , మాలతికి సాంబ్రాణి అంట్లు కట్టవచ్చు.

మల్లె చెట్టు దగ్గర నొక యెర్ర బాడిద కొమ్మను పాతి ఆ కొమ్మ చిగిర్చిన పిదప అడ్డగముగా నొక రంధ్రము చేసి ఆ రంధ్రములో నుండి ఒక మల్లె కొమ్మని తీసి పేడ మన్ను ఆ రంధ్రముని గప్పి నీళ్లు పోయుచుండిన కొంతకాలానికి ఆ రంద్రములో గల కొమ్మకి వేర్లు వచ్చును. పిమ్మట ఆ కొమ్మని మొదటకి కోసి నాటిన మంకెన ( బాడిద ) పువ్వులు పూయును.


* పొగడ చెట్టు కొమ్మకు సంపెంగ మొక్కకు అంటు కట్టిన ఒక పక్క పొగడ పువ్వులు , ఇంకో పక్క సంపెంగ పువ్వులు పూయును.

సూర్య కాంత ( sunflower ) గింజలు పాలలొ 7 మార్లు నానవేసి ఎండబెట్టి నాటి రోజు పాలతో తడుపు చుండిన తెల్లని పువ్వులు పూయును.

ఎర్ర గన్నేరుకు , తెల్ల గన్నేరుకు అంటు కట్టిన రెండు రకాల పువులు పూయును.


అప్పారావు డైటింగ్

 అప్పారావు డైటింగ్ రేపటి నుంచి (హాస్య కథ)

==================

రచన : సురేష్ వంకాయలపాటి

=============


మా కాకినాడ దేవాలయం వీధిలో అప్పారావు అనే వ్యక్తి ఉండేవాడు. అప్పారావు చాలా మంచి మనిషి. అందరితో నవ్వుతూ మాట్లాడేవాడు. కానీ అతనికి ఒక చిన్న బలహీనత ఉండేది.

అది ఏమిటంటే… తినడం!

తినడం అంటే అతనికి చాలా ఇష్టం. కొందరికి పుస్తకాలు అంటే ఇష్టం, కొందరికి సినిమాలు అంటే ఇష్టం. కానీ అప్పారావుకి మాత్రం తినడమే ప్రపంచంలో పెద్ద హాబీ.

ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం – ఎప్పుడైనా ఏదైనా తినడానికి సిద్ధంగానే ఉండేవాడు.

అప్పారావు ఉదయం లేవగానే మొదట చేసే పని ఏమిటంటే… అద్దం చూడటం కాదు, మొబైల్ చూడటం కాదు… వంటగది చూడటం!

వంటగదిలోకి వెళ్లి

“ఈ రోజు ఏమి వండారు?”స్పెషల్స్ ఏమిటి అని అడగడం అతని దినచర్య.

ఒక రోజు ఉదయం లేవగానే వంటగదిలోకి వెళ్లి చూసాడు. అక్కడ అతని భార్య సీత ఇడ్లీలు వేస్తోంది.

అప్పారావు కళ్ళు మెరిసిపోయాయి.

“సీతా! ఇవాళ్టి టిఫిన్ ఏమిటి?” అని అడిగాడు.

సీత నవ్వుతూ చెప్పింది

“ఇడ్లీలు చేస్తున్నాను. కొద్దిసేపట్లో సిద్ధం అవుతాయి.”

అప్పారావు వెంటనే ఆదేశాలు ఇవ్వడం మొదలుపెట్టాడు.

“అయితే ఇడ్లీకి కొబ్బరి చట్నీ కూడా చేయి. అలాగే కొంచెం దబ్బకాయ బెల్లం వేసిన పచ్చడి చేయి. అలా చేస్తే ఇడ్లీకి మహా రుచిగా ఉంటుంది. అన్నట్లు నెయ్యి వేడి చేసి కారప్పొడి కూడా పెట్టు.”

సీత విసుక్కుంటూ నవ్వింది.

“ఏమండీ! మీరు టిఫిన్ తింటున్నారా లేక హోటల్కి ఆర్డర్ ఇస్తున్నారా?”

కొద్దిసేపటికి ఇడ్లీలు సిద్ధమయ్యాయి.

సీత ప్లేట్‌లో నాలుగు ఇడ్లీలు పెట్టి తీసుకొచ్చింది.

అప్పారావు ఆ నాలుగు ఇడ్లీలు రెండు నిమిషాల్లో మాయమయ్యేలా తిన్నాడు.

తర్వాత మెల్లగా అన్నాడు

“సీతా… ఇడ్లీలు చాలా బాగున్నాయి. ఇంకో రెండు పెట్టు.”

సీత మళ్లీ రెండు పెట్టింది.

అప్పారావు మళ్లీ అడిగాడు

“ఇంకో రెండు పెడితే పర్లేదు కదా?”

ఇలా అడుగుతూ అడుగుతూ చివరికి పది ఇడ్లీలు తిన్నాడు.

సీత ఆశ్చర్యంగా చూసి చెప్పింది

“అయ్యో! ఇంత తింటే మీరు లావుగా అయిపోతారు.”

అప్పారావు నవ్వుతూ అన్నాడు

“పర్లేదు సీతా… మనిషి తినడానికి పుట్టాడు!”

సీత వెంటనే అన్నది

“కానీ మీరు మాత్రం ఇతరుల భాగం కూడా తినడానికి పుట్టినట్టు ఉన్నారు!”

కొన్ని రోజులు ఇలా గడిచాయి.

ఒక రోజు అప్పారావు అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకున్నాడు.

అతని పొట్ట కొంచెం ముందుకు వచ్చింది.

అప్పారావు వెంటనే భయపడ్డాడు.

“అయ్యో! నా పొట్ట చూస్తుంటే బెలూన్ లా ఉంది. ఇలా అయితే నడవలేను.”

అప్పుడే అతను గొప్ప నిర్ణయం తీసుకున్నాడు.

“ఇక నుంచి నేను డైటింగ్ చేస్తాను!”

సాయంత్రం సీత దగ్గరకు వెళ్లి చెప్పాడు.

“సీతా! రేపటినుంచి నేను డైటింగ్ చేయబోతున్నాను.”

సీత ఆశ్చర్యంగా అడిగింది

“నిజంగా డైటింగ్ చేస్తారా?”

అప్పారావు గంభీరంగా చెప్పాడు

“అవును. ఇకనుంచి తక్కువగా తింటాను.”

సీత నవ్వుతూ అంది

“సరే… మీ డైటింగ్ ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం.”

మరుసటి రోజు ఉదయం వచ్చింది.

సీత మళ్లీ ఇడ్లీలు చేసింది.

అప్పారావు ప్లేట్ దగ్గరకు వచ్చి గంభీరంగా అన్నాడు.

“నేను డైటింగ్ చేస్తున్నాను కాబట్టి రెండు ఇడ్లీలు మాత్రమే తింటాను.”

సీత రెండు ఇడ్లీలు పెట్టింది.

అప్పారావు వాటిని మూడు క్షణాల్లో తిన్నాడు.

కొద్దిసేపటికి మెల్లగా అన్నాడు

“సీతా… డైటింగ్ చేస్తున్నా గానీ ఇడ్లీలు చాలా చిన్నగా ఉన్నాయి. ఇంకో రెండు పెట్టు.”

మళ్లీ రెండు తిన్నాడు.

ఇంకొంచెం తర్వాత అన్నాడు

“ఇది చివరి సారి… ఇంకోటి పెట్టు.”

చివరికి మళ్లీ ఆరు ఇడ్లీలు తిన్నాడు.

సీత నవ్వుతూ అడిగింది

“ఇదేనా మీ డైటింగ్?”

అప్పారావు అన్నాడు

“ఇది మొదటి రోజు కాబట్టి ప్రాక్టీస్ డైటింగ్!”

మధ్యాహ్నం భోజనం వచ్చింది.

అప్పారావు అన్నాడు

“కొద్దిగా మాత్రమే పెట్టు. నేను డైటింగ్ చేస్తున్నాను.”

సీత చిన్న గరిటతో అన్నం పెట్టింది.

అప్పారావు ప్లేట్ కేసీ చూస్తూ 

“ఇంత తక్కువా? డైటింగ్ అంటే ఆకలితో ఉండటం కాదు కదా!”

ఇంకొంచెం పెట్టమన్నాడు.

ఇలా “ఇంకొంచెం… ఇంకొంచెం…” అంటూ చివరికి మూడు గిన్నెలు అన్నం తిన్నాడు.

సాయంత్రం టీ టైం వచ్చింది.

అప్పారావు అన్నాడు

“నేను డైటింగ్ చేస్తున్నాను కాబట్టి టీ మాత్రమే తాగుతాను.”

సీత టీతో పాటు బిస్కెట్లు కూడా పెట్టింది.

అప్పారావు మొదట అన్నాడు

“లేదు… బిస్కెట్లు తినను.”

కానీ కొద్దిసేపటికి ఒక బిస్కెట్ తీసుకున్నాడు.

“టీకి బిస్కెట్ లేకపోతే రుచి ఉండదు” అని అన్నాడు.

ఒక్కటి… రెండు… మూడు…

చివరికి ప్లేట్ మొత్తం ఖాళీ అయింది.

సీత నవ్వుతూ అంది

“ఇది డైటింగ్ కాదు… బిస్కెట్ మీటింగ్!”

రాత్రి భోజన సమయం వచ్చింది.

ఆ రోజు సీత పుట్టినరోజు కావడంతో పులిహోర, పాయసం, వడలు చేసింది.

వంటగది నుంచి మంచి వాసన వస్తోంది.

అప్పారావు కాస్త ఆలోచించాడు.

తర్వాత సీరియస్‌గా అన్నాడు

“సీతా… ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి.”

సీత అడిగింది

“ఏమిటది?”

అప్పారావు నవ్వుతూ అన్నాడు

“డైటింగ్ రేపటినుంచి చేస్తాను. ఈరోజు స్పెషల్ వంటలు ఉన్నాయి కదా!”

సీత గట్టిగా నవ్వింది.

“మీ డైటింగ్ ఎప్పుడూ రేపటినుంచే మొదలవుతుంది!”

అప్పారావు కూడా నవ్వుతూ అన్నాడు

“అదే అసలు డైటింగ్ రహస్యం!”

అలా ప్రతి రోజు అప్పారావు

“రేపటినుంచి డైటింగ్!” అని చెప్పుకుంటూ

ఆ రోజు మాత్రం బాగా తినేస్తూ ఉండేవాడు.

ఇప్పటికీ కాకినాడ దేవాలయం వీధిలో అందరూ ఒక మాట చెప్పుకుంటారు —

“అప్పారావు డైటింగ్ అంటే… తినడం కొంచెం ఆలస్యంగా మొదలుపెట్టడం మాత్రమే! తినడం మానడం కాదు.”

ఖడ్గమాలాస్తోత్రానికి

  *ప్ర*: ఖడ్గమాలాస్తోత్రానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? మరి *'అస్య శ్రీ శుద్ధ శక్తిమాలా మంత్రస్య'* అని ఎందుకన్నారు? ఖడ్గమాలలోని ఆ పేర్లన్నీ ఎవరివి?


*జ*: ఖడ్గమాల శ్రీవిద్యకు చెందినది. తొలుత లలితా త్రిపురసుందరి నామం చెప్పబడి, అటుపై న్యాసాంగ దేవతలు, తిథినిత్యా దేవతలు, దివ్యౌఘ సిద్ధౌఘ మానవౌఘ గురు మండల నామాలు; ఆ తరువాత క్రమంగా శ్రీచక్ర నవావరణ దేవతల నామాలు, నవచక్రేశ్వరీ నామాలు; చివరగా దేవి విశేషణాలు చెప్పబడ్డాయి.


ఒకే అక్షరం గల మంత్రాలు *'పిండ'* మంత్రాలనీ, 

రెండక్షరాలు కలవి *'కర్తరి'* అనీ, 

మూడు నుండి తొమ్మిది అక్షరాలు కలవి *'విధి బీజముల'* నీ, 

10 నుండి 20 అక్షరాల వరకు కలవి మంత్రములనీ, 

21 నుండి ఎన్ని అక్షరాలున్నా *మాలామంత్రముల* నీ


వ్యవహరింపబడుతాయి. ఆ కారణం చేతనే ఇది మాలా మంత్రం!


15 అక్షరాల పంచదశీ (శ్రీ) విద్యను ఆధారం చేసుకుని 15 విధాల మాలా మంత్రాలు ఏర్పడ్డాయి. 


అవి : 


శుద్ధ శక్తిమాల, 

నమోంత శక్తిమాల, 

స్వాహాంత శక్తిమాల,

తర్పణాంత శక్తిమాల, 

జయంత శక్తిమాల, 

శుద్ధ శివ సంబుధ్ధ్యంతమాల, 

నమోంత శివమాల, 

స్వాహాంత శివమాల, 

తర్పణాంత శివమాల, 

జయంత శివమాల,

శుద్ధమిధున మాల, 

నమోంత మిధునమాల, 

స్వాహాంత మిధునమాల, 

తర్పణాంత మిధునమాల, 

జయాంత మిధునమాల.


ఇందులో ప్రసిద్ధంగా లభిస్తున్నది *'శుద్ధ శక్తిమాల'*. 


దీనిని *'ప్రకృతిమాల'* అని కూడా అంటారు. 


ఈ మాలా మంత్రాలను వివిధ ప్రక్రియలతో ఉపాసించి కొన్ని సిద్ధులను పొందవచ్చు. పై చెప్పిన 15 విధాల మాలామంత్రాలకు 15 సిద్ధులున్నాయి. 


అందులో మొదటిది *'ఖడ్గసిద్ధి'*. 


తరువాత చెప్పబడిన పదునాలుగు : 


పాదుకాయుగ్మ సిద్ధి, 

అంజన సిద్ధి, 

బిల సిద్ధి, 

వాక్సిద్ధి, 

దేహ సిద్ధి, 

లోహ సిద్ధి, 

అణిమాద్యష్ట సిద్ధి,

వశీకరణ సిద్ధి, 

ఆకర్షణ సిద్ధి, 

సమ్మోహన సిద్ధి, 

స్తంభన సిద్ధి, 

చతుర్వర్గ సిద్ధి,

ఐహికాముష్మిక సిద్ధి, 

భోగ మోక్ష సిద్ధి.


ఒక్కొక్క సిద్ది కోసం ఈ మాలా మంత్రాలను వివిధ (15) విధాల వినియోగిస్తారు. *'ఖడ్గాది'* 15 సిద్ధుల నిచ్చే మాలా మంత్రము కనుక ఇది *'ఖడ్గమాల'* అని లోకంలో ప్రసిద్ధి పొందింది.


*'తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్త స్థితేనవై।*

*అష్టాదశ మహాద్వీప సమ్రాద్భక్తా (సమ్రాద్భోక్తా) భవిష్యతి'll* 


-- అని ప్రస్తుత లభ్య గ్రంథాలలో ఉంది.


కానీ ఈ శుద్ధశక్తిమాలను 14వ దైన ఐహికాముష్మిక సిద్ధి కోసం వినియోగించడమే మంచిదని విజ్ఞుల అభిప్రాయం. 


దానికి సంబంధించిన శ్లోకం :


*అలౌకికం లౌకికం చేత్యానంద ద్వితయం సదా।*

*సులభం పరమేశాని త్వత్పాదౌ భజతాం నృణామ్|*


శుద్ధశక్తిమాలను నిష్కామంతో జపించితే సర్వ (15) సిద్దులూ లభిస్తాయని శాస్త్రవచనం. సర్వసిద్ధులలో మొదటిది *'ఖడ్గసిద్ధి'* కనుక - దానిని మొదలుకొని మిగిలిన సిద్ధులను ఇచ్చే శుద్ధశక్తి మాలామంత్రాన్ని *'ఖడ్గమాల'* గా వ్యవహరిస్తున్నాం.

సేకరణ

పురాణము - అవగాహన (2029)*

  *పురాణము - అవగాహన (2029)*


శ్రీ మహాగణాధిపతయే నమః

శ్రీ గురుభ్యోనమః

కలియుగంలో పురాణశ్రవణం కంటే మించిన ధర్మము, పుణ్యము లేవని వ్యాసభగవానుడు చెప్పాడు. వాల్మీకి నారదుడిని ప్రశ్నించడం వల్ల రామాయణాన్ని, పరీక్షిత్తు శుకుణ్ణి ప్రశ్నించడం వల్ల భాగవతాన్ని పొందాము. అదే స్ఫూర్తితో పురాణము - అవగాహన అనే కార్యక్రమం శ్రీ ప్రణవపీఠము నిర్వహిస్తున్నది.


_*నిన్నటి ప్రశ్నలకు సమాధానాలు*:_. 

4057. శ్రద్ధ, లక్ష్మీ, ధృతి, తుష్టి, పుష్టి, మేధా, క్రియా, బుద్ధి, లజ్జా, వపు, శాంతి, ఋద్ధి, కీర్తి అనే కన్యలను ఎవరు భార్యలుగా స్వీకరించారు?

(ఆచారకాండము – గరుడ పురాణం)

◆ దక్ష ప్రజాపతి కుమార్తెలైన ఈ పదమూడు కన్యలను ధర్ముడు భార్యలుగా స్వీకరించాడు.


4058. ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమా, సన్నతి, అనసూయ, ఊర్జా, స్వాహా, స్వధా అనే కన్యలను ఎవరెవరు వివాహం చేసుకున్నారు?

(ఆచారకాండము – గరుడ పురాణం)

◆ ఈ కన్యలను వరుసగా భృగు మహర్షి, మహాదేవుడు, మరీచి మహర్షి, అంగిరస మహర్షి, పులస్త్య మహర్షి, పులహ మహర్షి, క్రతు మహర్షి, అత్రి మహర్షి, వశిష్ఠ మహర్షి, అగ్నిదేవుడు, పితృగణాలు వివాహం చేసుకున్నారు.


👏 నిన్నటి ప్రశ్నలకు సరైన సమాధానాలు ముందుగా సమాధానం ఇచ్చిన వారి 3 పేర్లు 👏

◆ కార్తికేయ, హైదరాబాద్

◆ రాజా కుమార్, నాగోల్, హైదరాబాద్

◆ చల్ల సూర్య కుమారి,‌ కాకినాడ.


_ఈ రోజు ప్రశ్నలు:_

4059. శ్రద్ధ కుమారుని పేరేమిటి?

(ఆచారకాండము – గరుడ పురాణం)


4060. లక్ష్మీ కుమారుని పేరేమిటి?

(ఆచారకాండము – గరుడ పురాణం)


సమాధానాలు తెలిసినవారు, సమాధానంతో పాటు, పేరు, ఊరు నాకు మాత్రమే వాట్సాప్ సందేశం (టెక్స్ట్, వ్రాసిన లేదా ఆడియో) పంపగలరు. 


సందీప్,

‪‪‪‪‪‪‪‪+91 89783 41489‬‬‬‬‬‬‬‬

బలం గురోః ప్రవర్ధతామ్🙏

పంచాంగం

 *🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏*

        *📿పంచాంగం📿*

*శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*


*తేదీ ... 17 - 06 - 2026,*

*వారం ... సౌమ్యవాసరే ( బుధవారం )*

శ్రీ పరాభవ నామ సంవత్సరం,

ఉత్తరాయణం,

గ్రీష్మ ఋతువు,

*నిజ జ్యేష్ఠ మాసం,*

శుక్ల పక్షం,


తిథి : *తదియ* రా2.09 వరకు,

నక్షత్రం : *పునర్వసు* సా6.00 వరకు,

యోగం : *ధృవం* రా1.44 వరకు,

కరణం : *తైతుల* మ3.16 వరకు

                   తదుపరి *గరజి* రా2.09 వరకు


వర్జ్యం : *ఉ6.45 - 8.15*

                           మరల రా1.34 - 3.05 వరకు*

దుర్ముహూర్తము : *ఉ11.34 - 12.26*

అమృతకాలం : *మ3.45 - 5.15*

రాహుకాలం : *మ12.00 - 1.30* 

యమగండం : *ఉ7.30 - 9.00*

సూర్యరాశి : మిథునం,

చంద్రరాశి : మిథునం 

సూర్యోదయం : 5.29,

సూర్యాస్తమయం : 6.31,


               *_నేటి విశేషం_*

*🌙 చంద్ర దర్శనం మహిమ*


అమావాస్య అనంతరం శుక్ల పక్షంలో కనిపించే తొలి చంద్రకళలను దర్శించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. చంద్రుడు మనస్సుకు అధిపతి. చంద్ర దర్శనం వల్ల మనశ్శాంతి, సౌభాగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.


చంద్ర దర్శన శ్లోకం:

దధిశంఖ తుషారాభం

క్షీరోదార్ణవ సంభవమ్ ।

నమామి శశినం సోమం

శంభోర్మకుట భూషణమ్ ॥


🌙 చంద్రుడిని దర్శించి ఈ శ్లోకాన్ని పఠిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని విశ్వాసం


*🌿 తులసీ మహిమ*


బుధవారం తులసీదేవికి దీపారాధన చేసి, 11 లేదా 21 ప్రదక్షిణలు చేస్తే కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, శుభఫలితాలు కలుగుతాయని శాస్త్రోక్తం.


తులసీదేవి శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. అందువల్ల తులసీ పూజ ద్వారా విష్ణు అనుగ్రహం కూడా లభిస్తుంది.


*🕉️ బుధ గ్రహ ఆరాధన*

బుధుడు జ్ఞానం, వ్యాపారం, గణితం, వాక్చాతుర్యానికి కారకుడు.

బుధ గ్రహ మంత్రం

ఓం బుం బుధాయ నమః ॥


ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాలలో పురోగతి కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది.


*🌺 నేటి ఆధ్యాత్మిక సందేశం*


"జీవితంలో సంపద కన్నా సద్బుద్ధి గొప్పది. సద్బుద్ధి ఉంటే సంపద, సంతోషం, గౌరవం అన్నీ స్వయంగా వస్తాయి.


🙏 ఈ రోజు తప్పక స్మరించవలసిన నామాలు


🔸 ఓం నమో నారాయణాయ

🔸 ఓం గం గణపతయే నమః

🔸 ఓం శ్రీ కృష్ణాయ నమః

🔸 ఓం బుం బుధాయ నమః


*🌺 సర్వేజనాః సుఖినో భవంతు 🌺*

            *_📿శుభమస్తు📿_*

*🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏*

19, జూన్ 2026, శుక్రవారం

శనివారం,జూన్.20,2026

 🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻

శనివారం,జూన్.20,2026

శ్రీ పరాభవ నామ సంవత్సరం

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు

నిజ జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షం

తిథి:షష్ఠి రా9.04 వరకు

వారం:శనివారం(స్థిరవాసరే)

నక్షత్రం:మఖ మ2.58 వరకు 

యోగం:వజ్రం సా6.31 వరకు

కరణం:కౌలువ ఉ9.45 వరకు తదుపరి తైతుల రా9.04 వరకు

వర్జ్యం:రా10.52 - 12.27

దుర్ముహూర్తము:ఉ5.30 - 7.14

అమృతకాలం:మ12.38 - 2.11

రాహుకాలం:ఉ9.00 - 10.30

యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00

సూర్యరాశి:మిథునం

చంద్రరాశి:సింహం

సూర్యోదయం:5.30

సూర్యాస్తమయం:6.32

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి

హోమియోపతి వైద్యం

  ఆన్లైన్లో హోమియోపతి వైద్యం

 కొరకు సంప్రదించండి


 దీర్ఘకాల రోగములకు చక్కటి చికిత్స కలదు 


తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తమిళం మరియు మలయాళం భాషలలో ఏ భాషలోనైనా డాక్టర్ గారితో మీరు మాట్లాడవచ్చు.


మీ సమస్యని తెలుపుకొని చికిత్స తీసుకోగలరు.


మందులు మీ ఇంటికి ఆన్లైన్లో కొరియర్ ద్వారా పంపించబడును.


వివరాలకు 9035231905 నెంబర్ను వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు . 


మీ పేరు,

వయస్సు, 

లింగము 

మీ చిరునామా

 మీ సమస్యను క్లుప్తంగా వివరించండి 


మీరు ఏ భాషలో డాక్టర్ గారి ని సంప్రదించదల్చారు పేర్కొనండి 


తరువాత డాక్టర్ గారే మీకు ఫోను చేసి మీతో మాట్లాడగలరు.

డాక్టర్ గారి ఫీజు మందుల ఖర్చులు అడిగి తెలుసుకోండి


డాక్టర్ సాయి అఖిల


 స్త్రీల రోగముల నిపుణురాలు

చేసిన పాపానికి

 చేసిన పాపానికి పరిహారం ఎలా ? పాపానికి ప్రాయశ్చిత్తం ఎలా ?



కపిలమహర్షి తన తల్లి దేవహూతితో


తస్మాత్ పురైవాద్దిహ

పాప నిష్కృతౌ

యతేత మృత్యో

రవిపధ్యరాత్మనా " - కపిలగీత


" ఈ జీవితంలోనే మరణానికి ముందే దేహం రోగగ్రస్తం కాకముందే చేసిన పాపాలకు నిష్కృతి చేసుకోవాలి " అని తెలియచేస్తూంది.


రోగాన్ని గుర్తించి వైద్యులు చికిత్స చేసినట్లుగా మనకు మనమే ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి. 


పూజలు, జపాలు, తీర్థయాత్రలు, వ్రతాలు చేసుకుంటూంటే పాపాలన్నీ మెల్లి మెల్లిగా క్షయం అవుతూంటాయి. నరక బాధలు తప్పుతాయి.


వ్రతమనగా శాస్త్రములు తెలియచేసిన నియమాలు పాటించడం. 


ఏఏ వ్రతాలు చేసుకోవాలి, 

ఏఏ సమయాలలో 

ఏఏ తిధులలో చేస్తే విశేషఫలితాలు కలుగుతాయి, వ్రతాచరణలో పాటించవలసిన నియమాలు వంటి విషయాలను   తెలుసుకుని ఆచరించాలి. ఉదాహరణకు సత్యనారాయణస్వామి వ్రతం ఏరోజయినా చేసుకోవచ్చు. కాని ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి నాడు చేసుకుంటే విశేష ఫలితం.


వ్రతం ఎందుకు చేయాలి?. ఆదిశంకరులు " చిత్తస్య శుద్ధయే కర్మ " అన్నారు. చిత్తశుద్ధి కోసం చేసే కర్మ వ్రతం. 


జీవుడి జన్మజన్మల కర్మఫలాలు చిత్తాన్ని ఆవరించుకుని ఉంటాయి. ఆ వాసనలన్నీ క్షయం కావాలి ముక్తి పొందాలంటే.


సాధారణంగా మనం చేసే వ్రతాలన్నీ కామ్యకవ్రతాలు. ఫలానా పని అవాలనో, కోరిక తీరాలనో లేక కోరిక తీరిందనో వ్రతం చేసుకుంటాం. సత్పురుషులు చేసే వ్రతాలు లోకకళ్యాణం కోసం.


" కృతఘ్నస్య నివృత్తయే " అన్నారు. కృతఘ్నతనుంచి తప్పించుకోవడం కోసం వ్రతాలు చేయాలి. మనం అనుభవించేవన్నీ అమ్మవారి అనుగ్రహమే. అలాగే వాటిని అనుభవించడానికి ఉపయోగపడే ఇంద్రియాలను ఇచ్చినవారు కూడా అమ్మవారే. మరి అన్నీ అనుగ్రహించిన అమ్మవారికి కృతజ్ఞత చెప్పుకోవాలిగా. వ్రతాలు ఈ కృతజ్ఞత తెలియచేయడానికే. ఉదాహరణకు కంచిపీఠాధిపతులు చాతుర్మాస్యవ్రతం చేయడం లోకకళ్యాణం కోసం, కృతఘ్నత నివృత్తి కోసం అని తెలుసుకోవాలి.


ఏతత్ సర్వం 

శ్రీ పరదేవతార్పణమస్తు.


_శుభమస్తు_

🙏శ్రీ సద్గురు పీఠం ద్వారా...✍️

సమస్త లోకా సుఖినోభవంతు

అరుణాచలేశ్వరా

 _తండ్రీ అరుణాచలేశ్వరా!🌹_ 


జీవన పయనములో 

ఎన్ని వెతలు 

ఎన్ని వేదనలు 

ఎన్ని కష్టాలు 

ఎన్ని నష్టాలు 

ఎన్ని అపజయాలు 

ఎన్ని ఆశా భంగాలు 

ఎన్ని రోదనలు 

ఎన్ని క్లేశములు 

ఎలా తెలుపను తండ్రీ 

నీకు దూరంగా 

ఎదో ఉండి 

సుఖము 

ఆనందము 

విజయాలు 

పొందుతున్నాను అని 

అనుకోవద్దు 

జీవితములో 

అండ 

దండ 

ధైర్యము 

స్థైర్యము 

అన్నీ నీవే 


 _హరః నమః పార్వతీ పతయే హరహర మహాదేవ శంభో శంకర🙏_

చేతులు జోడించి

 *“మీరు చేతులు జోడించి భగవంతునికి నమస్కరిస్తారు... నమస్కారమంటే ఏమిటి?”


*“ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు కలిపి భగవంతునికి అర్పించమే నిజమైన నమస్కారం..!”


*“న.. మ..” అనగా 'నాది కాదు' అని అర్థం..!


*“అంటే సర్వమూ భగవంతునిదే అన్న నిరంహకార భావానికి చిహ్నం నమస్కారం.


*కర్మలను ప్రారంభించే ముందు మీరు కర్మలకు నమస్కరించాలి..!


*“తస్మై నమః కర్మణే”...


*‘ఓ కర్మ దేవతా! నాచే పవిత్రమైన కర్మలను మాత్రమే చేయించు’ అని ప్రార్థించాలి.


*నమస్కారం అంటే ఏదో రెండు చేతులు జోడించడం కాదు, తలపెట్టిన కర్మ విజయవంతం అయ్యేలా ఆశీర్వదించమని భగవంతుని ప్రార్థించడమే నమస్కారంనకు అంతరార్థం..!

గొడ్డలి కట్టెలను కొడుతుంది

 గొడ్డలి కట్టెలను కొడుతుంది. అది గొడ్డలి గొప్పతనం కాదు!


కలం గొప్ప గ్రంధాలను వ్రాస్తుంది. అది కలం గొప్పతనం కాదు!!


మనం గొప్ప గొప్ప పనులు చేస్తాం. అది మన గొప్పతనం కాదు..!!!


అన్నింటికి కర్త అయిన ఈశ్వరునిదే ఆ గొప్పతనం! 


‘మనం కేవలం నిమిత్త మాత్రులం. ఈశ్వరుని చేతిలో పనిముట్లం’ అని భావిస్తూ సర్వ కర్మలను, కర్మ ఫలాలను ఈశ్వరునియందు వదిలి భక్తుడు నిశ్చింతుడై యుండాలి.

***********


 అన్ని భారాలు మోసేవాడు ఆ ఈశ్వరుడు. అనవసరంగా అహంకారాన్ని నెత్తిన పెట్టుకొని అన్నీ నేనే మోస్తున్నానని భ్రమ పడుతూ ఉండరాదు. అన్నీ నావల్లనే జరుగుతున్నవి అనుకోరాదు. ఇదంతా ఒట్టి అహంకారం. ఈ అహంకారాన్ని వదిలితేనే భగవంతుని సాన్నిధ్యం లభించేది.

 

కనుక కర్మలన్నింటిని ఈశ్వరుని యందే విడిచిపెట్టాలి.        

అంటే... ఈశ్వరుని స్మరిస్తూ కర్మలు ప్రారంభించు. ఈశ్వరుని స్మరిస్తూనే కర్మలను కొనసాగించు. ఈశ్వరుని స్మరణతోనే కర్మలను ముగించు..!


కర్మఫలాలను గురించి ఆలోచించకు. లభించిన దానిని ప్రసాద బుద్ధితో స్వీకరించు. నేను నిమిత్తమాత్రుడను అని భావించు. కర్త ఈశ్వరుడే అనే నమ్మకంతో ఉండు. ఏమి జరిగినా నిశ్చితంగా ఉండు. నేను చేస్తున్నాను, ఇది నా వల్లనే జరుగుతుంది అనే అహంకారాన్ని వదులు. ఈ అహంకారాన్ని వదలటమే కర్మలను ఈశ్వరుని లో సన్యసించుట.

 

ఇలా సర్వ కర్మలను ఈశ్వరుని తో సన్యసించి, ఈశ్వరుని ధ్యానము నే లక్ష్యంగా పెట్టుకోవాలి...

ఏమీ తెలియని వాడు

  “ఏమీ తెలియని వాడు ఏకాదశి నాడు చస్తే,అన్నీ తెలిసిన వాడు అమావాస్య నాడు చస్తాడు” అనే సామెతను వివరించే ప్రయత్నం చేద్దాం...

```

*అర్థం:*```

ఈ సామెత జీవితం, జ్ఞానం మరియు మరణం మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది.


*ఏమీ తెలియని వాడు (అజ్ఞాని):

ఈ వ్యక్తి జీవితం, మరణం గురించి అవగాహన లేని వ్యక్తి.


*అన్నీ తెలిసిన వాడు (జ్ఞాని):

ఈ వ్యక్తి జీవితం యొక్క నిజ స్వరూపాన్ని గ్రహించి, మరణాన్ని భయపడని వ్యక్తి.


*ఏకాదశి:

హిందూ సంప్రదాయంలో, ఏకాదశి శుభమైన రోజుగా భావిస్తారు.


*అమావాస్య:

అమావాస్య చీకటికి ప్రతీక, మరణం, అంత్యం అనే భావనను కూడా సూచిస్తుంది.


*వివరణ:

*అజ్ఞాని: అజ్ఞానికి మరణం భయంకరమైనది. అందుకే శుభమైన ఏకాదశి రోజున చనిపోతే బాగుంటుందని భావిస్తారు.


*జ్ఞాని: జ్ఞానికి మరణం జీవితంలో సహజమైన భాగం. అతను మరణాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు. అందుకే అమావాస్య వంటి రోజున చనిపోయినా భయపడడు.


*ఉదాహరణ:

ఒక వ్యక్తి జీవితం గురించి, మరణం తర్వాత ఏమి జరుగుతుందో తెలియక భయపడుతుంటే, అతను అజ్ఞానికి ఉదాహరణ.

*ఒక వ్యక్తి జీవితం యొక్క నిజ స్వరూపాన్ని గ్రహించి, మరణాన్ని సహజమైనదిగా భావిస్తే, అతను జ్ఞానికి ఉదాహరణ.


*ముఖ్యమైన అంశాలు:

జ్ఞానం మన భయాలను తగ్గిస్తుంది. మరణం జీవితంలో ఒక భాగం మాత్రమే.


జీవితం గురించి ఆలోచించడం ముఖ్యం.


ఈ సామెత ఒక సామాజిక నమ్మకం, ఆధ్యాత్మిక భావనలను ప్రతిబింబిస్తుంది.

శ్రీకూర్మం దేవాలయం

 శ్రీకూర్మం దేవాలయం పూర్తి వివరాలు 🙏

1. ఎక్కడ ఉంది? • ప్రదేశం: శ్రీకూర్మం గ్రామం, గార మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ • దూరం: శ్రీకాకుళం పట్టణం నుండి సుమారు 15 కి.మీ • GPS: 18°16′18.52″N 84°0′22.97″E 2. దేవాలయం ప్రత్యేకతలు • మూల విరాట్: శ్రీ కూర్మనాథస్వామి - శ్రీ మహావిష్ణువు దశావతారాలలో 2వది అయిన కూర్మావతారం • ప్రపంచంలోనే ఏకైక ఆలయం: కూర్మావతారంలో విష్ణుమూర్తికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒకే ఒక్క దేవాలయం ఇదే • అమ్మవారు: శ్రీమహాలక్ష్మి ఇక్కడ కూర్మనాయకిగా వెలిశారు • విచిత్రాలు: ◦ స్వామి పడమటి ముఖంగా దర్శనమిస్తారు ◦ ఆలయంలో రెండు ధ్వజస్తంభాలు ఉన్నాయి ◦ శిల్పకళ గాంధర్వ శిల్ప కళ శైలిలో ఉంటుంది ◦ 108 దివ్యదేశాలలో ఒకటి 3. శ్రీకూర్మ పురాణ కథ

కూర్మావతార కథ:

దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని మందర పర్వతంతో చిలుకుతుండగా, ఆ పర్వతం సముద్రంలో మునిగిపోయింది. దేవతల ప్రార్థనతో శ్రీమహావిష్ణువు కూర్మ రూపం అంటే తాబేలుగా అవతరించి, తన వీపుపై మందర పర్వతాన్ని మోసి అమృతోత్పాదనకు సహాయం చేశారు. జ్యేష్ఠ బహుళ ద్వాదశి నాడు స్వామి ఈ అవతారం స్వీకరించారని పద్మపురాణం చెబుతోంది.  


స్థల పురాణం:

శ్వేతచక్రవర్తి భార్య విష్ణుప్రియ ఏకాదశి వ్రతంలో ఉండగా, రాజు కామమోహితుడై ఆమెను చేరాడు. వ్రత భంగం కాకుండా కాపాడమని ఆమె విష్ణువును వేడుకోగా, స్వామి ప్రత్యక్షమై గంగను ఉద్భవింపజేశారు. ఆ ప్రదేశమే శ్రీకూర్మ క్షేత్రంగా మారింది.  

4. పుష్కరిణి & విశిష్టత • శ్వేత పుష్కరిణి: ఇక్కడ పితృకార్యం చేస్తే పితృదేవతలకు మోక్షం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి • దోష నివారణ: స్వామిని దర్శిస్తే శని, కుజ, రాహు, కేతు గ్రహ దోషాలు తొలగుతాయి 5. ఉత్సవాలు & చరిత్ర • ముఖ్య ఉత్సవం: రథసప్తమి • నిర్మాణం: సా.శ. 1281. 11వ శతాబ్దం నాటి శాసనాలు లభించాయి #శ్రీకూర్మం #కూర్మనాథస్వామి #కూర్మావతారం #శ్రీకాకుళం #108దివ్యదేశాలు #విష్ణుదశావతారాలు #కూర్మనాయకి #శ్వేతపుష్కరిణి #పడమటిముఖదైవం #ఏకైకకూర్మక్షేత్రం

హోమియోపతి వైద్యం

  ఆన్లైన్లో హోమియోపతి వైద్యం

 కొరకు సంప్రదించండి


 దీర్ఘకాల రోగములకు చక్కటి చికిత్స కలదు 


తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తమిళం మరియు మలయాళం భాషలలో ఏ భాషలోనైనా డాక్టర్ గారితో మీరు మాట్లాడవచ్చు.


మీ సమస్యని తెలుపుకొని చికిత్స తీసుకోగలరు.


మందులు మీ ఇంటికి ఆన్లైన్లో కొరియర్ ద్వారా పంపించబడును.


వివరాలకు 9035231905 నెంబర్ను వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు . 


మీ పేరు,

వయస్సు, 

లింగము 

మీ చిరునామా

 మీ సమస్యను క్లుప్తంగా వివరించండి 


మీరు ఏ భాషలో డాక్టర్ గారి ని సంప్రదించదల్చారు పేర్కొనండి 


తరువాత డాక్టర్ గారే మీకు ఫోను చేసి మీతో మాట్లాడగలరు.

డాక్టర్ గారి ఫీజు మందుల ఖర్చులు అడిగి తెలుసుకోండి


డాక్టర్ సాయి అఖిల


 స్త్రీల రోగముల నిపుణురాలు

అమ్మ ఎదురుచూపు*

 *అమ్మ ఎదురుచూపు*

==================

రచన :- సురేష్ వంకాయలపాటి 

==================


శాంతమ్మకు జీవితం చిన్న వయసులోనే పెద్ద పరీక్ష పెట్టింది. భర్త అకస్మాత్తుగా చనిపోవడంతో ఇద్దరు చిన్న పిల్లల బాధ్యత ఆమె భుజాలపై పడింది. పెద్ద కొడుకు రాము ఐదేళ్లు, చిన్న కొడుకు సోము రెండేళ్లు.

ఆ రోజు నుంచి శాంతమ్మ తన జీవితాన్ని పిల్లల కోసం అంకితం చేసింది. పొద్దున్నే కూలి పనికి వెళ్లేది. ఎండలో చెమటోడ్చేది, వానలో తడిసేది. తన కడుపు మాడ్చుకుని అయినా పిల్లల కడుపు నింపేది. తాను పాత చీరలు కట్టుకునేది, కానీ పిల్లలకు కొత్త బట్టలు కొనిపించేది.

"నా పిల్లలు చదువుకుని పెద్దవాళ్లు కావాలి. నేను పడిన కష్టం వాళ్లు పడకూడదు" అని కలలు కనేది.

కాలం గడిచింది. పిల్లలు బాగా చదివి మంచి ఉద్యోగాలు సంపాదించారు. శాంతమ్మ ఆనందానికి అవధులు లేకపోయాయి. "నా కష్టం వృథా కాలేదు" అని దేవుడికి నమస్కరించింది.

కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరికీ పెళ్లిళ్లు జరిగాయి.

మొదట్లో అంతా బాగానే ఉండేది. కానీ క్రమంగా పరిస్థితులు మారాయి.

"మీ అమ్మ ఎప్పుడూ మా ఇంట్లోనే ఎందుకు ఉండాలి?" అని పెద్ద కోడలు అడిగేది.

"మా ఇంట్లో కూడా బాధ్యతలు ఉన్నాయి కదా!" అని చిన్న కోడలు అనేది.

ఆ మాటలు గొడవలుగా మారాయి.

చివరికి ఇద్దరు కొడుకులు ఒక నిర్ణయం తీసుకున్నారు.

"ఆరు నెలలు అన్నయ్య దగ్గర... ఆరు నెలలు నా దగ్గర..."

ఆ మాట విన్న శాంతమ్మ గుండె బాధతో నిండిపోయింది. కానీ ఏమీ మాట్లాడలేదు.

తల్లి ప్రేమకు తన బాధ కంటే పిల్లల సంతోషమే ముఖ్యం.

అలా సంవత్సరాలు గడిచాయి.

ఒక రోజు పెద్ద కోడలు భర్తతో అంది:

"ఇలా ఎన్ని రోజులు? వృద్ధాశ్రమంలో చేరిస్తే బాగుంటుంది."

చిన్న కోడలు కూడా అదే మాట చెప్పింది.

భార్యల ఒత్తిడిని తట్టుకోలేక ఇద్దరు కొడుకులు శాంతమ్మను ఒక అనాథ వృద్ధాశ్రమానికి తీసుకెళ్లారు.

"అమ్మా... అక్కడ నీ వయసు వాళ్లు ఉంటారు. నీకు బాగుంటుంది" అని చెప్పారు.

ఆ మాటల వెనుక నిజం శాంతమ్మకు అర్థమైంది.

అయినా నవ్వుతూ అంది:

"మీకు ఏది మంచిగా అనిపిస్తే అదే చేయండి బాబూ."

ఆమెను ఆశ్రమంలో వదిలేసి ఇద్దరూ వెళ్లిపోయారు.

ఆశ్రమంలో శాంతమ్మకు ఒక చిన్న మంచం ఇచ్చారు.

ప్రతి ఉదయం గేటు దగ్గర కూర్చునేది.

ప్రతి సాయంత్రం రోడ్డువైపు చూసేది.

"ఈ రోజు నా పిల్లలు వస్తారేమో..."

ఒక రోజు...

ఒక వారం...

ఒక నెల...

ఒక సంవత్సరం...

ఎవరూ రాలేదు.

ఆశ్రమ నిర్వాహకుడు గమనించేవాడు.

ఒక రోజు అడిగాడు.

"అమ్మా... ప్రతిరోజూ గేటు దగ్గరే ఎందుకు కూర్చుంటావు?"

శాంతమ్మ చిరునవ్వు నవ్వి చెప్పింది.

"చిన్నప్పుడు నా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే దారి కోసం ఎదురు చూసేదాన్ని బాబూ. ఇప్పుడు కూడా అదే అలవాటు పోలేదు."

ఆ మాట విని నిర్వాహకుడి కళ్లలో నీళ్లు తిరిగాయి.

కొన్ని రోజుల తర్వాత శాంతమ్మ ఆరోగ్యం క్షీణించింది.

చివరి క్షణాల్లో కూడా ఆమె చేతిలో తన ఇద్దరు కొడుకుల చిన్ననాటి ఫోటో ఉంది.

ఆమె నెమ్మదిగా అంది:

"నా పిల్లలు సంతోషంగా ఉండాలి..."

అంతే...

ఆమె శాశ్వత నిద్రలోకి జారుకుంది.

శాంతమ్మ మరణించిన తర్వాత ఆమె దిండు కింద ఒక లేఖ దొరికింది.

ఆశ్రమ నిర్వాహకుడు దానిని జాగ్రత్తగా దాచుకున్నాడు.

కొన్ని రోజుల తర్వాత ఇద్దరు కొడుకులను ఆశ్రమానికి పిలిపించాడు.

వారు రాగానే ఆ లేఖను వారి చేతిలో పెట్టాడు.

వణుకుతున్న చేతులతో వారు చదవడం మొదలుపెట్టారు.

"నా ప్రియమైన బిడ్డలారా,

నేను మిమ్మల్ని తొమ్మిది నెలలు నా గర్భంలో మోశాను.

మీరు నిద్రపోతే నేను మేల్కొని ఉండేదాన్ని.

మీరు తింటే చాలు అని నేను ఆకలితో ఉండేదాన్ని.

మీరు నవ్వితే నా కష్టం మరిచిపోయేదాన్ని.

వృద్ధాప్యంలో మీ ప్రేమ కోసం ఎదురుచూశాను.

కానీ మీ జీవితాల్లో నాకు చోటు లేకపోయింది.

అయినా నాకు మీపై కోపం లేదు.

ఎందుకంటే మీరు నా పిల్లలు.

నా చివరి ఆశీర్వాదం కూడా మీకే.

– మీ అమ్మ"

లేఖ పూర్తయ్యేలోపే ఇద్దరి కళ్లలో కన్నీళ్లు ధారపోశాయి.

వారు బోరున ఏడవడం మొదలుపెట్టారు.

అప్పుడు ఆశ్రమ నిర్వాహకుడు వారివైపు చూసి గంభీరంగా అన్నాడు:

"ఇప్పుడు ఏడుస్తున్నారు..."

"కానీ మీ అమ్మ బ్రతికున్నప్పుడు ఆమె కన్నీళ్లు చూశారా?"

"మీ అమ్మకు డబ్బు కావాలా?"

"కాదు."

"ఆమెకు కావలసింది మీ ప్రేమ, మీ పలకరింపు, మీ తోడు."

"మీరు చిన్నప్పుడు పడిపోతే ఆమె పరుగెత్తుకుని వచ్చేది."

"కానీ ఆమె జీవితంలో చివరి రోజుల్లో ఆమె పడిపోయినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు?"

"తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్చడం తప్పు కాదు. కానీ వారిని మనసులోంచి తీసేయడం మాత్రం పెద్ద తప్పు."

"చెట్టు ఎండిపోయాక నీళ్లు పోస్తే ఉపయోగం లేదు."

"తల్లి తండ్రులు బ్రతికున్నప్పుడే వారి విలువ తెలుసుకోవాలి."

ఆ మాటలు వారి గుండెల్లో బాణాల్లా గుచ్చుకున్నాయి.

ఇద్దరు కొడుకులు చేతులు జోడించి ఏడుస్తూ అన్నారు:

"సార్... మమ్మల్ని క్షమించండి."

"మా అమ్మను క్షమించమని అడిగే అవకాశం కూడా మాకు దక్కలేదు."

"మేము చేసిన తప్పు జీవితాంతం మమ్మల్ని వెంటాడుతుంది."

ఆ రోజు నుంచి వారి జీవితం మారిపోయింది.

ప్రతి వారం ఆశ్రమానికి వెళ్లేవారు.

అక్కడ ఉన్న వృద్ధులతో మాట్లాడేవారు.

వారికి కావాల్సినవి సమకూర్చేవారు.

వారిలో తమ అమ్మను చూసుకునేవారు.

ఒక రోజు ఆశ్రమంలోని వృద్ధులందరి ముందు నిలబడి అన్నారు:

"మా తల్లిని మేము కోల్పోయాం. ఆ తప్పును ఎప్పటికీ సరిదిద్దలేం. కానీ ఇకపై మీలో మా అమ్మను చూసుకుంటాం. మమ్మల్ని క్షమించండి."

ఆశ్రమంలోని వృద్ధులందరూ వారిని ఆశీర్వదించారు.

నీతి

తల్లిదండ్రులు మన కోసం జీవితాన్ని అర్పిస్తారు.

వారి వృద్ధాప్యంలో వారికి కావలసింది సంపద కాదు, సంతానం ప్రేమ.

తల్లి తండ్రులు ఉన్నప్పుడు వారి చేతిని పట్టుకోండి.

వారు వెళ్లిపోయాక వారి ఫోటోను పట్టుకుని ఏడవాల్సిన పరిస్థితి రాకూడదు.

చదరంగం ఆట*

  *చదరంగం ఆట*


నాకు ఎప్పటినుంచో చదరంగం ఆట అంటే ప్రత్యేకమైన ఆకర్షణ.


దానికి కారణం రాజు లేదా రాణి కాదు; ప్రతి పావుకూ ఒక ప్రయోజనం ఉండటమే. రాజు ఆజ్ఞాపిస్తాడు. రాణి శక్తివంతంగా కదులుతుంది. కోట స్థిరంగా నిలుస్తుంది. గుర్రం అనూహ్య మలుపులతో ఆశ్చర్యపరుస్తుంది. చిన్న పావు కూడా నిశ్శబ్దంగా ముందుకు సాగుతుంది, ఒకరోజు మరింత ఉన్నత స్థాయికి చేరాలనే ఆశతో.


ఈ ఆట విజయాలు, పరాజయాలు, ఆశయాలు, త్యాగాలు, ఆత్మవిశ్వాసం, నిరాశల మధ్య సాగుతుంది. ప్రతి ఎత్తు అర్థవంతంగా అనిపిస్తుంది. ప్రతి పావు ఈ ఆట ఎప్పటికీ కొనసాగుతుందనే భావనతో తన వంతు పోరాటం చేస్తుంది.


కానీ చివరికి ఆట ముగుస్తుంది. బల్ల ఖాళీ చేయబడుతుంది. ఎంతో రక్షణ పొందిన రాజుని, ఎన్నోసార్లు పట్టించుకోని పావుని ఒకే చేయి తీసుకుని ఒకే పెట్టెలో ఉంచుతుంది. జీవితం కూడా అంత భిన్నంగా లేదు.


మన స్థానం కాపాడుకోవడానికి, గుర్తింపు కోసం, మన విలువను నిరూపించుకోవడానికి ఎన్నో సంవత్సరాలు వెచ్చిస్తాం ఈ ఆటకు ముగింపు లేదన్నట్లుగా.


కానీ ఒక రోజు చప్పట్లు ఆగిపోతాయి. బిరుదులు తమ వెలుగును కోల్పోతాయి. పదవులు ప్రాధాన్యత కోల్పోతాయి.


బల్ల నిశ్శబ్దంగా సర్దివేయబడుతుంది. ఆ నిశ్శబ్దంలో ఒక లోతైన సత్యం వెలుగులోకి వస్తుంది.


జీవితం ఎత్తైన గడిలో కూర్చోవడం గురించి కాదు. దాన్ని మనం ఎలా ఆడామన్నదే ముఖ్యం, నిజాయితీతో, కరుణతో, ధైర్యంతో, వినయంతో.


అందువల్ల ఉద్యోగ జీవితంలో పొందిన హోదాల పట్ల అతిశయ భావన అవసరం లేదు. పదవీ విరమణ తర్వాత రాష్ట్రపతిగా ఉన్నా, అటెండర్‌గా ఉన్నా, జనరల్ మేనేజర్‌గా ఉన్నా, చివరికి అందరూ ఒకే పెట్టెలో చేరతారు.


ఇది చేదు నిజం. అంగీకరించడం కష్టమైనా ఇదే వాస్తవం మరి.

చేసిన పాపానికి పరిహారం

  చేసిన పాపానికి పరిహారం ఎలా ? పాపానికి ప్రాయశ్చిత్తం ఎలా ?



కపిలమహర్షి తన తల్లి దేవహూతితో


తస్మాత్ పురైవాద్దిహ

పాప నిష్కృతౌ

యతేత మృత్యో

రవిపధ్యరాత్మనా " - కపిలగీత


" ఈ జీవితంలోనే మరణానికి ముందే దేహం రోగగ్రస్తం కాకముందే చేసిన పాపాలకు నిష్కృతి చేసుకోవాలి " అని తెలియచేస్తూంది.


రోగాన్ని గుర్తించి వైద్యులు చికిత్స చేసినట్లుగా మనకు మనమే ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి. 


పూజలు, జపాలు, తీర్థయాత్రలు, వ్రతాలు చేసుకుంటూంటే పాపాలన్నీ మెల్లి మెల్లిగా క్షయం అవుతూంటాయి. నరక బాధలు తప్పుతాయి.


వ్రతమనగా శాస్త్రములు తెలియచేసిన నియమాలు పాటించడం. 


ఏఏ వ్రతాలు చేసుకోవాలి, 

ఏఏ సమయాలలో 

ఏఏ తిధులలో చేస్తే విశేషఫలితాలు కలుగుతాయి, వ్రతాచరణలో పాటించవలసిన నియమాలు వంటి విషయాలను తెలుసుకుని ఆచరించాలి. ఉదాహరణకు సత్యనారాయణస్వామి వ్రతం ఏరోజయినా చేసుకోవచ్చు. కాని ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి నాడు చేసుకుంటే విశేష ఫలితం.


వ్రతం ఎందుకు చేయాలి?. ఆదిశంకరులు " చిత్తస్య శుద్ధయే కర్మ " అన్నారు. చిత్తశుద్ధి కోసం చేసే కర్మ వ్రతం. 


జీవుడి జన్మజన్మల కర్మఫలాలు చిత్తాన్ని ఆవరించుకుని ఉంటాయి. ఆ వాసనలన్నీ క్షయం కావాలి ముక్తి పొందాలంటే.


సాధారణంగా మనం చేసే వ్రతాలన్నీ కామ్యకవ్రతాలు. ఫలానా పని అవాలనో, కోరిక తీరాలనో లేక కోరిక తీరిందనో వ్రతం చేసుకుంటాం. సత్పురుషులు చేసే వ్రతాలు లోకకళ్యాణం కోసం.


" కృతఘ్నస్య నివృత్తయే " అన్నారు. కృతఘ్నతనుంచి తప్పించుకోవడం కోసం వ్రతాలు చేయాలి. మనం అనుభవించేవన్నీ అమ్మవారి అనుగ్రహమే. అలాగే వాటిని అనుభవించడానికి ఉపయోగపడే ఇంద్రియాలను ఇచ్చినవారు కూడా అమ్మవారే. మరి అన్నీ అనుగ్రహించిన అమ్మవారికి కృతజ్ఞత చెప్పుకోవాలిగా. వ్రతాలు ఈ కృతజ్ఞత తెలియచేయడానికే. ఉదాహరణకు కంచిపీఠాధిపతులు చాతుర్మాస్యవ్రతం చేయడం లోకకళ్యాణం కోసం, కృతఘ్నత నివృత్తి కోసం అని తెలుసుకోవాలి.


ఏతత్ సర్వం 

శ్రీ పరదేవతార్పణమస్తు.


_శుభమస్తు_

🙏శ్రీ సద్గురు పీఠం ద్వారా...✍️

సమస్త లోకా సుఖినోభవంతు

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                       పంచమోధ్యాయః

                కర్మ సన్యాస యోగము

 

యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః ।

సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే ।। 7 ।।



ప్రతిపదార్థ:



యోగ-యుక్తః — మనస్సు ద్వారా భగవంతునితో కూడియుండి; విశుద్ధ-ఆత్మా — పవిత్రమైన బుద్ధితో; విజిత-ఆత్మా — మనస్సుని జయించినవారు; జిత-ఇంద్రియః — ఇంద్రియములను జయించినవారు; సర్వ-భూత-ఆత్మ-భూత-ఆత్మా — అన్ని ఆత్మల పరమాత్మను ప్రతి ప్రాణిలో దర్శిస్తూ; కుర్వన్ — (కర్మలను) చేస్తూ; అపి — కూడా; న, లిప్యతే — చిక్కుకొనరు.

  

 

 తాత్పర్యము : 



 పరిశుద్ధమైన అంతఃకరణ కలిగి, ఇంద్రియ-మనస్సులను నియంత్రణ చేసే కర్మ యోగులు, ప్రతిప్రాణిలో పరమాత్మను దర్శిస్తారు. అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా వారు కర్మబంధాలలో చిక్కుకోరు.



వివరణ:



వైదిక వాఙ్మయంలో 'ఆత్మ' అనే పదం ఎన్నో రకాల అర్థాలలో వాడబడింది: భగవంతుడు అనే అర్థంలో, ఆత్మ అనే అర్థంలో, మనస్సు అనే అర్థంలో, బుద్ధి అనే అర్థంలో వాడబడినది. ఈ శ్లోకం, వీటన్నిటికీ ఉదాహరణ చూపిస్తున్నది. శ్రీ కృష్ణుడు, ఇక్కడ కర్మ యోగి అంటే యోగ యుక్తుడు (భగవంతునితో ఏకమై ఉన్నవాడు) అని విశదీకరిస్తున్నాడు. అటువంటి మహాత్ముడు 1) విశుద్ధాత్మ - పవిత్రమైన బుద్ధి ఉన్నవాడు 2) విజితాత్మా - మనస్సుని జయించినవాడు, మరియు 3) జితేంద్రియ - ఇంద్రియములను నియంత్రించినవాడు.


ఇటువంటి కర్మ యోగులు, పరిశుద్ధమైన బుద్ధితో, సమస్త ప్రాణుల యందు భగవంతుడినే దర్శిస్తారు మరియు అందరితో గౌరవప్రదంగా మెలుగుతూ, ఎవరితో సంగం లేకుండా ఉంటారు. తమ కార్యకలాపాలు వారి స్వార్థ-ప్రయోజనం కోసం కాదు కాబట్టి వారికి జ్ఞానం క్రమక్రమంగా స్పష్టమగుతుంది. వారి కోరికలు నిర్మూలించబడినవి కాబట్టి, ఇంతకు పూర్వం భౌతిక భోగములకోసం తాపత్రయ పడ్డ ఇంద్రియములు, మనస్సు, మరియు బుద్ధి, ఇప్పుడు నియంత్రణలోకి వస్తాయి. ఈ పరికరములు ఇక ఇప్పుడు భగవత్ సేవకు అందుబాటులోకి వచ్చాయి. భక్తి యుక్త సేవ అంతర్గత విజ్ఞానం వైపు దారి తీస్తుంది. ఈ విధంగా, కర్మ యోగము, సహజ పద్ధతిలో జ్ఞానోదయ దిశగా ఒక్కొక్క మెట్టు పైకి తీస్కువెళుతుంది, కాబట్టి ఇది కర్మ సన్యాసము కంటే భిన్నమైనది కాదు.

పాదారవింద శతకం - 2*

  *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*పాదారవింద శతకం - 2*


*శ్లోకము - 15*


*బలాకామాలాభిర్నఖరుచిమయీభిః పరివృతే*

*వినమ్రస్వర్నారీవికచకచకాలాంబుదకులే ।*

*స్ఫురంతః కామాక్షి స్ఫుటదలితబంధూకసుహృద-*

*స్తటిల్లేఖాయంతే తవ చరణపాథోజకిరణాః ॥*


*భావము :*


*జగన్మాతా! దేవలోకములోని స్త్రీలు, నీకు పాదనమస్కారము చేసే సమయంలో వారి నల్లని కేశపాశములు మేఘములవలే, నీ పాదముల నఖముల తెల్లని కాంతి ఆ మేఘములలో విహరించే కొంగల గుంపువలె, తెల్లని మెరుపులవలే గోచరించు చున్నది.*


🙏🙏🙏*శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

దేవునికి కృతజ్ఞతలు

 *దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి 10 ప్రత్యేక కారణాలు*


1. రోడ్డు మీద టైర్లు నడుస్తున్న కొద్దీ అరిగిపోతాయి, కానీ మన పాదాల అరికాళ్ళు జీవితాంతం నడిచినా, పరిగెత్తినా దాదాపు అలాగే ఉంటాయి.


2. మానవ శరీరంలో దాదాపు 75% నీరే ఉంటుంది, అయినా లక్షలాది రంధ్రాలు ఉన్నా ఒక్క చుక్క కూడా బయటకు కారదు.


3. ఆధారం లేకుండా ఏ వస్తువూ నిలబడలేదు, అయినా మానవ శరీరం తనను తాను సహజంగా సమతుల్యం చేసుకుంటుంది.


4. రీఛార్జింగ్ చేయకుండా ఏ బ్యాటరీ పనిచేయదు, కానీ గుండె పుట్టినప్పటి నుండి మరణం వరకు ఆగకుండా కొట్టుకుంటూనే ఉంటుంది.


5. ఏ పంపు కూడా శాశ్వతంగా నడవదు, అయినా రక్తం జీవితాంతం శరీరంలో నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది.


6. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కెమెరాలకు కూడా పరిమితులు ఉంటాయి, కానీ మన కళ్ళు ప్రతి దృశ్యాన్ని వేల మెగాపిక్సెల్‌లకు సమానమైన నాణ్యతతో చిత్రీకరిస్తాయి.


7. ఏ ప్రయోగశాల కూడా ప్రతి రుచిని పరీక్షించలేదు, అయినా నాలుక ఎలాంటి పరికరాలు లేకుండా వేలాది రుచులను గుర్తిస్తుంది.


8. అత్యంత అధునాతన సెన్సార్లకు కూడా పరిమితులు ఉంటాయి, కానీ మన చర్మం అతి చిన్న స్పర్శను, అనుభూతిని కూడా గ్రహించగలదు.


9. ఏ యంత్రమూ ప్రతి ధ్వనినీ సృష్టించజాలదు, కానీ మానవ స్వరం వేలకొద్దీ పౌనఃపున్యాలను సృష్టించగలదు.


10. ఏ పరికరమూ అన్ని ధ్వనులనూ పూర్తిగా విశ్లేషించజాలదు, కానీ మన చెవులు ప్రతి ధ్వనినీ అర్థవంతంగా గ్రహించి, అన్వయించుకుంటాయి.


దేవుడు ప్రసాదించిన ఈ అమూల్యమైన వరాలకు మనం కృతజ్ఞతతో ఉండాలి, యోగ సాధన తో ఆహార నియమములతో శరీరమును కాపాడుకోవాలి, ఫిర్యాదు చేయడానికి మనకు నిజంగా ఏ హక్కూ లేదు.


ప్రతి ఉదయం నిద్రలేవడమే ఒక అద్భుతం.

కాబట్టి ప్రతిరోజూ సర్వశక్తిమంతుడైన దేవునికి కృతజ్ఞతలు తెలుపండి. 🙏

శ్రీమన్నారాయణీయము

 *శ్రీమన్నారాయణీయము*


*90వ దశకము - విష్ణుమహత్త్వము - నాలుగవ శ్లోకము*


*334. తం చ త్రిమూర్త్యతిగతం పరపూరుషం త్వాం*

*శర్వాత్మనాపి ఖలు సర్వమయత్వహేతోః*

*శంసంత్యుపాసనవిధౌ తదపి స్వతస్తు*

*త్వద్రూపమిత్యతిదృఢం బహు నః ప్రమాణమ్*


*భావము :*

*పరమాత్మా ! ఆ త్రిమూర్తులయందు పరమ సత్వగుణ సంపన్నమైన రూపాన్ని విష్ణువని అంటారు. అదేవిధంగా, బ్రహ్మదేవుని యందు సత్వగుణము స్వల్పముగాను, రజోగుణము అధికముగాను కనిపిస్తుంది. ఇక శంకర స్వరూపంలో సత్వగుణం అధికముగా ఉన్నా, తమోగుణ ప్రధానమైన చేష్టలు కూడా కనిపిస్తాయి.*


*సర్వస్వరూపా ! త్రిమూర్తుల కంటె పరమైన ఈశ్వరరూపము మరియు పరమాత్మ ( సదాశివ ) రూపంలో ఉన్న నీవు, సమస్త దేవతాస్వరూపుడవు. కాబట్టి, ఉపాసన చేసే సమయంలో, నిన్ను శివుడని అంటారు. ఆ శివస్వరూపం కూడా నీదే అనటానికి చాలా ప్రబలమైన ఆధారాలు కనిపిస్తున్నాయి.*

🙏🙏🙏

18, జూన్ 2026, గురువారం

గూగుల్ కుదిర్చి న పెళ్ళి

 *గూగుల్ కుదిర్చి న పెళ్ళి* (*హాస్య కధ*)

=================

రచన :- సురేష్ వంకాయలపాటి 

===============

డైరెక్ట్‌గా కథలోకి సుత్తిలేకుండా వస్తే…

గోపాల్‌కి 40 సంవత్సరాలు. ఇంకా పెళ్లి కాలేదు. మనిషి చాలా అందగాడు. ఎంటెక్ వరకు చదువుకుని హైదరాబాద్‌లో ఒక మంచి కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు.

కానీ అతనికి ఒక విచిత్రమైన అలవాటు ఉంది.

ఏ విషయం అయినా ముందుగా గూగుల్‌లో సెర్చ్ చేస్తే గానీ నిర్ణయం తీసుకోడు. గూగుల్ అంటే అతనికి అంత నమ్మకం.

ఏ విషయం అయినా సరే మొబైల్ తీసుకుని గూగుల్‌లో చెక్ చేస్తాడు.

అది చూసి తర్వాతే ఏ నిర్ణయం అయినా తీసుకుంటాడు.

ఒకరకంగా చెప్పాలంటే… అతనికి లోకజ్ఞానం కొంచెం తక్కువే అని చెప్పాలి.

గోపాల్ వాళ్ళ ఊరు పిఠాపురం. అక్కడే అతని తల్లిదండ్రులు ఉంటారు. తల్లి పేరు లక్ష్మి. తండ్రి పేరు శ్రీరాములు. శ్రీరాములు గారు వృత్తి రీత్యా పురోహితుడు. ఊరిలో చాలా మంది పెళ్లిళ్లు చేసి మంచి పేరు సంపాదించారు.

కానీ ఒక విచిత్రం ఏమిటంటే…

ఊరిలో అందరి పెళ్లిళ్లు చేసిన శ్రీరాములు గారు తన కొడుకు పెళ్లి మాత్రం చేయలేకపోతున్నారు.

ఎందుకంటే గోపాల్ పెళ్లి విషయం వస్తే అంత గమ్ముని ఒప్పుకోడు. పైగా ఏ విషయం అయినా ముందుగా గూగుల్‌లో సెర్చ్ చేయడం అతని అలవాటు.

ఒకరోజు పిఠాపురం నుండి లక్ష్మి గారు మరియు శ్రీరాములు గారు హైదరాబాద్‌లో ఉన్న గోపాల్ దగ్గరకు వచ్చారు.

ఇంటికి రాగానే శ్రీరాములు గారు సోఫాలో కూర్చున్నారు. లక్ష్మి గారు గ్లాస్‌లో మంచినీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది.

నీళ్లు తాగుతూ శ్రీరాములు గారు కొడుకును చూసి కోపంగా అన్నారు.

“ఏరా గోపాల్… ఈ సంవత్సరం అయినా పెళ్లికి ఒప్పుకుంటావా లేదా? ఊరిలో తలెత్తుకుని తిరగలేకపోతున్నాం. అందరూ అడుగుతున్నారు.

‘శ్రీరాములు గారు ఊరి వాళ్లందరి పెళ్లిళ్లు చేస్తారు కానీ తన కొడుకు పెళ్లి మాత్రం చేయలేదట’ అని.”

అని గ్లాస్ టేబుల్ మీద పెడుతూ అన్నారు గోపాల్ తో...

గోపాల్ మాత్రం చాలా ప్రశాంతంగా మొబైల్ తీసుకున్నాడు.

అది చూసి లక్ష్మి గారు అడిగింది.

“ఏరా… నాన్న మాట్లాడుతుంటే ఆ ఫోన్ చూస్తున్నావేమిటి? ఏంటి అర్జెంట్?”

గోపాల్ ఫోన్‌లోంచి తల ఎత్తకుండా అమాయకంగా అన్నాడు.

“అమ్మా… నాన్న చెప్పిన విషయం గురించి గూగుల్ ఏమంటుందో చూస్తున్నాను.”

అని వెంటనే గూగుల్‌లో టైప్ చేశాడు.

“40 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకోవడం మంచిదా?”

కొద్దిసేపు చదివి అన్నాడు.

“నాన్న… గూగుల్ చెబుతోంది ఆలస్యంగా పెళ్లి చేసుకున్నా కూడా జీవితం బాగానే ఉంటుంది అంటోంది.”

అది విని శ్రీరాములు గారు తల పట్టుకున్నారు.

“అయ్యో రామా… నేను జీవితంలో వందల పెళ్లిళ్లు చేశాను. కానీ నా కొడుకు పెళ్లి మాత్రం గూగుల్ అనుమతి కోసం ఎదురు చూస్తోంది!”

లక్ష్మి గారు కూడా చెప్పింది.

“అవును రా బాబు… మాకు కోడలు కావాలి. ఇంట్లో కాస్త నవ్వులు వినాలి. మనవళ్లు తో ఆడుకుంటున్నారు మా వయస్సు వాళ్ళంతా.”

అని ప్రేమగా చెప్పి చివరకు గోపాల్‌ను పెళ్లికి ఒప్పించింది.

కొన్ని రోజుల తర్వాత లక్ష్మి గారు ఒక మంచి సంబంధం చూసింది. పైగా ఆడపెళ్లివారు దూరపు బంధువులే.

ఆ అమ్మాయి పేరు సీత. ఆమె హైదరాబాద్‌లో టీచర్‌గా పని చేస్తోంది. మంచి సంస్కారం ఉన్న కుటుంబం.

ఒకరోజు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు.

సీత కాఫీ తీసుకుని హాల్‌లోకి వచ్చింది. అందరూ కూర్చుని మాట్లాడుతున్నారు. గోపాల్ మాత్రం మెల్లగా మొబైల్ తీసుకుని గూగుల్ ఓపెన్ చేశాడు.

అతను టైప్ చేశాడు.

“పెళ్లి చూపుల్లో అమ్మాయిని ఏమి అడగాలి?”

అది చదివి వెంటనే సీతను అడిగాడు.

“మీకు హాబీస్ ఏమిటి?”

సీత నవ్వుతూ చెప్పింది.

“నాకు పాటలు పాడటం, పుస్తకాలు చదవడం ఇష్టం.”

గోపాల్ వెంటనే మళ్లీ గూగుల్‌లో టైప్ చేశాడు.

“పాటలు పాడే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మంచిదా?”

అది చూసి సీతకు నవ్వు వచ్చింది.

ఆమె మెల్లగా అడిగింది.

“మీరు ప్రతి విషయం గూగుల్‌లో చూసి నిర్ణయం తీసుకుంటారా?”

గోపాల్ గర్వంగా అన్నాడు.

“అవును. గూగుల్‌లో చాలా జ్ఞానం ఉంటుంది.”

సీత చిరునవ్వుతో చెప్పింది.

“అయితే పెళ్లి తర్వాత భార్యతో ఎలా మాట్లాడాలో కూడా గూగుల్‌లోనే చూస్తారా?”

అందరూ నవ్వేశారు.

పెళ్లి చూపులు అయిపోయాక సీత గోపాల్‌తో కొద్దిసేపు మాట్లాడింది.

“మీరు మంచి వ్యక్తిలా కనిపిస్తున్నారు. కానీ జీవితంలో కొన్ని నిర్ణయాలు గూగుల్ కాదు… మనసే తీసుకోవాలి.”

అది విని గోపాల్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు.

తర్వాత మొబైల్ తీసుకుని గూగుల్‌లో టైప్ చేశాడు.

“మనసు చెప్పిన మాట వినడం మంచిదా?”

కొద్దిసేపు చదివి నవ్వాడు.

“గూగుల్ చెబుతోంది కొన్నిసార్లు మనసు మాట కూడా వినాలి అని.”

అప్పుడు సీత అడిగింది.

“అయితే ఇప్పుడు మీ మనసు ఏమంటోంది?”

గోపాల్ కొద్దిసేపు ఆలోచించి అన్నాడు.

“నా మనసు చెబుతోంది… మీరు మంచి అమ్మాయి అనిపిస్తున్నారు.”

అది విని శ్రీరాములు గారు ఆనందంగా నవ్వేశారు.

“అయ్యో దేవుడా… చివరికి నా కొడుకు గూగుల్ కాకుండా తన మనసు మాట కూడా విన్నాడు!”

కొన్ని రోజుల తర్వాత రెండు కుటుంబాలు మాట్లాడుకుని పెళ్లి నిర్ణయించారు.

ముహూర్తం రోజున పెద్దగా పెళ్లి జరిగింది. బంధువులు, స్నేహితులు అందరూ వచ్చారు.

పెళ్లి మండపంలో ముహూర్తం దగ్గరపడుతోంది.

అప్పుడే గోపాల్ మళ్లీ మొబైల్ తీసుకున్నాడు.

శ్రీరాములు గారు వెంటనే అడిగారు.

“ఇప్పుడు ఏమి సెర్చ్ చేస్తున్నావురా?”

గోపాల్ నవ్వుతూ అన్నాడు.

“నాన్న… గూగుల్‌లో ఇలా టైప్ చేస్తున్నాను…”

“మంచి భర్తగా ఎలా ఉండాలి?”

అది విని శ్రీరాములు గారు నవ్వుతూ అన్నారు.

“రా గోపాల్… ఇప్పుడు గూగుల్ కాదు… నీ భార్య చెప్పిందే విను. అదే నిజమైన జ్ఞానం!”

అందరూ గట్టిగా నవ్వేశారు.

పెళ్లి అయిపోయి కొన్ని రోజులు గడిచాయి.

ఒకరోజు ఉదయం సీత వంటగదిలో వంట చేస్తోంది. గోపాల్ సోఫాలో కూర్చుని మొబైల్ చూస్తున్నాడు.

సీత అడిగింది.

“మళ్లీ గూగుల్‌లో ఏమి చూస్తున్నారు?”

గోపాల్ అమాయకంగా అన్నాడు.

“భార్య కోపంగా ఉన్నప్పుడు ఎలా శాంతింప చేయాలి అని చూస్తున్నాను.”

సీత నవ్వింది.

“అయితే గూగుల్ ఏమంటోంది?”

గోపాల్ చదువుతూ అన్నాడు.

“క్షమాపణ చెప్పాలి… గిఫ్ట్ ఇవ్వాలి… కాఫీ చేసి ఇవ్వాలి అంటోంది.”

సీత నవ్వుతూ చెప్పింది.

“గూగుల్ చెప్పింది అంతా చేయాల్సిన అవసరం లేదు. ముందు మీరు కాఫీ పెట్టడం నేర్చుకుంటే చాలు.”

గోపాల్ వెంటనే టైప్ చేశాడు.

కాఫీ త్వరగా ఎలా తయ్యారు చేయాలి ”

సీత నవ్వుతూ చెప్పింది.

“గూగుల్ కాదు గోపాల్… నేను నేర్పిస్తాను.”

గోపాల్ మొబైల్ పక్కన పెట్టి అన్నాడు.

“అయితే ఇకనుంచి నా గూగుల్ నువ్వన్న మాట.

అది విని ఇద్దరూ నవ్వేశారు.

అప్పుడే శ్రీరాములు గారు ఫోన్ చేశారు.

“ఏరా గోపాల్… ఎలా ఉంది పెళ్లి జీవితం?”

గోపాల్ నవ్వుతూ అన్నాడు.

“నాన్న… గూగుల్ కన్నా పెళ్లి జీవితం చాలా పెద్ద సబ్జెక్ట్ అని ఇప్పుడు అర్థమైంది!”

అది విని శ్రీరాములు గారు నవ్వుతూ చెప్పారు.

“అది తెలుసుకోవడానికి గూగుల్ అవసరం లేదు రా… పెళ్లి చాలు!”

ఆ మాటలు స్పీకర్ ఫోన్ లో విన్న లక్ష్మి గారు మసి ముసి గా నవ్వు కుంది కొడుకు మాటలు విని.

అలా చివరకు గూగుల్ మీద ఆధారపడే గోపాల్ కూడా పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని నవ్వులతో ప్రారంభించాడు.

(వాళ్ళ కాపురం ఎలావుందో తెలుసు కోవాలని మీరు గూగుల్ ల్లో వెతక్కం డే)

అరుణాచలేశ్వరా

 _తండ్రీ అరుణాచలేశ్వరా!🌹_ 


ఏ ఆర్తి 

కోటాను కోట్ల 

జీవ రాశులలో 

నను వేరు చేసి

నీ వాత్సల్యానికి 

దగ్గర చేసేది 

ఏ భక్తి 

జన్మ జన్మల 

కర్మఫలితములను 

దాటించి 

నీ కరుణకు 

పాత్రుని చేసేది 

ఏ సాధన 

మాయలో మునిగి 

తనని తానూ మరచిన

జీవునికి జ్ఞానము 

ప్రసాదించి 

నీ చెంతకు చేర్చునది 

ఆ ఆర్తిని

ఆ భక్తిని

ఆ సాధనని

ఈ కింకరునికి 

ఒసగి నీ దరికి 

చేర్చుకో 

పరమేశ్వరా ....


 _హరః నమః పార్వతీ పతయే హరహర మహాదేవ శంభో శంకర🙏_

ఘోల్లు మన్న సెల్లు (హాస్య కథ)*

 *ఘోల్లు మన్న సెల్లు (హాస్య కథ)*


📱📱📱📱📱📱📱📱📱📱



***ఓరీ మీ దుంపలు తెగా , మీరెక్కడ తయారయ్యారు రా....***


అని గొంతు వినిపిస్తే ఒక్కసారిగా ఉలిక్కిపడి అటూ ఇటూ చూశాను !!! మొబైల్ లో ఏదో హాస్య కార్యక్రమం చూస్తూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్న నాకు ఉన్నట్టుండి 


""నిన్నే దరిద్రుడా !! అని వినిపించింది"", 


అంతే నాకు సర్రున నా కోపం నషాళానికి అంటుతుండగా *ఎవర్రా అంత ధైర్యంగా నన్ను తిట్టేది అరుస్తూ ఒక్క ఉదుటున లేచి అటూ ఇటూ చూశాను కానీ చుట్టుపక్కల ఎవరూ కనిపించకపోవటంతో*


 నా చరవాణే నన్ను తిడుతున్నది అని అర్థం అవ్వటానికి చాలా సమయం పట్టింది , అలా అర్థం అయ్యసరికి నాకు మూర్చ వచ్చినంత పని అయ్యింది.....


ఆ హఠాత్పరిణామానికి *నేను వింటూ వింటున్నది చూస్తున్నది నిజమేనా?? అనుకుంటూ, నన్ను నేను ఓ సారి చేతి మీద గిచ్చుకుంటూ , కెవ్వని అరచుకుంటూ , షాక్ కొట్టిన కాకిలా అలా బిగుసుకుపోయి నా సెల్లునే చూస్తున్నాను* అదేదో హారర్ సినిమా చూస్తున్నట్లు , అలా గుడ్లప్పగించి నా సెల్లునే చూస్తుంటే , మళ్ళీ నా సెల్లే తిట్ల డండకం ప్రారంభించింది....


నా పేరు రవి , నేను బ్యాంకులో ఆఫీసర్ గా పని చేస్తున్నాను , మహా అయితే రోజు మొత్తం మీద మూడు నాలుగు గంటలు పని ఉంటుందేమో తర్వాత మిగతా టైం అంతా ఖాళీగా ఉండటం వల్ల నా సెల్లులోనే నాకు ఎక్కువ కాలక్షేపం అవుతూ ఉంటుంది, ఎంతలా అంటే """ఆ కాలక్షేపానికి మూల్యం నా జీవితం అన్న విషయం కూడా మరచిపోయేంత, నేను పెళ్లి చేసుకున్నాను నాకు పిల్లలు ఉన్నారు అన్న సంగతి కూడా పక్కన పెట్టి దానితోటిదే లోకం ఐపోయింది. 


ఎలాగంటే , అదేదో నెలల పిల్లని అపురూపంగా చూసుకున్నట్లుగా చూసుకునేవాడిని....


""నా వాడకానికి , సెల్లుని బోలెడు డబ్బులు పోసి కొన్న దానికి పైసా వసూలు చేస్తున్నట్టుగా అనిపించేది నాకు""".


""""కానీ , కానీ సెల్లు మాట్లాడడం ఏమిటో నాకు అర్థం కాలేదు"""???


 నేను ఏమైనా భ్రమలో ఉన్నానా అనుకోని చుట్టుపక్కలంతా గమనించాను, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు , సెల్లు మాట్లాడుతోంది అన్న విషయం నాకు నా సెల్ కి తప్ప ఎవరికీ వినిపించట్లేదు కనిపించట్లేదు ఒకవేళ ఎవరైనా చూస్తే నాకు మతిభ్రమించింది అనుకుంటారేమో అని ఒక పక్క భయం.....


నేను అలా అటూ ఇటూ చూస్తుండగానే నా సెల్లు మళ్ళీ నన్ను తిట్టడం మొదలెట్టింది , ఎండాకాలంలో ఏసీ కోసం ఏటీఎంలోకి వెళ్లే అంట్లకుంకలా ఇక్కడ తిడుతుంటే అటూ ఇటూ దిక్కులు చూస్తావేరా పింజారి వెధవా !!! నేను తిడుతున్నది నిన్నే అంటూ మొదలెట్టింది......


నువ్వు వాడే వాడకానికి నేను ఎంత నలిగిపోతున్నానో నీకు అర్థమవుతుందా అసలు ?? అంటూ ఓ రెండు సెకన్లు దీర్ఘంగా ఆకాశంలోకి చూసి నిట్టూర్చింది...... నేను కూడా దానితో పాటు ఒకసారి అలా పైకి చూశాను.... కానీ అక్కడ ఏం లేదు....


దీర్ఘంగా వైబ్రేటిస్తూ మొదలెట్టింది చెప్పడం """"ఏదో నువ్వు పడుకున్నప్పుడు నాలుగైదు గంటలు తప్పితే నా ప్రాణానికి సుఖం ఎక్కడ ఉంది, నువ్వు లేస్తున్నావు అంటేనే నాకు గుండెదడ మొదలౌతున్నది , అప్పుడప్పుడు ఒక్క పర్సెంట్ ఛార్జింగ్ కోసం ఎంత గిల గిల లాడుతానో switch off అయ్యే నాకు మాత్రమే తెలుసు......ఆ అనుభవం ఎలా ఉంటుందంటే ఆకాశం నుంచి పారచూట్ లేకుండా కిందకి విసిరేస్తున్నట్లుగా ఉంటుంది...... 



 """పొద్దున్నే లేస్తూనే ఆ పాచి మొహంతో మొదలెడతావు నీ దినచర్య , లేస్తూనే సంతలో తప్పిపోయిన పిల్లాడు తల్లిని వెతికి వెతికి తల్లిని చూడగానే కరుచుకుపోయినట్లు నన్ను వెదికి పట్టుకుంటావ్, అక్కడ నుంచి మొదలవుతుంది నా అవస్థ......""""


ఎక్కడికి వెళ్తే అక్కడకి నన్నూ తీసుకెళ్తావ్ , స్నానానికి !! బ్రష్ చేస్తూ !! టిఫిన్ తింటూ !! దరిద్రాతి దరిద్రం , థూ నా బతుకు చెడా, టాయిలెట్లోకి కూడా తీసుకెళ్తావ్ నన్ను ?? ఈ దరిద్రాలన్నీ చూస్తూ ఇంకా బతికున్నాను నేను అంటూ బావురుమంది....


*అది కాదూ అంటూ మొహం అదోరకంగా పెట్టి, ఏదో సద్ది చెప్పపోయాను కాస్త, అంతే మళ్ళీ అంతెత్తు వైబ్రేట్ అవుతూ , వినటానికి విల్లింగ్ గా ఉంటే భారతంలో కృష్ణుడికి అర్జునుడికి ఇంత చెప్పాడంట అంటూ సాగదీసింది*   


తెల్లవారు ఝామున ఐదింటికి లేస్తావు , రాత్రి ఒకటింటి వరకూ నన్ను వాడుతూనే ఉంటావు , ఏ ?? మాకంటూ ప్రైవేట్ లైఫ్ ఉండదా ?? , మీకు సర్వీస్ చేయలేక చస్తున్నాను, ఈమధ్య హెల్త్ కూడా పాడైపోతుంది, చస్తే బాగుండు అనిపిస్తోంది , ఎవడికి చెప్పు కొనేది నా బాధ అంటూ , నా సెల్లు దానిని ఎలా వాడతానో నాకే చెప్తుంటే తలకాయ దించుకొని *హి హి హి* అంటూ నవ్వటం మొదలెట్టాను......


నా నవ్వు చూసి నా సెల్ కి ఇంకా ఒళ్ళు మండిపోయింది , జంధ్యాల సినిమా లెవెల్ లో బండ బూతులు తిడుతుంటే చీకేసిన తాటికాయ మొహం వేసుకుని నవ్వుతావేరా అంటూ, కోటా శ్రీనివాసరావుని బ్రహ్మానందం తిట్టినట్టు ఎడాపెడ వాయించేస్తుంది నన్ను....


ఇంతలో మా ఆవిడ నన్ను ఏవండీ ?? ఏవండీ ?? అని గట్టిగా తడుతూ లేపింది, అంతే ఒక్కసారిగా మెలకువ వచ్చి ఉలిక్కిపడి లేచాను , లేస్తూనే అటూ ఇటూ వెర్రి చూపులు చూస్తున్న నన్ను మా ఆవిడ అడిగింది , ఏమైందండీ ??ఎందుకలా నిద్రలో అరుస్తున్నారు , ఏమైనా పీడకల వచ్చిందా అంటూ...... అప్పుడు అర్థమయింది నాకు సెల్లు నాతో మాట్లాడడం , నన్ను తిట్టడం అంతా కల అని....


పొద్దున్నే లేచి కాఫీ తాగుతూ నా సెల్లునే తదేకంగా చూస్తూ ఆలోచిస్తున్నాను, అవడానికి కలైనా నిజంగా ఈ రోజుల్లోని సెల్లుల బాధ నిజంగా ఇదేనేమో , అంతేనేమో అనిపించింది నాకు. అప్పటినుంచి నేను సెల్లు వాడటం చాలా మటుకు తగ్గించేసి , కుటుంబంతో ఎక్కువసేపు గడపడం మొదలు పెట్టాను , ఆ సెల్లుని చూస్తున్నప్పుడల్లా , అసలు ఏ సెల్లును చూస్తున్నా కూడా నాకు ఆ కల మాత్రం నా జీవితంలో మర్చిపోలేని స్థితికి వచ్చేసాను , నన్ను జీవితాంతం వెంటాడే కల బహుశా ఇదేనేమో.......


ధన్యవాదాలు 🙏

నేను రాసిన ఈ ఘోల్లు మన్న సెల్లు అను హాస్య కథ నా అందరినీ అలరించిందని అనుకుంటున్నాను..



*అరుణా సువర్చల*

కలం పేరు:: చంద్రిక ✍️

మార్చే గీత*

  *మన తలరాత* 

 *మార్చే గీత* 

             

*మన లోపల ఒకడు ఉన్నాడు... అసలైన వాడు.*


*కానీ వాడిదగ్గరికి వెళ్ళాలి అంటే 6 గురు దొంగలు అడ్డుగా ఉన్నారు...*


*కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య అనే 6 గురు దొంగలు..!*


*ఈ 6 గురిలో 4 గురు దొంగల నుండి సులభంగా తప్పించు కోవచ్చు, కానీ ఇద్దరు దొంగలనుండి తప్పించు కోవడం చాలా కష్టం...*


*ఆ ఇద్దరూ పెద్ద రౌడీలు. వాళ్ళే కామం, క్రోధం... ఈ ఇద్దరు రౌడీలు ఎక్కడ దాక్కొని ఉంటారు అంటే రజో గుణం అనే ఇంట్లో...*


*" కామ ఏష క్రోధ ఏష రజో*

  *గుణ సముద్భవహ "* 


*ఈ కామం, క్రోధం అనేవి రజో గుణం నుండి వస్తున్నాయి అని గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు...*


*కాబట్టి రజో గుణం అనే ఇంట్లో ఈ ఇద్దరు దొంగలు ఉంటారు*.


*ఈ దొంగలను పట్టుకోవాలి అంటే రజో గుణం అనే ఇంటికి తాళం వేయాలి. అంతే, ఇంక వాళ్ళు బయటికి రాలేరు... అయితే ఈ రజో గుణం అనేది First floor... ఇంకా మనం First floor కు రాలేదు... మనం Ground floor లో ఉన్నాం.*


*మనలో ఉండే తమో గుణమే ఆ Ground floor.*


*అంటే మనం తమో గుణంలో ఉన్నాం.*


*బద్దకం, అతి నిద్ర, ఆలస్యం, నిర్లక్ష్యం ఇవే తమో గుణం... ఇలాంటి తమో గుణంలో మనం ఉన్నాం... ఇంకా Ground floor లోనే ఉన్నాం.*


*ఈ Ground floor నుండి పైకి రావాలంటే చాలా కష్టం. అలాటి ఈ Ground floor నుండి పైకి వచ్చి, First floor కు వెళ్లి అక్కడ ఉండే 6 గురు దొంగలను తప్పించుకొని ఇంకా పైకి వెళ్తే అప్పుడు Second floor వస్తుంది.*


*ఆ floor పేరు ‘సత్వ గుణం..’*


*ఈ floor చాలా పెద్దగా ఉంటుంది... హాయిగా ఉంటుంది...*


*ఎక్కడ చూసినా వెలుగే ఉంటుంది...*


*అయితే చిన్న సమస్య... ఇక్కడ ఒకే ఒక దొంగుంటాడు. భయపడకండి...*


*వాడు...*

*మంచి దొంగ... వాడు మీకు మంచి మాటలే చెబుతూ ఉంటాడు మీకు Third floor కు దారి చూపిస్తాడు... ఆ floor పేరు శుద్ధ సాత్వికం... ఇదే చివరిది... ఇక్కడే మీకు అఖండమైన వెలుగులో కలిసిపోయింది... ఆ అఖండమైన వెలుగే పరమాత్మ...*


*అది వెలుగులకు వెలుగు, మహావెలుగు.*


*చివరిగా ఒక good news ఏమిటంటే మనం Ground floor నుండి third floor వరకు వెళ్ళడానికి ఒక లిఫ్ట్ ఉంది.*


*ఆ Lift పేరే "భగవద్గీత".*


*గీతను చదువుతూ ఉంటే తమో గుణం నుండి రజో గుణానికి, రజో గుణం నుండి సత్వ గుణానికి, సత్వ గుణం నుండి శుద్ధ సత్వం వరకు మనం ప్రయాణం చేసి, చివరికి శాశ్వతమైన స్థానాన్ని చేరుకోవచ్చు.*

*పునర్జన్మ లేకుండా చేసుకోవచ్చు...

🪷🪷🪷🪷🪷 ఓం నమో శ్రీ వేంకటేశాయ గ్రూపు సభ్యుల భక్తులకు విజ్ఞప్తి.

🙏🙏🙏🙏

👉 మన గ్రూపులోని విషయాలు మీ మనసుకు నచ్చినట్లయితే దయచేసి 

మీ స్నేహితులను, బంధువులను, శ్రేయోభిలాషులను, మన గ్రూపు లో సభ్యులుగా జాయిన్ చేయించండి, వారిని ꧁గోవిందా꧂

9676434666

 వాట్సాప్ వాయిస్ మెసేజ్ పెట్టమని చెప్పండి🙏

🪷🪷🪷🪷🪷

🟢🟡🔴🔵

మృత్యువుకు ఎంత దగ్గరగా వచ్చాము

 *మృత్యువుకు ఎంత దగ్గరగా వచ్చాము..?*


• మానవ జాతి మనుగడ కోసమై ఉన్నఫళం గా "500" కోట్ల మొక్కలను నాటవలసిన అవసరం ఉన్నది..!


• "ఈ వేసవి మామూలు వేసవి కాదు..! ఇది ఓ హెచ్చరిక..!"


*ఈ రోజు బయట అడుగు పెడితే మాడిపోతున్నాం..!*


• ఉదయం 6 గంటలకు కూడా వేడి తగ్గడం లేదు, రోజంతా..24 గంటలు రోడ్లన్నీ నిప్పులు కక్కుతునే ఉన్నాయి...ఫ్యాన్ గాలి చాలటం లేదు.. 


• ఏసీ లేనిదే బతకలేని దుస్థితికి వచ్చాం..కానీ మనం ఎంతకాలం ఏసీలను ఆశ్రయిస్తాం..? 


• నిప్పులు కక్కుతున్న నిజాలను చూడండి..!


*1. ఉష్ణోగ్రత పెరుగుదల:*


• భారతదేశంలో 45°C సాధారణం అయిపోయింది..రాజస్థాన్, విదర్భలో 49°C దాటుతోంది..!


• 56°C వద్ద మానవ మెదడు పని చేయడం ఆగిపోతుంది..


• 60°C కి చేరడానికి మనం చాలా దగ్గరగా ఉన్నాము.

  

*2. ఏసీ మాత్రమే పరిష్కారం కాదు:* 


• ఒక ఏసీ బయటకు వదిలే వేడి..10 వృక్షాలను నరికినంత ప్రభావాన్ని చూపుతుంది...


• మనం చల్లదనం కోసం భూమిని ఇంకా వేడెక్కిస్తున్నాం...


*3. చెట్లు ఎక్కడ..?* 


• భారతదేశానికి ఇప్పుడు తక్షణం 500 కోట్ల మొక్కలను పెంచాల్సిన అవసరం ఉంది...


• 1970లో 40% ఉన్న అటవీ విస్తీర్ణం, ఇప్పుడు 21% కి పడిపోయింది..


*మనం ఏం కోల్పోతున్నాం..?*

 

• ఒక పెద్ద చెట్టు రోజుకు నాలుగురికి "4" సరిపడా ఆక్సిజన్ ఇస్తుంది. పైగా 20 ఏసీలకు సమానమైన చల్లదనాన్ని ఇస్తుంది...


• భూగర్భ జలాలను పెంచుతుంది..వర్షాలను ఆహ్వానిస్తుంది...


• కానీ మనం అభివృద్ధి పేరుతో నిమిషానికి "15" చెట్లను నరుకుతున్నాం..!


• మొక్కలను నాటడం పెంచడం ప్రభుత్వ బాధ్యత మాత్రమేనా..?, కాదు..కదా..ప్రతి పౌరుడి బాధ్యత.. 


*ఒక మొక్క పెరిగి నీడ ఇవ్వడానికి "5 నుండి 7 ఏళ్లు" పడుతుంది..*


• అంటే మనం ఈ రోజు మొక్కను నాటితే, కనీసం 2032లో ఫలితాన్ని చూస్తాం. 


• ఇంకా ఆలస్యం చేస్తే, 60°C భూమిని మన పిల్లలకు అప్పగిస్తాం...


*మనం ఇప్పుడేం చేయాలి..?*


• వర్షాకాలం మొదలైంది, గట్టి వానలు పడి, భూమి బాగా తడిసిన వెంటనే మొక్కలను నాటడానికి సరైన సమయం అదే.. 


*మనందరి బాధ్యత ఏమిటి..?*


*1. ఈ వర్షాకాలంలో ప్రతీ మనిషి 2 రెండు మొక్కలు చొప్పున నాటండి..*


• తమ ఇంటి ముందు, స్కూల్లో, ఖాళీ స్థలంలో ఎక్కడైనా..వేప, రావి, మర్రి, చింత లాంటి దేశీయ మొక్కలను నాటండి...


*2. నాటిన ప్రతీ మొక్కకూ నీరు పెట్టి ..కంచె వేసి, సంరక్షించి, బ్రతికించే బాధ్యత మనందరిదీ..*


• మనం మారకపోతే, ప్రకృతి మనల్ని మార్చేస్తుంది. ఆ మార్పు "మృత్యువు" రూపంలో ఉంటుంది..లేదా చూడాల్సి వస్తుంది..ఏసీ రిమోట్ పక్కన పెట్టి, ఒక పొలుగు, పార పట్టుకోండి.. 


• "మన పిల్లల ఊపిరి కోసం, ఈ భూమి కోసం ప్రతి ఇంటికి" ఈ రోజే ప్రతీ ఒక్కరు రెండేసి(2) మొక్కల చొప్పున నాటుదాం..  


• "ఈ రెండు మొక్కలకు - ప్రాణం పోసే పనిని చేపట్టి.." మనలను కాపాడుకొంటూ భావితరాలను కూడా కాపాడుకుందాము.


🌹🌱🌴🌲🌳😊🙏

పంచాంగం 18.06.2026

  ఈ రోజు పంచాంగం 18.06.2026 Thursday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాస శుక్ల పక్ష చతుర్థి తిథి బృహస్పతి వాసర పుష్యమి నక్షత్రం వ్యాఘాత యోగః వణిజ తదుపరి భద్ర కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

 

యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు.

  


శ్రాద్ధ తిథి: చతుర్థి


 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                       పంచమోధ్యాయః

                కర్మ సన్యాస యోగము

 

సంన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః ।

యోగయుక్తో మునిర్బ్రహ్మా నచిరేణాధిగచ్ఛతి ।। 6 ।।



ప్రతిపదార్థ:



సన్యాసః — సన్యాసము; తు — కానీ; మహా-బాహో — గొప్ప బాహువులు కలవాడా; దుఃఖమ్ — దుఃఖము; ఆప్తుమ్ — పొందును; అయోగతః — కర్మ యోగము లేకుండా; యోగ-యుక్తః — కర్మ యోగములో ప్రవీణుడు; మునిః — ముని; బ్రహ్మ — బ్రహ్మన్; న చిరేణ — త్వరితముగా; అధిగచ్ఛతి — చేరును.


 

 తాత్పర్యము : 


భక్తి యుక్తముగా పని చేయకుండా (కర్మ యోగము) పరిపూర్ణ కర్మ సన్యాసమును చేరుకొనుట చాలా కష్టము, ఓ గొప్ప బాహువులు కలవాడా, కానీ, కర్మ యోగములో నిష్ణాతుడైన ముని శీఘ్రముగా పరమాత్మను పొందును.




వివరణ:


హిమాలయాల గుహలలో నివసించే ఓ యోగి, తాను జగత్తునుండి సన్యసించినట్టు భావించవచ్చు, కానీ, అతను పట్టణానికి తిరిగి వచ్చినప్పుడు అతని సన్యాసము యొక్క నిజమైన పరీక్ష చేయబడుతుంది. ఉదాహరణకి, ఒక సాధువు పన్నెండు సంవత్సరాలు గర్హ్వాల్ పర్వతాలలో నియమనిష్ఠలను అభ్యాసం చేసాడు. ఒకసారి అతను కుంభమేళాలో పాల్గొనటానికి హరిద్వార్ వచ్చాడు. ఆ కుంభమేళా హడావిడిలో ఎవరో ఒక అతను పొరపాటున తన చెప్పుతో ఉన్న కాలిని ఆ యోగి పాదాలపై ఉంచాడు. ఆ సాధువు కోపంతో ఊగిపోయి, ఇలా అరిచాడు ‘ఏంటి గుడ్డి వాడివా? ఎక్కడకి పోతున్నావో చూసుకోలేవా?’ అని. తరువాత కోపానికి తాను వశమైపోయినందుకు ఇలా చింతించాడు, ‘పన్నెండేళ్లు కొండలలో నియమనిష్ఠలతో చేసిన అభ్యాసం, ఒక్క రోజు నగరంలో ఉండటం వలన వృధా అయిపోయింది’ అని. ఈ ప్రపంచమే, మన సన్యాసం పరీక్షించబడే రంగ స్థలం.


ఈ లోకంలో తన ధర్మములు నిర్వర్తిస్తూ ఉండి, వ్యక్తి క్రమక్రమంగా కోపము, లోభము, మరియు కామములకు అతీతంగా ఎదగటానికి ప్రయత్నించాలి, అని శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో అంటున్నాడు. ఇలాకాక, ఎవరైనా తన విధులను త్యజిస్తే, మనస్సును పరిశుద్దం చేసుకోవటం చాలా కష్టం; మరియు పరిశుద్ధమైన మనస్సు లేకుండా నిజమైన వైరాగ్యం సుదూరపు స్వప్నంగానే మిగిలిపోతుంది.


మనమందరమూ మన సహజ స్వభావంచే పని చేయటానికి ప్రేరేపింపబడుతాము. అర్జునుడు ఒక యోధుడు, కానీ, కృత్తిమంగా తన ధర్మమును త్యజించి, అడవులకు పారిపోతే, అతని స్వభావం అక్కడ కూడా పనిచేపిస్తుంది. బహుశా ఎవరో కొంత మంది గిరిజనులను పోగుచేసి వారికి తానే రాజును అని ప్రకటించుకుంటాడేమో. బదులుగా, తన సహజ గుణాలని, ప్రతిభని భగవంతుని సేవలోనే ఉపయోగిస్తే అది ఏంతో ఫలదాయకంగా ఉంటుంది. కాబట్టి, భగవంతుడు అతనికి ఇలా ఉపదేశిస్తున్నాడు, ‘యుద్ధం కొనసాగిస్తూనే ఉండు, కానీ ఒక్క మార్పు చేయుము. మొదట్లో నీవు రాజ్య కాంక్షతో ఈ యుద్ధ భూమికి వచ్చావు. ఇప్పుడు దానికి బదులుగా నీ సేవని నిస్వార్థముగా ఆ భగవంతుకే అర్పించుము. ఈ విధముగా, నీవు సహజంగానే నీ మనస్సుని పవిత్రం చేసుకుని, నిజమైన అంతర్గత సన్యాసమును సాధించవచ్చు.’


పిందెగా మరియు కచ్చగా ఉన్న పండు, తనను మోసి, పోషించే చెట్టుకి గట్టిగా అతుక్కుని ఉంటుంది. అదే పండు, పూర్తిగా పండినప్పుడు, తనకు ఆధారంగా ఉన్న దాని నుండి విడిపోతుంది. అదే విధంగా, సంపూర్ణ విజ్ఞానంగా పరిపక్వత చెందే అనుభవం, కర్మ యోగికి, ఈ భౌతిక జగత్తు నుండి అందుతుంది. ఎలాగైతే కష్టపడి పనిచేసినవారికే గాఢ నిద్ర పడుతుందో, కర్మ యోగము ద్వారా మనస్సుని పరిశుద్ధమొనర్చుకున్నవారికే గాఢమైన ధ్యానం సాధ్యమవుతుంది.

పాదారవింద శతకం - 2*

 *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*పాదారవింద శతకం - 2*


*శ్లోకము - 14*


*పవిత్రీకుర్యుర్నుః పదతలభువః పాటలరుచః*

*పరాగాస్తే పాపప్రశమనధురీణాః పరశివే ।*

*కణం లబ్ధుం యేషాం నిజశిరసి కామాక్షి వివశా*

*వలంతో వ్యాతన్వంత్యహమహమికాం మాధవముఖాః ॥*


*భావము :*


*జగన్మాతా! నీ పాదములపై ఉన్న ధూళి కణములను తమ శిరసుపై ధరించాలని, బ్రహ్మ, విష్ణువు మొదలైన దేవతలంతా, ఒకరినొకరు తోసుకుంటూ ప్రయత్నిస్తున్నారు. నీ అరుణ పాదముల ధూళి కణములు నా శిరసుపై పడి నన్ను పవిత్రుని చేయుగాక.*


🙏🙏🙏 *శ్రీమాత్రే*శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*పాదారవింద శతకం - 2*


*శ్లోకము - 14*


*పవిత్రీకుర్యుర్నుః పదతలభువః పాటలరుచః*

*పరాగాస్తే పాపప్రశమనధురీణాః పరశివే ।*

*కణం లబ్ధుం యేషాం నిజశిరసి కామాక్షి వివశా*

*వలంతో వ్యాతన్వంత్యహమహమికాం మాధవముఖాః ॥*


*భావము :*


*జగన్మాతా! నీ పాదములపై ఉన్న ధూళి కణములను తమ శిరసుపై ధరించాలని, బ్రహ్మ, విష్ణువు మొదలైన దేవతలంతా, ఒకరినొకరు తోసుకుంటూ ప్రయత్నిస్తున్నారు. నీ అరుణ పాదముల ధూళి కణములు నా శిరసుపై పడి నన్ను పవిత్రుని చేయుగాక.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏 నమః* 🙏🙏🙏

గురువారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

18-06-2026 గురువారం రాశి ఫలితాలు


మేషం


చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పవు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.  

--------------------------------------- 


వృషభం


వివాదాలకు సంబందించి విలువైన విషయాలు సేకరిస్తారు. రాజకీయ వర్గం వారితో పరిచయాలు పెరుగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో పురోగతి కలుగుతుంది.

---------------------------------------


మిధునం


ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. గృహమున కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వ్యాపార ప్రారంభమునకు అవాంతరాలు తప్పవు. అనుకోని ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

---------------------------------------


కర్కాటకం


ప్రణాళికలు రూపొందించుకుని క్రమపద్ధతిలో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. 

---------------------------------------


సింహం


నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నూతన గృహ వాహన యోగం ఉన్నది, వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో విశిష్ఠ గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

---------------------------------------


కన్య


కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. నూతన వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యత పెరుగుతుంది.

---------------------------------------


తుల


బంధువులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ప్రయాణాలలో మరింత జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు స్థాన చలన సూచనలు ఉన్నవి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి.  

---------------------------------------


వృశ్చికం


ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ముఖ్య వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో మీ విలువ మరింత పెరుగుతుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

---------------------------------------


ధనస్సు


నిరుద్యోగులకు అరుదైన అవకాశములు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. పాతబాకీలు వసూలవుతాయి. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన వాహన యోగమున్నది.

---------------------------------------


మకరం


చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. బంధువులతో వివాదాలు సర్దుమణుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. దాయాదులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు తప్పవు.

---------------------------------------


కుంభం


మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. స్ధిరాస్తి వివాదాలకు సంబంధించి జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చవు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఇతరుల నుండి కొంత ఇబ్బందులు తప్పవు.

---------------------------------------


మీనం

 

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి.



---------------------------------------

గురువారం *గురు-పుష్యయోగం*

   18.06.2026 – గురువారం *గురు-పుష్యయోగం* 


ఉమా చతుర్థి, వరద గణేశ పూజ, కదళీగౌరీవ్రతం, *గురుపుష్యయోగం* 


ఋషిపీఠం


ఈ రోజున అమ్మవారిని 'ఉమా' నామంతో (శ్రీ ఉమాయై నమః) షోడశోపచారాలతో పూజించడం వలన సకల శుభములు కలుగుతాయి. ఉమాదేవి ప్రీతికై ప్రత్యేక హోమ విధానం కూడా శాస్త్రములో చెప్పబడింది. ప్రసిద్ధిగానున్న 'గణానాం త్వా..' అనే మంత్రములో చెప్పబడ్డ ‘జ్యేష్ఠ' రాజైన గణపతిని జ్యేష్ఠ చతుర్థినాడు 'ప్రద్యుమ్న గణపతి' నామముతో పూజ చేసి పండ్లు, దుంపలు దానము చేస్తే గణపతి అనుగ్రహం కలుగుతుంది. *గురువారం, పుష్యమి నక్షత్రం* కలిసిన అలభ్యయోగం నాడు ఏ పాటి పుణ్యకార్యమైన గురు అనుగ్రహం వల్ల అధికఫలితాలను కలుగజేస్తుంది.

తిరుమల సమాచారం*

 🕉️🕉️🕉️🕉️🕉️


*ఓం నమో వేంకటేశాయ*



*తిరుమల సమాచారం*


*18-జూన్-2026* 

*గురువారం* 



🕉️ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...


🕉️ వైకుంఠంలోని *31* కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు


🕉️ ఉచిత సర్వదర్శనానికి సుమారు *10* గంటల సమయం.


🕉️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి *7* గంటలు..



🕉️ రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు *5* గంటల సమయం



🕉️ నిన్న *17-06-2026* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *82,438* మంది...


🕉️ నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... *39,948* మంది...


🕉️ నిన్న స్వామివారి హుండి ఆదాయం *4.24* కోట్లు ... 

 


    *🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*

పంచాంగము

 


17, జూన్ 2026, బుధవారం

ఆలోచనకూ ఒక విశిష్ఠత

 *మనలో కలిగే ప్రతీ ఆలోచనకూ ఒక విశిష్ఠత ఉంది, కనుక ఆలోచనలు సరియైనవిగా ఉండాలి.


*మితమైన ఆహారం, నడత, కర్మాచరణలో మితమైన ప్రవర్తన, మితమైన నిద్ర, జాగరణ కలిగి ఉన్న సాధకునికి సమస్తములైన దుఃఖాలు తొలగిపోతాయి. ఆ యోగం ఫలవంతమౌతుంది.


*మనస్సులో అలజడి కలిగినప్పుడు అది శరీరంపై ప్రభావాన్ని చూపుతుంది. మనస్సు, శరీరం సవ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యం, ఆనందం ప్రాప్తిస్తాయి.


*బాహ్య విషయాలను గురించి చింతించనవసరం లేదు. ఒక నిర్ణీత పద్ధతిలో ఒక క్రమముతో పనిచేస్తే ఆనందం స్వంతమవగలదు.


*మన ఆహార విహారాలు ఒక క్రమమును కలిగి ఉన్నప్పుడు శరీరం శక్తివంతంగా పనిచేస్తుంది. మన ఆలోచనలు, ఆచరణలు సక్రమంగా ఉంటే జీవితం నిస్సారంగ అనిపించదు.


*పనికి ఎప్పుడూ అలసట, విశ్రాంతి అనేవి ఉండవు, చేసే వ్యక్తి మనఃస్థితిని బట్టి అవి *మనలో కలిగే ప్రతీ ఆలోచనకూ ఒక విశిష్ఠత ఉంది, కనుక ఆలోచనలు సరియైనవిగా ఉండాలి.


*మితమైన ఆహారం, నడత, కర్మాచరణలో మితమైన ప్రవర్తన, మితమైన నిద్ర, జాగరణ కలిగి ఉన్న సాధకునికి సమస్తములైన దుఃఖాలు తొలగిపోతాయి. ఆ యోగం ఫలవంతమౌతుంది.


*మనస్సులో అలజడి కలిగినప్పుడు అది శరీరంపై ప్రభావాన్ని చూపుతుంది. మనస్సు, శరీరం సవ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యం, ఆనందం ప్రాప్తిస్తాయి.


*బాహ్య విషయాలను గురించి చింతించనవసరం లేదు. ఒక నిర్ణీత పద్ధతిలో ఒక క్రమముతో పనిచేస్తే ఆనందం స్వంతమవగలదు.


*మన ఆహార విహారాలు ఒక క్రమమును కలిగి ఉన్నప్పుడు శరీరం శక్తివంతంగా పనిచేస్తుంది. మన ఆలోచనలు, ఆచరణలు సక్రమంగా ఉంటే జీవితం నిస్సారంగ అనిపించదు.


*పనికి ఎప్పుడూ అలసట, విశ్రాంతి అనేవి ఉండవు, చేసే వ్యక్తి మనఃస్థితిని బట్టి అవి కలుగుతాయి.కలుగుతాయి.

నిర్ణయించేది వేదములు,

 మానవులు తన జీవిత కాలంలో ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో నిర్ణయించేది వేదములు, శాస్త్రములు, అవే అందరికీ ప్రమాణములు. కాబట్టి ఈ బాహ్యప్రపంచంలో ఏ పని చేయాలన్నా ఎలా చేయాలన్నా, వాటికి వేదములు, శాస్త్రములలో చెప్పబడిన ప్రమాణములను అనుసరించి చేయాలి కానీ తమ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు.

```

కాబట్టి మానవులు ఏం చేయాలో, ఏం చేయకూడదో నిర్ణయించడానికి వేదములు శాస్త్రములే ప్రమాణములు. వాటి ప్రకారం మనం ప్రవర్తించాలే గానీ మన ఇష్టం వచ్చినట్టు ఆచార వ్యవహారములను మార్చరాదు. మన తెలివితేటలు ప్రదర్శించకూడదు. దాని వలన నష్టమే కానీ లాభం లేదు.


(ప్రభుత్వాలు ఎలా నడవాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేది నిర్ణయించేది ఆ ప్రభుత్వం ఏర్పరచుకున్న రాజ్యాంగము. ఏ చట్టం చేసినా రాజ్యాంగానికి లోబడే చేయాలి కానీ నాకు అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఉన్న చట్టాలు మార్చడం, రాజ్యాంగ వ్యతిరేక చట్టాలు చేయకూడదు. చేస్తే ఏమవుతుందో, మన జీవిత కాలంలో మనందరం చూసిన, అనుభవించిన, ఎమర్జెన్సీయే చక్కని ఉదాహరణ).


యజ్ఞాలు ఎలా చేయాలి. యజ్ఞ కుండం ఎంత పొడుగు, వెడల్పు ఉండాలి, ఎంత మంది ఋత్విక్కులు ఉండాలి, ఎవరు ఏ పని చేయాలి. ఏయే వస్తువులు హెూమంలో వేయాలి. ఇవన్నీ నిర్దిష్టంగా వేదాలలో శాస్త్రాలలో చెప్పారు. అలా కాదు మేము ఆవకాయలతో, మిరపకాయలతో హోమాలు చేస్తాము అంటే దాని అర్ధం మీరే ఆలోచించుకోవాలి. భగవంతునికి నివేదన చేయాల్సినవి పత్రం, పుష్పం, ఫలం, తోయం అని స్పష్టంగా చెప్పారు. కాదు మేము మద్యం మాంసం నివేదిస్తాము, జంతు బలులు నర బలులు ఇస్తాము అంటే అవి శాస్త్రవిరుద్ధములు అని తెలుసుకోవాలి. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. ఈ ప్రకారంగా ఎవరికి తోచినట్టు వారు పూజావిధానాలను, ఉపాసనలను, అర్చనలను మార్చేస్తున్నారు. తెలిస్తే శాస్త్రవిధానాలను బట్టి చేయాలి. తెలియకపోతే శాస్త్రములు చదివి తెలుసుకోవాలి. చదివిన వారి వద్ద నేర్చుకోవాలి. అంతే కాని, "అంతా నాకు తెలుసు.. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను" అనడం మూర్ఖత్వం. అది పనికిరాదు అంటున్నాడు పరమాత్మ.


వేదములు, శాస్త్రములు మనకు అందించిన మహాఋషుల స్థాయి, వారు చెప్పిన దాన్ని కాదనే అర్హత, విమర్శించే పరిజ్ఞానము మనకు లేదు. కాబట్టి వారు చెప్పిన వాటిని ఆచరించడమే మన కర్తవ్యం. అందుకే పరమాత్మ “జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం" అంటే కర్మలు చేసేముందు వాటికి సంబంధించిన శాస్త్రములు, విధివిధానముల గురించిన జ్ఞానం మనకు తెలిసి ఉండాలి. "కర్మ కర్తు మిహార్హసి' అంటే కర్మలు చేయాలి కానీ ఆ కర్మలు శాస్త్రములో చెప్పబడిన విధి విధానాలను అనుసరించి చేయాలి కానీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు

పంచాంగం 17.06.2026 Wednesday,

 ఈ రోజు పంచాంగం 17.06.2026 Wednesday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాస శుక్ల పక్ష తృతీయ తిథి సౌమ్య వాసర పునర్వసు నక్షత్రం ధ్రువ యోగః తైతుల తదుపరి గరజి కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

 

యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

  


శ్రాద్ధ తిథి: తృతీయ


 

నమస్కారః సృష్టిలో జీవరాశులు… స్థావరములు, జంగమములు అని, రెండు వర్గములు వున్నాయి. 


జీవం ఉండి చలనం లేని, స్థిరంగా ఉండేవాటిని స్థావరములని అంటారు. 

ఉదాహరణకు మొక్కలు, వృక్షాలు మొదలైనవి. ఇవి ఏకేంద్రియ జీవులు. వీటిలో స్పర్శ మాత్రమే ఉంటుంది. 


చలనం ఉండే జీవరాశులను జంగమములని అంటారు. ఉదాహరణకు క్రిమికీటకాదులు, సర్పములు, పక్షులు, మానవులు మొదలగునవి.


ఈ జంగమాల్లో వాటివాటి స్థితినిబట్టి, రెండునుంచి అయిదు జ్ఞానేంద్రియాలవరకూ ఇంద్రియ జ్ఞానాన్నికల్గి ఉంటాయి. 


వీటిలో స్పర్శ, రుచి తెలిసే రెండు జ్ఞానేంద్రియాలు ఉండేవి - ఉదాహరణకు నత్తలు, క్రిమి కీటకాదులు. 


స్పర్శ, రుచి, వాసన అనే మూడు జ్ఞానేంద్రియాలు ఉండేవి - జెర్రులు, పేలు మొదలైనవి. 


స్పర్శ, రుచి, వాసన, దృష్టి అనే నాలుగు జ్ఞానేంద్రియాలు ఉండేవి- ఉదాహరణకు తేళ్ళు, ఈగలు, సాలెపురుగు మొదలైనవి. 


స్పర్శ, రుచి, వాసన, దృష్టి, శబ్ద గ్రహణం అనే అయుదు జ్ఞానేంద్రియాలు ఉండేవి- ఉదాహరణకు పశుపక్ష్యాదులు, మానవులు, దేవతలు మొదలైన వారు. 


సృష్టిలో ఎనుబదినాలుగు లక్షల జీవరాసులు ఉన్నట్లు చెబుతారు. ఇలా ఏకేంద్రియముల కన్న, క్రమంగా పంచేంద్రియాలున్న జీవులు అధికమైనవని తెలుస్తుంది. పంచేంద్రియ జీవులలో కూడా; పశుపక్ష్యాదులకు సుఖదుఃఖానుభూతి తప్ప, విచక్షణచేసే బుద్ది లేదు. మనస్సు చెవి, ముక్కు, కన్ను, చర్మం, నాలుక అనే పంచేంద్రియాల ద్వారా గ్రహించిన విషయ జ్ఞానాన్ని బుద్దిముందు ఉంచుతుంది.  


అలా మనస్సుతెచ్చిన విషయాలలో మంచిచెడులను నిర్ణయించేది బుద్ధి. 


ఈబుద్ధి వల్లనే మానవుడు మిగిలిన జీవరాశులకన్న ఉన్నతమైన వాడు అనవచ్చు. క్రిమికీటకాదులు మొదలు, అన్ని జంతువులలోనూ మనోవ్యాపారం ఉంటుంది. కాని వాటి మనస్సు, బుద్దిరూపాన్ని పొందలేదు. మానవుడిలోనే బుద్దిరూపాన్ని పొందింది. అంచేత సాధనద్వారా, నివృత్తిమార్గాన్ని అవలంబించి, సంసారబంధంలోనుండి విడివడే అవకాశం మానవునికి మాత్రమే ఉంది. 


మిగిలిన జీవరాశులకు సత్వరమే ముక్తి పొందడానికి సాధ్యం కాదు. ఇక దేవతలు, గంధర్వులు మొదలైన వారు కూడా మనలాగే పంచేంద్రియాలతో బాటు, బుద్ధి కూడా పరిణతి చెంది ఉంటుంది. వారు గతజన్మలలో చేసుకున్న అధికమైన పుణ్యకార్యాలవల్ల; వాటి ఫలితాలను అనుభవించడానికి ఆయా దేవతాస్థానాలు కలిగాయి. వారు సుఖానుభవాలలోనే తేలుతుంటారు. తమ పుణ్యఫలం అనుభవించడం పూర్తికాగానే, తిరిగి క్రిందిజన్మలను ఎత్తవలసి ఉంటుంది. అందుచేత దేవతలూ, గంధర్వాదులు కూడా వారి శరీరాలతో మోక్షం పొందలేరనేది స్పష్టం.


అందుచేతనే మానవజన్మ లభించడం కడుదుర్లభం అని పెద్దలు చెబుతారు. ప్రతి జీవికీ వాటి క్రమాభివృద్ధిలో 

ఈ జగత్తులో ఉంటూ మోక్షాన్ని అభిలషించే ప్రయత్నం చెయ్యవచ్చు. కాని మానవశరీరం ప్రాప్తిస్తేనే మోక్షం పొందటం జరుగుతుంది. అందుచేతనే మానవ జన్మ ఉత్తమమైనదిగా చెప్పబడినది. 


మనుష్యస్థితి ఉత్తమమైనదని చెప్పడంచేత ఇదే ఉన్నత స్థితిఅనుకోవద్దు. నిరాశ, నిస్పృహ లనే ఊబినుంచి బయటపడి, సంసారమనే సముద్రం నుంచి తరించాలి. మేధావులంతా సర్వజ్ఞమైన సహజస్థితిని పొందడానికి మానవజన్మ మనకో సాధనం అని బోధించారు.  


ఇలాంటి ఉత్కృష్టమైన మానవజన్మ పొందటానికి కారణం, గత జన్మల్లో చేసుకున్న పుణ్యకర్మల ఫలితమే. అందువల్లనే నీచజన్మలు పొందలేదు. 


బుద్ధిని ఉపయోగించుకొని, ఈ జన్మనెలా సార్ధకం చేసుకోవాలో తెలుసుకోవాలి. తానెక్కడనుండి వచ్చాడో, ఎక్కడకు పోవాలో, ఆ గమ్యాన్నిచేరే మార్గమేమిటో చక్కగా తెలుసుకోవాలి. అమరత్వం, సత్యాన్వేషణ, ఆనందం అనేవి, మానవ గమ్యాలని విజ్ఞులు చెబుతారు. ఉపనిషత్తులలోనూ ఇలాగే చెప్పబడింది. బ్రహ్మాన్ని తెలుసుకో కోరేవాడు ఈ విశ్వానికి మూలకారణం ఏమిటి? అది బ్రహ్మమా లేక మరొకటా? మనం ఎక్కడినుంచి వచ్చాం? మనం మరణం తర్వాత ఏమవుతాం? ఎవరి నియమానుసారం మనం ఈ సుఖదుఃఖాలకు లోబడి ఉంటున్నాం? అని చర్చ చేసుకుంటారు అని చెప్పబడింది., శుభోదయం

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                       పంచమోధ్యాయః

                కర్మ సన్యాస యోగము

 

 యత్సాంఖ్యై: ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ।

ఏకం సాఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి ।। 5 ।।



ప్రతిపదార్థ:



యత్ — ఏదైతే; సాంఖ్యైః — కర్మ సన్యాసము ద్వారా; ప్రాప్యతే — పొందబడునో; స్థానం — స్థానము; తత్ — అది; యోగైః — భక్తితో పని చేయటం ద్వారా; అపి — కూడా; గమ్యతే — పొందవచ్చు; ఏకం — ఒకటే; సాంఖ్యం — కర్మ సన్యాసము; చ — మరియు; యోగం — కర్మ యోగము; చ — మరియు; యః — ఎవరైతే; పశ్యతి — చూస్తారో; సః — ఆ వ్యకి; పశ్యతి — నిజముగా చూచినట్టు.


 

 తాత్పర్యము : 


కర్మ సన్యాసము ద్వారా పొందగలిగే అత్యున్నత స్థితిని భక్తితో కర్మలను ఆచరించటం ద్వారా కూడా పొందవచ్చు. కాబట్టి, కర్మ సన్యాసము మరియు కర్మ యోగము ఒక్కటే అని చూసినవాడే నిజముగా ఉన్నదున్నట్టుగా చూసినట్టు.



వివరణ:


ఆధ్యాత్మిక సాధనలో, మనస్సు యొక్క ఉద్దేశమే (అభిమతం) ప్రధానమైనది, బాహ్యమైన క్రియలు కావు. ఒక వ్యక్తి పవిత్ర బృందావన ధామములో నివసిస్తున్నా అతని మనస్సు కొలకత్తాలో రసగుల్లాలు తినటం కోసం భావన చేస్తే అతను కొలకత్తాలో నివసిస్తున్నట్టే లెక్క. దీనికి విరుద్ధంగా, ఒకడు కొలకత్తా నగర హడావిడి మధ్య నివసిస్తున్నా, బృందావన పుణ్యక్షేత్రం పైనే మనస్సు నిమగ్నం చేస్తే, అతనికి ఆ బృందావనంలో నివసించే ఫలితం దక్కుతుంది. మన మానసిక స్థితిని బట్టి, మన ఆత్మ ఉద్ధరణ స్థాయి ఉంటుంది అని సమస్త వైదిక శాస్త్రాలు పేర్కొంటున్నాయి:


మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః


(పంచదశీ)


 


‘బంధమునకు మరియు మోక్షమునకు కారణము మనస్సే.’ జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్ గారు ఇదే సూత్రమును పేర్కొన్నారు:


బంధన్ ఔర్ మోక్ష కా, కారణ్ మన హి బఖాన్

యాతే కౌనిఉ భక్తి కరు, కరు మన తే హరిధ్యాన్


(భక్తి శతకము, 19వ శ్లోకం)


 


‘బంధము మరియు మోక్షము అనేవి మనస్సు యొక్క స్థితి మీద అధారపడుతాయి. ఏవిధమైన రూపంలో భక్తి చేసినా, మనస్సుని మాత్రం భగవంతుని ధ్యానంలోనే నిమగ్నం చేయుము.’


ఆధ్యాత్మిక దృష్టి లేనివారు, కర్మ సన్యాసికి, కర్మ యోగికి ఉన్న బాహ్యమైన తేడాలను చూసి, కర్మ సన్యాసి యే ఉన్నతమైనవాడు అని ప్రకటిస్తారు. కర్మ సన్యాసులు మరియు కర్మ యోగులు కూడా తమ మనస్సులను భగవంతుని యందే నిమగ్నం చేసినట్టు చూసి, జ్ఞానులు, వారిద్దరూ ఒకే సరిసమాన అంతర్గత స్థితిలో ఉన్నట్టు గమనిస్తారు.

పాదారవింద శతకం - 2*

  *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*పాదారవింద శతకం - 2*


*శ్లోకము - 13*


*భవాని ద్రుహ్యేతాం భవనిబిడితేభ్యో మమ ముహు-*

*స్తమోవ్యామోహేభ్యస్తవ జనని కామాక్షి చరణౌ ।*

*యయోర్లాక్షాబిందుస్ఫురణధరణాద్ధ్వర్జటిజటా-*

*కుటీరా శోణాంకం వహతి వపురేణాంకకలికా ॥*


*భావము :*


*అమ్మా భవానీ, ఈశ్వరుని జటాజూటములో నీవు ఒక మొగ్గవై ఉన్నావు. ప్రణయ సమయములో నీ పాదములను తాకిన శివుని ముఖముపై అలముకున్న నీ పాదముల లత్తుక ఎర్రని తిలకమువలె భాసిస్తున్నది. అటువంటి నీ పాదములు నా తమో గుణమును నశింపచేయుగాక.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

17-06-2026 బుధవారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏


17-06-2026 బుధవారం రాశి ఫలితాలు


మేషం


మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. ఇంటా బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన స్థానచలన సూచనలున్నవి.  

---------------------------------------


వృషభం


దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఇంటాబయట సమస్యలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు సాదాసీదాగా నడుస్తాయి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు.

---------------------------------------


మిధునం


చేపట్టిన పనులలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తవుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.

---------------------------------------


కర్కాటకం


సంఘంలో పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ఆర్థిక లాభాలు పొందుతారు. నిరుద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. 

---------------------------------------


సింహం


కీలక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు అమలు చెయ్యడం మంచిది. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగస్తుల విధుల్లో సమస్యలు తప్పవు. బంధు వర్గం వారితో విభేదాలు కలుగుతాయి.

---------------------------------------


కన్య


వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. నూతన ఋణయత్నాలు కలసిరావు. స్థిరాస్తి ఒప్పందాలలో ఆటంకాలు తప్పవు. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా పడతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. ఉద్యోగులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి.

---------------------------------------


తుల


చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి.

---------------------------------------


వృశ్చికం


సంఘంలో పెద్దల నుండి వివాదాలకు సంబంధించి ముఖ్య సమాచారం అందుతుంది. పనుల్లో మరింత పురోగతి సాధిస్తారు. మిత్రుల నుంచి వివాహ శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో సానుకూల ఫలితాలుంటాయి.

---------------------------------------


ధనస్సు


ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల వలన మానసిక సమస్యలు కలుగుతాయి. నిరుద్యోగులు మరింత కష్టపడాలి. వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడుతాయి.

---------------------------------------


మకరం


ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. గృహమున మీ ఆలోచనలు అందరికి నచ్చవు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాలలో తొందరపాటు మంచిది కాదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------


కుంభం


 సన్నిహితుల నుండి కీలక విషయాలు తెలుసుకుంటారు. సంతనానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ విషయంలో సమస్యలు అదిగమించి ముందుకు సాగుతారు.ఆర్థిక పరంగా ఇబ్బందులు తొలగుతాయి.

---------------------------------------


మీనం

 

ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో భాగస్థులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

---------------------------------------