నేనే శివుడిని
ప్రతి సాధకుడు ఒక్క విషయన్ని తెలుసుకోవాలి. ఈ సృష్టి మొత్తం ఈశ్వరుడిదే అయి వున్నది. అటువంటప్పుడు సృష్టిలో ఈశ్వరుడు కానిది, ఈశ్వరుడికన్నా బిన్నంగా వున్నది ఏది లేదు. అటువంటప్పుడు ఈ జగత్తులో భక్తుడు, భగవంతుడు అని రెండు లేవు. వున్నది ఒక్కటే ఆ ఒక్కటి పరమేశ్వరుడే అయి వున్నాడు. ఈ సత్యమే మనకు పరి పరి విధాలుగా అనేక పరియాయలు మన మహర్షులు బోధిస్తూ వున్నారు. కానీ దేహ వ్యామోహంతో వున్న మనం నేను దేహాన్ని అని నేను భగవంతుని ఆరాధిస్తూ వున్నానని, దేముడిని మా తోటలోని మల్లెపూలతో, చామంతి పూలతో మందార పూలతో పూజిస్తూ వున్నానని అర్చిస్తూ వున్నానని, అలంకరిస్తూ వున్నానని గర్వంగా చెప్పుకుంటూ ఉండటం సహజం. నిజానికి నాకు తోట ఉన్నదా? ఆ తోటలో పూలు పుస్తున్నవి అవి నాకు చెందినవా? ఆ పుల మీద నాకు ఏ అధికారం వున్నది అని ప్రతి సాధకుడు ఆలోచించాలి.
సాధకుడు ఒక్క విషయం ఎల్లప్పుడూ జ్ఞప్తికి తెచ్చుకోవాలి అదేమిటంటే తానూ ధరించిన తన శరీరం తనది కాదని అది కేవలం తన తల్లిదండ్రుల వలన ఈ భౌతిక ప్రపంచములో తయారయినదని. దానికి బిన్నంగా దానిని ఆసరాగా చేసుకొని తాను వున్నానని తెలుసుకోవాలి. ఈ సత్యం ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడే సాధకునికి అర్ధం అవుతుంది. తన శరీరమే తనది కానప్పుడు ఆ శరీరానికి సంబందించిన బంధాలు కూడా తనవి కావు అని తెలుసు కుంటాడు. అటువంటప్పుడు ఇక ఆస్తి పాస్తులు తనవి యెట్లా అవుతాయి.తాను నాటిన చెట్లను మొలకెత్తించి పురుషుపించే టట్లు చేసింది ఎవరు. ఆ ఈశ్వరుడు తప్ప ఇంకెవరు. పద్మ పురాణంలోని ఈ శ్లోకాన్ని ఒకసారి చూడండి.
ఋణానుబంధ రూపేణ! పశు పత్నీ సుతాలయాః!
ఋణక్షయే క్షయం యాంతి! కా తత్ర పరిదేవనా!!
దేహాన్ని ఆశ్రయించి వున్న జీవునికి జన్మ జన్మల కర్మ ఫలితంగా ఏర్పడిన రుణముల కారణంగా మాత్రమే పశు , పత్ని, సుతుడు, గృహాలు ఇంకా ఇతర ఆస్తి పాస్తులు కలుగుతున్నాయి. ఎప్పుడైతే ఆ ఋణం క్షీణిస్తుందో అప్పుడు అవి బందంనుంచి తొలగుతాయి.
ఒక నది ప్రవాహంలో రెండు తుంగాలు కొట్టుకొని వస్తున్నాయట. అవి ప్రవాహంలో కలుసుకున్నాయట. ఆలా ఒక దానితో ఒకటి కలిసి కొంత దూరం ప్రయాణం చేసి తరువాత వీటి దోవన అవి విడిపోయి వెళ్లిపోయాయట. ఈ ప్రపంచంలో దేహంతో ఏర్పడే బంధాలు కూడా అటువంటివే. వాటినే శాశ్వితం అని సామాన్యులు భావిస్తారు. కానీ సాధకులు ఈ నగ్న సత్యాన్ని తెలుసుకొని జాగరూకులై నిత్యం, సత్యం, అనంతము అయినటువంటి ఆ ఈశ్వరునితో మాత్రమే సంబంధం పెట్టుకొని అనుక్షణం ఈశ్వరునితో లయం అయి బ్రహ్మనందాన్ని పొందుతూ వుంటూ. ఈ దేహం కేవలం తనకు ఆశ్రయాన్ని ఇచ్చిన ఒక ఉపకరణం లాగ మాత్రమే తలుస్తూ జీవితాన్ని గడుపుతారు. నీవు కొంత దూరం వెళ్ళాలి దానికోసం ఒక కారుని ఏర్పాటు చేసుకొని ప్రయాణిస్తావు అనుకో. నీ గమ్యాన్ని చేరుకున్న తరువాత నీవు కారు దిగి నీ పనిమీద వెళతావు. అదేవిధంగా ఆ కారు లాంటిదే ఈ రోజు నీవు ధరించిన ఈ శరీరం. ఈ సత్యాన్ని కేవలం సాధకులు మాత్రమే తెలుసుకోగలుగుతారు. సామాన్యులు ఈ శరీరమే తాను అని భావన చేస్తూ అరిషడ్వార్గాలతో అనుబంధాన్ని పెంచుకొని వాటి సాధనే జీవిత లక్ష్యం అనుకోని చెతుర్విధ పురుషార్ధాలలో మధ్య రెండు పురుషార్ధలైన అర్ధ కామదులే పరమావధిగా భావించి మొదటిది, చివరిది ఐన ధర్మాన్ని, మోక్షాన్ని విస్మరించి జీవనం సాగించి అనేక పాప కృత్యాలు చేస్తూ భవిష్యత్తులో నీచ జీవులుగా జన్మలను పొంది ఈ జరామరణ చక్రంలో పరిభ్రమిస్తూ వుంటారు.
సాధకులు మాత్రము ధర్మాచరణపరులై జీవనం కొనసాగిస్తూ, జీవిత పరమ లక్ష్యం చతుర్ధ పురుషార్థం మాత్రమే అని నమ్మి దాని సాధనకొరకు నిరంతరం అనన్య సామాన్య కృషి చేస్తూ ఒక సద్గురువుని శరణు చొచ్చి మోక్ష పదాన్ని చేరుకోవటానికి ప్రయత్నిస్తారు.
ఈశావాస్యమిదం సర్వం, యత్కించ జగత్యాం జగత్
తేన త్యక్తేన భుంజీథాః, మా గృధ: కస్య స్విద్ధనం , 1
ఈ జగత్తులో ప్రతి ఆణువణువూ లోపల బైట కేవలం ఈశ్వరునిచే వ్యాపించి వున్నది. కాబట్టి ఇక్కడ నాది అనేది ఏది కూడా లేదు ప్రతిదీ ఆ ఈశ్వరునిది మాత్రమే త్యాగ బుద్దితో ఈశ్వరునిది నీవు అనుభవిస్తున్నట్లుగా భావించి జీవనం గడపవలెను.
మొట్ట మొదటి ఉపనిషత్తుగా భాసిల్లిన ఈశావాసోపనిషత్తు శుక్ల యజుర్వేదంలోనిది. ఒక సాధకుడు తరించటానికి వేరే ఏ గ్రంధాలు చదవనవసరం లేదు. కేవలం అంటే కేవలం ఈశావాసోపనిషత్తులోని ఈ మొదటి మంత్రాన్ని చదివి అర్ధం చేసుకొని ఆకళింపు చేసుకొని తన జీవితానికి అనుసంధానము చేసుకొని జీవితాన్ని కొనసాగిస్తే సాధకుడు నిత్ర్య ముక్తుడే.
రుద్రుడు అంటే దుఃఖంని హరించే వాడు అని అర్ధం. అంటే ఆనంద స్వరూపుడు అని తెలుసుకోవాలి. సాధకుడు రుద్రుడిని పూజించాలంటే ముందుగా తాను రుద్రుడిగా మారాలి
నారుద్రో రుద్రమర్చయేత్ అనగా రుద్రుడు కాని వాడు రుద్రాభిషేకమునకు అర్హుడు కాడు. ఇది ప్రమాణ వచనము
మరి ఒక సామాన్యుడు రుద్రునిగా ఎలా అవుతాడు అంటే దానికి ఒక ప్రక్రియను మన మహర్షులు తెలిపారు. అదే అంగన్యాస,కరన్యాసాలు. భక్తుడు తన శరీరంలోని ప్రతి అంగాన్ని పవిత్ర మైనటువంటి మంత్రాలతో న్యాసం అంటే దైవ శక్తిని స్థాపన చేసి తదుపరి రుద్రుని అర్చించాలని మన మహర్షులు ప్రబోధించారు. నేటికీ రుద్రార్చన చేసేవారితో పౌరోహితులవారు అంగన్యాస, కరన్యాసాలని చేయించటం మనం గమనిస్తూ వున్నాము. ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రతి భక్తుడు తప్పకుండా రుద్రుడు కావలసిందేనా అంటే అవును అని సమాధానం.
సాధారణ వ్యవహార సరళిలో మనమంతా అనుకుంటాము నేను అపవిత్రంగా వున్నాను అని భావించి శిరస్నానం చేసి దేహాన్ని శుద్ధి చేసుకుంటాము. కానీ మన శరీరంలో రక్త మాంసాలు, చీము నెత్తురు, మల మూత్రాదులతో అశుద్ధంగా ఉంటుంది అని సర్వుల భావన అటువంటి దోషం తొలగాలి న్యాసం చేయాలనీ కొందరి అభిమతం. ఏది ఏమైనా భక్తుడు రుద్రుడు కాకుండా రుద్రర్శన చేయ వీలు లేదనేది యదార్ధం.
ఉపనిషత్తు మంత్రార్ధాన్ని కనుక పరిగణలోకి తీసుకొని లోతుగా యోచిస్తే ఈ జగత్తు మొత్తం ఈశ్వరుడే అయి వున్నాడు. అట్టి తరి భక్తుడు ఈశ్వరుడి కన్నా బిన్నంగా ఉన్నదా అంటే లేదు అని అర్ధం చేసుకోవాలి. అప్పుడు సదా పరిశుద్ధుడు అయినా ఈశ్వరుని అంశగా భక్తుడు భావిస్తే ఇక అశుద్ది అనేది ఎక్కడ వున్నది. వున్నదంతా ఒక్కటే అయితే పూర్తిగా అది ఈశ్వరుడే అయితే అంటా శుద్ధి అని అర్ధం చేసుకోవాలి. మరి సాధకుడు రుద్రుడే అయి ఉంటాడు. మరి రుద్రుడు యెట్లా అయి ఉంటాడు అనే సందేహం కలుగుతుంది.
ఉపనిషత్తు మంత్రార్ధాన్ని కనుక పరిగణలోకి తీసుకొని లోతుగా యోచిస్తే ఈ జగత్తు మొత్తం ఈశ్వరుడే అయి వున్నాడు. అట్టి తరి భక్తుడు ఈశ్వరుడి కన్నా బిన్నంగా ఉన్నదా అంటే లేదు అని అర్ధం చేసుకోవాలి. అప్పుడు సదా పరిశుద్ధుడు అయినా ఈశ్వరుని అంశగా భక్తుడు భావిస్తే ఇక అశుద్ది అనేది ఎక్కడ వున్నది. వున్నదంతా ఒక్కటే అయితే పూర్తిగా అది ఈశ్వరుడే అయితే అంటా శుద్ధి అని అర్ధం చేసుకోవాలి. మరి సాధకుడు రుద్రుడే అయి ఉంటాడు. మరి రుద్రుడు యెట్లా అయి ఉంటాడు అనే సందేహం కలుగుతుంది.
ప్రతి సాధకుడు ఒక విషయాన్నీ ఎప్పుడు మననం చేస్తూ ఉండాలి అదేమిటంటే తాను ఈశ్వరుడు అని. ఎలా అంటే తాను నిత్యం తన ఇంద్రియాలను పూర్తిగా ఈశ్వరుని మీదనే లగ్నం చేసి జీవనం చేస్తూ ఉండాలి.ఇక్కడ ఇంద్రియాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు,చ కర్మేంద్రియాలు, ఇంకా వీటిని ఆధీనంలో ఉంచుకున్న మనస్సు వెరసి మొత్తం పదకొండు . అందుకేనేమో మనకు రుద్రులు ఏకాదశ రుద్రులుగా పేర్కొన్నారు. ఈ పదకొండు సాధకుడు నిత్యం, అనుక్షణం, నిరంతరమూ తదేకంగా అహర్నిశలు ఈశ్వరునితో అనుసందానం చేసి ఈశ్వరుడు తప్ప మరొక జాస లేకుండా జీవితాన్ని ఎడతెరపి లేకుండా లగ్నాత చేస్తూ ఉంటే అప్పుడు కలిగే స్థితే ఆత్మా సంయమనం స్థితి . దానికే సమాధి స్థితి అని తురీయా స్థితి అని మన మహర్షులు నొక్కి వక్కాణిస్తున్నారు.ఈ స్థితిని పొందటం చాలాకష్టతరం,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి