12, జులై 2024, శుక్రవారం

వర్షాభావము

 *వర్షాభావము*


ఉ.

మేఘములావరించగ సమీరుడు వీయగజొచ్చె ధూళియున్ 

మేఘమువోలె నింగి జనె మింట తటిత్తులు వెల్గులీనగా 

నోఘములై మృదాకరము లోలిని వ్రాలె ధరాతలమ్మునన్ 

మాఘపటీరమై కిరులు మళ్ళెను నాశ నిరాశయైసనెన్ 

___________________

మృదాకరము=పిడుగు

పటీరము=మేఘము

కిరి=మేఘము


మాఘపటీరములు = వర్షమునీయని మేఘములు. (మాఘమాసములో మేఘములు వర్షమునీయవు)

___________________

*~శ్రీశర్మద*

8333844664

(13-07-2024) రాశి ఫలితాలు

 రేపు (13-07-2024) రాశి ఫలితాలు



గురు నారాయణ భవిష్యవాణి వారి ఉచిత నిత్య రాశి ఫలితాలు మీ రాశి ఫలితాలు

మీరు ఏ సమస్యల్లో ఉన్నా మీ జాతకం/హస్తరేఖలు చూసి మీ సమస్య లకు పరిష్కారం చేయగలం సమర్ధులం పూజ/గ్రహజపం/హోమం ద్వారా ఖచ్చితంగా పరిష్కారం చేయగలం ఇప్పుడే ఫోన్ చేయండి  "జ్యోతిష్య రత్న" జరిగిన విషయం లు చెప్పి మీ భవిష్యత్తు చెప్పగలం వివాహం నకు జాతకం లు సరిపోల్చుట కూడా చూడబడును మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి 7981622895 గత 35 సంవత్సరంల నుండి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం మా దగ్గర సిద్ధి పొందిన మంత్రాలు ఉన్నాయి మా గురువు ల ద్వారా మాకు వచ్చాయి. విద్య ఉద్యోగం వివాహం సంతానం కారాగృహ విముక్తి అనారోగ్యం రాజకీయ పదవులు ఋణ విమోచనం వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి రోగ నివారణ శత్రువులు నుంచి రక్షణ గృహ నిర్మాణం ఇలా ఏదైనా పరిష్కారం చేయగలం సమర్ధులం హోమం ద్వారా ఖచ్చితంగా మీ కోరికలు తీరేలా చేయిస్తాం మీ కోరికలు తీరకపోతే మీ ధనం వాపసు ఇస్తాం షరతులు వర్తిస్తాయి మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి

సకల శుభ పౌరోహిత్యం కార్యక్రమాలు చేయించబడును



మేషం

 13-07-2024 

చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు. గృహమున కుటుంబ సభ్యులతో  ఆనందంగా గడుపుతారు. వృత్తి  ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన  వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.


వృషభం

 13-07-2024 

ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రారంభించిన  పనులు మందకొడిగా సాగుతా. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. సహోద్యోగులతో మాట పట్టింపులుంటాయి.


మిధునం

 13-07-2024 

చేపట్టిన  పనులలో అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దూర ప్రయాణాలు  వాయిదా వెయ్యడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నలోపం లేకపోయినా ఫలితం ఉండ. వ్యాపార వ్యవహారాలు మందగిస్తాయి.


కర్కాటకం

 13-07-2024 

ముఖ్యమైన వ్యవహారాలలో  సన్నిహితుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాలు పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగమున మీ పనితీరుతో  అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.


సింహం

 13-07-2024 

సన్నిహితులతో  మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థికంగా అవసరానికి ధనం లభించక ఇబ్బంది పడతారు. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి.  వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు.


కన్య

 13-07-2024 

భూ సంభందిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి  ఆకస్మిక  ధనలాభం పొందుతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  వృత్తి వ్యాపారాలలో  అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి.


తుల

 13-07-2024 

దీర్ఘకాలిక  ఋణ ఒత్తిడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. ఇంటా బయట  కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి  ఉద్యోగాలలో ప్రయత్నాలు కలిసిరావు.


వృశ్చికం

 13-07-2024 

సమాజంలో  పెద్దలతో పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో   కీలక  సమాచారం సేకరిస్తారు. గృహమునకు చిన్ననాటి మిత్రుల  రాక ఆనందం  కలిగిస్తుంది. సోదరులతో  వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత  అనుకూల పరిస్థితులుంటాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.


ధనస్సు

 13-07-2024 

చేపట్టిన  పనులలో విజయం సాధిస్తారు. నిరుద్యోగ యత్నాలు వేగవంతం చేస్తారు. ప్రయాణాలలో నూతన  వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల  నుండి అరుదైన ఆహ్వానాలు  అందుతాయి.   వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి  ఉపశమనం పొందుతారు.


మకరం

 13-07-2024 

వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా  వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర దర్శనం  చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని   సమస్యలు ఎదురవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు   నిరుత్సాహ పరుస్తాయి.


కుంభం

 13-07-2024 

చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని  నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారమున  నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యడం  మంచిది. దూరపు  బంధువులతో స్వల్ప  విభేదాలు ఉంటాయి.  విద్యార్థులు పోటీపరీక్షలలో  మరింత కష్టపడాలి.


మీనం

 13-07-2024 

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.  సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సోదరుల  నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో   నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు.

శ్రీ మహాలక్ష్మిదేవి


శ్రీ మహాలక్ష్మిదేవి కుటుంబం లో ఎవరెవరు ఉంటారు?


మహాలక్ష్మీదేవి మన అందరి దైవం. ఆమె గోత్రం 'భార్గవ' తల్లి పాల సముద్రం, తండ్రి భృగుమహర్షి, తమ్ముడు చంద్రుడు, కోడలు సరస్వతి, భర్త శ్రీహరి, పుత్రులు ఆనందుడు, కర్దముడు, చకితుడనే ముగ్గురు ఋషులు. కృతయుగంలో ఈమె పేరు శ్రీ మహాలక్ష్మి, భర్త శ్రీహరి. త్రేతాయుగంలో ఈమె పేరు సీత, భర్త శ్రీరామచంద్రుడు. ద్వాపరయుగంలో ఈమె పేరు రుక్మిణి, భర్త శ్రీకృష్ణ పరమాత్ముడు. కలియుగం లో ఈమె పేరు అలర్మేర్ మంగ(అలర్ - పుష్పాల యొక్క, మేర్ - పై భాగంలో కన్పిస్తూ దర్శమిచ్చిన, మంగ - కన్నె. ఈమె పేరే పద్మావతి. పద్మాలలో దాగి పుట్టినది) ఈమెనే ' అల మేలు మంగ ' అన్నారు. భర్త శ్రీ వేంకటేశ్వరుడు. కృతయుగంలో వైకుంఠంలో, త్రేతాయుగంలో అయోధ్యలో, ద్వాపరయుగంలో మధురలో, కలియుగములో తిరుమలలో ఈమె నివాసము.

ఈ బ్లాగు మనందరిది

 ఈ బ్లాగు మనందరిది దీనిని ప్రతిరోజూ 1000 కన్నా ఎక్కువమంది ప్రపంచవ్యాప్తంగా  వీక్షిస్తున్నారని తెలుపుటకు సంతోషిస్తున్నాము. ఈ బ్లాగుని ఇదేవిధంగా రోజు వినూత్న పోస్టులతో మిమ్ములను అలరించాలని మేము అనుకుంటున్నాము. దయచేసి దీని  అభివ్రుద్దికి మీ వంతుగా మీకు తొచిన ద్రవ్యం ఈ మొబైలు నంబర్కు 9848647145 డొనేటుచేయగలరు.  ఈ బ్లాగును ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళుటకు తోడ్పాటుపడగలరు.  మీరు వ్రాసిన ఆర్టికిల్సు పై నంబరుకు  Whatts app చేస్తే మీ పేరుమీద ప్రచురించగలము.

ప్రపంచ పేపర్ బ్యాగ్ దినోత్సవం




*🐄గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🐄*


 *నేడు ప్రపంచ పేపర్ బ్యాగ్ దినోత్సవం* 


రోజులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మరి ఈ ప్రపంచ కాగితపు సంచుల దినోత్సవాన్ని మనం ఎందుకు జరుపుకోవాలి? జులై 12న దీన్ని ఏటా నిర్వహిస్తున్నారు? పేపర్ బ్యాగులు మనకు అవసరమా? ఇవి పర్యావరణానికి మేలు చేసేవి అని తెలిసి కూడా ప్రజలు ఎందుకు వీటిని వాడలేకపోతున్నారు? పేపర్ బ్యాగుల్ని వాడకపోతే ఏమవుతుంది? ప్రపంచం మునిగిపోతుందా? దేశాలు సముద్రాల్లో కలిసిపోతాయా? జల ప్రళయం వస్తుందా? పూర్తి వివరాలు తెలుసుకుందాం...


మీరు భూకంపం తర్వాత వచ్చే వేగవంతమైన సునామీలను చూసి వుంటారు. ఆ సునామీలు ఒక రోజుతోనే ముగిసిపోతాయి. కానీ పేపర్ బ్యాగ్స్ వాడకపోవడం వల్ల వచ్చే సునామీకి రావడమే గానీ పోవడం తెలియదు. ఎందుకంటే అది నిదానంగా వచ్చే జల ప్రళయం. ప్రపంచాన్ని ముంచేసే మహా ప్రళయం. ఇదెలా సాధ్యమో వాస్తవాలతో తెలుసుకుందాం. దాని కంటే ముందు ఈ పేపర్ బ్యాగుల దినోత్సవం ఎందుకన్నది చూద్దాం. తెల్లారితే మనం ఎక్కువగా వాడేది ప్లాస్టిక్ క్యారీ బ్యాగులే. వాటిని మనం ఇలా వాడి అలా పారేస్తాం. కానీ అది భూమిలో కరిగిపోవడానికి వెయ్యి సంవత్సరాలు (carry bag decompose time) పడుతుంది. ఇలా రోజూ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది కోట్ల ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ సంచులు, వాటర్ బాటిళ్లు వాడి పారేస్తున్నారు. ఇవి అటు తిరిగీ, ఇటు తిరిగీ చివరకు నౌకల్లో సముద్ర గర్భంలోకి వెళ్తున్నాయి. వీటిని రీసైక్లింగ్ చేసే వ్యవస్థలు సరిగా లేవు. అందువల్ల ప్రపంచ దేశాలు రహస్యంగా చెత్తను సముద్రంలో పడేస్తున్నాయి. అలాగే డ్రైనేజీ మురికి కాలువలు కూడా వెళ్లేది సముద్రాల్లోకే. పరిశ్రమల వ్యర్థాలు కూడా చివరకు చేరుతున్నది సముద్రాన్నే. ఇలా అన్నీ సముద్రంలో కలుస్తుంటే.. సముద్ర మట్టాలు పెరగకుండా ఎలా ఉంటాయి? అందుకే జల ప్రళయం సైలెంటుగా వస్తోంది. తీర ప్రాంత నగరాల్ని కబళిస్తోంది. దీనికి చెక్ పెట్టాలంటే ప్లాస్టిక్ వాడకం తగ్గించి... పేపర్ బ్యాగుల్ని (paper bags) వాడాలన్నది ప్రపంచ దేశాల సందేశం.


 *అందుకోసం* 


పేపర్ బ్యాగుల్ని... భూమిలో త్వరగా కలిసిపోయే పదార్థాలతో తయారుచేస్తారు. మహా అయితే 3 నెలల్లో అవి భూమిలో కలిసిపోతాయి. మొక్కలకు ఎరువుగా మారిపోతాయి. వాటివల్ల పర్యావరణానికి అంతా మేలే జరుగుతుంది. ఈ విషయంపై అందరికీ అవగాహన కల్పించేందుకు ఓ రోజును కేటాయించారు. అదే జులై 12.

పవిత్ర దర్భ

 *🌱🌱 పవిత్ర దర్భ  ప్రాముఖ్యత 🌱🌱* 


🌱🌱 మనకున్న పవిత్రమైన వృక్షసంప దల్లో గడ్డిజాతికి చెందిన “దర్భ” ముఖ్యమైం ది. ఈ దర్భలో చాలా జాతులున్నాయి. వీటిలో దర్భజాతి దర్భను అపరకర్మలకు, కుశజాతి దర్భను శుకర్మలకు, బర్హిస్సు జాతి దర్భను యజ్ఞయాగాది శ్రౌత క్రతువులకు, శరం (రెల్లు) జాతి దర్భను గృహనిర్మాణాల కు వినియోగించాలని ధర్మశాస్త్రాలు చెప్పాయి.  


🌱🌱కూర్మపురాణం ప్రకారం, విష్ణు మూర్తి కూర్మావతారంలో మందరపర్వ తాన్ని (క్షీరసాగరమధనం సందర్బంలో) మోస్తున్నప్పుడు, ఆ పర్వతం రాపిడికి కూ ర్మం వంటిమీదుండే కేశాలు సముద్రంలో కలిసి అవి మెల్లగా ఒడ్డుకు కొట్టుకుపోయి కుశంగా మారాయి, అమృతం పుట్టినప్పు డు కొన్నిచుక్కలు ఈ కుశ అనే గడ్డిమీద పడటంతో వాటికంత పవిత్రత వచ్చింది. 


🌱🌱 వరాహపురాణం ప్రకారం, ఈ దర్భలు వరాహావతారంలోనున్న శ్రీమహావి ష్ణువు శరీరకేశాలట. అందుకే దర్భగడ్డిని శ్రీమహావిష్ణువు రూపాలుగా భావించి భాద్ర పదమాసంలో దర్భాష్టమినాడు వీటికి ప్ర త్యేకపూజలు చేస్తారు. వీటికి దేన్నైనా శు ద్ధిచేసే శక్తి ఉంది. ఈ నమ్మకాన్ని నిజంచేస్తూ శాస్త్రవేత్తలు వీటిని విరేచనాలు, రక్తస్రావం, మూత్రపిండాల్లో రాళ్ళు, మూత్రవిసర్జనలో లోపాలు మొదలైన వాటికి మందుగా వాడతారు.


🌱🌱 అసలు దర్భ అన్న పదం వినగా నే మనకు గుర్తొచ్చేది గ్రహణకాలం. ఆ సమ యంలో అన్నిటిమీదా దర్భనుంచడం ఆన వాయితీ. అలాచేయటం వెనకున్న విషయ మేమిటంటే, సూర్య, చంద్రగ్రహణ సమయా ల్లో కొన్ని హానికరమైన విషకిరణాలు భూమి పైకి వస్తాయి.  ఇలాంటి వ్యతిరేక కిరణాలు దర్భకట్టల మధ్యలోంచి దూరి వెళ్ళలేవు. అందుకే ఆఫ్రికా ప్రాంతంలో కొన్ని ఆటవిక జాతులు తమ గృహాలను పూర్తిగా దర్భగ డ్డితోనే కడతారు. ఈ విషయాన్ని మన స నాతన మహర్షులు గూడా గుర్తించి, గ్రహణ సమయంలో, ముఖ్యంగా సూర్యగ్రహణ సమయంలో ఇళ్ళకప్పులను దర్భగడ్డితో కప్పుకోమని శాసనంచేశారు. (బహుశా అందుకే పల్లెల్లో గడ్డితోనే ఇంటి పైకప్పును ఎక్కువగా వేస్తారు). కాలక్రమంలో మార్పు లొచ్చి, ఇంటిమధ్యలో రెండు దర్భపరకలు పర్చుకుని తూతూమంత్రంలా కానిస్తున్నా రు. ఇలాకాక, కనీసం పిడికెడు దర్భలైనా ప్రతివ్యక్తీ గ్రహణ సమయాల్లో శిరస్సుమీద కప్పుకుంటే, చెడుకిరణాల ప్రభావం వుండదు.


🌱🌱  సదాశివరావు అనే ఒక డాక్టర్ ఈ దర్భ గురించెన్నో విషయాలు తెల్సుకు ని, నమ్మకం కుదరక, కొన్ని దర్భలను తీసు కుని అరచేతిలో ఉంచిమరీ ఎక్సరే తీయిం చుకుంటే ఆయన నమ్మలేని విధంగా 60% రేడియేషన్ ఈ దర్భగడ్డి చేత శోషించబడిం ది. దీనికి కారణం దర్భలకొనలు తేజాన్ని కలిగుండడమే. 


🌱🌱 *"శుచౌ దేశే ప్రతిష్ఠాప్య  స్థిరమాస న మాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజినకుశోత్తరం"..* అని భగవద్గీతలో చెప్పారు. అంటే ఒక మంచి, స్థిరమైన ప్రదే శం లో, మనసుని లగ్నం చేసేందుకు సరైన ఆసనం ఎత్తుగా కాకుండా, మరీ కిందకు కా కుండా, చక్కని కుశగడ్డిని పరిచి, దానిపై జింకచర్మం వేసి, ఆ పైన ఒక చక్కని వస్త్రం ఉండేటటువంటి దర్భాసనమే ధ్యానానికి ఉత్తమం" అని శ్రీకృష్ణుడు చెప్పారు. ఈ రకమైన గడ్డి ఎక్కువగా ఉండే ద్వీపాన్ని "కుశద్వీపం" అంటారు. 


🌱🌱 దర్భను గూర్చి మన వేమన గారేమన్నారో చూడండి. "దాతగానివాని తఱచుగా వేఁడిన వాడుఁ దాతయగునె వసుధలోన అవురు దర్భ యౌనె యబ్ధిలో ముంచిన విశ్వదాభిరామ వినరవేమ!"  అంటే, "దానం అంటేనే తెలీనివాడిని ఎన్ని సార్లు అడిగినా వాడు దానమిస్తాడా? దాత అవుతాడా? అదేవిదంగా ఇంటిపైకప్పు యె క్క గడ్డిని పవిత్రమైన సముద్రంలో ముంచి నంతమాత్రాన దాని రూపుమారి, దర్భ అవుతుందా?!"  


🌱🌱 వేదపాఠం మననం చేసుకునేట ప్పుడూ, నేర్చుకునేటప్పుడూ, పఠించేట ప్పుడూ దర్భఉంగరం కుడిచేతి ఉంగరంవే లుకు ధరించాలని మన శాస్త్రాల్లో చెప్పా రు. చావుకు సంబంధిత కర్మలకు ఏకఆకు దర్భను ; శుభప్రదమైన వాటికి 2 ఆకుల దర్భను ; అశుభకార్యాలకు (పితృపూజ, తర్పణాలు) 3 ఆకుల దర్భను ; పూజా తదితర కార్యక్రమాలకు 4 ఆకుల దర్భను ఉంగరంగా వాడాలి. అలానే శ్రాద్ధకర్మలకు బ్రాహ్మణులు దొరకనిపక్షంలో దర్భఉంగరా న్ని ఆ స్థానంలో ఉంచి కర్మచేయాలని పద్మ పురాణంలో చేప్పారు. దర్భలకొనలు విడు దలచేసే తేజం దేవతలనూ, పితృదేవతల ను సైతం ఆకర్షించి మనం ఏపనైతే చేస్తు న్నామో ఆపనికి తగ్గట్టు వారినాహ్వానించి మన ముందు ఉంచుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. 


🌱🌱 *"సమూలస్తు భవేత్ దర్భః పితృ ణాం శ్రాద్ధ కర్మణిం!"* -- దర్భను వేరుతో (మూలంనుండి) సహా భూమినుండి పెక లించి, దాన్ని వాడాలి. ఎందుకంటే, ఈ వేర్లు మాత్రమే పితృలోకంలోని పితృదేవ తలకు విజయాన్ని చేకూరుస్తాయి. అందుకే యజ్ఞయాగాదుల్లో అగ్నిగుండానికి నలువై పులా దర్భలను పరుస్తారు. వీటికుండే సహజసిద్ధమైన గుణాలను 6 నెలల తర్వా త కోల్పోతాయి. ఇవి స్వ, పర జనాల కో పాలను పోగొట్టి, సముద్రాన్ని సైతం అణచి పెడుతుందని అథర్వణ వేదంలో చెప్పారు.


🌱🌱 దర్భలను ఎక్కువగా వాడటం వల్ల మనలో సత్వగుణం పెరుగుతుంది. ఒకవేళ మనం వాటిని నేలకేసికొట్టినా, గోటి తో చీల్చినా, వాటికి హానిచేసినా మనలో రజ-తమోగుణాల తీవ్రత పెరిగి, మనలో ఉండే సత్వగుణాన్ని కూడా నాశనం చేస్తుం ది. వీటిని పౌర్ణమి తర్వాతవచ్చే పాడ్యమి నాడు మాత్రమే కొయ్యాలి. ఈ దర్భలకొన కోసుగా ఉండటంతో అమృతం నాకడానికొ చ్చిన పాముల నాలుకలు రెండుగా చీలా యట. ధర్భల విలువ తెల్సిందిగా! యికెప్పు డూ ఒక గుప్పెడు ధర్భలన్నా ఇంట్లో ఉండే లా చూసుకోడం మంచిది. ఎందుకంటే, భగవంతుడికే దర్భాలంకరణసేవ జరుగు తుందంటే దర్భల విలువేమిటో తెల్సుకోండి.

📍📍📍📍📍📍📍📍📍📍

గోడగూచీ కథ*

 *గోడగూచీ కథ*

                ➖➖➖✍️


పూర్వం ఒక ఊళ్ళో శివదేవుడు అనే గృహస్తుడుండేవాడు అతడు మహా శివ భక్తుడు. రోజూ తమ ఊళ్లో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు. ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి పట్టుకెళ్లేవాడు. శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు. 


అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై పాలను ఇంటికి తీసుకెళ్లేవాడు. ఇలా పరమనిష్ఠతో ప్రతిదినం కుంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు. స్వామిని అర్చించేవాడు. 


ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్లాల్సిన పని పడింది. దాంతో తాను నిష్ఠగా చేసే శివ పూజ …. శివుడికి పాలని నివేదించే పని ఎలాగా, అని  ఆలోచించాడు. ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతురిని దగ్గరికి పిలిచాడు. “పాపా! మేము ఊరికి వెళ్తున్నాం. ఊరు నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు .ఇంకో ముఖ్యమైన పని, అదేంటంటే మనం రోజూ శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేసేవాళ్ళం. ఆ పని కూడా నువ్వు చేయాలి!“ అని జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోవుపాలను కుంచెడు కొలిచి పాత్రలో పోసుకొని గుడికివెళ్లాలి, అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి. వెళ్తావు కదూ! ఇది మన నియమము తల్లీ! వ్యర్థం కానివ్వకు. ఆటలని, పాటలని అటు ఇటు పరిగెత్తకుండా సావాసకత్తెలతో ఊరంతా  తిరగకుండా ఇంటిపట్టునే వుండి చెప్పిన పని చేయమ్మా!  మరచిపోవు కదూ! మా బంగారంకదూ!” అని గడ్డం పట్టుకొని బతిమిలాడి మరీ చెప్పాడు.


అలా గుడికి వెళ్ళే పని పాపకు అప్పగించాడు శివదేవుడు.


పాప సరేనంది. శివదేవుడు భార్యతో కలిసి పొరుగూరు వెళ్ళాడు. మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానదులు ముగించుకొని మంచి గోవు పాలను మరగకాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేతపట్టుకొని తను కట్టుకున్న పలుచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది.


గర్భాలయంలో కొలువై ఉన్న శివ లింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి రెండు చేతులెత్తి స్వామికి మొక్కింది.

పాల వైపు చేతులు చూపిస్తూ “శివయ్య”! ఇవిగో పాలు నీకోసమే తెచ్చాను ఆరగించవయ్యా! అని శివుడికేసి చూసి చెప్పింది.


ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని  కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది.  కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది. గిన్నెలో ఉన్న పాలవైపు విచిత్రంగా చూసింది. శివయ్య పాలు తాగలేదా! నీకోసమే తెచ్చాను తాగటానికి ఏమిటి ఇబ్బంది?

పాలు అలాగే ఉన్నాయి తాగవా! తాగు తాగు అంటూ శివుడికేసి చూసి పురామయించింది. ఊహు శివుడు తాగలేదు....


చిన్నపిల్ల కదా! ఆ పాపకు చింతమొదలైంది. అమ్మానాన్నలు చెప్పి వెళ్ళారు, వాళ్ళు చెప్పినట్లు నేను చేసాను. ఎక్కడ ఏం లోపం జరిగిందో. శివుడేమో ఈ రోజు పాలు త్రాగడం లేదు...? దాంతో పాపకి భయం పట్టుకుంది. శివుడు పాలు త్రాగకపోతే అమ్మానాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా! శివుడి వైపు దీనంగా చూస్తూ పాలెందుకు తాగలేదు తాగవయ్య! లింగమూర్తి! అని ప్రాధేయపడింది. పాలు సరిగ్గా కాచలేదా! రుచిగా లేవా...? సద్దిపాలు అనుకున్నావా?

పొద్దెక్కిందనా లేక పొగ వాసన వస్తుందా. నీళ్లు కలిపాననా...?ఆవుపాలు కాదనా...?

పోనీ ఆకలిగా లేదా...? మొగం మొత్తిందా? కుంచెడు లేవనా? నేనేమైనా వీటి మీద మనస్సు పెట్టుకున్నాననా? యే! చిన్నపిల్ల తెస్తే నేను తాగాలా? అని కోపంగా వుందా? ఎందుకు తాగవయ్యా...?

అంటూ నిలదీయటం మొదలెట్టింది, 


“పరమశివా..! పసిపాపను చేసి ఏమిటి ఈ సతాయింపు. ఆకలిగా లేదా పోనీ అదైనా నోరు తెరచి చెప్పాలి కదా! పోతేపోని ఒక్క గుటక అన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా .అంటూ పాప పరమశివుడిని బ్రతిమాలుతోంది. నువ్వు పాలు త్రాగలేదంటే మా అమ్మానాన్నలు నన్ను కొడతారు అలా కొట్టిస్తావా? నామీద ప్రేమతోనైన త్రాగవా? నిజంగా నవ్వు మనసులో ఏదో పెట్టుకొని ఇలా సాధిస్తున్నావు. ఇవి కాక ఇంకా ఏమైనాకావాల...?అడుగు నిమిషంలో తీసుకొస్తా కానీ  తాగకుండా మాత్రం నన్ను ఏడిపించకు లింగమూర్తి!మఠం లో పాయసం తింటావా?

వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తాగా. మా నాయన కదూ!మా శివయ్య కదూ!తాగవయ్య అంటూ అన్నం తినకుండా మారాం చేసే వాళ్ళ తమ్ముడిని వాళ్ళమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ బ్రతిమాలుతోంది. ఏడుస్తోంది.


ఆ పరమేశ్వరుడు పాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు కానీ పలకలేదు .ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ వున్నాడు .ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా..? అయినా పరిక్షిస్తూ వున్నాడు పాప కిందపడి అల్లరిచేస్తూ , గిలాగిలా కొట్టుకోసాగింది. ఈ శివుడు పాలు త్రాగమంటే బెల్లం కొట్టిన రాయిలా వున్నాడు...? నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తారు అని ఏడవ సాగింది. స్వామి వైపు చూస్తూ మా వాళ్ళు నన్ను చంపేస్తారు నువ్వు ఈ పాలు తాగలేదంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు, నాన్నగారు పదేపదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం ఖాయం, అంతకంటే ఇక్కడ నీ ముందే చావడం మేలు అని తలను శివలింగానికేసి బాదుకుంది. 


సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆగకుండా పాపను పట్టుకొని ఆపాడు. ఆ  చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డాడు. గిన్నెను తీసుకొని పాలాన్ని తాగేశాడు. పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది.


శివుడు ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ రూపం అరుదైనది అని పాపకు తెలీదు. ఆయన దేవుడని పిలిస్తే పలుకుతాడు పెట్టినవన్నీ తింటాడు మన మాట వింటాడు, అంటూ ఆనందించింది పాప, పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త నాలుగైదు రోజులయింది, పాప రోజు తానే పాలు తేవడం శివుడికి నివేదించడం అది శివుడికి నచ్చింది ఇలా ప్రతి రోజు పాలు తేవడం శివుడు త్రాగడం జరిగి పోతున్నాయి. ఒకరోజు ఊరెళ్లిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు ఆ సమయంలో పాప పాలను శివుడికి అరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది. అమ్మానాన్నలని చూసి ఎగిరిగంతేసింది. ఇంతలో ఆమె తండ్రి శివదేవుడు పాప చేతిలో పాలగిన్నెను చూసాడు. పాత్రలో పాలు లేవు ఎక్కడి కి వెళ్తున్నావు అని సందేహంగా అడిగాడు. పాప గుడిలో శివుడు పాలు త్రాగిన వ్యవహారం అంతా చెప్పింది. శివదేవుడు పాప మాటలు నమ్మలేదు. శివుడు పాలు త్రాగడమేంది...? నువ్వు ఏదో  అబద్దం చెప్పుతున్నావ్ శివుడి పేరు చెప్పి నువ్వే త్రాగేశావా లేదానిజం చెప్పు! శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ...అంటూ ఆగ్రహంతో కూతురును అనరాని మాటలన్నాడు.

పాప ఎంతచెప్పినా పాప మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్లారు. రోజూలాగే పాప పాలను శివుని ముందు ఉంచింది. లింగమూర్తి అరగించవయ్యా అని పిలిచింది. స్వామి పలకలేదు, అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది.


ఓసి! రోజు పాలు త్రాగే  శివుడు ఇవాళ త్రాగలేదే...? చూడను కూడా లేదు..? కన్నతండ్రినే అబద్దపు మాటలతో మోసం చేస్తావా, ఎన్ని కథలు చెప్పి మోసం చేసావే పాపిష్ఠిదాన... ఎంత శివ ద్రోహం చేసావే, శివుడికి తెచ్చిన పాలను నీపొట్టలో పోసుకున్నావా, ఉండు నీ పని చెప్పుతా ఎంత నాటకం ఆడావే నిన్ను వూరికే వదిలి పెట్టను నీ పొట్ట చీలుస్తా! అంటూ ఆక్రోశంతో పాప మీదకు ఉరికాడు ఆ తండ్రి. 

పాప భయం తో వణకిపోయింది. ఎటు వెళ్లాలో తేలిక గట్టిగా ఏడుస్తూ హా! లింగ! హా!లింగ! అంటూ లింగస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది. ఇదిగో నేనున్నాను అంటూ భయపడకు అత్యంత దయతో మహాలింగ మూర్తి పాప మీద వాత్సల్యంతో తన వక్షస్థలాన్ని తెరిచాడు పాప అందులోకి చొరబడింది. తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకున్నాడు. ఎక్కడికి పోతావే అంటూ ఇవతలకి లాగబోయాడు అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది.


వెంటనే ఆ దివ్యలింగం ఆ పాప మాయమైపోయింది. ఎంతో నిశ్చలమైనది ఆ  పాప భక్తి అమాయకత్వం. అదే శివుడికి ఇష్టమైనది అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చారు. తనలో ఐక్యముచేసుకున్నాడు. దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది. ఆనాటి నుండి ఆ పాప  “గోడగూచి” అనే పేరుతో స్తుతించబడింది.✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

వివేక హీనుని పతనములు !



సుభాషితమ్!


                            వివేక హీనుని  పతనములు !


             శా:  ఆకాశంబున  నుండి  శంభుని  శిరం , బందుండి  శీతాద్రి ,  సు


                    శ్లోకంబైన  హిమాద్రి  నుండి  భువి ,  భూలోకంబు నందుండి  య


                    స్తోకాంభోధి ,  పయోధినుడి  పవనాంధో లోకముం జేరె, గం


                     గా కూలంకష ,  పెక్కు  భంగులు ,  వివేక భ్రష్ట    సంపాతముల్;


                             భర్తృహరి సుభాషితములు:  ఏనుఁగు లక్ష్మణ కవి;

             


           కఠిన పదములకు అర్ధము:- శీతాద్రి-హిమాలయము; సుశ్లోకము:చక్కగా మెచ్చుకొనే; అస్తోక: అంతులేని; అంబోధి-సముద్రము;

           పవనాంధోలోకము: పాతాళము; కూలంకష:నది; వివేక భ్రష్టులు: తెలివి లేనివారు; సంపాతముల్: పతనములు;


             భావము:  గంగా  భవాని  మొదట స్వర్గలోకంలో  (ఆకాశంలో ) మందాకినీ యనుపేరుతో

పిలువ బడుతూ ఉండేది. అదికాస్తా భగీరధునిప్రార్ధనకు లొంగి  క్రిందకు జారటం మొదలు పెట్టింది. మొదట శివుని శిరస్సు మీదకు జారింది. అక్కడినుండి  హిమాలయాలమీదకు , అటనుండి భూలోకానికీ  అక్కడ నుండి సముద్రం లోకి,  సముద్రమునుండి పాతాళానికి  జారిపోయింది.


                      ఎక్కడో  ఊర్ధ్వ లోకమైన  స్వర్గంలో   ( ఆకాశంలో)   ఉండే గంగ  అక్కడ నుండి  దిగటం  మొదలు పెట్టి  చివరకు అధోలోకమైన  పాతాళానికి   జారిపోయింది. తెలివి లేని  మూర్ఖుల  పతనములు  గూడా యిలాగే  ఉంటాయి. అందుచేత వివేకంతో

పనులు చేసికుంటూ  తనస్థానాన్ని  తాను కాపాడుకోవాలి! అని  మనకు  సందేశం!


                       గంగా నది పతనం  మనకు నిదర్శనం కాబట్టి "  నిదర్శనాలంకారం!


                                                    స్వస్తి!🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

ఉడిపి శ్రీకృష్ణుడు*



              *ఉడిపి శ్రీకృష్ణుడు*

                   ➖➖➖✍️


ఉడిపీకి శ్రీ కృష్ణుడు ఎలా వచ్చాడు? స్వయంగా రుక్మిణీ దేవి చేయించిన 'ఉడుపీ శ్రీ కృష్ణ విగ్రహ రహస్యం'!


శ్రీ కృష్ణుని ఆలయాలలో, నాలుగు ఆలయాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇవి ఉత్తరాన ఉత్తర ప్రదేశ్ లోని మథుర, గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక, దక్షిణ భారతదేశంలో కేరళలోని గురువాయూరు, కర్ణాటకలోని ఉడుపి.


 ద్వైత సిద్ధాంత ప్రతిపాద్యులు, త్రిమతాచార్యులలో ఒకరైన 

శ్రీ మధ్వాచార్యుల వారి జననం, జీవితం, ప్రసిద్ధ శ్రీ కృష్ణ క్షేత్రం, కర్ణాటకలోని ఉడుపితో ముడిపడి ఉంది. 


ఒక రోజు       శ్రీ మధ్వాచార్యుల వారు, వేకువజామునే, సముద్ర తీరానికి వెళ్లి స్నానం చేసి, ప్రాతఃసంధ్యాదికాలు ముగించుకుని, ఆ తీరంలోనే కూర్చుని, ద్వాదశ స్తోత్ర రచనను ప్రారంభించారు. తపోదీక్షతో, ద్వాదశ స్తోత్ర రచన సాగుతోంది. ఆ రోజు పర్వదినం కావడంతో, అనేక మంది ప్రజలు కూడా వచ్చి, సముద్రస్నానం చేశారు.


ప్రశాంతమైన ప్రాతఃకాలం, భక్తి ప్రపత్తులు ప్రసరించడానికి అనువైన సమయం. అలాంటి నేపద్యంలో, శ్రీ మధ్వాచార్యుల వారు నిరాటంకంగా, ద్వాదశ స్తోత్రంలోని అయిదు అధ్యాయాల రచన పూర్తి చేశారు. 


ఆరవ అధ్యాయం ప్రారంభం కాబోతున్న సమయంలో, ద్వారక నుండి సరుకులు తీసుకువస్తోన్న ఒక నౌక తీరం వెంట వెళుతుండగా, అకస్మాత్తుగా, విపరీతంగా గాలులు ప్రారంభమయ్యాయి. ఆ గాలులకు సముద్ర కెరటాలు, ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. నౌక ప్రమాదంలో చిక్కుకుంది. దానిని రక్షించుకోవడానికి, అందులోని నావికులు చేస్తోన్న ప్రయత్నాలు, ఫలించడం లేదు. క్రమంగా నౌకలోకి నీరు చేరడం ఆరంభమైంది. ఏ క్షణాన్నైనా, నౌక మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. నావికులందరూ భయాందోళనలకు గురైన సమయంలో, చివరి ప్రయత్నంగా, నౌకకు సంబంధించిన ముఖ్య వ్యాపారి ఒకతను, తీరం వైపు చూస్తూ, రక్షించేవారి కోసం ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. 


అంత దూరం నుంచి కూడా, ఒడ్డున నిశ్చలంగా కూర్చొని రచన చేసుకుంటున్న శ్రీ మధ్వాచార్యుల వారు, ఆ వ్యాపారికి స్పష్టంగా గోచరించారు. ఆయననుద్దేశించి, మరింత ఆర్తితో ప్రార్థించసాగాడు. ద్వాదశ స్తోత్ర రచనలలో లీనమై ఉన్నప్పటికీ, అంతటి హోరుగాలిలోనూ అంత దూరంనుంచి వ్యాపారి చేస్తోన్న ప్రార్థన, మధ్వాచార్యుల చెవిని తాకింది. 


అప్రయత్నంగా అటుకేసి తల తిప్పారు. జాలి కలిగింది. వెంటనే తన ఉపవస్త్రం, ఒక కొసను పట్టుకుని గాలిలో నావ కేసి విసిరి, వెనక్కు తీసుకున్నారు. అంతే, ఆ క్షణం వరకూ సముద్రంలో మునిగిపోతుందా? అన్నట్లున్న నౌక, ఒక్కసారిగా స్థబ్దతకు వచ్చింది. ఎవరో తాళ్లు పట్టి లాగినట్లుగా, తీరానికి చేరి స్థిరంగా నిలిచింది. నావికులందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు. అంతకు మునువు ప్రార్థన చేసిన వ్యాపారి, వడివడిగా మధ్వాచార్యుల వారిని సమీపించి, సాష్టాంగ నమస్కారం చేశాడు. అనేక విధాలుగా స్తుతించాడు. అనంతరం లేచి నిలబడి, అంజలి ఘటించి, ‘స్వామీ, నా వద్ద అమూల్యమైన వస్తువులు అనేకం ఉన్నాయి. వాటిలో మీరు కోరుకున్నది ఏదైనా సరే, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి కాదనకండి’. అని అనేక విధాల ప్రాధేయపడ్డాడు.


మధ్యాచార్యుల వారు చిరునవ్వు నవ్వి, చివరికి అతని కోరికను మన్నించారు. అయితే, ‘నువ్వు నాకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్న అమూల్యమైన వస్తువు, నీ నౌకలో ఉన్న రెండు గోపీ చందనపు గడ్డలు, ఈయగలవా?’ అన్నారు. 


వ్యాపారి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే, గోపీచందనం, ద్వారకలో ఎక్కడపడితే అక్కడ దొరికే మట్టి. 


పడవలలో సరుకులు ఎక్కించేటప్పుడూ, దించేటప్పుడూ, బరువు సమతూకం తప్పిపోకుండా, గోపీ చందనపు గడ్డల సహాయంతో, నౌకలో సరుకును అటూ ఇటూ సర్దుతూ ఉంటారు. అలాంటి గోపీ చందనం మట్టి గడ్డలు, ఈ మహానుభావుడు కోరడం, ఆ వ్యాపారికి సుతరామూ నచ్చలేదు. ఎంత ప్రార్థించినప్పటికీ, మధ్వాచార్యుల వారు, తాను కోరిన గోపీ చందనానికి మించి, మరే బహుమతినీ తీసుకోవడానికి అంగీకరించలేదు. 


చివరికి ఆ వ్యాపారి, స్వామి కోరిన ఆ గోపీ చందనం గడ్డలను ఇవ్వడానికి సిద్ధపడి, అవే కోరడంలోని పరమార్థం ఏమిటో, ఆ మట్టి గడ్డల మహిమ, విశేషాలేమిటో, కనీసం అవైనా తెలుపమని, ప్రార్థించాడు. 


స్వామి మళ్లీ చిరునవ్వు చిందిస్తూ, ‘నువ్వే చూడు’ అంటూ, ఆ గడ్డలను అందరూ చూస్తుండగానే, నీటితో కరిగించారు. ఆ సమయంలో, అక్కడ ఓ అద్భుతం జరిగింది. ఒక గడ్డ నుండి బలరాముని విగ్రహం, రెండవ దాని నుండి శ్రీ కృష్ణుని విగ్రహం బయటపడ్డాయి. 


అక్కడున్నవారందరూ, సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు.      శ్రీ కృష్ణ విగ్రహ దర్శనం జరిగిన వెంటనే, మధ్వాచార్యులు, ద్వాదశ స్తోత్రంలోని ఆరవ అధ్యాయంలో, దశావతారాన్ని వర్ణించారు. బలరాముని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి, శ్రీ కృష్ణుని విగ్రహం తీసుకుని, ఉడుపీకి ప్రయాణమయ్యారు. శ్రీకృష్ణ ప్రాప్తి తరువాత, ద్వాదశ స్తోత్రాన్ని పరిసమాప్తి చేశారు. అందుకే, ద్వాదశ స్తోత్రం అత్యంత పవిత్రమైనది. అమృతరూపమైనటువంటి 

శ్రీ కృష్ణుని ఆగమనానికి కారణమైంది. అది విషాహార స్తోత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. 


ఇంతకీ శ్రీ కృష్ణుని విగ్రహ రహస్యం ఏంటి? వాస్తవానికి జరిగిందేంటి? అనే కథ మరింత ఆసక్తికరంగా ఉంటుంది…



ఆ శ్రీకృష్ణుని విగ్రహం, సామాన్యమైనదికాదు. ఒకసారి దేవకీదేవి, ‘కృష్ణా.. నీ బాల్య లీలలు చూసే భాగ్యం, యశోదకు కలిగినట్లు నాకు కలుగలేదు. వాటి గురించి వినీ, వినీ, ఎప్పటికైనా చూడాలని, నా మనస్సు ఉవ్విళూరుతోంది. చూపించవా కృష్ణా’ అని ప్రార్థించింది. 


కృష్ణుడు అనుగ్రహించాడు. మరుక్షణంలో శైశవ దశలో కృష్ణుడిగా మారిపోయాడు. తప్పటగులు వేస్తూ నడిచాడు. దేవకీ దేవి ఒడిలో కూర్చున్నాడు. ఆమె స్తన్యాన్ని త్రాగాడు. కేరింతలు కొట్టాడు. కుండ పగులగొట్టి వెన్న తిన్నాడు. ఒంటినిండా రాసుకున్నాడు. పామును తాడులాగా పట్టుకుని, మజ్జిగ చిలికినట్లు నృత్యం చేశాడు. మరీ ముఖ్యంగా, తనతో పాటు అన్న బలరాముణ్ణి కూడా చూపించాడు. ఈ చేష్టలను చూసి దేవకీ దేవి పరవశించి, మైమరచిపోగా, ఇదంతా గమనిస్తున్న రుక్మిణీ, తన పతి దేవుని శైశవ రూపాన్ని, ప్రపంచమంతా చూసి తరించాలని భావించి, వెంటనే విశ్వకర్మను పిలిపించి, ఆయా రూపాల్లో, శైశవ కృష్ణుడూ, బలరాముని విగ్రహాలను చేయించింది.

ముందుగా తానే, సకల వైభవాలతో, విగ్రహాలను స్వయంగా పూజించింది. కృష్ణావతారం ముగిసింది. మరికొంత కాలానికి, ద్వారక సముద్రంలో మునిగిపోయే సమయం, ఆసన్నమైంది. దూరదృష్టితో అర్జునుడు, ఆ విగ్రహాలను తీసుకువెళ్లి, ఒక ప్రదేశంలో ప్రతిష్ఠించి, దానికి రుక్మిణీ వనం అని నామకరణం చేశాడు. కాలక్రమంలో, ఆ వనం యావత్తూ, గోపీ చందనం మట్టిలో కలిసి, కనుమరుగైపోయింది. నావికులు తమ నౌకల్లో, సమతూకాన్ని పాటించడం కోసం, గోపీ చందనం గడ్డల్ని మోసుకెళ్లే అలవాటు ప్రకారం, కాకతాళీయంగా, ఈ విగ్రహాలున్న గోపీ చందనం గడ్డల్ని కూడా, నౌకలోకి చేర్చారు. వాటి విలువ తెలియకుండానే, వాటిని తీసుకెళ్లే భాగ్యం, ఆ వ్యాపారికి లభించింది.  ఆ విగ్రహం, ఆ నౌకలో వస్తోందని మధ్వాచార్యులవారి దివ్య దృష్టికి ముందే తెలుసు. ద్వాదశ స్తోత్రాన్ని రచిస్తూ, ఆ విగ్రహాలను ఆహ్వానించడానికే, ఆయన ఆరోజు, ఆ తీరానికి వెళ్లారు. శ్రీ కృష్ణుని ప్రతిమను మధ్వాచార్యులు, తమ శిష్యుల చేత, మాధవ సరోవరంలో, ప్రక్షాళన చేయించారు. తరువాత తానే స్వయంగా అభిషేకించారు. ఈ అభిషేకానికి మునుపు, నలుగురు శిష్యులు సునాయాసంగా ఎత్తిన ఆ విగ్రహం, మధ్వాచార్యుల వారు అభిషేకించిన తరువాత, 30 మంది కలిసినా ఎత్తడం సాధ్యం కాలేదు. ఎందుకంటే, మధ్వాచార్యుల అభిషేకంతో, ఆ విగ్రహంలో, శ్రీ కృష్ణుని దివ్య శక్తి పరిపూర్ణంగా ఏర్పడింది. 

మంత్ర విధులతో, మధ్వాచార్యులు అత్యంత శాస్త్రోకంగా, శ్రీ కృష్ణ విగ్రహాన్ని, విళంబి నామ సంవత్సరం, మాఘ శుక్ల తదియ నాడు, సామాన్య శకం, 1236 వ సంవత్సరంలో, ఉడుపిలో ప్రతిష్ఠింపజేశారు. 


ఆనాటి నుంచి, ఉడుపి ప్రాంత యాజ్ఞికులందరూ, శ్రీ మధ్వాచార్యులవారు అవలంభించిన విధానాలనే, అనుసరిస్తున్నారు.

శ్రీ కృష్ణ మఠంగా పిలువబడే ఈ దేవాలయానికి అనుబంధంగా, తన 8 మంది శిష్యులచే నిర్వహింపబడేటట్లుగా, పెజావరు మఠం, పుట్టిగే, పాలిమరు, ఆడమారు, సోదే, కాణియూరు, శిరూరు, కృష్ణ పురా అనే ఎనిమిది మఠాలను, శ్రీ మధ్వాచార్యులు ఏర్పరచారు. వీటిని అష్టపీఠాలు అంటారు. ఇవన్నీ, ఉడుపి కేంద్రంగా, శ్రీ కృష్ణ మఠానికి చుట్టు ప్రక్కల ఉన్నాయి.✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  944065 2774.

లింక్ పంపుతాము.

దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

పదహారేళ్ళు వయసు దాటిన పుత్రులను

 మంచి శ్లోకం చదువుదాం 

--------------------------------

శ్లో::షోడశాబ్దాత్పరం పుత్రం 

ద్వాదశాబ్దాత్పరంస్త్రియం

నా తాడయేద్దుష్ట వాక్యైః

పీడయే న్న స్నుషాదికమ్


పదహారేళ్ళు వయసు దాటిన పుత్రులను తిట్టకూడదు.పండ్రెండేళ్ళు దాటిన కూతురి ని కఠినమైన మాటలు మాట్లాడి కూడదు.మనసునొప్పించకూడదు.కోడళ్ళను పరుష పదజాలంతో తిట్టకూడదు.బాధించకూడదు.

కుటుంబ వ్యవస్థ లో చాలా మంది చేస్తున్న పొరపాటు. తల్లి దండ్రులం కన్న వాళ్ళం ఒక మాటంటే ఏమయింది.పడాలి. ఇంత చేస్తున్నాం ఒక దెబ్బ వేస్తే ఏమిటట.అంటారు. అలా అనకూడదు అని ధర్మ శాస్త్రం.ప్రస్తుత కాలంలో చిన్న మాటలకే పౌరుషపడి ఏవేవో నిర్ణయాలు తీసుకోవడం వల్ల చివరికి తల్లి దండ్రులు బాధ పడడం జరుగుతుంది.ఆ వయసు వారికి లాలనతో చెప్పాలి.పదిహేనేళ్ళవయసువరకు ఒక దెబ్బ వేసి చెప్పాలి.ఆవయసు దాటాక పుత్రులను మిత్రులు గా చూడాలంటోంది శాస్త్రం."ప్రాప్తేతు షోడశవర్షే పుత్రం మిత్రవదాచరేత్".

కన్న వారి పట్ల అంత జాగ్రత్తగా ఉండాలి అన్నప్పుడు బయటనుండి వచ్చిన అమ్మాయిని ఇంకెంత జాగ్రత్తగా చూడాలి.అంటే కోడలి పట్ల.  

కాలం మారింది ఎప్పటివో ధర్మాలు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. తస్మాత్ జాగ్రత్త 🙏💐

   మీ కామేశ్వరరావు

సత్కార్యాలతోనే

 *సత్కార్యాలతోనే జన్మ సాఫల్యం*


ఒకరిని ద్వేషించటం వ్యర్ధమైన విషయం. అందరిలోనూ వ్యాపించిఉన్న ఆత్మతత్వం, చైతన్యం ఒకటేనని గ్రహించగలగాలి. ఇది స్వయంగా శంకరులు గ్రహించి, ఆ విషయాన్ని గ్రహించగలిగే అవకాశాన్ని మనకు కలుగచేసారు. ఒకనాడు వారి శిష్యులతోబాటు గంగ స్నానానికి వెళుతూవుండగా చండాలుని రూపంలో ఒక వ్యక్తి వచ్చాడు. ఆచార్యులు అతడిని దూరంగా ఉండు అన్నారు. దానికతడు అయ్యా ! తమరు దూరంగా ఉండమన్నది ఈ దేహాన్నా లేక సర్వవ్యాపకమైన ఈ ఆత్మనా ? అని అడిగాడు. అప్పుడు శంకరులు అతని జ్ఞానమునకు ఆశ్చర్యము చెంది ఈ రూపంలో దర్శనమిచ్చింది సాక్షాత్తు విశ్వనాధుడే అని గ్రహించి నమస్కరించాడు. అందుచేత శంకరులు తనకు అందరూ సమానమే, వ్యత్యాసము లేదు అన్నారు. కాబట్టి సర్వమానవులలోయున్న చైతన్యమొక్కటేనని గ్రహించి ఆ విధంగా ఆచరణచేయాలి. 

ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు నేను కర్తను అనే భావన ఉండకూడదు. ఒక విధిని ఆచరిస్తున్నప్పుడు నేను త్యాగబుద్ధితో చేస్తున్నాననే భావన కూడా ఉండకూడదు. త్యాగం సాత్వికంగా ఉండాలి. పరమేశ్వరార్పణమస్తు అనే భావనతో చేయాలి. ఆ విధంగా చేస్తే ఏ భయమూ ఉండదు. అంతా భగవంతునికే చెందుతుంది. ఆ విధంగా కర్మలను ఆచరించేవారి జన్మ ధన్యమవుతుంది. 

వేదాంత శ్రవణం చేసినా సరైన భావన రాకపోతే వాని జన్మ నిష్ఫలం. ఆత్మోద్ధరణ అనేది అందరికీ కావాలి. మంచి జరుగవలెనని తలచినప్పుడు ప్రవృతి మార్గంలో పోతే జరగదు. అందువలనే శంకరులు లోకోపకారం కొరకై అందరిని నివృత్తి మార్గంలో సత్కార్యాలు చేయాలనీ జన్మ సాఫల్యం పొందాలని ఆపేక్షించారు. శంకరులు రచించిన ఏదైనా ఒక స్తోత్రాన్ని శ్రద్ధతో పఠించి మననం చేసి ఆ పాఠాన్ని ఆచరిస్తే ధన్యులవుతారు. కాబట్టి సర్వులూ శంకరులు నిర్దేశించిన నివృత్తి మార్గం అనుసరించి శ్రేయోవంతులు అవ్వుగాక. 


--- *జగద్గురు శ్రీశ్రీ విధుశేఖరభారతీ మహాస్వామివారు*


|| हर नमः पार्वतीपतये हरहर महादेव ||

విష్ణు భక్తి లేని వారి జీవితాలు

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో!! *అంధేందూదయముల్ మహాబధిరశంఖారావముల్ మూకస*

     *ద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసకవధూకాంక్షల్ కృతఘ్నావళీ*

     *బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడస*

     *ద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్తవ్యర్థసంసారముల్*.


           [ 7 - 168 - శార్దూల విక్రీడితము ]


తా𝕝𝕝 లోకంలో గుడ్డివాడికి వెన్నెల నిరుపయోగం; చెవిటివాడికి శంఖ ధ్వని వినబడదు; మూగవాడికి గ్రంథపఠనం సాధ్యపడదు; నపుంసకుడికి కాంత మీద కోరికలు ఫలించదు; కృతఘ్నుడికి బంధుత్వం కుదరదు; బూడిదలో పోసిన హోమద్రవ్యాలు నిరుపయోగ మైనవి; పిసినిగొట్టు వాడికి సంపద పనికివచ్చేది కాదు; పందికి పన్నీరు వంటి సువాసనలు తెలియనే తెలియవు; అలాగే *విష్ణు భక్తి లేని వారి జీవితాలు నిస్సారము లైనవి, వ్యర్థము లైనవి. అని భావిస్తాను*.

గు రు భ క్తి*

 *గు రు భ క్తి* 


మన పూర్వీకులు మనకు చాలా విషయాలు అనగా  సనాతనధర్మం, ఆధ్యాత్మిక విషయాలు ఇంకా చాలా బోధించారు.  అటువంటి బోధనలలో గురుభక్తి చాలా ముఖ్యమైనది.  అలాగే భగవత్పాద శంకరుడు కూడా గురుపాదుకలపై గొప్ప భక్తిని కలిగి ఉండేవాడు.  *‘‘గురుపాదుకల పై మీకు మరింత భక్తి కలిగి ఉండాలి. అప్పుడే మీరు సంసార సాగరం నుండి విముక్తి పొంది ముక్తానులవుతారు."* 


 అలాంటి గురుభక్తి మనకు కలిగి ఉండటం సంతోషకరమైన విషయం. ఈ గురుభక్తి మరింతగా వృద్ధి చెందాలి, తద్వారా ప్రతి ఒక్కరూ శ్రద్ధాసక్తి పెరిగి గురకృపను పొందుతారు.


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

ఆధ్యాత్మిక జీవన వాహిని

 ఆధ్యాత్మిక జీవన వాహిని- అనంతమైన మధుర మనోజ్ఞ తరంగిణి. ఆధ్యాత్మికత అనేది భావన కాదు, జీవన సంవిధానం. చింతనా మార్గంలో ఎవరికివారు సాగించే అలుపెరగని ప్రయాణం. ఆధ్యాత్మిక ధోరణి అంటే కేవలం పూజాది అభిషేకాలకు పరిమితమైంది కాదు. అవ్యక్తమైన దార్శనిక శక్తి. జీవన పరివర్తనకు, ఏకత్వం నుంచి అనేకత్వానికి కొనసాగించే మధుర యాత్ర- ఆధ్యాత్మిక చింతన. సప్త సూత్రాల సమన్వితంగా ప్రతి వ్యక్తిలో ఆధ్యాత్మికత దీప్తిమంతమవుతుంది. నిశిత దృష్టి, నిజాయతీ, నిశ్శబ్దం, నిర్మోహం, నిర్భయం, నిరంతర చింతన, నిర్విచారం- అనే ఏడు అంశాల ప్రాతిపదికన ఆధ్యాత్మిక ప్రగతి ప్రణాళిక ఆవిష్కారమవుతుంది. ఎవరిని వారే ఉద్దరించుకోవాలనేది భగవద్గీత చెప్పిన అభ్యుదయ సిద్ధాంతం. ఆత్మోద్ధరణ చెందాలంటే సప్త సూత్రాల ఆలంబనగా సాధకులు ముందడుగు వేయాలి. ప్రతి వ్యక్తికీ సమున్నత ఉపకరణం బుద్ధి.


కర్మల్ని అనుసరించి బుద్ధి ఆకృతి దాలుస్తుంది. అల్ప బుద్ధులతో అనల్పమైన విషయాల్ని సాధించడం అసాధ్యం. విశాల దృక్పథం, సద్బుద్ధి, సాత్విక దృక్కోణం వ్యక్తుల్ని ఆదర్శమూర్తులుగా ప్రకటిస్తాయి. వీటిని సాధించాలనే లోతైన దృష్టి అవసరం. నీతి నిజాయతీలనేవి బాహ్యంగానే కాదు. ఆంతరంగికంగా ఎవరికి వారు ప్రదర్శించినప్పుడే ఆధ్యాత్మికత స్వచ్ఛ స్పటికంగా ప్రకాశిస్తుంది. సంకుచిత భావనలను విడనాడి సంఘర్షణాత్మక వైఖరిని నిలువరించి స్పష్టతతో మసలుకోవాలి. 'నిశ్శబ్దం నిండిన హృదయం పరమాత్మకు నెలవు' అన్నారు రామకృష్ణ పరమహంస. మనసులో అలజడులనే సవ్వడులు లేకపోతే, ప్రతి మదీ మందిరమై మంగళదాయకమవుతుంది. శాంతి నిండిన మనసు ఆహ్లాదభరితమై, ఆధ్యాత్మిక వనమై గుబాళిస్తుంది. రాగద్వేషాలకు అతీతంగా మసలుకోవడం ఆధ్యాత్మిక పయనంలో ముఖ్య సూత్రం. ప్రతికూలతల్ని అధిగమించి, విపరీత శక్తుల్ని ఎదుర్కొని

సమదర్శనంగా ప్రగతి బాటలో ప్రయాణం చేసినప్పుడు మనోహరమైనమజిలీలు మనల్ని పలకరిస్తాయి. జీవన్ముక్తుడై జగత్తులో ప్రకాశిస్తాడని జగద్గురు ఆదిశంకరులు పేర్కొన్నారు. స్వపరభేదాలు లేని సమ్యక్ దృష్టి,సమగ్రభావన వ్యక్తుల్ని విలక్షణంగా తీర్చిదిద్దుతాయిఅనవసర భయాలతో జీవితాన్ని కుంగదీసుకోవద్దు. జీవితం అనేది భయపడటానికి కాదు. జీవన మధురిమల్ని సదా ఆస్వాదించడానికి'- అంటారు శ్రీఅరవిందులు. ఏ పరిస్థితినైనా ఎదుర్కోగల ఆత్మస్థైర్యం, గుండె నిబ్బరం ఆధ్యాత్మిక చింతనలో ఎల్లప్పుడూ అభిలషణీయం. పిరికితనం అనేది మరణంతో సమానమని వివేకానందుడు చెప్పిన హితోక్తి. జీవనయాత్రలో ఎదురయ్యే ప్రతి సంఘటననూ దైవం నిర్దేశించినదిగానే స్వీకరించాలి. ధైర్యం, సాహసం అనేవి వ్యక్తులకు సహజ భూషణాలుగా అమరినప్పుడు వాళ్లు తేజోమూర్తులుగాప్రకాశిస్తారు. నిరంతర చింతన అనే అంశం సాధకులకు ఆధ్యాత్మికంగా అప్రమత్తత కలిగిస్తుంది. భగవంతుడి కృప కలగాలంటే- మనసున సర్వదా దైవంతో అనుసంధానం కావాలి. ఆ కృపవల్ల లౌకికపరమైన అభీష్టాలు నెరవేరకపోవచ్చు. కాని, హృదయాంతరాళాల్లో సుసంపన్నమైన ఆధ్యాత్మిక సంపద చేకూరుతుంది. కలిమి బలిమివల్ల అద్భుతాలు సాక్షాత్కారమవుతాయి. నిర్విచార భావన ఆధ్యాత్మిక సాధకులకు కరదీపిక. సమతుల్యతను భంగపరచే ఏ అంశాన్నీ సాధకులు స్వీకరించరాదని 'యోగ వాసిష్ఠం' చెబుతోంది. విశ్వవిరాట్ మూర్తిమత్వంతో ప్రజ్వరిల్లే ఆధ్యాత్మిక శక్తిని అందిపుచ్చుకోవాలంటే అల్పమైన నిర్విచారాన్ని వదిలి, ఆ అమేయ శక్తిలో సంలీనం కావాలి. సత్యశివసుందర స్వరూపమైన ఆధ్యాత్మిక దివ్యయశస్సు నవ్య ఉషస్సుగా ప్రతిఫలించాలంటే సప్తసూత్రాల్ని సర్వకాల సర్వావస్థల్లోనూ ఆచరించాలి.


కనకదండి వేణుగోపాలరావు

పొగడ్తలు

 శ్లోకం:☝️

*వితరతి యావద్దాతా తావత్*

 *సకలోఽపి భవతి కలభాషీ ।*

*విరతే పయసి ఘనేభ్యః*

 *శామ్యన్తి శిఖండినాం ధ్వనయః ॥*


భావం: ఉదారమైన వ్యక్తి దానధర్మాలను కొనసాగించినంత కాలం, అందరూ అతని గురించి మంచిగానే మాట్లాడతారు. మేఘంలోని నీరు అయిపోగానే నెమళ్లు నాట్యం అపేసినట్టు దానధర్మాలు ఆగిపోగానే పొగడ్తలు ఆగిపోతాయి.

పంచాంగం 12.07.2024

 ఈ రోజు పంచాంగం 12.07.2024 Friday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం గ్రీష్మ ఋతు ఆషాఢ మాస శుక్ల పక్ష షష్థి తిధి భృగు వాసర: ఉత్తరఫల్గుని నక్షత్రం పరిఘ యోగ: తైతుల తదుపరి గరజి కరణం. ఇది ఈరోజు పంచాంగం.


షష్థి మధ్యాహ్నం 12:32 వరకు .

పూర్వఫల్గుని సాయంత్రం 04:08 వరకు.


సూర్యోదయం : 05:52

సూర్యాస్తమయం : 06:51


వర్జ్యం : రాత్రి 01:36 నుండి  03:25 వరకు.


దుర్ముహూర్తం : పగలు 08:29 నుండి 09:20 వరకు తిరిగి మధ్యాహ్నం 12:48 నుండి 01:40 వరకు.


అమృతఘడియలు : పగలు 08:01 నుండి 09:49 వరకు.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.



శుభోదయ:, నమస్కార: