1, ఏప్రిల్ 2023, శనివారం

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు *రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్

 


*గ్రంథం:* భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


*ఓం ఆపద్బాంధవాయనమః*


నెల్లూరు జిల్లా కోటమండలం మెట్టుగ్రామ నివాసి శ్రీ సి. రాజారాంరెడ్డిగారు తనను శ్రీ స్వామి వారు ఆపదలో ఆదుకొన్న విషయం ఇలా చెపుతున్నారు.


1993 సం|| సెప్టెంబరు నెలలో నేను నాకుమారుడు నాగూరు రెడ్డి గొలగమూడికి శ్రీ స్వామి వారిదర్శనార్ధం వచ్చాము, నా కుమారుడు భజన మందిరంలో భజన చేస్తున్నాడు. నేను నామిత్రుని ఇంట్లో నిద్రపోతున్నాను. రాత్రి 10గం. 45ని॥కు నాకుమారునికి గుండె నొప్పి వచ్చి భజన మందిరంలో పడిపోయాడు. మైకులో ఎంతసేపు పిలచినా నిద్రలో ఉన్న నాకు తెలియలేదు.


 రాత్రి 12 గం॥లకు నేను ఎవరో లేపినట్లుగా లేచి నాకుమారుడెక్కడున్నాడా అని వెతుకుతూ నామిత్రుడు గోపాల్ రెడ్డి గారింటికి వెళ్ళాను. ఒక పిల్లవాడు పడిపోయాడని జండుబామ్ రద్దుతూ జనం గుంపులు కూడియున్నారు. చూస్తే ఆపిల్లవాడు నాకుమారుడే. పిల్లవాడు చాలా అపాయ పరిస్థితిలో ఉన్నాడు. నెల్లూరు తీసుకు పోవుటకు ఆసమయంలో ఎలాంటి వాహన వసతి లేదు. ఆగ్రామంలో డాక్టరులేడు, ఏమిచేయాలా అని దిగుల్లో ఉన్నాను.


ఇంతలో ఒక ముసలాయన *'గుండె నొప్పి వచ్చిన పిల్లవాడేడి?'* అని అడుగుతూ నేరుగా జనాన్ని నెట్టుకొని పిల్లవాని దగ్గరకొచ్చి ఇప్పుడు రెండు తెల్లవారి రెండు వేయండి, నొప్పి వెంటనే తగ్గిపోతుందనిచెప్పి నాలుగు హోమియో మాత్రలో నాచేతిలో పెట్టి వెళ్ళాడు. రెండు మాత్రలు వేసిన వెంటనే పిల్లవాని నొప్పితగ్గి లేచికూర్చున్నాడు. ఆ మాత్రలిచ్చిన మనిషి కొరకు ఎంత వెతికినా కనిపించలేదు. *ఆమహనీయుడు ఆపద్భాంధవుడైన శ్రీ స్వామి వారు గాక మరెవరై ఉండగలరు?*


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*శ్రీ సాయిమాస్టర్ స్మృతులు*

       *సంకలనకర్త :- లక్ష్మీ నరసమ్మ*

                   *టాపిక్ :- 22*

                   *స్థిత ప్రజ్ఞుడు*

                              - శ్రీ రామచంద్రరావు


ఒక్కోసారి ఆయన్ను చూస్తూంటే యీయన కంటే నాస్తికులు మేలేమోనని అన్పించేది. ఏ నియమ నిష్ఠలు లేవు. ఆచారాలు పాటించే వారు కాదు. కాషాయ వేషధారణ గాని, వేషాడంబరము గాని లేక చాలా సింపుల్ గా వుండి సమయా సమయాలు పాటించక వచ్చిన వారినందరినీ సమాధాన పరచి పంపుతూండేవారు. ఆహారానికి, నిద్రకి వేళా పాళలుండేవి గావు.


"ఎప్పుడూ మనల్ని అది చెయ్యి యిది చెయ్యి అని చెప్తూంటారు కదా! మరి మాస్టర్ గారేం చేస్తారో అడుగు" అని నా మిత్రులు నన్ను ఎక్కేశారు. నేను అడిగాను "ఏమి సార్ మమ్మల్ని ఏవేవో చేయమంటున్నారు. మరి మీరేమి చేస్తుంటారు సార్ " అని అడిగితే "ఏమి చేయకుండా వుండటమే చేస్తూంటాను" అని అన్నారు నవ్వుతూ.


                        🙏జై సాయిమాస్టర్🙏

విజయం

 శ్లోకం:☝️

*యోజనాని సహస్రాణి*

 *ఫలం విహాయ చేదపి |*

*యోగ్యాయాం దిశి మార్గస్థే*

 *యశస్సిద్ధిర్భవిష్యతి ||*


భావం: ఏ ఫలితం చూడకుండా వెయ్యి మైళ్లు ప్రయాణించినా సరే, మన మార్గం సరియైనదైతే గమ్యం ఖచ్చితంగా చేరుకుంటాము. విజయం తప్పక సిద్ధిస్తుంది!🙏

ఎందుకు జపించాలి

 *ఓం నమో భగవతే* *వాసుదేవాయఈ మంత్రం* *ఎందుకు జపించాలి?* 


 (భవిష్యపురాణం)ఒక ముసలివాడు ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రాన్ని వల్లెవేస్తూ గంగానది తీరంలో నడుస్తున్నాడు. చేతిలో జపమాల, మేడలో రుద్రాక్ష హారం ధరించాడు. అతను ఈ "ఓంనమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రం చదవడం వలన ఆతరంగాలు కలిపురుషుడిని తాకాయి. ఎక్కడి నుండి వస్తున్నది ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్ర శబ్దం అని చుట్టూ పరికించాడు. గంగానది తీరంలో ఒక బక్కచిక్కిన ముదుసలి ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్ర జపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్లి పట్టుకోబోయాడు. అయన మీద చేయి వేసిన వెంటనే ఎగిరి అర కిలోమీటరు దూరం లో పడ్డాడు. 


కొంతసేపు ఏమి జరిగిందో తెలియక చూస్తే ఆ ముసలివాడు ముందు ఎక్కడో ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రాన్ని జపిస్తూ వెళ్తున్నాడు. ఎలాగైనా పట్టుకుని నామజపాన్ని ఆపాలని దగ్గరికి వెళ్ళాడు. పట్టుకోబోతే ఈసారి యోజనం దూరంలో పడ్డాడు. ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజ ఒణికిపోయాడు. చూస్తే బక్కచిక్కి ఉన్నాడు. గట్టిగా గాలి ఒస్తే ఎగిరిపోయేలా ఉన్నాడు. కాని పట్టుకుందామంటే నేను ఎక్కడో పడుతున్నాను.


ఒకవేళ నాశక్తి సన్నగిల్లిందా, కలియుగం ఆరంభంలో కృష్ణుడు వలన నా రాక ఆలస్యం అయింది. ఇదేమైన శ్రీకృష్ణుడి మాయా ప్రభావమా, అసలు ఇంతకీ ఆ ముసలివాడు ఎవ్వడు. శివుడా...? విష్ణువా...? అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న ''వేదవ్యాసుడు'' కనిపించాడు. కలి వెంటనే వ్యాసుడు దగ్గరికి వెళ్లి మహానుభావా! సమయానికి వచ్చావు. నా సందేహాన్ని నివృత్తి చేయండి అన్నాడు. వ్యాసుడు నవ్వి ఇది నీరాజ్యం ఈ కలికాలం నీది, నీకు సందేహమా... ఏ ఇద్దరిని కూడా సక్రమంగా కలిసి ఉండనివ్వవు కదా. ఎవరైనా కలిసున్నారంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటావు. ఇలాంటి నీకు నా అవసరం ఏముంది కలిపురుషా..? ఇంతకి నువ్వు కుశలమే కదా! అన్నాడు వేదవ్యాసుడు


కుశలమే! నారాజ్యంలో నేను కాక నువ్వు పాలించవు. కదా! అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడు ఎవరు, ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు. ఇదసలు నా రాజ్యమేనా? లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా? చెప్పండి అని వేడుకున్నాడు. వేదవ్యాసుడు నవ్వి, ఓహో అదా నీ సందేహం. అయన పరమ విష్ణు భక్తుడు. అయన జపించే నామం వలన విష్ణు శక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వదు. పట్టుకోవాలని ప్రయత్నించావా! విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగాన్నే లేకుండా చేస్తాడు. త్రికరణ శుద్దిగా నిత్యం '' ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకనుకూడా తాకలేవు. కనుక ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రాన్ని ప్రజలు పట్టుకునే లోపే నువ్వు పట్టుకో. లేదంటే నీ రాజ్యంలో నువ్వు ఉండలేవు. అని చెప్పి వెళ్ళిపోయాడు.


ఇంతటి మహత్తరమైన ఈ మంత్రాన్ని నిత్యం జపించండి.🙏🕉️

వడదెబ్బ నివారణా యోగాలు

 వడదెబ్బ నివారణా యోగాలు  -


 *  ఉల్లిపాయ రసమును వంటికి పట్టించిన వడదెబ్బ నివారణ అగును.


 *  వేసవి ఎండలో నడవవలసి వచ్చినపుడు ఒక ఉల్లిపాయ టోపిలో గాని రుమాలులో గాని నడినెత్తిన పెట్టి కట్టుకొని నడిచిన వడదెబ్బ తగలదు.


 *  నీరుల్లిపాయ రసం రెండు కణతలకు , గుండె ప్రదేశములో పూసిన వడదెబ్బ తగలడం వలన కలిగిన బాధలు తగ్గును.


 *  వడదెబ్బ తగిలిన ముఖము పైన , శరీరము పైన నీళ్లు చల్లుతూ తలపైన మంచుగడ్డలు ఉంచి తాగుటకు నిమ్మరసంలో ఉప్పు కలిపి ఇవ్వవలెను.


 *  కుమ్మున ఉడికించిన మామిడికాయ రసములో ఉప్పు , జీలకర్ర కలిపి భోజనం నందు తాగుచుండిన వడదెబ్బ తగలదు.


 *  విశ్రాంతిగా పడుకోనిచ్చి ఆ తరువాత కాఫీ ఇచ్చిన వడదెబ్బ నుంచి తేరుకొందురు.


 *  48 గ్రాముల చన్నీటిలో ఒక తులము తేనె కలిపి ఇచ్చిన వడదెబ్బ నివారణ అగును.


 *  వడగళ్ళు పడినపుడు ఆ ఐస్ గడ్డలను ఏరి విభూతిలో వేసి నిలువ ఉంచి జాగ్రత్తగా దాచి ఆ విభూతిని మూడువేళ్ళకు వచ్చినంత తీసుకుని మంచినీటిలో వేసి వడదెబ్బ తగిలిన వారికి ఇచ్చిన వడదెబ్బ నివారణ అగును.


 *  తరువాణి తేటలో ఉప్పును చేర్చి ఇవ్వవలెను.


 *  తాటిముంజలు పంచదారతో కలిపి తినిపించవలెను.


 *  నాలుకకు పాత ఉశిరిక పచ్చడి రాసి పుల్లని ఆవుమజ్జిగ లో ఉప్పువేసి అన్నంలో పోసి పిసికి పిప్పిని పారవేసి ఆ రసమును తాగించవలెను .


 *  చన్నీటితో స్నానం చేయించవలెను .


 *  వేడివేడి పలచటి గంజిలో ఉప్పు వేసి తాగించవలెను .


        వడదెబ్బ తగిలినప్పుడు పైన చెప్పిన యోగాలలో మీకు వీలైనవి పాటించి సమస్య నుంచి బయటపడండి . ప్రస్తుత పరిస్థితుల్లో ఎండలు చాలా ఎక్కువ అవుతున్నాయి. వీలున్నంతవరకు బయటకి పోకుండా ఉండటం మంచిది . వెళ్ళవలసి వస్తే పైన చెప్పిన యోగాలు పాటిస్తూ జగ్రత్త వహించండి.


           

అతిరథ మహారథులు

 🏹🏹🏹🏹🏹

అతిరథ మహారథులు..అంటే.ఎవరు.?

🏹🏹🏹🏹🏹

అతిరథ మహారథులందరూ వచ్చారని మనం అంటూ ఉంటాం. 

అంటే చాలా గొప్పవారొచ్చారనే విషయం మాత్రం 

మనకు అర్థమవుతుంది. 

అయితే ఆ పదాలకు సరైన అర్థం మాత్రం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. 

మహామహా గొప్పవాళ్ళు వచ్చారనే అర్థంలో వాడతామనేది అందరికీ తెలుసు. 

ఆ పదాలకు అర్థాలేమిటో చూద్దాం.


యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లివి. 

ఇందులో 5 స్థాయులున్నాయి. అవి..

రథి, 

అతిరథి, 

మహారథి, 

అతి మహారథి, 

మహామహారథి.


1) రథి.

ఏక కాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలడు.


సోమదత్తుడు, 

సుదక్షిణ, 

శకుని, 

శిశుపాల, 

ఉత్తర, 

కౌరవుల్లో 96మంది, 

శిఖండి, 

ఉత్తమౌజులు, 

ద్రౌపది కొడుకులు -


వీరంతా..రథులు.


2) అతి రథి (రథికి 12రెట్లు).

60,000మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.


లవకుశులు, 

కృతవర్మ, 

శల్య, 

కృపాచార్య, 

భూరిశ్రవ, 

ద్రుపద, 

యుయుత్సు, 

విరాట, 

అకంపన, 

సాత్యకి, 

దృష్టద్యుమ్న, 

కుంతిభోజ, 

ఘటోత్కచ, 

ప్రహస్త, 

అంగద, 

దుర్యోధన, 

జయద్రథ, 

దుశ్శాసన, 

వికర్ణ, 

విరాట, 

యుధిష్ఠిర, 

నకుల, 

సహదేవ, 

ప్రద్యుమ్నులు 


వీరంతా అతిరథులు.


3) మహారథి (అతిరథికి 12రెట్లు).


7,20,000 మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.


రాముడు, 

కృష్ణుడు, 

అభిమన్యుడు, 

వాలి, 

అంగద, 

అశ్వత్థామ, 

అతికాయ, 

భీమ, 

కర్ణ, 

అర్జున, 

భీష్మ, 

ద్రోణ, 

కుంభకర్ణ, 

సుగ్రీవ, 

జాంబవంత, 

రావణ, 

భగదత్త, 

నరకాసుర, 

లక్ష్మణ, 

బలరామ, 

జరాసంధులు 


వీరంతా..మహారథులు.


4) అతి మహారథి (మహారథికి 12రెట్లు).


86,40,000 (ఎనభై ఆరు లక్షల నలభైవేలు) మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు.


ఇంద్రజిత్తు, 

పరశురాముడు, 

ఆంజనేయుడు, 

వీరభద్రుడు, 

భైరవుడు - 


వీరు..అతి మహారథులు.


రామరావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరే ఇద్దరు అతి మహారథులు, 

అటు ఇంద్రజిత్తు - 

ఇటు ఆంజనేయుడు. 

రామలక్ష్మణ రావణ కుంభకర్ణులు మహారథులు మాత్రమే.


5) మహామహారథి (అతిమహారథికి 24రెట్లు) .

ఏకకాలంలో 207,360,000

(ఇరవై కోట్ల డెబ్భై మూడు లక్షల అరవై వేలు) మందితో ఏకకాలంలో యుద్ధం చేయగలడు.


బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, 

దుర్గా దేవి, 

గణపతి మరియు 

సుబ్రహ్మణ్య స్వామి, 


వీరంతా..మహామహారథులు.


మహామహారథులలో అమ్మవారు కూడా ఉండడం 

హిందూ ధర్మంలోనున్న మహిళా సాధికారతకు నిదర్శనం. మహిళ..యుద్ధంలో పాల్గొన్న సంగతే ఇతర మతాల్లో మనకు కనిపించదు. 

అలాంటిది, ఒక మహిళయైన దుర్గా దేవి ఏకంగా ఇరవైకోట్ల మంది కంటే ఎక్కువ మందితో యుద్ధం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్టుగా గుర్తించడం మామూలు విషయం కాదు.

జై దుర్గా మాత.

🙏🙏🙏🙏🙏

 Let's 

away our stress with ants


1. 5 ants + 5 ants = Tenants.

2. To bring ant from another country into your country = Important.

3. Ant that's looking for a job = Applicant.

4. A spy ant = Informant.

5. A big ant = Elephant

6. A very little ant = Infant.

7. Ant that has a gun = Militant   

8. Ant that is a specialist = Consultant 😂

9. A proud ant = Arrogant

10. Ant that is cruel and oppressive = Tyrant

11. Ant that is friendly and lovely = Coolant

12. Ant that changed from evil to good deeds = Repentant

13. Ant that accumulated so much food in winter for summer = Abundant

14. Ant that opposes change: Reluctant

15. An ant that keeps accounts = Accountant

16. Ant that occupies a place = Occupant.

17. A dirty ant = Pollutant. 

18. An unlikeable ant = Irritant. 

19. A green ant = Verdant

20. Ant that is important = Significant

21. A sarcastic Ant = Mordant

22. An extremely fast ant = Instant

23. Shouting Ant = Rant

24. An ant that doesn't keep moving = Constant.

25. An enthusiastic ant = Exuberant.

26. An ant that has changed in to a different form = Mutant

ఊరక రారు మహాత్ములు"

 అనుకోని అతిథులు యింటికి  వచ్చినప్పుడు మనలోచాలామంది "ఊరక రారు

మహాత్ములు" అనడం లోకంలో పరిపాటి. ఇది ఒకనానుడిగా ప్రచారములో వుంది. ఇది

భాగవతములోని ఒక పద్య పాదం

ఊరకరారు మహాత్ములు

వా రథముల యిండ్లకాడకు వచ్చుటలెల్లన్

గారణములు మంగళములకు

మీ రాక శుభంబు మాకు నిజాము మహాత్మా!

భాగవతములో దశమ స్కంధము లోని పద్యము. నందుని యింటబాలకృష్ణుడున్నాడనీ,

వెళ్లి ఆశీర్వదించమనీ, గర్గ మహర్షిని కోరుతాడు వసుదేవుడు. అప్పుడామహర్షి నందుని

యింటికి వస్తాడు. అతని రాకకు సంతోషిణా నందుడు ఆనందంగా పలకరించే సందర్భానికి

పోతన వ్రాసిన పద్యమిది. నాలాంటి వారింటికి మీ వంటి మహాత్ములు వూరికెనే రారు.

మహాత్ములారాకకు మంగళప్రదమైన కారణం ఏదో వుండి ఉంటుంది.అని నందుడు

వినయంతో చెప్పిన పద్యమిది.

గుండెపోటుమరణాలు

 భారతదేశంలో గుండెపోటుమరణాలు   కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా  ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తుంచుకోండి.

 

 అమెరికాలోని చాలా పెద్ద కంపెనీలు భారతదేశంలోని హృద్రోగులకు వేలకోట్ల విలువైన మందులను విక్రయిస్తున్నాయి.

 కానీ మీకు ఏదైనా గుండె సంభందించి సమస్య ఉంటే, డాక్టర్ యాంజియోప్లాస్టీ చేయించుకోమని చెబుతారు.

 ఈ ఆపరేషన్‌లో, డాక్టర్ గుండె ట్యూబ్‌లో *స్టంట్* అని పిలువబడే స్ప్రింగ్‌ను చొప్పిస్తారు.

 ఈ స్టంట్ అమెరికాలో తయారు చేయబడుతుంది. మరియు దీని ఉత్పత్తి ధర కేవలం 3 డాలర్లు (రూ.150-180).

 ఈ స్టంట్‌ను ఇండియాకు తీసుకొచ్చి 3నుంచి5 లక్షల రూపాయలకు విక్రయించి దోచుకుంటున్నారు.

 డాక్టర్లకు లక్షల రూపాయల కమీషన్ వస్తుంది. అందుకే యాంజియోప్లాస్టీ చేయించుకోమని పదే పదే అడుగుతారు.

 కొలెస్ట్రాల్, *బిపి* లేదా గుండెపోటుకు యాంజియోప్లాస్టీ ఆపరేషన్ ప్రధాన కారణం.

 ఇది ఎవరికీ ఎప్పుడూ విజయవంతం కాదు.

 ఎందుకంటే డాక్టర్ హార్ట్ ట్యూబ్ లో పెట్టే స్ప్రింగ్ బాల్ పాయింట్ పెన్ను స్ప్రింగ్ లాంటిది.

 అయితే కొన్ని నెలల్లోనే ఆ స్ప్రింగ్‌కి రెండు వైపులా  కొలెస్ట్రాల్ మరియు కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది.

 దీని కారణంగానే రెండోసారి గుండెపోటు వస్తుంది.

 మళ్లీ యాంజియోప్లాస్టీ చేయించుకోవాలని డాక్టర్‌ చెపుతారు.

 లక్షల రూపాయలు దోచుకుని నీ ప్రాణం తీస్తారు.

 ●●●●●●●●●●●●●●●●

 ఆయుర్వేద చికిత్స

●●●●●●●●●●●●●●●●

 *అల్లం రసం -* 

 ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది.

 ఇది సహజ పద్ధతిలో నొప్పిని 90% తగ్గిస్తుంది.

 ●●●●●●●●●●●●●●●●

 *వెల్లుల్లి రసం* 

 ●●●●●●●●●●●●●●

 ఇందులో ఉండే *అల్లిసిన్* మూలకం కొలెస్ట్రాల్ మరియు బీపీని తగ్గిస్తుంది.

 దాంతో హార్ట్ బ్లాక్స్ ఓపెన్ అవుతాయి.

 ●●●●●●●●●●●●●●●●

 *నిమ్మరసం* 

 ●●●●●●●●●●●●●●●●

 ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం రక్తాన్ని శుభ్రపరుస్తాయి.

 ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

 ●●●●●●●●●●●●

 *ఆపిల్ సైడర్ వెనిగర్* 

 ●●●●●●●●●●●●●●●●

 ఇందులో 90 రకాల మూలకాలు ఉన్నాయి, ఇవి శరీరంలోని అన్ని నరాల *బ్లాక్సు* ను తెరుస్తాయి, కడుపుని శుభ్రపరుస్తాయి. మరియు అలసటను తొలగిస్తాయి.

 ●●●●●●●●●●●●●●●●ఈ దేశీయ ఔషధాలు

        ఇలా ఉపయోగించండి ●●●●●●●●●●●●●●●●

 1- ఒక కప్పు నిమ్మరసం తీసుకోండి;

 2- ఒక కప్పు అల్లం రసం తీసుకోండి;

 3- ఒక కప్పు వెల్లుల్లి రసం తీసుకోండి;

 4-ఒక కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోండి; ●●●●●●●●●●●●●●●●

 నాలుగింటినీ కలపండి. మరియు తక్కువ మంట మీద వేడి చేయండి, 3 కప్పులు మిగిలి ఉన్నప్పుడు, దానిని చల్లబరచండి;

 ఇప్పుడు మీరు

 దానికి 3 కప్పుల తేనె కలపండి.

 ●●●●●●●●●●●●●●●●

 ఈ ఔషధం 3 స్పూన్లు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోండి.

 అన్ని బ్లాక్సు open అయిపోతాయి.

 ●●●●●●●●●●●●●●●●

 ప్రతి ఒక్కరూ ఈ ఔషధంతో తమను తాము  రక్షించుకోండి.

 ●●●●●●●●●●●●●●●●

 గుండెపోటును ఎలా నివారించాలలి?          ●●●●●●●●●●●

 గుండెపోటు సమయంలో చాలా మంది ఒంటరిగా ఉంటారు కాబట్టి, వారికి ఎటువంటి సహాయం లేకుండా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది.

 గుండె పోటురాగానే మూర్ఛపోవడం ప్రారంభమవుతుంది. కేవలం 10 సెకన్లు మాత్రమే ఉంటాయి.

 అటువంటి స్థితిలో, బాధితుడు తీవ్రంగా దగ్గాలి. దగ్గు చాలా బలంగా ఉండాలి.

 ఛాతీలోంచి ఉమ్మి వచ్చేంతవరకు దగ్గాలి.

 సహాయం వచ్చే వరకు

  ప్రక్రియ పునరావృతం చేయాలి.

 తద్వారా హార్ట్ బీట్ సాధారణంగా ఉంటుంది

 ,.................................

గట్టిగా దగ్గడంవలన ఊపిరితిత్తులు శ్వాస

 ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది

బిగ్గరగా దగ్గడం వల్ల

 గుండె కుంచించుకుపోయి

 రక్త ప్రసరణ క్రమం తప్పకుండా

 నడుస్తుంది.

 ●●●●●●●●●●●●●●●●●

 ●●●●●●●●●●●●●●●●●●●●

         మీరు చాలా అభ్యర్థించబడ్డారు

   జోక్ ఫోటోలు పంపే బదులు

        ఈ సందేశాన్ని అందరికీ పంపండి

    ప్రాణాలను కాపాడటానికి

రాయల్ బిక్షాలు రాథోడ్

 గోర్ బంజారా గ్రూప్:9000652896

 ...✍️🙏🙏🙏

పొగడ చెట్టు అద్భుత గాథ

 . 

                      *పొగడచెట్టు*

                                         


         పొగడ పూల పరిమళం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిన్నప్పుడు  ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తూ పొగడ చెట్ల నీడలో ఆడుకున్న రోజులు నాకింకా బాగా  గుర్తు. మిగిలిన పూలన్నీ ఒక ఎత్తు. పొగడ, పారిజాతం పూలు రెండూ ఒక ఎత్తు. ఎందుకో తెలియదుగానీ, ఆ రెండు పూలకు సంబంధించిన నా చిన్నప్పటి జ్ఞాపకాలు  చక్కటి వాటి సుగంధపు అనుభూతులతో కలిసి పెనవేసుకున్నాయి. ఎప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకున్నా, తక్షణం వాటి పరిమళాన్ని ఆస్వాదిస్తున్న అనుభూతి కూడా తప్పక కలుగుతుంది.  ఆ పూలకూ, వాటి పరిమళాలకూ మధ్య బంధం అంతగా విడదీయరానిది మరి !!  రాలిన పొగడపూలు వాటి తెల్లదనం కోల్పోయి లేత గోధుమవన్నెకు  మారినా,  అవి వాటి  సువాసనను  మాత్రం కోల్పోవు. అప్పట్లో ఆడపిల్లలు  రాలిన పొగడ పూలను ఏరుకుని, ఆ పూల మధ్యన ఉండే బొడ్డులోని రంధ్రం గుండా సూది జొనిపి, వాటిని మాలలుగా గుచ్చి, తలలో పెట్టుకునేవారు. కొందరయితే ఆ రాలుపూలను కొబ్బరి నూనెలో వేసుకుని   పరిమళభరితమైన ఆ నూనెను తలకి రాసుకునేవారు.


        పొగడపూల పరిమళాన్ని పొగడుతూ‘ విశ్వకవి’ రవీంద్రనాథ్ టాగోర్ (1861-1941) ఎన్నో కవితలు రాశారు. శాంతి నికేతన్ లో ఒక వీథికి ఇరువైపులా తనకు అత్యంత ప్రీతిపాత్రమైన పొగడచెట్లనే పెంచుకున్నారాయన. ఆ వీథికి  ‘బకుల్ బీథి’ (పొగడ వీథి ) అనే పేరుపెట్టుకుని  పొగడపూల పరిమళాలను ఆస్వాదిస్తూ, ప్రభాత సమయాల్లో ఆ బాట వెంట గంభీరంగా నడుస్తుండేవారట ఆయన. ఆషాఢ మాసంలో ముచ్చటైన చిట్టి నక్షత్రాలవంటి పొగడపూలు చెట్లనిండా విరగబూయడం, పరిమళాలు వెదజల్లే ఆ పూలు ఒక్కటొక్కటిగా మెల్లమెల్లగా నేలపై రాలిపడడం మొదలైనవన్నీ ఎంతో ఆసక్తిగా వర్ణించారు విశ్వకవి ‘అభినొయ్’ (Abhinoy) అన్న తన బెంగాలీ  కవితలో. రవీంద్రుడికి పొగడ పూల పరిమళం గుబాళించే ఏప్రిల్, మే,జూన్ నెలలంటే ఎంతో ఇష్టమట. సంస్కృత భాషలో పొగడను ‘వకుళః ’ అంటారు.  ‘రోగాలను పోగొట్టేది’ అని దీని అర్థం. సంస్కృతంలోనే దీనికి ‘కేసరః’ అనే మరో పేరుంది. ‘మంచి ఆకారం, సుగంధం కలిగి శిరస్సున ధరించేది’ అని దీని అర్థం. దీనినే కొందరు ‘సింహ కేసర’ అనీ అంటున్నారు. శ్రీకృష్ణుడికి పొగడ పూలంటే అమిత ఇష్టమట. బృందావనంలోని పొగడ చెట్ల నీడలలోనే గోపికలతో ఆయన ఆటపాటలన్నీ సాగేవట. 


#వకుళాదేవి #ఐతిహ్యం 

  

        తిరుమల కొండలపై అనాథ బాలుడైన శ్రీనివాసుడిని తన ఆశ్రమంలో పెంచి, పెద్దచేసి, పద్మావతితో ఆయన వివాహం జరిపించిన వకుళాదేవి తనను తాను శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ‘వకుళా’ పుష్పం యొక్క మారురూపంగా భావించేదట. రోజూ పొగడపూల మాలలు గుచ్చి కృష్ణుని విగ్రహానికి అలంకరించేదట  ఆ భక్తురాలు. కేవలం భక్తురాలిగానే కాక, కృష్ణుడిని  పెంచిన తల్లి యశోదగా కూడా తనను తాను   ఊహించుకునేదట ఆమె. ద్వాపర యుగంలోని ఆ యశోదే కలియుగంలో వకుళాదేవిగా జన్మించిందని కొందరి విశ్వాసం. శ్రీకృష్ణుడు విదిషను పాలించిన భీష్మకుని కుమార్తె రుక్మిణిని ఎత్తుకెళ్ళి, రాక్షస పద్ధతిలో వివాహం చేసుకున్నప్పుడు యశోద  కృష్ణుడితో, ‘ నీ పెళ్లి నా చేతులమీదుగా జరిపించాలని నాకు కోరికగా ఉంది,’ అన్నదట.  అప్పుడు కృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ యశోదతో, ‘ నీ కోరిక ఈ జన్మలో మాత్రం తీరేది  కాదు. వచ్చే జన్మలో నీవు వకుళాదేవిగా జన్మించి, తిరుమల కొండల మీద నివసించేటప్పుడు నేను ఒక  అనాథ 

బాలుడిగా నీ ఆశ్రమానికి వచ్చి, నీచే  చేరదీయబడి, నీ చేతులమీదుగా ( పద్మావతిని) వివాహమాడి,  నీ ముచ్చట  తీరుస్తాను’, అన్నాడట.  శ్రీకృష్ణుని రాక కోసం ఏళ్ళ తరబడి ఎదురుచూసిన ఆమె అనాథ బాలుడైన శ్రీనివాసుడిలోనే శ్రీకృష్ణుడిని చూసుకునేదట. తిరుపతి - చంద్రగిరి మార్గంలోని పేరూరులోని ఒక చిన్న కొండపై కొందరు భక్తులు కట్టించిన వకుళా మాత ఆలయం నేటికీ ఉంది. అయితే ఆ ఆలయంలో పూజా పునస్కారాలేవీ జరగడం లేదు. అక్రమ క్వారీయింగ్ చేసే తవ్వకందారులు పేరూరు బండగా ప్రసిద్ధమైన ఆ  చిన్న కొండను గ్రానైట్ కోసం దాదాపుగా పగలగొట్టి ధ్వంసం చేసేసిన కారణంగా ఆ కట్టడం ఉనికి ఇప్పుడు ప్రమాదంలో పడింది.  పి. పుల్లయ్యగారి దర్శకత్వంలో పద్మశ్రీ ప్రొడక్షన్స్ వారు  యన్టీ ఆర్, సావిత్రి ప్రధాన పాత్రధారులుగా నిర్మించిన మహత్తర  చలనచిత్రం  ‘శ్రీ వేంకటేశ్వర మాహాత్మ్యం’ లో వకుళాదేవి పాత్రధారి శాంతకుమారి గారు పెండ్యాలగారి సంగీత దర్శకత్వంలో ’ ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ ఎదురుచూతురా గోపాలా.. ఎంత పిలిచినా,  ఎంత వేడినా..  ఈనాటికి దయరాలేదా ?.. గోపాలా.. నందగోపాలా..’ అంటూ తానే స్వయంగా పాడుకున్న అద్భుత గీతాన్ని మనం  ఎవరమైనా ఎలా మరచిపోగలం ?

  

పొగడ  తీరూ … పేరూ … 


       పొగడ చెట్టు పెద్ద సతతహరిత (ఎప్పుడూ ఆకుపచ్చగా ఉండే) వృక్షం.  ఇది  అరుదుగా 120 అడుగుల ఎత్తువరకూ కూడా పెరుగుతుంది. మొదలు చుట్టుకొలత 9 అడుగులుండే వృక్షాలు కూడా అక్కడక్కడా కనుపిస్తాయి. దీని కాండం ముదురు చాక్లెట్ రంగులో నెర్రెలు విచ్చి ఉంటుంది. చెట్టంతా ఎప్పుడూ ఆకులు ఒత్తుగా ఉంటాయి. అందుకే నీడనిచ్చే వృక్షాలలో పొగడది ఓ ప్రత్యేకమైన  స్థానం. పొగడ చెట్లు  దక్షిణ భారతదేశమంతటా, ఇంకా అండమాన్ దీవులలోని సతత హరితారణ్యాలలోనూ, బెంగాల్, బర్మా అడవులలోనూ సహజంగా పెరుగుతాయి. సువాసనగల వీటి పుష్పాల కారణంగా పొగడ చెట్లను ఉద్యానవనాలలో అలంకార వృక్షం (Ornamental Tree) గానే కాక,  నీడకోసం రహదారులకు ఇరువైపులా ఎవెన్యూ వృక్షాలు (Avenue Trees)గానూ  పెంచుతున్నారు. ఈ ఉష్ణ ప్రాంతపు వృక్షం ఆకులు అండాకారంలో కొంచెం పొడవుగా మొనదేలి ఉంటాయి. ఆకులు పై పక్క ముదురు ఆకుపచ్చగా, నున్నగా  మెరుస్తూ, కింది పక్క లేత ఆకుపచ్చ రంగులో,  ఈనెలు బయల్పడి ఉంటాయి. పట్టుకుంటే ఆకులు స్పర్శకు తోలులా అనిపిస్తాయి. ఆకుల అంచులు అలలలా ఉంటాయి. పూలు కాండానికీ ఆకుకూ మధ్య (Axils)లో ఒంటరిగానూ లేక గుత్తులుగానూ పూస్తాయి. అవి మీగడ తెలుపు వన్నెలో నక్షత్రాకారంలో పరిమళభరితంగా ఉంటాయి. కాయలు అండాకారంలో పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగానూ, పండితే  కాషాయ వర్ణంలోనూ, ఒక్కోసారి పసుపుపచ్చగానూ ఉంటాయి.  సపోటా మరియు పాల పళ్ళకున్నట్లే పొగడ పళ్ళకూ పండు చివర సన్నటి  రాలిపోయే ముల్లు  ఉంటుంది. ఆ చెట్ల లాగే పొగడలోనూ చెట్టంతా పాలుంటాయి.  పండులో సాధారణంగా ఒక గింజ లేక  అరుదుగా రెండు గింజలుంటాయి. గింజలు అండాకారంలో గోధుమ వన్నెలో మెరుస్తూ, ఒత్తినట్లుగా ఉంటాయి. పొగడ పళ్ళపై గుజ్జు  తియ్యగా ఉంటుందిగానీ, దానిలో ఉన్న ‘శాపోనిన్’ అనే రసాయనిక పదార్ధం  కారణంగా అవి తింటుంటే కొంచెం వగరుగా, ఏదుగా అనిపించి, మనం ఏదో వికారమైన అనుభూతికి లోనవుతాం.  వాటిని ఇష్టంగా తినే పక్షులు, గబ్బిలాలు విత్తన వ్యాప్తికి తోడ్పడతాయి. మన ప్రాంతంలో మనకి మహావృక్షాలుగా పెరిగిన పొగడ చెట్లు దాదాపు ఎక్కడా  కానరావు. అయితే పశ్చిమ  కనుమలలోనూ, అండమాన్ దీవులలోనూ మనకు పొగడ మహావృక్షాలు కనుపిస్తాయి.


                 పొగడను బెంగాలీ భాషలో ‘బకుల్’ అంటారు.  దాని సంస్కృత పేరు ‘వకుళః’ లేక ‘బకుళః’ నుంచి ఇది ఏర్పడింది.    హిందీలో ఈ చెట్టును ‘మౌల్ సారీ’ లేక ‘మౌల్ సిరీ’ అంటారు.పగడాల (Corals) వంటి దీని కాయలనుబట్టి దీన్నికన్నడ భాషలో ‘పగడె మర’ అంటారు.మలయాళంలో ‘ఇలాంజి’ లేక ‘ఎలాంజి’ అంటారు. తమిళంలో ‘ఇలంచి’ అనీ ‘మగిళం’ అనీ అంటారు. ఆంగ్లంలో దీనిని ‘బుల్లెట్ ఉడ్ ట్రీ’ (Bulletwood Tree) అంటారు. వాణిజ్య పరంగా పొగడ కలపను ‘బుల్లెట్  ఉడ్’ అనే వ్యవహరిస్తారు. సపోటా చెట్టు  (Achras zapota), పాల చెట్టు (Manilkara hexandra),ఇప్ప లేక విప్ప (Madhuca indica) వగైరాలలాగే పొగడ చెట్టు కూడా ‘సపోటేసీ’ (Sapotaceae) కుటుంబానికి చెందినదే. దీని శాస్త్రీయ నామం  ‘మిమ్యూసాప్స్ ఎలెంజి’ ( Mimusops elengi). ‘మిమ్యూసాప్స్’ అనే పదానికి ‘మిమస్’(mimus- mimic) అనే లాటిన్ పదం, ‘ఆప్సిస్’ (opsis-like) అనే గ్రీకు పదం మూలాలు. పొగడ  పువ్వు  నక్షత్రాన్ని  పోలివుండడాన్నిబట్టి దీనికాపేరు.  ఇక ‘ఎలెంజి’ అనేది దీని మలయాళీ పేరు యొక్క లాటిన్ రూపం. పోర్చుగీసు భాషలో పొగడ చెట్టును ‘పొమ్మె - డి- ఆడమీ’  అనడాన్నిబట్టి  వారి దృష్టిలో ఇది ఆది పురుషుడైన ఆడమ్ అంత ప్రాచీన వృక్షమన్నమాట. కాని ఇది వృక్షం కనుక తొలి మానవుని కంటే కూడా లక్షల ఏండ్ల ముందర ఆవిర్భవించినదే అయి ఉంటుంది. 


పెంపకం ఎలా ?

  

                   పొగడ చెట్లు చాలా నిదానంగా పెరుగుతాయి. వేర్వేరు చిన్న తట్టలలో పేడ ఎరువు, ఇసుక కలిపిన మట్టిపోసి,  ఆ మట్టిలో ఒక్కొక్కటి చొప్పున పొగడ విత్తనాల్ని విత్తుకుని,రోజూ నీళ్ళు పోస్తూ,  మొలకెత్తిన తరువాత రెండు సంవత్సరాలకు వాటిని మనకు కావలసిన చోట నాటుకోవాలి. రెండేళ్ళు పెరిగిన మొక్కల్ని నాటుకోవడానికి వర్షాకాలం మాత్రమే అనుకూలమైనది. దీని విలువైన కలపకోసం ఈ చెట్లను పెంచేవారు, ‘ఊండ్ ఫంగస్’ (Wound Fungus- Fomes senex) అనే కలపను దెబ్బతీసే తెగులు పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆకుల మీద వచ్చే బొబ్బలు (leaf galls) కూడా చెట్టు పెరుగుదలకు కీడు చేస్తాయి. కనుక పొగడ చెట్ల పెంపకందారులు వాటిని గమనించిన వెంటనే వ్యవసాయాధికారులను సంప్రదించి సకాలంలో తగు నివారణ చర్యలు చేపట్టాలి.


ప్రయోజనాలు 


               పొగడ కలప దృఢంగా, మన్నికగా, బరువుగా ఉంటుంది. భూమిలో పాతిపెట్టినా అది  పది- పదిహేను సంవత్సరాల  పాటు కూడా చెడిపోకుండా ఉంటుంది. అందుకే శవాలను ఖననం చేసేవారు చెక్కపెట్టెల తయారీకి ఈ కలపను ఎక్కువగా ఉపయోగిస్తారు. కలప పచ్చిగా ఉన్నప్పుడు బాగా తెగుతుంది. ఈ కలప పాలిష్ ని బాగా తీసుకుంటుంది కనుక ఫర్నిచర్ తయారీలో కూడా ఎక్కువగా దీనిని వినియోగిస్తారు. ఫర్నిచర్ తయారీలోనే కాక పొగడ కలపను కాబినెట్ వర్క్ లోనూ, పనిముట్ల పిడుల తయారీలోనూ, చేతికర్రలు, ఫోటో ఫ్రేములు, సంగీత వాద్యాల తయారీలోనూ కూడా ఉపయోగిస్తారు. భవన నిర్మాణంలోనూ, వంతెనలు, బోట్లు, తెడ్లు, తెరచాప కొయ్యలు, వ్యవసాయ పనిముట్లు, బండ్లు, నూనె గానుగలు వగైరాల తయారీలోనూ  కూడా వినియోగిస్తారు. 


                 పొగడ పూలు పెద్ద సంఖ్యలో జలజలా నేలరాలుతుంటాయి. ఎండిన తరువాత కూడా చాలా కాలంపాటు ఈ పూలు తమ పరిమళం కోల్పోవు. ఈ రాలు పూలను ఏరి, మాలలు గుచ్చడం, పరిమళంకోసం కొబ్బరి నూనెలో వేసుకోవడమే కాక,  కొందరు ఈ పూలను దూదికి బదులుగా దిండ్లలో నింపడానికి వాడతారు. 

   

                       పొగడ ఆకులు, లేత కొమ్మలు కోసి, పశువులకు పచ్చి మేతగా వేస్తారు. అయితే ఈ మేత  అంతగా పుష్టికరం కాదు.  లేత కొమ్మల్ని విరిచి కొందరు పళ్ళు తోముకునే ( పందుము) పుల్లలుగా వాడతారు. థాయిలాండ్ లో పొగడ పూల గుజ్జును పరిమళం కోసం స్నానానంతరం ఒంటికి రాసుకుంటారు. ఈ పూలనుంచి  డిస్టిలేషన్ ప్రక్రియ ద్వారా ఒక అత్తరు (otto) తీస్తారు. దానిని  పరిమళ ద్రవ్యాలు, ఉత్ప్రేరకాల తయారీలో ఉపయోగిస్తారు. పొగడ పళ్ళు తింటారు. వాటితో జామ్ లు,  ఊరగాయ పచ్చళ్ళు తయారు చేసుకుంటారు. పొగడ గింజలనుంచి తీసే కొవ్వును వంటనూనెగానూ, దీపాలు వెలిగించడానికి కూడా ఉపయోగిస్తారు. ఈ ముడినూనె ఎరుపు - గోధుమ వర్ణాల మిశ్రమంగా, ఏ వాసన లేకుండా ఉంటుంది. దీనిని శుద్ధిచేస్తే లభించే నూనెకు  రంగు, వాసన ఉండదు కానీ, గాలి తగిలితే అది లేత పసుపు వన్నెలోకి మారుతుంది.


               పచ్చి పొగడ కాయలు స్రావాల్ని ఆపుతాయి. ఈ వృక్షం కాండంపై బెరడు బలవర్ధకమే కాక జ్వరహారిణి (Febrifuge) కూడా. గింజలు విరేచనకారిగా పనిచేస్తాయి. పూలు, పళ్ళ నుంచి తయారుచేసే ఒక లోషన్ గాయాలు, పుళ్ళ నివారణకు ఉపయోగిస్తారు. దీని ఎండు  పూలనుంచి  తయారుచేసే నస్యాన్ని పీల్చితే ముక్కుల వెంబడి స్రావాలు వెడలి  తీవ్రమైన తలనొప్పి కూడా మటుమాయమౌతుంది. పొగడ పండ్ల గింజలను దంచి,  నేతితో కలిపి మెత్తటి పేస్టుగా చేసి, పిల్లలకి తినిపిస్తే మొండి మలబద్ధకం కూడా తగ్గి, సాఫీగా విరేచనాలు అవుతాయి. పళ్ళ చిగుళ్ళ నుంచి రక్తం కారుతున్నా, పళ్ళు కదిలినా  పచ్చి పొగడ కాయలను నోట్లో వేసుకుని నమిలితే చిగుళ్ళు గట్టిపడి, పళ్ళు దృఢమౌతాయి. పళ్ళు, చిగుళ్ళ  వ్యాదులలో పొగడ కాండంపై బెరడును కషాయంగా కాచి, నోటిలో పుక్కిలిస్తే కూడా చిగుళ్ళు గట్టిపడి, పళ్ళు బలపడతాయి. పళ్ళ  చిగుళ్ళు వాచి, జిగురు సాగుతూ ఉంటే (Spongy gums)  పొగడ చెట్టు కాండం బెరడుతో తయారుచేసిన పండ్ల పొడి వాడతారు. పొగడ కాండంపై బెరడు స్త్రీల వంధ్యత్వాన్ని పోగొట్టి, వారికి  సంతాన ప్రాప్తి అవకాశాలను మెరుగుపరుస్తుంది. పొగడ పండ్ల గుజ్జును అతిసార వ్యాధినుంచి కోలుకుంటున్న వారికి ఆహారంగా ఇస్తారు. అలాగే పాముకాటుకు  మందుగానూ వాడతారు. ఈ పళ్ళ గుజ్జును నుదురుకు పట్టిస్తే తీవ్రమైన తలనొప్పులు కూడా తగ్గిపోతాయి. 


                      అందమైన ఉద్యానవన వృక్షంగా మనం భావించే పొగడ చెట్టుకు ఎన్నెన్ని ప్రయోజనాలున్నాయో చూశారుగా ! ఇదండీ పొగడ చెట్టు అద్భుత గాథ !!

సూక్తిసుధ

 .

                 _*సూక్తిసుధ*_


*ఒక గుణముచేత మరియొక గుణము గలుగునవి:*

అధికారముచేత సామర్థ్యమును, వస్త్రాభరణాదులచేత సౌందర్యమును, సంపదచేత మర్యాదయును, దాతృత్వముచేత కీర్తియును, వినయముచేత గొప్పతనమును, వైరాగ్యముచేత జ్ఞానము, భక్తిచేత భగవదనుగ్రహమును, ప్రియవాక్యముచేత లోకవశ్యతయును, సుగుణము చేత ధనమును సిద్దముగ వచ్చును.

మిత్రులు లేనివాడు

 .

                 _*సుభాషితమ్*_


 𝕝𝕝 *శ్లో* 𝕝𝕝


*ఆపన్నాశాయ విబుధైః*

*కర్తవ్యాః సుహృదోఽమలాః।*

*న తరత్యాపదం కశ్చి*

*ద్యోఽత్ర మిత్రవివర్జితః॥*


తా𝕝𝕝 

"ఎంతటి విద్వాంసులైననూ (తమ) ఆపదలు తొలగించుకునేందుకు ఉత్తములైన మిత్రులను సంపాదించవలెను.... మిత్రులు లేనివాడు ఎవడూ ఆపదలు దాటలేడు.

రామతత్వం

 తండ్రి మాటకు కట్టుబడి వుండటం బిడ్డల బాధ్యతన్నది రామతత్వం 


భర్త కోసం ఏమైనా చేయగల్గడం సీత తత్వం

అన్నవదినలమాట జవదాటకూడదన్నది లక్ష్మణ తత్వం 


నమ్మిన వారి కోసం ఏదైనా చేయాలనేది హనుమ తత్వం 

ఇదే సనాతన ధర్మం మనకు నేర్పిన ధర్మం 


ప్రజలెవ్వరికీ అశాంతి కలగకుండా పాలించాలనేది రామరాజ్యం.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

మౌనం అద్భుతమైన భాష

 *మౌనం అద్భుతమైన భాష* అది ఎలాగో తెలుసుకుందాం.


*నూతిని తవ్వి నేను నీటిని పుట్టిస్తున్నానని అనుకుంటున్నావేమో*- అది పొరపాటు... నువ్వు తవ్వకముందే అక్కడ నీరున్నది. అది నీటి అవ్యక్తస్థితి అంటుంది వేదం.నీ ప్రయత్నం ద్వారా అది లోకానికి వెల్లడి అయింది, అంటూ లక్షణశాస్త్రం వివరణ ఇచ్చారు వినోబా భావే 


నేను ఏ భాషలో మాట్లాడితే మీకు సౌకర్యంగా ఉంటుంది. అని వారిని ప్రశ్నించారు. పాత్రికేయుల్లో ఒకాయనకు భావే మాటలు కొంత అతిశయంగా అనిపించాయి. 


దాంతో ఆయన లేచి మీరు ఏ భాషలో మాట్లాడినా, అర్థం చేసుకోగల సామర్థ్యం అందరికీ ఉంది. మీకు బాగా ఇష్టమైన భాషలో మీరు మాట్లాడవచ్చు అన్నాడు దర్పంగా. 


ఆ పాత్రికేయుడికి కృతజ్ఞతలు చెబుతూ భావే, మందహాసంతో ‘నాకు మౌనం చాలా ఇష్టమైన భాష. మీకు తెలుసుగా’ అంటూ సర్దుకొని కూర్చుని మౌనముద్ర దాల్చారు. 


చాలాసేపటికి విమానం వచ్చింది. ప్రకటన వినిపించింది. ‘మరి శెలవా!’ అన్నట్టుగా భావే మౌనంగా తలపంకించి చిరునవ్వుతో అక్కడి నుంచి కదిలిపోయారు.


ఇది చదవగానే మనలో చాలామందికి ‘మౌనం కూడా ఒక భాషేనా?’ అనే సందేహం వస్తుంది. నిజానికి ఆ విషయంలో ఎవరూ సందేహించవలసిన పని లేదు. నిజంగానే మౌనమనేది చాలా శక్తిమంతమైన భాష. 


ప్రశాంత సుందరమైన హిమాలయ పర్వతసానువుల్లోనో నిర్జనమైన ప్రదేశాల్లోని శిథిల ఆలయాల్లోనో కార్తిక పౌర్ణమి వేళ మనం డాబాపై ఏకాంతంగా కూర్చొని చల్లని పిల్ల తెమ్మెరలను ఆస్వాదిస్తున్నప్పుడో... శ్రద్ధగా గమనిస్తే- ఆ గాలి ఊసులు చెబుతాయి మౌనం ఎంత గొప్ప భాషో! కోట్లాది శబ్దాలకన్నా మనిషికి నిశ్శబ్దం చాలా ఎక్కువ బోధిస్తుంది. 


మాట్లాడకుండా కూర్చోవడం కాదు, లోలోపల ఆలోచనల రొద సైతం నిలిచిపోయే ఒకానొక అద్భుతమైన స్థితి పేరు మౌనం! అప్పుడే నిశ్శబ్దం మనసును ఆవరిస్తుంది. మనిషికి ప్రశాంతత అనుభూతమవుతుంది.


మనిషి తనచుట్టూ దట్టంగా పరచుకొన్న కటిక చీకటిని, బ్రహ్మాండమైన వెలుగుల పూర్వరూపంగా ఏనాడో గుర్తించాడు. 


ఆ చీకటి అసలు రూపం నలుపు కాదని, అది అనంతమైన కాంతి కిరణాలను తన కడుపులో దాచుకొన్న తెల్లని దేదీప్యమానమైన వెలుగుల ముద్ద అనీ పెద్దలు ఎన్నోసార్లు వివరించారు. 


అదేవిధంగా నిశ్శబ్దం కూడా తన లోపల ప్రళయభీకర శబ్దాలను ఇమడ్చుకొన్నదేనని బోధించారు. ఇది నిజానికి వేద ప్రతిపాదితమైన జ్ఞానం. 


ఈ సత్యాన్ని మనిషి జీర్ణించుకొంటే మౌనం మాట్లాడటమంటే ఏమిటో అర్థం అవుతుంది. గాఢమైన ప్రేమికుల మధ్య... అన్యోన్య దంపతుల మధ్య... నిర్మలమైన భక్తుడికి భగవంతుడికి మధ్య... మౌనం చాలా గొప్ప వాహిక. అనుసంధాన వేదిక. అది అవ్యక్త మధురమైన భాష. 


మనిషి గుర్తించడు గాని... వాస్తవానికి ప్రతి మనిషికీ ఆ భాషతో పరిచయం ఉండే ఉంటుంది. ఎదలోపలి ప్రతిస్పందనలను గమనించినప్పుడు, మరో హృదయంలోంచి అది నేరుగా తన గుండెల్లోకి ప్రసారం అయినప్పుడు మనిషి దాన్ని గమనించాలి. 


అది విత్తులోంచి బ్రహ్మాండమైన వట వృక్షాన్ని దర్శించడం వంటిది. ఆ తరహా సాధన ఫలించిననాడు- మౌనంలోంచి,నిశ్శబ్దంలోంచే కాదు... యోగుల సంభాషణల్లోంచి సైతం వారి అంతరంగాల్లో నెలకొన్న ప్రశాంతతను గుర్తించడం సాధ్యమవుతుంది. 

మాట నేర్చిన మనిషి తన ప్రయాణంలో చివరకు చేరవలసిన గమ్యం అదే!🙏🏻

మోక్షం

 శ్లోకం:☝️

*న మోక్షో నభసః పృష్ఠే*

 *న పాతాలే న భూతలే l*

*మోక్షో హి చేతో విమలం*

 *సమ్యగ్ జ్ఞానవిబోధితం॥*

  - యోగవాశిష్టం


భావం: మోక్షం అనేది స్వర్గంలో కానీ పాతాళంలో కానీ భూమిమీద కానీ లేదు. సమష్టి జ్ఞానముచే శుద్ధమైన మనస్సు తన యొక్క ముక్త స్థితిని అనుభవపూర్వకంగా గుర్తించడమే మోక్షం.🙏

Ramayana

 1) Adhyatm Ramayana

2) Valmiki Ramayana

  3) Ananda Ramayana

4) Adbhuta Ramayana

5) Ranganatha Ramayana (Telugu)

6) Molda Ramayana (Telugu)

7) Ruipadkatenapadi Ramayana

(Odisha)

8) Ramker (Cambodian) 9) Ramcharitamanas by Tulsidasa (Avadhi)

10) Iramavtarama by Kamban (Tamil)

11) Janaki Haran by Kumar Dasa (Sanskrit)

12) Maleraj Kathav (Sinhalese)

  13) Kavyadarsha by Kinras-Puns-Pa (Tibetan)

14) Kakavin Ramayana (Indonesia)

  15) Hikayat Seriram (Malaysia)

16) Ramavatthu (Myanmar)

17) Ramkerti-Riamker (Cambodia Khmer)

18) Hobutsushu by Terrano Yasunori(Japanese)

19) Ramjataka (Laos)

20) Bhanubhakta's Ramayana (Nepal)

21) Ramkien (Thailand)

22) Khotani Ramayana (Turkistan)

23) Jivaka Jataka (Mongolia)

  24) Christian Ramayana (Persian)

25) Dastaan-e-Ram-o-Sita by Sheikh Sadi

26) Dashrath Kathanam

These all are names of ramayana 🙏🙏🙏🙏

శ్రీరామచంద్రుడి వంశవృక్షం

 ♦️🌳♦️ శ్రీరామచంద్రుడి వంశవృక్షం ♦️🌳♦️

♦️బ్రహ్మ కొడుకు మరీచి

♦️మరీచి కొడుకు కాశ్యపుడు

♦️కాశ్యపుడి కొడుకు సూర్యుడు

♦️సూర్యుడి కొడుకు మనువు

♦️మనువు కొడుకు ఇక్ష్వాకువు

♦️ఇక్ష్వాకువు కొడుకు కుక్షి

♦️కుక్షి కొడుకు వికుక్షి

♦️వికుక్షి కొడుకు బాణుడు

♦️బాణుడి కొడుకు అనరణ్యుడు

♦️అనరణ్యుడి కొడుకు పృధువు

♦️పృధువు కొడుకు త్రిశంఖుడు

♦️త్రిశంఖుడి కొడుకు దుంధుమారుడు 

♦️దుంధుమారుడి కొడుకు మాంధాత

♦️మాంధాత కొడుకు సుసంధి

♦️సుసంధి కొడుకు ధృవసంధి

♦️ధృవసంధి కొడుకు భరతుడు

♦️భరతుడి కొడుకు అశితుడు

♦️అశితుడి కొడుకు సగరుడు

♦️సగరుడి కొడుకు అసమంజసుడు

♦️అసమంజసుడి కొడుకు అంశుమంతుడు

♦️అంశుమంతుడి కొడుకు దిలీపుడు

♦️దిలీపుడి కొడుకు భగీరధుడు

♦️భగీరధుడి కొడుకు కకుత్సుడు

♦️కకుత్సుడి కొడుకు రఘువు

♦️రఘువు కొడుకు ప్రవుర్ధుడు

♦️ప్రవుర్ధుడి కొడుకు శంఖనుడు

♦️శంఖనుడి కొడుకు సుదర్శనుడు

♦️సుదర్శనుడి కొడుకు అగ్నివర్ణుడు

♦️అగ్నివర్ణుడి కొడుకు శ్రీఘ్రవేదుడు

♦️శ్రీఘ్రవేదుడి కొడుకు మరువు

♦️మరువు కొడుకు ప్రశిష్యకుడు

♦️ప్రశిష్యకుడి కొడుకు అంబరీశుడు

♦️అంబరీశుడి కొడుకు నహుషుడు

♦️నహుషుడి కొడుకు యయాతి

♦️యయాతి కొడుకు నాభాగుడు

♦️నాభాగుడి కొడుకు అజుడు

♦️అజుడి కొడుకు ధశరథుడు

♦️ధశరథుడి కొడుకు రాముడు

♦️రాముడి కొడుకులు లవకుశులు

♦️🌳♦️ ఇదీ శ్రీరాముడి వంశవృక్షం

ఈ వంశ పరంపర విన్నా, చదివినా పుణ్యఫలం.🌹

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

 🙏


*గ్రంథం:* భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


*ఓం సర్వసమర్దాయనమః*


శ్రీ కాళహస్తి మండలం, కళత్తూరు నివాసి వేణుమలై అనే భక్తుని ప్రాణాపాయ పరిస్థితులలో శ్రీ స్వామివారు రక్షించిన విధం వారిలా వ్రాస్తున్నారు.


శ్రీ స్వామివారితో నాకింతకు ముందు గల కొన్ని అనుభవాలవలన వారు నాజీవితంలో ఆపద్భాంధవుడయ్యారు. 1996 నవంబరునెలలో ఒకరోజు నేను రాళ్ళకళత్తూరు ఏటిలోని కొద్దిపాటి నీటిని దాటి పోతున్నాను. నీటి ప్రవాహం నిమిషాలలో ఎక్కువై నేను నడి ఏటిలో చిక్కుకొని ప్రాణాపాయ స్థితిలో దిక్కుతోచక *" స్వామి నన్ను కాపాడు నీవేదిక్కు"* అని పెద్దకేక పెట్టాను. కనుచూపు మేరలో అక్కడెవ్వరూలేరు. 


కానీ చిత్రంగా ఒక నడివయస్కుడు వచ్చి. *నారెట్టపట్టుకొని "భయపడవద్దు" అని చెపుతూ నన్ను ఏటి గట్టుకు చేర్చారు.* "నీవు భయపడియున్నావు ఆకాలువ దగ్గరుండే చాకలివారు కాలువకూడా దాటిస్తారు పో" అని చెప్పి నా కళ్ళముందే అదృశ్య మయ్యారు. ఈ అదృశ్యమవడమనేది జరుగకుంటే నాకు వారు శ్రీ స్వామివారేననే విశ్వాసం కలుగదు గదా!. నావిశ్వాసం బలపడేందుకే ఆమహనీయుడు అలాచేసి నాకు ప్రాణబిక్ష పెట్టడమే కాక *నావిశ్వాసాన్ని బలపరిచి వారిని శ్రద్ధాభక్తులతో సేవించేటట్లు చేశారు.*


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*శ్రీ సాయిమాస్టర్ స్మృతులు*

       *సంకలనకర్త :- లక్ష్మీ నరసమ్మ*

                   *టాపిక్ :- 22*

                   *స్థిత ప్రజ్ఞుడు*

                              - శ్రీ రామచంద్రరావు


ఒకసారి వార్తాలాపం అనే పుస్తకంపై ఒక కుక్క పడుకొని వుంది. అది చూసి చిరాకేసి “వెధవ కుక్క పుస్తకం పాడు చేస్తున్నది. " అని తిట్టాను “దాన్నెందుకు అలా 

ఈ సడించుకుంటావు. నేను చెప్పింది వింటారు గాని ఆచరించరు గదా! అని” అన్నారెంతో బాధగా.


ఆయనను మిమిక్రి చేస్తూ మాట్లాడినా, లేదా సరదాగా మాట్లాడుకుంటున్నా ఆయన సంతోషించేవారే గాని ఏమనేవారు కాదు. ఒకసారి మాస్టర్ గారెళ్ళిం తర్వాత నేను ఏదో లెక్చరిస్తున్నాను. ఇంతలో ఆయన మళ్ళీ వచ్చారు. నేను ఆయన్ను చూసి వెంటనే ఆపాను. అప్పడాయన “నేను రాగానే ఎందుకు ఆపేయటం? నేను వింటానుగా. యిక నుంచి మీరే చెప్పాలి” అన్నారు.


                      🙏జై సాయిమాస్టర్🙏

సూర్యోదయమైతే

 శ్లోకం:☝️

  *అంహః సంహరదఖిలం*

*సకృదుదయాదేవ సకలలోకస్య ।*

  *తరణిరివ తిమిరజలధిం*

*జయతి జగన్మంగళం హరేర్నామ ॥*


భావం: ఒక్కసారి సూర్యోదయమైతే అంతులేని సముద్రమువంటి అజ్ఞాన చీకట్లు ఎలా పటాపంచలవుతాయో, విష్ణువు యొక్క పవిత్రమైన నామం ఒక్కమారు స్మరించినా పాపాలన్నీ పూర్తిగా నాశనం అవుతాయి! అందుకు అజామీళోపాఖ్యానమే నిదర్శం.🙏

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

 🙏 

*గ్రంథం:* భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


*ఓం ఆత్మదర్శినే నమః*


గూడూరు మస్తానయ్య అనే భక్తుడు ఇలా చెపుతున్నారు. ఒక రోజు శ్రీ స్వామివారు నాస్వప్నంలో నాకొక మంత్రముపదేశించి జపించమన్నారు. నేను జపిస్తున్నాను. నన్ను వాయవ్యదిశగా చూడమన్నారు. ఆవైపు మనోజ్ఞమైన వైకుంఠందర్శనమైంది. వారి ఆజ్ఞప్రకారం తూర్పువైపు చూస్తే మబ్బు పట్టిన సూర్యబింబం దర్శనమైంది. *"నీకింకా తెగలేదయ్యా"* అన్నారు శ్రీ స్వామి, శ్రీ స్వామివారు నన్నువదలి వెళ్ళిపోతున్నారు. నేను భావోద్వేగంలో వారిని వెంబడించ బోయాను. అంతే మంచంనుండి క్రిందపడ్డాను, నాస్వప్నం అంతరించింది. 


అది మొదలు మూడు రోజులు శరీరం మొద్దుబారి మౌనంగా ఉండిపోయాను. ఆతర్వాత మామూలు పరిస్థితి అయింది. తర్వాత ఆరుసంవత్సరములకు నేను చిల్లకూరు స్వామివారి దగ్గర మంత్రోపదేశం పొందాను. చిత్రంగా వారు కూడా నాకు శ్రీ స్వామివారు ఆనాడు నా స్వపంలో ఉపదేశించిన మంత్రాన్నే ఉపదేశించారు. ఈ విధంగానేను తరింపుమార్గం చూచుకోకుండా ఆరు సంవత్సరాలు జాప్యం చేయడమే శ్రీ స్వామివారు "నీకింకా తెగలేదయ్యా” అన్న మాట కర్దమని తెలుస్తుంది.


*మిశ్రమ కర్మలు చేసే మానవుడు కేవల శ్రద్ధ, కేవల భక్తి నాశ్రయించి ముందు నిర్ణయాన్ని అధిగమించే ప్రయత్నమే సాధనని పూజ్య పాదులు శ్రీ భరద్వాజ మాస్టరు గారు చెప్పేవారు*.


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*గ్రంథం:-నేను దర్శించిన మహాత్ములు*

*శ్రీ ఆనందమాయి అమ్మ దివ్య చరిత్ర*

*రచన:-*

*శ్రీఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు*


  అమ్మ: 'నీ విడిది ఎక్కడ?'

  నేను: 'చెట్టుక్రింద'.

  అమ్మ: “భోజనమెక్కడ చేస్తున్నావు?”

  నేను: "గేటు బయట హోటల్లో టీ- బిస్కట్లతో కడుపు నింపుకుంటున్నాను. అంతటి ఆదరణకు కృతజ్ఞుడను” చెప్పాను. 

    

   ఒక్కసారిగా అమ్మ ముఖం చిట్లించి మొదటి రోజు నాతో మాట్లాడిన సన్యాసినే పిలిచి, ఈ బాబుకు మనతోపాటే ఆశ్రమంలో భోజనము, ఒక ప్రక్క వుండడానికి గుడారము ఇప్పించు" అని కొంచెం కఠినమైన స్వరంతో హెచ్చరించారు. నేను దీక్ష తీసుకొనని పరదేశీయుడనని, ఆహ్వానం లేకుండానే వచ్చాననీ, ఆ విషయం ముందుగా ఒక్క మాటైనా వ్రాయలేదనీ ఆ సన్యాసి ఆమెతో చెబుతూంటే, ఎలాగైనా తన మాట నిలబెట్టుకోవాలన్న పంతము, దాని వెనుక ప్రాంతీయ భావము స్పష్టంగా తెలుస్తున్నాయి. చివరికతడు నా కేసి చికాకుగా చూస్తూ, “చూడు, అమ్మకెంత ఇబ్బంది, బాధ కలిగిస్తున్నావో!" అని నాతో అన్నాడు. 

   

*********************************

ఆన్లైన్ లో చదువుటకు ఈ లింక్ ను ఉపయోగించుకోగలరు.


https://saibharadwaja.org/books/readbook.aspx?book=Sri-Aanandamai-Amma-Charitra&page=1

విజయం తప్పక సిద్ధిస్తుంది

 శ్లోకం:☝️

*యోజనాని సహస్రాణి*

 *ఫలం విహాయ చేదపి |*

*యోగ్యాయాం దిశి మార్గస్థే*

 *యశస్సిద్ధిర్భవిష్యతి ||*


భావం: ఏ ఫలితం చూడకుండా వెయ్యి మైళ్లు ప్రయాణించినా సరే, మన మార్గం సరియైనదైతే గమ్యం ఖచ్చితంగా చేరుకుంటాము. విజయం తప్పక సిద్ధిస్తుంది!🙏

కుల దేవతారాధన

 కుల దైవాన్ని ఎందుకు మరచి పోతున్నారు? అలా చేయడం శ్రేయస్కరం కాదు.

*************************

భారతీయ కుటుంబ వ్యవస్థలో, కులదైవం ఆరాధన ఎంతో విశిష్టమైనది. ఈ రోజు చాలా భారతీయ కుటుంబాలు, కులదైవాన్ని మరచి పోతున్నాయి. తదనుగుణ నష్టాలు చవి చూస్తున్నాయి. భార్యా-భర్తల మధ్య సంతానం లేకపోవడం , వారిద్దరి మధ్య మనస్పర్దలు రావడం, తద్వారా కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్దలు రావడం, కుటుంబ ఆర్దిక పరిస్థితులు తలక్రిందులు కావడం....


ఇలాంటి వన్నీ కుల దేవతారాధన నిర్లక్ష్యం వలనే వస్తాయి.

కులం అనేది ఒక సామాజిక వ్యవస్థ లో ఒక భాగం.కాబట్టి కుల దేవతా ఆరాధనలు మరల మనం ప్రోత్సహించాలి. ఆయా కులాల్లో ఎప్పటి నుండి ఉందో..... అప్పటి నుండి కులదేవతలు ఉన్నారు.


 ఒక కులం ఒకే రకమైన ఆచార వ్యవహారాలు పాటిస్తే, వారంతాఒక దేవతను పూజిస్తే ఆ దేవతను ‘కులదైవం’ అంటారు. ఉదా॥ విశ్వబ్రాహ్మణులు ‘విశ్వకర్మ’ను కులదేవతగా పూజిస్తారు. అలాగే చాలా కులాలకు కులదేవతలు ఉన్నారు.


అదే విధంగా ఎవరి ఇంటిని ఈ దేవుడు కాపాడుతున్నాడో వారిని ఇంటిదేవతగా భావిస్తారు. ఈ ఇంటి దేవతల సంప్రదాయం త్రేతాయుగం లేదా అంతకు మించిన కాలాల నుండి కన్పిస్తుంది.


 ఈ ఇంటిదేవతలను గృహంలో చిన్న అరలో ప్రతిష్టించుకొని, గృహాల్లో ఆయా సమయాల్లో పూజించి తిరిగి పైనున్న గూడు(అర)లో పెట్టడం పూర్వ సంప్రదాయం. అందుకే ‘ఉద్వాసన’ (దేవుని పూజ తర్వాత చెప్పడం) అనే మాట వచ్చింది. ఉత్ అంటే పైన, వాసం పెట్టడం అని అర్థం. పూజాది ఉత్సవాల అనంతరం ఈ ఇంటిదేవతను ఉద్వాసంతో అటకపైకి ఎక్కిస్తారన్నమాట. మొదటి యుగాల్లో చాలామందికి గ్రామదేవతల్లాంటి దేవతలే ఇలవేల్పులుగా ఉండేవారు. అయితే చాలా మందికి పురాణదేవతలు కూడా ఇంటి దేవతలుగా ఉంటుంటారు. కొందరికి దక్షిణామూర్తి, మరికొందరికి హయగ్రీవుడు ఇంటిదేవుళ్లు ఉంటే, మరికొందరికి నరసింహస్వామి, వేంకటేశ్వరుడు, శ్రీరాముడు, పాండురంగడు, శ్రీరంగడు ఇంటిదేవుళ్లుగా ఉన్నారు. ఈ ఇంటి దేవతలు గల గృహస్థులు తమ గృహాల్లో జరుపుకొనే ఏ కార్యక్రమంలోనైనా వీరికి ప్రాధాన్యతనిచ్చి, మొదట పూజించి ఇతర కార్యక్రమం పూర్తి చేస్తుంటారు.సీతారాములు తమ పట్టాభిషేకానికి ముందు నారాయణోపాసన చేసినట్లు శ్రీమద్రాయణం తెలియచేస్తుంది.


అలాగే శ్రీకృష్ణుడి ఆగడాలను యశోద ఫిర్యాదు చేసే సమయంలో తమ గోడలపై ఉన్న దేవతలను బాలకృష్ణుడు ఎంగిలి చేశాడని భాగవతం కూడా తెలియచేస్తుంది. కాబట్టి ఇంటి దేవతల సంప్రదాయం యుగాల నుండి ఉన్న ఉన్నది తెలుస్తుంది.తమ కోర్కెలు సిద్ధింపచేసే దేవతల్ని ఇష్టదైవం అంటారు. అందులో పౌరాణిక దేవతలు, గ్రామ దేవతలు ఎవరైనా ఉండవచ్చు. ఇష్టదైవానికి నమస్కరించి యోగం చేయాలని యాజ్ఞవల్క్యమహర్షి కూడా చెప్పడం జరిగింది. అలాగే పరబ్రహ్మ సాధకమైన యోగమార్గానికి ఆటంకం కలిగించకుండా ఇష్టదేవతలను, ఇంటిదేవతలను ప్రార్థించాలని యోగశాస్త్రాలు తెలియచేస్తున్నాయి.


 *కుల దేవతారాధన వలన ప్రయోజనములు :*


 గృహకలహాలు ఉండవు,ఆర్దిక సమస్యలు ఉండవు, చుట్టు ప్రక్కల ఉన్న ఉన్న సమాజంతో సమస్యలుండవు, సంతాన సమస్యలుండవు,పిల్లలు చెప్పిన మాట వినక పోవడం లాంటి సమస్యలుండవు. భార్యా భర్తల మధ్య వైమనస్యాలు ఉండవు.


సేకరణ💐💐💐

బ్రహ్మా ముహూర్తం

 ✨ *బ్రహ్మా ముహూర్తం*✨


 *ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం.*


*కానీ.....*


*దీనికి సరైన అర్థం, పరమార్థం మాత్రం చాలామందికి తెలియదు. బ్రహ్మా ముహూర్తం తెల్లవారుజామున అని తెలుసు కానీ.. కరెక్ట్ సమయం మాత్రం చాలామందికి తెలియదు. అసలు బ్రహ్మా ముహూర్తం అంటే ఏంటి ? బ్రహ్మాముహూర్తంలో నిద్రలేవాలని, పూజ చేయాలని, పిల్లలు చదువుకోవాలని ఎందుకు సూచిస్తారు ? బ్రహ్మా ముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యత ? బ్రహ్మ ముహూర్తంలోనే ఎందుకు నిద్రలేవాలి ? ఇలాంటి అనుమానాలన్నింటికీ.. పరిష్కారం దొరికింది. తెలుసుకోవాలని ఉందా.. అయితే.. ఈ ఆర్టికల్ లోకి ఎంటర్ అయిపోండి._*


*_బ్రాహ్మా ముహూర్తం_*


*_సుర్యోదయానికి 48 నిమిషాల ముందు సమయాన్ని బ్రాహ్మా ముహూర్తం అంటారు._*


*_ఆఖరి నిమిషాలు_*


*_రాత్రిభాగంలోని ఆఖరి 48 నిమిషాలను.. సూర్యోదయానికి ముందు 48 నిమిషాలను బ్రహ్మా ముహూర్తం అంటారు._*


*_పూజలు_*


*_బ్రహ్మా ముహూర్తం పూజలు, జపాలకు మంత్ర సాధనకు విశిష్టమైన సమయంగా చెబుతారు._*


*_విద్యార్థులకు_*


*_విద్యార్థులు బ్రాహ్మా ముహూర్తం లో లేచి చదువుకుంటే బాగా గుర్తుంటుందని నమ్ముతారు._*


*_జీవక్రియలు_*


*_మన శరీరంలో జీవ గడియారం ఉంటుంది. దీన్ని అనుసరించే మన జీవక్రియలన్నీ జరుగుతాయి. అలాగే ఉదయం మనలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మనలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలు బ్రహ్మా ముహూర్తంలో చదువుకుంటే చక్కగా గుర్తుంటుందట._*


*_ఒత్తిడి_*


*_అలాగే ముందు రోజు భరించిన ఒత్తిడులు అన్ని నిద్రలో మరిచిపోతాం కాబట్టి మెదడు ఉత్తేజంతో ఉంటుంది. పరిసరాలు కూడా నిశ్శబ్దంగా ఉంటాయి. ఈ అన్ని కారణాల వల్ల చదివినది మెదడులో జాగ్రత్తగా నిక్షిప్తం అవుతుంది._*


*_పెద్దవాళ్లు ఎందుకు లేవాలి ?_*


*_ఆయుర్వేదం ప్రకారం రాత్రి తోందరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచేవారికి ఆరోగ్య సమస్యలు రావు._*


*_ఫ్రెష్ ఆక్సిజన్_*


*_రాత్రంతా చెట్లు వదిలిన ఆక్సిజన్ వేకువ జామున కాలుష్యం బారిన పడకుండా ఎక్కువ పరిమాణం లో మనకు అందుబాటులో ఉంటుంది. వాకింగ్ కు వెళ్లేవారికి ఇది చాలా ఉపయెాగ పడుతుంది._*


*_గృహిణులు ఎందుకు లేవాలి.?_*


*_గృహిణులకు నిద్ర లేచిన దగ్గర నుంచి ఎన్నో పనులు , పిల్లల సంరక్షణ, ఇంట్లో పెద్దవారి సంరక్షణ , వంట పనులు,ఇంటి పనులతో క్షణం తీరిక లేకూండా గడుపుతారు. అలాంటి వారికి ఒత్తిడి లేని మానసిక ,శారీరక ఆరోగ్యం చాలా అవసరం._*


*_ఆందోళన_* 


*_బ్రహ్మా ముహూర్తంలో లేవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉదయాన్నే నిద్రలేస్తే ఇంటిపనులన్ని ఆందోళన లేకుండా అయిపోతాయి._*


*_సూర్యోదయము_* 


*_ప్రతిరోజూ సూర్యోదయము చూసే అలవాటు ఉన్నవారికి గుండె,మెదడు,ప్రశాంతంగా ఆరోగ్యంగ ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి...._*


*_ఆరోగ్యము_* 


*_బ్రహ్మా ముహూర్తంలో నిద్రలేవడం వల్ల సూర్యుని లేలేత కిరణాలు మన పైన ప్రసరిస్తాయి సూర్యరశ్మి లో ఉండే విటమిన్ డి ఎముకల బలానికి సహయపడుతుంది....._*

శుక్రవారం విడిచిన దుస్తుల్నే ధరిస్తే.

 శుక్రవారం విడిచిన దుస్తుల్నే ధరిస్తే.....బియ్యం కొలిచే పాత్రను బోర్లిస్తే...........!!


శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మీదేవిని ఉపాసన చేస్తే ధన సమృద్ధి కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి. సంపదలతో తులతూగాలి అనుకునే వారు శుక్రవారం పూట అష్టైశ్వర్యాలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం చేయాలి. ఇంకా ఇంట పసుపు, ఉప్పు అయిపోయాయనే మాట వినబడ కూడదు. పసుపును కొనాలి. లేదా ఉప్పును తేవాలి అని చెప్పడం చేయొచ్చు.


ఉప్పు, పసుపు అయిపోయేంతవరకు ఉపయోగించకూడదు. అవి అయిపోయే లోపు ఇంట తెచ్చుపెట్టుకోవడం చేయాలి. అలాగే ఇంట్లో అన్నం వండేందుకు ముందు బియ్యాన్ని కొలుస్తాం. ఆ కొలిచే పాత్రను ఎప్పటికీ బోర్లించకూడదు.


ఇంట సుఖసంతోషాలు, సిరిసంపదలు పొందాలంటే.. విడిచిన బట్టలను తలుపుకు వేలాడదీయకూడదు. విడిచిన బట్టలను రెండో రోజు, మూడో రోజు ధరించకూడదు. ప్రత్యేకించి శుక్రవారం నాడు విడిచిన దుస్తులు ధరిస్తే దరిద్ర్యం చుట్టుకుంటుందని ఆధ్యాత్మిక పండితులు హెచ్చరిస్తున్నారు.


* శుక్రవారం నాడు సాత్త్విక ఆహారాన్ని తీసుకోవాలి. పాలను వినియోగించాలి.


* శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి, రంగ వల్లికలతో అలంకరించి.. దీపారాధన చేయాలి.


* రోజూ లేదా శుక్రవారం రాత్రిపూట కొద్దిపాటి అన్నాన్ని శేషంగా ఓ చిన్నపాటి గిన్నెలో వుంచి వంటింట్లో వుంచడం సంప్రదాయం. ఇలా చేస్తే పితరులు, దేవతలు ఆ ఇంట అన్నం ఎల్లప్పుడూ వుండుగాక అంటూ దీవిస్తారని ప్రతీతి.


* శుక్రవారం నుదుట బొట్టు ధరించే వారికి కలకాలం సౌభాగ్యం నిలిచివుంటుంది. ఇంకా స్టిక్కర్లను నుదుటన ధరించకుండా తెల్ల వక్కలతో తయారైన కుంకుమను శుక్రవారం ధరిస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శుక్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది.


* తెల్ల వక్కలను, నేతిలో వేయించి చూర్ణం చేసి ఆ మిశ్రమానికి కస్తూరి పొడి, కుంకుమ పువ్వు పొడిని కలిపి చూర్ణం చేసుకుంటే కుంకుమ సిద్ధమవుతుంది. ఈ కుంకుమను నుదుటన ధరించడం ద్వారా సుగంధ భరితమైన సువాసనతో పాటు శుక్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది. ధనవృద్ధి వుంటుంది.


* శుక్రవారం పూట తెల్లని వస్త్రాలను ధరించడం ఓ నియమం. తెల్లని వస్త్రాలంటే శుక్రునికి, మహాలక్ష్మీకి ప్రీతికరం. తెల్లని దుస్తులను శుక్రవారం ధరిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.


* అలాగే శుక్రవారం పూట కమలములతో, కలువలతో లక్ష్మీదేవికి అర్చన చేసినట్లైతే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇంకా పుష్పాలను దానం చేసినా, అన్నదానం చేసినా, వస్త్ర దానం చేసినా శుభఫలితాలుంటాయి. కస్తూరిని మిత్రత్వం కోరి స్నేహితులకు అందించినా, శుక్రవారం వర్జ్యం వున్న సమయంలో మౌనవ్రతం పాటించినా ఆ ఇంట తప్పకుండా ధన సమృద్ధి కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు.