1, ఏప్రిల్ 2023, శనివారం

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

 🙏 

*గ్రంథం:* భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


*ఓం ఆత్మదర్శినే నమః*


గూడూరు మస్తానయ్య అనే భక్తుడు ఇలా చెపుతున్నారు. ఒక రోజు శ్రీ స్వామివారు నాస్వప్నంలో నాకొక మంత్రముపదేశించి జపించమన్నారు. నేను జపిస్తున్నాను. నన్ను వాయవ్యదిశగా చూడమన్నారు. ఆవైపు మనోజ్ఞమైన వైకుంఠందర్శనమైంది. వారి ఆజ్ఞప్రకారం తూర్పువైపు చూస్తే మబ్బు పట్టిన సూర్యబింబం దర్శనమైంది. *"నీకింకా తెగలేదయ్యా"* అన్నారు శ్రీ స్వామి, శ్రీ స్వామివారు నన్నువదలి వెళ్ళిపోతున్నారు. నేను భావోద్వేగంలో వారిని వెంబడించ బోయాను. అంతే మంచంనుండి క్రిందపడ్డాను, నాస్వప్నం అంతరించింది. 


అది మొదలు మూడు రోజులు శరీరం మొద్దుబారి మౌనంగా ఉండిపోయాను. ఆతర్వాత మామూలు పరిస్థితి అయింది. తర్వాత ఆరుసంవత్సరములకు నేను చిల్లకూరు స్వామివారి దగ్గర మంత్రోపదేశం పొందాను. చిత్రంగా వారు కూడా నాకు శ్రీ స్వామివారు ఆనాడు నా స్వపంలో ఉపదేశించిన మంత్రాన్నే ఉపదేశించారు. ఈ విధంగానేను తరింపుమార్గం చూచుకోకుండా ఆరు సంవత్సరాలు జాప్యం చేయడమే శ్రీ స్వామివారు "నీకింకా తెగలేదయ్యా” అన్న మాట కర్దమని తెలుస్తుంది.


*మిశ్రమ కర్మలు చేసే మానవుడు కేవల శ్రద్ధ, కేవల భక్తి నాశ్రయించి ముందు నిర్ణయాన్ని అధిగమించే ప్రయత్నమే సాధనని పూజ్య పాదులు శ్రీ భరద్వాజ మాస్టరు గారు చెప్పేవారు*.


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*గ్రంథం:-నేను దర్శించిన మహాత్ములు*

*శ్రీ ఆనందమాయి అమ్మ దివ్య చరిత్ర*

*రచన:-*

*శ్రీఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు*


  అమ్మ: 'నీ విడిది ఎక్కడ?'

  నేను: 'చెట్టుక్రింద'.

  అమ్మ: “భోజనమెక్కడ చేస్తున్నావు?”

  నేను: "గేటు బయట హోటల్లో టీ- బిస్కట్లతో కడుపు నింపుకుంటున్నాను. అంతటి ఆదరణకు కృతజ్ఞుడను” చెప్పాను. 

    

   ఒక్కసారిగా అమ్మ ముఖం చిట్లించి మొదటి రోజు నాతో మాట్లాడిన సన్యాసినే పిలిచి, ఈ బాబుకు మనతోపాటే ఆశ్రమంలో భోజనము, ఒక ప్రక్క వుండడానికి గుడారము ఇప్పించు" అని కొంచెం కఠినమైన స్వరంతో హెచ్చరించారు. నేను దీక్ష తీసుకొనని పరదేశీయుడనని, ఆహ్వానం లేకుండానే వచ్చాననీ, ఆ విషయం ముందుగా ఒక్క మాటైనా వ్రాయలేదనీ ఆ సన్యాసి ఆమెతో చెబుతూంటే, ఎలాగైనా తన మాట నిలబెట్టుకోవాలన్న పంతము, దాని వెనుక ప్రాంతీయ భావము స్పష్టంగా తెలుస్తున్నాయి. చివరికతడు నా కేసి చికాకుగా చూస్తూ, “చూడు, అమ్మకెంత ఇబ్బంది, బాధ కలిగిస్తున్నావో!" అని నాతో అన్నాడు. 

   

*********************************

ఆన్లైన్ లో చదువుటకు ఈ లింక్ ను ఉపయోగించుకోగలరు.


https://saibharadwaja.org/books/readbook.aspx?book=Sri-Aanandamai-Amma-Charitra&page=1

కామెంట్‌లు లేవు: