*గ్రంథం:* భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు
*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్
*ఓం ఆపద్బాంధవాయనమః*
నెల్లూరు జిల్లా కోటమండలం మెట్టుగ్రామ నివాసి శ్రీ సి. రాజారాంరెడ్డిగారు తనను శ్రీ స్వామి వారు ఆపదలో ఆదుకొన్న విషయం ఇలా చెపుతున్నారు.
1993 సం|| సెప్టెంబరు నెలలో నేను నాకుమారుడు నాగూరు రెడ్డి గొలగమూడికి శ్రీ స్వామి వారిదర్శనార్ధం వచ్చాము, నా కుమారుడు భజన మందిరంలో భజన చేస్తున్నాడు. నేను నామిత్రుని ఇంట్లో నిద్రపోతున్నాను. రాత్రి 10గం. 45ని॥కు నాకుమారునికి గుండె నొప్పి వచ్చి భజన మందిరంలో పడిపోయాడు. మైకులో ఎంతసేపు పిలచినా నిద్రలో ఉన్న నాకు తెలియలేదు.
రాత్రి 12 గం॥లకు నేను ఎవరో లేపినట్లుగా లేచి నాకుమారుడెక్కడున్నాడా అని వెతుకుతూ నామిత్రుడు గోపాల్ రెడ్డి గారింటికి వెళ్ళాను. ఒక పిల్లవాడు పడిపోయాడని జండుబామ్ రద్దుతూ జనం గుంపులు కూడియున్నారు. చూస్తే ఆపిల్లవాడు నాకుమారుడే. పిల్లవాడు చాలా అపాయ పరిస్థితిలో ఉన్నాడు. నెల్లూరు తీసుకు పోవుటకు ఆసమయంలో ఎలాంటి వాహన వసతి లేదు. ఆగ్రామంలో డాక్టరులేడు, ఏమిచేయాలా అని దిగుల్లో ఉన్నాను.
ఇంతలో ఒక ముసలాయన *'గుండె నొప్పి వచ్చిన పిల్లవాడేడి?'* అని అడుగుతూ నేరుగా జనాన్ని నెట్టుకొని పిల్లవాని దగ్గరకొచ్చి ఇప్పుడు రెండు తెల్లవారి రెండు వేయండి, నొప్పి వెంటనే తగ్గిపోతుందనిచెప్పి నాలుగు హోమియో మాత్రలో నాచేతిలో పెట్టి వెళ్ళాడు. రెండు మాత్రలు వేసిన వెంటనే పిల్లవాని నొప్పితగ్గి లేచికూర్చున్నాడు. ఆ మాత్రలిచ్చిన మనిషి కొరకు ఎంత వెతికినా కనిపించలేదు. *ఆమహనీయుడు ఆపద్భాంధవుడైన శ్రీ స్వామి వారు గాక మరెవరై ఉండగలరు?*
🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*శ్రీ సాయిమాస్టర్ స్మృతులు*
*సంకలనకర్త :- లక్ష్మీ నరసమ్మ*
*టాపిక్ :- 22*
*స్థిత ప్రజ్ఞుడు*
- శ్రీ రామచంద్రరావు
ఒక్కోసారి ఆయన్ను చూస్తూంటే యీయన కంటే నాస్తికులు మేలేమోనని అన్పించేది. ఏ నియమ నిష్ఠలు లేవు. ఆచారాలు పాటించే వారు కాదు. కాషాయ వేషధారణ గాని, వేషాడంబరము గాని లేక చాలా సింపుల్ గా వుండి సమయా సమయాలు పాటించక వచ్చిన వారినందరినీ సమాధాన పరచి పంపుతూండేవారు. ఆహారానికి, నిద్రకి వేళా పాళలుండేవి గావు.
"ఎప్పుడూ మనల్ని అది చెయ్యి యిది చెయ్యి అని చెప్తూంటారు కదా! మరి మాస్టర్ గారేం చేస్తారో అడుగు" అని నా మిత్రులు నన్ను ఎక్కేశారు. నేను అడిగాను "ఏమి సార్ మమ్మల్ని ఏవేవో చేయమంటున్నారు. మరి మీరేమి చేస్తుంటారు సార్ " అని అడిగితే "ఏమి చేయకుండా వుండటమే చేస్తూంటాను" అని అన్నారు నవ్వుతూ.
🙏జై సాయిమాస్టర్🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి