*మౌనం అద్భుతమైన భాష* అది ఎలాగో తెలుసుకుందాం.
*నూతిని తవ్వి నేను నీటిని పుట్టిస్తున్నానని అనుకుంటున్నావేమో*- అది పొరపాటు... నువ్వు తవ్వకముందే అక్కడ నీరున్నది. అది నీటి అవ్యక్తస్థితి అంటుంది వేదం.నీ ప్రయత్నం ద్వారా అది లోకానికి వెల్లడి అయింది, అంటూ లక్షణశాస్త్రం వివరణ ఇచ్చారు వినోబా భావే
నేను ఏ భాషలో మాట్లాడితే మీకు సౌకర్యంగా ఉంటుంది. అని వారిని ప్రశ్నించారు. పాత్రికేయుల్లో ఒకాయనకు భావే మాటలు కొంత అతిశయంగా అనిపించాయి.
దాంతో ఆయన లేచి మీరు ఏ భాషలో మాట్లాడినా, అర్థం చేసుకోగల సామర్థ్యం అందరికీ ఉంది. మీకు బాగా ఇష్టమైన భాషలో మీరు మాట్లాడవచ్చు అన్నాడు దర్పంగా.
ఆ పాత్రికేయుడికి కృతజ్ఞతలు చెబుతూ భావే, మందహాసంతో ‘నాకు మౌనం చాలా ఇష్టమైన భాష. మీకు తెలుసుగా’ అంటూ సర్దుకొని కూర్చుని మౌనముద్ర దాల్చారు.
చాలాసేపటికి విమానం వచ్చింది. ప్రకటన వినిపించింది. ‘మరి శెలవా!’ అన్నట్టుగా భావే మౌనంగా తలపంకించి చిరునవ్వుతో అక్కడి నుంచి కదిలిపోయారు.
ఇది చదవగానే మనలో చాలామందికి ‘మౌనం కూడా ఒక భాషేనా?’ అనే సందేహం వస్తుంది. నిజానికి ఆ విషయంలో ఎవరూ సందేహించవలసిన పని లేదు. నిజంగానే మౌనమనేది చాలా శక్తిమంతమైన భాష.
ప్రశాంత సుందరమైన హిమాలయ పర్వతసానువుల్లోనో నిర్జనమైన ప్రదేశాల్లోని శిథిల ఆలయాల్లోనో కార్తిక పౌర్ణమి వేళ మనం డాబాపై ఏకాంతంగా కూర్చొని చల్లని పిల్ల తెమ్మెరలను ఆస్వాదిస్తున్నప్పుడో... శ్రద్ధగా గమనిస్తే- ఆ గాలి ఊసులు చెబుతాయి మౌనం ఎంత గొప్ప భాషో! కోట్లాది శబ్దాలకన్నా మనిషికి నిశ్శబ్దం చాలా ఎక్కువ బోధిస్తుంది.
మాట్లాడకుండా కూర్చోవడం కాదు, లోలోపల ఆలోచనల రొద సైతం నిలిచిపోయే ఒకానొక అద్భుతమైన స్థితి పేరు మౌనం! అప్పుడే నిశ్శబ్దం మనసును ఆవరిస్తుంది. మనిషికి ప్రశాంతత అనుభూతమవుతుంది.
మనిషి తనచుట్టూ దట్టంగా పరచుకొన్న కటిక చీకటిని, బ్రహ్మాండమైన వెలుగుల పూర్వరూపంగా ఏనాడో గుర్తించాడు.
ఆ చీకటి అసలు రూపం నలుపు కాదని, అది అనంతమైన కాంతి కిరణాలను తన కడుపులో దాచుకొన్న తెల్లని దేదీప్యమానమైన వెలుగుల ముద్ద అనీ పెద్దలు ఎన్నోసార్లు వివరించారు.
అదేవిధంగా నిశ్శబ్దం కూడా తన లోపల ప్రళయభీకర శబ్దాలను ఇమడ్చుకొన్నదేనని బోధించారు. ఇది నిజానికి వేద ప్రతిపాదితమైన జ్ఞానం.
ఈ సత్యాన్ని మనిషి జీర్ణించుకొంటే మౌనం మాట్లాడటమంటే ఏమిటో అర్థం అవుతుంది. గాఢమైన ప్రేమికుల మధ్య... అన్యోన్య దంపతుల మధ్య... నిర్మలమైన భక్తుడికి భగవంతుడికి మధ్య... మౌనం చాలా గొప్ప వాహిక. అనుసంధాన వేదిక. అది అవ్యక్త మధురమైన భాష.
మనిషి గుర్తించడు గాని... వాస్తవానికి ప్రతి మనిషికీ ఆ భాషతో పరిచయం ఉండే ఉంటుంది. ఎదలోపలి ప్రతిస్పందనలను గమనించినప్పుడు, మరో హృదయంలోంచి అది నేరుగా తన గుండెల్లోకి ప్రసారం అయినప్పుడు మనిషి దాన్ని గమనించాలి.
అది విత్తులోంచి బ్రహ్మాండమైన వట వృక్షాన్ని దర్శించడం వంటిది. ఆ తరహా సాధన ఫలించిననాడు- మౌనంలోంచి,నిశ్శబ్దంలోంచే కాదు... యోగుల సంభాషణల్లోంచి సైతం వారి అంతరంగాల్లో నెలకొన్న ప్రశాంతతను గుర్తించడం సాధ్యమవుతుంది.
మాట నేర్చిన మనిషి తన ప్రయాణంలో చివరకు చేరవలసిన గమ్యం అదే!🙏🏻
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి