29, మే 2024, బుధవారం

స్పందించారు

 రెండేళ్ళ క్రితం వందల మంది స్పందించారు..ఇప్పుడు వేల మంది స్పందిస్తారన్న ఆశతో....


****


చేతులు రెండూ కట్టేసి సంకెళ్లు వేసి...పైకి లాగి..కాళ్ళు ముని వేళ్ళు మాత్రమే భూమికి ఆనేట్టు ఉంచి..


రోజూ తొమ్మిది గంటల చొప్పున వారం బాటు నిలబెట్టి...ఉంచేసే క్రూరమైన శిక్షను అనుభవించింది..సావర్కర్...నెహ్రూ కాదు..


యాభై ఏళ్లు  కాలాపానీ జైలు పడింది...సావర్కర్ కు...నెహ్రూకు కాదు...


ఉచ్చ పోసుకున్న చోటే... దొడ్డికి కూచున్న దగ్గరే తిండి తినాల్సిన జైల్లో ఉన్నది...సావర్కర్..నెహ్రూ కాదు..


గది పై భాగంలో ఉన్న చిన్న రంధ్రం ద్వారా మాత్రమే సన్నని వెలుగు కనపడే చీకటి కొట్టంలో మగ్గి పోయింది...సావర్కర్..నెహ్రూ కాదు...


పాచి పోయిన జొన్న రొట్టె రేకుల్లా గట్టిగా ఉండి గొంతు దిగని నాలుగు నాలుగు ముక్కలు..సంవత్సారాలు తరబడి తిన్నది...సావర్కర్..నెహ్రూ కాదు...


భీకరమైన గుహల్లో..ఖైదీల భయానకమైన నవ్వుల్లో...ముఖం దాచుకుని దుఃఖమే అసహ్యించుకున్న దుఃఖం అనుభవించింది... సావర్కర్..నెహ్రూ కాదు...


కాళ్లూ చేతులూ ముడుచుకున్నా సరిపోని డబ్బాల్లో కూర్చో పెట్టి... తరలింపబడిన ఘోర శారీరక హింస బ్రిటిష్ వారి చేతుల్లో అనుభవించింది... సావర్కర్...నెహ్రూ కాదు...


మూడంటే మూడే ముంతలతో...వంగమన్నప్పుడు ఒంగి లేవమన్నప్పుడు లేచే స్నానం చేసింది...సావర్కర్... నెహ్రూ కాదు..


గంటల కొద్దీ బురదను ఎత్తి పోయించి...బొక్కలు చూర చూర చేసినా మట్టి చాటున కప్ప బడి పోయి...


కనబడని కౌకు దెబ్బలు తిన్నది... సావర్కర్...నెహ్రూ కాదు...


హఠం చేసి చావద్దు..దొంగ సత్యాగ్రహాలు వద్దు అని...తోటి ఖైదీలకు చెప్పి...తిని శక్తి సంపాదిస్తే కదా...ఆ కుక్కలను కొట్ట గలిగేది అని ప్రేరణ ఇచ్చింది సావర్కర్..నెహ్రూ కాదు...


వంద డిగ్రీల వేడిలో...రక్త విరేచనాలు...అజీర్ణం తో చిక్కి శల్యం అయిపోయి..కళ్ళు గుంటలు పడి..కాళ్ళు సత్తువలేక నేలకంటినది... సావర్కర్ కు..నెహ్రూకు కాదు...


ఈయన్ని బ్రిటిష్ తొత్తు అనేవాడు...ఒకసారి ఏదైనా ప్రభుత్వానికి సమర్థనగా అయినా... ఓ నెల జైల్లో ఉండి రా...తెలుస్తుంది...


రక రకాల వ్యూహాల్లో..ఆలోచనల్లో...ప్రభుత్వాలకి ఏదో ఒకటి వ్రాసి ఇచ్చి...యుద్ధానికి సిద్ధం అవుతుంటారు...


వాటన్నిటినీ చూపించి... తుచ్ఛ నీచ రాజకీయాలు మాట్లాడానికే నీ చరిత్ర పనికొస్తుంది...


సావర్కర్ ఎవరో మాకు తెలుసు...


హిందుత్వం గురించి మాట్లాడాడు అనే కదా ఇంత కచ్చ....


ఆయన చెప్పిన వాటిల్లో దేశానికి అవసరం లేనివి ఉంటే...మేము చూసుకుంటాము...


ఈ దేశానికి..ధర్మానికి అంగుళం కూడా చెందని కలగూర గంపవి...


నువ్వు చూపించే కాగితాలు చూసి చరిత్ర తెలుసుకునే ఖర్మ పట్టలేదు...


నడిస్తే నడు... పరిగెత్తితే పరిగెత్తు... పడుకుంటే పడుకో...


జోడో కోసమో..జోడీ కోసమో...నీ యాత్ర నువ్వు చేసుకో...


తెలుసున్నదే మాట్లాడు...తెలియనిది...వద్దు..


నీ తాతల ద్రోహాలు మళ్ళీ గుర్తు చేసుకుని వాంతి చేసుకునేలా...విషయాలు కెలకకు...


చైనా పోయి కాగితాలు వ్రాసుకో...


అందుకే నీదీ.... దేశాన్ని ముక్కలు చేసిన నీ ముత్తాతది ఫోటో కూడా ఆ మహనీయుడి పక్కన పెట్టట్లేదు...


జై హింద్!!!

Ramji


 

చెవిలో ఏది చెబితే అది జరుగుతుంది.

 తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామం శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం


ఇక్కడి వినాయకుడు చెవిలో ఏది చెబితే అది జరుగుతుంది. వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విజ్ఞం కురుమేదేవా, సర్వ కార్యేషు సర్వదా అంటూ వేడుకుంటే వినాయకుడు కోరిన కోరికలు తీరుస్తాడు. విజ్ఞానలన్నిటికీ అధిపతి అగ్రజుడుగా అగ్ర పూజలందుకున్న గణేశుడిని నిత్యం దేవతలందరూ ఆరాదిస్తారంటే ఆయన ఎంతటి శక్తి వంతమైన దేవుడనేది అందరికీ తెలుస్తోంది. అలాంటి వినాయకుడు అన్ని చోట్ల కొలువై భక్తులకు అండగా ఉంటాడు. స్వామి కొలువై ఉన్న పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీ లక్ష్మి గణపతి దేవాలయం తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు లో ఉంది. ఇక్కడ వెలసిన వినాయకుడు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాడు. ఎంతో పురాతనమైన ఈ ఆలయంలో వినాయకుడిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని చెబుతుంటారు


క్రీ శ 840 సంవత్సరంలో చాళుక్యులు ఈ ఆలయం నిర్మించినట్టు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉండే శాసనాల ద్వారా ఇది ఎంతటి పురాతన ఆలయమో అర్ధమవుతుంది. నిజానికి ఇక్కడున్న ఆలయం భూమిలోనే ఉండేదట. 19 వ శతాబ్దంలో ఒక భక్తుడికి వినాయకుడు కలలో కనిపించి తన ఉనికిని చాతినట్టుగా ప్రచారంలో ఒక కధ వినిపిస్తుంది. అప్పుడా భక్తుడు గ్రామస్తులకు ఆ విషయం చెప్పిఅ ఆలయాన్ని తవ్వించాడట. ఆ తరువాత వినాయకుడు బయటపడ్డాడని అప్పటి నుంచి ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినదనీ చెబుతున్నారు. భూమిలో నుండి బయటపడిన తరువాత వినాయక విగ్రహం పెద్దదయిందని ఇక్కడ ప్రచారం జరుగుతోంది


ఈ వినాయకుడి ఆలయానికి ఎక్కడెక్కడి నుంచే భక్తులు వచ్చి తమ కోరికలను విన్నవించుకుంటున్నారు. విఘ్నేశ్వరుడి చెవిలో తమ కోరికలను చెప్పుకొని ముడుపు కడితే తమ కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అంతే కాకుండా నందీశ్వరుడిని, భూలింగేస్వరుడిని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ రాజరాజేశ్వర ఆలయం కూడా ఉంది


ఈ ఆలయం లోకి వెళ్ళగానే దివ్యానుభూతి కలుగుతుందని భక్తులు చెబుతున్నారు. వీరభద్రుడు, సుబ్రమణ్య స్వామి కొలువై ఉన్నారు. ప్రతీ సంవత్సరం గణపతి నవరాత్రులతో పాటు సుబ్రమనయేశ్వర ఉత్సవాలు కూడా జరుగుతాయి. పూజలు, పారాయణాలు, దీపోత్సవాలను ఇలా అన్ని కార్యక్రమాలను కన్నుల పండువగా తిలకించవచ్చు. ఇక్కడ గణపతి హోమమ చేయిస్తే సాక్షాత్తూ ఆ కుటుంబానికి గణపతి అండగా ఉంటాడని భావిస్తారు. రాజమండ్రి నుంచి గాని, అనపర్తి నుంచి గాని బిక్కవోలుకు చేరుకోవచ్చు


మనం ఏ కార్యం తలపెట్టినా, అది ఎటువంటి అవరోధాలు కలుగకుండా, విజయవంతంగా కొనసాగాలని ప్రప్రథమంగా శ్రీ విఘ్నేశ్వరుని ప్రార్ధిస్తాము. సకల సంకటాలనూ తొలగించే గణపతి అనుగ్రహం కోసం సంకట నాశన గణేశ స్తోత్రం భక్తి శ్రద్ధ విశ్వాసాలతో పఠిస్తే, శ్రీ గణేశ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఎవరికి వారు స్వయంగా, అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. ప్రతీరోజూ ఈ మహామహిమాన్వితమైన స్తోత్రాన్ని పఠించి, గణేశ అనుగ్రహం పొందుదాం

నాణెం పై తెలుగు భాష*

 *🤝VSR మిత్రదీపిక🤝*

*9908837451*

🌹🌹🌹🌹🌹


*నాణెం పై తెలుగు భాష*

🌹🌹🌹🌹🌹


*బ్రిటిష్ వారు మన తెలుగు భాషకు పట్టం కట్టారు*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


ఒకసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. గాంధీజీ, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ‘ఉక్కు మనిషి’ సర్ధార్ వల్లభాయి పటేల్, 

ఆంధ్ర ప్రముఖుడు మహా మేధావి డాక్టర్ భోగరాజు పట్టాభిసీతారామయ్య తదితరులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టాభి సీతారామయ్య గారు 'ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సమస్య' ను సభ దృష్టికి తీసుకువచ్చారు.


పట్టాభీ ! నువ్వు ‘ఆంధ్ర రాష్ట్రం,ఆంధ్ర రాష్ట్రం,‘ అని ఎప్పుడూ అంటూ ఉంటావు… అసలు నీ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉందయ్యా ? … మీరంతా ‘మద్రాసీ’లు కదా ? అంటూ పటేల్ గారు ఎగతాళిగా మాట్లాడారు.


అప్పుడు వెంటనే పట్టాభి సీతారామయ్య గారు 

తన జేబులో నుంచి అణా కాసును తీసి ”సర్ధార్ జీ ! దీనిపై 'ఒక అణా' అని అధికార భాష అయిన ఆంగ్లంలోనూ … జాతీయ భాష అయిన హిందీలోనూ … దేశంలో అత్యధికులు మాట్లాడే బెంగాలీలోనూ… 

ఆ తర్వాత ‘ ఒక అణా ‘ అని తెలుగులోనూ రాసి ఉంది. ఇది బ్రిటిష్ వారు తయారు చేసిన అణా నాణెం. (అప్పటికి భారతదేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు) "మరి ఈ నాణెం పై మా తెలుగు భాష ఉంది… కానీ...మీ గుజరాతీ భాష ఎక్కడా లేదే ???" అంటూ చురక వేశారు.పటేల్ గారు ఆశ్చర్యపోయారు.ఆ మాటలు విన్న గాంధీజీ కూడా చిరునవ్వుతో ఉండిపోయారు. మహాత్మా గాంధీ గారి మాతృభాష కూడా గుజరాతీ భాషే.


భారత దేశానికి స్వతంత్రం రాక ముందే బ్రిటిష్ ప్రభుత్వం వారు మనలను పరిపాలించే రోజుల్లోనే తెలుగు భాషకున్న ప్రాచీనతను గొప్పదనాన్ని గుర్తించి, వారు ముద్రించిన నాణెల మీద అధికార భాష ఇంగ్లీషు, జాతీయ భాష హిందీ, ప్రపంచంలో అధికంగా మాట్లాడే బెంగాలీ భాష, తెలుగు భాషలను ప్రవేశ పెట్టి, మన తెలుగు చరిత్ర గొప్పదనం అందరికి తెలియపర్చారు.


🌹🌹🌹🌹🌹🌹🌹

 *🤝VSR మిత్రదీపిక🤝*                                                                                                        🌹🌹🌹🌹🌹🌹🌹

వీలునామా

 వీలునామా !


ఒకావిడ అమ్మకానికి మెర్సిడెస్ కారు


1 రూపాయి అని ప్రకటన పెట్టింది.


ఎవరూ నమ్మలేదు, కాని ఒక వృద్ధుడు స్పందించి కారు చూడటానికి వెళ్ళాడు.


ఆమె అతనికి 12,000 కిలోమీటర్లు తిరిగిన మెర్సిడెస్ ను కేవలం


1 రూపాయికి విక్రయించింది.


ఆమె అతనికి పేపర్లు మరియు


కార్ కీలు ఇచ్చింది. ఒప్పందం పూర్తయింది.


ముసలివాడు బయలుదేరుతుండగా,


ఈ కారు ఎందుకు అంత చౌకగా అమ్మెసారో, మీరు నాకు చెప్పకపోతే నేను సస్పెన్స్‌తో చనిపోతానని చెప్పాడు.


ఆవిడ ఇలా బదులిచ్చింది.


మరణించిన నా భర్త యొక్క వీలునామాను నేను నెరవేరుస్తున్నాను.


నా భర్త మెర్సిడెస్ కారు అమ్మకం నుండి వచ్చే మొత్తం డబ్బు అతని లేడీ సెక్రటరీ కి వెళ్తుంది అని వ్రాసాడు, అందుకే అని చెప్పింది.


"భార్యలు ఎప్పటికీ భార్యలే" !


ఒకావిడ అమ్మకానికి మెర్సిడెస్ కారు


1 రూపాయి అని ప్రకటన పెట్టింది.


ఎవరూ నమ్మలేదు, కాని ఒక వృద్ధుడు స్పందించి కారు చూడటానికి వెళ్ళాడు.


ఆమె అతనికి 12,000 కిలోమీటర్లు తిరిగిన మెర్సిడెస్ ను కేవలం


1 రూపాయికి విక్రయించింది.


ఆమె అతనికి పేపర్లు మరియు


కార్ కీలు ఇచ్చింది. ఒప్పందం పూర్తయింది.


ముసలివాడు బయలుదేరుతుండగా,


ఈ కారు ఎందుకు అంత చౌకగా అమ్మెసారో, మీరు నాకు చెప్పకపోతే నేను సస్పెన్స్‌తో చనిపోతానని చెప్పాడు.


ఆవిడ ఇలా బదులిచ్చింది.


మరణించిన నా భర్త యొక్క వీలునామాను నేను నెరవేరుస్తున్నాను.


నా భర్త మెర్సిడెస్ కారు అమ్మకం నుండి వచ్చే మొత్తం డబ్బు అతని లేడీ సెక్రటరీ కి వెళ్తుంది అని వ్రాసాడు, అందుకే అని చెప్పింది.


"భార్యలు ఎప్పటికీ భార్యలే"

యోగము.

 శివే విషౌ చ, శక్తి చ, సూర్యే మయి నరాధిప! యాఒభేదబుద్ధిః యోగస్సమ్యగ్యో గోమతో మమ!! (గణేశగీత)


ఈశ్లోకం కంఠస్థం చేసి గుర్తుపెట్టుకోవలసిన అద్భుతమైన శ్లోకం. గణపతి చెప్తున్న మాట. శివునియందు, విష్ణువునందు, శక్తియందు, సూర్యునియందు, నాయందు - ఈ అయిదుగురిలో భేదం చూడకుండా ఉండడమే యోగము. అంతేకానీ ఒక దేవతను ఆరాధిస్తూ మిగిలిన దేవతలను ద్వేషిస్తూ ఉంటే అది యోగం కాదు. ఈ అయిదింటియందు సమదృష్టి కలిగి ఉండాలి. ఇష్టదైవంగా దేనిని ఆరాధించినప్పటికీ మిగిలిన దేవతలు ఇష్టదేవతకు భిన్నులు కారు. వేరు కారు అనే భావన కలిగి ఉండాలి. ఇది యోగంలో మొదటి మెట్టు, ప్రధానమైన మెట్టు.


ఋషిపీఠం

Panchaag


 

Hindu


 

స్త్రీ జన్మ

 స్త్రీ జన్మ 

ఒకరోజు ధర్మరాజుకొక ధర్మసందేహం వచ్చింది. ‘స్త్రీ పురుషుల్లో కుటుంబం పట్ల ఎవరికి ఎక్కువ అనురాగం వుంటుంది’ అని. ఇదే విషయం భీష్ముడిని అడిగాడు. దానికి భీష్ముడు నవ్వి “నీకొక కథ చెబుతాను. అందులో నీకు సమాధానం దొరకవచ్చు!” అని చెప్పడం ప్రారంభించాడు….

పూర్వము ‘భంగస్వనుడు’ అనే రాజు వుండేవాడు. అతను ధర్మ నిరతుడు, సత్య సంధుడు. ప్రజలను కన్న బిడ్డల కన్న మిన్నగా చూసుకునేవాడు. అటువంటి రాజుకు సంతానము కలుగ లేదు. “అపుత్రస్య గతిర్నాస్తి!” అని పున్నామ నరకం నుండి తప్పించడానికి ఒక పుత్రుడయినా లేడే అనే బాధతో అగ్ని దేవుడిని ప్రార్ధించి అగ్నిస్తుత యజ్ఞం చేసాడు. అగ్ని దేవుడు సంతుష్టుడై 100 మంది పుత్రులను అనుగ్రహించాడు. ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది. దేవతల రాజయిన తన అనుమతి లేకుండా ‘భంగస్వనుడు’ యజ్ఞము చేసి నూరుగురు కుమారులను పొందడం ఆగ్రహం తెప్పించింది. అతడికి తగిన శిక్ష వేసి తన అహాన్ని చల్లార్చుకోవాలని అనుకున్నాడు. తగిన సమయం కోసం వేచివున్నాడు. ఒకరోజు ‘భంగస్వనుడు’ వేటకు వెళ్లాడు. ఇంద్రుడు అదను చూసి అతడిని దారి తప్పేలా చేసాడు. ఫలితంగా ఆ రాజును గుర్రము ఎటోతీసుకుని వెళ్ళింది. ఇంతలో అతడికి బాగా దాహము వేసింది. అటూ ఇటూ చూడగా సమీపంలో ఒక కొలను కనిపించింది. వెంటనే గుర్రము దిగి కొలనులో నీటిని సేవించాడు. స్పటికంలా స్వచ్ఛమయిన నీటిని చూడగానే స్నానం చేయాలనిపించి అందులో మునిగాడు.

మునిగి పైకి లేచే సరికి ఆ రాజు ఆశ్చర్య కరంగా స్త్రీ గా మారిపోయాడు. అయాచితంగా ప్రాప్తించిన స్త్రీత్వానికి చాలా చింతించాడు. “ఈ రూపముతో రాజధానికి వెళ్ళి నేను నా భార్యా పిల్లలకు, పుర జనులకు ఎలా ముఖము చూపించగలను !?" అని విచారించి... "అయినా ఇలా అడవిలో ఉండలేను కదా!" అనుకుని చివరకు రాజధానికి వెళ్ళాడు. మంత్రులను పిలిచి విషయము చెప్పి తన పెద్ద కుమారుడిని రాజ్యాభిషిక్తుడిని చేసి పుత్రులందరికీ రాజ్యాన్ని అప్పగించి తాను మాత్రము తపస్సు చేసుకోవడానికి అడవులకు పోయి అక్కడ ఒక ముని ఆశ్రమంలో నివసించ సాగాడు. కాలక్రమంలో, ప్రకృతి వైపరీత్యాన మునికి - స్త్రీలాగా మారిన రాజుకి జత కుదిరి మోహించి వివాహమాడారు. స్త్రీగా ఆ మునివలన అత్యంత బలసంపన్నులైన నూరుగురు కుమారులను పొందాడు. వారు పెరిగి పెద్దయిన తరువాత ఆ నూరుగురు కుమారులను తీసుకుని రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న తన కుమారులతో...     

"కుమారులారా! నేను పురుషుడిగా ఉన్నప్పుడు మిమ్ము కుమారులుగా పొందాను. స్త్రీగా ఉన్నప్పుడు ఈ నూరుగురు కుమారులను పొందాను. కనుక వీరు మీ సోదరులు. ఇక మీదట మీరంతా ఈ రాజ్యాన్ని పంచుకుని పాలించండి." అంది. స్త్రీ గా మారినా ఆమె ఒకప్పటి తమ తండ్రి కనుక పితృ వాక్య పాలకులుగా తండ్రిమాట పాటించి వారు రాజ్యాన్ని పంచుకుని పాలించసాగారు. ఇది చూసిన ఇంద్రుడు ‘నేను ఈ రాజుకు కీడు చేద్దామనుకుంటే అది అతడికి మేలు అయ్యింది. ఎలాగైనా వీరి మధ్య బేధము కల్పించాలని’ సంకల్పించి ఒక బ్రాహ్మణుడి రూపము దాల్చి ‘భంగస్వనుడి’కి పురుష రూపంలో కలిగిన పుత్రుల వద్దకు వెళ్ళి.."రాజకుమారులారా ! ఏమిటీ వెర్రి ఎవరో ఎవరినో తీసుకు వచ్చి వీరు మీ తమ్ముళ్ళు అని చెప్పగానే నమ్మడమేనా!? అసలు వీరి తండ్రి ఎవరు ? ఎవరికో పుట్టిన కుమారులు మీ తమ్ముళ్ళు ఎలా కాగలరు?" అని వారిలో కలతలు రేపాడు. 

అలాగే భంగస్వనుడు స్త్రీగా ఉన్నపుడు జన్మించిన కుమారుల వద్దకు వెళ్ళి లేని పోని మాటలు చెప్పి అన్నదమ్ముల మధ్య ద్వేషము రగిల్చాడు. అన్నదమ్ములు బద్ధశత్రువులై ఒకరితో ఒకరు కలహించి యుద్ధము చేసుకుని చివరకు అందరూ మరణించారు. చని పోయిన కుమారులను చూసి స్త్రీ రూపంలో ఉన్న భంగస్వనుడు గుండెలు బాదుకుని రోదించసాగింది. ఇది చాటుగా గమనిస్తున్న ఇంద్రుడు మరల ఏమీ ఎరుగని వాడిలా బ్రహ్మణ రూపుడై... “అమ్మా నీవు ఎవరవు ? ఎందుకిలా రోదిస్తున్నావు " అని అడిగాడు. అప్పుడు ఆమె తాను యజ్ఞము చెయ్యడము కుమారులను కనడము అడవిలో దారి తప్పి కొలనునీరు త్రాగి స్త్రీగా మారడము మునిద్వారా కుమారులను కనడము పూసగ్రుచ్చినట్లు చెప్పింది. 

అది విన్న ఇంద్రుడు తన నిజరూపంతో ప్రత్యక్షమై…. "రాజా! నేను ఇంద్రుడను నీవు నా అనుమతి తీసుకోకుండా యజ్ఞము చేసినందుకు నీ మీద కోపించి ఈ కష్టాలు నీకు కలిగించాను" అని చెప్పాడు. దానికి ఆమె "దేవా ! అజ్ఞానంతో తెలియక పొరపాటు చేసాను. అయినా దేవతలకు అధిపతి వైన నీవు పగ తీర్చుకోడానికి నేను తగిన వ్యక్తినా! కనుక నన్ను దయతో రక్షించు!" అని వేడుకోగా..ఆ మాటలకు కరిగి పోయిన ఇంద్రుడు "రాజా ! నీకు నేను ఒక వరము ఇస్తున్నాను. నీవు పురుషుడిగా ఉన్నప్పుడు పొందిన పుత్రుల నైనా లేక స్త్రీగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా బ్రతికిస్తాను, ఎవరు కావాలో నీవే

ఎంచుకో !" అన్నాడు. ఆమె (భంగస్వనుడు) సిగ్గుపడుతూ స్త్రీగా ఉన్నప్పుడు కలిగిన కుమారులను బ్రతికించమని కోరుకుంది.

ఇంద్రుడు "అదేమిటి రాజా! మిగిలిన వారు నీ కుమారులు కాదా !?" అని అడిగాడు. భంగస్వనుడు "వారు కూడా నా పుత్రులే! వారికి నేను తండ్రిని, వీరికి నేను తల్లిని. తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పది కదా!” అని చెప్పింది. ఇంద్రుడు సంతోషంతో "రాజా! నీ సత్యనిష్టకు సంతోషించాను. నీకుమారులు అందరినీ బ్రతికిస్తాను" అని... రాజా ! నీకు ఇంకొక వరము ఇస్తాను నీవు పోగొట్టుకున్న పురుషత్వము తిరిగి ఇస్తాను" అన్నాడు. దానికి ఆమె "మహేంద్రా ! నా కుమారులను బ్రతికించావు అదే చాలు.

స్త్రీగానే ఉంటాను" అంది. ఇంద్రుడు ఆశ్చర్యంతో "అదేమిటి రాజా ! పురుషుడవైన నీవు స్త్రీగా ఉండి పోతాననడానికి కారణం ఏమిటి ?"అని అడిగాడు. స్త్రీగా ఉన్న భంగస్వనుడు సిగ్గు పడి "మహేంద్రా! నేను స్త్రీగా ఉండడములో ఆనంద పడుతున్నాను. ఇందులో వున్న తృప్తి నాకు పుంసత్వములో కనబడలేదు కనుక ఇలాగే ఉండి పోతాను" అంది. 

దేవేంద్రుడు నవ్వి “అలాగే అగుగాక”అని ఆశీర్వదించాడు. అని పై కథంతా ధర్మరాజుకు చెప్పిన భీష్ముడు “యుధిష్టిరా ! ఇప్పుడు తెలిసిందా నీ ప్రశ్నకు సమాధానం !” అని అడిగాడు.

 స్త్రీ జన్మ యొక్క ఔన్నత్యం అర్థమయిన ధర్మజుడు మౌనంగా తల పంకించాడు.

ఒకతెకు జగములు వణకున్ అగడితమై  

   ఇద్దరు కూడిన అంబులు ఇగురున్ ।

   ముగ్గురాండ్రు కలిసిన సుగుణాకరా

   పట్టపగలె చుక్కలు రాలున్ ॥


[ఒక్క ఆడది ఉంటేనే లోకాలు వణుకుతాయి, ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే సముద్రాలే ఇగిరిపోతాయి, ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఇంకేముంది? పట్టపగలే నక్షత్రాలు రాలతాయి. అంటే స్త్రీ చాలా చాలా శక్తివంతురాలని భావము

శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయం

 🕉 మన గుడి : నెం 332


⚜ కర్నాటక  :-


కుడుపు - దక్షిణ కన్నడ ప్రాంతం


⚜ శ్రీ  అనంతపద్మనాభ స్వామి దేవాలయం


💠 కుడుపు పట్టణం మంగళూరుకు అతి సమీపంలో ఉంది. కుడుపు దాని పేరు 'కుడుపు' అనే తుళు పదం నుండి వచ్చింది, దీని అర్థం ఎండిన అడవి లతతో తయారు చేసిన బుట్ట, ఇది బియ్యం ఉడకబెట్టిన తర్వాత నీటిని హరించడానికి ఉపయోగించబడుతుంది.

కుడుపు దాని సర్ప ఆలయానికి ప్రసిద్ధి చెందింది - శ్రీ అనంత పద్మనాభ ఆలయం, ఈ ప్రాంతంలోని ప్రముఖ నాగ-క్షేత్రాలలో ఒకటి.


💠 ఆలయం పేరు సూచించినట్లుగా ప్రధాన దేవతలు అనంతపద్మనాభ , సుబ్రహ్మణ్య మరియు వాసుకి నాగరాజు (సర్ప దేవుడు). దీనిని మధ్వాచార్యుల అనుచరుడైన వశిష్ణవ శాఖ పూజిస్తుంది.


🔆 స్థల పురాణం 


💠 పురాణాల ప్రకారం, కేదార్ అనే బ్రాహ్మణుడు సంతానం లేక  సుబ్రమణ్య స్వామిని కోసం తపస్సు చేసాడు.

కానీ కేదార భాగ్యంలో సంతానం లేదని, అతను మోక్షానికి మాత్రమే అర్హుడని సుబ్రహ్మణ్య భగవానుడు చెప్పాడు.

కానీ మహావిష్ణువు కోరికపై, సుబ్రమణ్యుడు కేదారానికి దర్శనమిచ్చి అతనికి పిల్లలను అనుగ్రహించాడు.

 

💠 కానీ తొమ్మిది నెలల తర్వాత కేదార్ భార్య పాము గుడ్లలా కనిపించే మూడు గుడ్లను ప్రసవించింది.

దేవతలు ఈ గుడ్లు భగవంతుడు మహావిష్ణువు, మహాశేషుడు మరియు సుబ్రమణ్య భగవానుడి అవతారం తప్ప మరొకటి కాదని భావించి చాలా సంతోషించారు.



💠 ఈ అండాలు లోక కళ్యాణార్థం మహావిష్ణువు, మహాశేషుడు, సుబ్రహ్మణ్య భగవానుల అవతారం తప్ప మరేమీ కాదని ఆకాశవాణి వినిపించింది.

తాను సుబ్రహ్మణ్య స్వామిపై తపస్సు చేసిన ప్రదేశంలో రహస్యంగా గుడ్లు పెట్టమని సలహా ఇచ్చింది. ఇది ఒక ప్రదేశాన్ని మరియు నదిని పవిత్ర ప్రదేశంగా ఆశీర్వదించింది మరియు నదిలో స్నానం చేసేవారికి సంతానం మరియు అన్ని అనారోగ్యాలు మరియు పాపాల నుండి విముక్తి లభిస్తుంది.

భగవంతుడు అనంత పద్మనాభాన్ని (మహావిష్ణువు యొక్క మరొక పేరు) ఆరాధిస్తూ ఆ పవిత్ర స్థలంలో ఉండమని ఒక దైవిక స్వరం అతనికి సలహా ఇచ్చింది మరియు అతని జీవిత చరమాంకంలో మోక్షాన్ని అనుగ్రహించింది.


💠 ఈ స్వరం విన్న కేదార్ చాలా సంతోషించాడు మరియు అతను ఆ గుడ్లను స్థానిక భాషలో కుడుపు అని పిలువబడే అడవి మొక్కలతో అల్లిన బుట్టలో ఉంచాడు మరియు అతను సుబ్రహ్మణ్య భగవానుని ధ్యానం చేసే ప్రదేశంలో రహస్యంగా ఉంచాడు.


💠 అతను తన శేష జీవితాన్ని అనంత పద్మనాభుడిని ధ్యానిస్తూ గడిపాడు మరియు తన జీవిత చరమాంకంలో మోక్షాన్ని పొందాడు. ఇప్పుడు ఆ ప్రదేశంలో ఒక పుట్ట పెరిగి ఆ ప్రదేశం శ్రీ క్షేత్ర కుడుపుగా ప్రసిద్ధి చెందింది.

ఆలయానికి సమీపంలోనే భద్ర సరస్వతి తీర్థం అనే చిన్న నది నివసిస్తుంది.


💠 ఒకసారి శూరసేనుడు అనే రాజు ఏదో ఒక తప్పుడు పని చేసాడు మరియు ఈ పాపం నుండి ఎలా బయటపడాలి అని వివిధ వేద పండితులను, పూజారులను అడిగాడు. కానీ బ్రాహ్మణ వేద పండితులు అతని చేతులను తానే నరికివేయమని చెప్పారు, ఎందుకంటే పాపానికి కారణం అతని చేతులే మరియు మహావిష్ణువును పూజించమని సలహా ఇచ్చారు.

రాజు సలహాను అంగీకరించి, తదనుగుణంగా చేశాడు.


💠 ఒక రోజు అతను తన సైన్యంతో కలిసి అడవిలో వేటాడటం చేస్తున్నప్పుడు పవిత్రమైన మరియు ప్రశాంతమైన భద్ర సరస్వతి తీర్థానికి చేరుకున్నాడు.


💠 ఇంతలో శ్రీమహావిష్ణువుకి చేయవలసిన పూజల గురించి బ్రాహ్మణ వేద పండితులు ఇచ్చిన సలహా అతనికి గుర్తుకు వచ్చింది. తర్వాత అక్కడే స్థిరపడి మహావిష్ణువును పూజించడం మొదలుపెట్టాడు.

అతను తీవ్రంగా పూజించగా, శ్రీమహావిష్ణువు అతని ముందు ప్రత్యక్షమై అతని కోరికలను అడిగి తెలుసుకున్నాడు.


💠 రాజు తన కోల్పోయిన చేతులను పునరుద్ధరించమని అభ్యర్థించాడు.

ఇది విన్న మహావిష్ణువు ఒక రోజులో ఒక ఆలయాన్ని నిర్మించమని మరియు ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత అతని చేతులు వస్తాయి అని చెప్పాడు.

రాజు శూరసేనుడు చాలా సంతోషించి ఒక రోజులో ఆలయాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యాడు.

శిల్పులు, వాస్తుశిల్పులు అందరూ నిర్మాణ పనుల్లో పడ్డారు. అయితే ఆలయం దాదాపుగా పూర్తి దశలో ఉంది, గర్భగుడి యొక్క అలంకారమైన పై భాగం మినహా.


💠 తెల్లవారుజామున ఆకాశం నుండి ఒక దివ్యమైన స్వరం వినిపించింది, నిర్మాణ పనులు ఎక్కడ ఉన్నాయో అలాగే ఆపివేయమని సలహా ఇచ్చింది.

రాజు చేతులు తిరిగి వచ్చాయి.

రాజు అక్కడ స్థిరపడి, తన శేష జీవితాన్ని మహావిష్ణువును ఆరాధిస్తూ గడిపాడు.

నేటికీ ఆలయంలో 'ముగులి' (ముగుళి - గర్భగుడిపై అలంకారమైన పైభాగం) లేదు.


💠 ప్రధాన ఆలయంలో, విష్ణువుగా ప్రసిద్ధి చెందిన శ్రీ అనంత పద్మనాభ స్వామి పశ్చిమాభిముఖంగా ప్రతిష్టించారు.

భారీ నాగ బనా (బహుళ సర్ప దేవుడి రాతి సంస్థాపనలు) ఉంది. నాగ బనాలో 300 కంటే ఎక్కువ సర్ప విగ్రహాలు ఉన్నాయి.


💠 పండుగలు: ఆలయంలో జరుపుకునే కొన్ని ప్రధాన పండుగలు సుబ్రహ్మణ్య షష్ఠి,చంపా షష్ఠి,కిరు షష్ఠి,నాగర పంచమి, శ్రావణ శుద్ధ నగర పంచమి.

వార్షిక పండుగ డిసెంబర్/జనవరి నెలలో. మార్గశిర శుద్ధ పాడ్యమి నుండి మార్గశిర శుద్ధ షష్ఠి వరకు బ్రహ్మకలశోత్సవం (బ్రహ్మకలశోత్సవం)


💠 మంగళూరు సిటీ సెంటర్ నుండి 10 కి.మీ దూరంలో ఉంది .

డొనెషన్లు

 డొనెషన్లు

మిత్రులారా మన బ్లాగు అభివ్రుద్దికి డొనేషనులు +91 9848647145 మొబేలు నంబరుకు జీ పే, ఫొనె పె, లొ దేనితొ నయినా పంప వచ్హు. మీ స్క్రీన్ షాట్ పంపిస్తె మన బ్లాగులొ పబ్లిష్ చేస్తాము. ఇక ఆలశ్యం యెందుకు ఇప్పుడె మీరు డొనెషన్ పంపండి. మన బ్లాగు అభివ్రుద్దికి తొట్పడండి 

హనుమాన్ సర్వస్వం

 *🌹హనుమాన్ సర్వస్వం🌹*


*పరాశర సంహిత నుంచి సేకరించిన సమాచారం  ప్రశ్నలు జవాబులు.* 


🚩1) శ్రీ హనుమంతుని తల్లి పేరు?

జవాబు : అంజనా దేవి !

🚩2) హనుమంతుని తండ్రి పేరు?

జవాబు : కేసరి !

🚩3) కేసరి పూర్వ జన్మలో ఎవరు?

జవాబు : కశ్యపుడు !

🚩4) అంజన పూర్వ జన్మలో ఎవరు?

జవాబు : సాధ్య !

🚩5) హనుమంతుని జన్మ తిథి ఏది?

జవాబు : వైశాఖ బహుళ దశమి!


🚩 6) హనుమంతుని జన్మ స్థలం ఏది?

జవాబు : తిరుమల  - అంజనాద్రి.

🚩7) హనుమంతుని నక్షత్రము ?

జవాబు : పూర్వాభాద్ర నక్షత్రము.

🚩8) హనుమంతుని జనన లగ్నం  ?

జవాబు : కర్కాటక.

🚩9) హనుమంతుడు ఏ యోగం లో పుట్టాడు ?

జవాబు : వైదృవీయోగం లో 

🚩10) హనుమంతుడు ఏ అంశతో పుట్టాడు ?

జవాబు : ఈశ్వరాంశ 


🚩11) ఎవరి వరం వలన హనుమంతుడు పుట్టాడు ?

జవాబు : వాయుదేవుని వరం వలన.

🚩12)హనుమ జనన కారకులు ?

జవాబు : శివ,పార్వతులు, అగ్ని,వాయువులు.

🚩13) హనుమంతుని గురువు ?

 జవాబు : సూర్య భగవానుడు.

🚩14) హనుమంతుని శపించిన వారు ?

 జవాబు : భృగుశిష్యులు.

🚩15) హనుమంతునికి గల శాపం ?

 జవాబు : తన శక్తి తనకు తెలియకుండా ఉండడం.


🚩16) హనుమంతుని శాప పరిహారం ?

 జవాబు : స్తుతించినా,

నిందించినా తన శక్తి తను గ్రహించుట.

🚩17) హనుమంతుని బార్య ?

 జవాబు : సువర్చలా దేవి.


🚩18) సువర్చాలా దేవి మాతామహుడు ?

జవాబు : విశ్వకర్మ.


🚩19) హనుమంతుని మాతామహుడు ?

 జవాబు : కుంజరుడు.


🚩20)సువర్చల తల్లి పేరు ?

 జవాబు : సంజాదేవి, ఛాయాదేవి.


🚩21) హనుమంతుని బావమరుదులు ?

 జ : అశ్వనీ దేవతలు, శని,యముడు.


🚩22) హనుమంతుని వివాహ తేదీ ?

 జ : జేష్ఠ శుద్ధ దశమి.


🚩23) హనుమంతుని తాత, అమ్మమ్మ ?

 జ : గౌతముడు , అహల్య.


🚩24) హనుమంతుని మేన మామలు ?

 జ : శతానందుడు, వాలి, సుగ్రీవులు.


🚩25)హనుమంతుడు నిర్వహించిన పదవి ఏది ?

 జ : సుగ్రీవుని మంత్రి.


🚩26) హనుమంతుడు నిర్వహించిన పదవి స్థానం ఏది ?

 జ : ఋష్యమూక పర్వతం.


🚩27) శ్రీరాముని కలియుటకు హనుమంతుడు ఏ రూపం ధరించాడు ?

 జ : భిక్షుక రూపం.


🚩28) హనుమంతుడు శ్రీరాముని తొలుత చూసిన స్థలం ఏది ?

 జ : పంపానదీ తీరం .


🚩29)హనుమంతుని వాక్ నైపుణ్యాన్ని తొలుత మెచ్చింది ఎవరు ?

 జ : శ్రీరాముడు.


🚩30)హనుమంతుడు అగ్ని సాక్షిగా ఎవరికి మైత్రి గూర్చాడు ?

 జ : శ్రీరామ సుగ్రీవులకు.


🚩31)హనుమంతుడు వాలిని సంహరింపని కారణం?

జ : తల్లి అజ్ఞ.


🚩32)హనుమంతుడు లక్ష్మణుని కి ఆసనంగా వేసినది ?

 జ : చందన వృక్ష శాఖ.


🚩33)హనుమంతుని సంపూర్ణ చరిత్ర కలిగిన మహత్ గ్రంథం ?

 జ : శ్రీ పరాశర సంహిత.


🚩34)హనుమంతుని మేన మామలు వాలి సుగ్రీవుల భార్యలు ?

 జ : తార, రమ.


🚩35) చైత్ర మాసంలో హనుమత్ పర్వదినం ?

 జ : పుష్యమి నక్షత్రం గల రోజు.


🚩36) సీతా దేవి నీ వెతుకుటకు హనుమంతుడు నీ ఏదిక్కుకు పంపారు.?

 జ : దక్షిణ దిక్కు.


🚩37)వైశాఖ మాసంలో హనుమత్ పర్వదినం ఏ నక్షత్రం కలది ?

 జ : ఆశ్లేష నక్షత్రం.


🚩38) హనుమంతుడి ఆదేశం తో వానరులు ప్రవేశించిన గుహ ఎవరిది ?

 జ : స్వయంప్రభది.


🚩39) ప్రాయోప ప్రవేశ యత్నం లో ఉన్న అంగదాదులను భక్షించిన పక్షి ?

 జ : సంపాతి.


🚩40) సముద్ర లంఘనం కోసం హనుమంతుడు ఎక్కిన పర్వతం ?

 జ : మహేంద్ర పర్వతం.


🚩41)హనుమంతుడు దాటిన సముద్ర విస్తీర్ణము ?

 జ : 100 యోజనాలు.


🚩42)హనుమంతునికి అడ్డు వచ్చిన పర్వతం ?

 జ : మైనాకుడు.


🚩43)హనుమంతునికి ఆతిథ్యం ఇవ్వాలని తలచింది ఎవరు ?

 జ : సముద్రుడు.


🚩44) మైనాకుని హనుమంతుడు ఎం చేశాడు?

 జ : రొమ్ము తో తాకాడు.


🚩45) మైనాకుడు హనుమంతుడిని ఎల అనుగ్రహించాడు.?

 జ : చేతితో స్పృశించి.


🚩46)హనుమంతుని కి ఏర్పడిన 2 వ విఘ్నం ?

 జ : సురస.


🚩47) సురస ఏ జాతి స్త్రీ ?

 జ : నాగజాతి.


🚩48) సురస నుండి హనుమంతుడు ఏలా తప్పించుకున్నాడు.?

 జ : ఉపాయంతో.


🚩49) సురసను పంపిన దెవరు ?

 జ : దేవతలు.


🚩50) సురసను దేవతలు ఎందుకు పంపారు ?

 జ : హనుమంతుని శక్తి సామర్థ్యాలు పరీక్షించుటకు .


🚩51) హనుమంతునికి ఏర్పడిన 3 వ విఘ్నం ?

 జ : సింహిక.


🚩52) సింహిక హనుమంతుని ఎం చేసింది ?

 జ : నీడ పట్టి లాగింది.


🚩53) సింహిక వృత్తి ఎమిటి ?

 జ : లంకను కాపాడడం.


🚩54) హనుమంతుని చరిత్ర ఎవరితో చెప్పబడింది ?

 జ : శ్రీ పరాశర మహర్షి చే.


🚩55) హనుమంతుడు లంక లో ఏ ప్రాంతంలో వాలాడు.?

జ : సువేల పర్వత ప్రాంతం లో.


🚩56) హనుమ వెళ్లిన పర్వతం మొత్తానికి గల పేరు ?

 జ : త్రికూటాచలం.


🚩57) సువేల పై హనుమంతుడు ఎందుకు అగాడు ?

 జ : సూర్యాస్తమయం కోసం.


🚩58) లంకలోకి హనుమంతుడు ఎంత రూపంలో వెళ్ళాడు?

 జ : పిల్లి పిల్ల అంత వాడు అయ్యి.


🚩59) లంకా ప్రవేశ ద్వారం వద్ద హనుమను అడ్డగించింది ఎవరు ?

 జ :లంకిణి


🚩60)  లంకిణిని హనుమంతుడు ఎల కొట్టాడు ?

 జ : ఎడమ చేతి పిడికిలి తో.


🚩61) లంకలో హనుమంతుడు ఎలా ప్రవేశించాడు ?

 జ : ప్రాకారం దూకి.


🚩62) శతృపుర ప్రవేశంలో హనుమంతుడు పాటించిన శాస్త్ర నియమం ఎమిటి ?

 జ : ఎడమ కాలు ముందు పెట్టీ పోవడం.


🚩63) ఎవరిని చూసి హనుమంతుడు సీతగా బ్రమించాడు ?

 జ : మండోదరిని.


🚩64)హనుమంతుడు ప్రవేశించిన వనం ?

 జ : అశోక వనం.


🚩65) అశోక వనం ఏ పర్వతం పైన ఉన్నది ?

 జ : సుందర పర్వతం.


🚩66)లంకా నగరం ఏ పర్వతం పై ఉన్నది ?

 జ : నీల పర్వతం.


🚩67)శ్రీ హనుమత్ చరిత్ర అంతా పరాశర మహర్షి చే ఎవరికి చెప్పబడింది ?

 జ : మైత్రేయ మహర్షి కి.


🚩68)హనుమంతుడు అందించిన అద్భుత సందేశం ?

 జ : జీవనృద్రాణిపశ్యతి. -(బ్రతికి ఉండిన శుభములు బడయవచ్చు)


🚩69) సీతను హనుమంతుడు ఏ చెట్టు కింద చూచాడు ?

 జ : శింశుపా వృక్షము.


🚩70) సీతకు హనుమంతుడు ఆనవాలుగా ఏమిచ్చాడు ?

 జ : రాముడి ఉంగరం.


🚩71) హనుమంతునికి తన ఆనవాలుగా సీత ఎమి ఇచ్చింది ?

 జ : చూడామణీ.


🚩72)హనుమంతుడు అశోక వనం ద్వంసం అనంతరం ఏ రాక్షస వీరుని చంపారు ?

 జ : జంబుమాలిని.


🚩73) హనుమంతుని చేతిలో మరణించిన రావణ సుతుడు ఎవరు ?

 జ : అక్షయ కుమారుడు.


🚩74)హనుమంతుడు ఎవరికి బందీ అయ్యాడు ?

 జ : ఇంద్రజిత్తు నకు.


🚩75) హనుమంతుని రావణ దర్భారు లో ఎవరు ప్రశ్నించారు. ?

 జ : ప్రహస్తుడు .


🚩76) సముద్రం తిరిగి దాటడానికి ఆధారం చేసుకున్న పర్వతం ?

 జ : అరిష్ట పర్వతం.


🚩77) సముద్రం మొదట దాటడానికి ఎంత సమయం పట్టింది ?

 జ : 30 ఘడియలు


       *🚩జై శ్రీరామ్🚩*

గురువారం*🌷 🌷 *మే 30, 2024*🌷

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       🌹 *గురువారం*🌷

     🌷 *మే 30, 2024*🌷

     *దృగ్గణిత పంచాంగం*                   

*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం వసంతఋతౌః*  

*వైశాఖమాసం కృష్ణపక్షం*

*తిథి* :*సప్తమి* ఉ 11.44 వరకు ఉపరి *అష్టమి*

వారం :*గురువారం* ( బృహస్పతివాసరే)

*నక్షత్రం : ధనిష్ఠ ఉ 07.31 వరకు ఉపరి శతభిషం*.

*యోగం : వైధృతి రా 8.53 వరకు ఉపరి విష్కంభం*

*కరణం : బవ* ఉ 11.44 *బాలవ* రా 10.42 ఉపరి *కౌలవ*.

అమృత కాలం :*రా 11.24 - 12.55*

అభిజిత్ కాలం :*ఉ 11.47 - 12.39*.

*వర్జ్యం : మ 2.20 - 3.51*

*దుర్ముహుర్తం : ఉ10.04 - 10.56* *సా 3.15 - 4.06*

*రాహు కాలం : మ 1.50 - 3.28*

గుళిక కాలం :*ఉ 8.59 - 10.36*

యమ గండం :*ఉ 05.45 - 07.22*

సూర్యరాశి :*వృషభం* 

చంద్రరాశి :*మకరం/కుంభం*

సూర్యోదయం :*ఉ 05.45*

సూర్యాస్తమయం :*సా 06.42*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.08 - 04.56*

______________________________

         🌷 *ప్రతినిత్యం*🌷

 *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

🌷 *అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా*

*రాజాధిరాజ యోగిరాజ  పరబ్రహ్మ* 

*శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్*🙏

🌹 *మహారాజ్ కీ జై |*🌷

 🙏🙏🙏🙏🙏🙏🙏



🌴🪷🌹🛕🌹🌷🪷🌷🌴

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🌷🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌷🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌹🌷

పుష్పగిరి

 *"పుష్పగిరి"

                  


      చాలా కాలం కిందట ఒక గ్రామంలో నిష్టాపరుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు దివ్య క్షేత్రాలు దర్శించుకువద్దామనీ, పుణ్య నదులన్నిటి లోనూ మునిగి తరించుదామని ఎంతో ఆసక్తిగా వుండేది. ఐతే, పుట్టుపేద కావటంచేత చేయిసాగక, కోరిక నెరవేరింది కాదు.


ఇంతలో ఆ బ్రాహ్మణుడికి కాలం సమీపించగా, ఒక్కగానొక్క కుమారుడైన చైనుల్ని చేరబిలిచి, "నాయనా ! ఎంత యత్నించినా నా జీవితంలో తీర్థయాత్రలు సేవించుకోవటం గాని, పుణ్యనదులలో స్నానం చేయటంగాని పడలేదు. ఈ కోరిక అలానే నిలిచిపోయింది. కాబట్టి, నీకైనా సావకాశం చిక్కినట్టయితే, నా అస్తికలను వీలైనన్ని పుణ్యనదులలో కలప వలిసింది. ముఖ్యంగా పవిత్రమైన గంగా నదిలో కలప వలిసింది. ఈ ఒక్క పని నీవు చేశావంటే నా ఆత్మ సంతృప్తి పడుతుంది. నాకు ముక్తిమార్గం యేర్పడుతుంది” అంటూ తన తుది కోరిక వెల్లడించి దేహయాత్ర చాలించాడు.


చైనులు పితృభక్తి కలవాడు. అందుచేత అతడు 'అప్పో సొప్పో చేసి ఐనా సరే, తండ్రి కోరిక నెరవేర్చి తీరాలె. కొడుకుననిపించుకుంటూ, ఈ మాత్రం పని చేయలేకపోతే, నాజన్మ యేం జన్మ !' అనే సంకల్పంతో బయల్దేరిపోయి, ఎన్ని కష్టాలకైనా ఓర్చి కాశీ క్షేత్రం దర్శించుకుని తండ్రి అస్తికలు గంగా నదిలో కలపాలని, నిశ్చయించుకున్నాడు.


ఆ కాలంలో ఇప్పటిలాగా రైల్లా, విమానాలా, ఇట్టె వెళ్లి అట్టె రావటానికి ! కాలి నడకని పోవాలి. కీకారణ్యాలు దాటాలి. కష్టసుఖాలు ఒంటపట్టించుకోవాలి. ఇన్ని జరిగినా, బయల్దేరిన మనిషి మళ్లీ ఇల్లు చేరుకునేవరకూ నమ్మకం లేకపోయె ! అందుకనే - “కాశీకి వెళ్లినవాడూ కాటికి పోయినవాడూ తిరిగిరారు" అనే సామెత కూడా యేర్పడినట్టుంది.


చైనులు పాదచారి అయి బయల్దేరాడు. రోజుకొక గ్రామం చొప్పున సంచారం చేస్తూ, దారిలో తగిలిన క్షేత్రాలన్నీ దర్శిస్తూ, పరలోకాన ఉండే తండ్రికి గతులు కల్పిస్తూ వెళుతున్నాడు. పోయి పోయి అతడు కడప జిల్లాలో కాలు పెట్టాడు. అక్కడ పినాకినీ నది ప్రవహిస్తున్నది. ‘సరే, ఇందులో కూడా స్నానం చేసిపోదాం' అనుకుని, అస్తికలమూట ఆ దగ్గరనే పెట్టి చైనులు నదిలో దిగాడు.


అతడు స్నానం చేసికొని, సంధ్య వార్చుకుని వచ్చి, మళ్లీ మూట బుజాన వేసుకు పోదామనుకొన్నాడు. తీరా చూడగా, ప్రవహించే పినాకినీ నది పొంగువచ్చి ఆ మూటంతా తడిసిపోయివున్నది. సరే, తడిగుడ్డ ఆరబెట్టి మళ్లీ కట్టుకుందామనే ఉద్దేశంతో మూట విప్పాడు.


ఆ మూట విప్పేసరికి, అస్తికలు మాయమై, , వాటికి బదులు అమోఘంగా పరిమళిస్తున్న తెల్లటి మల్లెపువ్వులు కనుపండువుగా కనిపించినై! ఇవి చూచి చైనులు ఆశ్చర్యంతో చకితుడయాడు. ఆహా, పినాకిని జలం ఎంతటి మహిమ కలది ! కాశీలో వుండే గంగాజల మహత్యం ఎటువంటిదో నేను ఎరుగను. కాని, పినాకిని మహిమ కళ్లారా ప్రత్యక్షంగా చూడగలిగాను. నా తండ్రికి తరణోపాయం కలిగింది. ఆయన ముక్తి పొందేశాడు. నా విధి నేను నెరవేర్చుకొన్న వాడినయాను. ఇక నేను కాశీకి పోనక్కరలేదు. ఇక్కడనే ధన్యుడనయాను” అనుకుంటూ అపరిమితానందభరితుడై, తండ్రిని స్మరిస్తూ ఆ పువ్వులను పినాకినీ ప్రవాహంలో కలిపి వేసి ఇంటిముఖం పట్టాడు.


ఏమి చిత్రమో కాని, చైనులు స్నానం చేసిన తావు ఒక మడుగుగా యేర్పడింది. ఆ మడుగు నీలాటి రేవుకి సదుపాయంగా ఉండటంచేత స్త్రీలందరూ అక్కడ స్నానాలు చేసి, నీళ్లుపట్టుకునేవాళ్లు. పశువులు కూడా వచ్చి దాహం తాగేవి.


ఒకరోజున ఒక ముసలివాడు పశువులకు నీళ్లెట్టడానికని ఆ రేవుకి వచ్చాడు. బక్కచిక్కివున్న ఆ పశువులు మడుగులో నీళ్లు తాగి ఇవతలకు వచ్చేసరికల్లా మిస మిసలాడుతూ బలంగానూ పడుచుగానూ కనపడినై. ఈ వింత చూచి తాతకు ఆశ్చర్యం కలిగింది. తన పశువులు పడుచువైనాయనే సంతోషంతో తనుకూడా మడుగులో దిగి స్నానం చేశాడు. స్నానం చేసి గట్టు పైకి వచ్చేసరికల్లా తాతకు ముసిలిరూపం పోయి, పడుచువాడయాడు.


సరీగా అదే సమయానికి ఆ ముసలి వాని భార్య నెత్తిని కూటికుండ పెట్టుకుని ఆ దారిన పొలానికి పోతూవుంది. అలా పోతూవున్న ఆమెను అతడు పలుకరించే సరికి, ఎవడో తుంటరి తనతో సరాగాలాడుతున్నాడనుకొని, ఎదిరించి సమాధానం చెప్పసాగింది. 

"నేను నీ భర్తను, ఫలాన ముసిలివాడనే,” అని ఎంత చెప్పినా ఆమె నమ్మక పోయేసరికి వాడు ఆమెను బరబర చెయ్యి పట్టుకు లాగి మడుగులో ముంచాడు. ఏముంది? పైకి వచ్చేసరికల్లా ఆమె రూపవతి, యౌవనవతి ఐ కూర్చుంది. తీరా ముసిలివాడూ అతని భార్యా కలిసి ఇంటికి వెళ్లేటప్పటికి, వాళ్ల బిడ్డలు తలి దండ్రుల్ని ఆనవాలు పట్టలేకపోయారు. తరువాత క్రమంగా నిజానిజాలు బయల్పడి పినాకిని జలమహిమ అందరకూ వెల్లడి ఐంది. అప్పటినించీ ఆ మడుగులో స్నానం చేసి, ప్రజలు అమరత్వం పొందటం ప్రారంభమైంది.


కొద్ది కాలానికల్లా ఈ వర్తమానం త్రిలోక సంచారి ఐనటువంటి నారదమహర్షి చెవుల బడింది. ఎవరికైనా మేలు జరుగుతూ వుంటే ఓర్వలేని నారదుడు, ఇంతమంది ప్రజలు అమరత్వం పొందుతూవుంటే చూచి సహించగలడా? ఉహుం. కనుక, ఈ మడుగుకి ఏవిధంగా కట్టడి చేయటమా!" అని ఆలోచించి తిన్నగా బ్రహ్మదేముని వద్దకు వెళ్లి సంగతి సందర్భాలు చెప్పాడు.


ఐతే, భూలోకంలో ఇటువంటి మడుగు ఎలా పుట్టింది?' అని దివ్య దృష్టితో చూచాడు బ్రహ్మ. పూర్వకాలమందు, తన తల్లి దాస్యవిముక్తికోసం దేవలోకంనించి గరుత్మంతుడు అమృతభాండాన్ని తీసుకు పోతూవుండగా దేవేంద్రుడు ఎదిరించాడు. అప్పుడు ఇద్దరి మధ్యనా ఘోరయుద్ధం జరిగింది. ఆ పోరాటంలో అమృతబిందువు ఒకటి చింది, భూలోకంలో ఇప్పుడు ఆ మడుగు ఉండే చోటున పడి నట్టు గ్రహించాడు.


నారదుడు నూరిపోసిన మీదట, అమరత్వం యిచ్చే ఇటువంటి మడుగు భూలోకంలో ఉండకూడదు అని బ్రహ్మకు కూడా అనిపించింది. వెంటనే బ్రహ్మ, హనుమంతుని రప్పించి, “హనూ ! ఒక పర్వతం తెచ్చి పడవేసి, పినాకినిలో ఉండే ఆ మడుగును కప్పెట్టివేసెయ్యి" అన్నాడు. 


చెప్పటమే తడవుగా ఆంజనేయుడు బ్రహ్మాండమైన పర్వతం ఒకటి తెచ్చి దభీమని ఆ మడుగులో పడవేశాడు. 


కాని, ఆ పినాకినీ జల మహిమ యేమిటో కాని, హనుమంతుడు పడవేసిన పర్వతం మడుగును కప్పి వేయటానికి బదులు బెండు లాగా నీటిపైన తేలి ఆడుతూవుంది.


 ఈ చిత్రం చూచి బ్రహ్మకు కంగారుపుట్టింది. అతనికేమీ తోచక నారదుణ్ణి వెంటబెట్టుకుని, సరాసరి శివుని వద్దకు వెళ్లాడు. శివునికి కూడా ఈ విషయంలో ఏమీ పాలుపోక, ఆ ముగ్గురూ కలిసి వైకుంఠంలోవుండే విష్ణుమూర్తి వద్దకుపోయి జరిగిన వైనాలన్నీ పూసగుచ్చినట్టు ఆ జగన్నాటక సూత్రధారుడికి వినికిడి చేశారు.


విష్ణుమూర్తి చిరునవ్వుతో అంతా విని, “నాకూ, శివునికి యెప్పుడూ ఇటువంటివే చిక్కులు తగులుతూవుంటై. తిన్నగా ఉండడు కదా ఈ నారదుడు!" అని చెప్పి, బ్రహ్మనూ నారదుణ్ణి పంపి వేశాడు. 


తరువాత శివకేశవులు మానవరూపంతో భూలోకానికి దిగివచ్చి, ఆ మడుగు పైన తేలి ఆడుతూవున్న పర్వతాన్ని ఒక వైపున శివుడూ, రెండోవైపున కేశవుడూ అదిమిపట్టి అణిచివేశారు.


అప్పుడు వారి ప్రభావంవల్ల ఆ పర్వతం భూమి పైన అణిగి వుండి, మడుగు మూసుకపోయింది.


ఆ బ్రాహ్మడి అస్తికలను పువ్వులుగా మార్చగల మహిమ గలిగింది- పినాకినీ నది జలం. అటువంటి నీటిలో ఆంజ నేయుడు పర్వతం తెచ్చి పడవేశాడు. ఈ రెండు కారణాలవల్ల ఆ పర్వతానికి 

'పుష్ప గిరి' అనే పేరు వచ్చిందంటారు.


శివకేశవులు ఇద్దరూ దిగివచ్చి ఆ పర్వతాన్ని అణచటంచేత, కొండకు రెండు పక్కలా ఆ ఇద్దరి ఆలయాలూ వెలిసి, అది ఈనాడు ఒక దివ్య క్షేత్రమై ఉన్నది.


ఇక్కడ యేటా గొప్ప ఉత్సవాలు జరుగుతై. లక్షలాది జనం స్వాముల దర్శనానికి వస్తుంటారు. ఇది చెప్పదగిన పుణ్య క్షేత్రం గనకనే పుష్పగిరి స్వాములవారు ఇక్కడ మఠం ఏర్పరచుకొన్నారు.


పుష్పగిరి కడపకు పది మైళ్ళ దూరం లోనే ఉన్నది. కాబట్టి ఈ సారి మీరు ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు తప్పక ఈ క్షేత్రం దర్శించి రండి!

(1951 ఏప్రిల్ నెల చందమామ కథ)

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🙏


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!

కానుక

 #కానుక

పూజ్యులైన అమ్మానాన్నలకు ప్రదీప్‌ నమస్కరించి వ్రాయునది. ఉభయకుశలోపరి. నాకు హైదరాబాద్‌లో ఉద్యోగం దొరికింది. నేనూ మీ కోడలూ ఇక్కడి ఉద్యోగాలకు రాజీనామా చేశాం. ఈ నెలాఖరులోగా ఇండియాకు తిరిగి వచ్చేస్తున్నాం. మిగిలిన వివరాలు వచ్చాక మాట్లాడుకుందాం. 

ఇట్లు 

మీ కుమారుడు 

ప్రదీప్‌

క్లుప్తంగా ఉన్న ఆ ఉత్తరం చదివిన సీతారామయ్య, వైదేహీల ఆశ్చర్యానికి అంతేలేకుండా పోయింది. అయోమయంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఆరు అంకెల జీతంలో ఉన్న కొడుకూ అయిదంకెల జీతంలో ఉన్న కోడలూ

ఉద్యోగాలకు రిజైన్‌ చేసి ఇండియాకి తిరిగి వచ్చేయడమేమిటీ..? ఇక్కడ... ఈ హైదరాబాద్‌లో అంత జీతం ఎక్కడుందీ? ఎవరిస్తారూ? అయినా చుట్టపుచూపుగా ఇండియాకి రావడమేగానీ, తాము

అమెరికాలో శాశ్వతంగా స్థిరపడిపోతామని ప్రదీప్‌ కచ్చితంగా తన నిర్ణయాన్ని ఏనాడో చెప్పేశాడుగా! మరి ఈ ఉత్తరం ఏమిటీ? వాడు పనిచేసేచోట ఏమన్నా గొడవలు జరిగాయా? భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు వచ్చాయా? సందేహాల సునామీలో ఉక్కిరిబిక్కిరైపోతున్నారా వృద్ధ దంపతులు.

‘‘ఏమిటండీ ఇది?’’ భర్తని అడిగింది వైదేహి.

‘‘ఉత్తరం’’ సింపుల్‌గా అన్నాడు సీతారామయ్య. భర్త జవాబుతో తెల్లబోయిన వైదేహి మొహంచూసి చిన్నగా నవ్వి ‘‘నాకొకటి తెలిస్తేగా నీకు చెప్పడానికి’’ అన్నాడు.

ఉత్తరం వచ్చినప్పటి నుంచి అన్యమనస్కంగానే గడిపారా ఇద్దరు. సాయంకాలం వాలుకుర్చీలో నడుంవాల్చి అదే ఆలోచనల్లో ఉన్న సీతారామయ్యకి చటుక్కున సందేహం కలిగింది. ఒకవేళ ప్రదీప్‌ తానిచ్చినదాన్ని చూశాడా? దానిని ఎప్పుడు చూడాలో తాను స్పష్టంగా చెప్పాడుగా? ఒకవేళ చూసినా, వీడు ఇండియాకి తిరిగి వచ్చేయడానికీ

దానికీ ఏమన్నా సంబంధం ఉందా?

ఎటూ తేల్చుకోలేకపోతున్నాడాయన. దానిని ప్రదీప్‌కి అందజేసిన రోజు జ్ఞాపకం వచ్చిందాయనకు. ఆరోజు...

రెండేళ్ళక్రితం తల్లిదండ్రులను చూడటానికి

కాలిఫోర్నియా నుండి భార్యా పిల్లలతో వచ్చాడు ప్రదీప్‌. నెలరోజులు సరదాగా గడిచిపోయాయి. మరుసటిరోజే తిరుగుప్రయాణం. వైదేహి కోడలినీ పిల్లలనూ తీసుకుని తెలిసినవారింటికి వెళ్ళింది. ఇంట్లో తండ్రీకొడుకులు మాత్రమే ఉన్నారు.

‘‘బాబూ... దీపూ!’’ గదిలో బ్యాగ్‌ సర్దుకుంటున్న ప్రదీప్‌ తలెత్తిచూశాడు. ఎదురుగా తండ్రి.

‘‘ఏమిటి నాన్నగారూ’’ అన్నాడు ప్రదీప్‌.

తన చేతిలోని ఒక ప్యాకెట్‌ కొడుకుకి అందిస్తూ ‘‘ఇది నీ దగ్గర భద్రంగా ఉంచు’’ అన్నాడు సీతారామయ్య.

‘‘ఏమిటిది?’’ ఆశ్చర్యంగా అడిగాడు ప్రదీప్‌.

‘‘అది ఇప్పుడు చెప్పను. దీన్ని నేనూ మీ అమ్మా మరణించిన తర్వాతే తెరిచి చూడాలి. మరణించిన వెంటనే చూడాలని రూలేం లేదు. ‘మేము లేము’ అని తెలిసిన తర్వాత మాత్రమే ఎప్పుడన్నా చూడాలని అనిపిస్తే చూడు. అప్పటివరకూ దీన్ని ఓపెన్‌ చేయకు’’ అన్నాడు సీతారామయ్య. కొడుకు మరోమాట మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా గదిలోనుండి ఇవతలకి వచ్చేశాడు.

కొడుకు ‘ఆ ప్యాకెట్‌నుగాని తెరిచి చూశాడా?’ అన్న సందేహమే ఇప్పుడు సీతారామయ్యకి వచ్చింది. ఆయనకి వచ్చిన సందేహం యధార్థమే... జరిగింది అదే.

ప్రదీప్‌ని గత కొద్దికాలంనుండి ఏదో తెలియని అసంతృప్తి వెంటాడుతోంది. స్వంత ఇల్లు, కారు, బ్యాంక్‌ బ్యాలన్స్‌... జీవితంలో కోరుకున్నవి అన్నీ సాధించినా, వాటి తాలూకు ఆనందం మనసుని తాకడంలేదు. ఇవేవీకావు, ఇంకా... ఇంకా... ఏదో కావాలని ఆరాటం... ఏమిటది? ఏసీ గదిలో భార్యాపిల్లలు ఒళ్ళెరగకుండా నిద్రపోతున్నా, తనకిమాత్రం కంటిమీద కునుకురాక నిద్రలేమితో బాధపడేవాడు. దాని ప్రభావం

ఉద్యోగంమీద పడుతోంది. అసలు తన అసంతృప్తికి కారణం ఏమిటో తెలిస్తే కదా, పరిష్కారం గురించి ఆలోచించడానికి.

చిన్నప్పటినుండి ప్రదీప్‌ చదువులో ఫస్ట్‌.

ఇంటర్‌లో ర్యాంక్‌ వచ్చాక తనకిష్టమైన కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చేయాలని ఎంతో ఉబలాటపడ్డాడు. స్కూల్‌ టీచరైన తండ్రి తనకంత శక్తిలేదంటే అతి కష్టంమీద ఒప్పించి, తరతరాలనుండి వస్తున్న ఇంటిని తనఖా పెట్టించి ఇంజినీరింగ్‌ కోర్సులో చేరాడు. అన్ని సరదాలు చంపుకుని పుస్తకాలకే అంకితమైపోయాడు. ఇంజినీరింగ్‌లో కూడా ర్యాంక్‌ రావడం... అతడి మరో చిరకాలవాంఛ- అమెరికాలో ఉద్యోగం... అన్నీ చకచకా జరిగిపోయాయి.

తనఖా పెట్టించిన ఇంటిని విడిపించి, తన చదువుకోసం చేసిన అప్పులన్నీ తీర్చాడు. అంచెలంచెలుగా ఎదిగి మంచి పొజిషన్‌లోకి వచ్చాడు. ఆరంకెల జీతాన్ని తొలిసారిగా అందుకున్నప్పుడు ఎవరెస్ట్‌ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించినంత ఫీలింగ్‌... తనని ప్రాణాధికంగా ప్రేమించే భార్య మంజుల... ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు- రమ్య, సిద్ధార్థ... భార్యాభర్తలిద్దరి ఆర్జన... ‘జీవితంలో అనుకున్నవన్నీ సాధించాను. నాకింక లోటేమీలేదు’ అని భావించిన ప్రదీప్‌లో అసంతృప్తి అదృశ్యరూపంలో వెన్నాడటం మొదలయింది.

ఆరోజు... ఇండియా నుండి వచ్చిన ఇరవైరెండు నెలల తరవాత... అర్ధరాత్రి పన్నెండయ్యింది.

ఎప్పటిలాగానే నిద్రపట్టక బెడ్‌రూంలో పచార్లు చేస్తున్నాడు. భార్యాపిల్లలు ప్రశాంతంగా నిద్ర పోతున్నారు. బెడ్‌రూం నుండి రీడింగ్‌రూమ్‌లోకి వచ్చాడు. కాసేపు ఏదైనా మంచి సంగీతం విని రిలాక్సవుదామని క్యాసెట్‌ కోసం షెల్ఫ్‌ దగ్గరికి వచ్చాడు. ఎదురుగా ఇండియా నుండి తీసుకువచ్చిన గజల్‌ శ్రీనివాస్‌ పాటల క్యాసెట్‌ కన్పించింది. ఆ క్యాసెట్‌ తీస్తుండగా, షెల్ఫ్‌లో కన్పించింది తండ్రిచ్చిన ప్యాకెట్‌.

ఇండియా నుండి వచ్చిన తరవాత ఒకటి రెండుసార్లు ‘ఆ ప్యాకెట్‌ ఓపెన్‌చేసి చూద్దామా?’ అని అనిపించింది. కానీ తండ్రిమీద గౌరవంతో ఆ పని చేయలేక షెల్ఫ్‌లో అలా పడేశాడు. ఇప్పుడు తిరిగి కనబడేసరికి మళ్ళీ కుతూహలం మొదలయింది. ప్యాకెట్‌ చేతిలోకి తీసుకున్నాడు. ‘ఒక్కసారి తీసిచూస్తే’ అన్పించింది. కానీ తండ్రి చెప్పిన మాటలు జ్ఞాపకం రావడంతో ‘భావ్యం కాదు’ అనుకుని తిరిగి షెల్ఫ్‌లో పెట్టేయబోయి ఆగాడు. ‘తప్పేంటీ? ఎప్పటికైనా చూడమనేగా తండ్రి తనకిచ్చింది. చెప్పినదానికన్నా కొద్దిగా ముందు చూస్తున్నాడు... అంతేగా’ మనసుకి సంజాయిషీ ఇచ్చుకోవడానికి ప్రయత్నించాడు. క్షణాలు భారంగా గడుస్తున్నాయి. చివరికి అతనిలోని కుతూహలమే జయించింది.

‘నాన్నగారూ! మీ మాటను ఉల్లంఘిస్తున్నందుకు క్షమించండి’ అని మనసులోనే అనుకుని సీల్‌ చేసిన ఆ ప్యాకెట్‌ని ఓపెన్‌ చేశాడు. ‘తండ్రి అంతగా చెప్పాడంటే అందులో ఏదో విశేషమే ఉంటుంది’ అనుకుని ఆశపడ్డ ప్రదీప్‌కి తీవ్ర ఆశాభంగమే ఎదురైంది. ప్యాకెట్‌లో రెండు సీడీలూ ఒక లెటరూ ఉన్నాయి. అంతే... నిర్లిప్తత ఆవరించిన ప్రదీప్‌ అన్యమనస్కంగానే ఉత్తరం అందుకుని చదవసాగాడు.

‘‘బాబూ, దీపూ! మీ అందరికీ మా ఇద్దరి ఆశీస్సులు. ఈ ఉత్తరం నువ్వు చదివే సమయానికి నేనూ అమ్మా ఈ లోకంలో ఉండమని మాకు తెలుసు. మృత్యువు తాను వచ్చేముందు ఎటువంటి హెచ్చరికలూ చేయకుండా సడెన్‌గా వచ్చేయవచ్చు. మా మరణవార్త తెలిసిన తరవాత నువ్వెంత ఆఘమేఘాల మీద పరిగెత్తుకు రావాలనుకున్నా, ఆఫీసులో సెలవు దొరికి, ఫ్లైట్‌లో సీటు దొరికి ఇక్కడికి వచ్చేసరికి మా చితాభస్మమే తప్ప, మా భౌతికకాయాలను ఆఖరిసారిగా చూసే అవకాశం కూడా నీకు లేకపోవచ్చు. మరణించేముందు ప్రతీ తల్లికీ తండ్రికీ తమ సంతానానికి ఏదో చెప్పాలని తాపత్రయం... ఉబలాటం. దానికి మేం కూడా అతీతులేంకాదు. కానీ ఆ అవకాశం మాకులేదు. ఎలా..? ఒకసారి టీవీలో ‘మాయాబజార్‌’ సినిమా చూస్తున్నా. ఎప్పుడో యాభై ఏళ్ళనాటి సినిమా. అందులో నటించిన యస్వీఆర్‌, యన్టీఆర్‌, సావిత్రి, రేలంగి... వీళ్ళల్లో ఎవ్వరూ ఈనాడు లేరు. అయినా వారి నటనాకౌశలాన్ని ఈనాడు మనం చూడగలుగుతున్నాం. ఆనాటి ఘంటసాల గానం ఈనాటికీ మన గుండెలోతులను స్పృశిస్తోంది. దీన్ని గురించే ఆలోచిస్తుంటే హఠాత్తుగా ఒక ఆలోచన స్ఫురించింది. మనం మరణించాక మన పిల్లలు మనల్ని చూడాలనుకుంటే ఫొటోలే ఆధారం. లేదా వాళ్ళ పెళ్ళి వీడియో చూస్తున్నప్పుడు వాళ్ళ పిల్లలకు ‘అదిగోరా మీ తాతయ్య... అదిగో మీ నాన్నమ్మ...’ అని చూపిస్తారు. అంతేగా! కానీ మా కంఠస్వరాలు వినలేరు కదా! ఎప్పుడో ఏళ్ళనాటి సినిమా ఇప్పుడు కూడా చూడగలుగుతున్నప్పుడు, వాళ్ళ మాటలూ పాటలూ వినగలుగుతున్నప్పుడు, మరణించిన తల్లిదండ్రుల మాటలు మాత్రం ఎందుకు వినలేం?

నా సమస్యకి పరిష్కారం లభించింది. దాని ఫలితమే ఈ సీడీలు. మేము లేకపోయినా మా రూపం, మా మాట నీముందుంటుంది. అమ్మానాన్నలను చూడాలని ఉందా? మరి ఆలస్యం దేనికీ?

సీడీలు చూడూ...

ఇట్లు

నీ నాన్న’’

విపరీతమైన సంభ్రమాశ్చర్యాలకు లోనైన ప్రదీప్‌ ఉత్తరాన్ని మడిచి, ‘అమ్మ’ అని లేబుల్‌ అంటించిన సీడీ తీసి, డి.వి.డి.ప్లేయర్‌లో పెట్టి స్విచ్‌ ఆన్‌ చేశాడు.

తలలో పూలు, నుదుట రూపాయి కాసంత బొట్టు, పట్టుచీర, చేతులనిండా గాజులు... మూర్తీభవించిన ముత్తైదువ రూపంలో చిరునవ్వు వెన్నెలలు కురిపిస్తూ అమ్మ...

‘బాబూ, దీపూ... మీ నాన్నగారు- అబ్బాయితో ఏమన్నా మాట్లాడు’ అన్నారు. ‘ఏం మాట్లాడనురా కన్నా? దీపూకి నా మాటకంటే పాటే ఇష్టం. నా పాటే వినిపిస్తాను’ అన్నాను. ‘మరి నా పాట వింటావా?’ వైదేహి అడుగుతోంది ప్రదీప్‌ని.

అవును... అమ్మ అద్భుతంగా పాడుతుంది. సంగీతంలో డిప్లొమా చేసింది. రేడియో ఆర్టిస్ట్‌ కూడానూ. తను అమ్మ దగ్గరేగా సంగీతం నేర్చుకుంది? అమ్మంత గొప్పగా కాకపోయినా, తనుకూడా బాగానే పాడగలడు. స్కూలు, కాలేజీ, యూనివర్శిటీ... పాటల పోటీలలో ఎప్పుడూ ప్రథమస్థానం తనదే. దానికి కారణం అమ్మపెట్టిన సంగీత భిక్ష. ఇప్పుడీ యాంత్రిక జీవితంలో పడిన తరవాత తనకి సా...పా...సా వచ్చునన్న సంగతే మర్చిపోయాడు. ఆలోచనలనుండి తేరుకుని స్క్రీన్‌ వంక చూశాడు.

పూజా మందిరంలో దేవుని ముందు కూర్చుని వైదేహి ‘ఎందరో మహానుభావులు’ కీర్తన ఆలపిస్తోంది. తరవాత ‘నగుమోము కనలేని’ కీర్తన... అలా వరసగా త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామాశాస్త్రి కీర్తనలు... హాలులో నటరాజ విగ్రహం ముందు కూర్చుని తంబుర మీటుతూ ‘కట్టెదుట వైకుంఠము కాణాచైన కొండ’ అంటూ అన్నమయ్య కీర్తనతో మొదలుపెట్టి, రామదాసు, పురందరదాసు కీర్తనలు... పెరట్లో పూలమొక్కల మధ్య విహరిస్తూ శ్రీరంగం గోపాలరత్నం పాడిన ‘అమ్మదొంగా! నిన్ను చూడకుంటే నాకు బెంగ’ వంటి

లలితగీతాలు పాడుతూ...

సంగీతామృత జలపాతంలో నిలువెల్లా తడిసిముద్దయిపోతూ ఉక్కిరిబిక్కిరైపోతున్న ప్రదీప్‌కి వూపిరి పీల్చడమే కష్టమైపోతోంది. హృదయంలో ఏవేవో ప్రకంపనలు... అమ్మ పాడుతున్న ఆ పాటలన్నీ తనకీ వచ్చు... అమ్మేగా నేర్పిందీ..? పసితనంలో ఒళ్ళొ కూర్చోబెట్టుకుని మాతృమూర్తిలా... ఎదిగిన తరవాత ఒక గురువులా ఎన్ని పాటలు నేర్పిందీ? ఏవీ ఆ పాటలూ... ఏవీ ఆ మధురానుభూతులూ..? సీడీ పూర్తయ్యేసరికి మనసులో తీవ్రమైన సంఘర్షణ... స్నానం చేసినట్టు స్వేదంతో శరీరమంతా తడిసిపోయింది. వణుకుతున్న చేతులతో ‘నాన్న’ అన్న లేబిల్‌ అంటించి ఉన్న రెండో సీడీని ప్లేయర్‌లోపెట్టి ఆన్‌ చేశాడు. మల్లెపూవులాంటి పంచె, లాల్చీ ధరించిన సీతారామయ్య చిరునవ్వులు చిందిస్తూ కుర్చీలో కూర్చుని ఉన్నాడు.

‘‘దీపూ... బాగున్నావురా బాబూ? ‘నాన్న ఏం చెబుతారులే- ధర్మపన్నాలూ నీతిబోధలూ చేసి ఉంటారు’ అనుకుంటున్నావు కదూ. అవన్నీ చెప్పడానికి నేనెవరినిరా? ఎవరి వ్యక్తిగత జీవితాలు వారిష్టం. అవతలివారు కోరుకున్నట్లు తానుండలేని మనిషి, ఎదుటివారు మాత్రం తాను కోరుకున్నట్లు ఉండాలనుకోవడం అజ్ఞానం కాక మరేమిటి? అయినా ఇంత వయసు వచ్చిన నీకు మరొకరి సందేశాలూ హితబోధలూ అవసరమా? మరి నీకు ఏం చెప్పాలి? ఆ... లోకంలో సంపదనంతా గుమ్మరించినా కాలచక్రంలో ఒక్క క్షణాన్ని కూడా వెనక్కి తిప్పలేరన్న సంగతి నీకు తెలియంది కాదు. అవునా? అందుకే నిరుపయోగమైన సందేశాలకంటే మధురమైన నీ బాల్యస్మృతులు ఒక్కసారి నీకు జ్ఞప్తికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. మాతో కలిసి పంచుకున్న ఆ అనుభూతులు నీ కళ్ళముందే కదలాడుతుంటే నీ స్మృతిపథంలో మేం కనీసం ఆ కొన్ని క్షణాలైనా తిరిగి సజీవులౌతామేమోనన్న చిన్న ఆశ. దీపూ... నీకు గుర్తుందా..?’’ అంటూ సీతారామయ్య ప్రదీప్‌ చిన్ననాటి సంగతులు ఒక్కొక్కటీ చెప్పనారంభించాడు...

పదినెలల వయసులో అతి కష్టంమీద లేచినిలబడి అడుగులు వేయడం... తండ్రి ‘ఒకటి, రెండు, మూడు’ అంటూ లెక్కపెట్టడం... నాలుగు అడుగులువేసి పడిపోతే తల్లి కంగారుగా ఎత్తుకోబోతూ ఉంటే, తండ్రి వారించడం... అల్మారాలో ఉంచిన అటుకుల డబ్బాకోసం తల్లి చూడకుండా కుర్చీని కష్టంమీద లాక్కొచ్చి డబ్బా అందుకోబోతే, మూతలేని డబ్బా జారి అటుకులు మొత్తం నెత్తిమీదగా తలంబ్రాల్లా పడటం... తండ్రి మెడచుట్టూ చేతులువేసి ఉప్పుమూటలా వూగుతూ- వేమన, సుమతీ శతకాలలోని పద్యాలు నేర్చుకోవడం... ఇంటిపని చేసుకుంటూ తల్లి పాడుతూ ఉంటే, వచ్చీరాని మాటలతో వంతపాడాలని ప్రయత్నించడం... రెండోక్లాస్‌ చదువుతున్నప్పుడు రోడ్డుమీద దొరికిన రోల్డ్‌గోల్డ్‌ గుళ్ళగొలుసులో ఒక పూస పట్టుకొచ్చి ‘అమ్మా! నీకోసం బంగారం పట్టుకొచ్చా’ అంటే, తల్లిదండ్రులు పగలబడి నవ్వడం... అదిచూసి బుంగమూతి పెట్టుకుని ‘పో అమ్మా, నీకోసం ఎంతో కష్టపడి తెస్తేనూ...’ అంటున్న ప్రదీప్‌ అమాయకత్వానికి తల్లి అక్కున

చేర్చుకుని ముద్దాడటం... తండ్రి ఒళ్ళొ కూర్చోబెట్టుకుని ‘ల, ళ, ర, ఱ, శ, ష, స’ అక్షరాలు స్పష్టంగా పలికే విధానం నేర్పించడం... నాలుగో తరగతి చదువుతున్నప్పుడు ఆటల్లో చెయ్యి విరక్కొట్టుకుంటే, ‘అసలే డబ్బుకి ఇబ్బందిగా ఉందనుకుంటే, మళ్ళీ ఇప్పుడు వెయ్యి రూపాయలు ఖర్చు; నాన్న ఎక్కడ్నించి తెస్తారు?’ అని తల్లి మందలిస్తే, ప్రదీప్‌ చిన్నబుచ్చుకున్న మొహంతో తండ్రి దగ్గరకొచ్చి ‘నాన్నా, అమృతాంజనం రాసుకుని కాపడం పెట్టుకుంటా, అదే తగ్గిపోతుంది. డాక్టరు దగ్గరికి వద్దు’ అని అంటే- తండ్రి కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగి ప్రదీప్‌ని దగ్గరకు తీసుకోవడం... రేపు సెవెన్త్‌క్లాస్‌ పబ్లిక్‌ పరీక్షలనగా, వీధిలో పిల్లలు ఆడుకుంటున్న క్రికెట్‌ ఆటని ప్రదీప్‌ చూస్తుండగా, క్రికెట్‌బంతి వచ్చి ప్రదీప్‌ మోకాలిచిప్పకు బలంగా తగిలి, మోకాలు బత్తాయిపండు సైజులో వాచిపోతే, పరీక్షకి వెళ్ళలేనేమోనని ప్రదీప్‌ ఏడుస్తుంటే, తండ్రి రిక్షాలో స్కూల్‌కి తీసుకెళ్ళి, అక్కడినుండి పరీక్ష రాసేగదికి రెండు చేతులతో ఎత్తుకెళ్ళి పరీక్ష రాయించడం...

ఇలా ఒకటేమిటి, సీతారామయ్య ప్రదీప్‌ చిన్ననాటి సంఘటనలు ఒక్కొక్కటీ వివరించి చెబుతూ ఉంటే, ఒక్కొక్క సంఘటనా, ఒక్కొక్క మిస్సైల్‌లా ప్రదీప్‌ గుండెల్లోకి దూసుకుపోతున్నాయి. సీడీ పూర్తయ్యేసరికి ప్రదీప్‌ ఒక కంటినుండి నయాగరా, మరో కంటినుండి శివసముద్రం జలపాతాలు. కంట్రోలు చేసుకోవడం అతని శక్తికి మించిన పనే అయింది.

ఏమిటా కన్నీళ్ళకి అర్థం? వేదనాభరితమైన హృదయం కార్చిన కన్నీరా? సీడీ మొత్తంలో తండ్రి ఎక్కడా కూడా ప్రదీప్‌ని మందలించలేదు... విమర్శించలేదు... హితబోధలు చేయలేదు.

మరి ఎందుకీ కన్నీరు? అవి... ఆనందబాష్పాలా? కాదు... యాంత్రికజీవనం, కృత్రిమత్వంతో హృదయంలో నిర్మించిన ఆనకట్ట, మానవ అనుబంధాలనే వరదతాకిడికి బద్దలై, అనురాగం, అభిమానం, ఆత్మీయతా ఆప్యాయతా వంటి కెరటాలు ఉవ్వెత్తున ఎగసి గుక్కతిప్పుకోనివ్వకుండా, వూపిరందకుండా చేస్తున్నప్పుడు కలిగే భావన అది. అక్షరాలకు అందని అనుభూతి అది.

అలా ఎంతసేపు వెక్కివెక్కి ఏడ్చాడో ప్రదీప్‌... చాలాసేపైన తరవాత, కొద్దిగా తేరుకుని, మనసు కంట్రోల్‌ చేసుకోవడానికి ‘గజల్‌ శ్రీనివాస్‌’ పాటల క్యాసెట్‌ టేప్‌రికార్డర్‌లో పెట్టి స్విచ్‌ ఆన్‌ చేశాడు.

‘‘ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చేయ్‌

నా సర్వస్వం నీకిస్తా నా బాల్యం నాకిచ్చేయ్‌...’’

టేప్‌లో గజల్‌ శ్రీనివాస్‌ గొంతు మధురంగా విన్పిస్తోంది. ‘ఎంత కోఇన్సిడెన్స్‌... నాన్న చెప్పిన బాల్యం సారాంశం ఒక్క పాటలో కళ్ళముందుంచాడు... పాదాభివందనం శ్రీనివాస్‌’ అనుకుంటున్న ప్రదీప్‌ మెదడులో తటిల్లంటూ మెరిసింది ఒక పెద్దమెరుపు. తనని ఇంతకాలం పీడిస్తున్న అసంతృప్తికి మూలమేమిటో తెలిసింది.

మానవ సంబంధాల లేమితో తను బాధపడుతున్నాడు... యస్‌... కమ్యూనికేషన్‌ గ్యాప్‌...

ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో ఉపద్రవం ముంచుకొస్తున్నట్టూ ఎవరో భయంకరమైన వేటకత్తి తీసుకుని చంపడానికి వస్తున్నట్టూ ఉరుకులు పరుగులు... కేర్‌టేకర్‌కి పిల్లల్ని అప్పగించి తనో దిక్కుకూ తన భార్యో దిక్కుకూ మారథాన్‌ రన్నింగ్‌. అలసిన శరీరాలతో ఏ రాత్రికో ఇల్లు చేరటం, ఏదో తిన్నామన్న పేరుకి అన్నం మెతుకులు కతికి, ఎప్పుడు పక్కమీదకు చేరి విశ్రాంతి తీసుకుందామా అన్న ఆరాటం... మొక్కుబడి పలకరింపులు...

అతికించుకున్న ప్లాస్టిక్‌ చిరునవ్వులు... తమ ధనవ్యామోహాన్ని కప్పిపుచ్చుకుంటూ ‘ఇదంతా సంతానం ఉజ్వల భవిష్యత్‌ కోసమే’నంటూ ఆత్మవంచన స్టేట్‌మెంట్స్‌... వీకెండ్‌కి అందరూ కలసి ఎక్కడికన్నా వెళ్తే, ఈ ఆరురోజులు కలిసిలేమన్న బాకీ తీరిపోయినట్లు కృత్రిమ ఆత్మసంతృప్తి... తల్లిదండ్రులకూ పిల్లలకూ మధ్యగానీ భార్యాభర్తల మధ్యగానీ కరువైపోయిన ఆప్యాయతా ఆత్మీయతా.

తన అసంతృప్తికి కారణం తెలిసిన తరవాత ప్రదీప్‌కి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ‘ఏ తల్లీతండ్రీ ఇస్తారు తమ సంతానానికి ఇంతటి అపురూపమైన కానుక... పరుషంగా ఒక్కమాట కూడా అనకుండా తాను జీవితంలో కోల్పోతున్నదేమిటో తన తండ్రి ఎంత తెలివిగా చెప్పాడు’ అనుకున్నాడు. సమస్యేమిటో తెలిశాక పరిష్కారం కనుక్కోవడం పెద్ద కష్టమేమీకాలేదు.

అప్పటికే తెల్లవారిపోయింది. భార్య లేచిన తరవాత ‘‘నేనివ్వాళ ఆఫీసుకి సెలవు పెట్టేస్తున్నాను. నువ్వూ సెలవు పెట్టేయ్‌’’ అన్నాడు.

‘‘ఎందుకూ?’’ ఆశ్చర్యంగా అడిగింది మంజుల.

‘‘చెబుతాగా’’ అన్నాడేగానీ వివరాలు చెప్పలేదు. స్నానం, టిఫిన్‌ కానిచ్చి, కొలీగ్‌కి తన సెలవు గురించి చెప్పి, తండ్రిచ్చిన సీడీలూ ఉత్తరం భార్య చేతిలోపెట్టి తాను మంచమెక్కాడు ప్రదీప్‌. పడుకున్న వెంటనే పట్టేసింది నిద్ర. చాలాకాలం తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాడు. తిరిగి మధ్యాహ్నం ఒంటిగంటకు లేచాడు. భార్యవంక చూశాడు. మంజుల మొహం బాగా ఏడ్చినట్లు ఉబ్బి కళ్ళు ఎర్రబారి ఉన్నాయి.

‘‘మనం... మనం... ఇండియా వెళ్ళిపోదామండీ!’’ భోజనం చేస్తున్న ప్రదీప్‌ మీద చెయ్యివేసి అంది మంజుల. తన నిర్ణయాన్ని చెప్పేముందు భార్యని మానసికంగా సిద్ధంచేయాలన్న తలంపుతో, సీడీలు చూడమని చెప్పిన ప్రదీప్‌, తన నిర్ణయమే భార్య నోటివెంట వెలువడేసరికి ఆశ్చర్యంతో తలమునకలవుతూ తలాడించాడు. సీడీలోని పాత్రలూ సంఘటనలూ వేరుకావచ్చు... కానీ అనుభూతి ఒక్కటేగా!

‘‘ఇండియా వెళ్ళిన తరవాత నేను నా పిల్లలకి తల్లిగా, నా భర్తకు భార్యగా ఉండదలచుకున్నాను. ఏటియం మిషన్‌లా కాదు. అందుకే ఉద్యోగం చేయదలచుకోలేదు’’ అంది మంజుల భర్తని ఇంకా ఆశ్చర్యపరుస్తూ.

ఫారిన్‌లో జాబ్‌ చేస్తున్న ప్రదీప్‌కి ఇండియాలో జాబ్‌ రావడం కష్టంకాలేదు. జీతం అక్కడకంటే తక్కువే అయినా భార్యాభర్తలకది బాధ అనిపించలేదు.

ఇండియా వచ్చాక హైదరాబాద్‌లోనే ఆఫీసుకి దగ్గర్లో ఫ్లాట్‌ తీసుకోవాలనిపించినా, మళ్ళీ వద్దులే అనుకుని, దూరమైనా తల్లిదండ్రుల అభిరుచులకు అనుగుణంగా తమ స్వంత ఇంటినే రీమోడల్‌ చేయించాడు.

ఆరోజు ఆఫీసులో వర్క్‌ త్వరగా పూర్తికావడంతో ప్రదీప్‌ ఇంటికి త్వరగా వచ్చేశాడు. అప్పుడు సాయంత్రం అయిదున్నర అవుతోంది.

అరుగుమీద వాలుకుర్చీలో పడుకున్న సీతారామయ్య పొట్టమీద కూర్చున్న రమ్య, తాతయ్య చెబుతున్న ‘అల్పుడెపుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను’ పద్యాన్ని వల్లెవేస్తోంది. ఆ దృశ్యాన్ని తన్మయత్వంతో చూస్తున్న కొడుకుని చూసి చిన్నగా నవ్వుకున్నాడు

సీతారామయ్య.

తన గదిలోకి వెళ్ళి డ్రెస్‌ మార్చుకుని హాల్‌లోకి వచ్చాడు ప్రదీప్‌. వంటగదిలో మంజుల ఉల్లిపాయ పకోడి చేస్తున్నట్లుంది. ఘుమఘుమల వాసన ముక్కుని అదరగొట్టేస్తుంది. హాలులో స్తంభానికి చేరగిలబడి వైదేహి కూర్చొనుంది. ఆమె ఒడిలో తలపెట్టుకుని సిద్ధార్థ పడుకుని నాన్నమ్మ పాడుతున్న రామదాసుకీర్తన చెవులప్పగించి వింటున్నాడు.

‘‘ఇరవుగ నిసుకలోన బొరలిన యుడుతభక్తికి

కరుణించి బ్రోచితివని నెరనమ్మితి నిన్నే తండ్రి

పలుకే బంగారమాయెరా’’

‘ఇన్ని సంవత్సరాలు గడిచినా అమ్మ గొంతులో శ్రావ్యత అలానే ఉంది’ అనుకుంటూ మెల్లిగావచ్చి తల్లి ఒడిలో రెండోవైపు తలపెట్టి పడుకున్నాడు. పాలసంద్రమైపోయింది మనసు. ఎంత హాయి అమ్మ ఒడి... ఈ సంతృప్తిముందు తాను అమెరికాలో తొలిసారిగా ఆరంకెల జీతం అందుకున్నప్పటి తృప్తి మేరుపర్వతం ముందు ఇసుక

రేణువులా అన్పించింది. ఆ ఆనందంలో అప్రయత్నంగా తల్లి గొంతుతో శృతి కలిపాడు.

‘‘ఎంతో వేడిన నీకు సుంతైన దయరాదు

పంతంబుసేయ నేనెంతటి వాడను తండ్రీ

పలుకే బంగారమాయెరా!’’

భర్తకి ప్లేట్‌లో పకోడీలు పట్టుకొచ్చిన మంజుల అక్కడి దృశ్యం చూసి అలాగే నిలబడిపోయింది.

💐💐🌹🌹💐💐

శ్వేతర్కం (తెల్ల జిల్లేడు ) -

 శ్వేతర్కం (తెల్ల జిల్లేడు ) -


తెల్ల జిల్లెడు దూదితో ఇప్పనూనే తో 5 దీపాలు చేసి 5 వారాలు వెలిగిస్తే ఆంజనేయస్వామి ప్రసన్నలవుథారు . దీని పూలతో శివపుజ, ఆకులతో  సుర్యపుజ దీని సమిధాలతో  సుర్యహోమం చేస్తారు. దీనివేరు తవ్వి తీసుకొనిరావడం ఆదివారం, గురువారం లలో  పుష్యమి నక్షత్రం రోజున మంచిది.


వేరు తీసే విధానం.- 


* ముందుగా చెట్టు గుర్తుఉంచుకోవాలి .

* ఏ రోజున శ్వేతార్కం ఆది, గురు , పుష్యమి నక్షత్రాలు కలిసిన రోజుకి ముందుగా రహస్యంగా (వెరు తీసుకొస్తున్నట్టు ఎవ్వరికి తెలియకూదదు) .

* చెట్టు వద్దకు సాయంకాలం వెళ్ళాలి. వెళ్ళేప్పుడు ఎర్రటిధారం , సింధూరం , నీరు ,అగరవత్తులు అగ్గిపెట్ట తీసుకొని వెల్లాలి.

* చెట్టు దగ్గర తూర్పు ఈశాన్య దిశలలో  ఎటువైపున నిల్చొని  చెట్టుని గణపతిగా భావించి నమస్కరించి చెట్టు మొదలులో నీరుపోసి , సిందూరం సమర్పించి దూపం వెలిగించి ఎర్రని దారాన్ని చెట్టుకి కట్టి ప్రార్ధించాలి.


ప్రార్ధన - 

 

హే గణపతి ప్రభో , శ్వేతర్క దేవా  నా కార్యసిద్ధికై  రేపు నిన్ను తీసుకుని వెళ్ళడానికి వస్తాను. దయతో మీరు నా కార్యం సిద్ధించే నిమిత్తం నాతో రావలసిందిగా ప్రార్ధిస్తున్నాను. అంటూ నమస్కరించి తిరిగివచ్చి రాత్రి ఒంటరిగా పడుకోవాలి.


తెల్లవారుజామున  లేచి స్నానం చేసి శుబ్రమైన వస్త్రం, తవ్వడానికి చిన్న సాధనం తీసుకుని చెట్టు వద్దకు వెళ్లి తుర్పు ,ఉత్తర దిశలలో ఎటైన నిలుచొని నమస్కరించి గణపతి మంత్రం చదువుతూ జాగ్రత్తగా వెరు తవ్వి తీయాలి . ఒకవేళ వేరు మధ్యలో విరిగినా దాన్ని జగ్రత్తగా వస్త్రం లొ చుట్టి ఇంటికి తీసుకురావాలి.


మంత్రాలు - 

                  ఓం గం గణపతయే నమః.

                  ఓం గ్లౌం గణపతయే నమః.


అదృష్టం ఉంటే వేరు అచ్చం గణపతిలా లబించొచ్చు.


పూజా విదానం - శ్వేతార్కం ని శుద్ధజలం లొ కడిగి శుబ్రమ్ గా తుడిచి ఆసనం పైన ఎర్రటి వస్త్రం పరిచి దానిపైన పెట్టలి. ఎర్రచందనం పౌడర్ , ఎర్రకుంకుమ, పసుపు, గంధం పొడి ,సిందూరం, పువ్వులు , అక్షింతలు తో పూజించాలి.


సిద్ది, బుద్ధి, ఐశ్వర్యం కోరేవారు  పైన చెప్పిన మంత్రాలలో 2 వ మంత్రం చదువుతూ పైన చెప్పిన వస్తువులు వేసి పుజించాలి. దూప దీపాలు సమర్పిస్తూ గణపతికి నైవేద్యం గా కుడుములు, ఉండ్రాళ్ళు, లడ్లు సమర్పించాలి. ఇది అయినతర్వాత  కనీసం 1116 సార్లు పైమంత్రం జపం చేసి హోమగుండం లొ నెయ్యి, పంచదార, నువ్వులు, జొన్నలు లెదా గోధుమలు గాని కలిపి పై మంత్రం తో హొమం చేయాలి. కనిసం జపసంక్యలొ దశాంశం అనగా 10% హొమం జరగాలి. ఇదైన తర్వాత వీబూది శ్వేతర్కములం పై రాసి దానిని పుజాస్థానం లొ పెట్టి దూప దీప నైవేద్యాలు అర్పించాలి. (వీబుధి హోమాగుండం లోని ధి) .


ఉపయొగాలు -

 

* శ్వేతార్కం ఇంట్లో ఉంటే సాక్షాత్తు గణపతి ఇంట్లో ఉన్నట్టే.

* ధన, ధన్య  సమృద్ది పెరుగుతుంది. వ్యాపారం అభివృద్ది. అది ఎలా శాకోపశాకలుగా పెరుగునో  వ్యాపారం అలా పెరుగును.

* విద్యార్ధులు రాణిస్తారు.

* సర్వకార్యాలు జయప్రదం అవుతాయి.

 

ఎలాంటి పరిస్థితులలోను నిరాదరణ చేయకూడదు... 


       ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

సప్తమోక్ష క్షేత్ర యాత్ర*

 *భారత్‌ గౌరవ్‌ సౌత్‌ స్టార్‌ రైల్‌*

*మహాలయ పక్షాల్లో సప్తమోక్ష క్షేత్ర యాత్ర*


*సెప్టెంబర్‌ 15వ తేదీ నుంచి 29వ తేదీ వరకు*


మహాలయ పక్షాల్లో సప్తమోక్ష క్షేత్రాలను దర్శిస్తూ, పితృ తర్పన చేసే అద్భుత అవకాశం


ఈ రైలు...

## ప్రయాగ త్రివేణి సంగమ స్నానం, మాధవేశ్వరీ శక్తిపీఠం

## గయ - విష్ణుపాద టెంపుల్‌, మాంగళ్యగయ శక్తిపీఠం, బోథ్‌గయ 

## సంపూర్ణ కాశీ దర్శనం

## అయోధ్య - శ్రీరామాలయ దర్శనం

## మధుర - ప్రేమమందిరం, కాత్యాయని శక్తిపీఠం

## మాతృగయ - సిద్ధాపూర్‌

## ద్వారక - శ్రీకృష్ణాలయం - బెట్‌ ద్వారక, రుక్మిణీ మందిరం

## నాగేశ్వర జ్యోతిర్లింగం

## సోమనాథ్‌ జ్యోతిర్లింగం

## ఉజ్జయని మహా కాళేశ్వర జ్యోతిర్లింగం, మహంకాళి శక్తిపీఠం, హర్‌సిద్ధిమాత శక్తిపీఠం

## ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం


ఐదు జ్యోతిర్లింగాలు - ఏడు శక్తిపీఠాలు - 8 పుణ్య నదులు సందర్శన


2024 సెప్టెంబర్ 15న చెన్నైలో బయలుదేరి మార్గమధ్యలో గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, మిర్యాలగూడ, సికింద్రాబాద్‌, కాజిపేట, స్టేషన్లలో ఆగి ప్రయాణికుల్ని ఎక్కించుకొనే అవకాశం కలదు.


*వసతులు*

1. రైలులోని అత్యాధునిక  కిచెన్‌లో భోజనం తయారీ 

  a) ఉదయం: కాఫీ/టీ/పాలు/ అల్పాహారం

  b) మధ్యాహ్నం: రుచికరమైన బ్రాహ్మణ భోజనం

  c) సాయంత్రం: స్నాక్స్‌ /టీ/కాఫీ/పాలు

  d) రాత్రి: అల్పాహారం (వంటల్లో ఉల్లి, వెల్లుల్లి నిషిద్ధం)


2.AC క్లాస్‌ వారికి AC రూమ్‌లు, స్లీపర్ తరగతుల వారికి NON AC STANDARD రూములు ఇవ్వబడును.


3. రైలు నుంచి క్షేత్రాలకు, తిరిగి రైల్వే స్టేషన్‌కు ప్రత్యేక బస్సులు ఏర్పాటు


4. రైలులో లగేజీకి ప్రత్యేక భద్రత (లగేజీ రైలులో ఉంచి సందర్శనకు వెళ్ళి వచ్చే సదుపాయం)


5. ఈ రైలులో ప్రయాణించే వారికి ప్రయాణ ఇన్స్యూరెన్స్‌ వర్తించును.


6. సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగులకు ''LTC'' వర్తించును.


7. బెర్తుల కేటాయింపు,  రైల్వేసిగ్నల్‌ Indian Raiwaysవారి ఆదేశానుసారం జరుగును.


8. మీరు క్షేత్ర సందర్శనకు వెళ్ళినప్పుడు మీరు బస చేసిన హోటల్‌ యొక్క విజిటింగ్‌ కార్డు దగ్గర పెట్టుకొని వెళ్ళవలెను.



*బుకింగ్‌ విధానం*


1. ఆధార్‌ కార్డు పంపించాలి.


2. బెర్త్‌ రిజర్వేషన్‌ కొరకు ముందుగా రూ. 10,000/-లు చెల్లించాలి


3. బుకింగ్‌ సమయంలో మీ నామినీ పేరు, వారి ఫోన్‌ నెంబరు పంపించాలి


4. జూలై 15 నాటికి మిగిలిన మొత్తంలో 50 శాతం, ఆగస్టు 15 నాటికి మిగతా 50 శాతం చెల్లించాలి


5. టిక్కెట్‌ కాన్సిలేషన్‌కు ఆగస్టు 15 ఆఖరు తేదీ, తదుపరి పేరు మార్పుకు అవకాశం కలదు.


ఆగస్టు 15 లోపు కాన్సిలేషన్‌ చేసుకున్న వారికి 15 శాతం మినహా, మిగిలిన మొత్తం రిఫండ్‌ ఇవ్వబడును


ఈ ప్రత్యేక రైలులో స్లీపర్ క్లాస్, 3rd AC, 2nd AC, 1st AC టిక్కెట్లు అందుబాటులో కలవు


ఈ 15 రోజుల యాత్రకుగాను ఒక్కరికి

@@  స్లీపర్ క్లాస్ ......Rs. 42,500/-

@@ 3rd AC.......Rs. 53,500/-

@@ 2nd AC.......Rs. 62,500/-

@@ 1st AC.......Rs. 70,500/-


బుకింగ్ కొరకు సంప్రదించండి

రమేష్‌ అయ్యంగార్‌

91600 21414,91600 91414


https://www.traintour.in/వెబ్‌ సైట్ ద్వారా కూడా టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చును.

(వెబ్‌ సైట్‌ ద్వారా బుకింగ్‌ చేసుకోగోరే వారు మొత్తం అమౌంట్‌ ఒకేసారి చెల్లించవలెను)

ద్వాదశ జ్యోతిర్లింగాలు

 హరిఓం  ,                                  -                                           ద్వాదశ జ్యోతిర్లింగాలు,.....

12 రాశులు కూడా ........

 రాశికి సరిపడిన జ్యోతిర్లింగమేదో తెలసుకొందాము..........


మేషం       -   రామేశ్వరం    -  తమిళనాడు

వృషభం    -   సోమనాథ్     -  గుజరాత్

మిధునం   -   నాగేశ్వరం     -  గుజరాత్

కర్కాటకం -   ఓంకారేశ్వరం -  మధ్యప్రదేశ్

సింహం     -   వైద్యనాథ్      -  ఝార్కండ్ 

కన్య         -   శ్రీశైలం           -  ఆంధ్ర ప్రదేశ్

తుల        -   మహాళేశ్వరం -  మధ్యప్రదేశ్

వృశ్చికం   -   ఘృష్ణేశ్వరం   -  మహారాష్ట్ర

ధనుస్సు   -  విశ్వేశ్వరం     -  కాశి

మకరం     -  భీమశంకరం   - మహారాష్ట్ర

కుంభం     -  కేదారేశ్వరం    - ఉత్తరాఖండ్

మీనం       - త్రయంబకేశ్వరం - మహారాష్ట

తెలుసుకుందాం.........

రాశికొక జ్యోతిర్లింగం

మేషరాశి వారికి పూజనీయమైన జ్యోతిర్లింగం రామేశ్వరం. మేషరాశి కుజునికి స్వగృహం. చరరాశి వారికి పదకొండవ రాశ్యాధిపతి శని బాధకుడు. గ్రహపీడా నివారణార్థం రామేశ్వర తీర్థ యాత్ర, సుత్రామ పర్ణీ జరరాషి యోగే, నిబధ్య సెతుం విశిఖైర సంఖ్యె శ్రీరామ చంద్రేన సమర్పితం త, రామేశ్వరాఖ్యం నియతం నమామి అనె శ్లోకం రోజూ చదువుకొవాలి. శ్రీరామచంద్రుడు శని బాధానివారణార్థం రామేశ్వర లింగాన్ని స్థాపించాడని ప్రతీతి.


వృషభరాశి వారి పూజాలింగం సోమనాథ జ్యోతిర్లింగం. ఈ రాశి శుక్రునికి స్వగృహం, చంద్రునికి ఉచ్ఛ రాశి. సోమనాథ జ్యోతిర్లింగం శ్రీకృష్ణుడు స్థాపించిన మహాలింగం. ఈ రాశివారు శనిదోష శాంతికి సోమనాథ దేవాలయ దర్శనం, సౌరాష్ట్ర దేశే విదేశేతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావసంతం, భక్తి ప్రాదానాయ క్రుపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే అనే శ్లోకధ్యానం చేయడం శుభప్రదం. ఈ రాశివారు జన్మ నక్షత్రంలో సోమనాథంలో రుద్రాభిషేకం చేయించుకుంటే మంచి ఫలితాలు పొందగలరు.


మిధునరాశి వారి జ్యోతిర్లింగం నాగేశ్వర లింగం. ఈ రాశి బుధునికి స్వగృహం. గ్రహదోషాలకు నాగేశ్వర పుణ్య క్షేత్ర దర్శన, రోజూ యామ్యే సదంగే నగరే తిరమ్యే విభ్శితాంగం వివిధైశ్చ భోగై, సద్భక్తి ముక్తి ప్రదమేకం, శ్రీనాగనాథం శరణం ప్రపద్యే అనే శ్లోకాన్ని పఠించడం, ఈ రాశిలో శని సంచారకాలంలో కైలాసయంత్రప్రస్తార మహాలింగార్చన జరిపిస్తే విశేష ఫలితాలు ఉంటాయి.


కర్కాటక రాశి వారికి ఓంకారేశ్వరలింగం పూజనీయ జ్యోతిర్లింగం. ఈ రాశి చంద్రునికి స్వగృహం. ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం, రోజూ కావేరికా నర్మదాయో పవిత్రే, సమాగమే సజ్జన తారణాయ, సడైవమాన్దాత్రు పురే వసంతం, ఓం కారమీశం శివమే మీడే అనే శ్లోకం పఠించడం, జన్మనక్షత్రం ఉన్న రోజు ఓంకార బీజాక్షరం జపించడం శుభకరం.


సింహరాశి వారికి పూజనీయమైన జ్యోతిర్లింగం శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం. సింహరాశి సూర్యునకు స్వగృహం. ఘృష్ణేశ్వర జ్యోతిర్లిగం దర్శనం, ఇలాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లసాంతం చ జగద్వ రేణ్యం, వందే మహాదారాతర స్వభావం, ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే అనే శ్లోకాన్ని నిత్యం పఠించడం ద్వారా సర్వదోషాల నుండి విముక్తులు కావచ్చు.


కన్యారాశి వారికి శ్రీశైల జ్యోతిర్లింగం పూజాలింగం. ఈ రాశికి అధిపతి బుధుడు. వీరు అన్నిరకాల బాధల నుండి ఉపశమనం పొందడానికి శ్రీశైల మల్లికార్జున దర్శనం, భ్రమరాంబకు కుంకుమ జన్మనక్షత్రం రోజున చండీ హోమం చేసుకోవాలి. శ్రీశైల శృంగే విభుధాతి సంగే తులాద్రి తుంగేపి ముదావసంతం, తమర్జునం మల్లిక పూర్వమేకం, నమామి సంసార సముద్ర సేతుం అనే శ్లోకాన్ని పఠించడం శ్రేయస్కరం.


తులారాశి వారికి పూజాలింగం మహాకాళేశ్వర లింగం. ఈ రాశికి శుక్రుడు అధిపతి. మహాకాళేశ్వర దర్శనం, శుక్రవారపు సూర్యోదయ సమయంలో ఆవన్తికాయం విహితావరం, ముక్తి ప్రధానాయ చ సజ్జనానాం, అకాల మ్రుత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం అనే శ్లోకాన్ని పఠించడం వల్ల అన్ని గ్రహదోషాల నుండి, బాధల నుండి విముక్తి పొందవచ్చు.


వృశ్చికరాశి వారికి వైద్యనాథేశ్వర లింగం పూజాలింగం. ఈ రాశికి కుజుడు అధిపతి, వృశ్చికం వైద్య వృత్తికి, శస్త్రచికిత్సలకి కారణభూతమైన రాశి. వైద్యనాథేశ్వరుని దర్శించడం, పూజించడం, మంగళవారం పూర్వోత్తరె ప్రజ్వాలికానిధానే, సాదావసంతం గిరిజాసమేతం, నురాసురారాదిత పాదపద్మం, శ్రీ వైద్యనాదం తమహం నమామి అనే శ్లోకాన్ని పఠించడం శ్రేయస్కరం.


విశ్వేశ్వరలింగం ధనూరాశివారి పూజాలింగం. ఈ రాశి వారికి గురుడు అధిపతి, సానందవనే వసంతం. ఆనందకందం హతపాపబృందం వారణాసీనాథ మనాథనాథం, శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే అనే శ్లోకాన్ని పారాయణ చేయడం, కాశీ క్షేత్ర దర్శనం, గురువారం రోజున, శనగల దానం ద్వారా శని, గురూ గ్రహదోషాల నుండి విముక్తి పొందవచ్చు.


భీమశంకర లింగం మకరం వారి పూజాలింగం. ఈ రాశి అధిపతి శని.ఇది గురునికి నీచ, కుజునికి ఉచ్ఛ, తెలిసో, తెలియకో చేసిన దోషాల నుంచి విముక్తికిగాను భీమశంకర దర్శనం, యం ఢాకినీ శాకినికాసమాజైః నిషేమ్యమాణం పిశితశనైశ్చ, సదైవ భీమాదిపద ప్రసిద్ధం, తం శంకరం భూతహితం నమామి అనే శ్లోకాన్ని పారాయణ చేయడం, శనివారం నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు దానం ఈవాడం, అవిటివారికి ముసలివారికి వస్త్ర దానం చేయడం మంచిది.


కుంభరాశి వారికి కేదారేశ్వర లింగం శేయోలింగం. ఈ రాశికి శని అధిపతి. గ్రహపీడలు, శత్రుబాధలు, ఇతర దోషాల విముక్తికిగాను ఈ రాశివారు కేదారేశ్వర దర్శనం. నిత్యం మహాద్రి పార్శ్వేచ మునీంద్రైః సురాసురై ర్యక్ష మహోరగాద్యైః కేదారమీశం శివమేక మీడే అనే శ్లోకాన్ని పారాయణం చేయాలి.శనివారం రుద్రాభిషేకం చేస్తే మంచిది.


త్ర్యంబకేశ్వర లింగం మీనరాశి వారి జ్యోతిర్లింగం. ఈ రాశి అధిపతి గురుడు. త్ర్యంబకేశరుడు ఎప్పుడూ నీటి మద్యలో ఉంటాడు. త్ర్యంబకేశ్వర దర్శనం, స్వామి చిత్రపటాన్ని పూజామందిరంలో ఉంచుకోవడం, నిత్యం సహ్యాద్రి శీర్షే విమలే వసంతం, గోదావరీ తీర పవిత్ర దేశే, యద్దర్శనాత్ పాతకమాశునాశం, ప్రయాతి తం త్ర్యంబక మీశ మీడే అనే శ్లోకాన్ని పారాయణం చేయటం సకల శుభాలను కలిగిస్తుంది.................


ఓం నమః శివాయ నమః

🙏🙏🙏🙏🙏🙏🙏                                -                                                             -          *సేకరణ*

అణువణువునా గురువులే

 అణువణువునా గురువులే


🌷🌷🌷🌷🌷


విద్యాభ్యాసం అంటే గురుముఖతా విద్య నేర్చుకోవడమే అని పలువురి అభిప్రాయం. లౌకికమైన విద్యలు వృత్తి వ్యాపారాల్లో ఉపకరిస్తాయే గాని చదువుల్లోని మర్మాలను వివరించవు. నిశితంగా పరికిస్తే విద్యాలయాల్లో బోధించని విద్యలు జీవిత పాఠాలను చెప్పకనే చెబుతాయి. ఎందరెందరో గురువులు అణువణువునా దర్శనమిస్తారు. జీవితానికి వాటిని అన్వయించుకొంటే నిజమైన బతుకంటే ఏమిటో అర్థమవుతుంది. మనిషికి సుఖాలు, దు:ఖాలు రమ్మంటే రావు. వద్దంటే మానవు. తట్టుకుని నిలబడాలి. నిరాశతో చతికిలపడకూడదు. తన్నినా, తవ్వినా, ఎన్నోవిధాల హింసించినా భూమి చలించదు. ఓర్పుతో సహిస్తుంది. పర్వతాలను, చెట్లను, భవనాలను మోస్తుంది. మనిషి సుఖజీవనానికి బాసటగా నిలుస్తుంది. పరోపకారార్థమే బతుకని, బాధ్యతలు భరించక తప్పదని చెబుతుంది. క్షమాగుణాన్ని నిలువెల్లా నింపుకొమ్మని బోధిస్తుంది. ఓర్పు, సహనమే ఉన్నత జీవితానికి సోపానాలని వివరిస్తుంది.

నిర్మలత్వానికి స్నిగ్ధత్వానికి మాధుర్యానికి పెట్టింది పేరు- జలం. జలం ప్రాణాన్ని నిలబెడుతుంది. మాలిన్యాన్ని వదిలిస్తుంది. స్నానంతో మనిషిని పవిత్రుణ్ని చేస్తుంది. వర్షంగా కురిసి పరుగెత్తి పంటపొలాల్లో ఎగిరెగిరి దూకుతుంది. నేలను సస్యశ్యామలం చేసి బంగారు పంటలు పండిస్తుంది. ప్రత్యుపకారాన్ని ఆశించని జలం పదిమందికీ ఉపయోగపడుతుంది. మనిషి జీవితం ఇలా ఉండాలని బోధిస్తుంది. మనిషి తన సత్‌ప్రవర్తన ద్వారా సాటి మనిషి అభిమానాన్ని పొందగలడు. వారి గుండెల్లో గూడు కట్టుకోగలడు. ఒకరికి సాయంచేస్తే మనకు దైవం సాయపడతాడని మనిషి నమ్మకం. ఉన్నదానితో నలుగురు బతకాలి. ఇతరులను బతికించాలి. ఇదే మానవత్వానికి అర్థం.

నులివెచ్చని కిరణాలతో ఉదయించి లోకం చీకట్లను పోగొట్టి రోజంతా వెలుగును ప్రసాదిస్తాడు ఆదిత్యుడు. లోకమంతా తిరిగి సాయం సంజెకు మాయమవుతాడు. మర్నాడు ఉదయమే మళ్ళీ ప్రత్యక్షం. బద్ధకం లేదు. విసుగు విరామాలు లేవు. ప్రపంచాన్ని బతికించే శ్రామిక చక్రవర్తి. భూమ్మీద జలాన్ని గ్రహించి, దాచి సమయం చూసి మళ్ళీ భూమ్మీదకు వదిలేసే పనిలో నిమగ్నమై ఉంటాడు. ఆహారాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవం. బాధ్యతను, సమయాన్ని నిరంతరం గుర్తుచేస్తూ వెలుగు ఉండగానే జీవితాలను చక్కదిద్దుకొమ్మని హెచ్చరిస్తాడు.

ఎన్నెన్నో కోరికలు, ఆశలు తీరాలని నిరంతరం తపిస్తాడు మనిషి. అనుకున్నవి నెరవేరితే ఆనందం. లేకపోతే విషాదం. వికారం లేని ప్రశాంత జీవితాన్ని అనుభవించమని చెబుతోంది సాగరం. అగాధమైన లోతులు గల తనలో ఎన్నో నదులు వచ్చి కలిసినా ఎప్పుడు పొంగిపోదు. వేసవిలో నదుల రాక తగ్గినా తాను ఎండిపోదు. దేశ కాల భేదం వల్ల విచ్ఛిన్నం కాదు. తన గర్భంలో ఏమున్నాయో తెలియనివ్వదు. వచ్చి చేరినవాటిని ఉంచుకోదు. తీరానికి చేరుస్తుంది. నర్మగర్భ నిరాడంబర జీవితాన్ని గడపమని, పరుల సొమ్ముకు పాకులాడవద్దని సందేశాన్ని అందిస్తుంది సాగరం. పడగొట్టినవారిపై పగ పెంచుకోక దారం దారం పోగేసుకొని గూడు కట్టుకొనే సాలీడు, క్రమశిక్షణే మన మార్గాన్ని సుగమం చేస్తుందని చెప్పే చీమలు, పడినా పట్టుదలతో లేచే కెరటం, ఎదగాలని సంకల్పబలంతో భూమిని చీల్చే మొక్క, వేడిని భరిస్తూ నీడనిచ్చే చెట్టు... ఇలా ఎన్నో గురువుల రూపేణా నిత్యం కనిపించి ఎన్నో పాఠాలు చెబుతాయి. మనిషికి మంచిచెడుల భేదాన్ని విప్పిచెప్పే మనసు ప్రధాన గురువు. విద్యల్లో తామే అధికులమని భావించేవారికి అణువణువునా కనిపించే అల్పజీవులు, నోరులేని మూగప్రాణులు, పశుపక్ష్యాదులు, చెట్టుచేమలు గురువులై చెప్పే పాఠాలు బతుకు రీతుల్ని అర్థవంతంగా వివరిస్తాయి.


ఓం నమో నారాయణాయ

పంచాంగం 29.05.2024 Wednesday

 ఈ రోజు పంచాంగం 29.05.2024 Wednesday.


స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాస కృష్ణ పక్ష: షష్థి తిధి సౌమ్య వాసర: శ్రవణా నక్షత్రం ఇంద్ర యోగ: వణిజ తదుపరి భద్ర కరణం. ఇది ఈరోజు పంచాంగం.


షష్థి మధ్యాహ్నం 01:38 వరకు.

ఉత్తరాషాఢ పగలు 08:37 వరకు.

సూర్యోదయం : 05:45

సూర్యాస్తమయం : 06:42


వర్జ్యం : మధ్యాహ్నం 12:25 నుండి 01:57 వరకు.


దుర్ముహూర్తం : పగలు 11:48 నుండి మధ్యాహ్నం 12:39 వరకు.


అమృతఘడియలు : రాత్రి 09:35 నుండి 11:06 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.


యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

వైశాఖ పురాణం - 21

 వైశాఖ పురాణం - 21


21వ అధ్యాయము - పాంచాలరాజు రాజ్యప్రాప్తి


నారదమహర్షి అంబరీష మహారాజుతో వైశాఖమహాత్మ్యము నిట్లు వివరింపసాగెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తిమహారాజా! వినుము. శ్రీహరికి మిక్కిలి యిష్టమైన వైశాఖమాస వ్రతమును దాని మహిమను వెల్లడించు మరియొక కథను చెప్పుదును వినుము.


పూర్వము పాంచాలదేశమున పురుయశుడను రాజు కలడు. అతడు పుణ్యశీలుడను మహారాజు పుత్రుడు. అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యెను. అతడు ధార్మికుడు మహావీరుడు తన శక్తియుక్తులచే విశాల భూమిని పరిపాలించెను. పూర్వజన్మ దోషముచేనతడు కొంతకాలమునకు సంపదను కోల్పోయెను. వాని యశ్వములు, గజములు మున్నగు బలము నశించెను. వాని రాజ్యమున కరవు యేర్పడెను. ఈ విధముగా వాని రాజ్యము, కోశము బలహీనములై గజము మ్రింగిన వెలగపండువలె సారవిహీనములయ్యెను.


వాని బలహీనతనెరిగి వాని శత్రువులందరును కలసి దండెత్తి వచ్చిరి. యుద్దములో నోడిన రాజు భార్యయగు శిఖినితో గలసి పర్వతగుహలో దాగుకొని యేబదిమూడు సంవత్సరముల కాలము గడపెను. ఆ రాజు తనలో నిట్లు విచారించెను. "నేను ఉత్తమ వంశమున జన్మించితిని. మంచి పనులను చేసితిని. పెద్దలను గౌరవించితిని. జ్ఞానవంతుడను. దైవభక్తి, యింద్రియజయము కలవాడను. నావారును నావలెనే సద్గుణవంతులు. నేనేమి పాపము చేసితినని నాకిట్టి కష్టములు కలిగినవి? నేనిట్లు అడవిలో నెంతకాలముండవలయునో కదా! అని విచారించి తన గురువులగు యాజుడు ఉపయాజకుడను గురువులను తలచుకొనెను. సర్వజ్ఞులగు వారిద్దరును రాజు స్మరింపగనే వానివద్దకు వచ్చిరి.


రాజువారిద్దరికి నమస్కరించి యధాశక్తిగనుపచారములను చేసెను. వారిని సుఖాసీనులగావించి దీనుడై వారి పాదములందుపడి నాకిట్టి స్థితియేల వచ్చెను? నాకు తరణోపాయమును చెప్పుడని వారిని ప్రార్థించెను. వారు రాజును లేవదీసి కూర్చుండబెట్టి రాజు చెప్పినమాటలను వినిరి. వాని మనోవిచారమును గ్రహించిరి. క్షణకాలము ధ్యానమగ్నులై యిట్లనిరి. రాజా! నీ దుఃఖమునకు కారణమును వినుము. నీవు గత పదిజన్మలలో క్రౌర్యము కలిగిన కిరాతుడవు. నీయందు ధర్మప్రవృత్తి కొంచమైనను లేదు. సద్గుణము లేవియును లేవు. శ్రీహరికి నమస్కరింపలేదు. శ్రీహరిని కీర్తింపలేదు. శ్రీహరి కథలను వినలేదు. గత జన్మమున నీవు సహ్యపర్వతమున కిరాతుడవైయుంటివి. అందరిని బాధించుచు, బాటసారులను దోచుకొనుచు నింద్యమగు జీవితమును గడుపుచుంటివి. నీవు గౌడ దేశముననున్నవారికి భయంకరుడవై యుంటివి. ఇట్లు అయిదు సంవత్సరములు గడచినవి.


బాలురను, మృగములను, పక్షులను, బాటసారులను వధించుటచే నీకు సంతానము లేదు. నీకీజన్మయందును సంతానము లేకపోవుటకును నీపూర్వకర్మయే కారణము. నీ భార్య తప్ప నీకెవరును అప్పుడును లేకుండిరి. అందరిని పీడించుట చేతను దానమన్నది లేకపోవుటచేతను నీవు దరిద్రుడవుగా నుంటివి. అప్పుడు అందరిని భయపెట్టుటచే నీకిప్పుడు యీ భయము కలిగెను. ఇతరులను నిర్దయగా పీడించుటచే నిప్పుడు నీ రాజ్యము శత్రువులయధీనమైనది. ఇన్ని పాపములను చేసిన నీవు రాజకులమున పుట్టుటకు కారణమును వినుము.


నీవు గౌడదేశమున అడవిలో కిరాతుడవై గత జన్మలోనుండగా ధనవంతులగు యిద్దరు వైశ్యులు కర్షణుడనుముని నీవున్న యడవిలో ప్రయాణించుచుండిరి. నీవు వారిని అడ్డగించి బాణమును ప్రయోగించి ఒక వైశ్యుని చంపితివి. రెండవ వైశ్యుని చంపబోతివి. అతడును భయపడి ధనమును పొదరింటదాచి ప్రాణరక్షణకై పారిపోయెను. కర్షణుడను మునియు నీకు భయపడి ఆ యడవిలో పరిగెత్తుచు, యెండకు, దప్పికకు అలసి మూర్ఛిల్లెను. నీవును కర్ష్ణణుని సమీపించి వాని మొగముపై నీటిని జల్లి ఆకులతో విసరి వానికి సేవచేసి వానిని సేదతీర్చితివి. అతడు తేరుకున్న తరువాత నీవు మునీ! నీకు నా వలన భయములేదు. నీవు నిర్ధనుడవు. నిన్ను చంపిననేమి వచ్చును. కాని పారిపోయిన వైశ్యుడు ధనమునెక్కడ దాచెనో చెప్పుము. నిన్ను విడిచెదను చెప్పనిచో నిన్నును చంపెదను అని వానిని బెదిరించితివి. ఆ మునియు భయపడి ప్రాణ రక్షణకై వైశ్యుడు ధనమును దాచిన పొదరింటిని చూపెను.


అప్పుడు నీవు ఆ మునికి అడవి నుండి బయటకు పోవు మార్గమును చెప్పితిని దగ్గరలోనున్న నిర్మల జలము కల తటాకమును చూపి నీటిని త్రాగి మరింత సేద తీసిపొమ్ము. రాజభటులు నాకై రావచ్చును కావున నేను నీవెంబడి వచ్చి మార్గమును చూపజాలనని చెప్పితివి. ఈ ఆకులతో విసురుకొనుము. చల్లనిగాలి వీచునని వానికి మోదుగ ఆకులనిచ్చి పంపి నీవు అడవిలో దాగుకొంటివి. నీవు పాపాత్ముడవైనను వైశ్యుని ధనమెచటనున్నదో తెలిసికొనుటకై ఆ మునికి సేవలు చేయుటవలన వానిని అడవి నుండి పోవు మార్గమును జలాశయమార్గమును చెప్పుట వలన ఆ కాలము వైశాఖమాసమగుటచే నీవు తెలియకచేసినను స్వార్థముతో చేసినను మునికి చేసిన సేవ ఫలించినది. ఆ పుణ్యము వలన నీవిప్పుడు రాజ వంశమున జన్మించితివి.


నీవు నీ రాజ్యమును పూర్వపు సంపదలను వైభవములను కావలెనని యనుకున్నచో వైశాఖ వ్రతమును చేయుము. ఇది వైశాఖమాసము. నీవు వైశాఖశుద్ద తదియ యందు ఒకసారి యీనిన ఆవును దూడతో బాటు దానమిచ్చినచో నీ కష్టములు తీరును. గొడుగునిచ్చిన నీకు రాజ్యము చేకూరును. ప్రాతః కాల స్నానము చేసి అన్ని ప్రాణులకు అందరికి సుఖమును కలిగింపుము. నీవు భక్తిశ్రద్దలతో వైశాఖ వ్రతము నాచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యధాశక్తి దానములను చేయుము. లోకములన్నియు నీకు వశములగును. నీకు శ్రీహరియు సాక్షాత్కరించును అని వారిద్దరును రాజునకు వైశాఖ వ్రత విధానమును చెప్పి తమ నివాసములకు మరలి పోయిరి.


రాజ పురోహితులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతమును భక్తిశ్రద్దలతో నాచరించెను. యధాశక్తిగ దానములను చేసెను. వైశాఖవ్రత ప్రభావమున ఆ రాజు బంధువులందరును మరల వాని వద్దకు వచ్చిరి. వారందరితో కలసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురమునకు పోయెను. శ్రీహరి దయవలన వాని శత్రువులు పరాజితులై నగరమును విడిచిపోయిరి. రాజు అనాయాసముగ తన రాజ్యమును తిరిగి పొందెను. పోగొట్టుకొని సంపదలకంటె అధికముగ సర్వసంపదలను పొందెను. వైశాఖవ్రత మహిమ వలన సర్వమును సంపన్నమై వాని రాజ్యము సుఖశాంతులతో ఆనందపూర్ణముగ నుండెను. వానికి ధృష్టకీర్తి, ధృష్టకేతువు, ధృష్టద్యుమ్నుడు, విజయుడు, చిత్రకేతువు అను అయిదుగురు పుత్రులు కుమార స్వామియంతటి సమర్థులు కలిగిరి. ప్రజలందరును వైశాఖమాస వ్రత మహిమ వలన రాజానురక్తులై యుండిరి.


రాజును రాజ్యవైభవము సంతానము కలిగినను భక్తి శ్రద్దలతో వైశాఖవ్రతము నాచరించి యధాశక్తి దానధర్మములను చేయుచుండెను. ఆ రాజునకు గల నిశ్చలభక్తికి సంతసించిన శ్రీహరి వానికి వైశాఖశుద్ద తృతీయ అక్షయతృతీయనాడు ఆ రాజునకు ప్రత్యక్షమయ్యెను. చతుర్బాహువులయందు శంఖచక్రగదా ఖడ్గములను ధరించి పీతాంబర ధారియై వనమాలావిభూషితుడై లక్ష్మీదేవితో గరుడాదిపరివారముతో ప్రత్యక్షమైన పరమాత్మయగు అచ్యుతుని జూచి ఆ రాజు శ్రీహరిని చూడలేక కనులు మూసికొని భక్తితో శ్రీహరిని ధ్యానించెను. కనులు తెరచి ఆనందపరవశుడై గగుర్పొడిచిన శరీరముతో గద్గదస్వరముతో శ్రీహరిని జూచుచు ప్రభుభక్తితో ఆనందపరవశుడై శ్రీహరినిట్లు స్తుతించెను.


అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి చెప్పెనని నారదమహర్షి అంబరీషునితో పలికెను.


వైశాఖ పురాణం 21వ అధ్యాయం సమాప్తం


ఓం నమో నారాయణాయ

హనుమ వచన చాతుర్యం!

 హనుమ వచన చాతుర్యం!


యడవల్లి మూర్తిగారి సౌజన్యంతో-


*సత్యం మాట్లాడాలి.ప్రియంగా మాట్లాడాలి. **సత్యమే అయినా అప్రియంగా బాధించేదిగా మాట ఉండకూడదు. ఇదే వేద   సూక్తి.*నవవ్యాకరణ పండితుడైన హనుమ మాట్లాడే విధానం రాముణ్ని ఆకట్టుకుంది. లక్ష్మణుడికి హనుమ మాట చాతుర్యం వివరించాడు.*


*మాట్లాడేటప్పుడు హావభావాలు ఎలా ఉండాలో కనురెప్పలు ఎగరవేయకుండా, ఎగతాళిగా నవ్వకుండా ప్రియంగా ఎలా మాట్లాడాలో హనుమ అలాగే ప్రవర్తించాడు.*


*తడబడకుండా, పునరుక్తి దోషం రాకుండా గబగబా కాక, అతినెమ్మదిగా కాక ప్రసంగం సాగాలని, ఎదుటివ్యక్తిలో నమ్మకాన్ని కలిగించాలని, అదే మాటకు ప్రాణమని తెలిపాడు శ్రీరాముడు.*


*హనుమంతుడు అశోకవనంలో సీతాదేవిని దర్శించినప్పుడు తాను ఎలా మాట్లాడితే ఆమెకు నమ్మకం కలుగుతుందో అలాగే సంభాషించాడు. సంస్కృతంలో కాక కోసలదేశ భాషలో ప్రసంగించాడు.*


*రావణసభలో గట్టిగా, నిష్కర్షగా నిజాల్ని తెలియజేశాడు. భయపడకుండా తన మనసులోని భావాల్ని వివరించాడు. ఎప్పుడు ఎక్కడ ఏ మాట వాడాలో తెలియడం ఒక కళ. అది హనుమలోని ఘనత. *


*సీతాదేవిని చూసి, లంకను కాల్చి శ్రీరాముడి దగ్గరికి రాగానే ‘చూశాను సీతను, లంకలో పాతివ్రత్య నియమంతో ఉన్నది’ అని ఒకే వాక్యంలో శ్రీరాముడికి చెప్పడం- ఆయనవ

శివభక్తుడు

 🌹ఈ లీల కచ్చితంగా మిమ్మల్ని రోమాంచితం చేస్తుంది.


ఒక సారి ఒక శివభక్తుడు తన ఊరినుండి కేదారనాథ్ ధామానికి యాత్రకోసం బయలుదేరాడు. అప్పట్లో యాత్రాసాధనాలు, ప్రయాణ సౌకర్యాలు లేనందున, అతడు నడక ద్వారానే పయనించాడు. దారిలో ఎవరు కలిస్తే వారిని కేదారనాథ్ మార్గం అడిగేవాడు. మనసులో శివుని ధ్యానిస్తూ ఉండేవాడు అట్లా నడుస్తూ నడుస్తూ నెలలు గడిచిపోయాయి. చివరకు ఒక రోజు అతడు కేదారధామం చేరనే చేరాడు.


కేదారనాథ్ లో మందిరం ద్వారాలను ఆరు నెలలే తెరుస్తారు, ఆరు నెలలు మూసి ఉంచుతారు. అతడు మందిరం ద్వారాలు మూసే వేళ అక్కడకు చేరాడు.

 

పూజారికి అతడు ఆర్తితో చెప్పాడు ‘నేనెంతో దూరం నుంచి పాదయాత్ర చేస్తూ వచ్చాను కృప ఉంచి తలుపులు తీయండి. ఈశ్వరుని దర్శించనివ్వండి’ అని. కానీ అక్కడ నియమం ఏంటంటే ఒకసారి తలుపును మూస్తే ఇక మూసినట్టే. నియమం నియమమే, మరి అతడు చాలా దుఃఖపడ్డాడు మాటిమాటికీ శివుని స్మరించాడు. 

‘ప్రభో, ఒకే ఒక్కసారి దర్శనం ఇవ్వవా'? అని అతడు అందరిని ఎంత ప్రార్థించినా, ఎవరూ వినలేదు


పూజారి అన్నాడు కదా ‘ఇహ ఇక్కడకు ఆరు నెలలు గడిచాక రావాలి, ఆరునెలలు అయ్యాకే తలుపును తెరిచేది’ అని ‘ఆరు నెలలపాటు ఇక్కడ మంచు కురుస్తుంది’ అని చెప్పి అందరూ అక్కడి నుంచి వెళిపోయారు. 


అతడక్కడే ఏడుస్తూ ఉండిపోయాడు, ఏడుస్తూ ఏడుస్తూ రాత్రి కాసాగింది. నలుదిక్కులా చీకట్లు కమ్మిపోయాయి కానీ అతడికి విశ్వాసం తన శివుని మీద  ఆయన తప్పక కృప చూపుతాడని. అతడికి చాలా ఆకలి దప్పిక కూడా కలగసాగాయి. అంతలోకి అతడు ఎవరో వస్తున్న శబ్దాన్ని విన్నాడు చూస్తే ఒక సన్యాసి బాబా అతని వైపు వస్తున్నాడు ఆ సన్యాసి బాబా అతడి వద్దకు వచ్చి దగ్గరలో కూర్చున్నాడు. 


అడిగాడు ‘నాయనా, ఎక్కడినుంచి వస్తున్నావు?’ అని అతడు తన కథంతా చెప్పాడు. చెప్పి, ‘నేను ఇంత దూరం రావటం వ్యర్థం అయింది బాబాజీ’ అని బాధపడ్డాడు. బాబాజీ అతడిని ఓదార్చి, అన్నం తినిపించాడు, తరువాత చాలా సేపటివరకు బాబాజీ అతడితో మాట్లాడుతూండి పోయాడు బాబాజీకి అతడి పై దయ కలిగింది ఆయన ‘నాయనా, నాకు రేపుదయం మందిరం తప్పక తెరుస్తారని అనిపిస్తున్నది, నీకు తప్పక దర్శనం దొరుకుతుందని అనిపిస్తున్నది’ అని అన్నాడు.

మాటల్లో పడి ఆ భక్తుడికి ఎప్పుడు కన్ను అంటిందో తెలియదు సూర్యుడు కొద్దిగా ప్రకాశించేవేళకు భక్తుని కళ్ళు తెరుచుకున్నాయి అతడు అటూ ఇటూ చూస్తే బాబాజీ చుట్టుపక్కల ఎక్కడా లేడు అతడికి ఏదైనా అర్థమయ్యే లోపు పూజారి తమ మండలి అంతటితో కలిసి రావటం చూశాడు అతడు పూజారికి ప్రణామం చేసి అన్నాడు  

'నిన్ననేమో మీరు మందిరం ఆరునెలలాగి తీస్తామన్నారు కదా? ఈ మధ్య సమయంలో ఎవరూ ఇటు తొంగి చూడరని కూడా చెప్పారు కదా, కానీ మీరు ఉదయాన్నే వచ్చేశారే’ అని అన్నాడు.


పూజారి అతడి వంక పరిశీలించి చూస్తూ, గుర్తు పట్టటానికి ప్రయత్నిస్తూ, అడిగాడు  ‘నువ్వు మందిరం ద్వారం మూసేసే వేళకు వచ్చినవాడివే కదా? నన్ను కలిశావు కదా ఆరునెలలయ్యాక తిరిగి వచ్చావా!’ అని అన్నాడు.


అప్పుడు ఆ భక్తుడు అన్నాడు ఆశ్చర్యంగా – ‘లేదు, నేనెక్కడికీ పోనేలేదే నిన్ననే కదా మిమ్మల్ని కలిసింది, రాత్రి నేను ఇక్కడే పడుకున్నాను నేనెటూ కదలలేదు’ అని చెప్పాడు.


పూజారికి ఆశ్చర్యానికి అంతే లేదు ఆయన అన్నాడు  ‘కానీ నేను ఆరునెలల ముందు మందిరం మూసి వెళిపోయాక ఇదే రావటం నీవు ఆరు నెలలు పాటు ఇక్కడ జీవించి ఎట్లా ఉండగలిగావు?’ పూజారి, అతడి బృందం అంతా విపరీతంగా ఆశ్చర్యపోయారు.


ఇంత చలిలో ఒక వ్యక్తి ఒంటరిగా ఆరునెలల పాటు జీవించి ఎట్లా ఉండగలడు?


అప్పుడు ఆ భక్తుడు ఆయనకు ఆ సన్యాసి బాబా రావటం, కలవటం, ఆయనతో గడిపిన సమయం, విషయం అంతా వివరించాడు ‘ఒక సన్యాసి వచ్చాడు- పొడుగ్గా  ఉన్నాడు, పెద్ద గడ్డం, జటలు, ఒక చేతిలో త్రిశూలం మరొక చేతిలో డమరుకం పట్టుకుని, మృగచర్మం కప్పుకుని ఉండినాడు’ అని.  

వెంటనే పూజారి, ఇతరులు అందరూ అతడి చరణాలపై పడిపోయారు ఇట్లా అన్నారు  ‘మేము జీవితమంతా వెచ్చించాము, కానీ ఈశ్వరుని దర్శనం పొందలేకపోయాము, నిజమైన భక్తుడివి నీవే నీవు సాక్షాత్తు భగవంతుడినే, శివుడినే దర్శనం చేసేసుకున్నావు.🙏🌷🌷🌷🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

మొగ్గలతో శోభిల్లే కానుగు చెట్టును

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝 *అన్ధావిద్వజ్జనై ర్హీనా మూకా కవిభి రుజ్ఞితా*। 

      *బధిరా గాయకై ర్హీనా సభా భవతి భూభృతామ్*||


      *____-----నీతిదీపికా-----____*


*విద్వాంసులు లేని రాజసభ గ్రుడ్డిది....కవులు లేనిసభ మూగది...గాయకులు లేనిసభ చెవిటిది*.....


            { 🙏 *కనకధారా స్తవం* 🙏 }


     *అంగం హరేః పులక భూషణ మాశ్రయన్తీ*

     *బృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్,*

     *అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా*

     *మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః* (1)


తాత్పర్యం: మొగ్గలతో శోభిల్లే కానుగు చెట్టును ఆడు తుమ్మెద ఆశ్రయించినట్లుగా, కానుగువృక్షం మాదిరి చల్లనివాడూ, నల్లని వాడూ అయిన శ్రీ మహావిష్ణువు యొక్క ఆనందం వల్ల ఏర్పడిన గగుర్పాటుతో కూడిన శరీరాన్ని మంగళదేవత అనే సార్థక నామాన్ని ధరించిన శ్రీమహాలక్ష్మి ఆశ్రయించి ఉంది. ఆమెకు విష్ణు

వక్షస్థలమే నివాస భూమి కదా! అట్టి సకలైశ్వర్యాలకూ నిలయములైన ఆ *జగజ్జనని కరుణా కటాక్ష వీక్షణాలు*

*నా మీద ప్రసరించి నాకు శుభాలిచ్చు గాక*!!

పోతన రూపచిత్రణ!

 శు భో ద యం🙏


పోతన రూపచిత్రణ! 


మ: త్రిజగ న్మోహన నీలకాంతి తనువుద్దీపింపఁ బ్రాభాత నీ


        రజ బంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల , నీలాలక


        వ్రజ సంయుక్త ముఖారవింద మతి సేవ్యంబై విజృభింప మా


        విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్!


                   ఆం: భాగవతం- ప్రధమస్కంథం- 247: వ: పద్యము;


                     

                   ముల్లోకాలను మైమరపించే నీలమేఘ ఛ్ఛాయగల తనువుతో, ఉదయారుణ కిరణ కాంతిని 


   ప్రతిఫలించు నుత్తరీయంబుతో ,గాలికి నూయలలూగు నల్లని ముంగురులతో నొప్పు ముఖారవిందముతో చూడముచ్చటఁ గొల్పుచు మా అర్జును దరికి నరుదెంచుచుండు అందగాడు శ్రకృష్ణుఁ డెల్లవేళల నామదిలో నిలచుగాక! అనిభీష్మ స్తుతి;


                 నల్లనివాడే గాని యామేనిలో నొక మెఱపున్నది. ఆకర్షణ యున్నది. అదియెంతటిదనగా ముల్లోకములను మోహింప జేయు నంతటిదట! ఆమూర్తి కన్నుల బడెనా అంతే ఆయాకర్షణ ప్రవాహమున గొట్టికొని పోవలసినదే!


                         ఇఁక నాతఁడు ధరించిన పీతాంబరమా ఉదయారుణ కాంతి రంజితమై చూపరులకు యింపు నింపు చున్నది. 

కృష్ణుడు కదలివచ్చుచుండ బాలసూర్యోపమ మైన కాంతిపుంజ వలయమేర్పడుటకా వస్త్రము ఆధారమగుచున్నది. ఎంత యద్భుతము! 


                  మోమా అరవిందమును బోలియున్నది. అది నల్లని ముంగులతో శోభాయమానమై యున్నది.కవి బయటకు చెప్పకున్నను తుమ్మెదలు ముసిరిన పద్మమును బోలియున్నది. 


                              ఇంత యందమును మూటగట్టి వచ్చువాడు వన్నెలాడు (సోకులరాయడు) గాకుండునా? 


              ఇదీ పోతన గారి యద్భుత రూప చిత్రణా సామర్ధ్యము!


                                                             స్వస్తి!🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

తింటానంటే బెయిలిస్తాం -

 *న్యూఢిల్లీ (సుప్రీంకోర్టు)*


*‘కల్తీ’ మీరు తింటానంటే బెయిలిస్తాం - సుప్రీంకోర్టు*


*పిటిషన్‌ వెనక్కి తీసుకున్న లాయర్‌*


ఆహార కల్తీ కేసులో నిందితుడి తరఫున ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసిన న్యాయవాదికి సుప్రీంకోర్టులో అనూహ్య పరిణామం ఎదురైంది.


చివరకు తన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.


మధ్యప్రదేశ్‌కు చెందిన పవార్‌ గోయల్‌, వినీత్‌ గోయల్‌ అనే వ్యాపారులపై గోధుమ పిండిని కల్తీ చేసిన నేరానికి కేసు నమోదైంది.

ఆహార కల్తీ కేసులో ఆరోపణలకు బెయిల్‌ ఇవ్వొచ్చని, కాబట్టి తన క్లయింట్లను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని పునీత్‌జైన్‌ అనే న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ ఎం.ఆర్‌. షాలతో కూడిన ధర్మాసనం,


‘‘ఒక్క మనదేశంలోనే ఆరోగ్యంపై ఎవరికీ పట్టింపు లేకుండా పోయింది. మీరుగానీ, మీ కుటుంబంగానీ మీ క్లయింట్‌ తయారు చేసి అమ్ముతున్న ఆహారాన్ని తింటే బెయిల్‌ ఇస్తాం. అందుకు మీరు సిద్ధమేనా?’’ అని నిలదీసింది. దీంతో న్యాయవాది సమాధానమివ్వలేదు.


*★ ‘‘సమాధానం ఇవ్వటానికి ఎందుకంత ఇబ్బంది పడుతున్నారు? ఇతరుల ప్రాణాలైతే పోతే పోనీ. మనకేంటి అనుకుంటున్నారా?’’ అని న్యాయమూర్తులు అడగటంతో న్యాయవాది తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.

స్వాప్నిక భ్రాంతి

 *స్వాప్నిక భ్రాంతి మెలకువ వచ్చే వరకే*


మానవుడు ఒక ముత్యపు చిప్పను చూసి దానిలోని అత్యంత తనుకూలీనే కాంతివలన రజతం అనుకొంటాడు. తరువాత దగ్గరకు సమీపించి చూడగా ఆ భ్రాంతి అతనికి తొలగిపోతుంది. అలాగే స్వప్నంలో అనేక యాత్రాదులు చేస్తూ పుణ్యక్షేత్రాలను దర్శించినట్లు అనిపిస్తుంది. మెలకువ రాగానే ఆ భ్రాంతి తొలగిపోతుంది. ఇలా ద్వైత భ్రాంతి అంత తొందరగా తొలగిపోదు. అది చాలా దీర్ఘమైనది.

మనం రాత్రి ఒక గదిలో పడుకుంటే ఆ రాత్రి కలలో విమానం ఎక్కి కాశీ వెళ్ళి, గంగాస్నానం, విశ్వేశ్వర దర్శనం ఆ తర్వాత రామేశ్వర యాత్ర, సముద్రస్నానం, రామనాథ దర్శనం వంటివన్నీ జరిగాయి. మెలకువ రానంతవరకు అది నిజంగా జరిగినట్లే 'సరే' అనిపిస్తూ ఉంటుంది. మెలకువ వచ్చాక అబ్బే అదేం జరగలేదు, 4,5 గంటల్లో ఇంత యాత్ర జరపడం సాధ్యమా? కాదు. ఇది అసత్యమే అని ఆ యాత్రా భ్రాంతి తొలగిపోతుంది. కలగంటున్నంత సేపూ నిజంగా కాశీలో ఉన్నట్లే, యాత్రా జరిగిపోయినట్లే అనిపించినా, మెలకువ వచ్చాక అదంతా మిధ్యయే అనే నిర్ణయం కలుగుతుంది.

అలాగే వ్యవహారంలో కూడా జగత్తులో సర్వమూ సత్యమే అనిపిస్తుంది.ఇలాగ్గా ఎందుకు? ద్వైత భ్రాంతి ఉండేవరకు. ఎప్పుడైతే ద్వైత భ్రాంతి తొలగిపోతుందో వెనువెంటనే అద్వైత సాక్షాత్కారం వెలువడుతుంది. *यत्रत्वस्य सर्वमात्मैवाभूत् तत् केन कं पश्येत् केन कं जिघ्रेत्, केन कं पश्येत् केन कं विजानीयात्* అని శ్రుతి వచనం. అద్వైత సాక్షాత్కారం ఎప్పుడు కలుగుతుందో అపుడు ఇంకేమీ లేదు, అరే అపుడు చూడవలసిందేముంది? వినవలసిందేముంది? అనిపిస్తుంది.

 *आत्मानं चे द्विजानीया* 

 *दहमस्मीति पूरुषः* | 

*कि मिच्छन् कस्य कामाय शरीरमनुसंज्वरेत्* ||

దీనికి మనం ఆశ్చర్యపడనవసరం లేదు. వ్యవహారంలో అలాగే అనుకోవడం భ్రాంతి పడడం జరుగుతుంది *यधास्वप्ने* అని. స్వప్నంలో ఆ భ్రాంతి ఉన్నంతసేపూ తదనుగుణమైన వ్యవహారమున్నట్లే, ఈ ద్వైతభ్రాంతి ఉన్నంత వరకూ *अनपेक्षया* జగత్ సత్యమనే వ్యవహారముండనే ఉంటుంది. అవిద్య, అజ్ఞానం నాశనమయేవరకు అలానే అనిపిస్తుంది. సూర్యోదయ అనంతరం అంధకారం నశించినట్లే ద్వైతభ్రాంతి తొలగి జ్ఞానోదయమవుతుంది. అయితే స్వాప్నిక భ్రాంతి మెలకువ వచ్చే వరకూ మాత్రమే. ఇది సుదీర్ఘం. అదే వ్యత్యాసం. కనుక ఆలోచించి, నిత్యానిత్య వివేకంతో *ब्रह्म सत्यं जगत् मिथ्या जीवः ब्रह्मैक ना परः* అని గ్రహించాలి.


--- *జగద్గురు శ్రీశ్రీ భారతీతీర్థ మహమహస్వామివారు* 


 *नमः पार्वती पतये हरहरमहदेव*

మానవ సంబంధాలు

 *🤍 పలచబడి పోతున్న మానవ సంబంధాలు 🤍*


నేను గత ముప్ఫై ఏళ్లుగా కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలు లో వస్తున్న మార్పులను చాలా దగ్గరగా చూస్తూ వచ్చాను..

          పెద్దగా ఆస్తులు..చెప్పుకోదగ్గ ఆదాయ వనరులు.. సమాజంలో హోదా.. సౌకర్యాలు సౌఖ్యాలు పెద్దగా లేని రోజుల్లోనే మనుషుల మధ్య ఆప్యాయత అనుబంధాలు చిక్కగా వుండేవి..

               ఒకరికి ఒకరు చేదోడుగా.. నిజాయితీగా అరమరికలు లేని సంబంధాలు కొనసాగించారు..

          వున్నంతలో తృప్తిగా వున్నారు.. కష్టానికి సుఖానికి ఒకరికొకరు కలుసుకోవడం.. అందరం దగ్గర వాళ్ళం అనే అనుభూతి పుష్కలంగా వుండేది..

               కుటుంబంలో ఎవరి పిల్లలు అయినా ఏదైనా సాధిస్తే అది కుటుంబం మొత్తం ఉమ్మడిగా సంతోషం వ్యక్తం చేసేవారు..

               మా మనవడు లేదా మనవరాలు..అని తాతలు.. మా మేనకోడలు లేదా మేనల్లుడు అని అమ్మమ్మ ఇంటివారు నానమ్మ ఇంటి వారు అందరూ గర్వంగా చెప్పుకునే వారు..

             కానీ ఎప్పుడైతే 1983-84 నుంచి కార్పొరేట్ కాలేజ్ సంస్కృతి పెరగడం మొదలైందో.. ఎప్పుడైతే ఒక్కొక్కరు పిల్లలను చదివించడానికి priority ఇవ్వడం మొదలైందో.. ఎప్పుడైతే పిల్లలు కూడా ఒకరికి మించి ఒకరు అవకాశాలు అందిపుచ్చుకుంటూ.. కెరీర్ సృష్టించుకోవడం మొదలైందో..

             మొదట్లో వారే కుటుంబాలలో మిగిలిన వారికి మార్గనిర్దేశనం చేసే వారు.. మిగిలిన వారికి అరమరికలు లేకుండా అండదండలు అందించే వారు.. తాము ఎదగడంతో పాటు తమ వారు కూడా ఎదగడం కోసం సహాయ పడ్డారు..

             కానీ ఎప్పుడైతే సర్వీస్ సెక్టార్ ప్రాముఖ్యత పెరగడం మొదలైందో.. ఎప్పుడైతే వేగంగా కెరీర్ దొరకడం మొదలైందో.. వేగంగా కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మారడం మొదలైందో..

              అంతకు ముందు కన్నా జీవితంలో సౌఖ్యాలు.. విలాసాలు.. పెరిగాయో ఎందుకో మనుషుల వ్యక్తిత్వం మరింత పరిణతి చెందాల్సిన దగ్గర రివర్స్ లో కుంచించుకు పోవడం మొదలైంది పక్కాగా సంబంధాలు పలుచపడటం మొదలైంది..

              ఏ ఇద్దరు కలిసినా తమ పిల్లలు సాధించిన విజయాలు.. కొన్న ఆస్తులు.. చేయించుకున్న నగలు.. వారు పొందుతున్న సాలరీ ప్యాకేజ్.. వారు పొందుతున్న కంఫర్ట్ గురించి తప్ప..

               వెనుకటి రోజుల్లో లాగా ఆప్యాయంగా నోరారా పలకరించు కోవడమే తగ్గిపోయింది..

                నా చిన్న నాటి రోజుల్లో ఇంట్లో కీడు జరిగినా..శుభకార్యం జరిగినా కనీసం 10 మంది చుట్టాలు వారం పది రోజుల ముందు నుంచే వచ్చి వుండేవారు..

              తరువాత కూడా ఇంకో వారం రోజులు వుండేవారు..

            రాత్రి పూట ఆరుబయట మంచాలు వేసుకుని పొద్దుబోయిందాక చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పడుకునే వారు..

               ఇప్పుడు ఎంత దగ్గర వారి కార్యక్రమం అయినా.. చేసే వారు కూడా ఆప్పో సొప్పో చేసి పక్క వాడి కన్నా ఘనంగా చేయాలి అని చూపించే శ్రద్ధ మన వాళ్ళను దగ్గరగా నిలుపుకుందాము అని మర్చిపోతున్నారు..

                అటెండ్ అయ్యే వారు కూడా తమ అతిశయం చూపించుకోవడానికి.. తమ స్థితిలో వచ్చిన మార్పు చూపించుకోవడనికి ఇస్తున్న ప్రయారిటీ..

             పారదర్శక సంబంధాలు కి ఇవ్వడం లేదు.. చాలా మొక్కుబడిగా ఆహ్వానాలు హజరులు మిగిలిపోతున్నాయి..

           అందరికి పిల్లలు దూరంగా వుంటున్నా.. ఇరుగు పొరుగు నే వుంటున్న రక్త సంబంధీకులు తో కూడా ఆత్మీయ అనుబంధాలు వుంచుకోవడం లేదు..

            నిష్కారణంగా చిన్న చిన్న కారణాలు తోనే విపరీతమైన అహం అతిశయం తో వ్యవహరిస్తూ.. అందరికి అందరూ గిరిగీసుకుని బతకడానికి అలవాటు పడుతున్నారు..

          వయసు పెరిగే కొద్దీ ఓర్పు సహనం పెరగాల్సిన దగ్గర అసూయ ద్వేషాలు పెంచుకుంటున్నారు..

         నూటికి 90% కుటుంబాలలో పిల్లలు దూరంగానే వుంటున్నారు.. వీళ్లకు పెద్ధతనం.. ఒంటరి తనం.. అనారోగ్య సమస్యలు.. మనిషి తోడు అవసరం..

            అయినా కొద్దిపాటి కూడా సర్దుబాటు ధోరణితో వుండడం లేదు.. విపరీతమైన తామసం.. పక్క వాడి నీడ కూడా సహించడం లేదు..

       చాలా కుటుంబాలలో ఇప్పటికే మనుషులు పలచబడ్డారు..

            వలసలు పుణ్యాన.. గత 60-70 సంవత్సరాలుగా అనుసరిస్తూ వచ్చిన ఫ్యామిలీ ప్లానింగ్ వల్ల ఇప్పటికే కుటుంబాల సైజ్ తగ్గిపోయింది.. 

        దానికి తోడు కేవలం కూడూ గుడ్డా కూడా పెట్టని ఈ అడ్డు గోడలు పర్యవసానం..

                బాధాకరమైన విషయం ఏంటంటే ఒక వేళ కజిన్స్ మన రూట్స్ కాపాడుకుందాం అనుకున్నా..రిలేషన్స్ లో ఎమోషన్ వుంచుకుందాము అనుకున్నా మెజారిటీ కుటుంబాలలో పెద్ద వాళ్ళు దూరిపోయి అగాధం పెంచుతున్నారు..

           చిన్నప్పటి మా రోజులే బంగారపు రోజులు అనిపిస్తున్నాయి..

              నేడు పిల్లలకు అసలు కుటుంబ సంబంధాలు పరిచయం చేయడం ఇన్వాల్వ్ చేయడం ఎప్పుడైతే తగ్గిపోయిందో..

      రేపటి రోజున మన తరువాత మన పిల్లలకు మన అనే వారే లేని.. మిగలని పరిస్థితి సృష్టిస్తున్నాము..

        నీ ఇంటికి వస్తే ఏమి పెడతావు? నా ఇంటికి వస్తె ఏమి తెస్తావు అన్న భావన నుంచి కొద్దిపాటి అయినా మార్పు చెందాలి..

           అందరూ కొద్దిగా ఆలోచించండి.. మన కుటుంబాల్ని మనమే ఎడం చేసుకుంటూ.. మనలో మనమే దూరం పెంచుకుంటూ ఇంకా సమాజం నుంచి మనం ఏమి ఆశిస్తాము..

               ఎవ్వరికీ వారు గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి.. మన చిన్ననాడు మనం ఏమేమి పొందాము నేడు మన పిల్లలకు ఏమేమి దూరం చేస్తున్నాము? 

           ఇప్పటికే చాలా మంది పెద్దవారు వెళ్ళిపోయారు.. మనకి ఎంత టైం వుంటుందో తెలియదు..

           మనం సక్రమంగా ఆరోగ్యంగా వున్నప్పుడే కనీసం మన వాళ్ళ దగ్గర అయినా పనికిమాలిన అహం అతిశయం వదిలి వెద్ధాము..

           మన తరువాత కూడా మన పిల్లలకి మన కుటుంబ అనుబంధాలు వారసత్వంగా ఇద్దాము..

           నేను కొన్ని వందల కుటుంబాలను చాలా సమీపంగా చూసి.. నేను కూడా ప్రత్యక్షంగా అనుభవించి రాస్తున్నా..


🤍🖤🤍🖤🤍🖤🤍

A Collection from 

Admin 

Brahmana samaakhya

దేవుడు

 




*⚜️దేవుడు గుడ్డివాడు కాదురా నాయనా నీవు ఎవరినైతే తన్నావో కొన్ని క్షణాల్లోనే అదే ప్లేస్ లో పడిపోయావు మళ్ళీ ఆ మహతల్లే నిన్ను కాపాడింది అందుకే అధికారం ఉందని డబ్బు మదం ఉన్నాయని ఇలా ప్రవర్తించకండి*

విద్వాంసులు లేని రాజసభ

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝 *అన్ధావిద్వజ్జనై ర్హీనా మూకా కవిభి రుజ్ఞితా*। 

      *బధిరా గాయకై ర్హీనా సభా భవతి భూభృతామ్*||


      *__---నీతిదీపికా-----__*


*విద్వాంసులు లేని రాజసభ గ్రుడ్డిది....కవులు లేనిది మూగది...గాయకులు లేనిది చెవిటిది*.....


 ✍️🌷💐🌸🙏

రాశి ఫలితాలు

 ఈ రోజు (29-05-2024) రాశి ఫలితాలు

గురు నారాయణ భవిష్యవాణి వారి ఉచిత నిత్య రాశి ఫలితాలు మీ రాశి ఫలితాలు

మీరు ఏ సమస్యల్లో ఉన్నా మీ జాతకం/హస్తరేఖలు చూసి మీ సమస్య లకు పరిష్కారం చేయగలం సమర్ధులం పూజ/గ్రహజపం/హోమం ద్వారా ఖచ్చితంగా పరిష్కారం చేయగలం ఇప్పుడే ఫోన్ చేయండి  "జ్యోతిష్య రత్న" జరిగిన విషయం లు చెప్పి మీ భవిష్యత్తు చెప్పగలం వివాహం నకు జాతకం లు సరిపోల్చుట కూడా చూడబడును మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి 7981622895 గత 35 సంవత్సరంల నుండి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం మా దగ్గర సిద్ధి పొందిన మంత్రాలు ఉన్నాయి మా గురువు ల ద్వారా మాకు వచ్చాయి. విద్య ఉద్యోగం వివాహం సంతానం కారాగృహ విముక్తి అనారోగ్యం రాజకీయ పదవులు ఋణ విమోచనం వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి రోగ నివారణ శత్రువులు నుంచి రక్షణ గృహ నిర్మాణం ఇలా ఏదైనా పరిష్కారం చేయగలం సమర్ధులం హోమం ద్వారా ఖచ్చితంగా మీ కోరికలు తీరేలా చేయిస్తాం మీ కోరికలు తీరకపోతే మీ ధనం వాపసు ఇస్తాం షరతులు వర్తిస్తాయి మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి

సకల శుభ పౌరోహిత్యం కార్యక్రమాలు చేయించబడును



మేషం

 29-05-2023

వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. దైవదర్శనాలు  చేసుకుంటారు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆదాయానికి  మించిన ఖర్చులు ఉంటాయి. బంధువులతో  స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున కొందరి  ప్రవర్తన  మానసిక చికాకు  కలిగిస్తాయి.


వృషభం

 29-05-2024

నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. దూర ప్రాంత మిత్రుల నుండి  అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో విశేషంగా రాణిస్తారు.  సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. అన్ని వైపుల నుండి ఆదాయం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉన్నది. 


మిధునం

 29-05-2023

చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్నంగా విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వాహన వ్యాపారస్తులకు అనుకూలత పెరుగుతుంది.


కర్కాటకం

 29-05-2023

ధన పరంగా కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. సోదరులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా  సాగుతాయి. ఉద్యోగమున  అధికారుల నుండి విమర్శలు తప్పవు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహం  కలిగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గోవడం మంచిది.


సింహం

 29-05-2023

చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక   చికాకు కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్థులతో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. దూర ప్రయాణాలలో  శ్రమాధిక్యత కలుగుతుంది.  ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. విద్యార్థులు పరీక్షా ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉండదు.


కన్య

 29-05-2023

కుటుంబ సభ్యులతో దైవ సేవ  కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు అధిగమిస్తారు. నూతన విద్య ఉద్యోగ  అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల ఆగమనం  ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో అప్పగించిన భాద్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్ధిక పురోగతి కలుగుతుంది.


తుల

 29-05-2023

ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం  సాదిస్తారు.  కుటుంబ సభ్యులు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. భూ  సంభందిత   క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.


వృశ్చికం

 29-05-2023

ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.  ధన పరమైన విషయాలలో తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో  సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.


ధనస్సు

 29-05-2023

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. అకారణంగా సన్నిహితులతో  వివాదాలు కలుగుతాయి. కీలక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. కుటుంబమున   కొందరి మాటల వలన మానసిక చికాకులు  కలుగుతాయి. నిరుద్యోగులు అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది.


మకరం

 29-05-2023

బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. గృహమున  శుభకార్యాలు నిర్వహిస్తారు. ముఖ్యమైన  వ్యవహారాలు  అనుకూలంగా సాగుతాయి. నూతన వాహన  భూ లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలు అందుకుంటారు.


కుంభం

 29-05-2023

కుటుంబ సభ్యులతో ఊహించని   వివాదాలు  కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభనలు తప్పవు. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.


మీనం

 29-05-2023

స్ధిరాస్తి  వివాదాల పరిష్కారం అవుతాయి. సంతాన  శుభకార్యాలకు ధనం   ఖర్చు చేస్తారు. సమాజంలో  పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. చుట్టుపక్కల వారితో సఖ్యతగా వ్యవహరిస్తారు.  వృత్తి  ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాలలో సమస్యలు  సర్దుమణుగుతాయి.